Indian Cricketer Dhawal Kulkarni Said Allu Arjun Is His Favourite Hero, Posts Viral - Sakshi
Sakshi News home page

Allu Arjun: అల్లు అర్జున్ నా ఫేవరేట్ హీరో.. టీమిండియా స్టార్ క్రికెటర్

Published Wed, Oct 26 2022 6:47 PM | Last Updated on Wed, Oct 26 2022 8:04 PM

Cricketer Dhawal Kulakarni Answer Allu Arjun His Favourate Hero In Kollywood - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  పుష్ప సినిమాతో ఆయన రేంజ్ పాన్ ఇండియాకు మారిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప మూవీతో ఆల్ ఇండియాలో బన్నీ పేరు మార్మోగింది. అంతేకాకుండా ఆ చిత్రంలోని 'తగ్గేదేలే'  అనే డైలాగ్ అయితే అభిమానులను ఓ ఊపు ఊపేసింది.  ఈ చిత్రంతో ఎంతోమంది అభిమానాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్‌కు ఇండియాలోని ప్రేక్షకులతో పాటు విదేశీ సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే ఏకంగా పుష్ప స్టైల్లో లుక్ షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశారు. 

ఈ క్రమంలోనే తాజాగా మరో క్రికెటర్ అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన టీమిండియా క్రికెటర్ ధావల్ కులకర్ణి  ట్విట్టర్ వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

ఓ అభిమాని మీ ఫేవరేట్ తమిళ హీరో ఎవరు అంటూ ఒకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ధావల్ కులకర్ణి అల్లు అర్జున్ అంటూ సమాధానమిచ్చారు. దీంతో అభిమానులు అవాక్కయ్యారు. అదేంటీ టాలీవుడ్ హీరోను కోలీవుడ్ హీరో అని చెప్పడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మరో నెటిజన్ అల్లు అర్జున్ తమిళ హీరో కాదు కదా అని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ అదేమో నాకు తెలియదు కానీ.. మై ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ కులకర్ణి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement