Dhawal Kulkarni
-
షూ కొనేందుకు డబ్బు లేదు.. అతడే ఆదుకున్నాడు: శార్దూల్ భావోద్వేగం
“When I did not have money to buy shoes: ‘‘ఇదే తన చివరి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్. తనతో పాటు నాకు కూడా భావోద్వేగ సమయం. చిన్ననాటి నుంచే అతడి ఆటను గమనిస్తూ ఉన్నాను. బౌలింగ్‌లో నాకెన్నో నైపుణ్యాలు నేర్పించాడు. అంతేకాదు.. షూ కొనడానికి నా దగ్గర డబ్బు లేని సమయంలో.. తన దగ్గర ఉన్న బూట్ల జతలు నాకు ఇచ్చాడు. కెరీర్ ఆరంభంలో నాకెంతో సహాయం చేశాడు’’ అని టీమిండియా క్రికెటర్, ముంబై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఉద్వేగానికి లోనయ్యాడు. I.C.Y.M.I The Mumbai team gave a Guard Of Honour on Day 1 to Dhawal Kulkarni, who is playing his final first-class game 👏@dhawal_kulkarni | @IDFCFIRSTBank | #Final | #MUMvVID Follow the match ▶️ https://t.co/k7JhkLhOID pic.twitter.com/LTCs0142fc — BCCI Domestic (@BCCIdomestic) March 11, 2024 కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్ ఫైనల్‌కు చేరుకున్న ముంబై.. టైటిల్ కోసం విదర్భతో పోటీ పడుతోంది. ఇరు జట్ల మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(46), భూపేన్ లల్వాణి(37) మెరుగైన ఆరంభమే అందించినా.. విదర్భ బౌలర్ల దెబ్బకు మిడిలార్డర్ కుప్పకూలింది. ఫలితంగా 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శార్దుల్ ఠాకూర్ (69 బంతుల్లో 75; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) విదర్భ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన శార్దుల్ చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో 224 పరుగుల వద్ద ముంబై తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అనంతరం.. తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన విదర్భను ముంబై పేసర్ ధవళ్ కులకర్ణి దెబ్బకొట్టాడు. The experience of Dhawal Kulkarni provides Mumbai a wicket in the evening session! Vidarbha lose the crucial wicket of Karun Nair. Follow the match ▶️ https://t.co/L6A9dXYmZA#RanjiTrophy | #MUMvVID | #Final | @IDFCFIRSTBank pic.twitter.com/VNk7HAkgSU — BCCI Domestic (@BCCIdomestic) March 10, 2024 ధవళ్ కులకర్ణిని అభినందిస్తున్న సహచరులు (PC: PTI) మరో పేసర్ శార్దూల్ ఠాకూర్ కూడా రాణించాడు. తొలిరోజు ఆట ముగిసే ధవళ్ రెండు, శార్దూల్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో ఆట పూర్తయ్యేసరికి విదర్భ 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు మాత్రమే చేసింది. ధవళ్ కులకర్ణి రిటైర్మెంట్ ఇదిలా ఉంటే.. 35 ఏళ్ల ధవళ్ కులకర్ణి ఈ మ్యాచ్ తర్వాత ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచి కూడా సెలవు తీసుకోకున్నాడు. ఇప్పటికే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన ఈ రైటార్మ్ పేసర్.. మోహిత్ అవస్థి గాయం కారణంగా విదర్భతో ఫైనల్ మ్యాచ్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో తొలి రోజు ఆట అనంతరం శార్దూల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ధవళ్ కులకర్ణితో తన అనుబంధం గురించి గుర్తుచేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను బాధపడిన సమయంలో కులకర్ణి తనకు అండగా నిలబడ్డాడంటూ అభిమానం చాటుకున్నాడు. చదవండి: Ind vs Eng 2024: టీమిండియా నయా సంచలనాలు.. ధనాధన్ దంచికొట్టి హీరోలుగా! -
అల్లు అర్జున్ టాలీవుడ్ హీరో కాదు.. టీమిండియా క్రికెటర్ షాకింగ్ సమాధానం..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో ఆయన రేంజ్ పాన్ ఇండియాకు మారిపోయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన పుష్ప మూవీతో ఆల్ ఇండియాలో బన్నీ పేరు మార్మోగింది. అంతేకాకుండా ఆ చిత్రంలోని 'తగ్గేదేలే' అనే డైలాగ్ అయితే అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో ఎంతోమంది అభిమానాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్‌కు ఇండియాలోని ప్రేక్షకులతో పాటు విదేశీ సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ అయిపోయారు. ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే ఏకంగా పుష్ప స్టైల్లో లుక్ షేర్ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో క్రికెటర్ అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించారు. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన టీమిండియా క్రికెటర్ ధావల్ కులకర్ణి ట్విట్టర్ వేదికగా అభిమానులతో కాసేపు సరదాగా చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఓ అభిమాని మీ ఫేవరేట్ తమిళ హీరో ఎవరు అంటూ ఒకరు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ధావల్ కులకర్ణి అల్లు అర్జున్ అంటూ సమాధానమిచ్చారు. దీంతో అభిమానులు అవాక్కయ్యారు. అదేంటీ టాలీవుడ్ హీరోను కోలీవుడ్ హీరో అని చెప్పడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై మరో నెటిజన్ అల్లు అర్జున్ తమిళ హీరో కాదు కదా అని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ అదేమో నాకు తెలియదు కానీ.. మై ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ కులకర్ణి చెప్పారు. Your favourite tamil actor? — ☄️ (@P_m_6_4) October 25, 2022 Allu Arjun — Dhawal Kulkarni (@dhawal_kulkarni) October 25, 2022 My fav South Indian actor is Allu Arjun — Dhawal Kulkarni (@dhawal_kulkarni) October 25, 2022 Allu not tamil actor he is telugu actor.but tamil peoples like allu arjun — வந்தியதேவன் Army (@massmani45) October 25, 2022 -
ప్లేఆఫ్ అవకాశాలు ఖేల్‌ఖతం.. ఇంతకుమించి ఏం చేస్తారులే!
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022 సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ముంబై 11 మ్యాచ్‌ల్లో 9 ఓటములు చవిచూసి అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఇండియన్స్ కనీసం ఆఖరి మ్యాచ్‌ల్లో గెలిచైనా పరువు కాపాడుకోవాలనే ప్రయత్నం ముంబై ఇండియన్స్‌లో కనిపించడం లేదు. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 113 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఆటతీరు చూస్తుంటే మిగిలిన మూడు మ్యాచ్‌లైనా గెలుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైదానంలో ఎలా ఉన్నా.. ముంబై డ్రెస్సింగ్ రూమ్ మాత్రం ఆహ్లదకర వాతావరణంలో ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఆ జట్టు సీనియర్ బౌలర్ ధావల్ కులకర్ణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ముంబై ఆటగాళ్లు చెఫ్ అవతారంలో కనిపించారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ వీడియోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. గ్రిల్స్‌పై చికెన్‌ను రోస్ట్ చేస్తున్న అర్జున్ను మాస్టర్ చెఫ్ అంటూ ధావల్ కులకర్ణి క్యాప్షన్ ఇచ్చాడు. అర్జున్‌తో పాటు జూనియర్ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ కూడా కుకింగ్‌లో బిజీగా కనిపించాడు. పనిలో పనిగా ముంబై ఆటగాడు సంజయ్ యాదవ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను జట్టు ఘనంగా నిర్వహించింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్..'' ఎలాగూ ప్లే ఆఫ్ అవకాశాలు లేవు.. ఇంతకుమించి ఏం చేస్తారులే'' అంటూ కామెంట్ చేశారు. ఇక గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ వెంటే ఉన్న అర్జున్ టెండూల్కర్ ఒక్కమ్యాచ్ ఆడలేకపోయాడు. కనీసం ఈ సీజన్లోనైనా అతనికి అవకాశం ఇస్తారేమో చూడాలి. దిగ్గజ ఆటగాడి కుమారుడిగా పేరున్నప్పటికి అర్జున్ టెండూల్కర్ పెద్దగా రాణించింది లేదు. 23 ఏళ్ల అర్జున్ ఇప్పటివరకు రెండు టి20 మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ మే12న సీఎస్కేతో ఆడనుంది. చదవండి: Rashid Khan: టి20 క్రికెట్లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత Surya Kumar Yadav: 'ఈ సీజన్ మాకు కలిసిరాలేదు'.. సూర్యకుమార్ ఎమోషనల్ పోస్ట్ -
ముంబై ఇండియన్స్ జట్టులో ధవళ్ కులకర్ణి
ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఆడిన 8 మ్యాచ్‌లు ఓడి ప్లేఆఫ్స్‌కు దూరమైంది. అయితే మిగిలున్న మ్యాచ్‌ల కోసం 33 ఏళ్ల పేస్ బౌలర్ ధవళ్ కులకర్ణిని తీసుకుంది. ఈ సీజన్లో ముంబై పేస్ దళం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ప్రధాన సీమర్ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)సహా, జైదేవ్ ఉనాద్కట్ (5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు), సామ్స్ (5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) తేలిపోయారు. -
అంతా అయిపోయాకా ఇప్పుడొచ్చి ఏం లాభం?!
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఘోర వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ నుంచి ఇంత దారుణ ప్రదర్శన సగటు అభిమాని ఊహించి ఉండడు. ఇప్పటివరకు సీజన్లో భోణీ చేయని ముంబై ఆడిన 8 మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది. ప్లేఆఫ్ దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు గెలిచినప్పటికి అవి కేవలం ప్రత్యర్థి జట్లను దెబ్బతీయడం మాత్రమే అవుతుంది. ఎలా చూసుకున్నా ముంబై ఇండియన్స్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఈ సంగతి పక్కనబెడితే.. ముంబై ఇండియన్స్ జట్టులోకి టీమిండియా సీనియర్ బౌలర్ ధవల్ కులకర్ణి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ ధవల్ కులకర్ణితో ఈ సీజన్లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అన్ని సక్రమంగా జరిగితే వచ్చే మ్యాచ్‌లోనే అతను బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా ముంబై ఇండియన్స్‌తో చేరకముందు ధవల్ కులకర్ణి ఐపీఎల్‌లోనే కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన అనుభవం అతనికి కలిసొచ్చింది. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ బౌలింగ్ నాసిరకంగా తయారైంది. ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. 8 మ్యాచ్‌ల్లో 229 పరుగులిచ్చుకొని ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. మిగతా బౌలర్లు చూసుకుంటే.. జైదేవ్ ఉనాద్కట్ పెద్ద తలనొప్పిగా మారాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో బౌలింగ్ వేసిన అతను 17 పరుగులను కాపాడలేకపోయాడు. ఎంఎస్ ధోని అతని బౌలింగ్‌ను ఉతికి ఆరేశాడు. ఉనాద్కట్ ఆరు మ్యాచ్‌ల్లో 190 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. టైమల్ మిల్స్ ఆరు మ్యాచ్‌ల్లో 190 పరుగులిచ్చి ఆరు వికెట్లు, బాసిల్ థంపి ఐదు మ్యాచ్‌ల్లో 152 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ఇక రిలే మెరిడిత్ కూడా రెండు మ్యాచ్‌లాడి 65 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. దీంతో ధవల్ కులకర్ణి ఎంట్రీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. బయోబబూల్ పూర్తి చేసుకున్న ధవన్ కులకర్ణి ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేశాడు. గతంలో ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఎక్కువగా రాజస్తాన్ రాయల్స్‌కు ఆడిన ధవల్ కులకర్ణి 92 మ్యాచ్‌ల్లో 86 వికెట్లు పడగొట్టాడు. కాగా 2008లో ధవల్ కులకర్ణి ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయిన ముంబై ఇండియన్స్ ధవల్ కులకర్ణి రావడంతోనైనా గాడిలో పడుతుందేమో చూడాలి. అయితే అభిమానులు మాత్రం కులకర్ణి రాకపై వినూత్న రీతిలో స్పందించారు. ''అంతా అయిపోయాకా ఇప్పుడొచ్చి ఏం లాభం.. ముంబై ఇండియన్స్ జట్టును మొత్తం ప్రక్షాళన చేయాలి.. రెగ్యులర్ ప్లేయర్లే ఏం చేయలేకపోతున్నారు.. ఆటలో గ్యాప్ వచ్చిన ధవల్ కులకర్ణి వచ్చి జట్టును గెలిపిస్తాడా'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ ఏప్రిల్ 30న బలమైన రాజస్తాన్ రాయల్స్‌తో ఆడనుంది. చదవండి: Kuldeep Yadav: నాకు పెద్దన్న లాంటివాడు.. పర్పుల్ క్యాప్ అతడిదే: కుల్దీప్ View this post on Instagram A post shared by SportsTiger (@sportstiger_official) -
IPL 2022: ముంబై జట్టులో టీమిండియా బౌలర్.. రోహిత్ సిఫార్సుతో చోటు..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నడూ లేనంత విపత్కర పరిస్థితులను ముంబై ఇండియన్స్ ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్‌లో (2022) ఎదుర్కొంటుంది . ఈ సీజన్లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. క్యాష్ రిచ్ లీగ్‌లో రికార్డు స్థాయిలో ఐదు టైటిళ్లను కైవసం చేసుకున్న ముంబై జట్టు.. ఈ ఏడాది బోణీ విజయం కోసం ఎదురుచూసే ధీన స్థితికి చేరింది. ఆటగాళ్ల రిటెన్షన్, మెగా వేలంలో కీలక బౌలర్లను వదులుకోవడం ముంబై ఈ దుస్థితికి కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జట్టులో పలు మార్పులు చేర్పులు చేయాలని భావించిన ముంబై యాజమాన్యం.. కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రోహిత్ సిఫార్సు మేరకు స్థానిక (ముంబై) ఆటగాడు, టీమిండియా బౌలర్ ధవల్ కులకర్ణిని జట్టులోకి తీసుకునేందుకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. ఈ ఏడాది మెగా వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన 33 ఏళ్ల ధవల్ కులకర్ణి ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హిందీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఐపీఎల్ లీగ్ దశ మ్యాచ్‌లన్నీ ముంబై, పూణేల్లో జరుగుతుండటంతో స్థానిక ఆటగాడిగా కులకర్ణి సేవలు తమ జట్టును గట్టెక్కిస్తాయని ముంబై సారధి అంచనా వేస్తున్నాడు. కులకర్ణికి ముంబైలోని వాంఖడే, బ్రబోర్న్, డీవై పాటిల్ మైదానాలతో పాటు పూణేలోని ఎంసీఏ స్టేడియంలోని పిచ్‌లపై పూర్తి అవగాహన ఉండటంతో రోహిత్ అతనిని ఎలాగైనా జట్టులో చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కులకర్ణి జట్టులో చేరితే ముంబై ఇండియన్స్ తిరిగి గాడిలో పడుతుందని రోహిత్ జట్టు యాజమాన్యాన్ని సైతం ఒప్పించినట్లు సమాచారం. ధవల్ కులకర్ణి ఐపీఎల్లో ఇప్పటివరకు 92 మ్యాచ్‌లు ఆడి 86 వికెట్లు పడగొట్టాడు. అతను గతంలో ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. కులకర్ణి 2020, 21 సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టులోనే ఉన్నాడు. అయితే ఈ ఏడాది మెగావేలంలో అతన్ని తిరిగి దక్కించుకునేందుకు ముంబై యాజమాన్యం ఆసక్తి చూపలేదు. కులకర్ణి టీమిండియా తరఫున 12 వన్డేలు, 2 టీ20లు ఆడి 22 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ముంబై రేపు (ఏప్రిల్ 21) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. చదవండి: కరోనా కల్లోలం నడుమ ఢిల్లీ, పంజాబ్ వార్.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సహచర ఆటగాడికి రోహిత్ శర్మ శాపనార్థం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహచర ఆటగాళ్లను ట్రోల్ చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. తాజాగా హిట్‌మాన్.. ముంబై ఇండియన్స్ సహచర ఆటగాడు ధవల్ కులకర్ణికి శాపనార్థం పెట్టాడు. అదేంటి.. రోహిత్ ఇలా చేయడమేంటి అనుకుంటున్నారా.. అదంతా ఫన్నీ శాపనార్థం మాత్రమే. విషయంలోకి వెళితే.. ధవల్ కులకర్ణి మంగళవారం తన స్నేహితులతో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా స్నేహితులతో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ''మేం ముగ్గురం ఏ విషయంపై మాట్లాడుకుంటున్నామో చెప్పగలరా'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. దీనికి రోహిత్ ఫన్నీగా మరాఠీ భాషలో ఏదో శపించాడు. ''మీ ముగ్గురిలో పెద్ద..'' అంటూ రోహిత్ మరాఠీలో పదాన్ని ఉపయోగిస్తూ కామెంట్ చేశాడు. రోహిత్ ఉపయోగించిన పదం మరాఠిలో ఎవరినైనా శపించడానికి వాడే పదం అని తెలిసింది. మరాఠీ అయిన ధవల్ కులకర్ణికి రోహిత్ పదం అర్థం కావడంతో లాఫింగ్ ఎమోజీ పెట్టాడు. చదవండి: IPL 2022 Auction: మెగా వేలం.. మార్కీ ప్లేయర్ల లిస్టు ఇదే.. ధవల్ కులకర్ణి టీమిండియా తరపున 12 వన్డేల్లో 19 వికెట్లు, 2 టి20 మ్యాచ్‌లాడి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున 35 మ్యాచ్‌ల్లో 36 వికెట్లు పడగొట్టాడు.. ఓవరాల్‌గా 92 మ్యాచ్‌ల్లో 86 వికెట్లు తీశాడు. ఇక హిట్‌మాన్ సారధ్యంలోని ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. ఇక ఈసారి మెగావేలం ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా జరగనుంది. మొత్తం 590 మంది క్రికెటర్లతో కూడిన షార్ట్‌లిస్ట్ జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది ఇక దాదాపు 10 వారాల బ్రేక్ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. నవంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో కెప్టెన్‌గా పనిచేసిన రోహిత్.. ఆ తర్వాత గాయంతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా గాయం నుంచి కోలుకున్న హిట్‌మాన్ విండీస్‌తో టి20, వన్డే సిరీస్‌కు తొలిసారి పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అంతకముందు రోహిత్ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా సౌతాఫ్రికాకు 0-3తో సిరీస్ కోల్పోయిన సంగతి తెలిసిందే. చదవండి: IPL 2022 Auction: వేలంలో పాల్గొనాలంటూ స్టార్ ఆటగాడికి ఫోన్‌కాల్.. కానీ View this post on Instagram A post shared by Dhawal Kulkarni (@dhawal_kulkarni) -
మ్యాచ్ గెలవడం కోసం క్రీడాస్ఫూర్తిని పక్కనబెట్టారు
ఢిల్లీ: ఐపీఎల్ 14వ సీజన్లో శనివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ముంబై ఆల్‌రౌండర్ పొలార్డ్ అద్భుత బ్యాటింగ్ కనబరిచి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ మాత్రం ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలవడం కోసం క్రీడాస్పూర్తిని పక్కన బెట్టిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విషయంలోకి వెళితే.. ముంబై విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు కావాలి. పొలార్డ్ స్ట్రైక్‌లో ఉండగా.. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ధావల్ కులకర్ణి ఉన్నాడు. ఎన్గిడి బంతి విసరకముందే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న కులకర్ణి అడ్వాన్స్‌గా ఆలోచించి క్రీజు దాటి చాలా ముందుకు వచ్చాడు. పొలార్డ్ బంతిని హిట్ చేయడం.. చకచకా రెండు పరుగులు పూర్తి చేయడం.. మ్యాచ్ గెలవడం జరిగిపోయాయి. అయితే మ్యాచ గెలవడం కోసం కులకర్ణి అడ్వాంటేజ్ చేసుకొని ముందుకు పరిగెత్తుకురావడం సమంజసం కాదని హగ్ పేర్కొన్నాడు. అలా చేస్తే క్రీడాసూర్తిని మరిచినట్లేనని తెలిపాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన ట్విటర్లో ఒక క్యాప్షన్ జత చేశాడు. '' నిన్నటి మ్యాచ్‌లో ఒక విషయం నన్ను బాధించింది. చివరి బంతికి నాన్ స్ట్రైకర్ అడ్వాంటేజ్ తీసుకొని బౌలర్ బంతి విడవకముందే క్రీజు దాటడం క్రీడాస్పూర్తికి విరుద్ధం. ఒక మ్యాచ్ గెలవడం కోసం ఇలా చేస్తారా'' అంటూ రాసుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు(72 నాటౌట్, 27 బంతులు; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్కే భారీ స్కోరు నమోదు చేసింది. జడేజా 22 పరుగులతో రాయుడుకు సహకరించాడు. అంతకముందు ఓపెనర్ డుస్లెసిస్ 50, మొయిన్ అలీ 58 పరుగులతో రాణించారు. ఇక చేజింగ్‌లో పొలార్డ్ (87 నాటౌట్, 34 బంతులు; 6 ఫోర్లు, 8 సిక్సర్లతో) విద్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కొడితే ఫోర్.. లేదంటే సిక్స్ అన్నట్లుగా రెచ్చిపోయిన పొలార్డ్ ముంబైకి ఒంటిచేత్తో విజయాన్ని సాధించిపెట్టాడు. రోహిత్ 38, డికాక్ 35, కృనాల్ 32, హార్దిక్ 16 పరుగులు చేశారు. చదవండి: ఆ బంతిని కూడా ఫోర్ కొడితే ఇంకేం చేస్తాం! -
కూతుళ్లతో మురిసిపోతున్న ముంబై ఆటగాళ్లు
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో మరోసారి అదరగొట్టే ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ ఆరవసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్లేఆఫ్‌లో ఢిల్లీపై ఘన విజయం సాధించిన ముంబై మరో టైటిల్‌పై కన్నేసింది. కాగా నేడు ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్‌తో తుది పోరుకు సిద్ధమవనుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండడంతో ముంబై ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా రోహిత్ కూతురు సమైరా, ధవల్ కులకర్ణి కూతురు నితారా, తారే కూతురు రబ్బానీల బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆటగాళ్లు తమ కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడీ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ విభాగం బలంగా కనబడుతుండగా.. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌లు చెలరేగిపోతున్నారు. బుమ్రా 14 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. బౌల్ట్ 22 వికెట్లతో ఉన్నాడు. అన్నింట్లోనూ సమానంగా కనిపిస్తున్న ముంబై మంగళవారం జరగబోయే ఫైనల్లో గెలిచి ఐదోసారి కప్ సొంతం చేసుకోవాలని భావిస్తుంది. -
‘స్లెడ్జింగ్ చేయలేక నవ్వులపాలయ్యారు’
లండన్: గత కొన్నేళ్లుగా టీమిండియా విజయాల్లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌లో వీరిద్దరిపై టీమిండియా భారీగానే ఆశలు పెట్టుకుంది. అయితే వీరిద్దరూ తాజాగా బ్రేక్‌ఫాస్ట్ విత్ గౌరవ్ కపూర్ షోలో సందడి చేశారు. టీమిండియా ఆటగాళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, పేసర్ దావల్ కులకర్ణిలు స్లెడ్జింగ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ‘గతంలో ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా మాథ్యూ వేడ్‌కు కులకర్ణిల మధ్య సరదా ఘటన చోటుచేసుకుంది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్‌తో ఇద్దరూ ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిద్దరి మద్య సంభాషణ చూసి మేము తెగ నవ్వుకున్నాం. ఇక అజింక్యా రహానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడిని కవ్వింపులకు పాల్పడితే అతను వెంటనే రియాక్ట్ అవుతాడు. కానీ అది బయటకు కనపడదు, వినపడదు. ఓ మ్యాచ్‌లో రహానే బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆసీస్ బౌలర్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వెంటనే రియాక్ట్ అయిన రహానే ఏదో అన్నాడు. కానీ వారికి వినపడలేదు. వాళ్లు దగ్గరికి వచ్చి ఏంటి? అనగా మళ్లీ ఏదో అన్నాడు. కానీ మళ్లీ వినపడలేదు. చేసేదేమి లేక వాళ్లు వెనక్కి వెల్లిపోయారు. అది చూసి తెగ నవ్వుకున్నాం. రహానే చాలా సున్నితమైన వ్యక్తి. గట్టిగా ఏది చెప్పలేడు. అరవలేడు’ అంటూ ధావన్, రోహిత్‌లు తెలిపారు. బ్యాటింగ్‌కు దిగేముందు టాయిలెట్ అంటాడు ఇక శిఖర్ ధావనతో తాను ఎదుర్కొనే ఇబ్బందుల గురించి రోహిత్ వివరించాడు. ‘మేం బ్యాటింగ్‌కు దిగే ముందు ప్రతిసారీ ధావన్ టాయిలెట్‌కు వెళ్లాలంటాడు. నేను మాత్రం ఫీల్డర్లు వెళ్లడానికి ఐదు నిమిషాల ముందే మైదానంలోకి వెళ్లిపోవాలనుకుంటా. తొలి బంతిని ఎదుర్కొనేది నేనే కాబట్టి ధావన్ కారణంగా నా అసహనం మరింత పెరుగుతుంది’అంటూ ధావన్‌పై తనకున్న అసహనాన్ని రోహిత్ వివరించాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో జూన్ 5న తలపడనుంది. -
‘చెక్ చేయండిరా బాబు.. నమ్మలేకపోతున్నాం’
జైపూర్ : ఐపీఎల్ సీజన్12లో భాగంగా సొంతగడ్డపైనే రాజస్తాన్ రాయల్స్‌ను మట్టికరిపించి కోల్‌కతా నైట్‌రైడర్స్ నాలుగో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన కేకేఆర్.. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో చెలరేగిన కోల్‌కతా ఓపెనింగ్ జోడి (నరైన్- క్రిస్‌లిన్)ని విడదీసేందుకు రాయల్స్ బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో పది ఓవర్లు కూడా పూర్తికాక ముందే కేకేఆర్ స్కోరు వందకు చేరింది. ముఖ్యంగా ఓపెనర్ క్రిస్ లిన్ అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్ల మోత మోగించి అభిమానులకు వినోదాన్ని పంచాడు. అయితే ‘బెయిల్స్’ కారణంగానే అతనికి లైఫ్ లభించిందని.. లేదంటే నాలుగో ఓవర్లలోనే అతడి ఆట ముగిసేదని రాయల్స్ అభిమానులు, క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. ఛేజింగ్‌లో భాగంగా నరైన్‌తో పాటు ఓపెనర్‌గా రంగంలోకి దిగిన క్రిస్ లిన్.. ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో రాయల్స్ బౌలర్ ధవల్ కులకర్ణి నాలుగో ఓవర్ రెండో బంతి(ఇన్సైడ్ ఎడ్జ్) ద్వారా లిన్ ఆట కట్టించాలని ప్రయత్నించాడు. అతడు అనుకున్నట్టుగానే బంతి వికెట్లను తాకగానే.. లైట్స్ కూడా వెలిగాయి. కానీ బెయిల్స్ మాత్రం కిందపడలేదు. అంతేకాదు బంతి బౌండరీ దాటడంతో కోల్‌కతాకు నాలుగు పరుగులు లభించగా.. అంపైర్ క్రిస్‌లిన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కంగుతిన్న క్రికెట్ అభిమానులు.. ‘ ఎవరైనా కాస్త చెక్ చేయండిరా బాబు.. ఎవరైనా ఫెవికాల్తో బెయిల్స్‌ను అంటించారేమో. స్టంప్స్‌ను బాల్ గట్టిగా తాకినప్పటికీ బెయిల్స్ కిందపడకపోవడం ఏమిటి. అస్సలు నమ్మలేకపోతున్నాం. ఐపీఎల్లో వాడుతున్న బెయిల్స్ ఫెవికాల్ యాడ్‌కి గొప్పగా న్యాయం చేస్తున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉంది’ అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా కులకర్ణి బౌలింగ్‌లో లైఫ్ పొందిన క్రిస్‌లిన్.. దూకుడుగా ఆడి 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధసెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌లో లిన్ ఔటయినప్పటికీ రాబిన్ ఉతప్ప (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (6 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడటంతో 13.5 ఓవర్లలోనే కేకేఆర్ లక్ష్యం(140 పరుగులు) పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో తొలిసారి బరిలోకి దిగిన హ్యారీ గర్నీ 2 వికెట్లు తీసి..‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు. Does someone want to check if the bails have been glued down? Never seen a ball hit the stumps that hard and not knock the bails off - unbelievable!#RRvKKR #HallaBol #IPL #IPL12 #ipl2019 #cricket pic.twitter.com/TLqshZ7Kvz — talesfrmthecrypt (@cricketwriter1) April 7, 2019 #RRvKKR #IPL2019 #BCCI #ICC #VIVOIPL What's point of inbuilt LEDs stumps/bails.. Even if the bails don't get dislodged the blink of LEDs should be taken into consideration.. pic.twitter.com/DJ0gDDDpI7 — Saurabh Trivedi (@saurabh7755) April 7, 2019 -
‘కేకేఆర్‌ను ఓడించే సత్తా ఉంది’
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాజస్తాన్ రాయల్స్ విజృంభించి ఆడుతోంది. హ్యాట్రిక్ విజయాలు ఆ జట్టులో మరింత ఆత్మవిశ్వాసాన్ని తీసుకొచ్చాయి. పటిష్టమైన కింగ్స్ పంజాబ్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లపై వరుసగా విజయాలను నమోదు చేసిన రాజస్తాన్ రాయల్స్.. తన తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడనుంది. మంగళవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్లో రాజస్తాన్ రాయల్స్ తన తదుపరి మ్యాచ్‌ను ఆడనుంది. దీనిలో భాగంగా మాట్లాడిన రాజస్తాన్ పేసర్ ధావల్ కులకర్ణి.. తదుపరి మ్యాచ్‌లో కూడా జోరును కొనసాగాస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ మాకు మిగిలిన రెండు మ్యాచ్‌లు అత్యంత కీలకం. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించడంపైనే మా దృష్టి ఉంది. మా జట్టుకు కోల్‌కతాను ఓడించే సత్తా ఉంది. వరుస విజయాలు తీసుకొచ్చిన ఉత్సాహాన్ని కేకేఆర్‌తో మ్యాచ్‌లో కూడా పునరావృతం చేస్తాం’ అని ధావల్ కులకర్ణి ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ రాజస్తాన్ రాయల్స్ 12 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఇక ఆ జట్టుకు రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపు కేకేఆర్‌తో జరగబోయే మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధిస్తే మాత్రం ప్లే ఆఫ్‌కు చేరువగా వస్తుంది. మరొకవైపు కోల్‌కతా కూడా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో విజయం ముఖ్యం. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. -
రహానేలోని మరో కోణం
జైపూర్ : ఐపీఎల్-11లో దేశ విదేశ ఆటగాళ్లు వారి వారి ప్రత్యేక ప్రతిభలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ అజింక్యా రహానే తనలోని బ్యాటింగ్ నైపుణ్యమే కాకుండా మరో ఆటలోని నైపుణ్యాన్ని ప్రదర్శించారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాజస్తాన్ ఆటగాళ్లు రహానే, బెన్ లాఫిన్, ధావల్ కులకర్ణిలు కరాటే ఫోజుల ఇస్తూ అభిమానులను అలరించారు. దీనికి సంబందించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తమ అధికారికి ట్వీటర్లో షేర్ చేసింది. ‘రహానే తనలోని కరాటే ఆటగాన్ని బెన్ లాఫిన్, దావల్ కలకర్ణితో కలిసి భయటపెట్టాడు’ అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. ఇక రాజస్తాన్ రాయల్స్ జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఆదివారం కింగ్స్ పంజాబ్‌తో జరగబోయే మ్యాచ్ కోసం రాజస్తాన్ జట్టు సన్నద్దమవుతోంది -
రహానే కరాటే ప్రదర్శిన
-
పాండే సెంచరీ బాదాడు
టౌన్స్ విల్లే: కెప్టెన్ మనీష్ పాండే సెంచరీకి, ధవళ్ కులకర్ణి పదునైన బౌలింగ్ తోడవడంతో దక్షిణాఫ్రికా-ఎ టీమ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో భారత్-ఎ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 231 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 7 వికెట్లు కో్ల్పోయి ఛేదించింది. వరుసగా వికెట్లు పడుతున్నా సెంచరీతో చివరి వరకు నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు పాండే. 105 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్లతో 100 పరుగులు సాధించి నాటౌట్ గా మిగిలాడు. బంతితో పాటు బ్యాటింగ్ లోనూ రాణించిన కులకర్ణి 23 పరుగులతో పాండేకు తోడుగా నిలిచాడు. జాదవ్ 26 పరుగులు సాధించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. మిల్లర్(90), ఆడమ్స్(52), బ్రుయిన్(40) రాణించారు. కులకర్ణి 37 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఉనద్కత్, హార్థిక్ పాండ్యా రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. పాండేకు 'మ్యాన్ ది మ్యాచ్' దక్కింది. -
సౌరాష్ట్ర 192/8
ముంబైతో రంజీ ఫైనల్ పుణే: ధావల్ కులకర్ణి (4/30) రాణించడంతో రంజీ ట్రోఫీ ఫైనల్లో తొలి రోజు ముంబై ఆధిపత్యం చలాయించింది. ఎంసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో బుధవారం ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 84.4 ఓవర్లలో 8 వికెట్లకు 192 పరుగులు చేసింది. ధావల్ కొత్త బంతితో నిప్పులు చెరగడంతో ఓ దశలో సౌరాష్ట్ర 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. పుజారా (4) సహా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. అర్పిత్ వసవాదా (214 బంతుల్లో 77; 6 ఫోర్లు) ఓ ఎండ్‌లో ఒంటరి పోరాటం చేసినా...రెండో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ అంతా క్యూ కట్టారు. దీంతో సౌరాష్ట్ర 108 పరుగులకు ఏడు వికెట్లతో కష్టాల్లో కూరుకుంది. ఈ దశలో కెరీర్లో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడుతున్న బౌలర్ ప్రేరక్ మన్కడ్ (119 బంతుల్లో 55 బ్యాటింగ్; 5 ఫోర్లు) అసమాన ఆటతీరుతో వసవాదాకు అండగా నిలిచాడు. ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 84 పరుగులు జోడించడంతో సౌరాష్ట్రకు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ముంబై బౌలర్లలో ఠాకూర్ రెండు వికెట్లు తీసుకోగా... అభిషేక్ నాయర్, సంధు ఒక్కో వికెట్ పడగొట్టారు. -
వన్డే సిరీస్ కు షమీ దూరం
-
వన్డే సిరీస్ కు షమీ దూరం
ముంబై: భారత్ సీమర్ మహ్మద్ షమీ శ్రీలంక వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ధావల్ కులకర్ణి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా షమీ జట్టుకు దూరమయ్యాడని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో మొదటి మూడు వన్డేలకు కులకర్ణిని తీసుకున్నట్టు వెల్లడించింది. షమీ జట్టులో లేకపోవడం భారత్ విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో అతడు 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. వెస్టిండీస్ అర్థాంతరంగా వెళ్లిపోవడంతో శ్రీలంకను బీసీసీఐ ఆహ్వానించింది. శ్రీలంకతో భారత్ ఐదు వన్డేలు ఆడనుంది. ధోని విశ్రాంతి తీసుకోవడంతో టీమిండియాకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించనున్నాడు. -
రాణించిన నాయర్, కులకర్ణి
హుబ్లి: అభిషేక్ నాయర్ (4/61), ధావల్ కులకర్ణి (3/60) చక్కటి బౌలింగ్‌తో రాణించడంతో మూడో అనధికారిక టెస్టులో తొలి రోజు భారత్ ‘ఎ’ ఆధిక్యం ప్రదర్శించింది. ఇక్కడి కేఎస్‌సీఏ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ‘ఎ’ 77.4 ఓవర్లలో 268 పరుగులకే ఆలౌటైంది. లియోన్ జాన్సన్ (148 బంతుల్లో 81; 15 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ఫుదాదిన్ (95 బంతుల్లో 47; 3 ఫోర్లు), దేవ్ నారాయణ్ (55 బంతుల్లో 35; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. జగదీశ్ (8), గంభీర్ (2) క్రీజ్‌లో ఉన్నారు. రాణించిన జాన్సన్... టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో బ్రాత్‌వైట్ (1)ను అవుట్ చేసి జహీర్‌ఖాన్ భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే పావెల్ (21) కూడా వెనుదిరిగాడు. అయితే మూడో వికెట్‌కు దేవ్నారాయణ్తో 70 పరుగులు, నాలుగో వికెట్‌కు ఫుదాదిన్తో 52 పరుగులు జోడించి జాన్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఫలితంగా టీ సమయానికి వెస్టిండీస్ 3 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. అయితే చివరి సెషన్లో నాయర్, కులకర్ణి విజృంభించడంతో విండీస్ బ్యాటింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. 93 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 7 వికెట్లు కోల్పోయింది.