భారత్ సీమర్ మహ్మద్ షమీ శ్రీలంక వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ధావల్ కులకర్ణి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా షమీ జట్టుకు దూరమయ్యాడని బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. అతడి స్థానంలో మొదటి మూడు వన్డేలకు కులకర్ణిని తీసుకున్నట్టు వెల్లడించింది. షమీ జట్టులో లేకపోవడం భారత్ విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో అతడు 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడు. వెస్టిండీస్ అర్థాంతరంగా వెళ్లిపోవడంతో శ్రీలంకను బీసీసీఐ ఆహ్వానించింది. శ్రీలంకతో భారత్ ఐదు వన్డేలు ఆడనుంది. ధోని విశ్రాంతి తీసుకోవడంతో టీమిండియాకు విరాట్ కోహ్లి నాయకత్వం వహించనున్నాడు.
Published Mon, Oct 27 2014 8:36 PM | Last Updated on Thu, Mar 21 2024 8:53 PM
Advertisement
Advertisement
Advertisement