
PC: IPL Twitter
ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్స్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2022 సీజన్లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికే ముంబై 11 మ్యాచ్‌ల్లో 9 ఓటములు చవిచూసి అధికారికంగా ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఇండియన్స్ కనీసం ఆఖరి మ్యాచ్‌ల్లో గెలిచైనా పరువు కాపాడుకోవాలనే ప్రయత్నం ముంబై ఇండియన్స్‌లో కనిపించడం లేదు.
కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 165 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో 113 పరుగులకే కుప్పకూలి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ముంబై ఆటతీరు చూస్తుంటే మిగిలిన మూడు మ్యాచ్‌లైనా గెలుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైదానంలో ఎలా ఉన్నా.. ముంబై డ్రెస్సింగ్ రూమ్ మాత్రం ఆహ్లదకర వాతావరణంలో ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా ఆ జట్టు సీనియర్ బౌలర్ ధావల్ కులకర్ణి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోలో ముంబై ఆటగాళ్లు చెఫ్ అవతారంలో కనిపించారు.
ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ వీడియోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. గ్రిల్స్‌పై చికెన్‌ను రోస్ట్ చేస్తున్న అర్జున్‌ను మాస్టర్ చెఫ్ అంటూ ధావల్ కులకర్ణి క్యాప్షన్ ఇచ్చాడు. అర్జున్‌తో పాటు జూనియర్ ఏబీ డెవాల్డ్ బ్రెవిస్ కూడా కుకింగ్‌లో బిజీగా కనిపించాడు. పనిలో పనిగా ముంబై ఆటగాడు సంజయ్ యాదవ్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను జట్టు ఘనంగా నిర్వహించింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్..'' ఎలాగూ ప్లే ఆఫ్ అవకాశాలు లేవు.. ఇంతకుమించి ఏం చేస్తారులే'' అంటూ కామెంట్ చేశారు.
ఇక గత సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ వెంటే ఉన్న అర్జున్ టెండూల్కర్ ఒక్కమ్యాచ్ ఆడలేకపోయాడు. కనీసం ఈ సీజన్‌లోనైనా అతనికి అవకాశం ఇస్తారేమో చూడాలి. దిగ్గజ ఆటగాడి కుమారుడిగా పేరున్నప్పటికి అర్జున్ టెండూల్కర్ పెద్దగా రాణించింది లేదు. 23 ఏళ్ల అర్జున్ ఇప్పటివరకు రెండు టి20 మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్ మే12న సీఎస్‌కేతో ఆడనుంది.
చదవండి: Rashid Khan: టి20 క్రికెట్‌లో రషీద్ ఖాన్ అరుదైన ఘనత
Surya Kumar Yadav: 'ఈ సీజన్ మాకు కలిసిరాలేదు'.. సూర్యకుమార్ ఎమోషనల్ పోస్ట్