IPL 2022: Arjun Tendulkar Bowled Ishan Kishan With Brilliant Yorker, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2022: అర్జున్ టెండూల్కర్ అద్భుత‌మైన యార్క‌ర్‌.. ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్‌

Published Thu, Apr 21 2022 5:26 PM | Last Updated on Thu, Apr 21 2022 6:46 PM

Arjun Tendulkar Cleans Up Ishan Kishan With Searing Yorker - Sakshi

PC: IPL.com

సచిన్ టెండూల్కర్ త‌న‌యుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియ‌న్స్‌కు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లో కూడా అత‌డికి ఆడే అవ‌కాశం రాలేదు. కాగా గురువారం చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ముంబై త‌ర‌పున  అర్జున్  అరంగేట్రం చేసే అవ‌కాశం ఉంది.

ఈ క్ర‌మంలో సీఎస్‌కేతో మ్యాచ్‌కు ముందు అర్జున్ నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోన్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా అర్జున్ అద్భుతమైన యార్కర్‌తో ఇషాన్ కిషన్‌ను క్లీన్ బౌల్డ్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియ‌న్స్‌ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్ర‌మంలో అత‌డికి ముంబై తుది జ‌ట్టులో అవ‌కాశం ఇవ్వాల‌ని నెటిజ‌న్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌-2021 సీజ‌న్‌కు ముందు అర్జున్ టెండూల్కర్‌ను నెట్ బౌల‌ర్‌గా ముంబై ఎంపిక చేసింది. అదే విధంగా ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ.30 ల‌క్షల‌కు అత‌డిని ముంబై ఇండియ‌న్స్ కొనుగోలు చేసింది.

చ‌ద‌వండి: IPL 2022: లంక యువ పేసర్‌కు బంపర్‌ ఆఫర్.. ఆడమ్ మిల్నే స్థానంలో సీఎస్‌కేలోకి ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement