Sachin Tendulkar
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సచిన్ టెండుల్కర్, యువీ.. కూతురి కోసం ధోని అలా!(ఫొటోలు)
-
సారా టెండుల్కర్‌కు కొత్త బాధ్యతలు.. సచిన్ ట్వీట్ వైరల్ (ఫొటోలు)
-
సచిన్ టెండుల్కర్ ఫౌండేషన్‌లో దీపావళి సెలబ్రేషన్స్.. ఫొటోలు షేర్ చేసిన సారా
-
విరాట్ కోహ్లి వరల్డ్ రికార్డు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే
భారత స్టార్ క్రికెటర్, రన్‌మిషన్ విరాట్ కోహ్లి మరో ప్రపంచరికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతవేగంగా 27,000 వేల పరుగులు మైలు రాయిని అందుకున్న క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో 47 పరుగులు చేసిన కోహ్లి.. ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి 594* ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను అందుకున్నాడు.సచిన్ రికార్డు బ్రేక్.. ఇంతకుముందు ఈ ప్రపంచ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 623 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అతడు అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌తో సచిన్ ఆల్‌టైమ్ రికార్డును కోహ్లి (594* ) బ్రేక్ చేశాడు.ఆగని రన్ మిషన్..విరాట్ కోహ్లి 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తన అరంగేట్రం నుంచి కోహ్లి సత్తాచాటుతునే ఉన్నాడు. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా పరుగులు వరద పారిస్తూ రన్మిషన్గా పేరుగాంచాడు. కోహ్లి ఇప్పటి వరకు టెస్టుల్లో 8871, వన్డేల్లో 13906, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. అదే విధంగా వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20లో ఒక శతకం కోహ్లి ఖాతాలో ఉన్నాయి.చదవండి: IND vs BAN: టీమిండియా వరల్డ్ రికార్డు.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే -
ఓపెనర్లుగా వీరూ, రోహిత్.. మిడిలార్డర్లో సచిన్, విరాట్: డీకే
టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కామెంటేటర్‌గా మరింత బిజీ అయ్యాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత మ్యాచ్ ఫలితాలు, ఆటగాళ్ల ప్రదర్శనను తనదైన శైలిలో విశ్లేషిస్తూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించిన డీకే తాజాగా.. తన ఆల్‌టైమ్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు.ఓపెనర్లుగా వీరూ, రోహిత్మూడు ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లకు తన జట్టులో దినేశ్ కార్తిక్ చోటిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు సింహస్వప్నంగా మారి.. విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు డీకే.మిడిల్ ఆర్డర్లో సచిన్, విరాట్పరిమిత ఓవర్ల క్రికెట్లో 100కు పైగా స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టిన వీరూతో పాటు.. ఇటీవలి టీ20 ప్రపంచకప్-2024లో 257 పరుగులతో రెండో హయ్యస్ట్ రన్‌స్కోరర్‌గా నిలిచిన రోహిత్‌కు ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశమిస్తానన్నాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్, మాజీ హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను ఎంచుకున్న డీకే.. వంద సెంచరీల దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్‌ను నాలుగో స్థానానికి ఎంచుకున్నాడు.ఇక ఆ తర్వాతి స్థానంలో రన్‌మెషీన్, 80 శతకాల వీరుడు విరాట్ కోహ్లికి చోటిచ్చిన దినేశ్ కార్తిక్.. ఆల్‌రౌండర్ల జాబితాలో వరల్డ్‌కప్ విన్నర్స్ యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజాలను ఎంపిక చేసుకున్నాడు. అదే విధంగా బౌలింగ్ విభాగంలో.. సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్, స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, లెజెండ్ అనిల్ కుంబ్లేలకు స్థానం కల్పించాడు డీకే. పన్నెండో ఆటగాడిగా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ను ఎంచుకున్నాడు ఈ తమిళనాడు మాజీ బ్యాటర్. క్రిక్‌బజ్ షోలో ఈ మేరకువ్యాఖ్యలు చేశాడు.వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో డీకే ఎంచుకున్న భారత అత్యుత్తమ జట్టువీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖన్.12th మ్యాన్: హర్భజన్ సింగ్. -
చరిత్ర సృష్టించిన రోహిత్.. సెహ్వాగ్, సచిన్ సరసన హిట్‌మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులను రోహిత్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు.రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి ఇయాన్ మోర్గాన్ రికార్డును రోహిత్ సమం చేశాడు. మోర్గాన్ కెప్టెన్‌గా 180 ఇన్నింగ్స్‌లలో 233 సిక్స్‌లు బాదగా.. రోహిత్ కేవలం 134 ఇన్నింగ్స్‌లలోనే 233 సిక్స్‌లు కొట్టేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో 15000 పరుగుల మైలు రాయిని అందుకున్న మూడో భారత ఓపెనర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు ఓపెనర్‌గా 352 ఇన్నింగ్స్‌లలో15,035 పరుగులు చేశాడు.ఈ జాబితాలో భారత లెజెండరీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(16,119) తొలి స్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,335) ఉన్నారు. -
CSK Vs GT: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
గుజరాత్ టైటన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో సాయిసుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన సుదర్శన్ సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి స్కోర్‌ను బోర్డును పరుగులు పెట్టించాడు. గిల్, సుదర్శన్ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్(104) కూడా సెంచరీ చేశాడు.సచిన్ రికార్డు బద్దలు..ఇక మ్యాచ్‌లో సుదర్శన్ సెంచరీతో పాటు.. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు.సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉండేది.సచిన్, గైక్వాడ్ ఇద్దరూ 1000 పరుగుల మైలు రాయిని 31 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్‌తో వీరిద్దరి ఆల్‌టైమ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైల్‌స్టోన్‌ను అందుకున్న మూడో క్రికెటర్‌గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ (21) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత విండీస్ ఆటగాడు లెండిల్ సిమన్స్(23) సిమ్మన్స్ ఉన్నాడు. -
HBD Sachin: రికార్డులకు కవల సోదరుడు.. ఈ విషయాలు తెలుసా?
రికార్డులు- అతడు కవల పిల్లల్లాంటివాళ్లు. 1990వ దశకంలో భారత క్రికెట్ ఎదుగుదలతో పాటే అతడూ ఎదిగాడు. కోట్లాది మందికి ఆదర్శమూర్తి అయ్యాడు. పాత రికార్డులు బద్దలుకొడుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆటతోనే కాదు అందమైన వ్యక్తిత్వంతోనూ సౌమ్యుడిగా పేరొంది వర్ధమాన క్రికెటర్లకు ఆరాధ్యదైవంగా మారాడు.దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన మకుటం లేని మహరాజుగా వెలుగొందిన ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండుల్కర్ ‘హాఫ్ సెంచరీ’ పూర్తి చేసుకుని నేడు(ఏప్రిల్ 24) 51వ పడిలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా... అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్న ఈ టీమిండియా దిగ్గజం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మీకోసం..అత్యధిక పరుగుల వీరుడుఅంతర్జాతీయ క్రికెట్లో వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. వన్డేల్లో 18,426, టెస్టుల్లో 15,921 రన్స్ సాధించాడు.ఓవరాల్‌గా సచిన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 34,357 రన్స్ స్కోరు చేశాడు. ఇక పరుగుల రికార్డుల్లో వన్డేల్లో సచిన్ తర్వాత కుమార్ సంగక్కర 14, 234 రన్స్‌తో రెండో స్థానంలో ఉండగా.. టెస్టుల్లో యాక్టివ్ ప్లేయర్లలో జో రూట్ 11,736 రన్స్‌తో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు1998లొ.. సెప్టెంబరు 26న బులావయోలో జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌లో 127 పరుగులు సాధించిన సచిన్.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. యాభై ఓవర్ల ఫార్మాట్లో సచిన్‌కు ఇది 18వ శతకం. తద్వారా డెస్మాండ్ హైన్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసిన సచిన్.. ఓవరాల్‌గా వన్డేల్లో 49 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక 2005, డిసెంబరులో ఢిల్లీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా టెండుల్కర్ టెస్టుల్లో 34వ శతకం సాధించి సునిల్ గావస్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత తన కెరీర్ మొత్తంలో ఓవరాల్‌గా 51 టెస్టు సెంచరీలు సాధించి.. ఇప్పటికీ ఆ రికార్డును తన పేరిట పదిలంగా పెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ మొత్తంగా వంద సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లి 80 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.బెస్ట్ అగైనెస్ట్ వెరీ బెస్ట్ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా మీద వన్డే, టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ మెరుగైన రికార్డులు సాధించాడు. 1992లో వన్డేల్లో రెండు సెంచరీలు.. 1998లో చెన్నై టెస్టులో 155 పరుగులతో దుమ్ములేపాడు. The Sachin Tendulkar masterclass at Sharjah. 💥pic.twitter.com/3NKRE9z2xl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024ఆస్ట్రేలియాతో 39 టెస్టుల్లో భాగమైన సచిన్ 3630, వన్డేల్లో 70 ఇన్నింగ్స్‌లో 3077 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా ఆస్ట్రేలియా మీద 20 శతకాలు బాది.. ఒకే ప్రత్యర్థి మీద ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.క్యాలెండర్ ఇయర్లో..టెస్టు క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధికసార్లు వెయ్యికిపైగా రన్స్ సాధించిన బ్యాటర్‌గా సచిన్‌కు వరల్డ్ రికార్డు ఉంది. 1997, 1999, 2001, 2002, 2008, 2010లో సచిన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. On his 51st birthday, sit back and enjoy some Sachin Tendulkar goodness! ⭐️ pic.twitter.com/nMRpzEBK5X— cricket.com.au (@cricketcomau) April 24, 2024సచిన్ తర్వాత బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, అలిస్టర్ కుక్, కుమార్ సంగక్కర, జాక్వెస్ కలిస్, రిక్కీ పాంటింగ్ ఐదేసిసార్లు ఈ ఫీట్ నమోదు చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లోనూ ఈ ఘనత సచిన్ పేరిట(7 సార్లు) ఉండేది. అయితే, విరాట్ కోహ్లి(8 సార్లు) ఈ రికార్డును బ్రేక్ చేశాడు.నాటి ఐసీసీ టోర్నీలో..1996 వరల్డ్‌కప్, 2003 ప్రపంచకప్ టోర్నీల్లో సచిన్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2011లో భారత్ వేదికగా టీమిండియా వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఓవరాల్‌గా ఐసీసీ టోర్నీల్లో ఆరు శతకాల సాయంతో 2278 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సచిన్ కొనసాగుతున్నాడు.అలా మొదలుపెట్టి.. 201 వికెట్లు కూడా1989లో పాకిస్తాన్‌తో టెస్టుతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సచిన్ టెండుల్కర్.. 2006లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత ఆటకు వీడ్కోలు పలికాడు. ఓవరాల్‌గా 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 34,357 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ 201 వికెట్లు కూడా పడగొట్టాడు. 2013లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి.. రిటైర్ అయ్యాడు.చదవండి: మొన్న రోహిత్.. ఇప్పుడు అక్షర్.. ఎందుకిలా? ఆ రూల్ వల్ల ఎవరికి నష్టం? -
ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్ ఎవరో తెలుసా?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక క్యాష్ రిచ్ లీగ్ కోసం అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ఒకొక్కరిగా జట్టుతో కలుస్తున్నారు. 17వ సీజన్ కోసం ఆటగాళ్లు తమ ప్రీ ట్రైనింగ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్‌ను బహుకరించడం అనావాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే ఈ క్యాప్‌తో పాటు ప్రైజ్ మనీని కూడా అందజేస్తారు. అయితే ఈ ధనాధన్ లీగ్‌లో ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్న తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా? మీరు ఆలోచించండి? మీకు సమాధానం తెలియకపోతే మేమే చెప్పేస్తాం. ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న మొట్టి మొదటి భారత ఆటగాడు ఎవరో కాదు టీమిండియా క్రికెట్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ సారథి సచిన్ టెండూల్కర్. 2010 సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున సచిన్ ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో మాస్టర్ బ్లాస్టర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 618 పరుగులతో లీగ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో అతడికి ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఇక సచిన్ తర్వాత ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్న రెండో ఇండియన్ రాబిన్ ఉతప్ప. 2014 సీజన్లో కోల్‌కతాకు ప్రాతినిథ్యం వహించిన ఉతప్ప.. 660 పరుగులతో ఆరెంజ్‌క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. మరి ఈసారి ఎవరు ఆరెంజ్‌క్యాప్‌ను గెలుచుకుంటారో వేచి చూడాలి. -
రోహిత్ అరుదైన ఘనత.. గేల్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! తర్వాత సచినే
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 154 బంతుల్లో తన 12వ టెస్టు సెంచరీ మార్కు అందుకున్నాడు. ఓవరాల్‌గా ఇది 48 అంతర్జాతీయ టెస్టు సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 162 బంతుల్లో 103 పరుగులు చేసిన హిట్‌మ్యాన్.. స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా శుబ్‌మన్ గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ పలు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(48) రికార్డును రోహిత్ సమం చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(100) తొలి స్దానంలో ఉండగా.. కోహ్లి(80) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. రోహిత్‌కు ఇది ఓపెనర్‌గా 43వ సెంచరీ. ఈ క్రమంలో క్రిస్ గేల్(42) రోహిత్ అధిగమించాడు. ఈ లిస్ట్‌లో డేవిడ్ వార్నర్(49) అగ్రస్ధానంలో ఉన్నాడు. ►అదే విధంగా టెస్టుల్లో ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్‌గా సునీల్ గవాస్కర్ రికార్డును రోహిత్ సమం చేశాడు. గవాస్కర్ ఓపెనర్‌గా ఇంగ్లండ్‌పై 4 సెంచరీలు చేయగా.. హిట్‌మ్యాన్ సైతం 4 సెంచరీలు చేశాడు. ►ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ చరిత్రలో 9 సెంచరీలు సాధించాడు. ►30 ఏళ్ల వయస్సు తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్(35) రికార్డును సైతం రోహిత్ బ్రేక్ చేశాడు. 30 ఏళ్ల వయస్సు తర్వాత సచిన్ 35 సెంచరీలు చేయగా.. రోహిత్ సైతం 35 సెంచరీలు చేశాడు. మరోసెంచరీ చేస్తే సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు. Of hundreds and celebrations! 👏 🙌 Rohit Sharma 🤝 Shubman Gill Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ImRo45 | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/yTZQ4dAoEe — BCCI (@BCCI) March 8, 2024 -
బిగ్‌బాస్ విన్నర్ చేతిలో ఔటైన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్
థానే వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) తొట్టతొలి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ లీగ్ ప్రారంభ వేడుకలలో సెలబ్రిటీలు, క్రికెటర్లు సందడి చేశారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మెగా పపర్ స్టార్ రాంచరణ్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తమిళ నటుడు సూర్య, భారత మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి, సురేష్ రైనా ఈ వేడుకల్లో భాగమయ్యారు. అయితే ఈ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహకులు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్‌లో సచిన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుపడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన మంచి ఊపు మీద కన్పించిన సచిన్.. స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన సచిన్.. మరో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ విషయానికి వస్తే.. ఇది టీ10 ఫార్మాట్లో టెన్నిస్ బాల్‌తో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, శ్రీనగర్ జట్లు పోటీ పడుతున్నాయి. రామ్‌చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్‌ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్‌ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. .@ispl_t10 is poised to amaze us all, much like Munawar did by dismissing the 𝐌𝐚𝐬𝐭𝐞𝐫 𝐁𝐥𝐚𝐬𝐭𝐞𝐫 👀 🤯 #SonySportsNetwork #ispl #isplt10 #Street2Stadium #ZindagiBadalLo pic.twitter.com/801LO25ilh — Sony Sports Network (@SonySportsNetwk) March 6, 2024 -
క్రికెట్ దేవుడే దిగి వస్తే...
కశ్మీర్‌కు చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్ జీవితం వెలిగింది. రెండు చేతులూ లేకపోయినా మెడతో బ్యాట్ పట్టి ఆడే అమిర్ తనను ఇన్‌స్పయిర్ చేసిన క్రికెట్ దేవుడు సచిన్‌ని జీవితంలో కలుస్తాననుకోలేదు. కలిశాడు. అంతేనా? సచిన్ నుంచి ఊహించని బహుమతి అందుకున్నాడు. ఈ వివరం ఏమిటంటే... సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. ఇది అతని తొలి కశ్మీర్ పర్యటన అని భోగట్టా. అక్కడి ‘చార్సో’ అనే ఊళ్లో ఉండే బ్యాట్ల తయారీ కేంద్రాన్ని సచిన్ సందర్శించాడు. అంతే కాదు... అక్కడి ‘బిజ్బెహరా’ ్రపాంతానికి చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్‌ను తన హోటల్‌కు పిలిపించుకుని ప్రత్యేకంగా కలిశాడు. అమిర్ హుసేన్ ప్రస్తుతం కశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నాడు. పుట్టుకతో చేతులు లేని అమిర్ తన జీవితంలో పేర్కొన్న నిరాశను సచిన్‌ను చూసి ఇన్‌స్పయిర్ అయి క్రికెటర్ కావడంతో పోగొట్టుకున్నాడు. బ్యాట్‌ను మెడ, భుజాల మధ్య పట్టి అతను క్రికెట్ ఆడతాడు. ఈ స్ఫూర్తిమంతమైన గాధను విన్న సచిన్ తన పర్యటన సందర్భంగా అమిర్ హుసేన్‌ను కలిశాడు. ‘నిన్ను కలవడం సంతోషం’ అని ‘ఎక్స్’లో తానే పోస్ట్ పెట్టాడు. సచిన్‌ని చూడగానే ఇలాంటిది తన జీవితంలో జరిగిందా అన్నట్టుగా భావోద్వేగంతో కదిలిపోయాడు అమిర్. ‘ఇలాగే నువ్వు మమ్మల్ని ఇన్‌స్పయిర్ చేయి’ అని అమిర్‌తో సచిన్ చె΄్పాడు. అంతేనా? తను సంతకం చేసిన బ్యాట్ ఇచ్చి అమిర్‌ని తబ్బిబ్బు చేశాడు. -
గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. వీడియో వైరల్
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం తన తొలి కాశ్మీర్ పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సచిన్ తన కుటుంబంతో కలిసి చుట్టేస్తున్నారు. ఈ పర్యటనలో సచిన్ మరోసారి బ్యాట్ పట్టి సందడి చేశాడు. గుల్మార్గ్లో స్థానికులతో కలిసి మాస్టర్ బ్లాస్టర్ గల్లీ క్రికెట్ ఆడాడు. రోడ్డుపై స్ధానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడూతూ సచిన్ ఎంజాయ్ చేశాడు. అక్కడ వారితో ఫోటోలు కూడా క్రికెట్ గాడ్ దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్‌గా "క్రికెట్ అండ్ కాశ్మీర్.. స్వర్గంలో మ్యాచ్" అంటూ రాసుకొచ్చాడు. కాగా బుధవారం సచిన్ బుధవారం చాలా ప్రాంతాలను సందర్శించాడు. అక్కడ విల్లో క్రికెట్ బ్యాట్ల తయారీ కేంద్రాన్ని లిటిల్ మాస్టర్ విజిట్ చేశాడు. అదే విధంగా ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అమన్ సేతు వంతెనను కూడా సందర్శించాడు. ఈ సందర్భంగా అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్ ముచ్చటించాడు. Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV — Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024 -
ఈ సెలబ్రిటీల పెట్టుబడులు ఎక్కడో తెలుసా?
చదువవగానే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికే స్థిరపడకుండా సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. కొత్తగా పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పారిశ్రామిక రంగం దన్నుగా నిలుస్తోంది. దాంతో, ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం ఉన్న దేశాల్లో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 1,16,000 గుర్తింపు పొందిన అంకుర పరిశ్రమలు ఉన్నాయి. దేశంలో లక్షకు పైగా ఉన్న అంకుర పరిశ్రమలు 56 విభిన్న విభాగాల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్‌లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం మనదే. నాస్కామ్ నివేదిక ప్రకారం 27 వేలదాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్ స్టార్టప్స్ ఉన్నాయిక్కడ. యువతరం ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి వస్తోంది. పెట్టుబడిదారులు పెరిగారు, ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందనే కంపెనీల్లో సెలబ్రిటీలు సైతం మదుపు చేసి కోట్లు గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్‌లుగా ఎదుగుతున్నాయి. ఇదీ చదవండి: రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే! సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్‌లు.. శిఖర్‌ధావన్: అప్‌స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. విరాట్‌కోహ్లీ: ఎంపీఎల్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్. సెప్టెంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్‌ఫామ్. జనవరి 2021లో పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్. నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు. -
చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్.. సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
నెల్సన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సర్కార్.. ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝుళిపించాడు. ఈ మ్యాచ్‌లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బంగ్లా క్రికెటర్‌గా సర్కార్ నిలిచాడు. ఈ జాబితాలో లిట్టన్ దాస్(176) అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బ్రేక్.. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సర్కార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆసియా క్రికెటర్‌గా సర్కార్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 2009లో క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 163 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అయితే తాజా మ్యాచ్‌తో సర్కార్ 14 ఏళ్ల మాస్టర్‌బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్‌క్యాప్స్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్(169) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. -
'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి'.. రాజమౌళి ట్వీట్ వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడంపై ఆయన ట్వీట్ చేశారు. రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి అంటూ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో పాటు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డ్‌ను తుడిచిపెట్టేశాడు. (ఇది చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టాడానికి. కానీ కానీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డును బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాదిలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. Records are meant to be broken, but no one in their wildest dreams dreamt of breaking Sachin's record when he announced his retirement. And the KING emerged. 🔥🔥 KOHLI 🙏🏻🙏🏻 — rajamouli ss (@ssrajamouli) November 15, 2023 -
మోదీకి టీమిండియా జెర్సీని బహూకరించిన సచిన్.. వీడియో వైరల్
వారణాసి: భారత్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ఉత్తరప్రదేశ్‌లోని తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం 31 ఎకరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లకు కొనుగోలు చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ స్టేడియం నిర్మాణానికి రూ. 330 కోట్లు వెచ్చించనుంది. రింగ్‌రోడ్ సమీపంలోని రాజాతలాబ్ ప్రాంతంలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2025 డిసెంబర్‌కల్లా ఈ స్టేడియం పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఇది మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానుంది. ఇప్పటికే కాన్పూర్, లక్నోలలో ఒక్కో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది. శనివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి భారత క్రికెట్ ప్రముఖులందరూ హాజరయ్యారు. సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకి టీమిండియా జెర్సీ బహుకరించిన సచిన్ ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సచిన్ టెండూల్కర్ భారత జట్టు జెర్సీ అందజేశారు. సచిన్ బహుకరించిన జెర్సీపై నమో అని రాసి ఉంది. అదే విధంగా బీసీసీఐ రోజర్ బిన్నీ, జై షా భారత జట్టు క్రికెట్ సభ్యులు సంతకాలు చేసిన బ్యాట్‌ను ప్రధానికి ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! యువ పేసర్ ఎంట్రీ Sachin Tendulkar Presented Indian cricket team jersey - written "Nammo" in back to PM Narendra Modi.pic.twitter.com/JqHtR2Ylu4 — Johns. (@CricCrazyJohns) September 23, 2023 -
సచిన్‌కు ‘గోల్డెన్ టికెట్’
ముంబై: భారత్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు బీసీసీఐ వరుసగా ‘గోల్డెన్ టికెట్’ ఇచ్చి మ్యాచ్‌లకు ఆహ్వానిస్తోంది. ఇటీవలే నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఈ టికెట్ అందించిన బోర్డు కార్యదర్శి జై షా తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ‘గోల్డెన్ టికెట్’ అందించారు. అద్భుత క్రికెటర్, జాతికి గర్వకారణంగా నిలిచిన ‘భారత రత్న’ సచిన్‌కు టికెట్ అందించడం పట్ల జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సచిన్‌లాంటి వ్యక్తి ఇప్పుడు వరల్డ్‌కప్‌లో ఒక భాగంగా మారారని వ్యాఖ్యానించారు. కొత్త టికెట్లూ హుష్ కాకి! వరల్డ్ కప్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని 4 లక్షల టికెట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే ఏమీ మారలేదని అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అమ్మకానికి పెట్టారు. అయితే భారత్‌కు సంబంధించి అన్ని మ్యాచ్‌లకూ టికెట్లే లేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని మ్యాచ్‌లకు ‘సోల్డ్ అవుట్’ చూపిస్తుండగా... మిగతా మ్యాచ్‌లకు మీరు క్యూలో ఉన్నారు అని ‘బుక్ మై షో’ చెబుతోంది. గతంతో పోలిస్తే టికెట్ కోసం ప్రయతి్నస్తున్నవారికి వేచి ఉండాల్సిన సమయం వేర్వేరుగా చూపించగా... ఇప్పుడు అందరికీ ఒకే మెసేజ్ ‘90 నిమిషాలు’ అనే చూపిస్తుండటం విశేషం! అసలు ఏ మ్యాచ్‌కు ఎన్ని టికెట్లు అమ్ముతున్నారనే విషయంపైనే సమాచారం లేకపోగా, 4 లక్షల టికెట్ల గురించి ఎక్కడా స్పష్టత లేదు! చూస్తుంటే ఇదంతా అభిమానులను కాస్త ఓదార్చించేందుకు బీసీసీఐ ఆడిన ఒక డ్రామాలాగానే కనిపిస్తోంది. -
మరో వందేళ్లయినా సచిన్ లాంటి క్రికెటర్ పుట్టడు: మురళీధరన్
టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా '800'. మురళీధరన్ పాత్రలో 'స్లమ్‌డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకుడు. బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ముంబైలో మంగళవారం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా '800' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో భాగంగా మురళీధరన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) 'నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్‌కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు. మరో 100 ఏళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు. ఆయన ఎప్పటికీ బెస్ట్. మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు. నా బౌలింగ్‌లో రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ నా బౌలింగ్ శైలిని పట్టుకోలేకపోయాడు. రాహుల్ ద్రావిడ్ కూడా! సచిన్ మాత్రం నా ఆటను పూర్తిగా చదివేశాడు'' అని మురళీధరన్ చెప్పాడు. ఇక సచిన్ మాట్లాడుతూ ''మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్‌కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. ఎంతో సాధించినా చాలా సింపుల్‌గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు' అని అన్నాడు. (ఇదీ చదవండి: తొలిప్రేమ- బ్రేకప్ గురించి చెబుతూ బాధపడిన జాన్వీ) -
సచిన్, ద్రవిడ్ కాదు.. అతడే ఆసియాలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్: సెహ్వాగ్
ప్రముఖ క్రికెట్ ప్రేజేంటర్ గౌరవ్ కపూర్ హోస్ట్ చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి చేశాడు. ఈ షోలో పాల్గొన్న సెహ్వాగ్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆసియాలో అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరని గౌరవ్ కపూర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా అతడు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కాకుండా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్‌ను ఎంపిక చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. కాగా 2000లలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలతో పోటీపడిన ఆటగాళ్లలో ఇంజమామ్ వుల్ హక్ ఒకడు. ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్లో 498 మ్యాచ్‌లు ఆడిన ఇంజమామ్.. 20,569 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 25 సెంచరీలు, వన్డేల్లో 10 సెంచరీలు సాధించాడు. అయితే వన్డేల్లో మాత్రం 83 హాఫ్ సెంచరీలు ఇంజమామ్ చేశాడు. "అందరూ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతారు. కానీ ఇంజమామ్-ఉల్-హక్ ఆసియాలో అతిపెద్ద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. అయితే సచిన్ పాజీ అందరి కంటే ముందున్నాడు. అతడికి ఎవ్వరితో పోటీ లేదు. కానీ ఆసియాలో మాత్రం అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే.. ఇంజమామ్‌ను మించిన వారు లేరు. 2003-04 కాలంలో ఇంజమామ్ ఓవర్‌కి 8 పరుగులు చేసేవాడు. అతను తన బ్యాటింగ్ పార్టనర్‌కి భయపడొద్దు అని ధైర్యం చేప్పేవాడు. ఓ మ్యాచ్‌లో ఆఖరి 10 ఓవర్లలో 80 పరుగులు అవసరం. ఇటువంటి సమయంలో ఏ ఆటగాడైనా ఒత్తడికి గురవుతాడు. కానీ ఇంజమామ్ మాత్రం చాలా కూల్‌గా ఉంటాడు. అదే విధంగా 2005లో ఓ మ్యాచ్‌లో డానిష్ కనేరియా రౌండ్‌ది వికెట్ బౌలింగ్ చేసి కాస్త ఇబ్బంది పెట్టాడు. భారీ షాట్లు ఆడకుండా నన్ను ఆపేందుకు కనేరియా ప్రయత్నించాడు. నేను ఒకట్రెండు ఓవర్లు ఢిపెన్స్ ఆడాను. ఆ తర్వాత ఇంజమామ్ వైపు తిరిగి... ‘‘ఇంజీ భాయ్... నా కాళ్లు నొప్పి పెడుతున్నాయ్. ఎంత సేపు డిఫెన్స్ ఆడాలని’’ అని అన్నాను. దానికి అతడు ‘‘నన్నేం చేయమంటావ్’’ అన్నాడు. అందుకు బదులగా "సర్కిల్ లోపలకి లాంగ్ ఆన్ ఫీల్డర్ని తీసుకురా, నేను సిక్స్ కొడతా అని ఇంజీతో చెప్పా. దానికి ఇంజమామ్ నవ్వాడు. ‘‘సరే నేను సిక్సర్ కొట్టపోతే ఆ ఫీల్డర్ని మళ్లీ వెనక్కిపంపించు’’ అని చెప్పాను. అందుకు అతడు అంగీకరించి ఫీల్డర్ని సర్కిల్ లోపలకి పిలిచాడు. కనేరియా గూగ్లీ వేయగా.. నేను చెప్పినట్లగానే బంతిని స్టాండ్స్‌కు పంపించాను. ఫీల్డింగ్ మార్చినందుకు కనేరియాకు ఒక్క సారిగా కోపం వచ్చింది. వెంటనే కెప్టెన్ దగ్గరికి వెళ్లి ‘ఇంజీ భాయ్, మీరు ఫీల్డర్‌ను ఎందుకు పైకి తీసుకువచ్చారు? అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా నువ్వు సైలెంట్‌గా వెళ్లి బౌలింగ్ చెయి, లేదంటే బయటకు వెళ్లిపోతావు అని ఇంజీ భాయ్ అన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. -
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్.. ఏమన్నాడంటే?
ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో కూడా గిల్ తన జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా కీలకమైన ఫైనల్‌కు ముందు శుబ్‌మన్ గిల్‌పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్లో గిల్ ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనదని సచిన్ కొనియాడాడు. "ఈ ఏడాది సీజన్లో గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఆటతీరు ఎప్పటికీ మర్చిపోలేం. అతడు మూడు సెంచరీలు సాధించాడు. అందులో రెండు సెంచరీలు గుజరాత్ ఫైనల్‌కు చేరుకోవడంలో తోడ్పడితే.. మరో సెంచరీ ముంబైకు అవకాశం కల్పించింది. అదే సెంచరీ ఆర్సీబీ కొంపముంచింది. ఈ జెంటిల్మెన్ గేమ్‌లో ఇటువంటివి సహజం. ముఖ్యంగా గిల్ బ్యాటింగ్ స్టైల్‌ను నన్ను బాగా అకట్టుకుంది. అతడు ఆడిన షాట్లు చాలా క్లాసిక్‌గా ఉన్నాయి. అదే విధంగా వికెట్ల మధ్య కూడా అతడు చాలా చురుకుగా పరిగెత్తతున్నాడు. గుజరాత్ భారీ స్కోర్లు నమోదు చేయడంలో గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక్కసారి క్రీజులో సెట్ అయ్యాక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక గుజరాత్ చాలా బలమైన జట్టు. గిల్, హార్దిక్, డేవిడ్ మిల్లర్ వికెట్లను చెన్నై సాధించగలిగితే.. గుజరాత్lio బ్యాక్‌ఫుట్‌లో ఉంచవవచ్చు. అదేవిధంగా ధోని కూడా తన బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది" అని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: చరిత్రకు అడుగు దూరంలో శుబ్‌మన్ గిల్.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు! -
టెండుల్కర పై పగ తీర్చుకునే రోహిత్ శర్మ
-
సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్ టెండూల్కర్.. వీడియో వైరల్
క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 2.5 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. దీంతో అతడిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. నెట్స్‌లో చెమటోడ్చుతున్న అర్జున్ ఇక అర్జున్ అర్జున్ టెండూల్కర్‌కు బౌలింగ్‌తో బ్యాటింగ్ కూడా చేసే సత్తా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి పేరిట ఓ సెంచరీ కూడా ఉంది. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 22న వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ముంబై చేరుకున్న రోహిత్ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తమ నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా అర్జున్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే అర్జున్ బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్‌పై కూడా దృష్టిపెట్టాడు. తమ బౌలర్లు బౌలింగ్ చేస్తుండగా అర్జున్ భారీ షాట్లు ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్‌లో ఇంతే! తీసి పడేయండి.. 𝕊𝕥𝕣𝕚𝕜𝕚𝕟𝕘 so good, you'd think it was their first job 😍 Look again 😉#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/2QRlreAOID — Mumbai Indians (@mipaltan) April 19, 2023 -
సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ!
ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో పలు మార్పులతో ముంబై బరిలోకి దిగనున్నట్లు సమాచారం. సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు ముంబై పేసర్ జోఫ్రా అర్చర్ నెట్స్‌లో గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్‌కు అర్చర్ దూరమైతే అతడి స్థానంలో మెరిడిత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా యువ స్పిన్నర్ హృతిక్ షోకిన్ స్థానంలో కుమార్ కార్తీకేయకు ఛాన్స్ ఇవ్వాలని ముంబై మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. అర్జున్ టెండ్కూలర్ ఎంట్రీ.. మరోవైపు సచిన్ తనయుడు అర్జున్ టెండ్కూలర్ సీఎస్కే మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ముంబయి ఇండియన్స్ జట్టులోచేరిన అర్జున్.. ఇప్పటివరకు ఒక మ్యాచ్‌లో కూడా ఆడలేదు. కాగా సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు అర్జున్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా దేశావాళీ క్రికెట్లో గోవా తరపున అర్జున్ ఆడుతున్న సంగతి తెలిసిందే. రంజీ సీజన్ 2022-23లో అర్జున్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ(25 వికెట్లు) మ్యాచ్‌లు ఆడిన అతడు.. ఐదు ఫస్ట్ క్లాస్(9 వికెట్లు) మ్యాచులు, 9 టీ20లు(12 వికెట్లు) ఆడాడు. చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు Arjun ko bas 🎯 dikhta hai 🤌🔥#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #TATAIPL #IPL2023 pic.twitter.com/IYHgDpBPEs — Mumbai Indians (@mipaltan) April 7, 2023 -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. సచిన్ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లి
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. మార్చి17(శుక్రవారం)న ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఇదే చివరి సిరీస్. ఇక ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన కోహ్లి(186).. ఆఖరి టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లి ముందున్న రికార్డులు ఇవే.. ►ఈ సిరీస్‌లో కోహ్లి మరో 191 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 13,000 పరుగులు పూర్తి చేసిన 5వ బ్యాటర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో వరుసగా సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430) ఉన్నారు. ►అదే విధంగా ఈ సిరీస్‌లో కోహ్లి మరో మూడు సెంచరీలు సాధిస్తే.. సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల(49) ప్రపంచరికార్డును సమం చేస్తాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 46 సెంచరీలు సాధించాడు. ►ఇక తొలి వన్డేలో విరాట్ 48 పరుగులు సాధిస్తే.. స్వదేశంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్(5406)ను కోహ్లి అధిగమిస్తాడు. కోహ్లి ఇప్పటివరకు సొంత గడ్డపై వన్డేల్లో 5358 పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(6976) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. చదవండి: IPL 2023: కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా! -
విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా విరాట్ ఈ ఫీట్ సాధించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉండేది. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. కోహ్లి 549 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. సచిన్ 577 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును నెలకొల్పాడు. విరాట్, సచిన్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (588 మ్యాచ్‌లు), జాక్వెస్ కలిస్ (594 మ్యాచ్‌లు), కుమార సంగక్కర (608 మ్యాచ్‌లు) , మహేల జయవర్ధనే(701 మ్యాచ్‌లు) 25,000 పరుగులను పూర్తి చేశారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 64 పరుగులు చేశాడు. ఆసీస్ చిత్తు.. భారత్ ఘన విజయం ఇక ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. 115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26. 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. చతేశ్వర్ పూజారా(27), శ్రీకర్ భరత్(23) ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో 7 వికెట్లతో రవీంద్ర జడేజా ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అశ్విన్ మూడు వికెట్ల పడగొట్టాడు. చదవండి: IND vs AUS: శభాష్ హిట్‌మ్యాన్.. పూజారా కోసం వికెట్‌ను త్యాగం చేసిన రోహిత్! వీడియో వైరల్ -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డులు.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడిగా
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్‌లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో విరాట్‌కు ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే ►శ్రీలంకపై విరాట్‌కు ఇది 10వ వన్డే సెంచరీ. తద్వారా ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్‌గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్‌తో కలిసి విరాట్ సమంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు చేయగా.. విరాట్ కూడా వెస్టిండీస్‌పై 9 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లి(10).. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ►ఇక భారత గడ్డపై విరాట్‌కు ఇది 21 వన్డే సెంచరీ. దీంతో స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సెంచరీ చేసిన కింగ్ సచిన్‌ను అధిగిమించాడు. ►అదేవిధంగా స్వదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రికీ పాటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో నిలవగా.. 5303 రన్స్‌తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. ►అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్‌లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు. చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
తొలి మ్యాచ్‌లోనే కొడుకు సెంచరీ.. సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రంజీ సీజన్లో గోవాకు అర్జున్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో అర్జున్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 207 బంతులు ఎదుర్కొన్న అర్జున్ 120 పరుగులు చేశాడు. ఇక తొలి రంజీ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన అర్జున్ టెండూల్కర్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇక అర్జున్ ఇన్నింగ్స్‌పై అతడి తండ్రి సచిన్ టెండూల్కర్ తొలి సారి స్పందించాడు. ఇన్ఫోసిస్ స్థాపించి 40 ఏళ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సచిన్ ఆసక్తిర వాఖ్యలు చేశాడు. "క్రికెట్లో రాణించడం అంత సులభమైన విషయం కాదు. అర్జున్‌కు కూడా ఇది చాలా కష్టమైన ప్రయాణం. అర్జున్ ఆట పరంగా నాకంటే ఎక్కువగా రోహన్ గవాస్కర్‌తో క్లోజ్‌గా ఉంటాడు. ఈ మ్యాచ్‌లో అర్జున్ను నైట్ వాచ్‌మెన్‌గా పంపారు. అతడు 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించమని నేను చెప్పాను. ఎన్ని పరుగులు చేస్తే అది మాకు మంచి స్కోర్ అవుతుందని అర్జున్ అడిగాడు. వారు అప్పటికే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి ఉన్నారు. కనీసం 375 పరుగులు అయినా సాధిస్తే మంచి ఫైటింగ్ స్కోర్ అవుతుందని నేను చెప్పాను. చివరికి అర్జున్ సెంచరీ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అర్జున్ అందరు పిల్లల్లాగా సాధారణ బాల్యాన్ని గడపలేదు. అతడు ఒక ప్రముఖ క్రికెటర్ కొడుకు కావడంతో అతడిపై తీవ్రమైన ఒత్తడి ఉండేది. నేను రిటైర్ అయ్యాక ముంబైలో మీడియా సమావేశంలో కూడా అదే చెప్పాను. అతడిపై అనవసర ఒత్తిడి పెంచవద్దు, ముందు అర్జున్ క్రికెట్‌పై మక్కువను పెంచుకోనివ్వండి అని చెప్పాను. అదే విధంగా అతడొక మంచి క్రికెటర్‌గా ఎదిగితే మీకు నచ్చిన ప్రకటనలను చేయవచ్చు అని కూడా నేను అన్నాను" అని సచిన్ పేర్కొన్నాడు. చదవండి: FIFA WC Final: ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్.. మెస్సీకి గాయం! -
ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి సరి కొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి..8 ఫోర్లు, 1 సిక్స్‌తో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్–లూయిస్ ప్రకారం) భారత్ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవి ఏంటో ఓ లుక్కేద్దాం. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు వీరుడు పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ అవతరించాడు. బంగ్లాతో మ్యాచ్‌లో 16 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (31 మ్యాచ్‌ల్లో 1,016 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డు కోహ్లి ఖాతాలోకి చేరింది. కెరీర్లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లి ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు ఆడి 23 ఇన్నింగ్స్‌లలో మొత్తం 1,065 పరుగులు సాధించాడు. అదే విధంగా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోనూ కోహ్లి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు కోహ్లి 113 టి20 మ్యాచ్‌లు ఆడి 3,932 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (146 మ్యాచ్‌ల్లో 3,811 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బద్దలు ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు అస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ 3350 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (ఆస్ట్రేలియాలో 3,300 పరుగులు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమించాడు. టి20 ప్రపంచకప్ టోర్నీలలో మూడు లేదా అంతకంటే ఎక్కువ అర్ధ సెంచరీలు చేయడం కోహ్లికిది మూడోసారి. తాజా ప్రపంచకప్‌తోపాటు 2014, 2016 ప్రపంచకప్ టోర్నీల్లోనూ కోహ్లి ఈ ఘనత సాధించాడు. గతంలో ఏ క్రికెటర్ కూడా ఇలా చేయలేదు. అత్యధిక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డులు అదే విధంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌లు అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా విరాట్ నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గానూ విరాట్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది. టీ20 ప్రపంచకప్‌లో విరాట్‌కి ఇది ఏడో మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయుంటే విజయం మాదే: షకీబ్ -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి ఆటగాడిగా
టీ20 ప్రపంచకప్-2022లో దాయాదుల పోరు అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. సూపర్-12లో భాగంగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 83 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లి ఒంటి చేత్తో భారత్‌ను గెలిపించాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే ►ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తద్వారా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లి (14 సార్లు) గుర్తింపు పొందాడు. మొహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్–13 సార్లు)ని కోహ్లి రెండో స్థానానికి పంపించాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లి (6 సార్లు) నిలిచాడు. గేల్ (వెస్టిండీస్; 5 సార్లు) రికార్డును కోహ్లి అధిగమించాడు. ► టి20 మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక సార్లు నాటౌట్‌గా నిలిచిన క్రికెటర్‌గా షోయబ్ మాలిక్ (పాకిస్తాన్; 18 సార్లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (18 సార్లు) సమం చేశాడు. ►పాక్‌పై ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కోహ్లి (110 మ్యాచ్‌ల్లో 3,794) మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. రోహిత్ శర్మ (143 మ్యాచ్‌ల్లో 3,741 పరుగులు) రెండో స్థానానికి పడిపోయాడు. ►అదే విధంగా ఐసీసీ టోర్నమెంట్స్‌లో అత్యధిక ఫిప్టీ ప్లస్ పరుగులు సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. ఐసీసీ మెగా ఈవెంట్లో కోహ్లికి ఇది 24 వ ఫిప్టీ ప్లస్ స్కోర్ . అంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(23) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సచిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. చదవండి: T20 WC PAK Vs IND: మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు..! కానీ క్రెడిట్ విరాట్‌కే ఇవ్వాలి -
వన్డేల్లో ధావన్ అరుదైన ఘనత.. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాల సరసన!
టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో 6500 పరుగుల మైలు రాయిని అందుకున్న పదో భారత బ్యాటర్‌గా ధావన్ రికార్డులకెక్కాడు. హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ధావన్ ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ 81 పరుగులతో అఖరి వరకు ఆజేయంగా నిలిచి భారత జట్టును విజయ తీరాలకు చేర్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే భారత బౌలర్ల ధాటికి 189 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో చహర్, ప్రసిధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ తీశాడు. అనంతరం 190 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా చేధించింది. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్(82), ధావన్(81) పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. వన్డేల్లో 6500 పరుగులు సాధించిన భారత ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్-18426 పరుగులు విరాట్ కోహ్లి-12344 పరుగులు సౌరవ్ గంగూలీ- 11363 పరుగులు రాహల్ ద్రవిడ్-10889 పరుగులు ఎంఎస్ ధోని-10773 పరగులు ఎం అజారుద్దీన్- 9378 పరుగులు రోహిత్ శర్మ-9378 పరుగులు యువరాజ్ సింగ్-8701 పరుగులు వీరేంద్ర సెహ్వాగ్-8273 పరుగులు శిఖర్ ధావన్-6508 పరుగులు 🚨 Milestone Alert 🚨 Shikhar Dhawan has reached 6️⃣5️⃣0️⃣0️⃣ ODI runs for India 👏🇮🇳 What a player 💪🏻#ShikharDhawan #India #ZIMvIND #CricketTwitter pic.twitter.com/IZ5YPM7cp5 — Sportskeeda (@Sportskeeda) August 18, 2022 చదవండి: IND vs ZIM 1st ODI: ధావన్, గిల్ మెరుపులు.. 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం -
శుభ్‌మన్ గిల్ అరుదైన ఫీట్.. సచిన్ రికార్డు బద్దలు..!
Ind Vs WI 1st ODI: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేతో రీ ఎంట్రీ ఇచ్చిన భారత యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ గిల్ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. గిల్ 53 బంతుల్లో 6 ఫోర్లు,2 సిక్స్‌ల సాయంతో 64 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించిన గిల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ గడ్డపై వన్డే ఫార్మాట్లో అర్ధ సెంచరీ సాధించిన రెండో భారత అతి పిన్న వయస్కుడుగా గిల్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌లో సచిన్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. సచిన్ ఈ ఫీట్‌ను 24 ఏళ్ల 3 రోజుల వయస్సులో నమోదు చేయగా.. గిల్ 22 ఏళ్ల 317 రోజుల వయస్సులో సాధించాడు. ఇక ఈ ఘనతను భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కేవలం 22 ఏళ్ల 215 రోజుల వయస్సులో సాధించి తొలి స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. అఖరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన తొలిపోరులో విండీస్‌పై భారత్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డే వేదిక: క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టాస్: విండీస్- బౌలింగ్ భారత్ స్కోరు: 308/7 (50 ఓవర్లు) వెస్టిండీస్ స్కోరు: 305/6 (50 ఓవర్లు) విజేత: భారత్.. 3 పరుగుల తేడాతో గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శిఖర్ ధావన్ (97 పరుగులు) అర్ధ సెంచరీలతో రాణించిన గిల్(64), శ్రేయస్ అయ్యర్(54) చదవండి: IND Vs WI 1st ODI: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు..! Well played to @BCCI on competitive 1st ODI.👏🏿 #WIvIND pic.twitter.com/jXj92ekm8b — Windies Cricket (@windiescricket) July 22, 2022 -
అర్జున్ టెండూల్కర్‌ను అందుకే ఆడించలేదు: షేన్ బాండ్
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ గత రెండేళ్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు. ఐపీఎల్-2021 మినీ వేలంలో ముంబై ఇండియన్స్ అర్జున్ను రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే గతేడాది సీజన్ మొత్తం బెంచ్‌కే అర్జున్ పరిమితమయ్యాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ముంబై అతడిని విడిచిపెట్టింది. కాగా మెగా వేలంలో మళ్లీ అతడిని రూ.30 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది. దీంతో ఈ ఏడాది సీజన్లోనైనా అర్జున్ టెండూల్కర్‌కు జట్టులో చోటు దక్కుతుందని క్రికెట్ ఫ్యాన్స్ భావించారు. అయితే మరోసారి క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం అతడికి దక్కలేదు. అర్జున్ టెండూల్కర్‌కి ఐపీఎల్ 2022లో ఎందుకు అవకాశం ఇవ్వలేదో తాజాగా ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ వెల్లడించాడు. "అర్జున్ ఇంకా చాలా మెరుగుపడాలి. ఏ ఆటగాడైనా జట్టులోకి రావడం ఒకవంతు అయితే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కాలంటే చాలా కష్టపడాలి. అతడు ఇంకా చాలా వర్కవుట్స్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో అతడు మరింత రాటుతేలాలి. అతడు బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో పురోగతి సాధించాడని జట్టు భావిస్తే ఖచ్చితంగా అతడికి అవకాశం ఇస్తాం" అని షేన్ బాండ్ పేర్కొన్నాడు. ఇక ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 14 మ్యాచుల్లో 10 పరాజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. చదవండి: IPL 2022: ఐపీఎల్ 2023 ముందు.. ఆ ముగ్గురికి గుడ్‌బై చెప్పనున్న ఎస్ఆర్హెచ్..! -
ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు నో ఛాన్స్..!
ఐపీఎల్ 15వ సీజన్ ఛాంపియన్స్‌గా హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్లోనే టైటిల్ సాధించి గుజరాత్ చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఏడాది సీజన్లో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లు దుమ్ము రేపగా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ క్రికెటర్లు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో తన బెస్ట్ ఎలెవన్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు. తన ఎంచుకున్న జట్టుకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను మాస్టర్ బ్లాస్టర్ నియమించాడు. అదే విధంగా ఓపెనర్లుగా జోస్ బట్లర్, శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశాడు. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. ఐదు ఆరు స్థానాల్లో డేవిడ్ మిల్లర్, లియమ్ లివింగ్ స్టోన్‌కు చోటు దక్కింది. ఏడో స్దానంలో ఫినిషర్‌గా డేవిడ్ మిల్లర్ అవకాశం ఇచ్చాడు. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రషీద్ ఖాన్‌కి చోటు దక్కింది. అదే విధంగా బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌ను లిటిల్ మాస్టర్ ఎంపిక చేశాడు. ఇక తన ప్రకటించిన జట్టులో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ 2022 బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్. చదవండి: Irfan Pathan Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన..కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా..! -
సచిన్, అమితాబ్‌లా ఫీల్ అయ్యా: బ్రిటన్ ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు చేరుకున్నారు. మొదటిరోజు భారత ప్రధాన నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో బోరిస్ జాన్సన్ పర్యటించారు. రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో బోరిస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. గురువారం గుజరాత్లో పర్యటనను బోరిస్ జాన్సన్ గుర్తు చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తనకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్లో తన స్వాగత హోర్డింగ్స్ చూసి.. ఆయన ఓ సచిన్ టెండూల్కర్, బిగ్‌బీ అమిత్ బచ్చన్‌లా ఫీలయ్యానని అన్నారు. ఇలాంటి స్వాగతాన్ని తాను మరెక్కడా చూడలేనమోనని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని బోరిస్ ప్రకటించారు. మరోవైపు.. బోరిస్ జాన్సన్ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భారత్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక సందర్భం అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఇది చదవండి: భారత్.. ఏ దేశానికీ ముప్పు కాదు -
అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన యార్కర్.. ఇషాన్ కిషన్ క్లీన్ బౌల్డ్
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్-2022లో ముంబై ఇండియన్స్‌కు అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా అతడికి ఆడే అవకాశం రాలేదు. కాగా గురువారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ముంబై తరపున అర్జున్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎస్కేతో మ్యాచ్‌కు ముందు అర్జున్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్నాడు. ప్రాక్టీస్‌లో భాగంగా అర్జున్ అద్భుతమైన యార్కర్‌తో ఇషాన్ కిషన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో అతడికి ముంబై తుది జట్టులో అవకాశం ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2021 సీజన్‌కు ముందు అర్జున్ టెండూల్కర్‌ను నెట్ బౌలర్‌గా ముంబై ఎంపిక చేసింది. అదే విధంగా ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ.30 లక్షలకు అతడిని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022: లంక యువ పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఆడమ్ మిల్నే స్థానంలో సీఎస్కేలోకి ఎంట్రీ You ain't missing the 🎯 if your name is 𝔸ℝ𝕁𝕌ℕ! 😎#OneFamily #DilKholKe #MumbaiIndians MI TV pic.twitter.com/P5eTfp47mG — Mumbai Indians (@mipaltan) April 20, 2022 -
మార్పింగ్ కు సచిన్ టెండూల్కర్ బలి
-
సచిన్ వీరాభిమానిపై పోలీస్ జులుం.. ప్రారంభోత్సవం చేసిన స్టేషన్లోనే..!
Sachin Die Hard Fan Beaten By Police: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుధీర్ కుమార్ చౌదరి అంటే తెలియని వాళ్లు బహుశా భారత క్రికెట్ వర్గాల్లో ఎవ్వరూ ఉండకపోవచ్చు. సచిన్ రిటైర్మెంట్ వరకు టీమిండియా ఆడిన ప్రతి మ్యాచ్‌లో అతను స్టాండ్స్‌లో దర్శనమిచ్చే వాడు. ఇంటా, బయటా అన్న తేడా లేకుండా సచిన్ ఆడిన ప్రతి మ్యాచ్‌ను చూసేందుకు అతను ఆస్తులను సైతం అమ్ముకున్నాడు. అతనికి కొన్ని సందర్భాల్లో బీసీసీఐయే ప్రత్యేక రాయితీలు కల్పించి మ్యాచ్ వీక్షించేందుకు పంపేది. సచిన్ సైతం సుధీర్‌కి చాలా మర్యాద ఇచ్చే వాడు. చాలా సందర్భాల్లో అతన్ని సత్కరించడంతో పాటు అతని అవసరాలను కూడా తీర్చాడు. విదేశాల్లో జరిగే టోర్నీల కోసం అతని విమాన చార్జీలను కూడా సచినే స్వయంగా భరించేవాడు. సచిన్‌ను దైవంతో సమానంగా ఆరాధించే సుధీర్.. క్రికెటేతర కారణాల చేత తొలిసారి వార్తల్లోకెక్కాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ పోలీసులు తనపై దాడి చేసి హింసించారని ఆయన ఆరోపించాడు. ఓ కేసు విషయంలో సోదరుడు కిషన్ కుమార్‌ను ముజఫర్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేయగా, అతన్ని కలిసేందుకు వెళ్లిన తనను స్థానిక డ్యుటీ ఆఫీసర్ దుర్భాషలాడాడని, అంతటితో ఆగకుండా కాళ్లతో తన్ని, స్టేషన్ బయటికి గెంటేశాడని సుధీర్ ఆరోపించాడు. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. తనను దూషించి, గాయపరచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు. కాగా, రెండేళ్ల క్రితం ఇదే పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించారని సుధీర్ వెల్లడించడం విశేషం. చదవండి: రైతుగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్.. -
అతనిలో ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుంది.. హైదరబాదీ పేసర్‌ని ఆకాశానికెత్తిన సచిన్
హైదరాబాదీ పేస్ గన్ మహ్మద్ సిరాజ్‌పై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. అతన్ని చూసిన ప్రతిసారి ఏదో కొత్తదనం కనిపిస్తుందంటూ ఆకాశానికెత్తాడు. కెప్టెన్ ఎప్పుడు అడిగినా లోడెడ్ గన్లా నిప్పులు చెరిగేందుకు రెడీగా ఉంటాడని కితాబునిచ్చాడు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సచిన్ మాట్లాడుతూ.. Thank you @sachin_rt sir for this . It is a huge motivation for me coming from you .. I will always do my best for my country .stay well sir https://t.co/3qJrCBkwxm — Mohammed Siraj (@mdsirajofficial) December 22, 2021 సిరాజ్ బౌలింగ్ రనప్ అద్భుతంగా ఉంటుందని, మైదానంలో అతనెప్పుడూ ఉత్సాహంగా కనిపిస్తాడని, అతను బౌల్ చేసేది తొలి ఓవరా లేక అఖరిదా అన్నది గుర్తించలేరని కొనియాడాడు. సిరాజ్‌లో ఈ లక్షణాలు తననెంతో అకట్టుకున్నాయని, గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఇదే తరహా యాటిట్యూడ్‌తో అతను సత్ఫలితాలు సాధించాడని పేర్కొన్నాడు.సిరాజ్‌లో వేగంగా నేర్చుకునే లక్షణం కనిపించిందని, అరంగేట్రం టెస్ట్‌లోనే అనుభవజ్ఞుడిలా బౌల్ చేశాడని, సీనియర్ల సలహాలతో మరింత మెరుగయ్యాడని కొనియాడాడు. దక్షిణాఫ్రికాతో త్వరలో ప్రారంభంకానున్న టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ కీలక బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. కాగా, తనపై క్రికెట్ దిగ్గజానికి ఉన్న అభిప్రాయానికి సిరాజ్ కృతజ్ఞతలు తెలిపాడు. 'థాంక్యూ సచిన్ సర్. మీ నుంచి ఇలాంటి మాటలు రావడం నాకెంతో స్ఫూర్తిదాయకం. దేశం కోసం ఎప్పుడూ అత్యుత్తమంగా ఆడేందుకే ప్రయత్నిస్తాను. స్టే వెల్ సర్' అంటూ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే, మూడు టెస్ట్‌ల సిరీస్ నిమిత్తం ప్రస్తుతం సిరాజ్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. చదవండి: ప్రముఖ బాలీవుడ్ నటుడికి దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన కేన్ మామ..! -
Sachin Tendulkar : అప్పుడు స్పిన్‌తో.. ఇప్పుడు స్పిన్నీతో..
ఆస్ట్రేలియన్ ఏస్ లెగ్ స్పిన్నర్ షేన్‌వార్న్‌కి కలలో సైతం చుక్కలు చూపించిన బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్. ఒకప్పుడు స్సిన్ బౌలింగ్‌ను సునాయసంగా ఎదుర్కొని పరుగుల వరద పారించిన ఈ బ్యాట్స్‌మన్.. ఇప్పుడు స్పిన్నీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. బ్రాండ్ ఎండార్సర్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మరో వ్యాపారంలో అడుగు పెట్టారు. ఇప్పటికే అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా పలు కంపెనీల్లో పార్ట్నర్గా ఆయన ఉన్నారు. తాజాగా అప్‌కమింగ్ బిజినెస్‌గా పేర్కొంటున్న యూజ్డ్ కార్ బిజినెస్‌లోకి ఇతర క్రీడాకారులకంటే ముందే అడుగు పెట్టారు. యూజ్డ్ కారు రిటైలింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా ఉన్న స్పిన్నీకి బ్రాండ్ ఎండార్సర్‌గా సచిన్ వ్యవహరిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ అనతి కాలంలోనే యూనికార్న్‌గా మారిన స్పిన్నీలో స్ట్రాటజిక్ ఇన్వెస్టర్‌గా సచిన్ పెట్టుబడులు పెట్టారు. అంతేకాదు ఈ సంస్థకు బ్రాండ్ ఎండార్సర్‌గా ప్రచారం కూడా చేయనున్నారు. అయితే సచిన్ ఇందులో ఎంత మొత్తం పెట్టుబడులు పెట్టారనే అంశాలను స్పిన్ని సంస్థ బహిర్గతం చేయలేదు. పీవీ సింధుతో పాటు సచిన్ స్పిన్ని సంస్థ ఈ ఏడాది ఆరంభంలో పీవీ సింధుతో జత కట్టింది. తాజాగా సచిన్‌ను తమతో చేర్చుకుని మార్కెట్లో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. మరోవైపు టీనేజ్లోనే బూస్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపించిన సచిన్ గత పాతికేళ్లలో అనేక సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరించారు. అనేక స్పోర్ట్స్లీగుల్లో పెట్టుబడులు పెట్టారు. స్పిన్ని ప్రస్థానం యూజ్డ్ కారు రిటైలింగ్ ఫ్లాట్‌ఫామ్‌గా మార్కెట్లోకి ఎంటరైన అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసింది స్పిన్ని. ఇటీవల ఈ సిరీస్ ఈ ఫండింగ్ రౌండ్లో స్పిన్ని సంస్థలోకి 238 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటి వరకు 530 మిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది స్పిన్ని. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ వ్యాల్యుయేన్ 1.80 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చదవండి: బిగ్–సి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేశ్ బాబు -
ఫోర్ కొట్టిన గిల్.. సచిన్ అంటూ అరిచిన అభిమానులు.. ఎందుకంటే!
Mumbai crowd chants Sachin, Sachin after Shubman Gill smashes a four: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో ఓ అసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో గాయం కారణంగా శుభ్‌మాన్ గిల్ ఓపెనింగ్‌కు రాలేదు. అతడి స్ధానంలో పుజారా ఓపెనర్‌గా వచ్చాడు. దీంతో మూడో రోజు గిల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే మూడో రోజు ఆటలో భాగంగా కీవిస్ బౌలర్ సౌథీ వేసిన బంతిని మిడ్ వికెట్ దిశగా గిల్ బౌండరీకు తరలించాడు. దీంతో ఒక్క సారిగా స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు సచిన్ సచిన్ అంటూ గట్టిగా అరిచారు. కాగా గిల్, టెండూల్కర్ కుమార్తె సారా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో గిల్‌ను టార్గెట్ చేస్తూ.. అభిమానులు అలా అరిచినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. ఇక ముంబై వాంఖడే స్టేడియం సచిన్ హోం గ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: Ind Vs Nz 2nd Test- Virat Kohli: 62 పరుగులకే ఆలౌట్.. అయినా అందుకే టీమిండియా ఫాలో ఆన్ ఆడించలేదు!ఔ pic.twitter.com/V073ZkjiC6 — Addicric (@addicric) December 5, 2021 -
తొలి వన్డే సెంచరీ సాధించడానికి సచిన్ ఎన్ని మ్యాచ్‌లు ఆడాడో తెలుసా?
Sachin Tendulkar Maiden ODI Century: సచిన్ టెండూల్కర్ ఇది పేరు మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ బ్రాండ్.. కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానుల గుండె చప్పుడు. ఇక క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మొదటి వన్డే సెంచరీ సాధించి గురువారానికి ఇరవై ఏడేళ్లు పూర్తయ్యాయి. మరి.. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించిన లిటిల్ మాస్టర్‌కు తన మెదటి వన్డే సెంచరీ సాధించడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా..? 1989లో అంతర్జాతీయ క్రికెట్లో టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. తన మెదటి వన్డే సెంచరీ సాధించడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. 1994, సెప్టెంబర్ 9 న సచిన్ ఆస్ట్రేలియాపై తొలి వన్డే సెంచరీ సాధించాడు. ఇందుకోసం అతడు 79 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. సచిన్ 130 బంతుల్లో 110 పరుగులు చేసి భారత్‌కు ఘన విజయం అందించాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ: 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 200 పరుగులు సాధించి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే మైలురాయిని అధిరోహించాడు. భారత రత్న పొందిన తొలి క్రీడాకారుడు సచిన్.. 16 నవంబర్ 2013 నాడు తన 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారుడడిగామరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. తండ్రి మరణం: 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా సచిన్ తండ్రి రమేష్ టెండుల్కర్ ఆకస్మాత్తుగా మృతిచెందారు. తండ్రి అంత్యక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యాపై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. చదవండి: Hardik Pandya: అనుకోకుండా ఆల్‌రౌండర్ అయ్యాను.. అది నా అదృష్టం #OnThisDay in 1994 - Batting great @sachin_rt scored his first ODI hundred. Relive the magic - DD SPORTS#Legend #SRT pic.twitter.com/hgvSm42yKK — BCCI (@BCCI) September 9, 2019 -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన కోహ్లి.. సచిన్ రికార్డు బద్దలు
ఓవల్: ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన మైలురాయిని క్రాస్ చేశాడు. అండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన రన్ మెషీన్ కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 23,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్.. 522 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకోగా, కోహ్లి 440 మ్యాచ్‌ల్లో 490 ఇన్నింగ్స్‌లలో 55.28 సగటుతో ఈ మైలరాయిని క్రాస్ చేశాడు. ఇందులో 70 శతకాలు, 116 అర్ధ శతకాలు బాదాడు. ఇక ఫీట్‌ను పూర్తి చేయడానికి ఆసీస్ మాజీ కెప్టెన్ రికి పాంటింగ్‌కు 544 ఇన్నింగ్స్ అవసరం కాగా, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్ కలిస్ 551 ఇన్నింగ్స్‌లలో ఈ మైలురాయిని అందుకున్నాడు. వీరి తర్వాత శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర(568 ఇన్నింగ్స్), ద వాల్ రాహుల్ ద్రవిడ్(576), శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్ధనే(645) వరుసగా ఈ మార్కును క్రాస్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ తొలి రోజు లంచ్ విరామం సమయానికి టీమిండియా 54 పరుగులకే మూడు కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. రోహిత్ శర్మ(11), కేఎల్ రాహుల్(17), పుజారా(4) పెవిలియన్ బాట పట్టగా విరాట్ కోహ్లి(18), రవీంద్ర జడేజా(2) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ పేసర్లు క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, ఆండర్సన్ తలో వికెట్ పడగొట్టి టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు. అంతకుముందు ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు రెండు మార్పులతో బరిలోకి దిగాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, సామ్ కర్రన్ల స్థానంలో ఓలీ పోప్, క్రిస్ వోక్స్ బరిలోకి దిగగా, టీమిండియా ప్లేయర్స్ ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీల స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్‌లు జట్టులోకి వచ్చారు. చదవండి: 'స్టన్నింగ్ క్యాచ్‌తో మా గుండెల్ని గెలుచుకున్నావు' -
మరో టీమ్‌కు ధోని కెప్టెన్.. మిగతా 10 మంది వీళ్లే!
Shakib Al Hasan All Time Best ODI XI ఢాకా: బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌ను ప్రకటించాడు. ఆ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం కల్పించాడు. తన ఆల్-టైమ్ ఎలెవన్ వన్డే టీమ్‌కు మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌కు, పాక్ మాజీ ఆటగాడు సయ్యద్ అన్వర్‌కి ఓపెనర్లుగా చోటు ఇచ్చాడు. వెస్టిండీస్ విధ్వంస ఆటగాడు క్రిస్ గేల్‌కు వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా చోటు దక్కింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ గా షకీబ్ చేర్చాడు. సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వస్ కలీస్‌ని ఐదో నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా షకీబ్ ఎంచుకున్నాడు . భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తన టీమ్‌కి వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు. తన టీమ్‌లో తనకి ఆల్‌రౌండర్‌గా తనకి కూడా షకీబ్ చోటు కల్పించాడు. శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌కి తన టీమ్‌లో మరో స్పిన్నర్‌గా షకీబ్ చోటు ఇచ్చాడు. ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్‌కి తన టీమ్‌లో మూడో స్పిన్నర్‌గా షకీబ్ అల్ హసన్ ఎంచుకున్నాడు . ఆస్ట్రేలియా మాజీ పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్‌ను తన టీమ్‌లో ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా ఎంచుకున్నాడు. పాకిస్తాన్ మాజీ పేసర్ వసీం అక్రమ్‌కి షకీబ్ అల్ హసన్ జట్టులో ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా చోటు దక్కింది... షకీబ్ అల్ హసన్ ఆల్ టైమ్ వన్డే XI ఇదే: సచిన్ టెండూల్కర్, సయ్యద్ అన్వర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, జాక్వస్ కలీస్, మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), షకీబ్ అల్ హసన్, ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, వసీం అక్రమ్, గ్లెన్ మెక్‌గ్రాత్ చదవండి: Ravindra Jadeja: టీమిండియా ఓటమి.. ఆసుపత్రిలో చేరిన జడేజా -
Sachin Tendulkar: ఈ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన సచిన్..!
ముంబై: భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో సారి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అండ్ టెక్నాలజీ కంపెనీ జెట్సింథసిస్లో భారీగా ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు రెండు మిలియన్ల డాలర్లను (సుమారు రూ. 14.8 కోట్లు) కంపెనీలో సచిన్ టెండూల్కర్ ఇన్వెస్ట్ చేశారని జెట్‌సింథసిస్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో కూడా సచిన్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. వీరు ఇరువురు కలిసి డిజిటల్ క్రికెట్ డెస్టినేషన్, 100ఎమ్బీ, క్రికెట్ గేమ్స్, సచిన్ సాగా క్రికెట్ ఛాంపియన్స్, సచిన్ సాగా వీఆర్ వంటి యాప్‌లను లాంచ్ చేశారు. కాగా ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో జెట్‌సింథసిస్ షేర్ హోల్డర్లు అదార్ పూనావాలా, క్రిస్ గోపాలక్రిష్ణన్ తో సచిన్ టెండూల్కర్ జత కట్టనున్నారు. అంతేకాకుండా ప్రస్తుత పెట్టుబడితో సచిన్ టెండూల్కర్, జెట్‌సింథసిస్ కంపెనీల మధ్య సంబంధం మరింత బలోపేతం కానుంది. కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్‌పై సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ..జెట్ సింథసిస్‌తో తన అనుబంధం ఐదు సంవత్సరాల నాటిదని తెలిపారు. జెట్‌సింథసిస్ చేసిన పలు యాప్‌లతో తాను అభిమానులకు మరింత దగ్గరయ్యానని పేర్కొన్నారు. తొలిసారిగా సచిన్ క్రికెట్ సాగా యాప్‌ను ఈ కంపెనీతో ప్రారంభించగా, అది ప్రస్తుతం సుమారు 20 మిలియన్ల డౌన్‌లోడ్స్‌కు చేరుకుందని తెలిపారు. అత్యంత ప్రజాదరణ కల్గిన గేమ్‌లలో ఇది కూడా ఒక్కటిగా నిలిచిందని వెల్లడించారు. జెట్‌సింథసిస్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ రాజన్ నవని మాట్లాడుతూ.. సచిన్ తన అభిమానులతో నేరుగా మాట్లాడేందుకు 100ఎమ్బీ ప్లాట్‌ఫాం ఎంతగానో ఉపయోగపడిందని పేర్కొన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కంపెనీలో చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌తో జెట్‌సింథసిస్ కుటుంబంలో కీలక సభ్యుడుగా చేరడం మాకు చాలా సంతోషనిస్తుందని తెలిపారు. జెట్ సింథసిస్ ప్రధాన కార్యాలయం పూణేలో ఉంది. ఈ కంపెనీకి భారత్‌తో పాటు జపాన్, యూకే, ఈయూ, యూఎస్ దేశాల్లో కార్యాలయాలు కలవు. -
సారాతో రిలేషన్.. గిల్ క్లారిటీ!
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో యంగ్ క్రికెటర్ శుభమన్ గిల్ డేటింగ్ చేస్తున్నాడంటూ నడుస్తున్న ప్రచారం గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో వీళ్ల కనెక్షన్ గురించి మీమ్స్ కుప్పలుగా కనిపిస్తుంటాయి. అయితే రిలేషన్‌షిప్‌పై ఇంతకాలం ఇద్దరిలో ఏ ఒక్కరు స్పందించిన సందర్భం లేదు. అయితే తాజాగా ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చాడు శుభ్‌మన్ గిల్. రీసెంట్గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు గిల్. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘ఆర్ యూ సింగిల్’ అని అడిగాడు. దానికి గిల్ ‘అవును.. ఇప్పట్లో అలాంటి ఆలోచనే లేద’ని చెబుతూ.. పుకార్లకు చెక్ పెట్టాడు. దీంతో వాళ్ల రిలేషన్ ప్రచారం ఉత్తదేనని స్పష్టమైంది. చదవండి: గిల్‌పై సారా ఫన్నీ కామెంట్ కాగా, గిల్-సారా ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. గిల్ బాగా ఆడినప్పుడల్లా సారా మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో ఏదో నడుస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. దీనికితోడు ఈ జనవరిలో ఇద్దరూ ఒక పోస్టును సేమ్ క్యాప్షన్‌తో పెట్టారు. ‘ఐ స్పై’ అని కన్ను ఎమోజీని ఉంచారు. ఇది చూసి వాళ్లు డేటింగ్లో ఉన్నారంటూ ఊహించుకుని కొన్ని మీడియా హౌజ్‌లు కథనాలు రాశాయి. తాజా స్టేట్మెంట్తో ఆ పుకార్లకు చెక్ పడింది. మరోవైపు శుభ్‌మన్ గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సన్నద్ధమవుతున్నాడు. -
సచిన్.. నన్ను ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడు: భార్య అంజలీ
ముంబై: కెరీర్ ఆసాంతం ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహ స్వప్నంలా నిలిచిన క్రికెట్ గాడ్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను అతని భార్య అంజలీ టెండూల్కర్ వెల్లడించింది. వీరి జోడీ వివాహ బంధంలోకి అడుగుపెట్టి 26 వసంతాలు పూర్తైన సందర్బంగా ఆమె సచిన్ ను గూర్చిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. ఆన్ ఫీల్డ్ బౌలర్లను గడగడలాడించే సచిన్ .. మైదానం వెలుపల మాత్రం మహా సిగ్గరి అని, అతను చాలా సున్నిత మనస్కుడని, అనవసరంగా ఎవరితో మాట కలపడని పేర్కొంది. ఈ సందర్బంగా ఆమె.. సచిన్ తో 26 ఏళ్ల బంధాన్ని నెమరేసుకుంది. తాము మొట్టమొదటిసారి ఎయిర్ పోర్టులో కలిసామని, తమ పరిచయం ఓ మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా బలపడిందని చెప్పుకొచ్చింది. అయితే, సచిన్.. తనను మొదటిసారి అతని తల్లిదండ్రులకు ఓ జర్నలిస్టులా పరిచయం చేశాడని, నన్ను అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ చేసేందుకు చాలా కసరత్తులే చేశాడని గుర్తు చేసుకుని నవ్వుకుంది. తమ పరిచయమైనా తొలినాళ్లలో ఇప్పటిలా ఇంటర్నెట్,. సోషల్ మీడియా సదుపాయాలు లేవని, ఫోన్లు ఉన్నప్పటికీ.. అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో తాము ఉత్తరాల ద్వారా సంభాషించుకునేవారిమని తెలిపింది. కాగా సచిన్, అంజలీల వివాహం 1995లో జరిగింది. వీరికి అర్జున్, సారా అనే ఇద్దరు సంతానం. కొడుకు అర్జున్ ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. చదవండి: రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడిన కోహ్లి దంపతులు .. -
నేను సచిన్ పోస్టర్లు చించితే.. అతను అఫ్రిది ఫోటోలను చించాడు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్, హీరో రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న "యారోంకి బారాత్" అనే చాట్ షోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హ్యూమా ఖురేషి.. తన చిన్నతనంలో జరిగిన ఆసక్తికర సంఘటనను వెల్లడించింది. తన సోదరుడు, బాలీవుడ్ నటుడు సకీబ్ సలీంకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ప్రాణమని, ఓ సందర్భంలో అతనితో గొడవ పడ్డప్పుడు కోపంలో అతని ఆరాధ్య దైవమైన సచిన్ పోస్టర్లను చించేశానని పేర్కొంది. దీనికి బదులుగా అతను తన ఫేవరెట్ క్రికెటర్ అయిన షాహిద్ అఫ్రిది ఫోటోలను చించేశాడని వివరించింది. అయితే షో హోస్ట్‌లు.. నువ్వు సచిన్ పోస్టర్లను చించావా అని ప్రశ్నించడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. తను కూడా సచిన్ వీరాభిమానినేనని.. చిన్నతనంలో అన్న చెల్లెల్ల మధ్య ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతుంటాయని కవర్ చేసుకుంది. తను క్రికెట్‌ను ఫాలో అవుతున్న రోజుల్లో పాక్ ఆటగాడు అఫ్రిది అరంగేట్రం చేశాడని, అతని దూకుడైన ఆటతీరు, అతని హెయిర్ స్టైల్ తనను బాగా ఇంప్రెస్ చేశాయని చెప్పుకొచ్చింది. 90వ దశకంలో ఆఖర్లో అఫ్రిదికి అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేదని, కాబట్టి తాను కూడా అతనికి అకర్షితురాలినయ్యానని తెలిపింది. కాగా, హ్యూమా ఖురేషి 2012లో విడుదలైన "గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్" సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చదవండి: ఆర్సీబీ అభిమానినే కానీ, కోహ్లి నా ఫేవరెట్ క్రికెటర్ కాదు: రష్మిక -
కుమారుడు చేసిన పనికి ఇబ్బందిపడ్డ సచిన్...!
ముంబై: ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ శనివారంతో 48 వసంతంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సచిన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి సుమారు ఎనిమిదేళ్లు అవుతోంది. ప్రస్తుతం అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్లో రాణిస్తున్నాడు. అర్జున్ ప్రస్తుత ఐపీఎల్-2021 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రంగ ప్రవేశం చేశాడు. కుమారుడి గురించి సచిన్ మాట్లాడుతూ.. ఒక సందర్భంలో అర్జున్ టెండూల్కర్ చేసిన పనికి కాస్త ఇబ్బంది పడ్డానని మీడియాతో తెలిపాడు. అమితాబ్ బచ్చన్‌తో కలిసి సచిన్ ఒక కంపెనీ ప్రకటనలో నటించాడు. వీరు ఇరువురు ప్రకటన చేసిన సమయంలో అప్పుడు అర్జున్ వయసు ఒకటిన్నర ఏళ్లు మాత్రమే. షూటింగ్ బ్రేక్ సమయంలో ఇరువురు ఒక దగ్గర కుర్చోగా, అర్జున్ తన తండ్రి సచిన్ ఒళ్లో కూర్చున్నాడు. అర్జున్ ఆ సమయంలో ఆరెంజ్ పండును తిని చేతులను అమితా బచ్చన్ వేసుకున్న కుర్తాతో తుడ్చుకున్నాడు. ఆ సమయంలో సచిన్ నిర్ఘాంతపోయానని మీడియాతో తెలిపారు.అంతేకాకుండా అర్జున్ చేసిన పనితో కాస్త ఇబ్బందికి గురయ్యానని పేర్కొన్నాడు. ఈ సంఘటనను 2017లో అమితాబ్ బచ్చన్ 75 వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో పంచుకున్నాడు. చదవండి: గాడ్ ఆఫ్ క్రికెట్‌పై వైరల్ అవుతోన్న వీడియో! -
క్రికెట్ చూడను కానీ సచిన్, కోహ్లి అంటే..
ముంబై: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేల ఇన్స్టాగ్రామ్ లో తన అభిమాని అడిగిన ప్రశ్నకు వింతగా సమాధానమిచ్చింది. ‘మిస్ ఇండియా’ గా ప్రజలకు పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాల్లో నటించిన తర్వాత బాగానే పాపులర్ అయ్యింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఊర్వశీ ఇన్‌స్టాలో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఊర్వశీ ఇన్‌స్టాలో తన అభిమానులు అడిగే ప్రశ్నలకు ఓపికగా సమాధానమిస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘మీకు ఇష్టమైన క్రికెటర్ ఎవరు?’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇవ్వడం గమనార్హం. ‘నేను క్రికెట్ అస్సలు చూడను, కాబట్టి నాకు ఏ క్రికెటర్ తెలియదు. కానీ సచిన్ సార్, విరాట్ సార్ అంటే మాత్రం అమితమైన గౌరవం’ అని జవాబిచ్చింది. ఏడాది క్రితం టీమ్ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్‌తో కలిసి ఊర్వశీ రౌతేలా భోజనం చేస్తున్న చిత్రాలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బహుశా ఆమె పంత్ ప్రియురాలేమోనని అప్పట్లో గుసగుసలు కూడా వినపడ్డాయి. ( చదవండి: పెళ్లి తర్వాత నటించన్నావ్.. మరి ఇదేంటి?! ) -
ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో క్రికెటర్‌కు కరోనా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో కోరలు చాస్తోంది. దీని ప్రభావం క్రీడారంగంపై భారీగా పడింది. రాయ్‌పూర్ వేదికగా జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టీ20 టోర్నీలో పాల్గొన్న ఇండియా లెజెండ్స్ జట్టు ఆటగాళ్లు రోజుకొకరు వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, యూసుఫ్ పఠాన్, సుబ్రమణ్యం బద్రీనాథ్ వైరస్ బారిన పడగా... తాజాగా ఈ జాబితాలో మరో ప్లేయర్ చేరాడు. ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు ఆయనే స్వయంగా సోమవారం ట్విటర్ ద్వారా తెలియజేశాడు. కరోనా లక్షణాలు లేకున్నప్పటికీ.. తన సోదరుడు యూసుఫ్‌కు కరోనా నిర్ధారణ కావడంతో తాను కూడా పరీక్ష చేయించుకున్నానని ఇర్ఫాన్ వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు తీసుకుంటానన్నాని ఆయన ప్రకటించాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. చదవండి: సచిన్ టెండూల్కర్‌కు కరోనా పాజిటివ్ -
ఆ సిరీస్‌లో పాల్గొన్న మరో భారత క్రికెటర్‌కు కరోనా
న్యూఢిల్లీ: రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న భారత దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తొలుత సచిన్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆతరువాత యూసఫ్ పఠాన్, తాజాగా సుబ్రమణ్యం బద్రీనాధ్ వైరస్ పీడిత జాబితాలో చేరారు. బద్రీనాధ్.. వైరస్ బారిన పడ్డ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్లో వెల్లడించాడు. తేలికపాటి కోవిడ్ లక్షణాలు కలిగి ఉండడంతో టెస్టు చేయించుకున్నాని, కోవిడ్ నిర్ధారణ కావడంతో ఇంట్లోనే క్వారంటైన్లో ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, ఇటీవలి కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. తమిళనాడుకు చెందిన బద్రీనాధ్.. భారత్ తరఫున 2008-2011 మధ్యలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011లో వరుసగా టైటిల్లు సాధించడంలో బద్రీనాధ్ కీలకంగా వ్యవహరించాడు. కాగా, దిగ్గజ క్రికటర్లు వరుసగా కరోనా బారిన పడుతుండటంతో రోడ్ సేఫ్టీ సిరీస్‌లో పాల్గొన్న క్రికెటర్లందరిలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా భారత లెజెండ్స్ సభ్యుల్లో తీవ్ర కలవరం మొదలైంది. వైరస్ బారిన పడ్డ క్రికటర్లకు సన్నిహితంగా ఉన్న వాళ్ళంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు. -
సచిన్,లారా రోడ్డు భద్రత పాఠాలు!
-
సచిన్,లారా రోడ్డు భద్రత పాఠాలు!
వాహనాలను నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, సీటు బెల్టు పెట్టుకొవాలని ప్రభుత్వాలు అనేక చట్టాలు తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై , ఇప్పటికి చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే, భారతమాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, వెస్టిండీస్ ఆటగాడు బ్రియాన్ లారాతో కలిసి రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిలో ‘ సచిన్ రోడ్డుపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ఎంత ముఖ్యమో... మైదానంలో క్రికెట్ ఆడేటప్పుడు కూడా హెల్మెట్ అంతే అవసరమని’ అన్నారు. సరైన హెల్మెట్ ధరించకపోవడంతో చాలామంది తమ ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు భద్రతను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని, సరైన హెల్మెట్ ధరించాలని పేర్కొన్నారు. సచిన్ టెండుల్కర్ చేసిన సూచనలకు బ్రియాన్ లారా ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియోపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించారు..‘ ఈ వీడియోకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని’ ఫన్నీగా కామెంట్ చేశారు. అయితే, రోడ్‌సెఫ్టీ వరల్డ్ సిరిస్ టీ20 టోర్ని రాయ్‌పూర్‌లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నిలో ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్‌పై గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. దీనిలో సచిన్ 42 బంతుల్లో 65 పరుగులు చేశాడు. యువరాజ్ సింగ్ 20 బంతులలో 49 పరుగులు చేశారు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ 206 పరుగులకే కుప్పకూలింది. చదవండి: రెండు శునకాల బెలూన్ ఆట.. చూస్తే వావ్ అనాల్సిందే! -
యువీ సిక్సర్ల సునామీ.. ఒకే ఓవర్లో 4
రాయ్‌పూర్: రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ బ్యాట్స్మెన్ల ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్(42 బంతుల్లో 65; 6ఫోర్లు, 3సిక్సర్లు), సిక్సర్ల షాహెన్షా యువరాజ్ సింగ్(20 బంతుల్లో 49 నాటౌట్; ఫోర్, 6 సిక్సర్లు) పరుగుల వరదపారించారు. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(17 బంతుల్లో 35; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు ఆరంభానివ్వగా, సచిన్, కైఫ్(21 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), యూసఫ్ పఠాన్(20 బంతుల్లో 37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), యువరాజ్ తమదైన మార్క్ షాట్లతో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. విండీస్ బౌలర్ నగముత్తు వేసిన 19వ ఓవర్లో యువీ ఏకంగా నాలుగు సిక్సర్లు బాది 24 రన్స్ రాబట్టాడు. భారత బ్యాట్స్మెన్ల వీరవిహారం ధాటికి విండీస్ బౌలర్లు ప్రేక్షకపాత్రకు పరిమితమయ్యారు. -
అన్‌అకాడమీలో సచిన్ పెట్టుబడులు
సాక్షి,బెంగళూరు: భారత మాజీ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్ బెంగళూరుకు చెందిన ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్ అన్‌అకాడమీతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్నికుదుర్చుకున్నారు.ఎడ్యుకేషన్ టెక్ స్టార్టప్ అన్‌అకాడమీలో ఆయన బారీ పెట్టుబుడులు పెట్టారు. దీంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఆయన వ్యవహరిస్తారు. అలాగే లైవ్ క్లాసుల ద్వారా విద్యార్థులకు బోధిస్తారు. సచిన్ తన జీవిత పాఠాలనూ పంచుకుంటారు. అన్అకాడమీ ప్లాట్‌ఫాంలో యూజర్లకు ఈ తరగతులు ఉచితమని కంపెనీ తెలిపింది. స్పోర్ట్స్ లెర్నింగ్ విభాగంలో సచిన్‌తో కలిసి లోతైన కంటెంట్-నేతృత్వంలోని భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని, పూర్తి వివరాలు రాబోయే నెలల్లో ఆవిష్కరించనున్నామని అకాడమీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ గౌరవ్ ముంజాల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా."ఆటలో తన అనుభవాలను పాఠాలుగా యువతతో పంచుకోవడంపాటు, వారికి ఉత్సాహాన్నివ్వాలనేదే తన ప్రయత్నమని టెండూల్కర్ చెప్పారు. -
రీ ఎంట్రీ ఇవ్వనున్న క్రికెట్ దిగ్గజాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాళ్లు మరో సారి బరిలోకి దిగి పేక్షకులకు కనువిందు చేయనున్నారు. రోడ్ సేఫ్టీ వరల్డ్ టీ20 సిరీస్‌లో భాగంగా రాయ్‌పూర్‌లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ టోర్నీలో దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రియాన్ లారా, బ్రెట్‌లీ, తిలకరత్నె దిల్షాన్, ముత్తయ్య మురళీధరన్‌తో పాటు భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్‌లకు చెందిన పలువురు ప్రముఖ క్రికెటర్లు పాల్గొనున్నారు. ఈ టోర్నీ మార్చి 2 నుంచి 21 వరకు జరగనుంది. కాగా, కరోనా కారణంగా గతేడాది ఈ సిరీస్(నాలుగు మ్యాచ్‌ల అనంతరం) వాయిదా పడిన సంగతి తెలిసిందే. రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ టీ20 టోర్నీలో ఆటగాళ్లు తమ మునుపటి ఫామ్‌ను ప్రదర్శిస్తూ పేక్షకులను అలరించేందుకు సన్నద్ధమవుతున్నారు. లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ ఈ సిరీస్‌కు కమిషనర్‌గా వ్యవహరిస్తుండగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు. -
టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయపై భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారు. భారత క్రికెట్ జట్టు విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అద్భుతమైన శక్తి, వారి అభిరుచి మ్యాచ్ అంతా కనిపించిందని, ఈ గెలుపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. జట్టుకు అభినందనలు! మీ భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు అని మోదీ తెలిపారు. (చెలరేగిన పంత్.. భారత్ సంచలన విజయం) చరిత్రను రికార్డులను తిరగరాసిన టీమిండియా బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ సంచలన విజయంపై పలువురు ప్రముఖులు, ఇతర దిగ్గజాలు సోషల్ మీడియా ద్వారా ఎనలేని ఆనందాన్ని ప్రకటించారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందిస్తూ గొప్ప సిరీస్ విజయాలలో ఇదొకటి అని ట్వీట్ చేశారు. ప్రతి సెషన్‌కి క్రొత్త హీరోను వస్తున్నాడు. ప్రతీసారి విజయం సాధించాం. చాలా స్థిరంగా ధీటుగా నిలబడ్డాం. నిర్లక్క్ష్యంగా కాదు.. నిర్భయంగా, నమ్మకంగా ఆడుతూ క్రికెట్ సరిహద్దులను చెరిపేసాం. గాయాల్ని, ఇతర అనిశ్చితులను విశ్వాసంతో ఎదుర్కొన్నామని సచిన్ ట్వీట్ చేశారు. బీసీసీఐతోపాటు మాజీ, ప్రస్తుత భారత క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు సంబరాలు చేసుకుంటున్నారు. విరాట్ కోహ్లి, వీవీఎస్ లక్క్ష్మణ్, శిఖర్ ధావన్, ఇశాంత్ శర్మ తదితరులు ట్విటర్ ద్వారా తమ ఆనందాన్ని ప్రకటించారు. అంతేకాదు టెక్ దిగ్గజం సుందర్ పిచాయ్ కూడా టీమిండియా గెలుపుపై సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. గొప్ప టెస్ట్ సిరీస్‌లో ఒకటి ఎప్పుడూ గెలుస్తుంది. విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని తెలిపారు. కాగా ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్‌గా భావించే బ్రిస్బేన్‌లోని గబ్బాలో భారత్ విజయ బావుటా ఎగురవేసింది. దాదాపు మూడు దశాబ్దాల తరువాత కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా రెండోసారి నిలబెట్టుకుంది. We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours. — Narendra Modi (@narendramodi) January 19, 2021 EVERY SESSION WE DISCOVERED A NEW HERO. Every time we got hit, we stayed put & stood taller. We pushed boundaries of belief to play fearless but not careless cricket. Injuries & uncertainties were countered with poise & confidence. One of the greatest series wins! Congrats India. pic.twitter.com/ZtCChUURLV — Sachin Tendulkar (@sachin_rt) January 19, 2021 Historic series win for Team India! Youngsters delivered when it mattered, with Gilll and Pant in the forefront. Hats off to Ravi Shastri and the support staff for their part in this turnaround! So so proud of this bunch, this is one for the ages👏👏👏 #AUSvsIND — VVS Laxman (@VVSLaxman281) January 19, 2021 The champions & the greatest chase!🙌#TeamIndia has proved it again by team efforts, great character, courage & max determination! Despite the bruises, the team made it possible for our country. That’s why we play for the country’s flag to go high every time we perfom🇮🇳#INDvAUS — Ishant Sharma (@ImIshant) January 19, 2021 -
కరోనాతో మరో స్నేహితుడిని కోల్పోయిన సచిన్
థానే: భారత మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కరోనావైరస్ కారణంగా మరొ స్నేహితుడిని కోల్పోయారు. క్రికెట్ 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్, వినోద్ కంబ్లితో కలిసి క్రికెట్ ఆడిన విజయ్ షిర్కే కరోనా వైరస్ కారణంగా ఆదివారం(డిసెంబర్ 20) రాత్రి థానే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మాజీ ఫాస్ట్ బౌలర్ విజయ్ షిర్కే వయసు 57 సంవత్సరాలు. విజయ్ షిర్కే 80వ దశకంలో సన్‌గ్రేస్ మాఫత్‌లాల్ తరఫున టెండూల్కర్, వినోద్ కాంబ్లితో కలిసి క్రికెట్ ఆడాడు. ఇప్పటికే కోవిడ్ కారణంగా అక్టోబర్‌లో సచిన్ టెండూల్కర్ తన సన్నిహితుడు అవీ కదమ్ ని కోల్పోయాడు.(చదవండి: అదే టీమిండియా కొంపముంచింది..) తన స్నేహితుడి మరణంపై వినోద్ కంబ్లి స్పందించారు.." ఇది ఎంతో విషాదకరమైన వార్త. నేను నా ప్రాణ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం. నేను, సచిన్ అతన్ని ముద్దుగా "విజ్జా" అని పిలిచేవాళ్ళం. అతను ఎప్పుడు ఉల్లాసంగా, కష్టపడి పనిచేసే వ్యక్తి" అని తాను ఆవేదన వ్యక్తం చేసాడు. విజయ్ షిర్కే మంచి ఫాస్ట్ బౌలర్. మేం ఆడుకునే రోజుల్లో చాల అద్భుతంగా బౌలింగ్ వేసేవాడు. కొద్దీ రోజుల క్రితమే అతనితో మాట్లాడాను. మేము ప్రతిరోజూ ఒకరికొకరు మెసేజ్ ల రూపంలో 'గుడ్ మార్నింగ్' చెప్పుకుంటాం. కానీ గత మూడు-నాలుగు రోజుల నుంచి నాకు అతని నుంచి మెసేజ్ లు రావడం లేదు. ఇంతలోనే ఈ చేదువార్త వినాల్సి వచ్చింది" అని బాధ పడ్డాడు. "మమ్మల్ని విడిచి చాలా త్వరగా వెళ్ళావు మిత్రమా. నీవు అక్కడ ప్రశాంతంగా ఉండాలి మిత్రమా. మీతో మైదానంలో, బయట గడిపిన గొప్ప సమయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము" అని భారత మాజీ పేసర్, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ సలీల్ అంకోలా ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. విజయ్ షిర్కే సుంగ్రేస్ మాఫట్లాల్ లో అంకోలా యొక్క పేస్ బౌలింగ్ సహోద్యోగి. షిర్కే మరణం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ)కు మరో ఎదురు దెబ్బ. షిర్కే ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ) అండర్ -17 జట్టుకు థానేలో రెండేళ్లపాటు కోచ్‌గా పనిచేశాడు. ఆయన మరణవార్త విని ప్రముఖ క్రికెటర్లు విచారం వ్యక్తం చేశారు. -
కొత్త ఫ్రెండ్ తిరిగొచ్చాడు: సచిన్
ముంబై: కరోనా కోరలు చాస్తుండటంతో చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ముఖ్యంగా సెలబ్రిటీలు రాకరాక వచ్చిన అవకాశం అంటూ ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతున్నారు. కొత్త కొత్త వంటకాలు ప్రయత్నిస్తున్నారు. పెంపుడు జంతువులతో ఆటలాడుతూ సరదా వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. క్రికెట్ లెజెంట్ సచిన్ టెండూల్కర్ ఇన్‌స్టాలో తాజాగా షేర్ చేసిన ఓ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది. ‘నా కొత్త స్నేహితుడు తిరిగొచ్చాడు. క్రితం సారి నుంచి వీడు వడా పావ్ మిస్ అయినట్టుగా కనిపిస్తోంది’అంటూ సచిన్ పెంపుడు పిల్లి వీడియోను షేర్ చేశాడు. అంతకుముందు సచిన్ వడా పావ్ తయారు చేశాడు. తన ఫేవరెట్ ఫుడ్ ఇదేనంటూ ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు. వడా పావ్ కోసం ఓ అతిథి నక్కినక్కి చూస్తోందని పెంపుడు పిల్లిని ఉద్దేశించి ఫోటో కూడా షేర్ చేశాడు. ఇప్పుడు అదే పిల్లిని ఉద్దేశించి అభిమానులతో పంచుకున్నాడు. మామిడి పళ్లతో కుల్ఫీ ఎలా తయారు చేయాలో కూడా సచిన్ ఇటీవల ఓ పోస్టులో పేర్కొన్నాడు. ఇక సచిన్ ముచ్చటైన పోస్టులతో అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా 1989లో క్రికెట్లో అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్ అయిన సంగతి తెలిసిందే! (చదవండి: షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా) View this post on Instagram My new friend is back! Looks like he's missing the Vada Pav from the last visit. 😋 A post shared by Sachin Tendulkar (@sachintendulkar) on Sep 15, 2020 at 12:45am PDT -
‘కోహ్లి జట్టులో ఉంటాడు.. కానీ ధోనినే సారథి’
హైదరాబాద్ : సీనియర్ ఆటగాడు, మాజీ సారథి ఎంఎస్ ధోనికి టీమిండియా మాజీ టెస్టు ఓపెనర్ వసీం జాఫర్ సముచిత గౌరవాన్ని కల్పించాడు. వన్డేల్లో తన ఆల్‌టైమ్ అత్యుత్తమ జట్టును జాఫర్ ప్రకటించాడు. అయితే ఈ జట్టుకు సారథిగా ఎంఎస్ ధోనిని ఎంపిక చేశాడు. తన జట్టులో ప్రస్తుత సారథి విరాట్ కోహ్లితో పాటు ఆస్ట్రేలియాకు రెండు సార్లు ప్రపంచకప్ అందించిన రికీ పాంటింగ్‌లు ఉన్నప్పటికీ ధోనికే సారథ్య బాధ్యతలను అప్పగించడం విశేషం. ఇక తన అత్యుత్తమ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు అవకాశం కల్పించాడు. అయితే ఒక్క భారత బౌలర్‌ను కూడా ఎంపిక చేయలేదు. ఓపెనర్లుగా సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మలు వ్యవహరిస్తారి పేర్కొన్న ఈ మాజీ ఓపెనర్ బ్యాటింగ్‌లో వన్‌డౌన్ కోసం కోహ్లిని కాకుండా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వీవీఎన్ రిచర్డ్స్ వైపు మొగ్గు చూపాడు. అయితే కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని చెప్పాడు. మిడిలార్డర్ పటిష్టపరచడానికి దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌లను ఎంపిక చేశాడు. ఇక బౌలింగ్ విభాగంలో పాకిస్తాన్ మాజీ సారథి వసీం ఆక్రమతో పాటు జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లను ఎంపిక చేశాడు. స్పిన్నర్లలో సక్లాయిన్ ముస్తాక్, షేన్ వార్న్‌లలో పరిస్థితిక తగ్గట్టు ఎవరినో ఒకరు తుదిజట్టులో ఉంటాడని తెలిపాడు. ఇక ఆసీస్ దిగ్గజ సారథి రికీ పాంటింగ్‌ను 12వ ఆటగాడిగా వసీం జాఫర్ ఎంపిక చేశాడు. వసీం జాఫర్ అత్యుత్తమ వన్డే జట్టు ఇదే.. ఎంఎస్ ధోని (సారథి, వికెట్‌కీపర్), సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎన్ రిచర్డ్స్, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, బెన్ స్టోక్స్, వసీం ఆక్రమ్, జోయల్ గార్నర్, గ్లెన్ మెక్‌గ్రాత్, సక్లాయిన్ ముస్తాక్/షేన్ వార్న్, రికీ పాంటింగ్(12వ ఆటగాడు) చదవండి: ప్రపంచకప్ ఫైనల్ క్రెడిట్ ఎవరికి?.. రైనా క్లారిటీ! ఆ క్షణం ఇంకా రాలేదు -
‘4 దగ్గర లైఫ్ ఇచ్చారు.. 264 కొట్టాడు’
భారత క్రికెట్‌కు దూకుడు మంత్రం నేర్పింది వీరేంద్ర సెహ్వాగ్.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెహ్వాగ్ తర్వాత మరి ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అప్పుడే వచ్చాడు మట్టిలో మాణిక్యం అనుకోవాలో.. సముద్రంలో సునామీ అనుకోవాలో.. బౌలర్ల్ హిట్ లిస్ట్‌లో ఉండే ఆ హిట్ మ్యాన్ ఎవరో ఇప్పటికే అర్థమైందనుకుంటా. టీమిండియా ఓపెనర్, సిక్సర్ల కింగ్, సెహ్వాగ్ స్క్వేర్, అభిమానులు ముద్దుగా పిలిచే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటికే చరిత్ర పుటల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. (చదవండి: ప్రతీ క్షణం అతడి గురించే చర్చ) వన్డే క్రికెట్లో అసాధ్యమనుకునే డబుల్ సెంచరీని అవలీలగా మూడు సార్లు సాధించి తానేంటో నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ. తొలి డబుల్ సెంచరీ సాధించనప్పుడు ఏదో గాలి వాటమనుకున్నారు.. రెండో ద్విశతకం సాధించనప్పుడు ప్రత్యర్థి జట్టుకే కాదు.. భారత ఫ్యాన్స్‌కు నిద్రలోనూ రోహిత్ బ్యాటింగే గుర్తొచ్చేదంటే అతిశయోక్తి కాదు. బౌండరీ నలువైపులా చూడముచ్చటైన షాట్లు.. ఆకాశమే హద్దుగా భారీ సిక్సర్లు.. రోహిత్ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు బంతులు ఎక్కడ వేయాలో దిక్కుతోచక పసిపిల్లలయ్యారు. ఈ అపూర్వ ఘట్టం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డేలో చోటుచేసుకుంది. రోహిత్ విశ్వరూపం ప్రదర్శించి 264 పరుగులు చేసిన ఆ మ్యాచ్ జరిగి నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రోహిత్ సాధించిన ఘనతను గుర్తుచేస్తూ ఐసీసీ, బీసీసీఐ ట్వీట్ చేసింది. అంతేకాకుండా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ఇక ఆ మ్యాచ్‌లో 173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్ల సహాయంతో 264 పరుగులు చేసి వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు. ఇక ట్రిపుల్ సెంచరీ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు అనే రీతిలో రోహిత్ బ్యాటింగ్ సాగింది. అయితే ఆ మ్యాచ్‌లో రోహిత్ నాలుగు పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్‌ను లంక ఆల్‌రౌండర్ తిశార పెరీరా నేలపాలు చేశాడు. దీంతో లంక భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ముఖ్యంగా ఆ క్యాచ్ వదిలేసినందుకు పెరీరా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో.. ఇక రోహిత్ సునామీ ఇన్నింగ్స్‌కు టీమిండియా నాలుగు వందలకుపైగా స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్‌లో 153 పరుగుల భారీ తేడాతో కోహ్లి సేన ఘన విజయం సాధించింది. అంతకుముందు.. ఆ తర్వాత రోహిత్ శర్మ తొలి డబుల్ సెంచరీ ఆస్ట్రేలియాపై సాధించాడు. 2013లో నవంబర్ 2న బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో టీమిండియాలో అతడికి సుస్థిర స్థానం ఖాయమైంది. ఇక ఆ తర్వాత ఏడాది శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. అనంతరం 2017లో లంకపై మరోసారి తన ప్రతాపం చూపించాడు. ఆ మ్యాచ్‌లో ఏకంగా 208 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ట్రిపుల్ డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. రోహిత్‌తో పాటు ఇంకెవరు? వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చరిత్రలో నిలిచిపోయాడు. 2010లో దక్షిణాఫ్రికాపై ఆ ఘనత సాధించి వన్డేల్లోనూ ద్విశతకం సాధించవచ్చని సచిన్ ప్రాక్టికల్‌గా రుజువు చేసి చూపించాడు. ఇక సచిన్ శిష్యుడు వీరేంద్ర సెహ్వాగ్ గురువు దారిలోనే పయనించాడు. 2011లో ఇండోర్ స్టేడియంలో వెస్టిండీస్‌పై 219 పరుగులు సాధించి గురువును మించిన శిష్యుడయ్యాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ వెస్టిండీస్‌పై(237 నాటౌట్), యూనివర్సల్ స్టార్ క్రిస్ గేల్ జింబాబ్వే(215)పై ద్విశతకాలు నమోదు చేశారు. అయితే అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఇప్పటివరకు రెండు అంతకంటే ఎక్కువ డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ రోహిత్ శర్మ. (చదవండి: మనసులో మాట బయటపెట్టిన రోహిత్) #OnThisDay in 2014, Rohit Sharma went big! The Indian opener smashed 264, the highest ever ODI score 🤯 The worst part? Sri Lanka dropped him when he was on 4 🤦 pic.twitter.com/E6wowdoGUL — ICC (@ICC) November 13, 2019 -
ఓపెనింగ్ చేస్తానని వేడుకున్నా: సచిన్
న్యూఢిల్లీ : మార్చి 27... 1994... భారత క్రికెట్ గతిని మార్చిన రోజుల్లో ఇది అత్యంత ప్రధానమైనది. ఇదే రోజున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేల్లో తొలిసారి ఓపెనర్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌పై ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 49 బంతుల్లో 82 పరుగులు చేసి దుమ్మురేపాడు. ఆ తర్వాతదంతా తెలిసిన చరిత్రే. అప్పటివరకు మిడిలార్డర్లో ఆడిన తాను అనూహ్యంగా ఓపెనింగ్‌కు దిగేందుకు జట్టు మేనేజ్మెంట్ను తీవ్రంగా ప్రాధేయపడినట్లు చెప్పాడు. నాటి మ్యాచ్‌లో తన బ్యాటింగ్ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ అనుభవాలు పంచుకున్నాడు. ‘అప్పటివరకు వన్డేల్లో వికెట్లను కాపాడుకుంటూ పరుగులు చేసేవారు. ఓపెనింగ్‌కు దిగి నేను ఈ పద్ధతి మార్చాలనుకున్నా. ఇందుకోసం ఒక్క అవకాశం ఇమ్మంటూ, విఫలమైతే మళ్లీ అడగనంటూ జట్టు మేనేజ్మెంట్ను వేడుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌లో ప్రదర్శనతో నా ఓపెనింగ్‌పై మరో మాటకు తావు లేకపోయింది. అందుకనే... అభిమానులకు ఒక్కటే చెబుతున్నా. విఫలమవుతామనే భయంతో ప్రయోగాలకు వెనుకాడొద్దు’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. -
సచిన్ గల్లీ క్రికెట్; షాకైన అభిషేక్, వరుణ్
ముంబై : మైదానంలోనే కాదు బయట కూడా స్ఫూర్తిమంతంగా వ్యవహరించడం క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నైజం. జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ కార్యక్రమానికి సచిన్ మద్దతు పలికాడు. ఈ క్రమంలో గురువారం గల్లీలో క్రికెట్ ఆడాడు. అయితే, తనతో పాటు క్రికెట్ ఆడతారా అని బాలీవుడ్ నటులు వరుణ్ ధావన్, అభిషేక్ బచ్చన్లను ఆహ్వానించడంతో వారు ఆశ్చర్యంలో మునిగిపోయారు. మెహబూబా స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సచిన్ వారితో కలిసి సరదాగా క్రికెట్ ఆడాడు. తొలుత సచిన్ బ్యాటింగ్ చేయగా.. వరుణ్, అభిషేక్ బంతులేశారు. అనంతరం వారిద్దరికీ బౌలింగ్ చేసిన లిటిల్ మాస్టర్ అక్కడే ఉన్న జియా అనే మహిళా యువ క్రికెటర్‌ను ఎంకరేజ్ చేశాడు. ఆమెతో వరుణ్, అభిషేక్‌కి బౌలింగ్ చేయించాడు. ‘స్పోర్ట్స్ ప్లేయింగ్ నేషన్’, ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ హాష్‌టాగ్‌లను జత చేస్తూ.. సచిన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. గల్లీలో క్రికెట్ ఆడటం ఆనందం ఉందని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చేసే పనిలో ఆటల్ని భాగం చేసుకోవాలని సూచించాడు. కాగా, ఈ ట్వీట్‌పై వరుణ్ స్పందించాడు. క్రీడా దినోత్సవం సందర్భంగా గొప్ప చొరవ చూపారు సర్ అంటూ ప్రశంసించాడు. మీతో క్రికెట్ ఆటడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. -
సచిన్‌నే తికమక పెట్టిన ఘటన!
ముంబై : క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు ఓ క్లిష్ట ప్రశ్నను సంధించాడు. బుధవారం ట్విటర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన మాస్టర్.. అందులో బ్యాట్స్‌మన్ ఔటా ? నాటౌటా? మీరు అంపైర్ అయితే ఏం చేసేవారని అడిగాడు. సంక్లిష్టమైన పరిస్థితిని కలిగి ఉన్న ఈ వీడియోను ఓ స్నేహితుడు పంపిచాడని సచిన్ పేర్కొన్నాడు. అయితే ఈ వీడియోలో బౌలర్ వేసిన బంతి నేరుగా వికెట్ బెయిల్స్‌ను తాకినప్పటికి.. అవి కిందపడలేదు. పైగా ఒక బెయిల్ పక్కకు జరిగింది. అయితే దీన్ని అంపైర్ నాటౌట్ ఇచ్చినట్లు తెలుస్తున్నప్పటికి వీడియోలో మాత్రం స్పష్టత లేదు. ఈ సందర్భంలో మీరు అంపైర్‌గా ఉంటే ఏం చేసేవారని అభిమానులను సచిన్ ప్రశ్నించాడు. A friend shared this video with me. Found it very unusual! What would your decision be if you were the umpire? 🤔 pic.twitter.com/tJCtykEDL9 — Sachin Tendulkar (@sachin_rt) July 24, 2019 చాలా మంది నాటౌట్ ఇచ్చేవాళ్లమని కామెంట్ చేయగా కొంతమంది మాత్రం ఔట్ అని అభిప్రాయపడ్డాడు. ‘వాస్తవానికి ఔటే కానీ.. రూల్స్ రూల్సే కదా.. మొన్న ఇంగ్లండ్ గెలిచినట్టు’ అని ఓ యూజర్ సెటైరిక్‌గా కామెంట్ చేశాడు. నిబంధనల ప్రకారం బంతి బెయిల్స్‌కు తగిలినా కిందపడితేనే ఔట్ ఇస్తారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ క్లబ్ మ్యాచ్‌లో ఇలాంటి వింత ఘటననే చోటు చేసుకుంది. బౌలర్ విసిరిన బంతికి మిడిల్ స్టంప్ ఎగిరి పడింది. కానీ దానిపై ఉన్న బెయిల్స్ మాత్రం కదల్లేదు.. కింద పడలేదు. దీంతో అంపైర్‌కు ఏం చేయాలో తోచలేదు. చాలాసేపటి వరకు నిర్ణయానికి ప్రకటించకుండా.. లెగ్ అంపైర్, థర్డ్ అంపైర్లతో చర్చించి చివరకు ఔటిచ్చాడు. మెల్బోర్న్లో మూనీ వాలీ సీసీ, స్ట్రాట్మోర్ హైట్స్ సీసీ టీమ్స్ మధ్య జరిగిన క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో ఈ వింత జరిగింది. క్రికెట్ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో అంపైర్లు కూడా ఔటివ్వాలా వద్దా అన్న విషయంపై అయోమయానికి గురయ్యారు. అప్పటికప్పుడు క్రికెట్ రూల్ బుక్ చూసి నిర్ణయాన్ని ప్రకటించారు. -
సచిన్ ప్రపంచకప్ జట్టులో ఐదుగురు భారత ఆటగాళ్లు
న్యూఢిల్లీ: బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన ప్రపంచ కప్ ఆల్ స్టార్స్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. ఈ జాబితాలో ఐదుగురు టీమిండియా సభ్యులకు చోటు దక్కింది. అయితే, వికెట్ కీపర్‌గా భారత వెటరన్ మహేంద్ర సింగ్ ధోనికి బదులుగా ఇంగ్లండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను సచిన్ ఎంచుకున్నాడు. టీమిండియా సారథి విరాట్ కోహ్లి సహా మెగా టోర్నీ టాప్ స్కోరర్ రోహిత్ శర్మ, పేసర్ బుమ్రా, ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలకు అతడు స్థానం కల్పించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఈ జట్టుకు సారథిగా ఉన్నాడు. సచిన్ వరల్డ్ కప్ జట్టు సభ్యులు: రోహిత్ శర్మ, బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కోహ్లి, షకీబ్ అల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్. -
భారత ఫ్యాన్స్‌పై వివ్ రిచర్డ్స్ సంచలన వ్యాఖ్యలు
లండన్ : భారత అభిమానులకు కొంచెం కూడా ఓపిక ఉండదని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ అభిప్రాపడ్డాడు. వారనుకున్న ఫలితం రాకుంటే పిచ్చిగా అభిమానించే ఆటగాళ్ల దిష్టిబొమ్మలు ఎందుకు తగలబెడతారో ఇప్పటికి అర్థం కాదన్నాడు. ప్రపంచకప్‌లో కోహ్లిసేన బాగా రాణించాలంటే భారత అభిమానులు ఓపికలతో ఉండాలని సూచించాడు. సలామ్ క్రికెట్ 2019 కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భారత అభిమానులకు కొన్నిసార్లు ఓపిక ఉండదు. దిష్టిబొమ్మలను తగలబెట్టడం తెలివితక్కువ పని. ఏ ఆటగాడికైనా ఓడిపోవాలని ఉండదు. గెలవడానికే ప్రయత్నిస్తారు. ఈ రోజు హీరో కాకపోయినంత మాత్రానా రేపు జీరో కాదు. ప్రత ఒక్కరి పట్ల గౌరవంగా, మర్యాదకంగా నడుచుకోవాలి. అన్నిసార్లు మనకే మంచి జరగాలంటే కుదురదు’ అని రిచర్డ్స్ చెప్పుకొచ్చాడు. సౌరవ్ గంగూలీ సారథ్యంలోని భారత జట్టు 2003 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడగానే భారత అభిమానులు ఆటగాళ్ల ఇళ్లపై దాడి చేయడం, దిష్టిబొమ్మలు తగలబెట్టిన విషయం తెలిసిందే. ఇక 2007 ప్రపంచకప్‌లో లీగ్ దశ నుంచే నిష్క్రమించడంతో కూడా అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. క్రికెటర్ల ఇళ్లపై రాళ్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో తీవ్రంగా కుంగిపోయిన సచిన్ రిచర్డ్స్ ఫోన్‌కాల్‌తోనే తేరుకొని మరో నాలుగేళ్లు క్రికెట్ ఆడానని ఈ కార్యక్రమంలోనే వెల్లడించాడు. ‘ 2007 ప్రపంచకప్‌లోని నా ప్రదర్శన కెరీర్‌లోని అత్యంత చెత్త ప్రదర్శన. ఈ ఓటమితో ఆటకు గుడ్‌బై చెప్పుదాం అనుకున్నా. ఆ సమయంలో మా అన్న 2011లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడుతావని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా నేను కన్వీన్స్ కాలేదు. నేను ఫామ్‌హౌస్‌లో ఉండగా వివ్ రిచర్డ్స్ ఫోన్ చేశాడు. సుమారు 45 నిమిషాలు మాట్లాడాడు. ఆ కాల్‌తో నేను నా నిర్ణయాన్ని మార్చుకున్నా’ అని సచిన్ చెప్పుకొచ్చాడు. -
అక్టోబర్ 22న బీసీసీఐ ఎన్నికలు
న్యూఢిల్లీ: ఇన్నాళ్లు తాత్కాలిక అధ్యక్షుడు, తాత్కాలిక కార్యదర్శి అని చెప్పుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పూర్తిస్థాయి కార్యవర్గంతో కళకళలాడనుంది. సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) క్రికెట్ బోర్డుకు ఎన్నికల నగారా మోగించింది. ఈ ఏడాది అక్టోబర్ 22న బీసీసీఐ ఎన్నికలు జరుగనున్నాయి. మంగళవారం సమావేశమైన సీఓఏ దీనికి సంబంధించిన షెడ్యూలును ఖరారు చేసింది. సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యులు డయానా ఎడుల్జీ, రవి తోడ్గే సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికలు సెప్టెంబర్ 14వ తేదీతో పూర్తి చేయాలని తుది గడువు విధించారు. వినోద్ రాయ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 30 రాష్ట్ర సంఘాలు లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తున్నాయని, మిగిలిన సంఘాలు అమలు చేసే పనిలో ఉన్నాయని చెప్పారు. రెండేళ్లకు పైగా సరైన పాలకవర్గం లేని బీసీసీఐ ఎట్టకేలకు ఈ ఎన్నికలతో పూర్తిస్థాయి కార్యవర్గంతో పనిచేస్తుందని, అదే జరిగితే తనకు ‘సుప్రీం’ అప్పగించిన బాధ్యత పూర్తయి... సంతోషంగా నిష్క్రమిస్తానని రాయ్ అన్నారు. ‘అప్పట్లో కోర్టు నన్ను నియమించినపుడే చెప్పాను... నా పాత్ర కేవలం నైట్ వాచ్‌మన్‌కే పరిమితమని! అయితే ఈ కాపలాదారుడు సుదీర్ఘకాలం ఉండాల్సి వచ్చింది. చివరకు సీఓఏ ఇప్పుడు సంతోషంగా నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉంది. ఆరంభంలో రాష్ట్ర సంఘాల్లో సిఫార్సుల అమలు కోసం కృషి చేశాం. ఇటు కోర్టు ఆదేశాలను పాటించాం. సంఘాలు, కోర్టుకు మధ్య మధ్యవర్తిత్వం జరిపాం’ అని వినోద్ రాయ్ తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కార్యవర్గమే క్రికెట్ బోర్డును నడిపించాలని గట్టి పట్టుదలతో కృషి చేశామన్నారు. కోర్టు సహాయకుడి (అమికస్)గా నియమితుడైన నర్సింహ కూడా తమతో పాటే శ్రమించారని చెప్పుకొచ్చారు. వివిధ రాష్ట్ర సంఘాలతో మధ్యవర్తిత్వం చేయడంలో ఆయన కృషి గొప్పదని రాయ్ అభినందించారు. కమిటీ విధివిధానాలు ఖరారు చేస్తాం భారత బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) విధి విధానాలను ఖరారు చేస్తామని పరిపాలక కమిటీ (సీఓఏ) తెలిపింది. ఇటీవల బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్, అంబుడ్స్‌మన్ డీకే జైన్ చేపట్టిన పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం విషయంలో సీఏసీ విధులేమిటో, పదవీ కాలమెంతో, అసలు పరిధి ఎంతో ఎవరికీ తెలియదని వీవీఎస్ లక్ష్మణ్ బహిరంగంగా సీఓఏపై మండిపడ్డారు. దీంతో సీఏసీ విధివిధానాలు రూపొందించి... డీకే జైన్ ఆమోదం తర్వాత ప్రకటిస్తామని సీఓఏ వర్గాలు వెల్లడించాయి. విధివిధానాల విషయంలో చాలా ఆలస్యమైన మాట వాస్తవమేనని త్వరలోనే స్పష్టత వస్తుందని చెప్పారు. -
బార్బర్ సిస్టర్స్‌తో షేవింగ్ చేయించుకున్న సచిన్
-
సచిన్@47
ముంబై: భారత క్రికెట్ దేవుడు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేడు 47వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్‌కు బుధవారంతో 46 ఏళ్లు నిండనున్నా యి. ఆధునిక క్రికెట్లో సాటి లేని మేటి ఆటగాడిగా నిలుస్తూ లిటిల్ మాస్టర్ నుంచి మాస్టర్ బ్లాస్టర్గా ఎదిగి అనంతరం క్రికెట్ దేవుడిగా సచిన్ ఖ్యాతినార్జించాడు. దేశానికి 24 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఈ మాస్టర్ బ్యాట్స్‌మన్... ఆ క్రమంలో టెస్టులు (200 మ్యాచ్‌లు–15,921 పరుగులు), వన్డేల్లో (463 మ్యాచ్‌లు–18,426 పరుగులు) అత్యధిక పరుగుల ఘనతలు సహా ఎన్నో ప్రపంచ రికార్డులు తిరగ రాశాడు. 2013 నవంబరు 16న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూనే... దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను అందుకున్నాడు. దీనికిముందే 1994లో అర్జున అవార్డు, 1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను పొందాడు. రికార్డు స్థాయిలో ఆరు ప్రపంచ కప్‌లలో పాల్గొన్న సచిన్... 2011లో విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడిగా తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. -
ముంబై చాంపియనైంది
క్రికెట్ దేవుడు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐకాన్ ప్లేయర్‌గాఉన్న జట్టు ముంబై ఇండియన్. ఐదు సీజన్లు గడిచినా చాంపియన్ షిప్‌ను అందుకోలేకపోయింది. ఈ ఐదేళ్లలో ఒకసారి 2010లో ఫైనల్ గడప తొక్కినా... చివరకు చెన్నై చేతిలో చుక్కెదురైంది. ఆరో సీజ¯Œ లో మాత్రం అదే చెన్నైపై బదులు తీర్చుకున్న సచిన్ జట్టు 2013 చాంపియన్ అయింది. ఐదు సీజన్లుగా అలసట లేని పోరాటం చేసిన ముంబై ఇండియన్ జట్టు రాత ఆరో సీజన్ నుంచి మారిపోయింది. ఆటగాళ్ల ప్రయత్నానికి అదృష్టం కూడా తోడవడంతో 2013 చాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ ఫేవరెట్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో సాధారణ లక్ష్యాన్ని కాపాడుకొని తొలిసారి విజేతగా నిలిచింది. 2010లో ఫైనల్ మెట్టుపై తమనో ‘పట్టు’పట్టిన చెన్నైపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఆ తర్వాత ఆడిన ఐదు సీజన్లలో మరో రెండుసార్లు (2015, 2017) టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట ఈ సీజన్లో పాంటింగ్ సారథ్యంలో తలపడిన ముంబై ఇండియన్స్ అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలో పుంజుకుంది. సచిన్ ఆడిన చివరి ఐపీఎల్ కూడా ఇదే. గాయంతో ఫైనల్ ఆడలేకపోయిన సచిన్ ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. పెప్సీ ఐపీఎల్... డీఎల్ఎఫ్ ఐదేళ్ల కాంట్రాక్టు గడువు ముగియడంతో పెప్సీకో ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వచ్చింది. దీంతో డీఎల్ఎఫ్ ఐపీఎల్ కాస్తా పెప్సీ ఐపీఎల్‌గా మారింది. తొమ్మిది జట్లతో మొదలైన ఈ సంగ్రామంలో ముంబై ఇండియన్ చివరిదాకా పట్టుదలగా ఆడింది. ఇక ఈ లీగ్‌కు చెన్నైలో రాజకీయ ఆందోళనలు వెల్లువెత్తాయి. శ్రీలంకలోని తమిళులపై సింహళీయుల అణచివేత కారణంగా తమిళనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత లంక ఆటగాళ్లు చెన్నైలో ఆడకుండా చూసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ఐపీఎల్ పాలకమండలికి, బీసీసీఐకి లేఖ రాసింది. దీంతో లంకేయులెవరూ చెన్నై గడ్డపై అడుగుపెట్టలేదు. లీగ్ విషయానికొస్తే 9 జట్లు బరిలోకి దిగగా మొత్తం 76 మ్యాచ్‌లు జరిగాయి. లీగ్ దశలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు, ముంబై ఇండియన్స్ సమవుజ్జీగా నిలిచింది. రెండు జట్లు 16 మ్యాచ్‌ల్లో 11 చొప్పున గెలిచి తొలి రెండు స్థానాల్లో ప్లే–ఆఫ్ బరిలో నిలిచాయి. చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఆటగాళ్ల హవా నడిచిన ఈ లీగ్‌లో మైక్ హస్సీ 733 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకోగా, చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ చేజిక్కించుకున్నాడు. ఇక జట్టు మొత్తంగా చూసుకుంటే పాల్గొన్న తొలి సీజన్లోనే ఏమాత్రం అంచనాలు లేని సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థుల మెరుపులకు కళ్లెం వేసి మరీ తక్కువ స్కోర్లను కాపాడుకున్న జట్టేదైనా ఉంటే అది సన్ రైజర్సే! మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 119, 126, 136 పరుగుల్ని చేసి... టి20ల్లో అతిసాధారణమనే ఈ లక్ష్యాల్ని నిలబెట్టుకోవడం గొప్ప విశేషం. బౌలర్లు స్టెయిన్ , ఇషాంత్ శర్మ, కరణ్ శర్మ, డారెన్ స్యామీ సమష్టిగా రాణించారు. లీగ్ దశ ముగియడంతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై, ముంబై ప్లే ఆఫ్ అడ్వాంటేజ్ పొందగా, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్న రాజస్తాన్, సన్ రైజర్స్ ఎలిమినేటర్ ఆడాయి. ఇందులో రాజస్తాన్ జట్టు ముందంజ వేయగా... హైదరాబాద్ ఆట ముగిసింది. తొలి క్వాలిఫయర్‌లో ముంబైని ఓడించిన చెన్నై నేరుగా ఫైనల్ చేరింది. ప్లే ఆఫ్ సౌలభ్యంతో ముంబై రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్‌పై గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్ డ్రామా... ఈ లీగ్‌లో చెన్నై బ్యాటింగ్ పవర్ సూపర్. 200 పైచిలుకు పరుగులు చేయడమే కాకుండా... 180, 170, 190 పరుగులకు పైగా లక్ష్యాల్ని ఛేదించింది. కానీ ఫైనల్లో మాత్రం ముంబై తమ ముందుంచిన 149 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. మొదట పొలార్డ్ (32 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులతో ముంబై 9 వికెట్లకు 148 పరుగులు చేసింది. తర్వాత చెన్నై 2, 2, 3, 35 చూస్తుండగానే 39 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. మలింగ (2/22), జాన్సన్ (2/19), హర్భజన్ (2/14)ల ధాటికి చెన్నై ఇన్నింగ్స్ కాస్తా పేకమేడలా కూలింది. 58 పరుగులు చేసేసరికి 8 వికెట్లు!! కానీ కెప్టెన్ ధోని (45 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో నిర్ణీత ఓవర్లు ఆడేసి 9 వికెట్లకు 129 పరుగులు చేసింది. 23 పరుగులతో గెలిచిన ముంబై తొలిసారి లీగ్ చాంపియన్ అయింది. దక్క¯Œ ఔట్... రైజర్స్ ఇన్ ఈ ఆరో సీజన్లోనూ 2012లాగే తొమ్మిది జట్లే ఆడాయి. కానీ జట్టు మారింది. హైదరాబాదీ ఆధీనంలోని దక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీ రద్దయింది. చెన్నైకి చెందిన ప్రముఖ సన్ టీవీ నెట్వర్క్ ఆధీనంలోకి హైదరాబాద్ వెళ్లింది. 2009 చాంపియన్ అయిన దక్కన్ చార్జర్స్... కొచ్చి టస్కర్స్ కేరళలాగే నిర్ణీత బ్యాంక్ గ్యారంటీని ఇవ్వకపోవడంతో బీసీసీఐ దక్కన్‌ను లీగ్ నుంచి తప్పించింది. కుదిపేసిన ‘స్పాట్’ మీకు తెలుసా... ప్రస్తుతం బీసీసీఐ కార్యవర్గంతో పాటు ‘సుప్రీం’ నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) రావడానికి, తొలిసారిగా బోర్డులో సంస్కరణలు చేయడానికి, ప్రొఫెషనలిజాన్ని (సీఈఓ) తేవడానికి... ఇవన్నీ రావడానికి ఈ సీజనే కారణం. అదెలాగంటే ‘స్పాట్ ఫిక్సింగ్’ జరిగింది ఈ సీజన్లోనే. రాజస్తాన్ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ , అజిత్ చండిలా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులకు ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేశారు. ముకుల్ ముద్గల్ కమిటీ విచారణ, తదనంతరం లోధా కమిటీ సిఫార్సులు. సంస్కరణలు అవన్నీ ఇప్పటికీ కొనసా...గుతున్నాయి. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: వాట్సన్ రాజస్తాన్ రాయల్స్ అత్యధిక పరుగులు ఆరెంజ్ క్యాప్: హస్సీ చెన్నై: 733 అత్యధిక వికెట్లు పర్పుల్ క్యాప్: బ్రేవో చెన్నై: 32 -
మార్చి 16.. మర్చిపోలేని రోజు!
క్రికెట్ అభిమానులు ఈ రోజు(మార్చి 16)ను మర్చిపోలేరు. క్రికెట్ చరిత్రలో రెండు సరికొత్త రికార్డులు నమోదయిన రోజు. అందులో ఒకటి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలు సాధించింది కాగ, మరొకటి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హెర్షల్ గిబ్స్ తొలి సారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి నయా రికార్డు సృష్టించాడు. హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద అంతర్జాతీయ శతకాలు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది ఇదే రోజున. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌పై చేసిన శతకం సచిన్‌కు వన్డేల్లో 49వ సెంచరీ కాగా, టెస్టులు(51), వన్డేల్లో కలుపుకుని వంద సెంచరీలను సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఈ "లిటిల్ మాస్టర్" సరికొత్త రికార్డును సృష్టించాడు. సచిన్ సాధించిన ఈ అరుదైన ఘనతతో యావత్ క్రికెట్ అభిమానులు తెగ పండగ చేసుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్(71) సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇప్పటివరకు 66 అంతర్జాతీయ సెంచరీలు సాధించి సచిన్ ‘వంద శతకాల’పై కన్నేశాడు. సిక్సర్ల సునామీ ఇక పన్నెండేళ్ల క్రితం సిరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు హెర్ష్లీ గిబ్స్ అద్భుతం చేశాడు. వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిబ్స్ అతడికి చుక్కలు చూపించాడు. అప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రవిశాస్త్రి, గార్ఫీల్డ్ సోబర్స్ సాధించిన రికార్డే(ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు) అత్యుత్తమం కావడం విశేషం. గిబ్స్ ఈ ఘనత అందుకున్న కొద్ది నెలల అనంతరం టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ రికార్డు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఫీట్ అందుకున్నాడు. -
ఆస్ట్రేలియాలో ఈసారి సిరీస్ నెగ్గొచ్చు!
ముంబై: కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేనందున ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలిచేందుకు ఈసారి టీమిండియాకు గొప్ప అవకాశం వచ్చిందని మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తాను నెలకొల్పిన ‘టెండూల్కర్–మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ’ ప్రారంభం సందర్భంగా గురువారం సచిన్ మీడియాతో మాట్లాడాడు. స్మిత్, వార్నర్‌లపై నిషేధం ఎత్తివేత గురించి స్పందించేందుకు అతడు నిరాకరించాడు. యువ పేసర్ ఖలీల్ అహ్మద్ ఆకట్టుకుంటున్నాడని, భారత పేస్ బౌలింగ్‌లో బుమ్రా కీలకమని పేర్కొన్న సచిన్... ఇలాంటి ఆరోగ్యకర పోటీ ఆహ్వానించదగినదని అన్నాడు. ఒక క్రికెటర్‌గా విరాట్ కోహ్లి పురోగతి అద్వితీయమని, అతడిలో ఆ కసిని తాను చూశానని పేర్కొన్నాడు. ‘విరాట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా నిలుస్తాడని నేను అంచనా వేశా. అతడు ఆల్‌టైమ్ గ్రేట్‌గా అవతరిస్తాడు. ఇక్కడ బౌలర్ల స్థాయి ఏమిటనేది అప్రస్తుతం. తరానికి తరానికి మార్పు తప్పనిసరిగా ఉంటుంది. అందుకని పోల్చి చూడటాన్ని నేను నమ్మను. యువ ఆటగాడు పృథ్వీ షా మరింతగా వెలుగులోకి వచ్చేందుకు ఆస్ట్రేలియా పర్యటన ఉపయోగపడుతుంది’ అని సచిన్ విశ్లేషించాడు. -
ఆచార్య దేవోభవ
ముంబైలో నేడు టెండూల్కర్ మిడిలెసెక్స్ గ్లోబల్ అకాడమీ (టీఎంజీఏ)ని సచిన్ టెండూల్కర్ ప్రారంభించబోతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఆటలో ఓనమాలు నేర్పిన గురువు రమాకాంత్ అచ్రేకర్‌ను బుధవారం కలిసిన సచిన్ పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాడు. అచ్రేకర్ మరో శిష్యుడు, ముంబై టీఎంజీఏలో కోచ్‌గా వ్యవహరించబోతున్న వినోద్ కాంబ్లీ కూడా సచిన్‌తో పాటు ఉన్నాడు. -
వినాయక చవితి వేడుకల్లో ప్రముఖులు
-
అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం
కొలంబో: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్–19 జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. శ్రీలంక అండర్–19 జట్టుతో మంగళవారం ఇక్కడ ప్రారంభమైన నాలుగు రోజుల యూత్ టెస్టులో ఎడంచేతి పేసర్ అర్జున్ అరంగేట్రం చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో శ్రీలంక ఓపెనర్ మిషారా (9)ను ఎల్బీగా ఔట్ చేసిన అతను జట్టుకు శుభారంభం ఇచ్చాడు. మొత్తం 11 ఓవర్లు వేసిన అర్జున్ 33 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఆయుష్ బదోని (4/24), హర్‡్ష త్యాగి (4/92) ధాటికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. -
‘సచిన్ రాముడైతే.. నేను హనుమంతుడిని’
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తనకు దైవంతో సమానమని ఎప్పుడు చెప్పే సెహ్వాగ్.. మరోసారి అతనిపై తనకున్న భక్తిని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. సచిన్ రాముడైతే.. తాను హనుమంతుడిని అని తెలిపిన సెహ్వాగ్.. ఆ రాముడి, హనుమంతిడి స్టైల్లో దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు. దానికి క్యాప్షన్‌గా.. ‘దేవుడితో ఉన్నప్పుడు..అతని పాదాల వద్ద ఉండటం బాగుంది.’ అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు ఫిదా అయిన అభిమానులు.. అద్భుతమైన జోడి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఓ అభిమానైతే ఏకంగా ‘సెహ్వాగ్ జీ.. మీరు సచిన్ నెంబర్‌ను మీ మొబైల్లో గాడ్జీ అని సేవ్ చేసుకున్నారా? దయచేసి సమాధానం ఇవ్వండి’ అని ప్రశ్నించాడు. 93 అంతర్జాతీయ వన్డేల్లో సచిన్, సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగి 42.13 సగటుతో 3,919 పరుగులు చేశారు. 12 సెంచరీ, 15 హాఫ్ సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పి అత్యధిక పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. -
అర్జున్ ఎంపికపై సచిన్ సంతోషం
ముంబై: తన కుమారుడు భారత అండర్–19 జట్టులోకి ఎంపిక కావడం పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. జులైలో శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం గురువారం సెలక్టర్లు ప్రకటించిన జట్టులో అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కింది. దీనిపై సచిన్ స్పందిస్తూ... ‘భారత అండర్–19 జట్టులోకి అర్జున్ ఎంపిక కావడం పట్ల మేమందరం సంతోషంగా ఉన్నాం. అతని క్రికెట్ కెరీర్లో ఇది కీలకమైన మైలురాయి. అతని ఇష్టాఇష్టాల్లో నాతో పాటు అంజలి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అర్జున్ విజయం సాధించాలని మేం ప్రార్థిస్తున్నాం’ అని పుత్రోత్సాహం ప్రదర్శించాడు. -
రోడ్డుపై షటిల్ ఆడిన విక్టరీ వెంకటేశ్
మొన్న క్రికెట్ దేవుడు సచిన్ రోడ్డు పైకి వచ్చి క్రికెట్ ఆడారు. స్టేడియంలో ఆడటం వేరు. బయట రోడ్డుపైకి వచ్చి పిల్లలతో ఆడటం వేరు. స్వయంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆడటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. విక్టరీ వెంకటేశ్ కూడా అదేవిధంగా పిల్లలతో షటిల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సరదాగా కాసేపు పిల్లలతో ఆడిన వెంకటేశ్ ఆటను చూసి ముచ్చట పడ్డారు అక్కడి వారు. వెంటనే వెంకీ ఆటను కెమెరాలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియలేదు. గతేడాది ‘గురు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో వెంకీ నటనకు ప్రశంసలు దక్కాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వెంకీ, వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ తేజతో కూడా వెంకటేశ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.