
మొన్న క్రికెట్ దేవుడు సచిన్ రోడ్డు పైకి వచ్చి క్రికెట్ ఆడారు. స్టేడియంలో ఆడటం వేరు. బయట రోడ్డుపైకి వచ్చి పిల్లలతో ఆడటం వేరు. స్వయంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఆడటంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. విక్టరీ వెంకటేశ్ కూడా అదేవిధంగా పిల్లలతో షటిల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
సరదాగా కాసేపు పిల్లలతో ఆడిన వెంకటేశ్ ఆటను చూసి ముచ్చట పడ్డారు అక్కడి వారు. వెంటనే వెంకీ ఆటను కెమెరాలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే వివరాలు తెలియలేదు. గతేడాది ‘గురు’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో వెంకీ నటనకు ప్రశంసలు దక్కాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విజయాన్ని సాధించింది. ప్రస్తుతం వెంకీ, వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ తేజతో కూడా వెంకటేశ్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment