‘ఎఫ్‌2’ టీజర్‌ ఎప్పుడంటే..? | Venkatesh And Varun Tej F2 Trailer may Be on 12th December | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 6 2018 12:50 PM | Last Updated on Thu, Dec 6 2018 1:00 PM

Venkatesh And Varun Tej F2 Trailer may Be on 12th December - Sakshi

ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యంగ్‌డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి.. మాస్‌ పల్స్‌ను పట్టుకోవడంలో దిట్ట. తీసిన మూడు సినిమాల్లో కామెడీ, యాక్షన్‌, సెంటిమెంట్‌ ఇలా ప్రతీది ఉండేలా.. మాస్‌కు చేరువయ్యేలా తెరకెక్కించారు. పటాస్‌, సుప్రీమ్‌, రాజాదిగ్రేట్‌ సినిమాలతో వరుసగా హిట్‌లు కొట్టిన ఈ డైరెక్టర్‌.. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) అనే మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.  

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఇక వరుసగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీనిలో భాగంగానే వెంకటేష్‌ పుట్టిన రోజు(డిసెంబర్‌ 13) సందర్భంగా.. స్పెషల్‌ తేదీ(డిసెంబర్‌ 12)న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement