F2 Fun & Frustration
-
డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?
పైసా మే పరమాత్మ అంటారు. ఒక్క చిన్న మార్పు. ఇప్పుడు ‘పైసా మే సినిమా’ అనాలి. ఎందుకంటే రిలీజ్ తర్వాత సాధించే పైసా వసూల్ కోసం పైసల చుట్టూ కథలు అల్లి కొన్ని సినిమాలు తీస్తున్నారు. ‘పైసా మే సినిమా’... అంటూ పైసల మీద తీస్తున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. వినోదం.. సందేశం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’. భార్యాభర్తల అనుబంధాలతో అల్లుకున్న ‘ఎఫ్ 2’ అయినా.. వారసత్వం నేపథ్యంతో సాగిన ‘ఎఫ్ 3’ అయినా.. ఈ రెండు సినిమాల్లో అంతర్లీనంగా ఉన్న ప్రధానాంశం డబ్బుతో కూడుకున్న అవసరాలేనని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ‘ఎఫ్ 3’లో అయితే జీవితంలో డబ్బు చాలా ముఖ్యమంటూ ‘లబ్ డబ్.. లబ్ డబ్.. డబ్బూ..’ అనే పాట కూడా ఉంది. ఈ చిత్రం ఎండింగ్లో ‘ఎఫ్ 4’ ఉంటుందన్నట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది ‘ఎఫ్ 4’ సినిమా ఆరంభం కానుందట. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ల మాదిరిగానే ‘ఎఫ్ 4’ ప్రధాన కథాంశం డబ్బే అయ్యుంటుందని ఊహించవచ్చు. ఖరీదైన భవనాలు.. నోట్ల కట్టలు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు వినోదంతో పాటు సందేశాత్మకంగానూ ఉంటాయి. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న తాజా సినిమాలో ధనుష్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఒకవైపు అత్యంత ఖరీదైన భవనాలు, మరోవైపు మురికి వాడలు.. మధ్యలో నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. సో.. ఈ సినిమా ప్రధాన కథాంశం డబ్బు నేపథ్యంలో ఉంటుందని, సమాజంలో నెలకొన్న అసమానతల కోణంలో కథనం సాగుతుందని ఊహింవచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. జూదం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ పాన్ ఇండియన్ సినిమాకు ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్‌ని బట్టి ‘మట్కా’ కథ అంతా డబ్బు చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నట్లు, వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామాన్యుడి కథ నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌ను గమనిస్తే టైటిల్లో డాలర్ సింబల్ స్పష్టంగా కనిపిస్తుంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాలర్ కుమార్ ‘బిగ్ బాస్’ షో ఫేమ్ వీజే సన్నీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. ఏ ట్విస్టెడ్ ఫ్యామిలీ స్టోరీ అనేది ఉపశీర్షిక. హ్రితికా శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్ శేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాలర్ కుమార్ అనే పాత్రలో నటిస్తున్నారు వీజే సన్నీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌లో డబ్బు కనిపిస్తుండటం ‘సౌండ్ పార్టీ’ ప్రధాన కథాంశం డబ్బేఅని స్పష్టం చేస్తోంది. డబ్బే ప్రధానాంశంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
ఈ సినిమాలకు ముందుంది మూడో భాగం
ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ కూడా హిట్.. మరి ఆ హిట్ కంటిన్యూ అవ్వాలి కదా. అవ్వాలంటే కథ ఉండాలి. కొన్ని చిత్రాల కథలకు ఆ స్కోప్ ఉంది. ఎన్ని భాగాలైనా తీసేంత కథ ఉంటుంది. అలా తెలుగులో కొన్ని చిత్రాల కథలు ఉన్నాయి. ఆ కథల తొలి, మలి భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగానికి కథ రెడీ అవుతోంది. ‘ముందుంది మూడో భాగం’ అంటూ రానున్న సీక్వెల్ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఒకే కాంబినేషన్.. రెండు చిత్రాల సీక్వెల్ సీక్వెల్ చిత్రాలు రావడం ఇప్పుడు కామన్ అయింది. అయితే ఒకే కాంబినేషన్లో రెండు చిత్రాల సీక్వెల్స్ రావడం అరుదు. అల్లు అర్జున్–సుకుమార్‌ల కాంబినేషన్ ఈ కోవలోకే వస్తుంది. ‘ఆర్య’ (2004)తో ఈ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది. ఆ చిత్రం హిట్‌తో హిట్ కాంబినేషన్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (2021) పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాణంలో ఉంది. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది. ‘ఆర్య’, ‘పుష్ప’... ఇలా సౌత్‌లో రెండు చిత్రాల సీక్వెల్స్ తెచ్చిన కాంబినే షన్ బన్నీ–సుకుమార్లదే అవు తుంది. ఎఫ్ 4 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన తొలి మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ తెరకెక్కించారు అనిల్. ఈ మూవీలోనూ వెంకటేశ్–తమన్నా, వరుణ్ తేజ్–మెహరీన్ హీరో హీరోయిన్లు. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిట్ 3 ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదల కాగా మూడో భాగం కోసం డైరెక్టర్ శైలేష్ కొలను సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమా 2020 ఫిబ్రవరి 28న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ తీశారు శైలేష్ కొలను. అయితే ఈ మూవీలో హీరో మారారు.. అడివి శేష్ హీరోగా నటించారు. 2022 డిసెంబరు 2న రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ స్పష్టం చేశారు. ‘హిట్ 2’ లానే ‘హిట్ 3’లోనూ హీరో మారారు. ‘హిట్ 1’, ‘హిట్ 2’ సినిమాలు నిర్మించిన హీరో నాని ‘హిట్ 3’లో లీడ్ రోల్ చేయనున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. ‘హిట్ 2’ క్లయిమాక్స్లోనే నాని కనిపించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అటు నాని, ఇటు శైలేష్ కొలను తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరి ‘హిట్ 3’కి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ 3 కన్నడ చిత్ర పరిశ్రమను, యశ్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2018 డిసెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత యశ్‌తోనే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. 2022 ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. -
ఎఫ్3 మూవీ ట్విటర్ రివ్యూ
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్,వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అందిస్తామంటూ `ఎఫ్ 3`ని తెరకెక్కింంచారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన రావడంతో పాటు మూవీపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. ఈ చిత్రంలో కామెడీ బాగా వర్కౌట్ అయిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ల కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుందట. స్టోరీ పెద్దగా ఏమీ లేకున్నా..కామెడీతో లాక్కొచ్చారని చెబుతున్నారు. సినిమా యావరేజ్‌గా ఉందని మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #F3Movie Very good 1st and 2nd half. Excellent Comedy timing from @VenkyMama & @IAmVarunTej. Franchise is mean for Fun and they delivered it perfectly. Overall: logics aside just enjoy the hilarious laugh ride in Theaters💥🔥#F3OnMay27 #F3 #f3 — tolly_wood_UK_Europe (@tollywood_UK_EU) May 26, 2022 ఎఫ్3 మూవీ చాలా బాగుంది. వెంకటేశ్, వరుణ్‌తేజ్‌ల కామెడీ అదిరిపోయింది. లాజిక్‌ని పక్కన పెట్టి చూస్తే ఎఫ్3 ని ఎంజాయ్ చేస్తారని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #F3Movie First Half Report : Entertainment Loaded #F3 > #F2 🤑💸@VenkyMama as usual👌@IAmVarunTej #sunil comedy 👏@Mehreenpirzada @tamannaahspeaks 😍@AnilRavipudi 👍 #DilRaju pic.twitter.com/Xd9s6vS4du — Ushkela Mohan (@UshkelaM) May 27, 2022 ఎఫ్2 కంటే ఎఫ్3 బాగుంది. ఫస్టాఫ్ వెంకటేశ్ ఎప్పటిమాదిరే తనదైన కామెడీతో నవ్వించాడు. #F3Movie Pretty Average 1st Half! Some comedy sequences work well but others seem very forced and unfunny. The production qualities are bad. #F3 — Venky Reviews (@venkyreviews) May 27, 2022 ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉందని, కొన్ని కామెడీ సీన్స్ మినహా..మిగతాదంతా బోరింగ్‌గా ఉందని, ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ బాలేవని చెబుతున్నారు. Disappointed with #F3Movie Waste and Horrible 😞 We wanted to see our tammy in glamorous role but you disappointed us @AnilRavipudi f2 was far better! Confirm flop on way. Don’t give anymore films to anil @SVC_official 🙏 Waited 2 years for this crap😭 #F3 #F3Disaster — sanjay (@TamannaahFansAP) May 27, 2022 Few comedy scenes worked really well, Decent 1st half…Venky on duty 🥁🥁 #F3Movie — ♓️aRRRsha (@harshakaruturi) May 27, 2022 #f3 Review: Average 1st half First 15mins too much Lag and comedy sequences are okay okay in 1st half But 2nd half full out and out Comedy Entertainer Final verdict Above average movie Rating:3/5 #F3 pic.twitter.com/op8JC6gmE7 — UTR (@Uday_TejaReddyj) May 27, 2022 ఫస్టాఫ్ యావరేజ్‌గా ఉంది. మొదటి 15 నిమిషాలు సాగదీతగా అనిపిస్తుంది. కామెడీ ఓకే. కానీ సెకండాఫ్‌లో మాత్రం కామెడీ అదరిపోయింది. మూవీ చాలా బాగుందంటూ మూడు స్టార్లు ఇచ్చాడు ఓ నెటిజన్. #F3 review First half is good with comedy and second half is worst than #Acharya #Rating-2/5 — saikiran (@saikiranbannu) May 26, 2022 #F3 is SUPER HIT! Decent 1st half and extremely entertaining 2nd half with superb climax. Sure shot blockbuster! — Asim (@a01_asim) May 26, 2022 WORST - #f3@VenkyMama & @IAmVarunTej ilanti hero's ni pettukoni ee cringe comedy franchises ela teesthunavu ayya anil 🙏🏻 Asalu em undi ani ee movie lo Storyline ey ledhu cringe comedy overactive dailouges and aa songs aa useless skin shows 🗣️ 2nd Half Ithy oddule 🙏🏻#F3Movie — Bhanu Kanna (@Bhanuprasadh) May 26, 2022 #F3Movie First Half Report :#Positive: Venkatesh , Varun Tej Comedy👌 Tamannaah presence 😍 Mehreen👍 Some very Good comedy scenes, Sunil#Negative: Few comedy scenes didnot worked#F3 > #F2 until First half 💸@VenkyMama @tamannaahspeaks #DilRaju @IAmVarunTej @AnilRavipudi — Thyview (@Thyveiw) May 26, 2022 #F3Movie Review FIRST HALF: A Decent Yet Entertaining One 👍#Venkatesh Shines With His Timing 😂#VarunTej Is Good ✌️#TamannaahBhatia & #MehreenPirzada Are Good As Well 👌 Most of the jokes work 👍#F3MovieReview #F3Review #F2 #F3FunAndFrustration #F3 pic.twitter.com/A4F3TLgLxk — Swayam Kumar (@SwayamD71945083) May 26, 2022 -
సంక్రాంతి బరిలో నుంచి ఎఫ్ 3 ఔట్.. రిలీజ్ డేట్ ఇదే
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించగా... తాజాగా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది చిత్రబృందం. ఆదివారం ఎఫ్3 మూవీ విడుదల తేదీని ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటిస్తూ.. 'బొమ్మ ఎప్పుడు పడితే.. అప్పుడే మనకు నవ్వుల పండగ' అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ🎉 Lets Celebrate the Most Awaited Fun Franchise #F3Movie in cinemas from Feb 25th,2022. Triple Fun Guaranteed😁#F3FromFeb25@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @Mee_Sunil pic.twitter.com/3Fnq7FiyK9 — Anil Ravipudi (@AnilRavipudi) October 24, 2021 -
ఎఫ్3 సెట్లో అల్లు అర్జున్ సందడి.. ఫోటోలు వైరల్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమా రాబోతోంది. ఒరిజినల్ చిత్రంతో పోలిస్తే ఎఫ్ 3 ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందని అంటున్నారు. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. తాజాగా ఎప్3 సెట్‌ని సందర్శించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. చిత్రీకరణ జరుగుతుండగా, సడెన్‌గా సెట్లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. వెంకటేష్, వరుణ్ తేజ్‌తో పాటు పలువురు స్టార్స్‌తో కలిసి కాసేపు ముచ్చటించాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమన్నా, మెహరీన్, సునీల్ ,రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
‘సాక్షి’ అవార్డు నాకో సర్ప్రైజ్ : అనిల్ రావిపూడి
-
‘సాక్షి’ అవార్డు నాకో సర్ప్రైజ్ : అనిల్ రావిపూడి
సాక్షి మీడియా గ్రూప్ అందించిన ‘సాక్షి ఎక్స్‌లెన్స్’ పురస్కారాల్లో భాగంగా మోస్ట్ పాపులర్ డైరెక్టర్(ఎఫ్ 2) అవార్డును అనిల్ రావిపూడి అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఎఫ్ 2’ నా కెరీర్‌కు ఒక గేమ్ చేంజర్లా ఫీల్ అవుతాను. ఈ సినిమా నాకు సర్ప్రైజులు ఇస్తూనే ఉంది. ఇది కూడా (‘సాక్షి’ అవార్డు) ఓ సర్ప్రైజ్. ఈ ప్యాండమిక్ తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలుపెట్టి, చక్కగా పని చేసుకుంటున్నాం. ఇలాంటి టైమ్‌లో ‘సాక్షి’ యాజమాన్యం అవార్డ్స్ ఇవ్వటం అనేది మా అందరికీ ఒక బూస్టింగ్‌లా అనిపించింది. నాకు ఇష్టమైన డైరెక్టర్ త్రివిక్రమ్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నేను చదువుకునే రోజుల్లో నాకు జంధ్యాలగారు, ఈవీవీగారంటే చాలా ఇష్టం. ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడే త్రివిక్రమ్‌గారి సినిమాలు చూసి, ఆయన రాసే స్టైల్, డైలాగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్లం. మా జనరేషన్ డైరెక్టర్స్ అందరికీ వాళ్లు తీసిన సినిమాలు మా మైండ్ మీద ఎంతో కొంత ప్రభావం చూపించే ఉంటాయి. ‘థ్యాంక్యూ సో మచ్ సార్.. ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఈ అవార్డు మీ చేతుల మీదుగా తీసుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. -
హిందీలో రీమేక్ కానున్న సౌత్ చిత్రాలు: హీరోలు ఎవరంటే?
దక్షిణానికి.. ఉత్తరానికి హద్దు చెరిగిపోయింది. సినిమా దగ్గర చేసేసింది. ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ అక్కడ హిట్ అయిన సినిమా ఇక్కడ... ఇప్పుడు రీమేక్ జోరు పెరిగింది. సౌత్‌లో వచ్చిన పలు హిట్ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. మరి.. హిందీ రీమేక్‌లో నటించనున్న కథానాయకుడు కౌన్? ఆ విషయంలోనే బాలీవుడ్ నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. హీరో ఎవరు? అనేది తర్వాత తెలుస్తుంది. రీమేక్ కానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. వెండితెరపై నవ్వులు కురిపించి బాక్సాఫీస్‌ను కాసులతో నింపిన తెలుగు హిట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీ రీమేక్‌కు ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మాతలు. ఈ చిత్రాన్ని దర్శకుడు అనీజ్ బాజ్మీ తెరకెక్కిస్తారు. కానీ ఈ రీమేక్‌లో ఎవరు హీరోలుగా నటిస్తారు? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత రాలేదు. ఒక దశలో వెంకటేష్, అర్జున్ కపూర్ (నిర్మాత బోనీకపూర్ తనయుడు) పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. ‘ట్యాక్సీవాలా’ వంటి హిట్ మూవీ తర్వాత విజయ్ దేవరకొండ కెరీర్లో వచ్చిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా దక్షిణాది భాషల్లో విడుదల కాకముందే హిందీ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు బాలీవుడ్ బడా దర్శక–నిర్మాత కరణ్ జోహార్. ఆ తర్వాత ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్‌లో హీరో ఎవరు? అసలు సెట్స్‌పైకి వెళుతుందా? అనే విషయంపై ఇప్పటివరకు ఓ స్పష్టత అయితే రాలేదు. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రాల్లో 2019లో విడుదలైన ‘మత్తువదలరా’ ఒకటి. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి తనయుడు శ్రీ సింహా ఈ సినిమాతోనే హీరోగా పరిచయం అయ్యారు. రితేష్ రాణా ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రం హిందీ రీమేక్‌కి కూడా రితేషే దర్శకుడు. కానీ ఇందులో హీరో ఎవరు? అనే విషయంపై మాత్రం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదట. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో వచ్చిన ‘బ్రోచేవారెవరురా’ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత నటుడు అజయ్ దేవగన్ దక్కించుకున్నారు. ఈ చిత్రం హిందీ రీమేక్‌లో అభయ్ డియోల్ మెయిన్ లీడ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ దర్శకుడు ఎవరు? సినిమాలోని మిగతా నటీనటుల గురించిన నెక్ట్స్ అప్డేట్ రాలేదు. అటు తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా పుష్కర్ గాయత్రి ద్వయం దర్శకత్వం వహించిన ‘విక్రమ్ వేదా’ చిత్రం బంపర్ హిట్. ఈ సినిమా హిందీ రీమేక్‌ను పుష్కర్ గాయత్రి ద్వయమే డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఇందులో హీరోలుగా ఎవరు నటిస్తారనే విషయంపై మాత్రం ఐదేళ్లుగా కొందరి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇటీవల సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ పేర్లు వినిపించాయి. కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో విజయ్ కాంబినేషన్లో వచ్చిన తమిళ ‘కత్తి’ చిత్రం సూపర్ హిట్. ఈ సినిమా తెలుగు రీమేక్ ‘ఖైదీ నంబరు 150’లో చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ ‘కత్తి’ హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్న దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మాత్రం తమ సినిమాలో హీరో ఎవరో చెప్పలేదు. జగన్ శక్తి హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేస్తారని, ఇందులో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తారనే వార్తలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఇక కార్తీ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్ ‘ఖైదీ’ (2019) సినిమా హిందీ రీమేక్ రైట్స్‌ను అజయ్ దేవగన్ సొంతం చేసుకున్నారు. కానీ ఇందులో అజయే హీరోగా నటిస్తారా? లేక మరో హీరో ఎవరైనా చేస్తారా? అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. మరోవైపు మలయాళ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ది కూడా ఇదే పరిస్థితి. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను నటుడు, నిర్మాత జాన్ అబ్రహాం చేజిక్కించుకున్నారు. మరి.. హిందీ రీమేక్‌లో జాన్ నటిస్తారా? లేదా? అనే విషయంపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇంకా మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ‘అంజామ్ పతిరా’, ‘దృశ్యం 2’, ‘ఫోరెన్సిక్’ చిత్రాలు హిందీలో రీమేక్ కానున్నాయి. కుంచకో బోబన్ నటించిన ‘అంజామ్ పతిరా’ రీమేక్‌ను రిలయన్స్ ఎంటర్టైన్ మెంట్, ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్, ఏపీ ఇంటర్నేషనల్ సంస్థలు నిర్మిస్తాయి. దర్శకులు, నటీనటుల వివరాలు రావాల్సి ఉంది. ‘ఫోరెన్సిక్’ రీమేక్‌కు విశాల్ ఫరియా దర్శకుడు. ఇందులో విక్రాంత్ మెస్సీ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగింది. మోహన్‌లాల్ ‘దృశ్యం 2’ హిందీ రైట్స్‌ను కుమార్ మంగత్ పాతక్ దక్కించుకున్నారు. హిందీ ‘దృశ్యం 1’లో నటించిన అజయ్ దేవగనే ‘దృశ్యం 2’లో కూడా నటిస్తారనే ప్రచారం సాగుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాలే కాదు.. మరికొన్ని సౌత్ హిట్ సినిమాల రీమేక్ హక్కులను బాలీవుడ్ తారలు, దర్శక నిర్మాతలు దక్కించుకున్నారు. అయితే ‘కథానాయకుడు కౌన్’ అనేది మాత్రం నిర్ణయించలేదు. బహుశా కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఈ రీమేక్స్‌లో హీరోలుగా ఎవరు నటిస్తారు? అనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
సూపర్ హిట్ చిత్రాలు.. సీక్వెల్‌కు రెడీ
కొన్ని కథలు భలే ఉంటాయి. ఇంకోసారి వినాలనిపించేలా. ఇంకా ఉంటే బావుండు అనిపించేలా. సినిమాకు సీక్వెల్ పుట్టడానికి ఇదో కారణం. బాక్సాఫీస్ విజయం, కాంబినేషన్లు చేసే మ్యాజిక్ కూడా కొన్నిసార్లు సినిమా సీక్వెల్‌కి కారణం అవుతాయి. కథను కొనసాగించే స్కోప్ ఉంటే.. సీక్వెల్ తీయొచ్చు. అలాంటి కథలు కొన్ని ఉన్నాయి. వాటితో సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. సీక్వెల్ కథేంటో చూద్దాం. బంగార్రాజు ఈజ్ బ్యాక్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో 2016 సంక్రాంతికి బాక్సాఫీస్ హిట్ సాధించారు నాగార్జున. బంగార్రాజుగా ఆయన ఎనర్జీ స్క్రీన్ మీద బాగా పండింది. కల్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కనుంది. ‘బంగార్రాజు’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. బంగార్రాజు నేపథ్యం ఏంటి? అనేది ఈ సినిమా ప్రధానాంశం. మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఈ చిత్రంలో నాగచైతన్య కూడా నటిస్తారు. కేబుల్ ఆపరేషన్ స్టార్ట్ అనుకోకుండా ఎదురైన ఆపదను కేబుల్ ఆపరేటర్ రాంబాబు తెలివిగా తప్పించాను అనుకుంటాడు. కానీ పోలీసులు ఈ కుటుంబాన్ని అనుమానిస్తుంటారు. మరి ఇప్పటికైనా ఆ ఆరోపణల నుంచి బయటపడ్డారా? ‘దృశ్యం 2’ వచ్చేవరకూ ఆగాలి. వెంకటేశ్ హీరోగా 2014లో వచ్చిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమాకు తాజాగా సీక్వెల్ తెరకెక్కుతోంది. కేబుల్ ఆపరేటర్ రాంబాబు పాత్రలో మళ్లీ కనిపించనున్నారు వెంకటేశ్. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేయనున్నారు. మార్చి నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డోస్ డబుల్ మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఢీ’ పెద్ద హిట్ అయింది. చురుకైన బబ్లూగా స్క్రీన్ మీద కామెడీ బాగా పండించారు విష్ణు. ఇప్పుడు దాని డోస్ పెంచనున్నారు. ‘ఢీ’ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఢీ 2 : డబుల్ డోస్’ టైటిల్‌తో ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో నటిస్తూ, నిర్మించనున్నారు విష్ణు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. డబుల్ ఇస్మార్ట్ రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన హై ఎనర్జిటిక్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే సీక్వెల్ ఉంటుందని దర్శకుడు పూరి పేర్కొన్నారు. ఈ సీక్వెల్‌కి ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేశారు. చిత్రం 1.1 ‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు తేజ. కేవలం నలభై లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ హిట్ అయింది. ఉదయ్ కిరణ్, రీమా సేన్ ను ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు తేజ. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్‌గా ‘చిత్రం 1.1’ను ప్రకటించారు తేజ. ఈ సినిమా ద్వారా సుమారు 45 మంది కొత్తవాళ్లను పరిచయం చేయనున్నారని సమాచారం. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. గూఢచారి రిటర్న్స్ ఏజెంట్ గోపీగా అడివి శేష్ చేసిన సాహసాలు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాయి. ఈ యంగ్ గూఢచారిని సూపర్ హిట్ చేశారు. అడివి శేష్ కథను అందించి, హీరోగా నటించిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్ తిక్కా దర్శకుడు. చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుంది. రెండో భాగానికి కూడా కథను అందిస్తున్నారు అడివి శేష్. రాహుల్ పాకాల దర్శకుడు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది. సందడి రెండింతలు సంక్రాంతి అల్లుళ్లుగా ‘ఎఫ్ 2’ చిత్రంలో సందడి చేశారు వెంకటేశ్, వరుణ్ తేజ్. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి థియేటర్స్‌లో నవ్వులు పూయించారు. ఇప్పుడు ఈ సందడిని రెండింతలు చేయనున్నారు. ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ సిద్ధమవుతోంది. మొదటి చిత్రంలో కనిపించిన వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ భార్యాభర్త గొడవ, కాబోయే భార్యాభర్త మధ్య అలకలతో సాగింది. రెండో భాగంలో వెంకీ, వరుణ్ డబ్బు చుట్టూ తిరిగే పాత్రలు చేస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మాత. ఆగస్ట్ 27న ‘ఎఫ్ 3’ రిలీజ్ కానుంది. రెండో కేసు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ విక్రమ్ గత ఏడాది ఓ కేసుని సక్సెస్‌ఫుల్‌గా ఛేదించారు. ఇప్పుడు రెండో కేస్ పని పట్టడానికి రెడీ అయ్యారు. హీరో నాని నిర్మాణంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ‘హిట్: ది ఫస్ట్ కేస్’. శైలేష్ కొలను దర్శకుడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్ : ది సెకండ్ కేస్’ రానుందని చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇంకొన్ని సీక్వెల్స్ కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘అ!, కల్కి, జాంబీ రెడ్డి’ చిత్రాలకు కూడా సీక్వెల్స్ ఉండొచ్చు. సీక్వెల్ చేసే ఉద్దేశం ఉన్నట్లు ఆయనే స్వయంగా పేర్కొన్నారు. చదవండి : దృశ్యం 2: అజయ్ కూడా తప్పించుకుంటాడు ‘అలా నటించడం ఆనందంగా ఉంది’ -
ఇవన్నీ సిద్ధం.. మీరు సిద్ధమా?
థియేటర్స్‌లో సినిమాలు లేక 2020 వెలవెలబోయింది. 2021 కొత్త చిత్రాల రిలీజులతో జోరుగా హుషారుగా ఉండబోతోంది. గత ఏడాది మిస్సయిన మజాని రెండింతలు ఈ ఏడాది ఇవ్వబోతోంది. స్టార్స్ అందరూ తమ చిత్రాలను థియేటర్స్‌కు తీసుకొచ్చే డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల తేదీలు వచ్చాయి. తాజాగా మరిన్ని అప్ డేట్స్ వచ్చాయి. వేసవి నుంచి దసరా వరకూ ఒక్కో డేట్‌ను ఒక్కో సినిమా తీసుకుంది. ఆ విశేషాలు. ట్రిపుల్ ఫన్ ‘ఎఫ్2’తో డబుల్ ఫన్ ఇచ్చాం. ఇప్పుడు ట్రిపుల్ ఫన్ ఇవ్వడానికి రెడీ అయ్యాం అంటోంది ‘ఎఫ్ 3’ చిత్రబృందం. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ 3’. ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రానికి ఇది సీక్వెల్. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ సీక్వెల్లో కో బ్రదర్స్ వెంకీ, వరుణ్ డబ్బు సంపాదించడం మీద ఎక్కవ దృష్టి పెడతారట. ఈ సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పుష్పరాజ్ వేట త్వరలో.. అల్లు అర్జున్, సుకుమార్‌ది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ గతంలో ‘ఆర్య, ఆర్య 2’ సినిమాలు చేశారు. తాజాగా ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నారు. ‘పుష్పరాజ్ వేట త్వరలోనే ఆరంభం’ అంటూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కూత మొదలు ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్. ఏప్రిల్ 2నుంచి థియేటర్స్‌లో కూత మొదలవుతుందట. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘గోపీచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది. కపటధారి రెడీ? క్రైమ్‌ని పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీస్ సుమంత్ సిద్ధమయ్యారు. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కపటధారి’. ఇందులో సుమంత్ ట్రాఫిక్ పోలీస్‌గా కనిపించనున్నారు. నాజర్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. కన్నడ చిత్రం ‘కవులుదారి’కి ఇది తెలుగు రీమేక్. ఫిబ్రవరి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. గని రెడీ బాక్సర్ గని తన పంచ్ ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నారు. జూలైలో తన పంచ్ పవర్ చూపించనున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం ‘గని’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కథానాయిక. ఉపేంద్ర, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రాధాకృష్ణ ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా టి.డి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ పార్వతి ఓ కీలక పాత్రలో నటించారు. పుష్పాల సాగరిక నిర్మించారు. నిర్మల్ బొమ్మలు తయారు చేసే కళాకారుల సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కామ్రేడ్ రవన్న వస్తున్నాడు ప్రజల సమస్యలపై పోరాడటానికి కామ్రేడ్ రవన్న అయ్యారు రానా దగ్గుబాటి. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీరావ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నివేదా పేతురాజ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు రానా. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. -
ఎఫ్3 రిలీజ్ కూడా వచ్చేసింది.. ఎప్పుడంటే
విక్టరీ వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్‌గా రూపొందుతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ‘ఎఫ్2’ లో భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో గొడవలు జరిగితే, ‘ఎఫ్ 3’లో డబ్బు వల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జరిగాయనేది చూపించబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్లోనూ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేశాడు దర్శకుడు. తాజాగా ఎఫ్ 3 విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. చదవండి: వరుణ్‌తేజ్ రింగులోకి దిగేది అప్పుడే! గత రెండు మూడు రోజుల నుంచి ముఖ్యంగా ఈరోజు(గురువారం) టాలీవుడ్లో బోలేడు సినిమాలు వరుస పెట్టి రిలీజ్ డేట్లను అనౌన్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎఫ్3 సినిమా యూనిట్ కూడా తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించింది. ఈ సినిమా ఆగష్టు 27న థియేటర్లలో నవ్వులు పూయించనుందని పేర్కొంది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. వీలైనంత త్వరలో సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు వెళ్లాలని ఆలోచిస్తున్నారు. కాగా ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి రామ్ చరణతో సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: అమెజాన్ చేతికి 'ఎఫ్ 3' డిజిటల్ రైట్స్ -
‘ఎఫ్ 3’లో మూడో హీరో.. దర్శకుడి క్లారిటీ
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న చిత్రమిది. ‘ఎఫ్2’ లో భార్యల మనస్తత్వం వల్ల కుటుంబంలో గొడవలు జరిగితే, ‘ఎఫ్ 3’లో డబ్బు వల్ల కుటుంబాల్లో ఎలాంటి మార్పులు జరిగాయనేది సీక్వెల్లో చూపించబోతున్నారు. కాన్సెప్ట్ పోస్టర్లోనూ ఈ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా చెప్పేశాడు దర్శకుడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నట్లుగా కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో మహేశ్ బాబు లేదా రవితేజ నటించబోతున్నారని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత గోపీచంద్ నటిస్తున్నారని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఇందులో మెగా హీరో సాయితేజ్ కూడా నటిస్తున్నాడని రూమర్లు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. ఎఫ్ 3 సినిమాలో మూడో హీరోగా ఎవరు చేయడం లేదని.. అసలు తనకు ఆ మూడో హీరో అన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చాడు. ఇక ఎఫ్ 2 లాగే ఎఫ్ 3 కూడా ఇద్దరు హీరోలతో మాత్రమే చిత్రీకరిస్తానని తెలిపాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2021 వేసవికి ప్రేక్షకుల మందుకు రాబోతుంది. -
హ్యాపీ బర్త్‌డే ‘మెగా ప్రిన్స్’.. తన ప్రత్యేకత ఇదే
మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్లో నటిస్తూ.. కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో వరుణ్ తేజ్. మొదట్లో కథల విషయంలో తడబడ్డా.. ఆ తర్వాత మూస కథలతో వచ్చే సినిమాలను పక్కన పెట్టిన వరుణ్ కొత్తరకం కథలను ఎంచుకోవడం చేయడం మొదలు పెట్టాడు. మెగా హీరోలంతా పక్కా కమర్షియల్ సినిమాలను ఎంచుకుంటే.. ఈ మెగా ప్రిన్స్ మాత్రం అన్ని రకాల మూవీలు చేస్తూ టాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పకీ.. కష్టపడి పైకొస్తున్న హీరో వరణ్ తేజ్. చేసింది తొమ్మిది సినిమాలే అయినా.. ప్రతీది ఓ ప్రయోగమే. నేడు(జనవరి 19) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన వరణ్ సినీ ప్రస్థానం మీకోసం.. ఎంట్రీయే ఓ ప్రయోగం మాములుగా హీరోలు ఎక్కువగా మాస్ సినిమాతోనే ఎంట్రీ ఇస్తారు. ఇక మెగా ఫ్యామిలీ హీరో అంటే.. పక్కా మాస్ సినిమా రావాల్సిందే. కానీ వరుణ్ తేజ్ మాత్రం అలా ఎంట్రీ ఇవ్వలేదు. కుటుంబా కథా చిత్రం ‘ముకుందా’తో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలై ఆకట్టుకోలేకపోయింది. కానీ, నటుడిగా అతడికి మంచి పేరును తెచ్చింది. ‘కంచె’తో గుర్తింపు తొలి సినిమా ‘ముకుంద’ మెగా అభిమానులను కాస్త నిరుత్సాహపర్చినప్పటికీ ఈ మెగా హీరో మాస్ సినిమా జోలికి పోలేదు. రెండు సినిమా కూడా వైవిద్యమైన కథను ఎంచుకున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ వరణ్కి మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో ఆర్మీ మ్యాన్‌గా, ప్రేమికుడిగా వరుణ్ వైవిధ్యమైన నటనను కనబరిచాడు. ఈ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. మూడో సినిమాతో మాస్ జోన్లోకి అడుగు తొలి రెండు చిత్రాల్లో క్లాసికల్ లుక్‌లో కనిపించిన వరుణ్.. మూడో చిత్రంలో మాత్రం రఫ్‌గా కనిపించాడు. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’ చేసి మాస్ జోన్లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినా వరుణ్‌కు మాస్ ఇమేజ్ను తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘మిస్టర్’ డిజాస్టర్ కావడంతో వరుణ్ కాస్త ఇబ్బంది పడ్డారు. ‘ఫిదా’తో లవర్ బాయ్ ఇమేజ్ వరుణ్ తేజ్ సినీ కెరీర్‌ని మలుపు తిప్పిన చిత్రం ‘ఫిదా’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. వరుణ్ నటనకు ఫ్యాన్స్ ‘ఫిదా’ అయ్యారు. లవర్ బాయ్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరణ్ మార్కెట్ కూడా పెరిగిపోయింది. ‘తొలి ప్రేమ’తో మరో హిట్ ఇక ఫిదా ఇచ్చిన జోష్‌లో వరుణ్ ‘తొలి ప్రేమ’ సినిమా చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘అంతరిక్షం’తో మరో ప్రయోగం చేసి విఫల మయ్యాడు. ‘ఘాజీ’ దర్శకుడు సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ స్పేస్ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ వ్యోమగామిగా కనిపించారు.. మెప్పించారు. ఎఫ్2 తో ఫన్ జోన్లోకి తొలి నుంచి సోలోగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ వచ్చిన వరుణ్... తొలిసారి విక్టరీ వెంకటేశ్‌తో కలిసి ఎఫ్2 అనే మల్టీస్టారర్ సినిమా చేశాడు. ఇది వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అంతేకాదు, వరుణ్ తేజ్‌లోని కామెడీ కోణం కూడా ప్రేక్షకులను పరిచయం చేసింది. ‘గద్దలకొండ గణేష్’గా భయపెట్టిన వరుణ్ హీరోగా పాజిటివ్ పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్న వరుణ్.. తొలిసారి తనలోని రౌడీయిజాన్ని కూడా తెరపై చూపించాడు. 2019లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’తో ఫ్యాన్స్‌ను భయపెట్టాడు వరుణ్. ‘జిగర్తాండ’కు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో వరుణ్ ఒదిగిపోయాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో రౌడీ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు వరుణ్. ‘గని’తో బాక్సర్‌గా ఇక తాజాగా మరో ప్రయోగానికి సిద్దమయ్యాడు వరుణ్. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ టైటిల్, మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచాయి. -
అమెజాన్ చేతికి 'ఎఫ్ 3' డిజిటల్ రైట్స్
టాలీవుడ్ లో ఒకటి మూవీ హిట్ అయితే గొప్పగా చెప్పుకుంటారు.. అలాంటిది ఆ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రాలు వరుసగా ఐదు హిట్ అయ్యాయి. దాంతో ఆ డైరెక్టర్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు అతను తీయబోయే కొత్త సినిమాలకు రెమ్యూనరేషన్ ని కూడా పెంచాడట. ఆయన మరెవరో కాదండి దర్శకుడు అనీల్ రావిపూడి. ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడి ఎఫ్ 2 యొక్క సీక్వెల్ తీసేపనిలో పడ్డారు. ఇటీవలే ఈ చిత్రం షూట్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబందించిన స్టార్ కాస్ట్ వెంకటేష్ నుంచి అనిల్ రావిపూడి వరకు అందరూ తమ రెమ్యూనరేషన్ పెంచేశారు. దీంతో ఈ చిత్ర బడ్జెట్ రూ.70 కోట్లకుపైగా చేరుకున్నట్లు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా వస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మూడింతల వినోదంతో రాబోతున్న 'ఎఫ్ 3' పై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం యొక్క నాన్-థియేట్రికల్ ఒప్పందాలను మేకర్స్ మూసివేస్తున్నట్లు తెలుస్తుంది. "ఎఫ్ 3" పై భారీ అంచనాలు ఉండటంతో డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ రికార్డ్ ధర పలుకుతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో 'ఎఫ్ 3' స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం బహుళ భాషలలో విడుదల కాకపోయినప్పటికీ, డీజిటల్ హక్కులు అన్ని భాషలకు అమ్ముడైయినట్లు సమాచారం . ఈ చిత్రాన్ని 2021 దసర విడుదల చేయాలనీ చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. బొమన్ ఇరానీ - సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
నవ్వులకు క్లాప్
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ‘ఎఫ్3’ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్ ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ‘దిల్’ రాజు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మా ‘ఎఫ్2’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెలిసిందే. అన్నీ కుదిరితే ‘ఎఫ్3’ చిత్రాన్ని రూపొందిస్తామని అప్పుడే చెప్పాం. అప్పటినుండి దర్శకుడు అనిల్ ఈ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. డిసెంబర్ 23న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం’’ అన్నారు. అనిల్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్2’కి మరింత వినోదాన్ని జోడించి ‘ఎఫ్3’ని రూపొందిస్తున్నాం. అద్భుతమైన కథ కుదిరింది. మా ఆర్టిస్టులు మరిన్ని నవ్వుల్లో ప్రేక్షకులను ముంచెత్తుతారు. రాజుగారి బ్యానర్లో మరోసారి వర్క్ చేయటం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సహనిర్మాత: హర్షిత్ రెడ్డి. -
హైదరాబాద్‌లో ‘ఎఫ్ 3’ పూజ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: వెంకటేష్ , వరుణ్ తేజ్‌లు హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో గతేడాది వచ్చిన ఎఫ్2(ఫన్ అండ్ ఫ్రస్టేషన్) మంచి విజయం సాధించింది. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లు నటించారు. కామెడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద బ్లక్‌బస్టర్ హీట్‌గా నిలిచింది. దీంతో ఇదే కాంబినేషన్లో ‘ఎఫ్ 2’కు సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అదే దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభ పూజ కార్యక్రమం గురువారం హైదబాద్‌లో జరిగింది. హీరోయిన్ తమన్నా, హీరో వరణ్ తేజ్‌ల ఓ సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. ఈ నెల 23 నుంచి ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎఫ్ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు ‘ఎఫ్ 3’ని కూడా నిర్మించనున్నారు. -
వినోదం మూడింతలు
కోబ్రా అంటే పాము అని మనకు తెలుసు. అయితే ‘ఎఫ్2’లో కోబ్రా అంటే కో–బ్రదర్స్ (తోడల్లుళ్లు). వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా ఈ సినిమాలో చేసిన కామెడీ మామూలుగా ఉండదు. వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కి జోడీగా మెహరీన్ నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు వినోదం మూడింతలు అంటూ వెంకీ బర్త్‌డే సందర్భంగా ఆదివారం ‘ఎఫ్ 3’ని ప్రకటించారు. తొలి భాగంలో హీరోలు భార్యల వల్ల ఫ్రస్ట్రేట్ అవుతారు. సీక్వెల్లో ఇద్దరూ డబ్బు కారణంగా ఇబ్బందుల పాలవుతుంటారు. ఆ విషయాన్ని సూచిస్తూ, వెంకీ, వరుణ్ ట్రాలీలో డబ్బుల కట్టలు పట్టుకుపోతున్న పోస్టర్ని విడుదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే రూపొందనున్న ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌లే కథానాయికలు. అదనంగా మరో ముగ్గురు నాయికలు ఉంటారని సమాచారం. ఇద్దరు వెంకీ సరసన, ఇద్దరు వరుణ్ తేజ్ సరసన నటిస్తారట. మరో హీరో అతిథి పాత్రలో కనిపిస్తారని వినికిడి. బహుశా ఆ హీరోకి జోడీగా ఐదో హీరోయిన్ ఉంటుందేమో! -
దిల్‌రాజుకు షాకిచ్చిన వరుణ్, వెంకీ..!
కరోనా కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ మళ్లీ షూరు అవుతున్నాయి. లాక్‌డౌన్‌తో ఎక్కడిక్కకడ మూతబడ్డ కెమెరాలు క్లిక్క్మనిపించేందుకు సిద్ధమయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. కొత్త కథలు, కొత్త సినిమాల కబుర్లలతో ఇండస్ట్రీలో మునుపటి వాతావరణం కనిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చుని కథలు సిద్ధం చేసుకున్న దర్శకులు వాటిని పట్టాలెక్కించేందుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక హీరోలు సైతం కొత్త కథలపై దృష్టిసారించారు. సుదీర్ఘ విరామం అనంతరం రానున్న సినిమాలు కావడంతో ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. ఇక అసలు విషయాని కొస్తే టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలపై మరింత దూకుడు పెంచాడు. కెరీర్లో ప్రారంభంలో వడివడిగా అడుగులేసిన యంగ్ హీరో.. ఫిదా, గద్దలకొండ గణేష్, ఎఫ్2 విజయాలతో ఓ రేంజ్‌లోకి వెళ్లిపోయాడు. వరుస సినిమాల విజయంతో రెమ్యునరేషన్‌ను ఒక్కసారిగా పెంచేశాడు. స్టార్ హీరోలతో పోల్చుకుంటే తానేమీ తక్కవ కాదంటూ నిర్మాతల ముందు భారీ మొత్తాన్నే డిమాండ్ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 35 కోట్లతో దిల్ రాజు నిర్మించిన ఈ కామెడీ మూవీ దాదాపు 85 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే ఎఫ్2 ఇచ్చిన విజయంతో దిల్‌కుష్‌గా ఉన్న దర్శక, నిర్మాతలు ఎఫ్3 మూవీని పట్టాలెక్కించాలని నిర్ణయించారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి కథను కూడా సిద్ధం చేశారు. అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చి పడింది. ఎఫ్3కి తనకు పారితోషికతం మరింత పెంచాలని హీరో వరుణ్ తేజ్ నిర్మాతకు ముడిపెట్టాడు. దాదాపు 12 కోట్లు వరకు ఇవ్వాలని పట్టుపట్టినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. మరోవైపు వెంకటేష్ సైతం తనకు 13 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు చిత్ర పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు వరుస హిట్స్‌తో స్టార్ దర్శకుల సరసన చేరిన అనిల్ సైతం భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే భారీ బడ్జెట్‌తో ఎఫ్3ని తెరక్కించాలనుకున్న దిల్‌రాజ్‌కు ఇప్పుడు ఇద్దరు హీరోలు ఊహించని పారితోషికం డిమాండ్ చేయడం తలనొప్పిగా మారింది. దర్శకుడు ఇప్పటికే కథ సిద్ధం చేయడం. చిత్రీకరణకు కూడా ముహూర్తం ఖరారు కావడంతో ఇక చేసేదేమీ లేక వారి డిమాండ్స్‌కు నిర్మాత ఒప్పుకున్నట్లు సమాచారం. -
నవ్వుల వ్యాక్సిన్ సిద్ధం చేస్తాం
‘‘మన ఎదుగుదలను పోల్చిచూసుకోవడానికి మన పుట్టినరోజులు చాలా ఉపయోగపడతాయి. అందుకే పుట్టిన రోజుకు తప్పనిసరిగా ప్రాముఖ్యత ఇవ్వాలి’’ అన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘పటాస్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు’ సినిమాలతో మంచి విజయాలు అందుకుని, ఫామ్‌లో ఉన్నారాయన. నేడు తన పుట్టిన రోజు సందర్భంగా అనిల్ రావిపూడి పంచుకున్న విశేషాలు. ► దర్శకుడిగా నా ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది. నాతో సినిమా చేసిన స్టార్స్ అందరూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చారు.. ప్రతిసారి వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాను. ఈ ప్రయాణంలో ‘దిల్’ రాజుగారి సహాయం కూడా మరువలేనిది. ► నాకు సినిమాయే ఎనర్జీ. సినిమా అంటే నాకు స్వర్గం.. స్వర్గంలో ఉన్నవారెవరైనా నీరసంగా ఉంటారా? అందుకే ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉంటాను. అలానే ఈ ఎడాది నాకు అన్ని రకాలుగా గుర్తుండే సంవత్సరం. ఈ ఏడాది మా కుటుంబం పెద్దది అయింది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మాకు బాబు (అజయ్ సుర్యాంశ్) పుట్టాడు. సినిమా బ్లాక్బాస్టర్ హిట్ అయింది. ► ‘ఎఫ్ 2’ అనేది దర్శకుడిగా నన్ను మార్చేసిన సినిమా. యాక్షన్ సబ్జెక్ట్స్ చేస్తున్న నాకు పూర్తి ఫ్యామిలీ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో ‘ఎఫ్2’ సినిమా చేశా. 2019 సంక్రాంతిని నవ్వుల మయం చేసేసింది ఆ సినిమా. ‘దిల్’ రాజుగారి బ్యానర్లో వచ్చిన సినిమాలన్నింట్లో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమా అదే అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ను సిద్ధం చేసే పనిలో ఉన్నాను. ‘ఎఫ్ 3’లో మరింత ఫన్ ఉంటుంది. డిసెంబర్ 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తాం. ప్రస్తుతం అందరూ కరోనాకు మందు కనుక్కొనే పనిలో ఉన్నారు. ఈలోపల మేము ‘ఎఫ్ 3’తో నవ్వుల వ్యాక్సిన్‌ను సిద్ధం చేస్తాం. -
డోస్ డబుల్ అట!
‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (ఎఫ్ 2) అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు పంచిన నవ్వులు అన్నీ ఇన్నీ కావు. దర్శకుడు అనిల్ రావిపూడి సృష్టించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ‘దిల్’ రాజు నిర్మించారు. దీనికి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3’ కథను సిద్ధం చేశారు అనిల్ రావిపూడి. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ‘ఎఫ్2’లో కనిపించిన స్టార్సే ఈ సీక్వెల్లోనూ కనిపిస్తారు. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే డేట్ ఫిక్సయిందని సమాచారం. డిసెంబర్ 14 నుంచి ‘ఎఫ్ 3’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఈ సీక్వెల్లో ఫన్, ఫ్రస్ట్రేషన్ రెండింతలు ఉంటుందట. కామెడీ డోస్ డబుల్ ఉంటుందని టాక్. వచ్చే ఏడాది సమ్మర్‌కి థియేటర్స్‌లోకి ‘ఎఫ్ 3’ను తీసుకురావాలన్నది చిత్రబృందం ప్లాన్. -
ఎఫ్2 చిత్రానికి ఇండియన్ పనోరమ అవార్డు
వెంకటేశ్, వరుణ్‌తేజ్, తమన్నా, మెహరీన్‌లు నటించిన చిత్రం ‘ఎఫ్–2’. గతేడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. 2019వ సంవత్సరానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియావారు ఎంపిక చేసిన వివిధ భాషల్లోని 26 సినిమాలకు కేంద్ర సమాచార శాఖ అవార్డులను ప్రకటించింది. ఇండియన్ పనోరమ అవార్డుకు ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఎఫ్–2’ సినిమాను ఎంపిక చేసింది. ‘‘ఎంటైర్ యూనిట్‌కు అభినందనలు’’ అన్నారు చిత్రనిర్మాత ‘దిల్ రాజు’. ‘‘ఎఫ్2’ సినిమాతో పాటు దర్శకునిగా నాకు అవార్డు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. వెంకటేశ్, వరుణ్‌తో పాటు ‘ఎఫ్2’కి పని చేసిన అందరికీ’ థ్యాంక్స్’’ అన్నారు అనిల్ రావిపూడి. -
ఎఫ్2' సినిమాకు కేంద్ర అవార్డు
సాక్షి, న్యూఢిల్లీ : 2019కి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాకు కేంద్ర అవార్డు లభించింది. కాగా గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు. చదవండి: ఆస్కార్స్‌కు ప్రియాంక? -
ఐఎఫ్ఎఫ్ఐకు ఎఫ్2
ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులకు కితకితలు పెట్టి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టిన చిత్రం ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్’ రాజు నిర్మాత. తమన్నా, మెహరీన్ కథానాయికలు. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన గౌరవం పొందింది. ఈ ఏడాది గోవాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో ఇండియన్ పనోరమా విభాగంలో ‘ఎఫ్ 2’ చిత్రం ప్రదర్శితం కానుంది. అక్కడ ప్రదర్శించబోయే 250 సినిమాల్లో ‘ఎఫ్ 2’ ఒక్కటే తెలుగు సినిమా కావడం విశేషం. ‘‘ఈ గౌరవం పొందడం చాలా గర్వంగా ఉంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ ఏడాది ఐఎఫ్ఎఫ్ఐకు గోల్డెన్ జూబ్లీ ఇయర్. నవంబర్ 20 నుంచి 28 వరకూ ఈ చిత్రోత్సవాలు జరుగుతాయి. -
‘ఎఫ్2’కు అరుదైన గౌరవం
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఎఫ్2 (ఫన్ అండ్ ప్రస్ట్రేషన్)’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజ్ నిర్మించారు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే సన్నివేశాల నుంచే కామెడీ జనరేట్ చేసిన అనిల్.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేలా చేశాడు. తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ పనోరమ’లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ సినిమా ఎంపికైంది. 50వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ఉత్సవాలు నవంబర్‌లో గోవాలో జరగనున్నాయి. ఈ ఫెస్టివల్లో ఎఫ్2 చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఎఫ్2 చిత్రం ఐఎఫ్ఎఫ్ఐ-2019 ప్రదర్శనకు ఎంపిక కావడంపై దిల్ రాజ్, అనిల్ రావిపూడి సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం పనిచేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, ప్రకాశ్‌రాజ్, ప్రియదర్శి, రఘుబాబు ఇతర ప్రధాన పాత్రలో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. -
ఫన్ చేస్తారా?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన తెలుగు చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా రూపొందిన ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ సినిమాను బోనీకపూర్‌తో కలిసి ‘దిల్’ రాజు హిందీలో రీమేక్ చేయనున్నారు. హిందీ చిత్రంలో వెంకటేశ్, అర్జున్ కపూర్ హీరోలుగా నటించబోతున్నారని బాలీవుడ్ టాక్. తెలుగు చిత్రాలు ‘పెళ్లాం ఊరెళితే, రెడీ’లను నో ఎంట్రీ, రెడీగా హిందీలో రీమేక్ చేసిన అనీస్ బాజ్మీ హిందీ ‘ఎఫ్ 2’ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఇక బోనీకపూర్ తనయుడే అర్జున్ కపూర్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి.. వెంకీ, అర్జున్ కాంబినేషన్ నిజమేనా? వేచి చూద్దాం. -
బాలీవుడ్‌కి ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్
ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘దిల్’ రాజు ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ప్రస్ట్రేషన్) ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వంద కోట్లు వసూలు చేసిన ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి హిందీలో రీమేక్ చేయనున్నారు ‘దిల్’ రాజు. తెలుగులో విజయవంతమైన ‘రెడీ’ చిత్రాన్ని సల్మాన్‌ఖాన్, ఆసిన్ జంటగా అదే పేరుతో, ‘పెళ్లాం ఊరెళితే’ చిత్రాన్ని ‘నో ఎంట్రీ’ గా హిందీలో తెరకెక్కించి, విజయం సాధించిన అనీస్ బజ్మీ ‘ఎఫ్ 2’కి దర్శకత్వం వహిస్తారు. నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ∙‘దిల్’ రాజు ∙బోనీకపూర్ -
అది వారి దురదృష్టమే!
సినిమా: నటి తమన్నాను మరోసారి అదృష్ణం వెంటాడుతోందనే చెప్పాలి. సినిమాలో ప్రతిభ ఉన్నా, అదృష్టం చాలా అవసరం. ఆ మధ్య వరుసగా అపజయాలు ఎదురవడంతో ఈ మిల్కీబ్యూటీపై ఐరెన్‌లెగ్ నటి అని ముద్రవేసేశారు. తెలుగులో ఎఫ్–2 విడుదల ముందు వరకూ తమన్నా అవకాశాల విషయంలో ఎదురీదింది. కోలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. ఇక్కడ శింబుతో నటించి అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర ఫ్లాప్ తమన్నాకు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ తరువాత నటించిన కన్నె కలైమానే చిత్ర రిజల్ట్ ఈ బ్యూటీకి ప్లస్ అవలేదు. అయితే ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఇతర నటీమణులకు రావలసిన అవకాశాలను తమన్నా తన్నుకుపోతోందనే ప్రచారం వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రభుదేవాతో నటించిన దేవి–2 చిత్రం నిర్మాణకార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు మూడు కొత్త చిత్రాలు తమన్నా కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో రెండు విశాల్‌తో రొమాన్స్ చేసేవి కావడం విశేషం. అందులో సుందర్.సీ దర్శకత్వంలో నటించనున్న చిత్రం షూటింగ్ త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది.ఈ చిత్రం కోసం మిల్కీబ్యూటీ ఆ చిత్ర యూనిట్లో కలిసి టర్కీ నగరానికి పయనం అవుతోంది. అవును దర్శకుడు సుందర్.సీ ఈ చిత్ర షూటింగ్‌ను అధిక భాగం అక్కడే చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ఈ చిత్రం కోసం తమన్నా ఏకంగా 50 రోజులు కాల్షీట్స్ కేటాయించిందని సమాచారం. అదే కణ్గళ్ చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రోహిత్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించబోతోంది. ఇది హర్రర్ ఇతివృత్తంలో తెరకెక్కనున్న చిత్రం. ఇలా తమన్నాకు మరోసారి అదృష్టం తలుపు తట్టడంతో ఇతర హీరోయిన్ల అవకాశాలు తమన్నా రాబట్టకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా హీరోయిన్ల మధ్య పోటీ, పోరు జరుగుతోందని, ఒకరి అవకాశాలను మరొకరు ఎగరేసుకుపోవడం సినిమాల్లో సహజం అనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి స్పందించిన తమన్నా ఎవరి అవకాశాలు వారి చేతిలోనే ఉంటాయని అంది. ఒకరి అవకాశాలను మరొకరు తన్నుకు పోయే పరిస్థితి ఇక్కడ లేదని అంది. అదే విధంగా హీరోయిన్ల మధ్య స్నేహం ఉండదు, అంతా పోటీ, పోరేననడం సరికాదు అని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే ఇద్దరు హీరోయిన్లు మధ్య స్నేహాన్ని అదేదో ప్రపంచంలోనే జరగని విషయంగా చూస్తున్నారని అంది. సినిమారంగంలో దర్శకులు, హీరోయిన్లు, కెమెరామెన్లు ఇలా చాలా మంది స్నేహంగా మెలుగుతుంటారని, అయితే వారి మధ్య వృత్తి రీత్యా పోటీ ఉంటుందని చెప్పింది. అయితే ప్రతిభపై నమ్మకం లేని వారికే పోటీ, అసూయ, భయం లాంటివి ఉంటాయని అంది. ఇక్కడు ఎందరు హీరోయిన్లు ఉన్నా వారి ప్రతిభకు తగ్గట్టు అవకాశాలు లభిస్తాయని, ఒక వేళ ప్రతిభ ఉన్నా అవకాశాలు రాకపోతే అది వారి దురదృష్టం అని తమన్నా పేర్కొంది. -
అనిల్ సినిమాలు చూస్తే జిమ్‌కు వెళ్లక్కర్లేదు
‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇలా షీల్డ్స్ ఇవ్వడం చూసి చాలా ఏళ్లయ్యింది. ‘దిల్’ రాజు మంచి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఇక అనిల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు కూడా వెళ్లనక్కర్లేదు’’ అని దర్శకులు కె. రాఘవేంద్రరావు అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘ఎఫ్ 2’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్–లక్ష్మణ్ నిర్మించిన ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా, రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నా సినిమాల్లో ‘పెళ్ళిసందడి, గంగోత్రి’ సినిమాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. వెంకటేష్ గత సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువగా నవ్వించాడు, వరుణ్ కూడా మంచి నటనను కనపరిచాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోవడానికి ముఖ్య కారణం అనిల్. మా హీరోలిద్దరూ బిజీగా ఉండటం, అనిల్ తన నెక్ట్స్ మూవీకి, అలాగే మేం నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఆల్రెడీ బిజీగా ఉన్నా... ఈ వేడుక చేయడానికి నిర్ణయించుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఎక్కడా గ్యాప్ లేకుండా కామెడీతో అనిల్ ఇరగొట్టేశాడు. టాలెంట్‌ను వెతికి పట్టుకుని, ఎంకరేజ్ చేయడం ‘దిల్’ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. నవ్విస్తే చాలు.. ప్రేక్షకుడు లాజిక్, మేజిక్ల గురించి ఆలోచించడు’’ అన్నారు యస్వీ కృష్ణారెడ్డి. ‘‘ఈ సినిమాకు సంబంధించి ఈ షీల్డుని చూస్తే .. దీనికి సంబంధించిన జ్ఞాపకం మైండ్‌లో రీల్లా తిరుగుతుంది. అందుకనే ఈ ఫంక్షన్ చేశాం. 107 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు.. 130 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసిన సినిమా ఇది. ‘నువ్వునాకు నచ్చావ్’ లాంటి ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాను వెంకటేష్‌గారు చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనకు మరోసారి తెలిసింది. వరుణ్‌తేజ్ కామెడీజోనర్లో చేసిన తొలి చిత్రమిది. అలాగే తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్‌గారు, ఇలా ప్రతి ఆర్టిస్ట్‌కు, సాంకేతిక నిపుణలకు థాంక్స్.రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు కుటుంబతో సమానం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నా 10వ సినిమా బెస్ట్ మూవీగా నిలవడం, సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం పట్ల çసంతోషంగా ఉన్నాను’’ అన్నారు మెహరీన్. -
వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేసిన ‘ఎఫ్2’
ఈ ఏడాది సంక్రాంతి బరిలోకి దిగి.. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది ఎఫ్2 చిత్రం. వినయ విధేయ రామ, కథానాయకుడులు దారుణంగా బెడిసికొట్టడంతో..ఎఫ్2 దూసుకుపోయింది. కలెక్షన్లలో ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో కూడా వచ్చేసింది. అయినా కొన్ని చోట్ల ఈ మూవీ ఇంకా బాగానే ఆడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా 140కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. Enjoy this weekend with #F2 😀⚡️#FunAndFrustration #VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official@ThisisDSP Directed by @AnilRavipudi pic.twitter.com/7UogyHk5aA — Sri Venkateswara Creations (@SVC_official) February 23, 2019 -
‘మరో ఐదేళ్ల వరకూ పెళ్లి ఊసే లేదు’
బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్‌లు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. మరి మీ పెళ్లప్పుడు అంటే నా వయసింకా 29దే.. అప్పుడే పెళ్లేంటే అంటుంది తమన్నా. తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్న ఈ బ్యూటీ హిందీలోనూ అడపాదడపా సినిమాలు చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ చూసి చాలా కాలమైంది తమన్నా. ఒకానొక దశలో ఆమె పని అయిపోయింది. ఇక మూటాముల్లె సర్దుకోవలసిందే అనే కామెంట్లు కూడా బాగానే వినిపించాయి. వీటన్నింటికి గట్టిగానే బదులిచ్చి నటిగా మళ్లీ పుంజుకుంది తమన్నా. తెలుగులో వెంకటేశ్‌తో నటించిన ఎఫ్ – 2 చిత్రం సంక్రాంతి బరిలో విజేతగా నిలిచి తమన్నాకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇదేకాక చిరంజీవి తదుపరి చిత్రంలో కూడా తమన్నా నటించబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే తమిళంలో ప్రభుదేవాతో దేవి – 2 చిత్రంలో నటిస్తోంది తమన్నా. ఉదయనిధిస్టాలిన్‌తో జతకట్టిన ‘కన్నె కలైమానే’ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 22న విడుదల కావడానికి సిద్ధం అవుతోంది. తాజాగా నటుడు విశాల్‌తో మరోసారి పనిచేసే అవకాశం వరించిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఫెయిల్యూర్స్ ఎక్కువైన సమయంలో పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అయిపోదామని నిర్ణయానికి వచ్చిన ఈ ఉత్తరాది బ్యూటీ.. మళ్లీ నటిగా కెరీర్ రైజ్ అవడంతో పెళ్లి ఆలోచనను పక్కన పెట్టిందట. ఇప్పుడు పెళ్లేప్పుడంటే నా వయసింకా 29దేగా అని దీర్ఘాలు తీస్తూ.. మరో ఐదేళ్ల వరకూ పెళ్లి ఊసే లేదు అని కూడా చెప్పేసింది. -
‘థియేటర్లలో నవ్వించాడని అరెస్ట్ చేస్తున్నా’
సంక్రాంతి బరిలో నిలిచిన ‘ఎఫ్2’కు ఎదురులేకుండా పోయింది. ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ లాంటి పెద్ద సినిమాలు బోల్తా కొట్టగా.. ఎఫ్2 మాత్రం జెట్స్పీడ్తో దూసుకుపోతోంది. సంక్రాంతి సీజన్ అయిపోయినా.. ఎఫ్2 సందడి మాత్రం ఇంకా తగ్గడంలేదు. సరైన సినిమా థియేటర్లలోకి రాకపోవడంతో ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్‌లోకి చేరేట్టు కనిపిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌ను చిత్రయూనిట్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తోంది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్, దిల్ రాజు, హీరోయిన్లు ఈ సినిమాతో మంచి సక్సెస్‌ను కొట్టారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ దర్శకుడు అనిల్ రావిపూడిపై చేసిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోను షేర్చేస్తూ.. ‘థియేటర్లలో పగలబడి నవ్వించినందుకు అరెస్ట్ చేస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. Arresting for causing excessive laughter in theatres!! 😂😂😂@AnilRavipudi pic.twitter.com/s5SExJTMA7 — Varun Tej Konidela (@IAmVarunTej) February 1, 2019 -
అలా ఫిక్స్ అయితే బోల్తాపడతాం
‘‘స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ప్రతిదీ ప్లాన్డ్గా చేసుకుంటే ప్రతి సినిమా ఆడుతుందనేదే నా నమ్మకం. ఒక్కోసారి స్క్రిప్ట్ వల్ల కావచ్చు.. మరోసారి కాస్టింగ్ కుదరక కూడా మిస్‌ఫైర్ అవ్వొచ్చు.. ఒక సినిమా ఆడలేదంటే దానికి చాలా కారణా లుంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. ఇటీవల ‘ఎఫ్ 2’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకుని, మరిన్ని సినిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్న ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. ► 2017 ఎంత సక్సెస్‌ఫుల్‌గా గడిచిందో, 2019 కూడా అదే స్థాయి సక్సెస్ ఇస్తుందనిపించింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ‘ఎఫ్ 2’తో ఇంత పెద్ద సక్సెస్‌ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో 2021లో ‘ఎఫ్ 3’ సినిమా ప్లాన్ చేస్తున్నాం. దాదాపు సేమ్ టీమ్ ఉంటుంది. అయితే ఈసారి ముగ్గురు హీరోలు ఉంటారు. ► 2017లో 6 సినిమాలు చేయాలని నేనేమీ అనుకోలేదు, అలా జరిగిపోయింది. అలాగని 2019లో కూడా 6 సినిమాలు చేయాల్సిందే అని ఫిక్సయితే బోల్తా పడే చాన్స్ ఉంది. కాబట్టి దాని గురించి అంత కచ్చితంగా చెప్పలేను. ప్రస్తుతానికి 4, 5 స్టోరీస్ అయితే చాన్సెస్ ఉన్నాయి. ► తమిళ ‘96’ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాం. నా కెరీర్లో తొలి రీమేక్ ఇది. ఈ సినిమా గురించి మీడియాలో చాలా ఫేక్ న్యూస్‌లు బయటికి వచ్చాయి. తమిళంలో ఈ సినిమాని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ తెలుగు రీమేక్‌కి కూడా దర్శకత్వం వహిస్తారు. హీరోగా శర్వానంద్ కరెక్ట్ అనీ, హీరోయిన్గా సమంత అయితే బాగుంటుందని, వాళ్లే కావాలని ప్రేమ్ అన్నారు. ► ‘96’ చక్కటి ఫీల్ ఉన్న సినిమా. రెండు పాత్రల మధ్య ఒక జెన్యూన్ ఫీల్‌ని దర్శకుడు ట్రావెల్ చేయించిన విధానం నాకు అద్భుతమనిపించింది. ఈ సినిమాను తెలుగులో కూడా నువ్వే చేయాలని డైరెక్టర్‌తో చెప్పాను. ‘96’ తమిళంలో క్లాసిక్ సినిమా అనిపించుకుంది. తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. కచ్చితంగా హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ► మహేశ్‌బాబుతో చేస్తున్న ‘మహర్షి’ సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తాం. అమెరికా షెడ్యూల్ అప్పుడు వీసా ఆలస్యం కావడంతో సినిమా విడుదలను 5 నుంచి 25కు మార్చడం జరిగింది. నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుంది. స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. షూటింగ్ ఎప్పుడు మొదలు పెట్టాలనే చర్చలు జరుగుతున్నాయి. అలాగే ‘పలుకే బంగారమాయెనా’ అనే ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రం విడుదలను 2020 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాం. ఇవి కాకుండా గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సినిమా ఉంది. కానీ ముందు అనుకున్న కథతో ఈ సినిమా చేయడం లేదు. -
మామా అల్లుళ్లతో రానా కూడా..!
ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సీనియర్ హీరో వెంకటేష్, మరో మల్టీస్టారర్ సినిమాకు రెడీ అవుతున్నాడు. అల్లుడు నాగచైతన్యతో కలిసి వెంకీ నటించనున్న వెంకీ మామ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జై లవ కుశ ఫేం బాబీ దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూన్స్ టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో యంగ్ హీరో రానా అతిథి పాత్రలో కనిపించనున్నాడట. గతంలో రానా హీరోగా తెరకెక్కిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో వెంకీ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. ఇప్పటికే వెంకీ సినిమాలో రానా గెస్ట్ రోల్ చేస్తున్నాడన్న వార్తలతో దగ్గుబాటి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
హనీ ఈజ్ ది బెస్ట్.. 35 సినిమాలు, ఐదు టీవీసీరియల్స్లో..
విజయనగరం టౌన్: అవకాశాలు అందరికీ వస్తాయి. కానీ అవి వచ్చినప్పుడే వాటి విలువ తెలుసుకుని సద్వి నియోగం చేసుకుంటే భవిష్యత్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలా అందివచ్చి న అవకాశాన్ని అతి చిన్నవయసులోనే అంది పుచ్చుకుని తల్లిదండ్రులు ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అనే తన మేనరిజాన్ని అందరి నోటా పలికిస్తుంది ఆ చిన్నారి చక్రాట్ సాయి హన్సిక. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఎఫ్–2 చిత్రంలో నటి మెహ్రీన్ నోట వచ్చే హనీ ఈజ్ ది బెస్ట్ అనే పదానికి మూలం ఈ చిన్నారి. ఎఫ్–2 చిత్ర దర్శకులు అనిల్ రావిపూడి చెప్పిన మేరకు విజయనగరంలో మున్నా డ్యాన్స్ అకాడమీలో హనీ ఈజ్ ది బెస్ట్ అనే కవర్సాంగ్ను హనీ చేయడానికి ఇక్కడకు వచ్చారు. ఈ మేరకు సాక్షితో హనీ ఈజ్ బెస్ట్ అంటూ ముచ్చటించింది. హనీ ఈజ్ ది బెస్ట్ ఎలా... రాజా ది గ్రేట్ మూవీ పది రోజుల పాటూ షూట్ చేస్తున్న సమయంలో అప్పుడు డొకోమో యాడ్ సాంగ్ వచ్చేది.అందులో హనీ..డొని అంటూ వెటకారంగా వచ్చే సందర్భంలో హన్సిక అలా కాదంటూ హనీ ఈజ్ బెస్ట్ అంటూ అందరికీ తన మేనరిజంతో అలవాటు చేసింది. ఇది చూసిన దర్శకులు, నిర్మాతలు, హీరో, హీరోయిన్లు ఇదేదో బావుందంటూ ఫాలో అయ్యారు. నిర్మాత దిల్‌రాజ్ తన చిత్రంలో హనీ ఈజ్ బెస్ట్ మేనరిజాన్ని హీరోయిన్‌కి ఉపయోగిస్తానంటూ కాపీరైట్స్ అందించారని చిన్నారి తల్లి గీతా సుందర్ తెలిపారు. మైఖేల్ డ్యాన్స్ అకాడమీలో కవర్‌సాంగ్ షోలో పాల్గొన్న హన్సిక 35 సినిమాలు, ఐదు టీవీసీరియల్స్లో.. శతమానం భవతి, రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు. నేను శైలజ, సర్ధార్ గబ్బర్‌సింగ్, డిక్టేటర్ తదితర 35 చిత్రాల్లో నటించానని, మనసు మమత, అల్లరే అల్లరి, కథలో రాజకుమారి, సరదాగా కాసేవు వంటి సీరియల్స్‌లో నటిస్తున్నానని, మహేష్‌బాబు, దిల్ రాజ్‌లకు సంబంధించిన చిత్రాల్లో ఆడిషన్స్‌కి వెళ్తున్నట్లు హన్సిక తెలిపింది. సేవా కార్యక్రమాల్లో జాతీయస్థాయి అవార్డులు.. హైదరాబాద్‌లో సెయింట్ మార్టిన్ హైస్కూల్లో ఐదోతరగతి చదువుతుందని, తన తండ్రి డాక్యుమెంట్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారని తెలిపింది. అమ్మ గీతా సుందర్, అన్నలు శివ, సతీష్‌లు మంచి సపోర్ట్‌గా ఉంటారు. కేరళ వరదలకు తన వంతుగా రూ.1.84 లక్షల విరాళం అందించడంతో పాటూ నలుగురు పిల్లలను తన సొంత డబ్బులు వెచ్చించి చదివిస్తుంది. అదేవిధంగా ఇద్దరికి కంటి ఆపరేషన్లు చేయించింది. వీటితో పాటూ అనాథలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో సావిత్రీబాయి పూలే జాతీయస్థాయి అవార్డును హైదరాబాద్‌లో అదిలాబాద్ ఎంపి వేణుగోపాలాచారి చేతుల మీదుగా అందుకుంది. సోనీ 4కేని ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా లాంచ్ చేసింది. స్టార్ మహిళ, లక్ష్మీదేవీ తలుపు తట్టింది వంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభను చాటింది. కేరళ, థాయిలాండ్, దుబాయ్‌లో మోడలింగ్ విభాగంలో విన్నర్‌గా నిలిచింది. మిస్ యూనివర్స్ కావడమే ధ్యేయం.. నేను మిస్ యూనివర్స్ కావాలి. అంతవరకూ అందరి సపోర్ట్‌తో గోల్ రీచ్ కావాలి. అందుకు తగిన శిక్షణను అమ్మ , నాన్న, సోదరులు అందిస్తున్నారు. ఎఫ్–2 చిత్ర దర్శకుడి సూచన మేరకు హనీ ఈజ్ ది బెస్ట్ కవర్ సాంగ్‌ను మున్నా చేతుల మీదుగా పూర్తి చేస్తున్నా.– చక్రాట్ సాయి హన్సికమున్నా -
ఓవర్సీస్లో దుమ్ములేపుతున్న ‘ఎఫ్2’
వంద కోట్ల గ్రాస్‌ను దాటి సంచలనం సృష్టించిన ఎఫ్2.. ఓవర్సీస్లోనూ దూసుకుపోతోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. సంక్రాంతి బరిలో దిగి.. సూపర్‌హిట్‌గా నిలిచింది ఎఫ్2. ఇప్పటికీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ చిత్రం ఓవర్సీస్లో రెండు మిలియన్ల మార్కును చేరినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కామెడీ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని మలిచారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. $2 Million in USA 💥⚡️ BOMMA BLOCKBUSTER!! Anthegaa... Anthegaaa.... 🤗🤗#F2 #FunAndFrustration #VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official@ThisisDSP Directed by @AnilRavipudi pic.twitter.com/hKbDR5HlH3 — Sri Venkateswara Creations (@SVC_official) January 27, 2019 -
యాభై.. వందరోజుల వేడుకలు పోయాయి
‘‘ఇప్పటికే మా ‘ఎఫ్ 2’ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం సంతోషం. ఇంకెంత వసూలు చేస్తుందో మాకు తెలీదు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు నుంచి మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నాం. ప్రేక్షకులు కేరింతలు కొట్టే విధంగా ఈ కొత్త సీన్స్ ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గతంలో 50 రోజులు, 100 రోజుల వేడుకలుండేవి. ఇప్పుడు అవన్నీ పోయి 50 కోట్లు, వందకోట్ల గ్రాస్, షేర్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ మా ‘ఎఫ్2’ చిత్రం వంద కోట్ల గ్రాస్ షీల్డ్స్‌ని పంపిస్తున్నాం. ఇది మా సినిమాతో స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వందకోట్ల సినిమా చెయ్యాలన్నది ప్రతి డైరెక్టర్ కల. అది ‘ఎఫ్2’ తో నాకు దక్కినందుకు హ్యాపీ. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేయడానికి 5 కొత్త సీన్స్‌ని యాడ్ చేస్తున్నాం. ఈ చిత్ర విజయంలో చాలామంది కష్టం ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన ‘హ్యాపీడేస్’ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ‘ఎఫ్ 2’ బిగ్గెస్ట్ హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు తమన్నా. -
వంద కోట్ల బొమ్మ.. అంతేగా అంతేగా..!
సంక్రాంతి బరిలో ఎన్నో అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తా కొట్టగా.. ఎఫ్2 మాత్రం రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ సినిమాలకు కలెక్షన్లు అంతంత మాత్రమే రాగ.. ఎఫ్2 మాత్రం కలెక్షన్లలో దూసుకుపోతూ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సంక్రాంతికే కాదు..ఈ ఏడాదిలో టాలీవుడ్‌కు ఇదే మొట్టమొదటి బ్లాక్బస్టర్హిట్. గతేడాది తన సినిమాలతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయిన దిల్ రాజు.. ఈ సారి మాత్రం సూపర్ హిట్ చిత్రాన్ని అందించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎంతో కాలం పాటు సరైన హిట్ కోసం ఎదురుచూసిన విక్టరీ వెంకటేష్‌కు ఎఫ్2 రూపంలో సూపర్ హిట్ దొరికింది. ఈ సినిమా వందకోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఓవర్సిస్లో కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. మరి ఈ సినిమా ఫుల్‌రన్‌లో ఇంకా ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి. వంద కోట్ల #F2. #100CroreF2 బొమ్మ బ్లాక్ బస్టర్... మా సినిమా ని ఇంత ఘనవిజయం చేసిన తెలుగు అభిమానులు అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు... 🙏🏻🤩#FunAndFrustration #VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official@ThisisDSP Directed by @AnilRavipudi pic.twitter.com/jhsCaxnmEz — Sri Venkateswara Creations (@SVC_official) January 25, 2019 -
వరుణ్ తేజ్ కొత్త సినిమా అప్డేట్.!
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న మెగా హీరో వరుణ్ తేజ్. ఇటీవల ఎఫ్ 2తో రికార్డ్ వసూళ్లు సాధిస్తున్న వరుణ్ తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయనున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ జిగర్తాండకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న వరుణ్ ఈ సినిమాతో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడట. ఒరిజినల్ వర్షన్లో సిద్ధార్థ్ చేసిన పాత్రలో వరుణ్ నటింస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 27న ప్రారంభించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా..?
పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ మూవీలతో హ్యాట్రిక్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. రీసెంట్గా సంక్రాంతి బరిలో విన్నర్‌గా నిలిచాడు. బడా సినిమాలకు పోటీగా తెచ్చిన ‘ఎఫ్2’ అందరి అంచనాలను తలకిందులు చేసి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్లో అనిల్ రావిపూడి హవా పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్‌పైనే అందరి దృష్టి నెలకొంది. ‘ఎఫ్2’ సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ.. ఎఫ్2కి సీక్వెల్చేస్తానని ప్రకటించాడు. అప్పట్లో బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ప్రస్తుతం అనిల్.. ఓ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్దం చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కూడా తన స్టైల్లోనే మంచి కమర్షియల్ ఫార్మాట్లోనే ఉంటుందా.. అసలు ఈ ప్రాజెక్ట్ అనిల్ మనసులో ఉందో లేదో తెలియాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. -
ఇదే కాంబినేషన్లో ఎఫ్-3 తీస్తా
నెల్లూరు సిటీ: విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోలుగా త్వరలో ఎఫ్–3 చిత్రం తీస్తానని ఎఫ్–2 దర్శకుడు అనీల్ రావిపూడి తెలిపారు. నెల్లూరులోని ఎస్ 2 థియేటర్స్‌లో ఎఫ్–2 చిత్ర బృందం మంగళవారం సందడి చేసింది. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ..ఎఫ్–2 చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అనీల్ రావిపూడి మాట్లాడుతూ..ఎఫ్–2 చిత్రాన్ని బ్లాక్ బాస్టర్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఒక సినిమా తీసిన తరువాత వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కాంబినేషన్లో ఎఫ్–3 చిత్రం తీస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ హరి, యూవీ క్రియేషన్స్ హెడ్ఓడీ మాగుంట ఆదిత్యబాబు పాల్గొన్నారు. ఇక వెంకటేష్, వరుణ్ తేజ్, రవితేజ ముగ్గురితో అనిల్ రావిపూడి ఎఫ్3 చిత్రానికి కథ రెడీ చేస్తున్నట్లు ఉహాగానాలు వినిపిస్తున్నాయి. రాజా ది గ్రేట్ చిత్రంలోని రవితేజ బ్లైండ్ క్యారెక్టర్ నే ఇందులో కూడా చూపించబోతున్నాడట. ఆ పాత్రలోనే రాజా ది గ్రేట్ చిత్రంలో రవితేజ హాస్యాన్ని పండించాడు. ఎఫ్3 లో మరింత ఫన్ ఉండేలా అనిల్ రావిపూడి జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. -
శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి, దిల్ రాజు
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనిల్ రావిపూడి,దిల్‌రాజు
-
వెంకీ,రవితేజ,వరుణ్ కాంబినేషన్లో సీక్వెల్?
-
వెండి వెన్నెల..నువ్వు ఇలా...
‘క్రిష్ణగాడి వీరప్రేమగాథ’తో తెలుగు ప్రేక్షకులకు ‘మహాలక్ష్మి’గా పరిచయమైంది మెహ్రీన్ కౌర్ పీర్జాదా. ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘నోటా’ ‘కవచం’, ‘ఎఫ్–2’ చిత్రాలతో చేరువైన మెహ్రీన్ ముచ్చట్లు తన మాటల్లోనే... నన్ను మార్చేసింది కెమెరా ముందు నిల్చున్న క్షణాలన్నీ నా దృష్టిలో ఆనందమయమే. రకరకాల పాత్రలు చేస్తున్న క్రమంలో నన్ను నేను కొత్తగా కనుగొనే ప్రయత్నం చేస్తున్నాను. ‘నటన’ నాలో మార్పు తెచ్చిందా అంటే...యస్ అని అంటాను. క్రమశిక్షణ, ఏకాగ్రత పెరగడం, సమయం సద్వినియోగం చేసుకోవడంతో పాటు నా గురించి నేను కేర్ తీసుకునేలా చేసింది నటన. విధివిలాసం దుస్తులకు, వ్యక్తిత్వానికి సంబంధం లేదని నమ్ముతాను. మోడ్రన్ స్టైల్లో కనిపించినంత మాత్రానా గ్రామీణనేపథ్యం ఉన్న పాత్రలు చేయలేరు అనేది అపోహ మాత్రమే. అలా అయితే నేను మహాలక్ష్మి పాత్ర చేసి ఉండేదాన్ని కాదేమో! పంజాబ్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగాను. న్యూయార్క్, కెనడా నుంచి హైదరాబాద్ వరకు జరిగిన నా జర్నీ అంతా డెస్టినీ అనుకుంటాను. హైదరాబాద్‌లో ఉంటే హోమ్‌సిక్ ఉండదు. హోమ్‌టౌన్‌లో ఉన్నట్లుగానే ఉంటుంది! ఎందుకంటే... ‘మిస్ పర్సనాలిటీ సౌత్ ఏషియా’గా ఎన్నికైన తరువాత ఫ్యాషన్ ప్రపంచం నుంచి అవకాశాలు వచ్చాయి. పెద్ద పెద్ద బ్రాండ్లకు పనిచేశాను. అలా ముంబైకి షిఫ్ట్ అయ్యాను. ఆ తరువాత సినిమాల్లోకి! ‘హిందీ సినిమాల్లో కాకుండా తెలుగులో ఎందుకు నటిస్తున్నారు?’ అనే ప్రశ్న ఎదురవుతుంటుంది. ఈరోజుల్లో తెలుగు, హిందీ లేదా ఇతర భాష అనే తేడా లేదు. ఇక్కడ కూడా ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. గలగలమని... ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ధైర్యంగా ముందడుగు వేయగలం. నాకు అలాంటి సపోర్ట్ ఉన్నందుకు గర్వంగా ఉంటుంది. మా కుటుంబసభ్యులు ఎప్పుడూ తమ నిర్ణయాన్ని నా మీద రుద్దే ప్రయత్నం చేయరు.‘నీ మనసు చెప్పినట్లే చెయ్’ అని చెబుతుంటారు. మౌనంగా ఉండడం కంటే ఎప్పుడూ గలగలమని మాట్లాడుతూ ఉండడమే నాకు ఇష్టం. చుట్టూ బంధువులో, స్నేహితులో ఉండాల్సిందే. గన్ అంటే ఇష్టం! ఏదో ఒక ఆట ఎంచుకొని ప్రాక్టీస్ చేయమని అమ్మ చెప్పడంతో ఎయిర్ పిస్టల్ షూటింగ్లో శిక్షణ తీసుకున్నాను. నెయిల్‌పాలిష్, హెయిర్ స్టైల్...మొదలైన వాటి కంటే ‘గన్’ అంటేనే నాకు ఇష్టంగా ఉండేది. జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న ఎయిర్ పిస్టల్‌తో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇప్పటికీ నేను పంజాబ్‌కు వెళితే షూటింగ్ రేంజ్‌కు వెళ్లి ప్రాక్టీస్ చేస్తుంటాను. -
‘ఎఫ్ 2’ సక్సెస్ మీట్
-
అందరూ నవ్వుతుంటే కన్నీళ్లొచ్చాయ్
‘‘ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ని హిట్ కాదు.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ చేశారు. నిజంగా అభిమానుల కళ్లలో ఆ ఆనందం చూసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల తర్వాత థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల రియాక్షన్ చూసినప్పుడు అక్కడ అందరూ నవ్వుతున్నారు.. కానీ, నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయ్. చాలా రోజుల తర్వాత థియేటర్లో అంత రియాక్షన్ చూసినప్పుడు.. మేమంతా కష్టపడి పనిచేసి ఆ సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి ప్రేమ చూపెట్టడం నిజంగా వండ్రఫుల్ ఫీలింగ్. ఇందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కి థ్యాక్స్ చెబుతున్నా. నావి ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ‘గణేశ్, ప్రేమించుకుందాం రా... నా బిగినింగ్ సినిమా ‘బొబ్బిలి రాజా నుంచి మొన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలు కానీ, నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి... ఇలా ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశారు. అనిల్ ఈ కథ చెప్పి నన్ను ఒప్పించడం.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం.. ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వండ్రఫుల్ సినిమా ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. అనిల్ చాలా మంచి ఎనర్జీ ఇచ్చాడు. వరుణ్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టైటిల్‌ని అనిల్ ‘ఎఫ్ 2’ అని అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ‘వీ 2’ అని వెంకటేశ్‌గారు, వరుణ్‌గారు జాయిన్ అయ్యారు. సినిమా రిలీజ్ రోజు ‘ఈ 2’ అని(ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్) కొందరు మెసేజ్‌లు పంపించారు. ఫైనల్‌గా ‘బీ 2’ అని (బొమ్మ బ్లాక్‌బస్టర్) బిరుదు ఇచ్చేశారు. మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా అయినందుకు టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం.ఈ సక్సెస్ అనిల్ ఒక్కడిదే కాదు.. టెక్నీషియన్స్ అందరిదీ. మీరందరూ ఉన్నారు కాబట్టే ఇంతపెద్ద సక్సెస్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ క్రెడిట్ మా టీమ్‌తో పాటు ప్రేక్షకులదే. మిమ్మల్ని కొంచెం నవ్విస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారని అర్థం అయింది. వెంకటేశ్‌గారు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో 50కోట్ల క్లబ్లో ఉన్నారు. వరుణ్ ‘ఫిదా’ సినిమాతో 50కోట్ల క్లబ్లో చేరారు. ఇద్దరూ ‘ఎఫ్ 2’ తో 50కోట్ల క్లబ్ దాటేశారు. మా బ్యానర్‌కి హయ్యస్ట్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే.. చాలా హ్యాపీ’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. ఓ సినిమా చేయాలంటే 100 నుంచి 200 మంది ఎఫర్ట్ ఉంటుంది. మా ‘ఎఫ్ 2’ సినిమాకి ఇంకా ఎక్కువ మంది పనిచేశారు. ఈ సినిమాకి అందరూ చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో పనిచేశారు.. అందరికీ థ్యాంక్స్. నేను నిజంగా కామెడీ అంటే ఇద్దర్నే చూశా. ఒక్కరు చిరంజీవిగారు, రెండోది వెంకటేశ్‌గారు. వాళ్లను చూసి ఇలా మనం చేయగలుగుతామా? అనిపించేది. వెంకీగారి పక్కన ఎలా చేస్తాం అనే భయం, సిగ్గు ఉండేది. ఆయన ఓ బ్రదర్‌లా నా పక్కన ఉంటూ సపోర్ట్ చేశారు. వెంకీగారు నిజంగా నా కో బ్రదర్, బెస్ట్‌ఫ్రెండ్. మీతో పనిచేయడం మరచిపోలేను. వెంకీగార్ని, అనిల్గార్ని, ఈ టీమ్‌ని మిస్ అవుతున్నందుకు ఎక్కడో ఫీలింగ్ ఉండేది. కానీ, త్వరలోనే ‘ఎఫ్ 3’ సినిమా చేయబోతున్నాం. మీ అభిమాన హీరో ఎవరైనా కావొచ్చు. కానీ, వాళ్లందరికీ నచ్చే కామన్ వ్యక్తి వెంకటేశ్‌గారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్. ప్రతి సినిమా నాకు ఓ ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నటీనటులందరూ లైఫ్పెట్టి పనిచేశారు. అందరికీ థ్యాంక్స్. తమన్నా, మెహరీన్ చాలా బాగా నటించారు. దేవిశ్రీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకీ సార్‌తో కలిసి వరుణ్ చాలా కష్టపడి చేశాడు. మళ్లీ మళ్లీ వరుణ్‌తో పనిచేయాలనుకుంటున్నా. వెంకటేశ్‌గారి దెబ్బకి బాక్సాఫీస్ అబ్బ. ఈ చిత్రంలో వెంకీగారు లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ గుర్తొచ్చింది. ఆయనొక లైబ్రరీ. మనం ఏరుకోవడమే. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ నవ్వుల్ని మీకు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్లు ఇచ్చారు. నా లైఫ్‌లో ఇది నవ్వుల సంక్రాంతి.. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా టీమ్‌ని ఎంతో ఎంకరేజ్ చేసిన మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్. ‘ఎఫ్ 3’ సినిమా కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కథానాయిక మెహరీన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - ఆప్ 2
-
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘ఎఫ్ 2’
సంక్రాంతి బరిలో పాజిటివ్ టాక్‌తో ఆకట్టుకున్న ఒకే ఒక్క సినిమా ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). భారీ పోటి మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చాలా కాలం తరువాత సీనియర్ హీరో వెంకటేష్ కామెడీ టైమింగ్‌తో మెప్పించటం వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్‌లు అదే స్థాయిలో అలరించటంతో ఎఫ్ 2కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పండగ సీజన్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం కావటం కూడా ఎఫ్ 2 కలిసొచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ రావటంతో ఎఫ్ 2కు కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 32 కోట్లకు పైగా షేర్ సాదించినట్టుగా తెలుస్తోంది. ఈ వారం సినిమా రిలీజ్ లేవి లేకపోవటం కూడా ఎఫ్ 2కు కలిసొచ్చే అంశంమే. ఈ సినిమా ఫుల్ రన్లో 50 కోట్లకుపైగా షేర్ సాధించటం కాయంగా కనిపిస్తోంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. -
ఫెయిల్యూర్ రాకూడదని పని చేస్తాను
‘‘ఎవరైనా సక్సెస్ కోసం పని చేస్తారు. నేను ఫెయిల్యూర్ రాకూడదని పని చేస్తాను. ఫెయిల్యూర్ భయం నాకు ప్రతి క్షణం ఉంటుంది. డైరెక్టర్‌గా నేను సక్సెస్ అయ్యాను. రైటర్‌గా ఉన్నప్పుడు నేను చాలా ఫెయిల్యూర్స్ చూశా. మనం చేసిన పనికి ప్రశంస రాకపోతే ఉండే బాధను అనుభవించాను. ఇప్పుడు ఆ బాధ లేకుండా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా’’ అని అనిల్ రావిపూడి అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు... ► ఈ సినిమాకు ముందు మూడు యాక్షన్ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్) చేశాను. యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దామనుకున్నాను. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్లాం ఊరెళితె’ తరహాలో ఉండే సినిమా చేద్దామని ‘ఎఫ్ 2’ చేశాను. ‘రాజా ది గ్రేట్’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ‘ఎఫ్ 2’ ఆలోచన వచ్చింది. ► జంధ్యాలగారు గొప్ప రైటర్. గొప్ప దర్శకులు. బోర్ కొడితే ఆయన సినిమాలు చూస్తాను. ఆయన్ను ఫాలో అవుతాను కానీ ఆయన్ని కాపీ కొట్టను. అలాగే ఈవీవీగారు, కృష్ణారెడ్డిగారి సినిమాలు కూడా బాగా ఇష్టం. వీరిని ఇన్‌ప్లూయెన్స్ అవుతున్నానన్న మాట మాత్రం వాస్తవం. కానీ నా స్టైల్ ఆఫ్ నరేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ► నాది తక్కువ.. నీది ఎక్కువ, ఒకరికి ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. ఒకరికి తక్కువ ఉన్నాయి అన్న తలనొప్పి నాకు లేదు ఈ సినిమా సెట్లో. అందరూ నమ్మి ఈ సినిమా చేశారు. మంచి ఫలితం వచ్చింది. వెంకటేశ్‌గారు కొన్ని ఐడియాస్ ఇచ్చారు. సినిమాలో వెంకీ ఆసనం, డాగ్ ఎపిసోడ్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వెంకీగారు గ్రేట్ యాక్టర్. రిజల్ట్ పట్ల ఆయన ఫుల్‌హ్యాపీ. వరుణ్ ఇప్పటివరకు కామెడీ జానర్ చేయలేదు. వెంకీగారితో వరుణ్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందా? అనుకున్నాం. బాగా చేశారు. తెలంగాణ డైలాగ్స్ బాగా పలికారు. సినిమాలో ప్రకాష్‌రాజ్‌గారికి ‘గుండమ్మ కథ’ అంటే ఎంత పిచ్చో నాకు అంత పిచ్చి. అదే సినిమాలో పెట్టాను. ఈ సినిమాలో ముందుగా ‘అంతేగా.. అంతేగా..’ డైలాగ్స్ అనుకోలేదు. ► నీ సినిమాల్లో గ్లామర్ ఉండదేంటి? అన్నారు కొందరు. అలాంటి ఆడియన్స్ కూడా ఉన్నారని రియలైజ్ అయ్యి ఈ సినిమాలో కొంచెం గ్లామర్ సీన్స్ పెంచాను. కానీ బోర్డర్ దాటి చేయలేదు. నా పెళ్లి తర్వాతే రాసుకున్నాను ఈ సినిమా స్క్రిప్ట్‌ని (నవ్వుతూ). నా వైఫ్ చూసి చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. ► నేను న్యూస్, కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతాను. సినిమానే నాకు లైబ్రరీ. సినిమానే నాకు పుస్తకం. అందుకే నేను చేసే సినిమాల్లో కరెంట్ అఫైర్స్ ట్రెండ్ కనిపిస్తుంది. బాల్యంలో ఎంత బాగా చదివేవాడినో అంతే బాగా సినిమాలు చూసేవాడిని. నా గురించి ఇప్పుడు అరుణ్ ప్రసాద్‌గారు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆయన తీసిన ‘గౌతమ్ ఎస్ఎస్సి’ సినిమాకు నేను వర్క్ చేశాను. ఆయనంటూ లేకపోతే నేనూ ఇండస్ట్రీలో లేను. కాస్త టైమ్ తీసుకుని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా. బాలకృష్ణ, వెంకటేశ్ గార్లకు ఐడియాలు చెప్పాను. బయోపిక్స్ పట్ల ఆసక్తి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదు. ► ‘ఎఫ్ 3’ చేయాలనే కోరిక ఉంది. ‘ఎఫ్ 2’ కి ఆడియన్స్ సక్సెస్ ఇచ్చారు కాబట్టి నా కోరికకు బలం కూడా వచ్చింది. వెంకీగారు, వరుణ్ కూడా ఎగై్జట్‌గా ఉన్నారు. వెంకీగారు, వరుణ్‌కి తోడుగా ఇంకో హీరో వస్తారా? లేక అసలు ఎలా ఉండబోతుందన్న వివరాలు భవిష్యత్‌లో తెలుస్తాయి. -
పండక్కి ట్రిపుల్ ధమాకా
సంక్రాంతి పండక్కి సినిమాలొస్తాయి. థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారు. ఆకాశంలో గాలిపటాల కంటే స్టార్స్ ఎక్కువ కనపడతారు. రంగుల ముగ్గుల కంటే థియేటర్లో రంగుల కాగితాలు ఎక్కువ ఎగురుతాయి. ఇక స్వీట్ల పంపకాలు, వేడుకలు, డ్యాన్సులు... థియేటర్ల బయట బోలెడంత హంగామా. సంక్రాంతికి ట్రిపుల్ ధమాకాలా వచ్చిన మూడు స్ట్రయిట్ ‘ఫ్యాన్.... టాస్టిక్’ సినిమాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. సంక్రాంతి సీజన్లో ముందుగా వచ్చిన సినిమా ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’. నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. క్రిష్ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాతలు. ‘‘ట్రేడ్ పరంగా బుధవారం రిలీజ్ అంటే అంత మంచిది కాదు. కానీ ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి విడుదలకు ఆ రోజుని ఎంపిక చేసుకున్నాం’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ చిత్రం వసూళ్ల విషయానికొస్తే... 700 థియేటర్లలో రిలీజైన ‘యన్.టి.ఆర్’ తొలి రోజు 10 కోట్ల పై చిలుకు షేర్ చేసిందని, బుధవారం అయినప్పటికీ ఇంత వసూలు చేయడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘యన్.టి.ఆర్’ రిలీజ్ తర్వాత ఒక్క రోజు గ్యాప్ (11న విడుదల)తో ‘వినయ విధేయ రామ’ తెరపైకి వచ్చింది. రామ్‌చరణ్ హీరోగా డీవీవీ దానయ్య నిర్మించారు. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరపైకొచ్చింది. దాదాపు 900 థియేటర్లకు పైగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు 30 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్ వీకెండ్లో సందడి చేయడానికి థియేటర్లోకి వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం శనివారం తెరకొచ్చింది. ‘‘మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్లో ఈ సినిమా కూడా హిట్టే’’ అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. స్ట్రయిట్ చిత్రాల మధ్య వచ్చిన డబ్బింగ్ మూవీ ‘పేట’. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ సినిమాని తెలుగులో అశోక్ వల్లభనేని విడుదల చేశారు. మూడు స్ట్రయిట్ చిత్రాల మధ్య రావడంతో థియేటర్లు పెద్దగా దొరకలేదు. రజనీ మార్క్ మాస్ మూవీ అనిపించుకుని, ప్రేక్షకులను థియేటర్స్‌కి రాబట్టుకుంటోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కియారా, రామ్‌చరణ్ వెంకటేశ్, తమన్నా, మెహరీన్, వరుణ్ తేజ్ రజనీకాంత్, త్రిష -
‘ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్)’ మూవీ రివ్యూ
టైటిల్ : ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) జానర్ : కామెడీ ఎంటర్టైనర్ తారాగణం : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ప్రగతి సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : అనిల్ రావిపూడి నిర్మాత : దిల్ రాజు వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన మరో కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 2. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు హీరోలుగా మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో భారీ పోటి మధ్య రిలీజ్ అయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలకు డివైడ్ టాక్ రావటంతో ఎఫ్ 2 ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. చాలా కాలం తరువాత వెంకీ ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్లో కనిపించటం, వరుణ్ తేజ్ తొలిసారిగా మల్టీస్టారర్ సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఎఫ్ 2 అందుకుందా..? కథ : వెంకీ (వెంకటేష్) ఓ ఎమ్మెల్యే (రఘు బాబు) దగ్గర పీఏగా పనిచేస్తుంటాడు. వెంకీకి అమ్మా నాన్న లతో పాటు అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు కూడా లేకపోవటంతో హారిక (తమన్నా) వెంకీని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి తరువాత వెంకీ జీవితం పూర్తిగా మారిపోతుంది. అప్పటి వరకు తనకు నచ్చినట్టుగా గడిచిపోతున్న వెంకీ జీవితం.. భార్య, అత్తమామల రాకతో నరకంగా తయారవుతుంది. హారిక చెల్లెలు హని (మెహరీన్). కాలేజ్‌లో చదువుకుంటున్న హనీని వరుణ్ యాదవ్( వరుణ్ తేజ్) ఇష్టపడతాడు. వెంకీ వద్దని వారిస్తున్నా వినకుండా వరుణ్, హనీతో పెళ్లికి రెడీ అయిపోతాడు. వరుణ్ జీవితం పెళ్లి కాకుండానే హనీ చేతుల్లోకి వెళ్లిపోతుంది. దీంతో వెంకీ, వరుణ్‌లలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఎదురింటి వ్యక్తి(రాజేంద్రప్రసాద్) చెప్పిన మాటలు విని వెంకీ తన భార్యను, వరుణ్ తనకు కాబోయే భార్యను వదిలేసి యూరప్ వెళ్లిపోతారు. తాము దూరమైతే భార్యలు కాళ్లభేరానికి వస్తారని అనుకుంటారు. కానీ హారిక, హనీలు యూరప్‌లోనే ఉండే దొరస్వామి నాయుడు కొడుకులను పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతారు. ఈ పరిస్థితుల్లో వెంకీ, వరుణ్‌లు ఏం చేశారు..? తిరిగి తమ భార్యలకు ఎలా దగ్గరయ్యారు..? అన్నదే మిగతా కథ. నటీనటులు : చాలా కాలం తరువాత వెంకటేష్ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. పర్ఫామెన్స్, డైలాగ్ డెలివరీ, కామెడీ ఇలా ప్రతీ దాంట్లో వెంకీ పర్ఫామెన్స్ సూపర్బ్ అనేలా ఉంది. మరో హీరోగా నటించిన వరుణ్ తేజ్ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. నటన పరంగా మెప్పించినా.. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది. కామెడీ పరంగా మాత్రం మంచి మార్కులే సాధించాడు. హారిక పాత్రలో తమన్నా ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత లీడ్ హీరోయిన్గా అలరించింది. ఫస్ట్ హాఫ్‌లో మరో హీరోయిన్‌మెహరీన్ నటన కాస్త అతిగా అనిపించినా తరువాత తరువాత పరవాలేదనిపిస్తుంది. గ్లామర్ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు తమ వంతుగా నవ్వించే ప్రయత్నం చేశారు. విశ్లేషణ : వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న అనిల్ రావిపూడి ఈ పండక్కి ఓ మంచి కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా కట్టిపడేసే సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే సన్నివేశాలనుంచే కామెడీ జనరేట్ చేశాడు. భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్ క్రియేట్ చేసింది. రచయితగానూ అనిల్ రావిపూడి ఫుల్ మార్క్ సాదించాడు. అనిల్ రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి. తొలి భాగాన్ని ఏమాత్రం పట్టు తప్పకుండా ఫన్ రైడ్‌లా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంలో కాస్త నెమ్మదించాడు. క్లైమాక్స్‌లో నాజర్ ఎంట్రీ, ఆయన చెప్పే డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చింది. ముఖ్యంగా యూరప్ అందాలను చాలా బాగా తెర మీద ఆవిష్కరించారు. ఎడిటింగ్,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన సినిమాటోగ్రఫి డైలాగ్స్ మైనస్ పాయింట్స్ : ద్వితీయార్థంలో కొన్ని సీన్స్ పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నేను పెద్ద హీరోని అనుకోను
‘‘సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను, వరుణ్ సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘నేను పెద్ద హీరోని అని ఎప్పుడూ అనుకోను. కథ, దర్శకుడు అనిల్‌ని నమ్మి ఈ సినిమా చేశా. ‘దిల్’ రాజుగారితో మంచి అనుబంధం ఉంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కలియుగ పాండవులు’ చిత్రంతో వెంకటేశ్‌గారి అభిమానిని అయ్యా. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడు అనిల్’’ అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. అది కూడా కామెడీ క్యారెక్టర్. ‘ఎఫ్ 2’తో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ‘ఫిదా’ తర్వాత మరోసారి పనిచేయడం హ్యాపీ. మా పెదనాన్నగారి (చిరంజీవి) కాన్టెంపరరీ హీరో వెంకటేశ్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో ఫ్రెండ్‌లా, మెంటర్‌లా ఉన్నారు. నెక్ట్స్ టైమ్ ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి రెడీ’’ అన్నారు. ‘‘ఎఫ్ 2’ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. టైమింగ్ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు’’ అన్నారు అనిల్ రావిపూడి. నటులు రాజేంద్రప్రసాద్, కథానాయికలు తమన్నా, మెహరీన్, నిర్మాత శిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎఫ్2’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
ఎవరి టైమ్ వాళ్లకు వస్తుంది
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి 32 ఏళ్లవుతోంది. ఇప్పుడు కూడా సోలో హీరో అయితేనే చేస్తా అనడం కరెక్ట్ కాదు. ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత హీరోనా, మల్టీస్టారర్ మూవీనా అనే ఆలోచన కలగడంలేదు. ఫలానా పాత్రే కావాలనే కోరికలు నాకు లేవు. పాత్రల గురించి మనం ఎవర్నీ అడగకూడదు. సోలో హీరోగా చేయమని డైరెక్టర్లు కథలు తీసుకొస్తే చేస్తా’’ అన్నారు వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా వెంకటేశ్ చెప్పిన విశేషాలు. ► మంచి ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ఫ్రస్ట్రేషన్లోనూ కామెడీ ఉంటుంది. ఈ చిత్రం టీజర్, ట్రైలర్లో నేను చెప్పిన డైలాగులకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. ‘దృÔ¶ ్యం, గురు’ వంటి సీరియస్ సినిమాలు చేశాక కొంచెం ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలనుకుంటున్నప్పుడు అనిల్ ‘ఎఫ్ 2’ కథ చెప్పాడు. సంక్రాంతికి రియల్ ఫెస్టివల్ ఫిల్మ్ ‘ఎఫ్ 2’. ► అనిల్ వెరీ పాజిటివ్.. సిన్సియర్. తను రచయిత కూడా కావడంతో మంచి డైలాగులు రాశాడు. వరుణ్ తేజ్ వెరీ నైస్, సింపుల్ పర్సన్. ఏ ఇమేజ్‌లో ఇరుక్కోకుండా కొత్తగా చేయాలనుకుంటాడు. ఎవర్నీ అనుకరించకుండా తన స్టైల్లో చేశాడు. ► కుటుంబ కథా చిత్రాల్లో నేను బాగా ఒదిగిపోవడంతో పాటు మంచి ఎమోషన్స్‌ని పండిస్తానని ప్రేక్షకులు అంటుంటారు. దానికి కారణం.. నా స్కూల్, కాలేజ్ డేస్‌లో ఫ్రెండ్స్, బంధువుల ఇళ్లకు వెళ్లేవాణ్ని. అక్కడ వారి ఎమోషన్స్, బిహేవియర్లను పరిశీలించేవాణ్ణి. మాది పెద్ద కుటుంబం.. మంచి సర్కిల్ ఉంది. పైగా స్కూల్‌డేస్ నుంచే ఆధ్యాత్మికం గురించి తెలుసుకోవడం వల్లేనేమో అనుకుంటున్నా. ► ‘గురు’ సినిమా తర్వాత చాలా కథలు విన్నా కుదరలేదు. వైవిధ్యమైన సినిమా చేయాలనుకోవడం వల్లే గ్యాప్ వచ్చింది. పైగా యంగ్‌స్టర్స్ చేస్తున్న కథలతో నేను సినిమాలు చేయలేను (నవ్వుతూ). నేను, రానా ఓ సినిమా చేయాలనుకున్నాం. అప్పుడు తను ‘బాహుబలి’తో బిజీ అయిపోయాడు. ► యాక్టింగ్ అనేది సహజంగా అందరిలోనూ ఉంటుంది. కొందరు చేసే కొద్దీ నేర్చుకుంటుంటారు. ఇండస్ట్రీలో ఓపికగా ఉంటే ఎవరి టైమ్ వారికి కచ్చితంగా వస్తుంది. మంచి కథలు ఎంచుకుంటూ సిన్సియర్‌గా కష్టపడుతుండాలి. హిట్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. అయితే మన ఆలోచనా విధానం పాజిటివ్‌గా ఉండాలి. అదే నిజమైన సక్సెస్. ► రియల్ లైఫ్‌లో నేను ఫ్రస్ట్రేషన్‌కి దూరంగా ఉంటా. ప్రతిరోజూ ప్రకృతితో సావాసం చేస్తా. అప్పుడే దాని ప్రాముఖ్యత మనకి తెలుస్తుంది. నేను రోజూ సూర్యోదయం చూస్తా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్... అందరూ అశాశ్వతం. ప్రకృతే శాశ్వతం. దాన్ని మనం అర్థం చేసుకుంటే సమస్యలు రావు. ► చాలెంజింగ్ రోల్స్ అంటే బాగా ఇష్టం. అందుకు టైమ్ రావాలి. అమితాబ్‌గారు ఎన్ని పాత్రలు చేసినా ‘బ్లాక్’ సినిమాలోని పాత్ర సూపర్బ్. నేను ‘రోజా’ సినిమా చేయలేకపోయా. కానీ ఆ తర్వాత ‘సుందరకాండ’ వంటి మంచి మూవీ చేశా. ‘రోజా’ సినిమా చేసుంటే హిందీలోనూ ఎక్కడికో వెళ్లిపోయేవాణ్ణి. నాకు ‘బాహుబలి’లాంటి సినిమా చేయాలనుంది. అయితే ఆ పాత్ర మనకి రావాలి. నాకు రాలేదే అని ఎప్పుడూ బాధపడకూడదు. ► బాబీ దర్శకత్వంలో చేస్తున్న ‘వెంకీ మామ’ సినిమా కథ చాలా బాగుంటుంది. నా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్, అనిల్ రావిపూడి కథలు తయారు చేస్తు న్నారు. ఇమేజ్ చట్రం అంటే ఏంటో నాకు తెలియదు. మన నుంచి ఫ్యాన్స్, ప్రేక్షకులు ఓ ఇమేజ్‌ని ఆశిస్తారు. కానీ, ఓ ఇమేజ్ రావాలనే కోరిక నాకు లేదు. సినిమా బాగుండాలి. నిర్మాత, సినిమా కొనేవాళ్లు నష్టపోకూడదని ఆలోచిస్తా. కానీ, బయట నాపై చూపించే ఇమేజ్‌ని నేను కంట్రోల్ చేయలేను. క్రమశిక్షణ, కష్టపడే తత్వం నా కంట్రోల్లో ఉంటాయి. అవి నాన్నగారి (రామానాయుడు) నుంచే నేర్చుకున్నా. -
ఐటమ్ అంటే నాకిష్టం!
సాక్షి, తమిళసినిమా: ఐటమ్ సాంగ్స్ నాకిష్టం అంటోంది నటి తమన్నా.. స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లో నటించడానికి ఒకప్పుడు భయపడేవారు. కానీ, ఇప్పుడు అది ఫ్యాషన్ అయ్యింది. ఇమేజ్ను సైతం పట్టించుకోకుండా స్టార్ హీరోయిన్లు ఐటమ్ సాంగ్స్‌లో ఆడిపాడుతున్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఒక చిత్రంలో నటిస్తే వచ్చే పారితోషికంలో సగం ఒక్క ఐటమ్ సాంగ్‌లో నటిస్తే వచ్చేస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తత్వాన్ని బాగా ఒంటబట్టిచుకున్న ఈ తరం హీరోయిన్లు ఐటమ్ సాంగ్‌లకు అస్సలు వెనుకాడడం లేదు. తమన్నా, శ్రియ, కాజల్ అగర్వాల్ ఇలా టాప్ హీరోయిన్లందరూ సింగిల్సాంగ్కు చిందేయడానికి సిద్ధం అంటున్నారు. అయితే ఇందుకు వారు ఒక్కో రీజన్‌ను రెడీగా పెట్టుకుంటున్నారు. నటి తమన్నా ఇప్పటికే చాలా చిత్రాల్లో ఐటమ్ సాంగ్‌లో నటించారు. ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్‌లోనూ తన అందాలతో అదరగొట్టారు. ఇలా ఐటమ్ సాంగ్స్‌లో నటించడంపై తాజగా తమన్నా స్పందించారు. ‘ సినిమాల్లోకి మొదట్లో నాకు డాన్స్‌తోనే గుర్తింపు లభించింది. ఇంకా చెప్పాలంటే డాన్స్‌లో ప్రతిభను చాటుకునే అవకాశాలు చాలా తక్కువ మంది హీరోయిన్లకే వస్తుంటాయి. అలాంటి అవకాశాలు నాకు ఎక్కువగానే వచ్చాయి. అందుకే డాన్స్‌కు ప్రాధాన్యం కలిగిన పాటల్లో నటించడం నాకు చాలా ఇష్టం’ అంటూ స్పెషల్ సాంగ్స్‌లో నటించడాన్ని ఈ అమ్మడు సమర్థించుకుంది. మొత్తం మీద తొలి రోజుల్లో నటనతో కాకుండా డాన్స్, అందచందాలతో నెట్టుకొచ్చానని ఈ అమ్మడు చెప్పకనే చెప్పిందన్నమాట. ఈ బ్యూటీ నటించిన తెలుగు చిత్రం ఎఫ్-2 చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ అమ్మడు సక్సెస్ చూసి చాలా కాలమైంది. అందుకే ఎఫ్-2 సినిమా రిజల్ట్ కోసం చాలా ఆతృతంగా ఎదురుచూస్తోందట. -
ఎవరైనా ఉంటే చెప్పండి
సినిమా: మీ ఊళ్లో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే చెప్పండి పెళ్లి చేసుకుంటానని అంటోంది నటి తమన్నా. నటిగా ఈ అమ్మడి వయసు 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కాలంలో హింది, తెలుగు, తమిళం, కన్నడం అంటూ పలు భాషల్లో నటించేసి భారతీయ సినీ నటిగా పేరు తెచ్చుకుంది. ఇంకా కథానాయకిగానే నటిస్తున్న ఈ మీల్కీబ్యూటీ అవకాశాలు తగ్గాయేమోగానీ, క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అయితే కోలీవుడ్‌లో తమన్నా నటించిన చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలమే అయ్యింది. తెలుగులో ఇటీవల నటించిన నెక్టŠస్ ఏంటీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అయితే ఆ విషయాన్ని ఈ అమ్మడు అంగీకరించడం లేదన్నది వేరే విషయం. నెక్ట్స్ఏంటీ చిత్రం చాలా మందికి నచ్చిందని, అందువల్ల అది సూపర్‌హిట్ చిత్రం అని నమ్మబలుకుతోంది. ఈ విషయాన్ని పక్కన పేడితే ఈ బ్యూటీ నటించిన తమిళ చిత్రం కన్నె కలైమానే నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలంగా విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఆ చిత్ర విడుదల తేదీని నటి తమన్నా తాజాగా వెల్లడించింది. ఇటీవల చెన్నైలోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తమన్నా మాట్లాడుతూ కన్నె కలైమానే అన్ని వర్గాల వారు చూసి ఆనందించే చిత్రంగా ఉంటుందని చెప్పింది. ఇందులో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని, చిత్రం ఫిబ్రవరి 1వ తేదీన విడుదల కానుందని తెలిపింది. ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటావన్న ప్రశ్నకు మీ ఊరిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే చెప్పండి. పెళ్లి చేసుకుంటాను అని బదులిచ్చింది. ఇటీవల కన్నె కలైమానే చిత్ర ప్రచారం కోసం చెన్నైకి వచ్చిన తమన్నాను ఒక అభిమాని మీరంటే చాలా ఇష్టం మీమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నాను. అది సాధ్యం అవుతుందా? అని అడిగాడు. దీంతో పక్కనున్న నటుడు ఉదయనిధిస్టాలిన్ కలగచేసుకుని అస్సలు సాధ్యం కాదు. తమన్నాకు అమెరికాలో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు తెలుసా? అని అన్నారు. దీంతో ఆయన చెప్పింది నిజమో, కాదో తెలియక అభిమానులు అయోమయానికి గురయ్యారు. అన్నట్టు ఈ భామ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న భారీ, చారిత్రక కథా చిత్రం సైరా నరసింహారెడ్డిలో ముఖ్య భూమికను పోషిస్తోంది. అదే విధంగా హిందీలోనూ ఒక చిత్రం చేస్తోంది. ఇక తమిళంలో నటిస్తున్న దేవి–2 చిత్రం నిర్మాణంలో ఉంది. -
‘ఎఫ్ 2’ ట్రైలర్ రిలీజ్
-
సడన్‌గా సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా?
‘‘నిన్న ఒక సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో వాళ్లు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారేమో నాకు తెలియదు. పండక్కి›వస్తున్న 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ అయ్యాయి. 3 పెద్ద సినిమాలకు థియేటర్స్ ఎలా సెట్ చేసుకోవాలని స్ట్రగుల్ అవుతున్నాం. అలాంటిది 20 రోజుల ముందు సినిమాను కొనుక్కొచ్చి సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా? 3 తెలుగు సినిమాలున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయి?’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి, ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘రాజా ది గ్రేట్’ తర్వాత అనిల్ ఈ ఐడియా చెప్పాడుæ. బాగా నచ్చింది. జర్నీ అంతా ఫన్‌గా సాగిపోయింది. మొన్న ఇద్దరం మాట్లాడుకుంటూ ‘ఏంటి అనిల్.. 3 సినిమాలు చేసేశాం. చిన్న క్లాష్ కూడా రాలేదు’ అని నవ్వుకున్నాం. తను అనుకున్నట్టు సినిమా చేశాడు. పండక్కి మా సినిమా ఫన్ ఇస్తుందని నమ్ముతున్నాం. అలాగే థియేటర్స్ ఇష్యూలో రెండో పాయింట్.. ఆ నిర్మాతే గత నాలుగు నెలల్లో ‘నవాబ్, సర్కార్’ సినిమాలు రిలీజ్ చేశారు. ‘సర్కార్’కు ఎన్ని థియేటర్స్ కావాలో అన్ని థియేటర్స్‌లో వేసుకున్నారు. ఇప్పుడు దొరకడం లేదంటే? తెలుగు సినిమాలను తగ్గించుకుని రిలీజ్ చేయలేం కదా. ఈ సీజన్లో మన తెలుగు సినిమా కాకుండా వేరే భాష చిత్రాలకు థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. 18న రిలీజ్ చేయొచ్చుగా? అలా చేస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరుకుతాయిగా. ఇలాంటివి ఆలోచించకుండా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చి, నోరు జారారు. అలా మేమూ మాట్లాడగలం. కానీ ఇక్కడ మనం చేస్తున్నది వ్యాపారం. డబ్బు సంపాదించడానికే. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయాయి. అయినా సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నాం. ఎవరి మీదా స్టేట్మెంట్లు ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు. 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకు థియేటర్స్ ఉండాలా వద్దా? మూడూ క్రేజీ సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అది తెలియకుండా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ మధ్యలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్లో ఫుల్ కామెడీ సినిమా చేయలేదు. అనిల్ కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. మల్టీస్టారర్ అయితే ఇంకా ఫన్ ఉంటుందనుకుని చేశాం. వరుణ్‌తో పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఎంటర్టైన్ చేసిన ప్రతిసారీ నన్ను ఆదరించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. ‘‘నా కెరీర్లో చేయాల్సిన కామెడీ అంతా ఈ సినిమాలో చేయించాడు అనిల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. వెంకీగారితో పని చేయాలంటే టెన్షన్ పడ్డా. ఫ్రేమ్‌లో ఆయనతో పోటీపడటం పెద్ద చాలెంజ్. ఆయన ఇచ్చిన కంఫర్ట్ వల్లే బాగా చేయగలిగాను. సీట్లో కూర్చోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ ఆన్నారు వరుణ్ తేజ్. ‘‘ఈ బ్యానర్లో ఇది నాకు మూడో సినిమా. నిర్మాతలు ఫ్యామిలీలా మారిపోయారు. వాళ్లతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. మా కాంబినేషన్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. రెండు నిమిషాల ట్రైలర్లో కొన్ని నవ్వులే. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో చాలా నవ్వులుంటాయి. వెంకటేశ్, వరుణ్, తమన్నా మెహరీన్‌లు ఈ సినిమాకు 4 పిల్లర్స్’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో రాజుగారు నాదో సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు నుంచి నా లైఫ్‌లో ‘హ్యాపీడేస్’ వచ్చేశాయి. అప్పటి నుంచి ఆయనతో ఎప్పుడు సినిమా చేస్తానా అనుకున్నాను. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అనిల్‌గారు ఓన్లీ ఫన్ నో ఫ్రస్ట్రేషన్. వెంకీ సార్ ఎన్ని పాత్రలు చేసినా అంత ఫ్రెష్‌గా, ముద్దుగా ఎలా కనిపిస్తారో అర్థం కాదు. వరుణ్ చేస్తున్న సినిమాలు నాకు ఇష్టం. మెహరీన్ నా హనీ’’ అన్నారు తమన్నా. ‘‘200 శాతం ఈ సినిమాకు ఇచ్చాను. వెంకటేశ్ సార్, వరుణ్, తమన్నాలతో కలసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నాను’’ అన్నారు మెహరీన్. -
సెన్సార్ పూర్తి.. బరిలోకి దిగడానికి రెడీ!
ఈ సంక్రాంతి బరిలో నందమూరి బాలకృష్ణ, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తున్నా.. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ ఎఫ్2, సూపర్‌స్టార్ రజనీకాంత్ పేట కూడా రంగంలోకి దిగడానికి సిద్దమయ్యాయి. అయితే వీటిలో ఏ సినిమాలకు ప్రేక్షకులు పట్టంకడతారో చూడాలి. ఎన్టీఆర్ జీవిత చరిత్రగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ కథానాయకుడిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక బోయపాటి శ్రీను సినిమా అంటే మాస్కు పండుగే. భారీయాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన వినయ విధేయ రామపై మాస్లో భారీ హైప్ క్రియేట్ అయింది. వినోధ భరితంగా రాబోతోన్న ఎఫ్2, రజనీ తనదైన స్టైల్, మ్యానరిజంతో నటిస్తూ వస్తున్న పేట ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. అయితే వీటిలో ఎలాంటి కట్లు లేకుండా ఎన్టీఆర్ కథానాయకుడు మూవీకి యూ.. పేటా, ఎఫ్2లకు యూ/ఏ సర్టిఫికేట్లు లభించాయి. ఇక వినయ విధేయ రామ చిత్రం సెన్సార్ పూర్తి కావాల్సిఉంది. కథానాయకుడు అన్నింటికంటే ముందుగా (జనవరి 9న) విడుదల కానుండగా.. పేట జనవరి 10న, వినయ విధేయ రామ జనవరి 11న, ఎఫ్2 జనవరి 12న విడుదల కానున్నాయి. -
విశాఖలో ‘ఎఫ్2’ ఆడియో విడుదల వేడుక
-
తెలుగు సినిమా మరోసారి సత్తా చాటాలి
‘‘హలో వైజా........గ్.. సౌండ్ అంటే అదమ్మా. మీ సౌండ్‌తో నాకు గొంతు పోయినట్టుంది (నవ్వుతూ). వైజాగ్ ఉత్సవాల్లో మా ‘ఎఫ్ 2’ సినిమా ఆడియో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘ఎఫ్ 2’ వండర్ఫుల్ స్క్రిప్ట్. నా గత సినిమాలన్నీ జాగ్రత్తగా చూసిన అనిల్ వాటన్నిటికంటే చాలా బాగా రెచ్చిపోయాలా నన్ను చూపించాడు’’ అన్నారు వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదివారం వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నాకెంతో క్లోజ్. నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ఎన్నో సినిమాలు నేను ఇక్కడ చేశాను. ‘స్వర్ణకమలం, సుందరకాండ, గురు’... ఇన్‌ఫ్యాక్ట్ ‘మల్లీశ్వరి’ సినిమాలో కత్రినాకైఫ్‌తో ఇదే బీచ్‌లో అలా నడుస్తూ ఉన్నాను కదా (నవ్వుతూ). వైజాగ్ నాకెంతో లక్కీ ప్రదేశం. మా పెళ్లాలు (తమన్నా, మెహరీన్) రాలేదు. దానికే కొంచెం అందరం ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాం (నవ్వుతూ). మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీకి థ్యాంక్స్. ‘ఎఫ్ 2’ లాంటి మంచి సినిమా ఇస్తున్నందుకు ‘దిల్’రాజుగారు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. వారితో చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో బ్రదర్ మహేశ్‌ని సంపాదించుకున్నా.. ‘ఎఫ్ 2’ సినిమాకి మరో బ్రదర్ వరుణ్ని సంపాదించుకున్నా. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న బాలయ్య బాబు (యన్.టి.ఆర్. కథానాయకుడు), చరణ్ (వినయ విధేయ రామ), రజనీకాంత్‌సార్ (పేట) సినిమాలన్నీ బాగా ఆడాలి.. మరోసారి తెలుగు సినిమా సత్తా చాటాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కరెక్టుగా 2014 డిసెంబరు 31న నేను, బన్నీ (అల్లు అర్జున్) ఇక్కడే వైజాగ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. 2017లో సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద పోటీ అని అందరం భావించాం. బాలకృష్ణగారి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్లాసిక్ సినిమా అయింది.. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అయింది. మా ‘శతమానం భవతి’ మంచి సినిమా అయ్యి జాతీయ అవార్డు వరకూ వెళ్లింది. 2019 సంక్రాంతికి మళ్లీ మూడు సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ మూడు సినిమాలు పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెంకటేశ్‌గారితో మా బ్యానర్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్‌తో ‘ఫిదా’ సినిమాలు చేశాం. వారిద్దరితో మల్టీస్టారర్‌గా ఇప్పుడు తీసిన ‘ఎఫ్ 2’ సంక్రాంతికి రాబోతోంది. ఇద్దరూ నిర్మాతకి కంఫర్టబుల్ హీరోలు. థ్యాంక్యూ వెంకీ సార్. మంచి కథ కుదిరితే మీతో మరో సినిమా చేయాలనే కోరిక ఉంది. వరుణ్ ఆల్మోస్ట్ ఓ ఫ్యామిలీ మెంబర్. చిరంజీవిగారిలోని లక్షణాలు తీసుకుని మంచి సినిమాలు చేస్తూ ఎదుగుతున్న వరుణ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరవుతాడు. అనిల్ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నా. మా బ్యానర్‌కి మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందని అప్పుడే తెలుసు. అనిల్ గత చిత్రాలు ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అయితే ‘ఎఫ్ 2’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే ఈ సినిమాకి ‘సంక్రాంతి అల్లుళ్లు’ వస్తున్నారని మరో ట్యాగ్‌లైన్ పెట్టాడు. సినిమాలో ఒకరు ఆంధ్ర అల్లుడు.. మరొకరు తెలంగాణ అల్లుడు. మా బ్యానర్లో అనిల్‌కి వరుసగా మూడో సినిమా. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. దేవిశ్రీతో ‘ఆర్య’ నుంచి మా జర్నీ మొదలైతే ‘ఎఫ్ 2’ పదో సినిమా. ఇప్పటి వరకూ 9 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నా యాక్టింగ్ కెరీర్ ఇక్కడి నుంచే మొదలైంది. వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. ‘ఎఫ్ 2’కి దేవి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నా గత సినిమాలు చూసి ఈ పాత్ర ఎవరూ నాకు ఇవ్వరేమో? కానీ అనిల్ చాలా ధైర్యం చేసి ఇచ్చాడు.. బాగానే చేశా. ఓ ఫ్రెండ్‌లా, మెంటర్‌లా వెంకటేశ్ సార్ నన్ను ప్రోత్సహించడంతో ఈ జర్నీ చాలా హ్యాపీగా సాగింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మా ఫన్, ఫ్రస్ట్రేషన్ వైజాగ్ బీచ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే ఈ కథ ఇక్కడే రాశాం. వెంకటేశ్‌గారితో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది. ఈ సినిమాతో వెంకీగారు మిమ్మల్ని టైమ్ మెషీన్లో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి’.. అక్కడికి తీసుకెళ్లిపోతారు. వరుణ్ తొలిసారి ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు మిమ్మల్ని నవ్విస్తాయి. దేవిశ్రీగారు ఆరు పాటలూ మంచివి ఇచ్చారు. జీవితంలో ఎన్ని ఉన్నా నవ్వులు లేకపోతే అదో వెలితి. సంక్రాంతికి మీ కుటుంబంతో వచ్చి మా సినిమా చూడండి.. తప్పకుండా నవ్వుకుని బయటికెళతారు’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూస్తే మీలోని ఫ్రస్ట్రేషన్ వదిలేసి ఫన్‌తో ఇంటికెళతారు. వెంకటేశ్‌గారికి విక్టరీ అలవాటైపోయింది. మీరు చాలామందికి స్ఫూర్తి సార్. వరుణ్‌తో తొలిసారి చేస్తున్నా. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. అనిల్‌తో చాలా సరదాగా ఉంటుంది. ‘దిల్’ రాజుగారితో నా జర్నీ ఇంకా ఇంకా సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ వేడుకలో పాటల రచయితలు కాసర్ల శ్యాం, శ్రీమణి, బాలాజీ, నటుడు ‘సత్యం’ రాజేశ్, నటి హరితేజ, లైన్ ప్రొడ్యూసర్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఎఫ్ 2’ వర్కింగ్ స్టిల్స్
-
పెళ్లికి ముందు.. పెళ్లి తర్వాత!
‘‘చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటారు. అదే ఓ మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత’’ అంటున్నారు వెంకటేశ్. పెళ్లి చేసుకున్న వాళ్ల కష్టాల మీద సెటైరికల్‌గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా ‘దిల్’ రాజు నిర్మించారు. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ రోజు వెంకటేశ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘ఎఫ్ 2’ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉండబోతోందని టీజర్ చెప్పేసింది. ‘సంక్రాంతికి గట్టిగా నవ్వించేట్టున్నారుగా?’ అని ఓ పాత్ర అడగ్గా. ‘అంతేగా.. అంతేగా..’ అంటూ నవ్వులు పంచారు వెంకీ, వరుణ్. సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్. -
ఫన్నీగా ఎఫ్2 టీజర్!
విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దిల్’ రాజు‘ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా వెంకటేష్ బర్త్‌డే(డిసెంబరు 13) కంటే ఒకరోజు ముందుగానే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘ఒక మగాడి జీవితం గురించి చెప్పాలంటే పెళ్లికి మందు... పెళ్లికి తర్వాత.. పెళ్లాన్నిఎలా అదుపులో పెట్టాలో నాకు తెలుసు’ వంటి డైలాగ్స్ వింటుంటే ఎఫ్2.. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైడర్ అని తెలుస్తోంది. కాగా తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ప్రత్యేక అతిథి
‘క్షణం, గాయత్రి, రంగస్థలం’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి అనసూయ. ఇప్పుడు ఆమె ‘ఎఫ్ 2’ చిత్రంలో ఓ అతిథి పాత్ర పోషించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మోహరీన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. ‘‘ఎఫ్ 2’ చిత్రంలో అనసూయ అతిథి పాత్ర చేశారు. అలాగే ఓ సాంగ్‌లో కూడా కనిపిస్తారు’’ అని పేర్కొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన అనిల్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు అనసూయ. -
తెలియజేయునది ఏమనగా..!
‘‘ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. ఈ నెల 12న మా చిత్రం ‘ఎఫ్ 2’టీజర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని వచ్చే ఏడాది వెండితెర సంక్రాంతి అల్లుళ్లు వెంకటేశ్, వరుణ్ తేజ్ గురువారం చాటింపు వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ఇందులో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. త్వరలోనే ఈ సాంగ్‌ను కూడా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్లో వస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైడర్ ‘ఎఫ్ 2’. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్‌ను సాధించిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. త్వరలో పాటలను విడుదల చేసి, సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. -
‘ఎఫ్2’ టీజర్ ఎప్పుడంటే..?
ఫుల్ స్వింగ్‌లో ఉన్న యంగ్‌డైరెక్టర్ అనిల్ రావిపూడి.. మాస్ పల్స్‌ను పట్టుకోవడంలో దిట్ట. తీసిన మూడు సినిమాల్లో కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ప్రతీది ఉండేలా.. మాస్కు చేరువయ్యేలా తెరకెక్కించారు. పటాస్, సుప్రీమ్, రాజాదిగ్రేట్ సినిమాలతో వరుసగా హిట్లు కొట్టిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఎఫ్2(ఫన్ అండ్ ఫస్ట్రేషన్) అనే మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక వరుసగా ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనిలో భాగంగానే వెంకటేష్ పుట్టిన రోజు(డిసెంబర్ 13) సందర్భంగా.. స్పెషల్ తేదీ(డిసెంబర్ 12)న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. -
రేపటి నుంచి ‘ఎఫ్ 2’ సందడి..!
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్‌లు కలిసి నటిస్తున్నారు. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసిన చిత్రయూనిట్, రేపటి(బుధవారం) నుంచి సినిమా అప్ డేట్స్ ఇవ్వనున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. We are nearing end of shoot. Updates will start flowing from tomorrow. Stay tuned. #F2 #FunAndFrustration #F2Sankranthi#VictoryVenkatesh @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada Directed by @AnilRavipudi — Sri Venkateswara Creations (@SVC_official) 4 December 2018 -
మెగా హీరో గ్యాప్‌లేకుండా వస్తున్నాడే!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఆ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం ఒక సవాల్. అలా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫిదా, తొలిప్రేమతో కూల్ హిట్స్ కొట్టిన వరుణ్.. తాజాగా ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’లతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో ‘ఘాజీ’ తెరకెక్కించిన సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్ నటించిన ‘అంతరిక్షం’ డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన తరువాత తక్కువ గ్యాప్‌లోనే ‘ఎఫ్2’ చిత్రం కూడా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఒకటి సైన్స్ ఫిక్షన్ కాగా, రెండోది మాస్ ఎంటర్టైనర్ కాబట్టి రెండింటికి విజయావకాశాలు ఎక్కువే. సో.. ఈ మెగా హీరో బ్యాక్‌టుబ్యాక్ హిట్స్ కొట్టబోతున్నాడని అభిమానులు సంబరపడిపోతున్నారు. -
ఓన్లీ ఫన్
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్... వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ చిత్రం సెట్స్‌లో నో ఫ్రస్ట్రేషన్. ఓన్లీ ఫన్. ఎందుకంటే అనిల్ రావిపూడి బర్త్‌డే. ఈ సందర్భంగా అనిల్ కేక్ కోశాక.. చిత్ర కథానాయికలు తమన్నా, మెహరీన్‌లు ఇలా కేక్ పూసి, ఫన్ చేశారు. అన్నట్లు సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఫన్ శాంపిల్ రెడీ
‘పటాస్, రాజా ది గ్రేట్’ వంటి హిలేరియస్ ఎంటర్టైనర్లు అందించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు మూడో సినిమాతో బిజీగా ఉన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్‌లతో ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్నారు. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. అనిల్ సినిమాలంటేనే ఎంటర్టైన్మెంట్. ఇక ఇద్దరు హీరోలంటే డబుల్ ఫన్ ఉంటుందని ఊహించవచ్చు. వీళ్లకు జోడీగా సందడి చేయడానికి తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా ఉన్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ నెలాఖరుతో షూటింగ్‌కు ప్యాకప్ చెప్పి ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మోతాదు ఎంత ఉంటుందనేది తెలియడానికి ఇంకా టైమ్ ఉంది. ఈలోపు చిన్న శ్యాంపిల్‌ను ప్రేక్షకులకు చూపించడానికి రెడీ అయ్యారు టీమ్. వెంకటేశ్ బర్త్‌డే (డిసెంబర్ 13) సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. అలాగే సినిమాను సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 9న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
సంక్రాంతికి అల్లుళ్లు వస్తున్నారు
సంక్రాంతి పండగంటే కొత్త అల్లుళ్లు ఇంటికి రావడం సంప్రదాయం. సినీ అల్లుళ్లు ‘వెంకటేశ్, వరుణ్’ కూడా సంక్రాంతికి థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అయ్యారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. చిత్రనిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా సంస్థలో వస్తోన్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్. కమర్షియల్ హంగులతో పర్ఫెక్ట్ లాఫ్టర్ రైడ్‌లాంటి చిత్రం. మూడు హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తోన్న చిత్రం. ఇప్పటి వరకూ 80శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, క్లైమాక్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. సంక్రాంతికి విడుదలకి ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
‘ఎఫ్2’ ఫస్ట్‌లుక్.. సంక్రాంతికి జోష్!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తరహాలో వినోదాత్మకంగా సాగే ఎఫ్2(ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రషూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. దీపావళి కానుకగా.. విడుదల చేసిన ఈ పస్ట్‌లుక్‌లో వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్ హుషారుగా ఉన్నారు. ఫుల్‌జోష్‌లో ఉన్న ఈ జోడీలు సంక్రాంతికి సరదాలను పంచడానికి రెడీ అవుతున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్సంగీతాన్ని అందిస్తున్నారు. Oo araganta ...munduga....😀😀😀..Here go...#F2 first look #VictoryVenkatesh.garu...@IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP Garu..😀😀😀 pic.twitter.com/GWvBWpTegJ — Anil Ravipudi (@AnilRavipudi) November 5, 2018 -
‘వెంకీ’తో ‘గబ్బర్ సింగ్’ సెల్ఫీ!
విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం మల్టిస్టారర్‌లో చిత్రాలతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్, నాగ చైతన్యతో కలిసి సినిమాలు చేస్తున్నారు వెంకీ. దీంట్లో వరుణ్ తేజ్‌తో కలిసి చేస్తున్న ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వెంకీ ప్రస్తుతం ఎఫ్2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ షూటింగ్ విరామ సమయంలో అక్కడి వచ్చిన గబ్బర్‌సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ వెంకీతో ఓ సెల్ఫీని క్లిక్‌మనిపించాడు. హరీష్ శంకర్ ఈ పిక్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. డీజేతో పలకరించి ఏడాది కంటే ఎక్కువే అయినా.. ఈ డైరెక్టర్ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. ఇక ఈ మాస్ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలై, ఇంకెప్పుడు విడుదలవుతుందో వేచి చూడాలి. Fun time with Victory Venkatesh Gaaru .. on the sets of #F2 thank you for the wonderful time sir :) pic.twitter.com/uSuhZ2Abwx — Harish Shankar .S (@harish2you) 4 November 2018 -
రేపే ‘ఎఫ్ 2’ ఫస్ట్ లుక్!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘ఎఫ్2’ (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ హీరోలిద్దరు కూలీలుగా ఉన్న పిక్‌ను డైరెక్టర్ సోషల్ మీడియాలో పోస్ట్చేయగా వైరల్ అయింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సోమవారం విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. నవంబర్ 5న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నారు. వెంకీకి జోడిగా తమన్నా, వరుణ్‌కు జోడిగా మెహ్రీన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. -
కూలీలుగా..!
సరదాగా ‘ఎఫ్ 2’ సినిమా కోసం కూలీలుగా మారారట వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కి జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు కూలీ బ్యాడ్జ్‌లు కట్టుకున్న ఒక ఫొటోను ట్వీటర్లో పోస్ట్ చేశారు అనిల్ రావిపూడి. ఇన్సెట్లో ఉన్న ఫొటో అదే. ఒక బ్యాడ్జ్‌పై ‘కూలీ నెం 1’ అని, మరో బ్యాడ్జ్ పై ‘కూలీ 786’ అని ఉంది. దీంతో ‘కూలీ నెం.1’ వెంకటేశ్ సినిమా కాబట్టి ఆ బ్యాడ్జ్ ఉన్న హ్యాండ్ వెంకీది అని, ‘ఖైదీ నంబర్ 786’ చిరంజీవి సినిమా కాబట్టి ఆ హ్యాండ్ వరుణ్ తేజ్‌ది అని ఊహలు మొదలయ్యాయి. ఏ సీన్ కోసం వెంకీ, వరుణ్ కూలీలుగా మారారు? అన్నదే సస్పెన్స్. ఇందులో ఈ ఇద్దరూ ఫుల్ లెంగ్త్ కూలీలు కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
మల్టీస్టారర్‌లో.. కూలీలుగా మారిన హీరోలు!
పటాస్, సుప్రీమ్, రాజా దిగ్రేట్ సినిమాలతో డైరెక్టర్‌గా హ్యాట్రిక్ హిట్‌ను కొట్టారు అనిల్ రావిపూడి. మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తనదైన శైలిలో సినిమాను తెరకెక్కిస్తారు డైరెకర్ అనిల్ రావిపూడి. అయితే ప్రస్తుతం వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో ఎఫ్2 (ఫన్ అండ్ ఫస్ట్రేషన్) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్డేట్ను అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా పంచుకుంటారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ పిక్‌ను పోస్ట్ చేశారు. వెంకటేష్ సూపర్ హిట్ మూవీ కూలీ నెం.1 స్టైల్లో ఉన్న ఈ స్టిల్‌లో.. కూలీ నెం.786 వరుణ్ అని, కూలీ నెం.1 వెంకటేష్ అని అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే కూలీ బ్యాడ్జ్‌లో పశ్చిమ రైల్వే అని ఉన్నందున ఈ చిత్రం కథా నేపథ్యం ముంబై ప్రాంతానికి చెంది ఉండొచ్చని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తమన్నా, మెహరీన్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. #V2 (Venkatesh Garu & Varun Tej) 😀😀#F2(fun & Frustration)😀😀😀 pic.twitter.com/QCQJXHCty1 — Anil Ravipudi (@AnilRavipudi) November 2, 2018 -
సందడే సందడి
‘ఎఫ్ 2’ బ్యాచ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో హంగామా చేస్తున్నారు. మొన్నామధ్యే కదా బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చారు అంటే.. అవును.. కానీ, తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం మళ్లీ అక్కడికే వెళ్లారు. ‘ఎఫ్ 2’ బ్యాచ్ బ్యాంకాక్‌లో చేసిన సందడి ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉప శీర్షిక. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ షెడ్యూల్ నవంబర్ 5 వరకు జరగనుందని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరగబోయే 15 రోజుల చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుందని సమాచారం. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా మేజర్ షూటింగ్ విదేశాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
మరో టూర్‌కి సిద్ధం
ప్రాగ్ వెళ్లి వచ్చిన తోడల్లుళ్లు తర్వాత ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అయ్యారు. మరి ఈసారి డ్యూయెట్ పాడతారో ఏదైనా ముఖ్యమైన సన్నివేశాల కోసమో అన్నది తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరగనుందన్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తవుతుందని టాక్. ఆ తర్వాత లాస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారట. మొత్తం షూటింగ్‌ను నవంబర్ నెలలో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కా చెల్లెళ్లుగా కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
ఫ్లాప్ డైరెక్టర్‌తో వెంకీ..!
ఇటీవల సినిమా ఎంపికలో కాస్త స్లో అయిన వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో కలిసి ఎఫ్2 సినిమాలో నటిస్తున్న ఈ సీనియర్ స్టార్ త్వరలో నాగచైతన్యతో వెంకీ మామ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా వెంకటేష్ హీరోగా మరో సినిమా తెరకెక్కనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బొమ్మరిల్లు సినిమాతో హాట్ టాపిక్‌గా మారిన దర్శకుడు భాస్కర్ దర్శకత్వంలో నటించేందుకు వెంకీ ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. బొమ్మరిల్లు తరువాత పరుగుతో పరవాలేదనిపించినా ఆరెంజ్, ఒంగోలు గిత్త సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో భాస్కర్ కెరీర్ కష్టాల్లో పడింది. ఇటీవల బెంగళూర్ డేస్ సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. దీంతో మరోసారి లాంగ్ గ్యాప్ తీసుకున్న భాస్కర్, వెంకటేష్‌కు ఓ లైన్ వినిపించారట. వెంకీకి ఆ లైన్ నచ్చటంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నారన్న టాక్ వినిపిస్తోంది. వెంకీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో భాస్కర్ సినిమా ఓకె అయిన సెట్స్ మీదకు వెళ్లడానికి చాలా సమయమే పడుతుంది.