
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో మంచి ఫామ్‌లోకి వచ్చారు వరుణ్ తేజ్. డిఫరెంట్ కథలను ఓకే చేస్తూ.. విజయాలను సొంతం చేసుకుంటున్నారు హీరో వరుణ్. ఈ మెగాహీరో ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేయబోతున్న మల్టిస్టారర్ మూవీ ఎఫ్2(ఫన్ అండ్ ఫస్ట్రేషన్) షూటింగ్ ఇటీవలె ప్రారంభమైంది. ఈరోజు సెట్‌లో అడుగుపెడుతున్నట్లు వరుణ్ ట్వీటర్ ద్వారా అభిమానులకు తెలిపారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో మరో ప్రాజెక్ట్‌ను కూడా ఓకే చేశారు ఈ మెగా హీరో.
Another beautiful day..
— Varun Tej Konidela (@IAmVarunTej) July 5, 2018
Another exciting role &
A new chapter starts today!
Rolling for #F2 begins!
🤘🏽😎🤘🏽@AnilRavipudi ready for the fun to begin???