
సినిమా: నటి తమన్నాను మరోసారి అదృష్ణం వెంటాడుతోందనే చెప్పాలి. సినిమాలో ప్రతిభ ఉన్నా, అదృష్టం చాలా అవసరం. ఆ మధ్య వరుసగా అపజయాలు ఎదురవడంతో ఈ మిల్కీబ్యూటీపై ఐరెన్‌లెగ్ నటి అని ముద్రవేసేశారు. తెలుగులో ఎఫ్–2 విడుదల ముందు వరకూ తమన్నా అవకాశాల విషయంలో ఎదురీదింది. కోలీవుడ్‌లోనూ అదే పరిస్థితి. ఇక్కడ శింబుతో నటించి అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్ర ఫ్లాప్ తమన్నాకు బాగా ఎఫెక్ట్ ఇచ్చింది. ఆ తరువాత నటించిన కన్నె కలైమానే చిత్ర రిజల్ట్ ఈ బ్యూటీకి ప్లస్ అవలేదు. అయితే ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఇతర నటీమణులకు రావలసిన అవకాశాలను తమన్నా తన్నుకుపోతోందనే ప్రచారం వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రభుదేవాతో నటించిన దేవి–2 చిత్రం నిర్మాణకార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు మూడు కొత్త చిత్రాలు తమన్నా కోసం ఎదురుచూస్తున్నాయి. వాటిలో రెండు విశాల్‌తో రొమాన్స్ చేసేవి కావడం విశేషం. అందులో సుందర్.సీ దర్శకత్వంలో నటించనున్న చిత్రం షూటింగ్ త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది.ఈ చిత్రం కోసం మిల్కీబ్యూటీ ఆ చిత్ర యూనిట్‌లో కలిసి టర్కీ నగరానికి పయనం అవుతోంది.
అవును దర్శకుడు సుందర్.సీ ఈ చిత్ర షూటింగ్‌ను అధిక భాగం అక్కడే చిత్రీకరించడానికి ప్లాన్ చేశారట. ఈ చిత్రం కోసం తమన్నా ఏకంగా 50 రోజులు కాల్‌షీట్స్ కేటాయించిందని సమాచారం. అదే కణ్‌గళ్ చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు రోహిత్ వెంకటేశన్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించబోతోంది. ఇది హర్రర్ ఇతివృత్తంలో తెరకెక్కనున్న చిత్రం. ఇలా తమన్నాకు మరోసారి అదృష్టం తలుపు తట్టడంతో ఇతర హీరోయిన్ల అవకాశాలు తమన్నా రాబట్టకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. అదే విధంగా హీరోయిన్ల మధ్య పోటీ, పోరు జరుగుతోందని, ఒకరి అవకాశాలను మరొకరు ఎగరేసుకుపోవడం సినిమాల్లో సహజం అనే ప్రచారం హోరెత్తుతోంది. దీనికి స్పందించిన తమన్నా ఎవరి అవకాశాలు వారి చేతిలోనే ఉంటాయని అంది. ఒకరి అవకాశాలను మరొకరు తన్నుకు పోయే పరిస్థితి ఇక్కడ లేదని అంది. అదే విధంగా హీరోయిన్ల మధ్య స్నేహం ఉండదు, అంతా పోటీ, పోరేననడం సరికాదు అని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే ఇద్దరు హీరోయిన్లు మధ్య స్నేహాన్ని అదేదో ప్రపంచంలోనే జరగని విషయంగా చూస్తున్నారని అంది. సినిమారంగంలో దర్శకులు, హీరోయిన్లు, కెమెరామెన్లు ఇలా చాలా మంది స్నేహంగా మెలుగుతుంటారని, అయితే వారి మధ్య వృత్తి రీత్యా పోటీ ఉంటుందని చెప్పింది. అయితే ప్రతిభపై నమ్మకం లేని వారికే పోటీ, అసూయ, భయం లాంటివి ఉంటాయని అంది. ఇక్కడు ఎందరు హీరోయిన్లు ఉన్నా వారి ప్రతిభకు తగ్గట్టు అవకాశాలు లభిస్తాయని, ఒక వేళ ప్రతిభ ఉన్నా అవకాశాలు రాకపోతే అది వారి దురదృష్టం అని తమన్నా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment