
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి టాలీవుడ్ ప్రియులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. టాలీవుడ్‌లో శ్రీ మూవీతో మొదలైట్టిన తమన్నా పలు సూపర్ హిట్ చిత్రాలో నటించింది. హ్యాపీ డేస్, అల్లు అర్జున్ బద్రీనాథ్, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, ఎఫ్2, రచ్చ లాంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. అయితే గతేడాది జైలర్, స్త్రీ-2 చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది.
తాజాగా బాలీవుడ్‌లో ఓ థియేటర్ వద్ద మెరిసింది. రవీనా టాండన్ ముద్దుల కూతురు రషా తడానీ నటించిన తొలి చిత్రం ఆజాద్ చూసేందుకు తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి థియేటర్‌కు వచ్చింది. ఈ సందర్భంగా రషా తడానీ, తమన్నా మధ్య ఆసక్తకర సంభాషణ చోటు చేసుకుంది. తనను ఆంటీ అని పిలవచ్చని రషా తడానీతో సరదాగా మాట్లాడింది తమన్నా. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
తమన్నా భాటియా- రషా తడానీ రిలేషన్..
కాగా.. బాలీవుడ్ భామ రషా తడానీ (19), తమన్నా భాటియా (35) చాలా మంచి స్నేహితులు. గతంలో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తమన్నాను గురించి చెప్పమని రషాను అడిగినప్పుడు తాను నాకు మరో అమ్మలాంటి వ్యక్తి అని చెప్పింది. తమన్నా, విజయ్ వర్మ తనను దత్తత తీసుకున్నారంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది.
SHOCKINGLY #Tammana Says CALL ME AUNTY no issue #RashaTadani - Great Gesture From Tammu 😳😳😳😳😳
pic.twitter.com/qJjC0iHLbh— GetsCinema (@GetsCinema) January 21, 2025