aunty
-
‘మమత అక్క కాదు.. గయ్యాళి అత్త’
పశ్చిమ బెంగాల్లో సందేశ్‌ఖాలీ ఘటన వెలుగు చూసినప్పటి నుంచి మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఉద్యమించాయి. అయితే రాష్ట్రంలోని శాంతియుత వాతావరణాన్ని బీజేపీ చెడగొట్టిందని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు బెంగాల్ రాజకీయాలన్నీ సందేశ్‌ఖాలీ చుట్టూ తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత శుభేందు అధికారి మరోసారి బెంగాల్ ముఖ్యమంత్రిని టార్గెట్ చేశారు. మమతా బెనర్జీ ఇప్పుడు అక్క(దీదీ) కాదని, గయ్యాళి అత్తగా మారిపోయారని ఆరోపించారు. ఇకపై మమతా బెనర్జీని ‘దీదీ’ అని పిలవడం మానేయాలని అన్నారు. ఇది అత్త, మేనల్లుడి ప్రభుత్వమని ఆరోపించారు. దీదీ అనే పేరులో మానవత్వం స్ఫురిస్తుందని, అయితే మమతా బెనర్జీలో క్రూరత్వం ప్రతిబింబిస్తోందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమెను ఓడించానని, అందుకే తనపై 42 కేసులు పెట్టారని శుభేందు అధికారి ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న సందేశ్‌ఖాలీ గ్రామం నిరసనలకు సాక్షిగా మారింది. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు ఇటీవల టీఎంసీ నేత షాజహాన్ షేక్‌తో పాటు ఇతర నేతలు తమ భూములను స్వాధీనం చేసుకున్నారని, లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నేపధ్యంలోనే ఈ ప్రాంతం నిరసనలకు నిలయంగా మారింది. -
సోషల్ మీడియాతో కుమారి ఆంటీకి క్రేజ్.. ప్రముఖ ఓటీటీ బిగ్ ప్లాన్!
ఇప్పుడు కాలాన్ని కలియుగం కంటే సోషల్ మీడియా యుగం అంటే బాగుంటుందేమో. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాను ప్రజలు విపరీతంగా వాడేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏకంగా అడిక్ట్ అయిపోయారనుకోండి. 'వాడటం మొదలు పెడితే మాకన్న బాగా ఎవరూ వాడలేరు' అనే మిర్చి సినిమా డైలాగ్ గుర్తుకొచ్చేలా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. అందువల్లే క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోతున్నారు. అలానే ఇటీవల సోషల్ మీడియాలో పేరు తెలియని వారు కూడా ఒక్కసారిగా ఫేమస్ అయిపోతున్నారు. సినిమా స్టార్లను మించి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో చరవాణి ఉండడం.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ పెరిగిపోవడంతో మరింత ఈజీగా మారిపోయింది. ఇటీవలే గుంటూరు కారం సాంగ్‌తో కుర్చీ తాత ఫేమస్ అయ్యారు. అదే స్టైల్లో రోడ్డు పక్కన ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారి ఆంటీకి విపరీతమైన క్రేజీ వచ్చింది. ఆమె హోటల్‌కు ఒక్కసారిగా కస్టమర్ల రద్దీ పెరిగిపోయింది. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఆమె హోటల్‌కు వెళ్లి వచ్చాక మరింత ఫేమస్ అయిపోయింది. దీంతో యూట్యూబర్స్ అంతా ఒక్కసారిగా కుమారి ఆంటీ వెంటపడ్డారు. దీంతో ఒక్కసారిగా ఆమె బిజినెస్ ఓ రేంజ్‌కు దూసుకెళ్లింది. అయితే అది కాస్తా కుమారి ఆంటీకి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. ట్రాఫిక్‌కు అంతరాయం అవుతోందంటూ పోలీసులు ఆమె బిజినెస్‌ను అడ్డుకునేస్థాయికి తీసుకొచ్చింది. కానీ చివరికీ మళ్లీ ఆమెను సడలింపు ఇచ్చారు కూడా. అయితే ఇంతలా ఫేమస్ అయిన కుమారి ఆంటీపై ఏకంగా సినిమానే తీయనున్నట్లు తెలుస్తోంది. అసలు ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? అనే ఆసక్తికర అంశాలతో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంతవరకు దీనిపై ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ప్రస్తుతం ఈ టాపిక్ అయితే నెట్టింట అప్పుడే చర్చ మొదలైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్‌గా క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీపై డాక్యుమెంటరీ సినిమాగా వస్తే ఆమె రేంజ్ వేరే లెవెల్‌కు చేరుతుందంటున్నారు నెటిజన్స్. -
కుమారి ఆంటీ ఎపిసోడ్లో ట్విస్ట్!
Kumari Aunty News: సోషల్ మీడియాతో వచ్చిన పాపులారిటీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదనే విషయం దాసరి సాయికుమారి అలియాస్ కుమారి ఆంటీకి బోధపడినట్లు ఉంది. ఫేమ్ కోసమో.. తన వ్యాపారం నడవాలనో.. లేక అమాయకత్వంతోనో అడ్డగోలుగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఎక్కడెక్కడి నుంచో జనం క్యూ కట్టడంతో.. ఆమె దుకాణం ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తోందని, మరో చోటుకి తరలించాలని ట్రాఫిక్ పోలీసలు ఆదేశించడం వార్తలెక్కింది. అయితే.. ఈ విషయం అదే సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ కావడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ వ్యాపారానికి ఇబ్బంది కలిగించవద్దని డీజీపీ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ వద్ద ఎక్కడైతే ఆమె స్ట్రీట్‌ఫుడ్ కోర్టు నడుస్తుందో.. అక్కడే నడిపించుకునేందుకు వీలు కల్పించారు. దీంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె ఇంతలా పాపులర్ కావడానికి కారణమైన ‘ఎక్స్ట్రా టూ లివర్స్’ కస్టమర్‌తో సహా మళ్లీ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఆమె ఇంటర్వ్యూల కోసం ఎగబడుతున్నారు. దీంతో ఈసారి ఆమె తన సంపాదనతో సోషల్ మీడియాలో ఇంకా నానుతూనే ఉంది. ఇది చాలదన్నట్లు.. త్వరలో ఆమె ఫుడ్‌కోర్టును సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సందర్శిస్తారని ప్రచారం ఒకటి బయటకు వచ్చింది. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డి మీ ఫుడ్ స్టాల్ వద్దకు వస్తాను అన్నారు కదా జీవో 46 రద్దు చేయమని ఆయనతో చెప్పండి అంటూ నిరుద్యోగులు ఆమెను చుట్టుముట్టి తెగ ఇబ్బంది పెట్టారు.. పాపం. తనకు ఇవేవీ తెలియవని.. దయచేసి తనను ఇబ్బంది పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే.. వాళ్లలో కొందరు సీఎం రేవంత్ రెడ్డి మీ వద్దకు వచ్చినప్పుడు ఈ దరఖాస్తు ఇవ్వాలంటూ ఆమె చేతికి ఇవ్వబోయారు. ఈ ఘటనతో ఇప్పటికే మీ సమస్యను ఆయన(సీఎం రేవంత్) విని ఉంటారని చెబుతూ ఆమె ఆ దరఖాస్తును స్వీకరించేందుకు ఇష్టపడలేదు. పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో 46 నుంచి టీఎస్ఎస్పీ పోస్టులను మినహాయించాలని గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కాంగ్రెస్ కూడా నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. Unemployed protest at Kumari Aunty's food stall! Unemployed protest that Revanth Reddy said he will come to your food stall, tell him to cancel Jivo 46. #KumariAunty #RevanthReddy pic.twitter.com/NZhG4iVU4L — MD HAJI (@MDHAJI63535465) February 3, 2024 Video Credits: MD HAJI ఇదీ చదవండి: సామాన్యులకు సోషల్ మీడియా వరమా? శాపమా? -
మళ్లీ హోటల్ తెరుస్తాననుకోలేదు: కుమారి ఆంటీ
హైదరాబాద్, సాక్షి: ఫుడ్ స్టాల్‌తో నగరంలోని మాదాపూర్ ప్రాంతంలో ఫేమస్ అయ్యి.. ఆపై సోషల్ మీడియా ద్వారా ఆ ఫేమ్‌ను మరింత పెంచుకుంది కుమారి ఆంటీ. అయితే ఆ ఫేమ్ వల్లే జనాలు ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర గుమిగూడడం.. అది ట్రాఫిక్ జామ్‌కు దారి తీయడంతో ఆమె స్టాల్‌ను పోలీసులు బలవంతంగా తొలగించాల్సి వచ్చింది. ఈ పరిణామంపై తీవ్ర చర్చ నడవగా.. చివరకు తెలంగాణ సర్కార్ ఆమెకు ఊరట ఇచ్చింది. ఈ పరిణామంపై ఆమె సాక్షితో స్పందించారు. ‘‘గత 13 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నా. ముందు మాకు తొలగించాలని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. నిన్న 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయింది. నా ఫుడ్ కోర్టు బండిని సీజ్ చేశారు. మా కొడుకును పోలీసులు కొట్టారు. మళ్లీ హోటల్ తెరుస్తామని మేం అసలు అనుకోలేదు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించడం గొప్ప విషయం. అందుకు సీఎం రేవంత్‌రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారామె. కుమారి ఆంటీ అసలు పేరు దాసరి సాయి కుమారి. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె కొన్నేళ్లుగా ఫుడ్‌స్టాల్ నడిపిస్తోంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమె గురించి ఎక్కువ చర్చ నడిచింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆమె ఫుడ్ స్టాల్‌కు జనాల రాక మొదలైంది. ఈ క్రమంలో జనం భారీగా గుమిగూడి.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూ వస్తోంది. దీంతో మంగళవారం ఆమె షాప్‌ను సీజ్ చేసి.. మరో చోటుకి తరలించాలని పోలీసులు ఆదేశించారు. అయితే మిగతా వాళ్లను వదిలేసి తననే తొలగించాలని ఆదేశించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కుమారి ఆంటీ అందుకే టార్గెట్ అయ్యిందా? మరోవైపు ఈ పరిణామంపై అదే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వైఖరిని ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తప్పు పట్టింది. సీఎం జగన్ తనకు మంచి చేశారని.. ఇళ్లు ఇచ్చారని ఆమె చెప్పడం వల్లే ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించింది. దీంతో వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చక ముందే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె ఫుడ్‌కోర్టును యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్ర డీజీపీతో పాటు ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్లు సీఎంవో తెలిపింది. మరోవైపు ఈ సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఆమె స్టాల్‌కు వెళ్లనున్నారనే ప్రచారం ఒకటి నడుస్తోంది. -
సోషల్ మీడియా సామాన్యులకు వరమా? శాపమా?
ఒకప్పుడూ ఇలాంటి సోషల్ మీడియాలు లేని ఆ కాలం చాలా ప్రశాంతంగ సాగిపోయింది. ఏ రోజూ..ఏం వింటాం అనే ఉత్కంఠ, టెన్షన్ మాత్రం లేనేలేవు. ఏదైనా బిజినెస్ మంచిగా సాగాలన్న పేపర్ ప్రకటనలతోనే కొంతమంది ప్రముఖులతోనే ప్రచారం చేయించుకోవడం జరిగేది. ఆలస్యమైనా నిలదొక్కుకునే వారు. సజావుగా సాగేది. అది వ్యాపారమనే కాదు, ఓ వ్యక్తి ఉన్నతి, లేదా సృజనాత్మకత గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా ఆ ఫేమ్ అలా నిలబడేది. ఒకవేళ కాలం కలిసిరాక కష్టాలు ఎదురైనా కొద్దిమందికే తెలిసేది. ఒకవేళ పత్రికల్లో రాసినా పాపం అన్నట్లుగా ఆ వ్యక్తి గురించి చెప్పిచెప్పనట్లుగా చెప్పేవారు. అంతే తప్ప! ఊదరగొట్టి, బెదరగొట్టి పడేసేలా మాత్రం రాసేవారు కాదు. ఇక ఎప్పుడైతే ఇంటర్నెట్ ఓ రేంజ్లో అందరికి సుపరిచితమై ట్విట్టర్, ఇన్‌స్టా, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలు హవా నడవడం మొదలైందో..అప్పటి నుంచి అసలైన సమస్య వచ్చిందనాలా? లేక టెక్నాజీతో దూసుకుపోతున్నాం అనలా తెలియని గందరగోళంలా మారిపోయింది స్థితి. ఎందుకిలా చెబుతున్నానంటే.. సెకనులో తెచ్చిపెట్టే స్టార్డమ్.. ఈ సోషల్ మీడియా అసామాన్యుడిని ఓవర్‌నైట్ సెలబ్రెటీని చేసేస్తుంది. ఓ సామాన్య వ్యాపార వేత్తని సెకండ్లలో ఫేమస్ చేసేస్తుంది. దీంతో వారంతా తమ రంగంలో ఓ రేంజ్లో దూసుకుపోతున్నారు. అంతవరకు బాగానే ఉంది. మధ్యలో ఏదో జరిగి దివాలా తీశాడో ఇక అంతే! ఇక ఆ తర్వాత కూడా వద్దు రా! నన్ను వదిలేయండన్న వినకుండా వెంట పడి వాడి గురించి వీడియో తీసి పెట్టేస్తారు. అంతకుముందు ఏదైతే ఆయా వ్యక్తులకు పాపులారిటీ తెచ్చిపెట్టిందో అదే వాళ్ల కష్టాలకూ, కన్నీళ్లకు కారణమవుతోంది. అలా బలైన వాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఈ టిక్‌టాక్‌లు యూట్యూబ్‌లతో పేరుగాంచిన కచ్చా బాదం సింగర్ నుంచి ఇటీవల వంటలతో పేరు సంపాదించుకున్న కుమారి ఆంటీ వరకు అందరూ ఈ సోషల్ మీడియా బాధితులే అనాలి. ఎందుకంటే..? నిజానికి ఈ ఇద్దర్నీ గమనిస్తే అందులో ఒకరు రోడ్డుపై వేరుశనగలు అమ్ముకుంటే మరోకరు పొట్టకూటి కోసం రోడ్డు పక్కన చిన్న హోటల్ నడుపుతున్నారు మరొకరు(కుమారీ ఆంటీ). వారిలో ఒకరేమో! ..వేరశనగలు విక్రయించేందుకు పాడిన పాట ఎవరో వీడియో తీసీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యిపోయారు. ఆ ఇమేజ్ అతడి వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయల్లా సాగిపోయేలా చేసింది. ఆ తర్వాత అతను ప్రైవేట్ ఆల్బమ్‌లో పాట పాడే స్థాయికి కూడా వెళ్లిపోయాడు. అయితే అతనికి ఒక్కసారిగా వచ్చిన ఇమేజ్, సంపద నిలుపుకోవడం చేతకాలేదు. మళ్లీ యథాస్థితికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న దాని గురించి కూడా ఈ సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నాం. ఇక్కడొకటి గుర్తించుకోండి కిందపడితే సాయం చేసేందుకు వచ్చే చేతులు కూడా కొన్నే. పైగా ఇది వరకటిలా మనపై వీడియో కాదుకదా మన గోడువినేందుకు కూడా ముందుకు రారు. అతడి పనై పోయింది తెలుసుకునేది ఏముంది అన్నట్లుంటుంది వ్యవహారం. ఇక వంటలతో ఫేమ్ సంపాదించికున్న సాయి కూమారి ఆంటీ దగ్గరకు వస్తే..ఆమె మాదాపుర్‌లో ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఏ హంగు ఆర్భాటం లేకుండా జస్ట్ ఓ డేరా కింద హోటల్ నడుపుకుంటుండేది. అందరి దగ్గర వెజ నాన్‌వెజ్ ఏవో రెండు మూడు రకాలు ఉంటాయి ఈమె దగ్గర వెజ్‌కి సంబంధించిన నాన్‌వెజ్‌కి సంబంధించిన పలురకాలు ఉండటమేగాక కాస్త రుచిగా కూడా ఉండటంతో అనతి కాలంలో మంచి పేరు వచ్చేసింది ఆమెకు. దీనికీ తోడు ఈ సోషల్ మీడియా కూడా తోడవ్వడంతో ఆమె బిజనెస్ కూడా ఓ రేంజ్లో దూసుకుపోవడం మొదలైంది. మంచి లాభలతో ఓ రేంజ్లో సాగింది. ఆ ప్రాంతమంతా ఆమె హోటల్ కారణంగా జాతరలా మారి ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడే స్థాయికి వచ్చేసింది. మాములుగానే మన నగరాల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇక ఇలాంటి వాటి కారణంగా ట్రాఫిక్‌కి అంతరాయం ఏర్పడితే అధికారులు ఊరుకుంటారా?. అందులోకి సామాన్యుడి మీదకి లాఠీ ఝళిపించడం చాలా తేలిక. ఇంకేముంది నీ హోటల్ కారణంగానే ట్రాఫిక్ ఏర్పడిందంటూ అధికారులు కూమారీ ఆంటీ హోటల్ని కాస్త మూయించేశారు. నా పొట్టమీద కొట్టొద్దు అంటూ కూమారి ఆంటీ పెడబొబ్బలు పెట్టినా వినిపించుకోలేదు అధికారులు. పార్కింగ్‌కి స్థలం ఇచ్చేంత స్థోమత లేదని ఆమె గోడు వెల్లబోయగా, అదంతా మాకు తెలియదు మీ కారణంగానే ఈ సమస్య అంటూ ఆమెపై కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ రెండు ఘటనలు చూస్తే సోషల్ మీడియా ఫేమే ఆ ఇద్దరికీ కష్టాలు కూడా తెచ్చి పెట్టిందనలా అంటే..ఓ వ్యక్తిలోని టాలెంట్‌ని అందరికీ సుపరిచితం చేసి అతడికో దారి చూపించడం వరకు ఓకే. ప్రతిక్షణం ఆ వ్యక్తినే ఫోకస్ పెట్టేలా చేస్తే వచ్చే సమస్యలే ఇవి. పైగా ఆయా వ్యక్తుల నేపథ్యాన్ని తెలుసుకుని వాటిని కూడా సోషల్ మీడియాలో పెట్టేస్తారు. కనీసం వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు విలువనియ్యకుండా బజారున పెట్టేయడం ఎంతవరకు కరెక్ట్. అక్కడితో ఆగకుండా ఆమె ఇంత సంపాదించేస్తుందంటూ అదేపనిగా ఊదరగొట్టేస్తారు. ఆ తర్వాత ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వాళ్లపై దాడి జరిగితే..మళ్లీ ఇది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. అసలేంటిదీ? మనం ఏం చేస్తున్నాం. ఈ టెక్నాలజీ మాయలోపడి మనుషులమనే విషయమే మర్చిపోతున్నామా!. లేక అవతల వాళ్ల జీవితాలను ట్రెండ్ చేసి సొమ్ము చేసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒక విద్యార్థి ఫెయిలైతేనే ఆ మాష్టారు ఎంతో హుందాగా దగ్గరకు తీసుకుని ఇంకో అవకాశం ఉంది పాసవ్వచ్చు అని ధైర్యంగా చెబుతారు. అందరి ముందు అతడిని నిలబెట్టేసి ఏడిపించరు కదా!. అలాంటిది ఇక్కడ జీవితాలకు సంబంధించినవి నెట్టింట వైరల్ చేస్తున్నాం. వీటిని ట్రెండ్ చేసి ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్. వాళ్లలో ఉండే సృజనాత్మకతను, టాలెంటన్ని పదిమందికి తెలిసేలా చేసేవరకు చాలు. మరీ లోతుగా వెళ్లిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయకండి. ముఖ్యంగా వాస్తవాలేంటో తెలియకుండా కథలు అల్లేయొద్దు. ఇంతకుమునుపు ఇలాంటి వాటి విషయాల్లో వార్తపత్రికలను, మీడియాను తిట్టిపోసేవారు. కానీ ఇప్పుడవే బెటర్‌గా వ్యవహరిస్తున్నాయి. కానీ ఈ టిక్‌టాక్, యూట్యూబ్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ఇన్ఫ్లున్సెర్లు మాత్రం ఎవరు ముందు విషయం షేర్ చేశారు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే దిశగా వెనకాముందు చూడకుండా ఏదీపడితే అది పోస్ట్ చేసి జీవితాలు అల్లకల్లోలమయ్యి, నాశనమయ్యేలా చేసేస్తున్నారు. మీలో దాగున్న ఏదో ఒక స్కిల్‌తో సొమ్ము ఆర్జిచండి ఇలా పక్కోళ్ల జీవితాలకు సంబంధించి అన్నింటిని ట్రెండ్ చేసి సోమ్ము చేసుకోకండి. అది ఎవ్వరికీ మంచి కాదు. ముఖ్యంగా టెక్నాలజీని మనకు ప్రయోజనకరంగా చేసుకోకపోయిన పర్లేదు గానీ హాని చేసేలా మాత్రం చెయ్యొద్దు!. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
HYD: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై స్పందించిన సీఎంవో
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారికి షాక్ ఇచ్చిన పోలీసులు.. ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించిన విషయం తెలిసిందే. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో.. అదే ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంవో ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా? -
అత్తను హత్య చేసి... అడ్డువచ్చిన భార్యపై..
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అత్తను హత్య చేసి అడ్డుపడ్డ భార్య గొంతు కోశాడు. ఈ ఘటన సంగారెడ్డిలోని పటాన్చెరు మండలం ఇస్నాపూర్ పద్మారావు కాలనీలోని ఓ ఇంట్లో జరిగింది. రుద్రారంకు చెందిన సాయిబాబా.. తన భార్య సత్యవతిని సంసారానికి రాకుండా అత్త శాంతమ్మ అడ్డుపడుతోందని కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం అత్త శాంతమ్మ(40) ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. శాంతమ్మపై దాడి చేస్తున్న సమయంలో సాయబాబాను భార్య సత్యవతి అడ్డుకుంది. మరింత కోపంతో సాయిబాబా తన భార్య గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. భార్య గొంతు కోయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన సత్యవతిని చికిత్స కోసం స్థానికులు సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నిందితుడు సాయిబాబా లొంగిపోయియాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. చదవండి: జూబ్లీహిల్స్‌లో కి‘లేడీ’: లిఫ్ట్ అడిగి, బట్టలు చించుకుని కేకలేస్తూ.. -
అలాంటి వాళ్లు ‘ఆంటీ’ అంటే నాకు ఇష్టమే : అనసూయ
అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. బుల్లితెరపై యాంకర్‌గా కెరీర్‌ని ప్రారంభించి.. వెండితెరపై దూసుకెళ్తోంది. నిడివిని పట్టించుకోకుండా.. విభిన్నమైన పాత్రలను పోషిస్తూ.. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా రంగస్థలం’లోని రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయకు మంచి గుర్తింపుని తేవడంతో పాటు వరుస సినిమా అవకాశాలు వచ్చేలా చేసింది. అయితే అనసూయ మాత్రం సినిమా ఎంపిక విషయంలో ఆచుతూచి వ్యవహరిస్తోంది. కేవలం డబ్బు కోసమే కాకుండా..గుర్తింపు వచ్చే పాత్ర ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటుంది. అందుకే మన దర్శకులు అనసూయ కోసం ప్రత్యేక పాత్రలను క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పెదకాపు చిత్రంలోనూ.. అనసూయ మంచి పాత్ర పోషించింది. ప్రస్తుతం పుష్ప 2తో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తోంది. కెరీర్ పరంగా ఇలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది అనసూయ. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. ఆమె షేర్ చేసే కొన్ని ఫోటోలు, వీడియోలు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆమె పెట్టే పోస్ట్‌లను కొంతమంది నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. అందులో ముఖ్యంగా ‘ఆంటీ’అనే పదాన్ని వాడుతూ నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ‘ఆంటీ’ అనే పదం వింటే తనకు ఎందుకు కోపం వస్తుందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది అనసూయ. ఆంటీ అనే పదం తప్పు కాదు కానీ.. ఎదైన అంశంపై నేను స్పందిస్తే చాలు.. ‘ఇంట్లో ఉండి పిల్లలను చూసుకోవచ్చు కదా ఆంటీ ’అని కామెంట్స్ పెడతారు. ‘ఆంటి అనే పదం తప్పు కాదు.. కానీ చాలామంది ఇప్పుడు ఈ పదాన్ని వల్గర్‌గానే వాడుతున్నారు. చిన్న పిల్లలు, తెలిసిన వాళ్ళు వచ్చి ఆంటీ అని ముద్దుగా పిలుస్తారు. అలా వాళ్లు ఆంటీ అని పిలిస్తే నాకు ఇష్టమే. కానీ నా కంటే పెద్దవాళ్లు, తెలియని వాళ్లు ‘ఆంటీ’ అని మరో అర్థం వచ్చేలా పిలిస్తారు. అందుకే నాకు ఆ పదం నచ్చదు. ఆంటీ అంటే ఇంగ్లీష్ లో పిన్ని అని అర్థం. అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళని పిలవడానికి ఈ పదాన్ని వాడతారు. కానీ ఇప్పుడు ఆ పదాన్ని కొంతమంది వల్గర్‌గా వాడుతున్నారు. వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులు అవుతారు నేను చిన్నప్పుడు చాలా మందిని ఆంటీ అనే పిలిచాను. ఇప్పటికీ కొంతమంది తెలిసిన వాళ్లను అలానే పిలుస్తాను. ఆంటీ అని పిలవడం వాళ్లకు నచ్చకపోతే.. నేను పిలవడమే మానేస్తాను. అలా పిలిస్తే..వాళ్లు హర్ట్ అవుతారని నేను అర్థం చేసుకోగలను. నాకు ఆంటీ అని పిలిపించుకోవడం ఇష్టం లేదని చెప్పిన తర్వాత..మళ్లీ మళ్లీ ఎందుకు అనాలి? పైశాచిక ఆనందం కోసం ఎదుటివాళ్లను హర్ట్ చేయాలా? నా మీద కామెంట్స్ చేసిన వాళ్లను ఈ జన్మలో ఎప్పుడో ఒక్కసారైనా ఎదురెదురుగా చూసే అవకాశం వస్తుందో లేదో నాకు తెలియదు. పైగా నేను ఎలా ఉంటానో అతనికి తెలియదు. ఇలా ఫేస్ టు ఫేస్ పరిచయం లేని వ్యక్తిపైనే ఇంత అయిష్టాన్ని పెంచుకుంటే.. చుట్టుపక్కల ఉన్న మహిళలను ఇంకెలా చూస్తారు? ఇలాంటి వాళ్లే భవిష్యత్తులో రేపిస్టులుగా మారుతారు’అని అనసూయ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rajesh Manne Official (@rajeshmanne1) -
ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు: యాంకర్ అనసూయ
యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా కంటిన్యూ అవుతూనే సినిమాల్లోనూ రాణిస్తుంది.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ తరచూ ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌తో నిత్యం టచ్‌లో ఉంటుంది. అయితే ఈమధ్య కాలంలో ఆమెపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఆంటీ అంటూ కొందరు నెటిజన్లు ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. అలా ట్రోల్స్ చేసిన వాళ్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అరెస్ట్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం ఇన్స్టాగ్రామ్ నెటిజన్లతో కాసేపు ముచ్చటించిన అనసూయ వాళ్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్.. అక్కా.. మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడిగారు. దీనికి అనసూయ సమాధానమిస్తూ..ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి. అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఒక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనౌన్స్ చేస్తానని చెప్పి క్యూరియాసిటీని పెంచింది. -
ఇల్లరికపు అల్లుడు షాకింగ్ ట్విస్ట్.. భార్యకు వివాహేతర సంబంధం ఉందని..
నగరి(చిత్తూరు జిల్లా): అత్తను హతమార్చి అల్లుడు పరారైన సంఘటన శుక్రవారం రాత్రి విజయపురం మండలం ఇల్లత్తూరు దళితవాడలో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్ కథనం.. గ్రామానికి చెందిన మణియమ్మ (42) తన కుమార్తె నిరోషను తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా మనువూరుకు చెందిన కార్తీక్ (28)కి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేసింది. అప్పటి నుంచి కార్తీక్ ఇల్లరికపు అల్లుడుగా అత్తగారింట్లోనే ఉంటూ తాపీ మేస్త్రీ పనికి వెళ్లేవాడు. చదవండి: నడిరోడ్డుపై భర్త దాష్టీకం.. భార్యను లారీ కిందకు తోసి.. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక, నిరోష మూడేళ్ల నుంచి శ్రీపెరంబదూర్‌లో ప్రైవేటు కంపెనీలో పనికి వెళ్తోంది. తన భార్య ఎవరితోనో వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానంతో కార్తీక్ తరచూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కూడా తన భార్యతో కార్తీక్ గొడవ పడ్డాడు. ఇది గమనించిన మణియమ్మ అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన కార్తీక్ చేతికి దొరికిన ఇనుప కమ్మీతో మణియమ్మను పొడవడంతో అక్కడికక్కడే ఆమె మృతిచెందింది. దీంతో కార్తీక్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి కార్తీక్ కోసం గాలిస్తున్నారు. -
Aunty: ఆంటీ.. అంతగొప్ప స్థాయి ఉంది!
ఆంటీ.. Aunty Trend గత 24 గంటలుగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న పదం. అందుకు కారణం ఏంటో చాలామందికి తెలిసే ఉంటుంది. విరామం కూడా లేకుండా సదరు సెలబ్రిటీని మీమ్స్, ట్రోలింగ్‌తో తెగ వైరల్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో నెటిజన్స్. అయితే.. ఆంటీ అనే ఈ పదం ఎలా పుట్టిందో తెలుసా?. లాటిన్ పదం అమిటా Amita, ఫ్రెంచ్ పాత పదం ఆంటే(Ante) నుంచి పుట్టుకొచ్చింది ఆంటీ అనే పదం. వాస్తవానికి ఆ రెండు పదాలకు అర్థం ఒక్కటే ‘కుటుంబ సంబంధం’ అని. కాలక్రమంలో ఒక కుటుంబంలో మహిళలకు.. బంధం కోసం ఈ పదం తీసుకొచ్చారు. అలా వాడుకలో వందల ఏళ్లుగా నడుస్తోంది ఈ పదం. ఆంటీ అంటే అత్త.. తండ్రి సోదరి. ఇది మాత్రమే కాదు.. ఆంటీ అనే బంధుత్వం ప్రకారం తల్లిదండ్రుల తోబుట్టువు కూడా. ఒక తరానికి రెండవ స్థాయి బంధువు. అంటే ఆంటీ అనే పదానికి అత్త లేదంటే పిన్ని అనే అర్థాలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం.. తల్లి తర్వాత తల్లి అంతటి స్థాయిని ఆంటీ అనే పదానికి ఇచ్చారు సమాజంలో. అయితే.. ఆంటీ అనే పదానికి నెగెటివిటీ రావడానికి కారణం.. జనాదరణ పొందిన ఒక సంస్కృతి. పాశ్చాత్య సంస్కృతిలో పాతరోజుల్లో పిల్లలు లేని మహిళలను ఆంటీలుగా వ్యవహరించేవాళ్లు. యువతతో సంబంధాల ద్వారా వీళ్లు సమాజానికి చేటు చేసేవాళ్లనే అభిప్రాయం ఒకటి నెలకొంది. అలా అక్కడి నుంచి.. ఆ సంస్కృతి మన దేశానికి పాకింది. ఆంటీ అంటూ కొందరిని చులకనగా చూడడం నడుస్తోంది. కానీ, మాతృత్వానికి ప్రాధాన్యతనిస్తూ.. ఆంటీ(అత్త/పిన్ని)కి సమాజంలో వాస్తవ గౌరవం ఉంది. అంతెందుకు తెలుగు సంస్కృతి ప్రకారం ఎక్కడికి వెళ్లినా.. పరిచయం లేని మహిళలను ఆంటీ అని సంభోదించడం.. వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించడమే!. కాబట్టి, ఆంటీ అనే పిలుపు #Ageshaming అవమానం, మహిళలను అగౌరవపర్చడం ఎంతమాత్రం కాదన్నది పలువురు నెటిజన్లు వెలిబుచ్చుతున్న అభిప్రాయం. -
ఆంటీ ఎంత చాకచక్యంగా ఫోన్ కొట్టేసిందో చూడండి: వీడియో వైరల్
దొంగతనాలకు సంబంధించిన ఎన్నో వైరల్ వీడియోలు చూసుంటాం. పాపం వాళ్లు దొంగతనం చేసేటప్పుడు ఎంతలా టెన్షన్ పడుతూ దొంగలించి పారిపోతుంటారో వంటివి చూశాం. ఎందుకింత హైరానా మంచిగా పనిచేసుకుని హాయిగా ఉండొచ్చు కదా అనుకుంటా. కానీ కొంతమంది కన్నింగ్ క్యాండిట్లు అసలు ఏ మాత్రం భయపడుకుండా భలే చోరి చేస్తారు. వాళ్ల ముఖంలో కాస్త కూడా గాభరా గానీ ఆందోళన గానీ కనిపించదు. అచ్చం అలానే ఇక్కడో ఆంటీ ఎంతలా దొంగతనం చేసిందో చూడండి. వివరాల్లోకెళ్తే... ఇద్దరు మహిళలు షాపింగ్ చేసి బిల్లు పే చేసేందుకు కౌంటర్ వద్దకు వచ్చారు. ఐతే అందులో ఒక మహిళ తెలివిగా తను ముందున్న మహిళ వద్దకు రాసుకుంటూ వస్తుంది. పైగా చాలా చాకచక్యంగా సదరు మహిళ పర్సులో పోన్ తీస్తూనే మరోవైపు బిల్ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి ఏవేవో సందేహాలు అడుగుతుంది. ఇంతలో ఆ మహిళ ఫోన్‌ని తన బ్యాగ్‌లో వేసుకుని కామ్‌గా వెళ్లిపోతుంది. కనీసం తన ఫోన్ పోయిందని పాపాం ఆ మహిళకు కూడా ఇంకా తెలియదు. ఈ మేరకు ఘనటకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: నివాళి సభలో ‘పోకిరీ’ పాటకు బెల్లి డ్యాన్స్‌లు.. నోరెళ్లబెట్టిన బంధువులు.. వీడియో వైరల్) -
ఆంటీ తెలివిగా దుకాణంలో ఫోన్‌ను భలే నొక్కేసింది..!!
-
స్టార్ హీరోయిన్ను 'ఆంటీ' అంటున్న కియరా అద్వానీ
Kiara Advani Reveals She Calls Juhi Chawla As Aunty: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్నబ్యూటీఫుల్ హీరోయిన్ కియారా అద్వానీ. అందంతోనే కాకుండా అభినయంతోనూ సినీ ప్రేక్షకులను ఆకట్టకుంది ఈ బ్యూటీ. ఎంఎస్ ధోనీ, కబీర్ సింగ్, లక్ష్మీ, లాంటి సూపర్ హిట్ బాలీవుడ్ చిత్రాల్లో నటించిన కియరా ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. హిందీలో 'కబీర్ సింగ్' సినిమాతో స్టార్డమ్ సంపాదించుకున్న కియరా 'షేర్ షా' చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. తాజాగా ఈ బ్యూటీ పాపులర్ డైరెక్టర్ శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కియారా, చెర్రీ జంటగా వస్తున్న రెండో చిత్రం ఇది. చదవండి: నన్నైతే పిలవలేదు.. బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది కియరా అద్వానీ. ఇందులో స్టార్ హీరోయిన్ జూహీ చావ్లాపై ప్రశంసలు కురిపించింది. తన తండ్రి జగ్దీప్ అద్వానీకి హీరోయిన్ చిన్ననాటి స్నేహితురాలని చెప్పుకొచ్చింది. 'జూహీ ఆంటీ మా నాన్న చిన్ననాటి స్నేహితులు. ఆమె చాలా మంచింది. జూహీ ఆంటీ అంటున్నందుకు ఆమె నన్ను చంపేస్తుందని నేను అనుకోవట్లేదు. ఆమెను పెద్ద నటిగా నేను ఎప్పుడూ చూడలేదు. నా పేరెంట్స్‌కు ఫ్రెండ్‌గా మాత్రమే తెలుసు. ఆమె పిల్లలతో కూడా నేను ఆడుకున్నాను.' అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అలనాటి నటుడు అశోక్ కుమార్ తనకు బంధువు అవుతాడని తెలిపింది కియరా. 'మా తాతయ్య పెళ్లి చేసుకున్న మా నాన్నమ్మ అశోక్ కుమార్ కుమార్తె. కాబట్టి వీరి పెళ్లి ద్వారా నాకు అశోక్ కుమార్ బంధువు అవుతారు. కానీ నేను ఎప్పుడూ వారిని కలవలేదు.' అని కియరా పేర్కొంది. చదవండి: లగ్జరీ కారు కొన్న కియారా అద్వానీ.. ధర ఎంతంటే? -
దారుణం: చపాతీ కర్రతో అత్తను హత్యచేసిన కోడలు
సాక్షి, తెనాలి: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన అత్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని తెనాలిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరులోని తెనాలిలో నివాసం ఉంటున్న కోడలు ప్రియాంక తన అత్త తలపై చపాతీ కర్రతో బలంగా కొట్టింది. దీంతో అత్త మైధిలి అక్కడికక్కడే మృతి చెందింది. చదవండి: Kidnap: నవ వధువును కిడ్నాప్ చేసిన టీడీపీ నేత సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అత్త వేధింపులు భరించలేకే కోడలు ప్రియాంక ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: పహాడీషరీఫ్: 38 రోజుల్లో నాలుగు హత్యలు, హడలెత్తుతున్న స్థానికులు -
అత్త అల్లుడు వివాహేతర సంబంధం, పెళ్లి, ట్విస్టు ఏంటంటే?
లక్నో: సమాజంలో రోజు రోజుకీ విలువలు పతనమవుతున్నాయి. కామంతో కళ్లుమూసుకుపోయి వావి వరుసలు మరిచి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిండు కాపురాలను నిలువునా కూల్చేస్తున్నాయి. అత్త, అల్లుడు పారిపోయి పెళ్లి చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్ జిల్లాలోని మధుభార్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. 50 ఏళ్ల మహిళ ఒకరు పాతికేళ్ల వయసున్న తన సొంత అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే వీరి సంబంధం గురించి తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 10 నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే 10 నెలల క్రితం పారిపోయిన వీరిద్దరూ బుదవారం ఇంటికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులకు వివాహం జరిగిన విషయం తెలియజేశారు. తామిద్దరం కలిసి ఉండాలని అనుకుంటున్నట్టు కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. అయితే ఇందుకు కుటుం సభ్యులు అంగీకరించలేదు. దీంతో అక్కడ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ జంటను అరెస్టు చేశారు. ఈ విషయం కాస్తా గ్రామస్తులకు తెలియడంతో.. అత్త, అల్లుడి అక్రమ సంబంధంపై నిరసన వ్యక్తం చేశారు. -
గుడివాడ : కోపంతో అత్తపై కాగుతున్న నూనె పోసిన కోడలు
-
రెండు నెలల చిన్నారిని హత్య చేసిన మేనత్త
-
అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య
మీర్‌పేట: అత్త వివాహేతర సంబంధం పెట్టుకో వడంతో అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాకు చెందిన అంగోతు బాబు (25) 8నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ నందనవనం కాలనీలో భార్య నిర్మలతో ఉంటున్నాడు. కొంతకాలంగా భార్య తల్లి విజయ(40) శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి రోజు తన ఇంటికి రావడం గమనించాడు. అనుమానంతో నిలదీయగా అసలు విషయం తెలిసింది. దీంతో బాబు పది మందిలో పంచాయితీ పెట్టడంతో ఓర్చుకోలేని అత్త విజయ, శ్రీనులు బాబుకు ఫోన్ చేసి తిట్టి బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పెట్టుబడి పెడితే లాభాలు పొందొచ్చని.. -
అత్తమామలను హతమార్చాడు
-
దారుణం: అత్తమామలను హతమార్చాడు
సాక్షి, కృష్ణా: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో అల్లుడు, కూతురు అత్తామామలనను గొంతు కోసి హత్య చేశారు. నాలుగు నెలల క్రితం నెమలిబాబు మైనర్ బాలికను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇటీవల తనకు కట్నం కావాలంటూ అత్తామామలను వేధించసాగాడు. కట్నం ఇవ్వడంలేని కోపం పెంచుకున్న నెమలిబాబు భార్య సహకారంతో అత్తామామలను గొంతు కోసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. కూతురు మనీషా, అల్లుడు నెమలిబాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను అత్తమామలు పాట ముత్తయ్య, సుగుణమ్మగా పోలీసులు గుర్తించారు. -
'ఆంటీ' అన్నందుకు జుట్టు పట్టుకుని కొట్టింది
లక్నో: అమ్మాయిలకు హెచ్చరిక, అపరిచిత మహిళలను ఆంటీ అని పిలిచేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. పొరపాటున ఆంటీ అని పిలిచినప్పుడు వాళ్లకు తిక్క లేస్తే మీ జుట్టు కత్తిరించి చేతిలో పెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ఉత్తరప్రదేశ్‌లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనే నిలువెత్తు నిదర్శనం. యూపీలోని ఈటాలో బాబూగంజ్ మార్కెట్లో కొందరు మహిళలు షాపింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి అక్కడే ఉన్న ఓ మహిళను ఆంటీ అని పిలిచింది. (చదవండి: ఇతగాడి దొంగ తెలివి మామూలుగా లేదు) అంతే ఆమెకు ఉక్రోషం కట్టలు తెంచుకుంది. 'నన్నే ఆంటీ అంటావా?' అంటూ పళ్లు కొరుకుతూ అమ్మాయి జుట్టు పట్టుకుని మరీ చితకబాదింది. ఆమె అలా వీరబాదుడు బాదుతుంటే ఆపాల్సింది పోయి అక్కడే ఉన్న మరికొందరు మహిళలు ఆమెకు సాయం చేయడం గమనార్హం. ఇంతలో ఓ మహిళా పోలీసు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘర్షణపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. ఇక ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆంటీ అంటే మీదపడి కొట్టేస్తారా? అని నోరెళ్లబెడుతున్నారు. (చదవండి: ‘జాదూకీ జప్పీ’.. హ్యాట్సాఫ్ డాక్టర్!) -
డబ్బు కోసం మేనత్త హత్య
సాక్షి, వరంగల్: మత్తు పదార్థాలు, జల్సాలకు అలవాటు పడి వాటికి అవసరమైన డబ్బు కోసం ఆశ్రయం కల్పించిన మేనత్తను హత్య చేసిన నిందితుడితో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో ఇటీవల జరిగిన వివాహిత హత్య కేసులో మిస్టరీ వీడినట్లయింది. ఈ మేరకు హన్మకొండలోని పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో నిందితుల వివరాలను సీపీ ప్రమోద్‌కుమార్ వెల్లడించారు. భర్త మరణంతో కూరగాయల వ్యాపారం హన్మకొండ టైలర్ స్ట్రీట్‌కు చెందిన దోర్నం శారద(38) భర్త మరణించడంతో కుమారుడు అఖిల్, కుమార్తెతో ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తోంది. కుమార్తె హైదరబాద్‌లో ఇంజనీరింగ్ చదువుతుండగా, అఖిల్ తల్లి దగ్గర ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో వరంగల్ ఎస్‌ఆర్‌ఎఆర్ తోటకు చెందిన అడెపు ఆకాశ్‌బాబు గంజాయి సేవిస్తూ మత్తు› పదార్థాలకు బానిస కావడంతో తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటి వేశారు. ఈ క్రమంలో మృతురాలు శారద తన అన్న కుమారుడైన ఆకాశ్‌బాబుకు తన ఇంట్లో సుమారు 15 రోజుల పాటు ఆశ్రయం కల్పించింది. ఈ సందర్భంగా ఆమె కూరగాయల వ్యాపారం ద్వారా వచ్చే డబ్బుతో పాటు కూతురు పెండ్లి కోసం పొదుపు చేస్తున్న డబ్బు, బంగారాన్ని బీరువాలో పెట్టడాన్ని గమనించాడు. ఇదే సమయంలో చెడు వ్యసనాలకు డబ్బు దొరకపోవడంతో ఈ నెల 3న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు శారద ఇంట్లోకి చొరబడ్డాడు. శారదపై బండ రాయి వేసి హత్య చేసిన ఆయన పక్కనే నిద్రిస్తున్న ఆమె కుమారుడు అఖిల్‌పై కూడా హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత బీరువాలోని డబ్బులో కొంత, బంగారం తీసుకుని దీనిని ప్రమాదంగా చితత్రీకరించేందుకు కొన్ని డబ్బులు ఉంచి వారిపై బీరువా పడవేసి పరారయ్యాడు. అయితే, కేసులో ఎలాంటి క్లూ లభించకపోవడంతో సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీ కె.పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యాన మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడికి ఇద్దరి సహకారం హత్య అనంతరం ప్రధాన నిందితుడు ఆకాశ్‌బాబుకు ఓ బాల నేరస్తుడితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన మేకల మచ్చేందర్ సహకరించారు. ఈ మేరకు చోరీ చేసిన సొత్తులో నుంచి బాల నేరస్తుడికి రూ.51 వేలు, మచ్చేందర్‌కు రూ1.5 లక్షలు ఇవ్వగా వారు ఆశ్రయం కల్పించారు. కేసు విచారణలో భాగంగా అధునాతక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను బుధవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆకాశ్‌బాబు నుంచి రూ.69,900తో పాటు బంగారు ఆభరణాలతో పాటు మిగతా వారి నుంచి కూడా కలిపి రూ.2.7 లక్షలు, మూడు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. కాగా, మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు పగులగొట్టిన ఘటనలో ఆకాశ్‌పై గతంలో కేసు నమోదైంది. ఈ మేరకు కేసును చేధించడంలో ప్రతిభ కనపరిచిన సెంట్రల్ జోన్ ఇన్చార్జ్ డీసీపీ పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సుబేదారి, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు అజయ్‌కుమార్, శ్రీనివాస్‌రావు, హన్మకొండ, సుబేదారి సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌యాదవ్, వేణుగోపాల్‌తో పాటు సిబ్బంది సీపీ ప్రమోద్‌కుమార్ అభినందించారు. -
భార్యపై కోపంతో అత్తను దారుణంగా..
సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు మండలంలోని పాతఊరిలో దారుణం చేటుచేసుకుంది. భార్యపై కోపంతో ఓ వ్యకి అత్తను దారుణంగా నరికి చంపాడు. వివరాలు.. దుర్గాప్రసాద్, వరలక్ష్మీ దంపతులకు ఏడు నెల క్రితం వివాహమైంది. దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లోని రెయిన్బో ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి అత్తారింటికి వచ్చిన దుర్గాప్రసాద్ భార్యతో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రస్థాయికి చేరడంతో.. వారికి సర్ది చెప్పేందుకు దుర్గాప్రసాద్ అత్త లక్ష్మీ ప్రయత్నించింది. దీంతో కోపంతో రగిలిపోయిన దుర్గాప్రసాద్ లక్ష్మీపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో లక్ష్మీ వీధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు బాధితురాలని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. కుటుంబ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితమే దుర్గాప్రసాద్ భార్య వరలక్ష్మి పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
అత్తా? అమ్మా?
ఎంతైనా అత్తగారు అత్తగారే. కోడలు పిల్ల కోడలు పిల్లే. ఇద్దరూ తల్లీకూతుళ్లలా ఉండడం సాధ్యమేనా?సాధ్యమే. అదీ అత్తగారి వల్లనే సాధ్యం. ఒకింటికి కోడలిగా వెళ్లి.. తర్వాత అత్తయింది కనుక ఒకప్పటికి అత్త అయ్యే కోడలికి తనే నేర్పించుకోవాలి. కొడుక్కి పెళ్లయిపోగానే అత్తగారైపోయిన ‘అమ్మ’లోఅమ్మతనాన్ని ఎవరైనా అకస్మాత్తుగా ఎత్తుకుపోతారా?అమ్మ అమ్మే. అత్తయ్యాక కూడా అమ్మే. అత్తమ్మే. బార్లో అందరూ వెళ్లిపోయారు అతను తప్ప.మూసేసే టైమ్ అయ్యింది.లైట్లు కూడా ఆఫ్ చేసేస్తున్నారు.వెయిటర్‌కు అతడు తెలుసు. రెండు మూడు వారాలకు ఒకసారి వచ్చి సరదాగా ఒక బీర్ తాగేసి పోతుంటాడు. ఈసారి సరదా కోసం వచ్చినట్టు లేదు. చాలా తాగాడు. ఇంటికి వెళ్లకుండా కదలక మెదలక ఉన్నాడు.వెయిటర్‌కు ఇలాంటి వాళ్లు తెలుసు.అనునయంగా లేపి, బయటకు తీసుకొచ్చి ఆటో ఎక్కిస్తూ అడిగాడు– ‘వైఫ్ ప్రాబ్లమా సార్’.అతడు ఆటోలో కూలబడ్డాడు.‘అదైనా బాగుండేది. కాని ఇది అమ్మ ప్రాబ్లమ్. మా అమ్మతో ప్రాబ్లమ్’ అని, ఎంతిస్తున్నాడో కూడా చూసుకోకుండా టిప్పు కుక్కి కళ్లు మూసుకున్నాడు.తెల్లారింది. తల్లి వెళ్లి మెయిన్ డోర్ తెరిచింది. గుమ్మంలో పాలప్యాకెట్లు పడి ఉన్నాయి. పేపర్ కూడా. వాటిని చూడగానే ఆమెకు కోపం వచ్చింది.‘ఈ పిల్ల ఉదయాన్నే లేచి వీటిని తీయవచ్చు కదా’ అనుకుంది. కొడుక్కి కొత్తగా పెళ్లయ్యిందని కాపురం మొదలయ్యి ఆరు నెలలు అయ్యిందని కోడలు తొందరగా లేవ వలసిన పని లేదని మార్నింగ్ కాఫీ పెట్టి తానే నిద్ర లేపుతానని ఈ తల్లే కొత్తల్లో చెప్పింది. కాని ఇప్పుడు ఎందుకో ఆమెకు కోపం వస్తోంది.వెళ్లి ముందు వెనుకా చూసుకోకుండా కొడుకు కోడలు ఉండే బెడ్రూమ్ తలుపును బాదింది.‘అమ్మాయ్ సరళా. ఇంకా ఏంటా మొద్దు నిద్ర లే’ అని అరిచింది.నిద్రలో ఉన్న సరళా ఉలిక్కి పడి లేచింది. రాత్రి తాగి బతుకు జీవుడా అని నిద్రపోయిన కొడుకూ అదిరిపడి లేచాడు.రోజు మొదలైంది అని ఇద్దరూ అనుకున్నారు.‘వస్తున్నా అత్తయ్యా’ కోడలు బయటకు పరిగెత్తింది నైటీ సరి చేసుకుంటూ.‘అబ్బాయికి బాక్స్ కట్టావా’‘కట్టాను అత్తయ్యా’‘ఏం కట్టావ్?’ ‘చామగడ్డల పులుసు. పప్పు. అరటి కాయ తాలింపు’...‘నీ తలకాయ తాలింపు చేయకపోయావా. వాడు అరటికాయ తినడని తెలియదా?’‘నాకు మీరు చెప్పలేదు అత్తయ్యా’‘పర్లేదులేమ్మా. తింటాలే’‘నువ్వు నోర్మూయరా... అప్పుడే తందానా అనడం మొదలెట్టావా’కొడుకూ కోడలూ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఉక్రోషంగా ఉంది. ఏం చేయాలో తోచనట్టుగా ఉంది. తిరగబడ్డానికి వీలు లేకుండా ఉంది.ఎదురుగా ఉన్నది శతృవు కాదు.సొంత తల్లి. ఆమెకు అత్త.సుజాతమ్మకు ఆ వీధిలో చాలా మంచిదని పేరు. ఒకరికి కష్టం వస్తే పరిగెత్తుకొని వస్తుందని పేరు. మంచీ చెడ్డ చెబుతుందని పేరు. అందరి ఇళ్లల్లో తల్లో నాలుక అని పేరు. ఆమెను అభిమానించని ఇల్లు ఆ వీధిలో లేదు. పెళ్లిళ్లలో శుభకార్యాలలో ఆమె పెత్తనమే ఎక్కడైనా. అలాంటిది ఆమె ఇంట్లో కూడా శుభకార్యమే జరిగింది. కొడుకు పెళ్లే జరిగింది. అది శుభప్రదంగా ఉంటుందని తమ ఇళ్లల్లో లాగా చికాకులు చిర్రుబుర్రులతో సాగదని అందరూ అనుకున్నారు. సుజాతమ్మ కోడలిని బాగా చూసుకుంటుందని అనుకున్నారు. భర్త చనిపోయాక ఎన్నో కష్టాలు పడి ఇంటిని నిలబెట్టుకున్న సుజాతమ్మ ఇన్నాళ్లకు ఆడతోడు దొరికి కాసింత తెరిపిన పడుతుందని అనుకున్నారు. ప్రస్తుతం బయట అందరి అభిప్రాయమూ అదే. ఆమె మీద ఎవరికి ఏ చాడీ చెప్పినా నమ్మరు.కాని ఇంట్లో జరుగుతున్నది వేరు.సుజాతమ్మ ఇప్పుడు ఒక రాక్షసి.‘ఏమండీ... ఇలాగైతే నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను’ అంది సరళ.‘అదేమిటి అలా అంటావు. ఓపిక పట్టు. అంతా సర్దుకుంటుంది’ అన్నాడు భార్గవ్ హతాశుడవుతూ.‘సర్దుకునే సూచన కనిపించడం లేదండీ. ఇది ఇంకా పెరిగేలా ఉంది. నేను ఆల్రెడీ మా పెద్దవాళ్లకు ఫోన్ చేశాను. రేపు వస్తారు’‘నిజమా’ గుడ్లు తేలేశాడు.మరునాడు సుజాతమ్మ కూడా గుడ్లు తేలేయక తప్పలేదు. ‘మీరు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారండీ’ కొంచెం మర్యాద పాటిస్తూ అన్నాడు సరళ తండ్రి.‘ఇబ్బందా.. పీక్కు తింటోంది’ కోపం పట్టలేక అంది సరళ తల్లి.‘మాకేం కూటికి గతిలేదనుకోవద్దు. విడాకులిప్పించి దర్జాగా ఇంకో పెళ్లి చేస్తాం’ సరళ తల్లి కోపంతో బుసలు కొడుతోంది.సుజాతమ్మ ఒణికిపోయింది.‘సరళంటే నాకు ఇష్టం. నేనేదో చిన్న మాట అంటున్నాను తప్ప ఆ పిల్ల ఇంత బాధ పడుతుందని నాక్కూడా తెలియదు. మా వాడు విడాకులు తీసుకుంటే నాకేం సంతోషం. నాకేం లాభం. అయ్యో.. వద్దే వద్దు’ అంది ఎలాగోలా శక్తి తెచ్చుకుని.‘లేదండీ... మీ మైండ్ ఖరాబయ్యింది. మీకు కౌన్సెలింగ్ అవసరం’ అని తేల్చాడు అనుభవజ్ఞుడైన సరళ తండ్రి.వేరే మార్గం లేక తల వొంచుకుని అంగీకరించింది సుజాతమ్మ.సుజాతమ్మ కథ ఇది. ఆమెకు యాభై సంవత్సరాలు. పద్దెనిమిదేళ్లకే పెళ్లయ్యింది. ముప్పై ఏళ్లకే భర్త చనిపోయాడు. ఆమెకు పెద్దగా బంధుగణం లేదు. జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు. ఒక్కగానొక్క కొడుకు. వాడే లోకంగా బతికింది. వాడి కోసమే జీవించింది. జీవితంలో కొంతమంది మగవాళ్లు ఆమెకు తారసపడ్డారు. కోరుకున్నారు. మరోపెళ్లిని ప్రస్తావించారు. కాని ఆమె కొడుకు కోసం తన సంతోషాలన్నింటినీ త్యాగం చేసింది. వీధిలో వాళ్లే తన బంధువులనుకుంది. కొడుకును ప్రయోజకుణ్ణి చేసింది. అతడికి పెళ్లి చేసింది. కాని పెళ్లయ్యి రెండు మూడు నెలలు గడిచిన తర్వాత కోడలు నచ్చకపోవడం మొదలైంది. ఆమెను తిట్టడం మొదలెట్టింది. బాధ పెట్టడం సూటిపోటి మాటలు అనడం... ఇలా ఎందుకు చేస్తున్నదో ఆమెకే తెలియదు. ఆమె తనను తాను అర్థం చేసుకోవాల్సి ఉంది.‘మీ కోడలు మీ కొడుకును మీకు ఎక్కడ కాకుండా చేస్తుందోనని మీ భయం కదా’ లేడీ సైకియాట్రిస్ట్ అడిగింది.సుజాతమ్మ ఏం మాట్లాడలేదు. మౌనంగా తల ఊపింది. ‘కొంత కాలం మీరు మీ కోడలిని అభిమానించారు. కాని మీ కొడుకు కోడలు ఏకాంతంగా ఉన్నా, కలిసి సినిమాకు వెళ్లినా, డిన్నర్‌కు వెళ్లినా మీ కొడుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడేమో, క్రమంగా మిమ్మల్ని వదులుకుంటాడేమో, మీ ప్రాధాన్యం తగ్గిపోతుందేమో అని మీకు అనిపించి ఏం చేయాలో తెలియక మీ కోడలిని బాధ పెట్టడం మొదలెట్టారు’ అంది సైకియాట్రిస్ట్.మళ్లీ అడిగింది.‘మీకు కొడుకు పుట్టినప్పుడు మీ భర్త ఉండగా మీరు వారిద్దరినీ సమానంగా ప్రేమించారా? ఒక్కరినే ప్రేమించారా?’సుజాతమ్మ తలెత్తి చూసి ‘ఇద్దరినీ ప్రేమించాను’ అంది.‘మీ కొడుకు కూడా అలాగే చేయగలడు అని మీరు ఎందుకు అనుకోవడం లేదు. మీ కొడుకు మిమ్మల్ని, మీ కోడలిని కూడా ఏక కాలంలో ప్రేమగా చూసుకోవచ్చు కదా. ఎవరూ ఏ ఒక్కరికీ సొంతం కాదు. అందరూ అందరికీ చెందినప్పుడే కుటుంబం నడుస్తుంది. సాధారణంగా ఏమవుతుందంటే మీ కొడుకు స్థానంలో మీకు కూతురు ఉంటే ఆ కూతురు ఏదో ఒకనాటికి అత్తారింటికి వెళ్లిపోతుందని మీరు ప్రిపేర్డ్‌గా ఉండేవారు. కొడుకు అయ్యే సరికి అతనితోనే జీవితాంతం ఉండాలనుకుని, అలా ఉండటానికి ఎక్కడ అడ్డంకులు వస్తాయో అని ఉలిక్కి పడుతున్నారు. మీ కొడుక్కే కాదు ఏ కొడుక్కైనా తల్లంటే ప్రేమ ఇష్టం ఉంటాయి. వాళ్లను ప్రేమించకుండా మానేయరు. కాని కోడలు వచ్చేసరికి మీలాగే చాలామంది అత్తగార్లు ఇన్సెక్యూర్ అయ్యి ఇంటిని ఇబ్బందుల్లోకి నెడతారు. మీ కోడలు మంచి అవగాహన ఉన్న అమ్మాయి. ఆమెను నమ్మండి. మీ అబ్బాయిని నమ్మండి. వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు’ అంది లేడీ సైకియాట్రిస్ట్.సుజాతమ్మకు ఆ కౌన్సెలింగ్ చాలా ఉపయోగపడింది.ఆమె వెంటనే కోడలిని పిలిచి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరింది.కొద్దిపాటి అవగాహన, అవసరమైన చర్చలు కుటుంబ సభ్యుల మధ్య సాగితే ప్రతి ఇల్లు సౌకర్యవంతమైన అనుబంధాలతో కొనసాగుతుంది.నాలుగైదు రోజుల తర్వాత సుజాతమ్మ తెల్లవారుతూనే లేచింది.గుమ్మంలో పాలప్యాకెట్లు, పేపర్ పడి ఉన్నాయి.వాటిని చేతిలోకి తీసుకుని కాఫీ పెట్టడానికి వెనుదిరుగుతుండగానే.. కోడలు ఎదురొచ్చింది!‘ఇటివ్వండత్తయ్యా.. కాఫీ పెట్టుకొస్తాను’ అంది. ఆ తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్న దృశ్యం అప్పుడే నిద్ర లేచి హాల్లోకి వస్తున్న కొడుక్కి కనిపించింది. – కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ మీ కొడుక్కే కాదు ఏ కొడుక్కైనా తల్లంటే ప్రేమ ఇష్టం ఉంటాయి. వాళ్లను ప్రేమించకుండా మానేయరు. కాని కోడలు వచ్చేసరికి మీలాగే చాలామంది అత్తగార్లు ఇన్సెక్యూర్ అయ్యి ఇంటిని ఇబ్బందుల్లోకి నెడతారు.