భార్యపై కోపంతో అత్తను దారుణంగా.. | Aunty Murdered By Son In Law At West Godavari District | Sakshi
Sakshi News home page

భార్యపై కోపంతో అత్తను దారుణంగా..

Dec 11 2019 2:34 PM | Updated on Dec 11 2019 3:18 PM

Aunty Murdered By Son In Law At West Godavari District - Sakshi

భార్యపై కోపంతో ఓ వ్యకి అత్తను దారుణంగా నరికి చంపాడు. హైదరాబాద్‌ నుంచి అత్తారింటికి వచ్చిన దుర్గాప్రసాద్‌ భార్యతో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రస్థాయికి చేరడంతో.. వారికి సర్ది చెప్పేందుకు దుర్గాప్రసాద్‌ అత్త లక్ష్మీ ప్రయత్నించింది.

సాక్షి, పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు మండలంలోని పాతఊరిలో దారుణం చేటుచేసుకుంది. భార్యపై కోపంతో ఓ వ్యకి అత్తను దారుణంగా నరికి చంపాడు. వివరాలు.. దుర్గాప్రసాద్‌, వరలక్ష్మీ దంపతులకు ఏడు నెల క్రితం వివాహమైంది. దుర్గాప్రసాద్‌ హైదరాబాద్‌లోని రెయిన్‌బో ప్రింటింగ్‌ ప్రెస్‌లో పని చేస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి అత్తారింటికి వచ్చిన దుర్గాప్రసాద్‌ భార్యతో గొడవకు దిగాడు. అది కాస్తా తీవ్రస్థాయికి చేరడంతో.. వారికి సర్ది చెప్పేందుకు దుర్గాప్రసాద్‌ అత్త లక్ష్మీ ప్రయత్నించింది.

దీంతో కోపంతో రగిలిపోయిన దుర్గాప్రసాద్‌ లక్ష్మీపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో లక్ష్మీ వీధిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు బాధితురాలని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచింది. కుటుంబ తగాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. వారం రోజుల క్రితమే దుర్గాప్రసాద్‌ భార్య వరలక్ష్మి పుట్టింటికి వెళ్లిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement