జంగారెడ్డిగూడెంలో జంట హత్యలు
ప:గో: జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. విజయ పేరుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న లక్ష్మణరావును కొంతమంది దుండగులు పెట్రోల్ బంక్ సమీపంలో గొడ్డలితో నరికి హత్య చేశారు. లక్ష్మణరావుతో పాటు అడ్డువచ్చిన అతని భార్య తులసిని కూడా హత్య చేశారు.
ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలు గురయ్యారు. ఈ జంట హత్యలకు పాత కక్షలే ప్రధాన కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణం గురువారం అర్ధరాత్రి దాటాక జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.