Son-In-Law Committed Suicide After Aunt Had An Extramarital Affair With Another Person - Sakshi
Sakshi News home page

అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య

Published Thu, Feb 18 2021 1:27 PM | Last Updated on Thu, Feb 18 2021 5:06 PM

Aunty Extramarital Affair With Another Person Son In Law Deceased - Sakshi

మీర్‌పేట: అత్త వివాహేతర సంబంధం పెట్టుకో వడంతో అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాకు చెందిన అంగోతు బాబు (25) 8నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ నందనవనం కాలనీలో భార్య నిర్మలతో ఉంటున్నాడు. కొంతకాలంగా భార్య తల్లి విజయ(40) శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి రోజు తన ఇంటికి రావడం గమనించాడు. 

అనుమానంతో నిలదీయగా అసలు విషయం తెలిసింది. దీంతో బాబు పది మందిలో పంచాయితీ పెట్టడంతో ఓర్చుకోలేని అత్త విజయ, శ్రీనులు బాబుకు ఫోన్‌ చేసి తిట్టి బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: పెట్టుబడి పెడితే లాభాలు పొందొచ్చని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement