extra marrital relation
-
వంటగదిలో ప్రియుడితో భార్య.. భర్తకు మెలకువచ్చి ప్రశ్నించగా
బొబ్బిలి రూరల్: మండలంలోని పారాది గ్రామంలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కలిశెట్టి వెంకటరమణ కేసు మిస్టరీ వీడింది. వెంకటరమణను భార్య లలితకుమారి, ఆమె ప్రియుడు రసిల్లి నరసింగరావు(బాలు) కలిసి హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్టు చేసి శనివారం బొబ్బిలి పోలీసుస్టేçషన్ ఆవరణలో మీడియా ముందు ప్రవేశపెట్టి, కోర్టుకు తరలించారు. పట్టణ సీఐ ఎం.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు.. లలితకుమారికి వెంకటరమణతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. గ్రామానికి చెందిన నరసింగరావుతో కొద్ది సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం గతంలో రేగింది. ఘటన జరిగిన గురువారం రాత్రి 10గంటల సమయంలో భర్త నిద్రిస్తున్న సమయంలో లలితకుమారి సెల్‌కు ప్రియుడు మెసేజ్ పెట్టాడు. కలుసుకుందామని మెసేజ్ చేయడంతో లలితకుమారి వీడియోకాల్ చేసి మాట్లాడుకుని అనుకున్న మేరకు ఇంట్లో కలిశారు. వంటగదిలో వీరు ఉన్న సమయంలో భర్తకు మెలుకువ వచ్చి చూడడంతో ఈ సమయంలో ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. తరువాత నరసింగరావును గుర్తించి, భార్య, ఆమె ప్రియుడుని ఆగ్రహంతో కొట్టాడు. వారు ప్రతిదాడి చేసి వెంకటరమణను గాయపరిచి, గోడకు గుద్దారు. అనంతరం భార్య చున్నీతో భర్త వెంకటరమణను ఉరి తీసి చంపేసారు. మృతదేహాన్ని ఇంట్లో ముందర గదిలో ఉంచేసి, ప్రియుడు పరారీ అయ్యాడు. రాత్రి సమయంలో లలితకుమారి తన బావ అప్పలనాయుడుకు తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బుకాయించింది. రెండు ట్యాబ్లెట్లు ఇచ్చానని చెప్పడంతో అప్పలనాయుడు, స్థానికులతో కలిసి వచ్చి చూసి ఉదయం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో గాయాలు గమనించిన బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నాగేశ్వరరావు సిబ్బందితో గ్రామంలో విచారణ చేపట్టారు. దీంతో లలితకుమారి, నరసింగరావులను శనివారంఅరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా నరసింగరావు సీతానగరం, పార్వతీపురం ప్రాంతాల్లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారంలో లలితకుమారి, వెంకటరమణ తరచూ గొడవలు పడి లలితకుమారి పలుసార్లు పుట్టింటికి వెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింగరావు, లలితకుమారి ఎక్కడికైనా వెళ్లిపోదామని ప్రతిపాదనలు చేసినట్టు పోలీసులు తెలిపారు. రోడ్డున పడ్డ పిల్లలు వెంకటరమణ హత్యకు గురి కాగా, లలితకుమారి అరెస్టు కావడంతో అభం శుభం తెలియని ఐదేళ్ల బాబు హర్షవర్దన్, ఏడాదిన్నర పాప యశస్విని రోడ్డున పడ్డారు. వీరిని బంధువుల పర్యవేక్షణలో ఉంచారు. వీరి పరిస్థితి ఏమిటన్నదీ అందరినీ కలచివేస్తుంది. -
వివాహేతర సంబంధం: ముగ్గురు ఆత్మహత్య
టీ.నగర్: వివాహేతర సంబంధం వల్ల దంపతులు, పోలీసుల విచారణకు భయపడి ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. చెంగల్పట్టు కైలాసనాథర్ ఆలయం వీధికి చెందిన గోపి (38) భార్య కన్నియమ్మాళ్‌కు అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్ (45)తో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. సురేష్‌కు పెళ్లై భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి గోపీ ఆమెను తీవ్రంగా మందలించాడు. ఈ విషయంపై శుక్రవారం గోపీ, సురేష్ గొడవపడ్డారు. తరువాత ఇంటికి వచ్చిన గోపీ తన భార్య కన్నియమ్మాళ్‌తో గొడవకు దిగాడు. అయితే శనివారం ఉదయం గోపీ, కన్నియమ్మాళ్ ఇద్దరూ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెంగల్పట్టు టౌన్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌ను విచారించాలని భావించగా, అతను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీ, కన్నియమ్మాళ్ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమార్తె అనాథగా మిగిలింది. అదే సమయంలో సురేష్ మృతితో అతని ముగ్గురు కుమార్తెలు, భార్య దిక్కులేనివారు ఆయ్యారు. చదవండి: నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి.. -
అత్త వివాహేతర సంబంధం.. అల్లుడు ఆత్మహత్య
మీర్‌పేట: అత్త వివాహేతర సంబంధం పెట్టుకో వడంతో అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాకు చెందిన అంగోతు బాబు (25) 8నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ నందనవనం కాలనీలో భార్య నిర్మలతో ఉంటున్నాడు. కొంతకాలంగా భార్య తల్లి విజయ(40) శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి రోజు తన ఇంటికి రావడం గమనించాడు. అనుమానంతో నిలదీయగా అసలు విషయం తెలిసింది. దీంతో బాబు పది మందిలో పంచాయితీ పెట్టడంతో ఓర్చుకోలేని అత్త విజయ, శ్రీనులు బాబుకు ఫోన్ చేసి తిట్టి బెదిరించారు. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పెట్టుబడి పెడితే లాభాలు పొందొచ్చని.. -
భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్..!
కోల్‌కత : కట్టుకున్న భార్య మరోవ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందని అనుమానించిన ఓ వ్యక్తి ముగ్గురిని బలితీసుకున్నాడు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే వ్యక్తి (46) కుటుంబంతో కలిసి దక్షిణ 24 పరగణాల జిల్లాలో నివాసముంటున్నాడు. అతని బంధువులు కూడా అక్కడే ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా తన భార్య దగ్గరి బంధువైన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అతనికి అనుమానం మొదలైంది. 15 రోజుల క్రితం వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడంతో ఈ అనుమానం మరింత బలపడింది. దీంతో భార్యతో చనువుగా ఉంటున్న వ్యక్తిని చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి సదరు వ్యక్తి ఇంటి గుమ్మం బయట విద్యుత్ సరఫరా ఉన్న వైర్‌ను ఉంచాడు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని వెలుపలకు రప్పించేందుకు బయట ఉన్న వారి బట్టలకు నిప్పుపెట్టాడు. మంటల్ని ఆర్పేందుకు ఇంట్లోని వారు ఒకరివెంట ఒకరు బయటికొచ్చారు. గుమ్మంలో ఉన్న విద్యుత్ వైర్ తగిలి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. మరో ఆరుగురు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిపోయేందుకు యత్నించిన నిందితున్ని రైల్వే స్టేషన్లో పట్టుకున్న గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య..
సాక్షి, నెల్లికుదురు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో పాటు మరొకరితో కలసి తన భర్తను దారుణంగా భార్య సుభద్ర హత్యచేయించిందని తొర్రూర్ డీఎస్పీ జి.మధన్ లాల్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో తొర్రూర్ సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్‌తో కలసి శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన హత్య వివరాలను వెల్లడించారు. నెల్లికుదురు మండలం నైనాల గ్రామ శివారు పార్వతమ్మగూడెం గ్రామానికి చెందిన జెల్లక వెంకన్నకు కేసముద్రం మండల తాళ్ళపూసపల్లి గ్రామానికి చెందిన సుభద్రతో 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు యమున (మానసిక వికలాంగురాలు), మనీషలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారు గుండాల గడ్డ తండాకు చెందిన లావుడ్యా రాము (శ్రీను) వద్ద జెల్లక వెంకన్న రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి వెంకన్న సుభద్ర దంపతుల మధ్య 5ఏళ్లుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. సుభద్రపై అనుమానంతో వెంకన్న పలుమార్లు పంచాయితీ పెట్టించి సుభద్రను తన చెడు పద్ధతిని మార్చుకొమ్మని పెద్దమనుసులు చెప్పినప్పటికీ మారలేదు. గత సంవత్సరం క్రితం రెండు సార్లు వెంకన్నపై విద్యుత్ షాక్‌తో హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సుభద్ర, రాము (శ్రీను), లూనావత్ మంగిలాల్‌తో కలసి పతకం çపన్నారు. ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి పార్వమ్మగూడెం గ్రామానికి వచ్చిన సుభద్ర వెంకన్నతో కలసి ఇంట్లో ఉన్నారు. అదేరోజు అర్ధరాత్రి ఇంట్లో పడుకుని గాఢ నిద్రలో ఉన్న వెంకన్నపై ముగ్గురు కలసి దాడి చేశారు. సుభద్ర, వెంకన్న నోరు మూయగా రాము గొడ్డలి కామతో నుదుటిపై బలంగా కొట్టడమే కాకుండా బండరాయితో తలపై దాడిచేయడంతో పాటు మంగిలాల్ మర్మాంగాలను ఒడిపెట్టి అతి కిరాతంగా హతమార్చారని తెలిపారు. మృతుడి సోదరుడు జెల్లక యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ మదన్‌లాల్ వెల్లడించారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆపై
సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. వివరాలు.. మెరుగు కొమరయ్య, మెరుగు కొమరమ్మ దంపతులు అడ్డగూడూరు మండలం మానాయికుంటలో నివాసముంటున్నారు. కడారి ఈదయ్యతో గత కొంతకాలంగా కొమరమ్మ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. నిన్న రాత్రి (బుధవారం) ఈదయ్య, కొమరమ్మలు ఆమె భర్త కొమరయ్యను హత్య చేశారు. అనంతరం చేసిన నేరాన్ని గ్రామస్తుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పాము విషం ఇంజెక్షన్ చేసి.. భార్యను కడతేర్చాడు!
తరచు గొడవ పడుతూ, వివాహేతర సంబంధం ఉందంటూ వేధిస్తున్న భార్యకు ఇంజెక్షన్ ద్వారా పాము విషం ఎక్కించి చంపేశాడో భర్త. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో జరిగింది. ఈ వివరాలను రామచంద్రపురం డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ పుల్లారావు విలేకరులకు వెల్లడించారు. అక్టోబరు 22న ఏడిద గ్రామానికి చెందిన షేక్ షహీదా బేగం (36) అనుమానాస్పదంగా మరణించింది. ఆమెను చంపింది తానేనంటూ భర్త మొఘలా సాహెబ్ 30వ తేదీన పోలీసుల వద్ద లొంగిపోయాడు. అతడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. మొఘలా సాహెబ్‌కు షహీదా బేగంతో 16 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె తరచు భర్తతో గొడవపడుతూ, పుట్టింటికి వెళ్లి, నెలల తరబడి ఉండిపోయేది. భర్తకు భోజనం కూడా సరిగా పెట్టేది కాదు. వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందంటూ భర్తను వేధించేది. దీంతో ఆమెను అంతమొందించాలని మొఘలా సాహెబ్ నిర్ణయించుకున్నాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు, పాము కరిచి చనిపోయిందని నమ్మించేలా ప్రణాళిక వేశాడు. ఏడిద రోడ్డులో పాములు పట్టేవారి వద్దకు వెళ్లి.. ఆయుర్వేదం మందులోకి కావాలంటూ విషం సేకరించాడు. 22న ఉదయం షహీదాబేగంకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆర్ఎంపీతో వైద్యం చేయించాడు. అతడు వెళ్లిపోయాక పాము విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె కుడిచేతిలోకి ఎక్కించాడు. ఆమె కేకలు వేయగా, స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి వెళ్లేలోపే ఆమె మరణించింది.