హత్య వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ
సాక్షి, నెల్లికుదురు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో పాటు మరొకరితో కలసి తన భర్తను దారుణంగా భార్య సుభద్ర హత్యచేయించిందని తొర్రూర్ డీఎస్పీ జి.మధన్ లాల్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో తొర్రూర్ సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్‌తో కలసి శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన హత్య వివరాలను వెల్లడించారు. నెల్లికుదురు మండలం నైనాల గ్రామ శివారు పార్వతమ్మగూడెం గ్రామానికి చెందిన జెల్లక వెంకన్నకు కేసముద్రం మండల తాళ్ళపూసపల్లి గ్రామానికి చెందిన సుభద్రతో 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు యమున (మానసిక వికలాంగురాలు), మనీషలు ఉన్నారు.
కూలీ పనులు చేసుకుంటూ సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారు గుండాల గడ్డ తండాకు చెందిన లావుడ్యా రాము (శ్రీను) వద్ద జెల్లక వెంకన్న రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి వెంకన్న సుభద్ర దంపతుల మధ్య 5ఏళ్లుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. సుభద్రపై అనుమానంతో వెంకన్న పలుమార్లు పంచాయితీ పెట్టించి సుభద్రను తన చెడు పద్ధతిని మార్చుకొమ్మని పెద్దమనుసులు చెప్పినప్పటికీ మారలేదు. గత సంవత్సరం క్రితం రెండు సార్లు వెంకన్నపై విద్యుత్ షాక్‌తో హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు.
ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సుభద్ర, రాము (శ్రీను), లూనావత్ మంగిలాల్‌తో కలసి పతకం çపన్నారు. ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి పార్వమ్మగూడెం గ్రామానికి వచ్చిన సుభద్ర వెంకన్నతో కలసి ఇంట్లో ఉన్నారు. అదేరోజు అర్ధరాత్రి ఇంట్లో పడుకుని గాఢ నిద్రలో ఉన్న వెంకన్నపై ముగ్గురు కలసి దాడి చేశారు. సుభద్ర, వెంకన్న నోరు మూయగా రాము గొడ్డలి కామతో నుదుటిపై బలంగా కొట్టడమే కాకుండా బండరాయితో తలపై దాడిచేయడంతో పాటు మంగిలాల్ మర్మాంగాలను ఒడిపెట్టి అతి కిరాతంగా హతమార్చారని తెలిపారు. మృతుడి సోదరుడు జెల్లక యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ మదన్‌లాల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment