husband murder case
-
వివాహేతర సంబంధం.. ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
కర్ణాటక: జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో వివాహేతర సంబంధంతో ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు. వివరాల మేరకు మహారాజగడ సమీపంలోని కల్లనాయకనపల్లం గ్రామానికి చెందిన కార్మికుడు మైకేల్‌రాజ్ (36) ఆదివారం అదే ప్రాంతంలోని పొలంలోని బావిలో శవమై కనిపించాడు. గ్రామాధికారి తంగరాజ్ మహారాజగడ పోలీసులకు ఫిర్యాదు చేయగా శవాన్ని స్వాదీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు. విచారణలో అతని భార్య జోస్పిన్ సింధు (28)తో అదే ప్రాంతానికి చెందిన విక్రమ్ (19)కి అక్రమ సంబంధం ఉండేదని, వారి ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ఇరువురూ ఇంట్లో మైకేల్రాజ్ను హత్య చేసి బావిలో పడేసినట్లు తెలిసింది. జోస్పిన్‌సింధు, విక్రమ్‌లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. -
భర్త హోటల్లో పని చేసే సప్లయర్‌తో భార్య వివాహేతర సంబంధం
కర్ణాటక: భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడి సహా ఐదుగురిని తలఘట్టపుర పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు...గతనెల 29న గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేయగా వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. రామనగర జిల్లా చన్నపట్టణ తాలూకా నణ్ణూరుకు చెందిన అరుణ్‌కుమార్ (34) ఆర్‌ఆర్‌నగర ఉత్తరహళ్లి రోడ్డులో జేఎస్ఎస్ కళాశాల పక్కన హోటల్ నడిపిస్తున్నాడు. ఆ హోటల్‌కు గణేశ్ అనే వ్యక్తి నీటిని సరఫరా చేస్తున్నాడు. ఇతనితో అరుణ్‌కుమార్ భార్య రంజిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీనికి తోడు అరుణ్‌కుమార్, గణేశ్‌తో చేబదులుగా కొంత నగదు తీసుకున్నాడు. ఇదిలా ఉంటే గణేశ్, రంజిత వివాహేతర సంబంధం గురించి అరుణ్ తెలుసుకుని భార్యను తీవ్రంగా మందలించాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. గతనెల 28న పార్టీ చేసుకుందామని చెప్పి అరుణ్‌ను గణేశ్ అతని శివానంద, దీపు, శరత్‌లు పిలిపించారు. అరుణ్ రాగానే అతని కళ్లపై కారంపొడి చల్లి మారణాయుధాలతో చంపి హత్య చేశారు. మరుసటి రోజు తలఘట్టపుర పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. అనంతరం విచారణలో భాగంగా రంజిత మొబైల్ ఫోన్‌కాల్ డేటా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
వంటగదిలో ప్రియుడితో భార్య.. భర్తకు మెలకువచ్చి ప్రశ్నించగా
బొబ్బిలి రూరల్: మండలంలోని పారాది గ్రామంలో గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కలిశెట్టి వెంకటరమణ కేసు మిస్టరీ వీడింది. వెంకటరమణను భార్య లలితకుమారి, ఆమె ప్రియుడు రసిల్లి నరసింగరావు(బాలు) కలిసి హతమార్చినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్టు చేసి శనివారం బొబ్బిలి పోలీసుస్టేçషన్ ఆవరణలో మీడియా ముందు ప్రవేశపెట్టి, కోర్టుకు తరలించారు. పట్టణ సీఐ ఎం.నాగేశ్వరరావు తెలిపిన వివరాలు.. లలితకుమారికి వెంకటరమణతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. గ్రామానికి చెందిన నరసింగరావుతో కొద్ది సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వివాదం గతంలో రేగింది. ఘటన జరిగిన గురువారం రాత్రి 10గంటల సమయంలో భర్త నిద్రిస్తున్న సమయంలో లలితకుమారి సెల్‌కు ప్రియుడు మెసేజ్ పెట్టాడు. కలుసుకుందామని మెసేజ్ చేయడంతో లలితకుమారి వీడియోకాల్ చేసి మాట్లాడుకుని అనుకున్న మేరకు ఇంట్లో కలిశారు. వంటగదిలో వీరు ఉన్న సమయంలో భర్తకు మెలుకువ వచ్చి చూడడంతో ఈ సమయంలో ఏం చేస్తున్నావని ప్రశ్నించాడు. తరువాత నరసింగరావును గుర్తించి, భార్య, ఆమె ప్రియుడుని ఆగ్రహంతో కొట్టాడు. వారు ప్రతిదాడి చేసి వెంకటరమణను గాయపరిచి, గోడకు గుద్దారు. అనంతరం భార్య చున్నీతో భర్త వెంకటరమణను ఉరి తీసి చంపేసారు. మృతదేహాన్ని ఇంట్లో ముందర గదిలో ఉంచేసి, ప్రియుడు పరారీ అయ్యాడు. రాత్రి సమయంలో లలితకుమారి తన బావ అప్పలనాయుడుకు తన భర్త గుండెపోటుతో చనిపోయాడని బుకాయించింది. రెండు ట్యాబ్లెట్లు ఇచ్చానని చెప్పడంతో అప్పలనాయుడు, స్థానికులతో కలిసి వచ్చి చూసి ఉదయం దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహానికి స్నానం చేయిస్తున్న సమయంలో గాయాలు గమనించిన బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సీఐ నాగేశ్వరరావు సిబ్బందితో గ్రామంలో విచారణ చేపట్టారు. దీంతో లలితకుమారి, నరసింగరావులను శనివారంఅరెస్టు చేసి కోర్టుకు తరలించారు. కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఇదిలా ఉండగా నరసింగరావు సీతానగరం, పార్వతీపురం ప్రాంతాల్లో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరి ప్రేమ వ్యవహారంలో లలితకుమారి, వెంకటరమణ తరచూ గొడవలు పడి లలితకుమారి పలుసార్లు పుట్టింటికి వెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింగరావు, లలితకుమారి ఎక్కడికైనా వెళ్లిపోదామని ప్రతిపాదనలు చేసినట్టు పోలీసులు తెలిపారు. రోడ్డున పడ్డ పిల్లలు వెంకటరమణ హత్యకు గురి కాగా, లలితకుమారి అరెస్టు కావడంతో అభం శుభం తెలియని ఐదేళ్ల బాబు హర్షవర్దన్, ఏడాదిన్నర పాప యశస్విని రోడ్డున పడ్డారు. వీరిని బంధువుల పర్యవేక్షణలో ఉంచారు. వీరి పరిస్థితి ఏమిటన్నదీ అందరినీ కలచివేస్తుంది. -
రాజీ పేరుతో కొట్టుకుంటూ లాక్కెళ్లి ప్రాణం తీశారు!
అనంతపురం క్రైం: ‘మాకు ఆరుగురు పిల్లలు. అందులో నలుగురూ ఆడపిల్లలే సార్. నా భర్త సంపాదనతోనే మా కుటుంబం నడుస్తోంది. రాజీ అయ్యామని చెప్పి.. రాత్రికి రాత్రి గుంపుగా ఇంటిపై పడ్డారు. ఇంట్లో ఉన్న నా భర్త ప్రసాద్, అతని తమ్ముడు లోకేష్, నా తమ్ముడు బాబును కొట్టుకుంటూ బయటకు లాక్కెళ్లారు. చివరకు నా భర్త ప్రాణాలు తీసేశారు సార్’ అంటూ హతుడు ప్రసాద్ భార్య లక్ష్మి బోరున విలపించింది. సోమవారం ఉదయం అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. తమ కుటుంబసభ్యులందరూ నగరంలోని గౌరీ థియేటర్ వెనుక ఉన్న కొట్టాల్లో నివాసముంటున్నట్లు తెలిపారు. ఈ నెల 6న తన మరిది లోకేష్ కుమారుడి తలనీలాలు సమర్పించేందుకు గుత్తి సమీపంలోని బాట్లో సుంకులమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా.. నీరుగంటి వీధి వద్దకు చేరుకోగానే పాముల కొట్టాలకు చెందిన కొందరు రాంగ్ రూట్లో ద్విచక్రవాహనంపై వస్తూ తమ వాహనాన్ని ఢీకొన్నట్లుగా తెలిపారు. ఆ సమయంలో కాస్త నిదానంగా వెళ్లాలని తన భర్త, మరిది చెప్పారన్నారు. దీంతో వారు కేకలు వేస్తూ లోకేష్‌పై చెయ్యి చేసుకోవడంతో గొడవ మొదలైందన్నారు. ఆ తర్వాత పాముల కొట్టాలకు చెందిన తిరుపతయ్య, తదితరులు కల్పించుకుని రాజీ అవుతున్నట్లుగా చెప్పి.. రాత్రికి రాత్రి ఉన్నఫళంగా పెద్ద గుంపుగా వచ్చి ఇంట్లోకి చొరబడ్డారన్నారు. భర్త ప్రసాద్, మరిది లోకేష్, తమ్ముడు బాబును కొట్టుకుంటూ ఇంటి నుంచి బయటకు లాగారన్నారు. వారి దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసినా వదల్లేదని, వెంటబడి కొట్టుకుంటూ తరిమారన్నారు. వేణుగోపాల్ నగర్ వద్ద ప్రసాద్ కిందపడిపోగా ఆస్పత్రికి తీసుకెళితే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారని వివరించారు. ఉద్దేశపూర్వకంగా తన భర్త ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి తిరుపతయ్య, చిన్న తిరుపతయ్య, నరేంద్ర, మహేష్ తదితరులను కలుపుకుని 17 మందిపై హత్య కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, కర్నూలు: ఏడడుగులు నడిచి నూరేళ్లు కలిసి కాపురం చేస్తానని బాస చేసిన భార్యే భర్తను కడతేర్చింది. వరుసకు కొడుకయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని క్షణికానందం పొందింది. తమకు అడ్డుగా ఉన్న భర్తను ఏడాదిన్నర క్రితమే అంతమొందించింది. ఇన్నాళ్లు తనకు ఏమీ తెలియదన్నట్టూ నాటకం ఆడింది. అయితే పోలీసులు ఎట్టకేలకు ఆమె నాటకానికి తెరదించారు. గురువారం నంద్యాల తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి వివరాలు వెల్లడించారు. మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన డక్కా క్రిష్ణయ్య (40), జయలక్ష్మి (37)లకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. క్రిష్ణయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తన అన్న కుమారుడు డక్కా చింతలయ్యతో జయలక్ష్మి చనువుగా ఉంటూ రాసలీలలు కొనసాగించేది. దీన్ని గమనించిన క్రిష్ణయ్య ఇద్దరిని మందలించాడు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పురాలేదు. పదే పదే మందలిస్తుండటంతో అడ్డుతొలగించుకోవాలని చూసింది. భర్తకు ఈత రాదని ఎక్కడైనా నీళ్లలో తోసి హత్య చేయమని చింతలయ్యకు సలహా ఇచ్చింది. చింతలయ్య నంద్యాలకు చెందిన వెంకట సాయి అలియాస్ కవ్వ, ఆర్ఎస్ గాజులపల్లికి చెందిన శివరాజ్, తన సమీప బంధువు సుధాకర్, తమ్మడపల్లె గ్రామానికి చెందిన ప్రతాప్‌లతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. 2020 సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు నందిపల్లె గ్రామ శివారులోని పాలేరు వాగు వంతెనపై బైక్‌మీద వెళ్తున్న క్రిష్ణయ్యను చింతలయ్య ఆపాడు. ఇద్దరు కలిసి మాట్లాడుతుండగా మిగతా నిందితులు క్రిష్ణయ్య కాళ్లు, చేతులు పట్టుకొని నీటిలోకి విసిరేశారు. దీంతో అతను నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు. అదే రోజు జయలక్ష్మి తన భర్త కనిపించటం లేదని మహానంది పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత నంద్యాల పట్టణ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలోని పాలేరు వాగులో క్రిష్ణయ్య మృతదేహం లభ్యం కావటంతో తాలుకా పోలీసులు గుర్తించి భార్యకు తెలియజేశారు. క్రిష్ణయ్య మృతి చెందటానికి బలమైన కారణాలు అంతుచిక్కకపోవటంతో భార్య ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు. అయితే జయలక్ష్మి, చింతలయ్య ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన మహానంది పోలీసులు నిఘా పెట్టారు. ఈక్రమంలో 15 రోజుల క్రితం చింతలయ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో చింతలయ్య హత్య తానే చేయించానని ఒప్పుకున్నాడు. పోలీసులు చింతలయ్యను అదుపులోకి తీసుకున్నారని తెలియగానే జయలక్ష్మి కనిపించకుండా పరారైంది. నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ మురళీమోహన్, ఎస్ఐలు శ్రీనివాసులు, శేషయ్య, గంగయ్యయాదవ్, మల్లికార్జునులను అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి అభినందించారు. నిందితులను అరెస్ట్ చూపుతున్న అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి -
అడ్డుగా ఉన్నాడనే భర్త హత్య..
సాక్షి, నెల్లికుదురు : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో పాటు మరొకరితో కలసి తన భర్తను దారుణంగా భార్య సుభద్ర హత్యచేయించిందని తొర్రూర్ డీఎస్పీ జి.మధన్ లాల్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో తొర్రూర్ సీఐ వి.చేరాలు, ఎస్సై పెండ్యాల దేవేందర్‌తో కలసి శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన హత్య వివరాలను వెల్లడించారు. నెల్లికుదురు మండలం నైనాల గ్రామ శివారు పార్వతమ్మగూడెం గ్రామానికి చెందిన జెల్లక వెంకన్నకు కేసముద్రం మండల తాళ్ళపూసపల్లి గ్రామానికి చెందిన సుభద్రతో 18ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు యమున (మానసిక వికలాంగురాలు), మనీషలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుంటూ సాఫీగా సాగుతున్న వీరి జీవితంలో మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామ శివారు గుండాల గడ్డ తండాకు చెందిన లావుడ్యా రాము (శ్రీను) వద్ద జెల్లక వెంకన్న రూ.50వేలు అప్పుగా తీసుకున్నాడు. అప్పటి నుంచి వెంకన్న సుభద్ర దంపతుల మధ్య 5ఏళ్లుగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. సుభద్రపై అనుమానంతో వెంకన్న పలుమార్లు పంచాయితీ పెట్టించి సుభద్రను తన చెడు పద్ధతిని మార్చుకొమ్మని పెద్దమనుసులు చెప్పినప్పటికీ మారలేదు. గత సంవత్సరం క్రితం రెండు సార్లు వెంకన్నపై విద్యుత్ షాక్‌తో హత్య చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని సుభద్ర, రాము (శ్రీను), లూనావత్ మంగిలాల్‌తో కలసి పతకం çపన్నారు. ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి పార్వమ్మగూడెం గ్రామానికి వచ్చిన సుభద్ర వెంకన్నతో కలసి ఇంట్లో ఉన్నారు. అదేరోజు అర్ధరాత్రి ఇంట్లో పడుకుని గాఢ నిద్రలో ఉన్న వెంకన్నపై ముగ్గురు కలసి దాడి చేశారు. సుభద్ర, వెంకన్న నోరు మూయగా రాము గొడ్డలి కామతో నుదుటిపై బలంగా కొట్టడమే కాకుండా బండరాయితో తలపై దాడిచేయడంతో పాటు మంగిలాల్ మర్మాంగాలను ఒడిపెట్టి అతి కిరాతంగా హతమార్చారని తెలిపారు. మృతుడి సోదరుడు జెల్లక యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ మదన్‌లాల్ వెల్లడించారు. -
ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
త్రిపురారం(నాగార్జునసాగర్) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. గత మార్చి 17న జరిగిన ధార శ్రీనయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. శనివారం హలియా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్, çహాలి యా సీఐ ధనుంజయగౌడ్ హత్య కేసు వివరాలు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం ఘనిపల్లి గ్రామానికి చెందిన ధార శ్రీనయ్య, భార్య వాణితో కలిసి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల కిత్రం హాలియాకు వచ్చాడు. హాలియాలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. ఇదే ఇంట్లో మరో పక్క పోర్షన్లో మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన బచ్చు వెంకట్‌రెడ్డి ఉంటున్నాడు. ఈయన హాలియాలో ఫొటోస్టూ డియో నిర్వహిస్తున్నాడు. ధార శ్రీనయ్య లారీడ్రైవర్ కావడంతో నెలలో ఎక్కువ రోజుల పాటు ఇతర ప్రాంతాలకు తిరుగుతూ ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఒకే ఇంట్లో పక్కపక్కనే నివాసం ఉంటున్న ధార వాణి, బచ్చు వెంకట్‌రెడ్డిల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం ధార శ్రీనయ్యకు తెలియడంతో భార్య వాణిని పలుమార్లు మందలించాడు. అయినా తనలో ఏ మార్పు రాకపోవడంతో తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన వివాహేతర సంబంధానికి ధార శ్రీనయ్య అడ్డుగా వస్తున్నాడని భావించిన వాణి, వెంకట్‌రెడ్డి అతన్ని అంతమొందించాలని పథకం పన్నారు. వెంకట్‌రెడ్డి నందిపాడు గ్రామానికి చెందిన తన స్నేహితులు జోగు వినోద్‌రెడ్డి, నేరేళ్ల మహేష్‌తో కలిసి పథకాన్ని అమలు చేశారు. ఈక్రమంలో గత మార్చి 17వ తేదీన భార్య వాణి, వెంకట్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, మహేష్ కలిసి తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనయ్యను గొంతు నులిమి, ఎదురొమ్ముపై బాగా కొట్టారు. బలమైన దెబ్బలకు శ్రీనయ్య స్పృహ కొల్పోయాడు. నిందితులు శ్రీనయ్యను ఓ మోటార్‌బైక్‌పై కూర్చొబెట్టుకుని హాలియా సమీపంలో ఉన్న ఎడమకాల్వలో పడేశారు. వెలుగులోకి వచ్చిందిలా.. శ్రీనయ్య తమ్ముడు ధార రమేశ్ ఈనెల 10న తన సొంత పనినిమిత్తం పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. రమేశ్‌కి పోలీస్‌స్టేషన్‌లో నోటీస్ బోర్డుపై ఉన్న గుర్తుతెలియని మృతదేహం అని ఓ ఫొటో కనిపించింది. మృతుడి ఒంటిపై ఉన్న దుస్తులు, ముఖ కవలికలను గుర్తించి రమేశ్ తన సోదరుడి మృతదేహం గా భావించాడు. ఈ విషయంపై మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేయగా డీఎస్పీ హాలియా సీఐ ధనుంజయగౌడ్‌కు కేసుకు సంబం ధించిన బాధ్యతలను అప్పగించాడు. సీఐ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ మొదలుపెట్టారు. ఈక్రమంలో ప్రత్యేక బృందం పోలీసులకు ఫొటో స్టూడియో నడుపుతున్న వెంకట్‌రెడ్డిపై అనుమానం వచ్చి ఆరా తీశారు. వెంకట్‌రెడ్డి వనపర్తి జిల్లా కొత్తపేటలో ఉంటున్నాడని తెలిసి పోలీస్ బృందం అక్కడకు వెళ్లి వెంకట్‌రెడ్డిని అతనితో పాటు ఉంటున్న ధార వాణిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనయ్య భార్య వాణితో పాటు వెంకట్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, మహేశ్‌లను విచారించగా నేరం అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. కేసును ఛేదించిన సీఐ ధనుంజయగౌడ్‌తో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
స్వాతి గారు
నిందితురాలి గురించి చెబుతున్నప్పుడు పోలీసులు ‘తమదైన శైలి’కి భిన్నంగా మర్యాదకరమైన భాషను ఉపయోగిస్తుండగా.. ‘తనది కాకూడని శైలి’లో మీడియా అమర్యాదకరమైన రీతిలో నిందితురాలిని ఆడిపోసుకుంటోంది. విచారణ జరగక ముందే నిందితురాలిని పరమ దుర్మార్గురాలిగా చిత్రీకరించే ‘మోరల్ బైనరీ’ ఇది! ఈసబెల్ అయాండే చిలీ సంతతి అమెరికన్ రచయిత్రి. ‘భూత నిలయం’, ‘మృగ నగరం’ అని అర్థం వచ్చే రెండు నవలల్తో తొలిసారి ఈసబెల్ పేరు అందరికీ తెలిసింది. భూత నిలయంలో భూతాలు ఉండవు. మృగ నగరంలో మృగాలు ఉండవు. మానవ జీవితంలోని సహజ భావనలే ఆ భూతాలు, మృగాలు. ‘మేజికల్ రియలిజం’ ఆమె రచనాశైలి. అంటే ఏం లేదు. కల్పన కల్పనలా ఉండదు. వాస్తవం వాస్తవంలా ఉండదు. పుస్తకంలోని పేజీల్లోపల ఏం జరగాలో అదే జరుగుతుంది. రచయిత్రి వచ్చి జరిపించరు. మోరల్ బైనరీస్ ఉండవు. తప్పు, ఒప్పు తప్ప ఇంకేం అయ్యేందుకు అవకాశమే లేదనే ఆలోచనకు ప్రభావితం చెయ్యడం మోరల్ బైనరీ. అది ఉండదు ఈసబెల్ రచనల్లో. ఈసబెల్ నవలలతో సమానంగా ఆమె మాట ఒకటి బాగా వాడుకలో ఉంది. ‘వాట్ ఐ ఫియర్ మోస్ట్ ఈజ్ పవర్ విత్ ఇంప్యూనిటీ. ఐ ఫియర్ అబ్యూజ్ ఆఫ్ పవర్, అండ్ ది పవర్ టు బ్యూజ్’. శిక్షల నుంచి మినహాయింపు పొందిన అధికారం అంటే ఆమెకు భయం. అధికారం ఇచ్చి, నువ్వేం చేసినా శిక్ష ఉండదని చెప్తే అధికారం దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉంటాయి. దుర్వినియోగం చెయ్యడానికే నీకీ అధికారం అని చెప్పినట్లూ అవుతుంది. అదీ ఈసబెల్ భయం. ‘పవర్ విత్ ఇంప్యూనిటీ’ని చట్టం ఎవరికీ ఇవ్వదు. తీసుకుంటారంతే! ఎందుకు తీసుకుంటారూ అంటే.. అధికారం ఉంది కాబట్టి తీసుకోవాలనిపిస్తుందేమో. పోలీసులకు అధికారం ఉంటుంది. న్యాయ వ్యవస్థకు అధికారం ఉంటుంది. ప్రజాప్రతినిధులకు అధికారం ఉంటుంది. ప్రజలకు ఏమైనా చెయ్యాలంటే అధికారం ఉండాలి కనుక ఉండే అధికారాలివన్నీ. అంతే తప్ప, అధికారం ఉంది కదా అని ప్రజల్ని ఏమైనా చెయ్యడానికి ఉండే అధికారాలు కావు. మీడియా కూడా మిగతావాటిలా తనకూ అధికారం ఉందనుకుంటుంది. నిజానికి మీడియాకు ప్రజల తరఫున తనకై తానుగా తీసుకున్న ‘సుమోటో’ లాంటి హక్కు తప్ప, ప్రభుత్వం ఇచ్చిన అధికారం ఏమీ ఉండదు. కానీ ఉందనుకుంటుంది! ఉందనుకున్న ఆ అధికారంతో ఒక్కోసారి జడ్జిలా తీర్పులు ఇస్తుంటుంది. పోలీసులా ప్రశ్నలు వేస్తుంటుంది. బాబాలా ప్రవచనాలు చెబుతుంటుంది. పొలిటీషియన్ల మీద సెటైర్లు వేస్తుంది. ఏ విషయాన్నైనా తను తప్పనుకుంటే తప్పనిపించేలా చెబుతుంది. తను ఒప్పనుకుంటే ఒప్పనిపించేలా చెబుతుంది. తను దారుణం అనుకుంటే దారుణం అనిపించేలా చెబుతుంది. ఇదే ‘మోరల్ బైనరీ’. దారుణాన్ని దారుణం అని చెప్తే చాలు. దారుణంగా చెప్పాలా! భాషను మార్చుకుంటున్న ఏజ్‌లో ఉన్నాం మనం. ‘తమదైన శైలిలో విచారించగా..’ అని పోలీసుల గురించి మీడియా చెప్పడం కూడా సరికాదు. పోలీసుల అధికార దుర్వినియోగాన్ని ఒక శైలిగా సూత్రీకరించడం అది. నాగర్‌కర్నూల్‌లో భర్త హత్య కేసు విషయంలో స్వాతిని అరెస్ట్ చేసిన వార్తను చెబుతున్నప్పుడు మీడియా.. ప్రియుడి మోజులో పడి భర్తను చంపిందనీ, భర్త ప్లేసులో ప్రియుడితో దర్జాగా పుణే చెక్కేద్దామనుకుందనీ, సిగ్గు లేదనీ, శరం లేదనీ.. అసలు ఆడ మనిషే కాదనీ తిట్టిపోస్తుంటే.. పోలీసు అధికారులు మాత్రం ఈ కేసు గురించి మీడియాకు వివరాలు ఇస్తూ.. స్వాతిని అనేకసార్లు ‘స్వాతి గారు ఇలా చేశారు’, ‘స్వాతి గారు అలా చేశారు’ అని ఎంతో మర్యాదగా మాట్లాడుతూ తమకు తెలియకుండానే నేరానికి ‘ఫీల్‌గుడ్’ నేరేషన్ ఇవ్వడం టీవీలో చూస్తున్నవాళ్లందరికీ కొత్తగా అనిపించింది. పోలీసులపై సదభిప్రాయం కూడా కలిగించింది. సమాజాన్ని మెరుగు పరచాలని నిరంతరం పరుగులు తీస్తుండే మీడియా.. ఒక రోజు సెలవు పెట్టయినా తన పద్ధతులను మెరుగు పరచుకునే ఆలోచనలు చేస్తే.. వార్త, వార్తలా ఉంటుంది. రచనల్లోని ‘మేజికల్ రియలిజం’.. వార్తలు చెప్పడంలో కనిపించకూడదు. కనిపిస్తే అది ‘పవర్ విత్ ఇంప్యూనిటీ’నే అవుతుంది. అబార్షన్ వార్తల్ని రాసేటప్పుడు జర్నలిస్టులు ఎంత సున్నితంగా ఆలోచించాలో ‘నేర్పించే’ సెషన్ ఒకటి ‘గ్లోబల్ హెల్త్ స్ట్రాటజీస్’ ఆధ్వర్యంలో ఈమధ్య న్యూఢిల్లీలో జరిగింది. పిండాన్ని పిండమనే రాయండి తప్ప శిశువు అని రాయకండనీ, రాసేటప్పుడు తప్పొప్పుల ‘మోరల్ బైనరీస్’ ఇవ్వకండనీ ఆ సెషన్లో చెప్పారు. నేరుగా చెప్పండి తప్ప వేరుగా చెప్పకండి అన్నారు. కరెక్టు మాట. అబార్షన్ని అబార్షన్ అని చెబితే చాలు. ‘దేవుడితో ఆటలు’ (ప్లేయింగ్ విత్ గాడ్) అనక్కర్లేదు. గర్భాన్ని ఉంచుకుంటే గర్భాన్ని ఉంచుకున్నట్లు చెబితే చాలు. ‘మాతృత్వాన్ని కాపాడుకోవడం’ (సేవింగ్ మదర్‌హుడ్) అనక్కర్లేదు. - మాధవ్ శింగరాజు -
భర్తను హత్య చేసిన కేసులో స్వాతికి తప్పని కష్టాలు
-
భర్త హత్యకు రూ.లక్ష సుపారీ..
పత్తికొండ టౌన్:మానవ సంబంధాలు మంటగలసిపోతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కుట్ర పన్ని అంతమొందించింది ఓ మహిళ. గత నెల 10న తుగ్గలి మండలం మీటేతండా సమీపంలో పొత్తూరు కమ్మ నారాయణస్వామి(55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణలో భార్యే కుట్రపన్ని చంపేసినట్లు పోలీసులు తేల్చారు. ఈమేరకు భార్యతోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పత్తికొండలో సీఐ బివి.విక్రంసింహ, పత్తికొండ, జొన్నగిరి ఎస్ఐలు శ్రీనివాసులు, నజీర్‌అహ్మద్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. పత్తికొండ మండలం రామచంద్రాపురం కొట్టాల గ్రామానికి చెందిన పొత్తూరు కమ్మ నారాయణస్వామికి, అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పెద్ద చిన్న ప్యాపిలి(పీసీ ప్యాపిలి)కి చెందిన ఉమాదేవితో 1997లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నారాయణస్వామికి వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, కుటుంబాన్ని పోషించేవాడు. భార్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గ్రామంలో బంధువుల మధ్య పరువు పోతుందని పత్తికొండకు మకాం మార్చాడు. తర్వాత గుంతకల్లులో నివాసముండేవారు. భార్య మద్దికెర మండలం బురుజులకు చెందిన ఎర్రిస్వామితో సన్నిహితంగా ఉండేది. ఈక్రమంలో నారాయణస్వామి చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. రెండేళ్ల క్రితం అతడికి దీర్ఘకాలిక వ్యాధి సోకింది. అప్పటి నుంచి ఆమె అతడిని శారీరకంగా దూరంగా ఉంచడంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు. తనకు పరిచయమున్న వన్నూర్‌స్వామి అనే మంత్రగాడితో ఆమె తన సమస్యను చెప్పుకుంది. అతడి సలహా మేరకు భర్త హత్య చేయించేందుకు తుగ్గలి మండలం జొన్నగిరికి చెందిన రాజశేఖర్‌తో రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకుంది. హత్య చేసేందుకు గోవా టూర్‌కు.. ముందుగా రచించుకున్న ప్రణాళిక ప్రకారం ఆమె తన భర్తను రాజశేఖర్ వెంట మార్చి 4న రైలులో గోవా టూర్‌కు పంపింది. హుబ్లి సమీపంలో మద్యం మత్తులో ఉన్న నారాయణస్వామిని టవల్‌తో గొంతు నులిమి చంపేందుకు రాజశేఖర్ యత్నించాడు. మత్తులో ఉన్న ఆయన ఒక పక్కకు ఒరిగిపోవడంతో చనిపోయాడని భావించిన రాజశేఖర్ అక్కడ నుంచి పారిపోయి గుంతకల్లుకు వచ్చాడు. ప్రాణాపాయం నుంచి బయటపడిన నారాయణస్వామి మళ్లీ తిరిగివచ్చి రాజశేఖర్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. రాజశేఖర్‌కు ఫోన్ చేసి ‘నా భర్త నీకోసం వెదుకుతున్నాడు, నువ్వు చంపకపోతే ఆయన చేతిలో చస్తావు’ అని పలుసార్లు బెదిరించింది. తనను ఎక్కడ చంపుతారో అని భయపడిన రాజశేఖర్.. నారాయణస్వామిని చంపాలని నిశ్చయించుకున్నాడు. బైక్‌ను వెంబడించి.. ఎలాగైనా నారాయణస్వామిని హత్య చేయాలనుక్ను రాజశేఖర్ ఇందుకు తన సోదరుడు అనంతపురం జిల్లా తోపుదుర్తిలో జీపుడ్రైవర్‌గా ఉంటున్న సుధాకర్, అదే జిల్లా తగరకుంటకు చెందిన ఆటోడ్రైవర్ బాలునాయక్ సాయం కోరాడు. ఉమాదేవి సమాచారం మేరకు..గత నెల 9న గుంతకల్లు నుంచి ప్యాపిలి వెళ్తున్న నారాయణస్వామిని ముగ్గురూ బైక్‌పై వెంబండించారు. గత నెల 10 తెల్లవారుజామున బోడబండ పక్కీరప్ప ఆలయానికి వెళ్లి వస్తున్న నారాయణస్వామిని మీటేతండా సమీపంలో గొంతుకు టవల్ బిగించి హత్యచేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లుగా నమ్మించేందుకు మృతుడి పక్కనే బైక్‌ను పడవేసి అక్కడి నుంచి జారుకున్నారు. తొలుత అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక, నిందితుల ఫోన్ డేటా ఆధారంగా హత్యకేసుగా తేల్చారు. ఈమేరకు నిందితులు ఉమాదేవి, వన్నూర్‌స్వామి, రాజశేఖర్, సుధాకర్, బాలునాయక్‌లను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్ 14రోజుల రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. -
హత్యకు పురిగొల్పిన వివాహేతర సంబంధం
ఆనందపురం(భీమిలి): సభ్య సమాజం తలదించుకునేలా వావి వరసలు మరిచి స్వయాన తన అక్క కొడుకుతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం బయట పడి భర్త నిలదీయడంతో అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. అందుకు తన ప్రియుడినే పురమాయించింది. ఆ వ్యక్తి స్వయాన తన తమ్ముడినే వెంటేసుకొని వెళ్లి బాబాయ్‌ని అంతమొందించాడు. మండలంలోని గొట్టిపల్లిలో జరిగిన ఈ ఘాతుకానికి సంబంధించి ఏసీపీ బి.వి.ఎస్.నాగేశ్వరరావు, ఆనందపురం పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పద్మనాభం మండలం, కురపల్లి గ్రామానికి చెందిన నరసియ్యమ్మకు విజయనగరం జిల్లా, డెంకాడ మండలం, మోదవలస గ్రామానికి చెందిన బాడితబోయిన రాములప్పడుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. నరసియ్యమ్మ అక్క రమణమ్మ ఆనందపురం మండలంలోని గొట్టిపల్లిలో ఉంటోంది. అక్క చెల్లెళ్లు పరస్పరం రాకపోకలు సాగిస్తుంటారు. రాములప్పడు కూలి పనికోసం లక్కవరపుకోట తదితర ప్రాంతాల్లో బ్రిక్ ఇండస్ట్రీస్‌కి వెళ్లి 15 రోజులకోసారి ఇంటికి వస్తుంటాడు. కుటుంబం మోదవలసలోనే ఉంటోంది. గొట్టిపల్లిలో ఉంటున్న నరసియ్యమ్మ అక్క రమణమ్మ కొడుకు అప్పలరాజు(21) తరుచూ మోదవలస రాకపోకలు సాగించడాన్ని రాములప్పడు కుటుంబ సభ్యులు గమనించారు. ఈ విషయాన్ని రాములప్పడుకు తెలియజేయగా అతను అప్పలరాజుపై నిఘా ఉంచి వాస్తవమేనని రూఢీ చేసుకున్నాడు. దీంతో భార్యాభర్తలు మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. రాములప్పడు గట్టిగా నిలదీయడంతో భర్త అడ్డు తొలగించుకోవాలని నరసియ్యమ్మ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న ఉదయం గొట్టిపల్లిలో ఉన్న తన అక్క రమణమ్మ ఇంటికి వచ్చేసి తన భర్త వేధిస్తున్న విషయాన్ని అప్పలరాజుకు తెలపడంతో రాములప్పడును చంపేయాలని నిర్ణయించుకున్నాడు. నరసియ్యమ్మ గొట్టిపల్లి వచ్చిన విషయం లక్కవరపుకోటలో పనిలో ఉన్న రాములప్పడుకు తెలియడంతో అదే రోజు మధ్యాహ్నానికి అతను గొట్టిపల్లి చేరుకున్నాడు. అప్పటికే పక్కా వ్యూహంతో ఉన్న అప్పలరాజు తన తమ్ముడైన ఎల్లారావు (19)ని వెంట బెట్టుకొని రాములప్పడుతో కలిసి చందకలో మద్యం షాపు వద్దకు వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేశారు. అనంతరం గొట్టిపల్లి గ్రామ సమీపంలో ఉన్న మామిడితోటలోకి తీసుకెళ్లి రాములప్పడుకు పూర్తిగా మద్యం పట్టారు. మత్తులోకి జారుకున్నాక ముందు అప్పలరాజు రాములప్పడుని కర్రతో కొట్టగా ఎల్లారావు నోటిని అడిచిపెట్టి ఛాతీపై కర్రతోను చేతులతోను విచక్షణారహితంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. వారిరువురు గ్రామంలోకి వచ్చి ఆ విషయాన్ని నరసియ్యమ్మకు తెలపగా సంఘటనా ప్రాంతం వద్దకు ఆటోలో వెళ్లి స్పృహ తప్పి ఉన్న రాములప్పడును ఆటోలో ఎక్కించుకొని తీసుకొని వచ్చి ఒక ఇంట్లో ఉంచారు. మద్యం ఎక్కువైందని అందరినీ నమ్మించారు. చీకటిపడగానే గ్రామంలో ఉన్న ఆర్ఎంపీ వైద్యుడికి చూపించడంతో అప్పటికే మృతి చెందినట్టు నిర్థారించారు. దీంతో రాములప్పడుని అదే ఆటోపై నరసియ్యమ్మ మోదవలసలోని తన ఇంటికి తీసుకొని వెళ్లి గుట్టుగా ఇంట్లో పడుకోబెట్టి, వారు జారుకోవడంతో రాములప్పడు కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏసీపీ బి.వి.ఎస్.నాగేశ్వరావు ఆదేశాలతో సీఐ ఆర్.గోవిందరావు, ఎస్ఐ ఎన్.గణేష్ రంగంలోకి దిగారు. ముందుగా మోదవలసలో ఉన్న శవాన్ని భీమిలి తరలించారు. అనంతరం గొట్టిపల్లి వెళ్లి విచారణ జరపడంతో అసలు విషయం బయట పడింది. ఈ సంఘటనలో రాములప్పడు భార్య నరసియ్యమ్మ, గండిబోయిన అప్పలరాజు, ఎల్లారావులను నిందితులగా తేల్చి అరెస్ట్ చేశారు. సీఐ గోవిందరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు అరెస్టు
బ్రహ్మంగారిమఠం (కర్నూల్): భర్తను హత్య చేసిన కేసులో భార్యను, ఆమె ప్రియుడ్ని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠంలోని బ్రహ్మంసాగర్ సమీపంలో ఉన్న కొత్తబసవాపురం గ్రామంలో ఈ నెల 8న వంగ జయరామానాయుడిని ఆయన భార్య, ఆమె ప్రియుడు హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. ఈ నెల 7వతేదీన జయ రామానాయుడు లారీకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఇంట్లో భార్య వెంకటలక్ష్మీ, ఆమె ప్రియుడు సోమయ్యలు ఉండటం గమనించాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణలో భర్తను వెంకటలక్ష్మీ గొడ్డలితో కొట్టింది. జయరాముడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ప్రియుడు సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చికిత్స కోసం భర్తను తీసుకెళుతుండగా రాజంపేట వద్ద మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి మైదుకూరు రూరల్ సి.ఐ నాగభూషణం చొరవతో హత్యకు సంబంధించిన వివరాలను పూర్తిగా సేకరించి వెంటలక్ష్మి, ఆమె ప్రియుడు సోమయ్యలను 302, 201 సెక్షన్ల కింద అరెస్టు చేశామని ఎస్సై తెలిపారు.