
కర్ణాటక: జిల్లా కేంద్రం క్రిష్ణగిరి సమీపంలో వివాహేతర సంబంధంతో ప్రియునితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు కటకటాల పాలయ్యారు. వివరాల మేరకు మహారాజగడ సమీపంలోని కల్లనాయకనపల్లం గ్రామానికి చెందిన కార్మికుడు మైకేల్‌రాజ్ (36) ఆదివారం అదే ప్రాంతంలోని పొలంలోని బావిలో శవమై కనిపించాడు. గ్రామాధికారి తంగరాజ్ మహారాజగడ పోలీసులకు ఫిర్యాదు చేయగా శవాన్ని స్వాదీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు.
విచారణలో అతని భార్య జోస్పిన్ సింధు (28)తో అదే ప్రాంతానికి చెందిన విక్రమ్ (19)కి అక్రమ సంబంధం ఉండేదని, వారి ఆనందానికి అడ్డుగా ఉన్నాడని ఇరువురూ ఇంట్లో మైకేల్‌రాజ్‌ను హత్య చేసి బావిలో పడేసినట్లు తెలిసింది. జోస్పిన్‌సింధు, విక్రమ్‌లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment