ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆపై | Wife Murdered Husband With Lover In Yadadri Bhuvanagiri District | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 11 2018 7:15 PM | Last Updated on Thu, Oct 11 2018 7:19 PM

Wife Murdered Husband With Lover In Yadadri Bhuvanagiri District - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. వివరాలు.. మెరుగు కొమరయ్య, మెరుగు కొమరమ్మ దంపతులు అడ్డగూడూరు మండలం మానాయికుంటలో నివాసముంటున్నారు. కడారి ఈదయ్యతో గత కొంతకాలంగా కొమరమ్మ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. నిన్న రాత్రి (బుధవారం) ఈదయ్య, కొమరమ్మలు ఆమె భర్త కొమరయ్యను హత్య చేశారు. అనంతరం చేసిన నేరాన్ని గ్రామస్తుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement