wife murders husband
-
తెగని పంచాయితీ.. అత్తవారింటికి వచ్చిన అల్లుడు.. ఇదే అదనుగా..
శాలిగౌరారం (నల్గొండ): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన శాలిగౌరారం మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామానికి చెందిన ప్రస్తుత సర్పంచ్ మామిడికాయల జయమ్మ కుమార్తె సారికను నకిరేకల్ మండలం మండలాపురం గ్రామానికి చెందిన మాచర్ల కిరణ్(35)కు ఇచ్చి 2011లో వివాహం జరిపించారు. వీరికి కుమారుడు(10), కుమార్తె(7) ఉన్నారు. వివాహం జరిగినప్పటి నుంచి వీరు హైదరాబాద్‌లో జీవనం సాగిస్తున్నారు. సారిక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేయగా, కిరణ్ ఎమ్మార్పీఎస్ ఆర్గనైజేషన్‌లో పనిచేసేవాడు. ఈ క్రమంలో రోజురోజుకూ పోషణ ఖర్చులు పెరుగుతుండటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఇద్దరి మధ్య నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగం మానేసిన సారిక ఆరు నెలల క్రితం కుమారుడు, కుమార్తెను వెంటపెట్టుకొని చిత్తలూరులోని తల్లిగారింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. కానీ భార్యభర్తల మధ్య బేదాభిప్రాయాలు తగ్గకపోవడంతో విడివిడిగా ఉంటున్నారు. వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా భర్తపై పోలీసులకు ఫిర్యాదు ఈనేపథ్యంలో భర్త కాపురానికి తీసుకుపోవడంలేదని 20రోజుల క్రితం సారిక శాలిగౌరారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కిరణ్‌ను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి పోలీసులు భార్యాభర్తలకు కలిసి ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అక్కడనుంచి కిరణ్ హైదరాబాద్‌కు పోగా, సారిక చిత్తలూరులో ఉంటోంది. ఈక్రమంలో సోమవారం మధ్యాహ్నం 3గంటలకు కిరణ్ చిత్తలూరు గ్రామానికి వచ్చాడు. సాయంత్రం కిరణ్ మద్యం ఇంటికి తెప్పించుకొని తాగాడు. భోజనం తర్వాతా ఆర్థికపరమైన విషయాలతో దంపతుల మధ్య వాదనలు జరిగాయి. కొంతసమయం తర్వాత కిరణ్ ఇంట్లో నేలపై నిద్రించాడు. ఇదే అదునుగా భావించిన సారిక రాత్రి 11 గంటల సమయంలో నిద్రలో ఉన్న కిరణ్ తలపై బండరాయితో మోదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే సారిక అక్కడనుంచి బయటకు వెళ్లి వంగమర్తిమీదుగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించి లొంగిపోయింది. దీంతో అర్వపల్లి పోలీసులు సంఘటన గురించి శాలిగౌరారం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం హతుడి కుటుంబ సభ్యులు, బంధువులు చిత్తలూరుకు చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని సీఐ రాఘవరావు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం తరలింపు అడ్డగింత మాచర్ల కిరణ్ హత్యలో భార్య సారికతో పాటు మరికొంతమంది ప్రమేయం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. నిందితులను గుర్తించి కేసు నమోదుచేసి చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమనిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హతుడి తమ్ముడు మాచర్ల కిశోర్ సారికతో పాటు మరో నలుగురి వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిశోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. హత్యలో ఐదుగురి పాత్ర? మాచర్ల కిరణ్ హత్యలో భార్య సారికతో పాటు మరో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు హతుడి కుటింబికులు ఆరోపిస్తున్నారు. వారిలో సారికతో పాటూ చిత్తలూరుకు చెందిన ఆమె అక్క బండారు నాగమ్మ, ఆమె కుమారుడు బండారు శివప్రసాద్, యాదాద్రి భువనగిరిజిల్లా అడ్డగూడూరు మండలం వెల్దేవికి చెందిన ఓ వ్యక్తి, నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో! తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇద్దరు పిల్లలతో కలిసి.. -
భర్తను హతమార్చి కరోనా పేరుతో నాటకం..!
సాక్షి, చెన్నై: భర్తను హతమార్చడమే కాకుండా, శ్వాస ఆడకుండా కరోనాతో మరణించినట్టుగా ఓ భార్య నాటకాన్ని రక్తి కట్టించింది. అయితే, మృతుడి సమీప బంధువు హఠాత్తుగా ఆస్పత్రిలో ప్రత్యక్షం కావడంతో ఆ భార్య గుట్టు రట్టయ్యింది. ఈరోడ్జిల్లా గోబి చెట్టి పాళయం సమీపంలోని కుమార పాళయంకు చెందిన శ్రీనివాసన్ స్థానికంగా సెలూన్ దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య ప్రభా, పదేళ్ల కుమార్తె ఉంది. ఈ పరిస్థితుల్లో మంగళవారం తన భర్తకు శ్వాస ఆడడం లేదని, కరోనా వచ్చినట్టుగా ఉందంటూ రోదించింది. ఇరుగు పొరుగు వారి సాయం కోరింది. కరోనా భయంతో ఇరుగురు పొరుగు వారు సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చివరకు ఓ ఇద్దరు వ్యక్తులు ఆమెకు సహకరించారు. సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా శ్రీనివాసన్‌ను పరీక్షించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. దీంతో తనతో వచ్చిన ఇద్దరి వ్యక్తుల సాయంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే యత్నం చేసింది. అదే సమయంలో ఆ ఆస్పత్రి వద్ద శ్రీనివాసన్ సమీప బంధువు ఒక రు ప్రత్యక్షం కావడంతో ప్రభాలో ఆందోళన బయలుదేరింది. శ్రీనివాసన్‌ను క్షుణ్ణంగా పరీక్షించిన ఆ బంధువు మెడ భాగంలో గాయం ఉండటాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆమెతో పాటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఉడాయించారు. పోలీసులు జరిపిన విచారణలో ఆమె తన భర్తను ఇద్దరు ప్రియులు సెలూన్ శరవణకుమార్, పొరోటా వెల్లింగిరితో కలసి భర్తను చంపి నాటకం ఆడినట్లు నిర్ధారించారు. లాక్డౌన్ సమయంలో తన భార్య ప్రభా ఎవరితోనో పదేపదే ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసిన శ్రీనివాసన్ మందలించడం వల్లే.. ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. చదవండి: జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ -
బావతో కలిసి భర్తను హత్య చేసిన భార్య
రాజస్థాన్ లోని ఉదయపూర్ లో బావతో కలిసి ఒక మహిళ తన భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ విషయం 5 నెలల తర్వాత చాలా ఆశ్చర్యకరంగా బయటకి వచ్చినట్లు పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్రంలోని అగర్తల పరిధిలోని నాగ్పాడకు చెందిన 45 ఏళ్ల ఉత్తమ్ దాస్ అనే వ్యక్తి తన అన్నయ్య 51 ఏళ్ల తపన్ దాస్ కలిసి నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఉత్తమ్ దాస్ భార్య రూపా దాస్ తో తపన్ దాస్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎప్పటికైనా ఈ విషయం బయటకి వస్తే తమకు ప్రమాదమని గ్రహించి ఉత్తమ్ దాస్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగా కిరాయి గుండాలకు డబ్బులు కూడా అందజేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం, రాజస్థాన్ కు వ్యాపార నిమిత్తం వెళ్లి రావాలని ఉత్తమ్ దాస్ కు తపన్ సూచించాడు. ఉత్తమ్ వెళ్లిన రెండు రోజుల తర్వాత తపన్ కూడా కిరాయి గుండాలను తీసుకోని వెళ్లారు. వీరందరూ తన మిత్రులని పరిచయం చేసి సైట్ చూడటానికి పోదామని తపన్ పేర్కొన్నాడు. సైట్ చుడానికి వెళ్తున్న మార్గం మధ్యలో తనకు మత్తు మాత్రలు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు. ఉత్తమ్ దాస్ నిద్రలోకి జారుకోగానే అతన్ని చంపి కాళ్లు, చేతులు కట్టేసి నదిలో పడేసారు. ఆ తర్వాత తపన్ దాస్ నాగ్పాడకు వెళ్లి రూపా దాస్ కు పని పూర్తీ అయ్యిందని చెప్పాడు. బందువులకు అడగ్గా వ్యాపార నిమిత్తం అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు. కొద్దీ రోజుల తర్వాత గుర్తు తెలియని మృత దేహం బయటపడినట్లు వచ్చేసరికి. తపన్ దాస్, రూపా దాస్ కలిసి ఉత్తమ్ దాస్ కరోనా చనిపోయాడని తన శవాన్ని కూడా తీసుకురాకుండా అక్కడే పూడ్చిపెట్టినట్లు కట్టుకథ చెప్పారు. అయితే, 5 నెలల తర్వాత ఆస్తిని రూపా దాస్ పేరిట రాయించడానికి భర్త డెత్ సర్టిఫికెట్ అవసరం వచ్చింది. దీనితో వాళ్లు రాజస్థాన్ వెళ్లి ఒక ప్రభుత్వ డాక్టర్ కి డబ్బులు ఇచ్చి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. కానీ, ఆ డాక్టర్ ఈ విషయాన్నీ పోలీసులకు చెప్పడంతో వాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం ఈ హత్యలో పాల్గొన్న వాళ్లందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. చదవండి: దారుణం: ఆరేళ్ల బాలికపై తాత, మేనమామ అత్యాచారం -
బండరాళ్లతో మోది భర్తను చంపిన భార్య
సాక్షి, తాండూరు రూరల్ (వికారాబాద్): జల్సాలకు అలవాటుపడిన భర్త చోరీలు చేస్తూ తమను మానసిక క్షోభకు గురిచేస్తుండటంతో ఓ భార్య కుమారుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని గౌతపూర్‌లో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన కుర్వ బాలమణికి కొన్నేళ్ల క్రితం కొడంగల్ పట్టణానికి చెందిన కుర్వ మల్లేశం (42)తో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం మల్లేశం స్వగ్రామంలో ఉన్న ఆస్తులను విక్రయించి అత్తగారిల్లు గౌతపూర్‌కు వచ్చాడు. స్థానికంగా డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొంతకాలంగా మల్లేశం జల్సాలకు అలవాటుపడి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. అదేవిధంగా పలుచోట్ల చోరీలు చేయడంతో కరన్‌కోట్, కొడంగల్ ఠాణాల పరిధిలో అతడిపై కేసులు కూడా నమోదయ్యాయి. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన మల్లేశం భార్యను బంగారం ఇవ్వాలని కోరాడు. ఇందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తిరిగి మధ్యాహ్నం మల్లేశం భార్యను కొట్టడంతో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలోనే మల్లేశం ఇంట్లోంచి బయటకువస్తూ అకస్మాత్తుగా కిందపడ్డాడు. దీంతో భార్య, కుమారుడు (15) కలిసి బండరాళ్లతో ఆయన తలపై తీవ్రంగా మోదడంతో చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ వివరాలు సేకరించారు. మల్లేశంతో వేగలేకే హత్య చేసినట్లు భార్య, కొడుకు పోలీసుల ఎదుట అంగీకరించారు. మృతదేహానికి తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. చదవండి: భార్యతో గొడవ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్మ వయసు ఎక్కువని హేళన.. విద్యార్థి ఆత్మహత్య -
హంతకులను పట్టించిన మద్యం సీసా మూత
సాక్షి, నాగోలు: మద్యానికి బానిసైన భర్త తరచూ వేధింస్తుండడంతో పాటు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతుండడాన్ని సహించలేని ఓ మహిళ తన బంధువులతో కలసి భర్తను హత్య చేసింది. ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో శనివారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. శామీర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో అద్రాస్పల్లి గ్రామానికి చెందిన బోణి శ్రీనివాస్‌కు 14 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన స్వప్నతో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. కూలిపని చేసే శ్రీనివాస్ మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తున్నాడు. అత్తమామలను సైతం ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో శ్రీనివాస్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నారు. స్వప్న తన మేనమామ తీగళ్ల యాదగిరిని సంప్రదించగా అందుకు అంగీకరించిన అతడు స్వప్న కుటుంబ సభ్యుల నుంచి కొంత నగదు మొత్తం అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. యాదగిరి అతడి స్నేహితుడు రమేష్, స్వప్న, ఆమె తల్లి లక్ష్మి, తండ్రి మల్లేశం కలిసి హత్యకు పథకం పన్నారు. గతనెల 29న యాదగిరి, రమేష్ శ్రీనివాస్‌కు మద్యం తాగించి ధర్మవరం ప్రాంతంలోని రవలకోలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్‌ను హత్య చేసి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శ్రీనివాస్ కనిపించకపోవడంతో ఇతడి తల్లి శామీర్‌పేట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అడవిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడు శామీర్‌పేట పరిధిలో అదృశ్యమైన శ్రీనివాస్‌గా గుర్తించి దర్యాప్తు చేపట్టారు. పట్టించిన మద్యంసీసా మూత.. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంఘటనా స్థలంలో ఓ మద్యం సీసా మూత లభించింది. దానిపై ఉన్న బార్కోడ్ ఆధారంగా పూడూరు ఎక్స్‌రోడ్‌లో జైదుర్గ వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వైన్స్ షాప్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా యాదగిరి, రమేష్, మృతుడు శ్రీనివాస్‌ను బైక్‌పై తీసుకెళుతుండడాన్ని గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. హత్య తో సంబంధం ఉన్న శ్రీనివాస్ భార్య స్వప్న, అత్తమామలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఆపై
సాక్షి, యాదాద్రి భువనగిరి : ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను హతమార్చింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. వివరాలు.. మెరుగు కొమరయ్య, మెరుగు కొమరమ్మ దంపతులు అడ్డగూడూరు మండలం మానాయికుంటలో నివాసముంటున్నారు. కడారి ఈదయ్యతో గత కొంతకాలంగా కొమరమ్మ అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. నిన్న రాత్రి (బుధవారం) ఈదయ్య, కొమరమ్మలు ఆమె భర్త కొమరయ్యను హత్య చేశారు. అనంతరం చేసిన నేరాన్ని గ్రామస్తుల ముందు ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉద్యోగం కోసం హత్య...
-
బీమా సొమ్ము కోసం భర్తను చంపేసింది
సాక్షి, హైదరాబాద్ : రాజధానిలో ఓ తపాలాశాఖ ఉద్యోగి మరణం వెనుక దాగిన కుట్ర బయటపడింది. బీమా సొమ్ము కోసం మొదటి భార్యే భర్తను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భర్త వద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి డబ్బు ఆశ చూపి భర్తను చంపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులోని ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ సి. గాంధీ నారాయణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కమ్మగూడలోని భవానీనగర్ కాలనీకి చెందిన కేశ్యా నాయక్‌తో నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలోని బొర్రయపాలెంకు చెందిన కేతవత్ పద్మకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. ఆ తర్వాత ఏర్పడిన మనస్పర్థలతో భర్త తనను వేధిస్తున్నాడంటూ ఎనిమిదేళ్ల క్రితం తిరుమలగిరి పోలీసు స్టేషన్లో పద్మ ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది. బీమా సొమ్ము ఇస్తానని ఆశజూపి... కేశ్యానాయక్ శైలజ అనే యువతిని రెండో వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలతో హాయిగా జీవిస్తున్నాడని, తాను మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తోందని భావించిన పద్మ... భర్తను హత్య చేస్తే రూ. 60 లక్షల బీమా సొమ్ముతోపాటు ఆయన ఉద్యోగం తనకు వస్తుందని భావించింది. ఇందులో భాగంగా కోర్టు వాయిదాల కోసం కేస్యనాయక్‌తో కలసి వచ్చే డ్రైవర్ సభావత్ వినోద్‌తో పద్మ పరిచయం పెంచుకుంది. భర్త తనను పట్టించుకోవడం లేదని, అందువల్ల ఆయన్ను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తే వచ్చే రూ. 60 లక్షల బీమా డబ్బులో రూ. 10 లక్షలు ఇస్తానని ఆశచూపింది. అతనికి నమ్మకం కలిగించేందుకు తొలుత రూ. 15 వేలు చెల్లించింది. వీరి పథకం ప్రకారం ఈ నెల 1న ఉద్యోగానికి వెళ్లి తిరిగి వస్తున్న కేస్య నాయక్‌కు వినోద్ ఫోన్ చేసి ఎల్బీ నగర్లో కలిశాడు. టీఎస్07యూఈ 2221 నంబర్ గల కారులో గుర్రంగుడ దగ్గర ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లి కేస్యా నాయక్‌కు మోతాదుకు మించి మందు తాగించాడు. శనివారం అర్ధరాత్రి 2.30 గంటలకు గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వెళ్లే మార్గంలో కారు ఆపి వెనుక సీట్లోకి వెళ్లిన వినోద్... ముందుసీట్లో కూర్చున్న కేస్యా నాయక్ (43) గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ఇంజాపూర్ కమాన్ దగ్గరగల హైటెన్షన్ కరెంట్ స్తంభానికి కారు ఎడమవైపును మాత్రమే ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో తన భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడంటూ పద్మ ఆదివారం ఉదయం వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అది హత్యేనని నిరూపించే ఆధారాలు లభించాయి. మృతుని మెడ కమిలిపోయి ఉండటం, పోస్టుమార్టం నివేదికలోనూ గొంతు నులమడంతోనే కేస్యా నాయక్ మరణించినట్లు వెల్లడైంది. ఈ ఆధారాలనుబట్టి పోలీసులు సోమవారం ఉదయం ఇంజాపూర్ కమాన్ దగ్గర పద్మ, వినోద్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. -
కోర్టు ప్రాంగణంలోనే భార్యను చంపిన భర్త
గౌహతి: అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే తన భార్యను గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడు పూర్ణ నహర్ కన్నకూతురును అత్యాచారం చేశాడనే ఆరోపణలతో 9 నెలలు జైళ్లో గడిపి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు. విచారణ నిమిత్తం శుక్రవారం కోర్టుకు హాజరైన అతను అకస్మాత్తుగా భార్య రీటా నహర్పై దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
స్వాతి చెప్పినట్లే చేశా...: రాజేశ్
సాక్షి, హైదరాబాద్ : నాగర్ కర్నూల్ సివిల్ కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజేశ్ గురువారం పోలీసుల విచారణలో పలు విషయాలను వెల్లడించాడు. సుధాకర్ రెడ్డి భార్య స్వాతి తనకు అన్నవిధాలా ఆర్థిక సాయం చేసిందని అతడు తెలిపాడు. స్వాతి ఇచ్చిన డబ్బులతోనే డ్రెస్‌లను కొనుక్కునేవాడినని చెప్పాడు. అంతేకాకుండా స్వాతి టీవీ సీరియల్స్ బాగా చూస్తుందని, చాలాసార్లు తనకు ఆ స్టోరీలు చెప్పేదని వివరించాడు. ఇక సుధాకర్ రెడ్డి హత్య విషయంలో స్వాతి చెప్పినట్లే చేశానని రాజేశ్ పోలీసుల విచారణలో తెలిపారు. కాగా హైదరాబాద్‌లోని డీఆర్డీవో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజేశ్‌ను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. స్వాతి .. ఖైదీ నెంబర్ 678 పథకం ప్రకారమే కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన నిందితురాలు స్వాతి ప్రస్తుతం పాలమూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది. అయితే ఆమె ముఖంలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోగా, తోటి ఖైదీలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతికి జైలు అధికారులు 678 ఖైదీ నెంబర్‌ను కేటాయించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పూర్తి చేసిన ఆమె... తోటి ఖైదీలతో పాటు జైలులో గడ్డి కోసింది. కాగా స్వాతి వ్యవహారం మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉన్నదని పోలీసుల విచారణలో బయటపడింది. నర్సింగ్ శిక్షణ పొందిన స్వాతి ఆ సమయంలో పలువురితో చనువుగా మెలిగేదని తెలుస్తోంది. జల్సాలకు ఎక్కువగా అలవాటు పడ్డ స్వాతిని తన పద్ధతి మార్చుకోవాలని భర్త తరచు చెబుతూ వచ్చేవాడని సమాచారం. అయితే మూడు నెలల నుంచే సుధాకర్ రెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు స్వాతి, ఆమె ప్రియుడు రాజేశ్ పథకం రచిస్తూ వచ్చారని, గతనెల 27న అందుకు మంచి అవకాశం దొరకడంతో పని ముగించినట్లు పోలీసులు తెలిపారు. కట్టుకున్న భర్త, కన్నబిడ్డలను కాదనుకుని ప్రియుడితో గడపాలన్న తపనతో స్వాతి ...సుధాకర్‌రెడ్డిని అత్యంత కిరాతకంగా హతమార్చడంపై నాగర్ కర్నూల్లో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. -
గుట్టు విప్పిన మటన్‌సూప్!
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నాగర్ కర్నూల్‌కు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్‌రెడ్డి హత్య కేసులో రోజుకో కోణం వెలు గు చూస్తోంది. భర్త సుధాకర్ రెడ్డిని హత్య చేసి ప్రియుడు రాజేశ్‌ను ఆ స్థానంలో పెట్టాలని స్వాతి పన్నిన పథకం ఎలా బయట పడిందన్న విష యం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. మటన్‌సూప్ వల్లే ఈ కేసు గుట్టు రట్టయిందని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఏ అపోలో ఆస్పత్రిలో స్వాతి ప్రియుడు రాజేశ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సాధారణంగా కాలిన గాయాలతో చికిత్స పొం దుతున్న వారికి ఆస్పత్రిలో మటన్ సూప్ ఇస్తుంటారు. చికిత్స పొందుతున్న రాజేశ్‌కు వైద్యులు మటన్‌సూప్ తాగించేందుకు యత్నించారు. కానీ తాను శాఖాహారినని మటన్ సూప్ తాగేందుకు నిరాకరించడంతో అక్కడే ఉన్న సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు కంగుతిన్నారు. వాస్తవంగా సుధాకర్‌రెడ్డికి మాంసాహారం ఇష్టం కాగా.. ఇప్పుడు వద్దన డం ఏమిటని వారు ఆలోచనలో పడ్డారు. అప్పుడే వారికి అనుమానమొచ్చింది. చికిత్స పొందుతోంది సుధాకర్‌రెడ్డి కాదని, మరొకరన్న సంగతి క్రమంగా వారిలో బలపడుతూ వచ్చింది. రాజేశ్ ముఖానికి ఉన్న ముసుగు తొలగించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే స్వాతి వారిని అడ్డుకునేదని, ‘ఆయన మాట్లాడలేకపోతున్నారని..ఏదైనా ఉంటే రాసి చూపిస్తాడం టూ’ పెన్ను, పేపర్ ఇచ్చి రాజేశ్‌తో సమాధానం ఇప్పించేది. ఇలా పదిరోజుల పాటు స్వాతి, రాజేశ్ తమ బండారం బయట పడకుండా జాగ్రత్త పడ్డారు. చివరికి సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడం.. రంగప్రవేశం చేసిన పోలీసులు గోప్యంగా ఆరా తీశారు. సుధాకర్ రెడ్డి ఆధార్ కార్డుకు రాజేశ్ వేలిముద్రలకు సరిపోలక పోవడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఎంతైనా భరిస్తానన్న స్వాతి ముఖం కాలిన రాజేశ్‌కు ప్లాస్టిక్ సర్జరీ చేసి ఎవరూ గుర్తుపట్టకుండా తయారు చేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడనని ఆస్పత్రి వర్గాలతో స్వాతి అన్నట్లుగా తెలుస్తోంది. ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పినా.. సర్జరీ చేసేందుకు డబ్బు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని అన్నట్లుగా చెబుతున్నారు. రాజేశ్ ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్తను చంపిన కేసు నుంచి బయటపడటంతోపాటు ప్రియుడితో కాపురం చేసేందుకు స్వాతి తీవ్ర ప్రయత్నాలు చేసింది. కొడుకు పుట్టిన రోజునే.. సుధాకర్‌రెడ్డి ఆరేళ్ల కుమారుడు దర్శిత్రెడ్డి ఏడో పుట్టిన రోజు నవంబర్ 27న జరగాల్సి ఉంది. అంతకు ముందురోజు సుధాకర్‌రెడ్డి కొడుకు పుట్టిన రోజు ఏర్పాట్లలో భాగంగా కొత్త బట్టలు కొన్నాడని స్నేహితులకు తెలిపారు. 27న ఉదయాన్నే సుధాకర్ రెడ్డిని హత్య చేశారు. పోలీసుల అదుపులో రాజేశ్! ప్రధాన నిందితుడైన రాజేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను సోమ వారం అర్ధరాత్రే పోలీసులు అదుపులోకి తీసుకు న్నట్లు సమాచారం. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక పోలీసుల బృందం రాజేశ్‌ను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. బకాయి బిల్లు చెల్లించేదెవరు? హైదరాబాద్: హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఏ అపోలో ఆస్పత్రిలో 18 రోజుల పాటు రాజేశ్‌కు జరిగిన చికిత్సకు యాజమాన్యం రూ.4 లక్షలు బిల్లు వేయగా.. ఇందులో సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు (తమ కుమారుడే అనుకొని) రూ.2.10 లక్షలు చెల్లించారు. ఇంకా రూ.1.90 లక్షల బిల్లు బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ బకా యి ఎవరు చెలిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నా యి. ఓ వైపు హత్య, కుట్ర కేసుల్లో స్వాతి అరెస్టయి రిమాండ్‌కు వెళ్లగా... మరోవైపు రాజేశ్ కుటుంబసభ్యులెవరూ ఇప్పటి వరకు ముందుకు రాకపోవడంతో బిల్లు ఎవరు చెల్లిస్తారో తెలియక పరిస్థితి అయోమయంగా మారింది. -
సుధాకర్ రెడ్డి హత్య కోణంలో కొత్త ట్విస్ట్
-
సీరియల్ ప్రభావంతో.. స్వాతి స్కెచ్
సాక్షి, నాగర్‌కర్నూల్: ఆమె.. భర్తతో ఏడు అడుగులు నడిచింది. వేదమంత్రాల సాక్షిగా తాళి కట్టించుకుంది. సమాజం ఎగ‘తాళి’ చేసేలా ప్రియుడితో కలిసి పథకం ప్రకారం కట్టుకున్నోడిని హతమార్చింది. భార్యాభర్తల ఆత్మీయబంధాన్ని మంటగలిపింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగిన ఈ హత్యోదంతం నిజంగానే ‘సీరియల్’ను తలపించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో కలకలం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాలను నాగర్‌కర్నూల్ జిల్లా ఏఎస్పీ జోగుల చెన్నయ్య, డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొల్లాపూర్ సీఐ శ్రీనివాసరావు ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆరోజు ఏం జరిగిందంటే..! గతనెల 27న నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌పై యాసిడ్ దాడి జరిగిందని అతని సోదరుడు సురేందర్‌రెడ్డి 28న ఉదయం 11గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన అన్న, వదిన స్వాతి పట్టణంలోని రవితేజ కళాశాల పక్కన ఓ అద్దెఇంట్లో నివాసం ఉంటున్నారని అందులో పేర్కొన్నాడు. స్వతహాగా కాంట్రాక్టర్ అయిన సుధాకర్‌రెడ్డి భార్యను ఇంట్లో ఉంచి కాంట్రాక్ట్ పనుల కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో ఆమె టీవీ సీరియళ్లు ఎక్కువగా చూసేది. దీనికితోడు ఒంటరిగా ఉండే స్వాతికి రాజేష్ పరిచయమయ్యాడు. ఈ క్రమంలో సుధాకర్‌రెడ్డికి వీరి వ్యవహారం తెలియడంతో భార్య స్వాతిని 26న నిలదీయడమే కాకుండా ఆమెపై చేయిచేసుకున్నాడు. ఇరువురూ తోసుకోవడంతో సుధాకర్‌రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు రాత్రి 12గంటల ప్రాంతంలో సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికివచ్చాడు. అప్పటికే రాజేష్‌తో కలిసి సుధాకర్‌రెడ్డిని హత్య చేసేందుకు స్వాతి పథకం రచించింది. ఆరోజు రాత్రే పని ముగించాలని అనుకున్నప్పటికీ ఇంట్లో మరో వ్యక్తి ఉండటంతో కుదరలేదు. తెల్లవారుజామున అతను బయటకు వెళ్లిన వెంటనే రాజేష్‌ను ఇంటికి పిలిపించుకున్న స్వాతి నిద్రిస్తున్న సుధాకర్‌రెడ్డి మెడకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో అతను అరవకుండా నోట్లో బట్టలు కుక్కింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇనుప రాడ్‌తో సుధాకర్‌రెడ్డి తలపై బాదడంతో అతను అక్కడే మరణించాడు. వెంటనే దుప్పట్లో సుధాకర్‌రెడ్డి శవాన్ని మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని ఇంట్లో నుంచి స్వాతి, రాజేష్ బయలుదేరారు. ఉదయం ఏడు గంటలకల్లా నవాబ్‌పేట వద్దనున్న అటవీ ప్రాంతానికి చేరుకుని రోడ్డుకు వంద మీటర్ల దూరంలో శవాన్ని విసిరేశారు. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌తో సుధాకర్‌రెడ్డి శవాన్ని తగులబెట్టి అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. అక్కడ అప్పటి వరకు వాడిన కారును మెకానిక్ షెడ్డులో సర్వీసింగ్ చేయాలంటూ ఇచ్చేశారు. వెలుగులోకి ఇలా.. 27వ తేదీ నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి సుధాకర్‌రెడ్డిపై యాసిడ్ దాడికి పాల్పడ్డారని, దీంతో తమ వదిన స్వాతి సుధాకర్‌రెడ్డిని చికిత్స కోసం హైదరాబాద్‌కు హుటాహుటిన తీసుకెళ్తున్నట్లు తనకు తెలిపిందని సురేందర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఎస్పీ కల్మేశ్వర్ సింగెనవర్ సంఘటన స్థలానికి వెళ్లి విచారణ జరిపారు. జిల్లా కేంద్రంలోని అన్ని సీసీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. తమ దర్యాప్తు కొనసాగుతుండగానే ఈనెల 9న ఫిర్యాదుదారు మంద సురేందర్‌రెడ్డి, అతని తల్లి సుమతమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి సుధాకర్‌రెడ్డి కాదని, స్వాతి ప్రియుడని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. స్వాతితో పాటు ముఖం కాలి చికిత్స పొందుతున్న స్వాతి ప్రియుడు రాజేష్‌ను విచారించడంతో వారు పథకం ప్రకారమే సుధాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించారు. దీంతో స్వాతిని అదుపులోకి తీసుకుని సుధాకర్‌రెడ్డి శవాన్ని తగలబెట్టిన నవాబ్‌పేట మండలం ఫతేపూర్ మైసమ్మ అడవి ప్రాంతానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో గుర్తుపట్టకుండా కాలిన శవం, ఎముకలు, పుర్రె మాత్రమే లభించింది. వీటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని పోలీసులు తెలిపారు. టీవీ సీరియల్ ప్రభావమే.. తరచూ టీవీ సీరియళ్లు చూసే స్వాతికి ప్రియుడిని భర్త స్థానంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచనతో అతనికి సుధాకర్‌రెడ్డిలా ప్లాస్టిక్ సర్జరీ చేయించాలన్న ఆలోచన వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ఓ నిర్జలప్రదేశంలో రాజేష్ తన ముఖానికి ఓ టవల్ కట్టుకుని దానిపై పెట్రోల్ పోసుకుని పెద్దగా గాయాలు కాకూడదని నిప్పంటించుకున్నాడు. ఆ తర్వాత ముఖం నల్లగా మారడంతో ఇక ఎవరూ గుర్తుపట్టరని, ప్లాస్టిక్ సర్జరీ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. ఆ తర్వాత స్వాతి అతను ఉన్న ప్రదేశానికి ఓ ప్రైవేట్ ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్లి హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆ తర్వాత బంధువులు, పోలీసులకు చికిత్స పొందుతున్నది సుధాకర్‌రెడ్డే అని వారంరోజులకు పైగా స్వాతి అందరిని నమ్మిస్తూ వచ్చింది. వైద్యులు కాలిన గాయాలు నయం అయ్యాయని, డిశ్చార్జి చేస్తామని చెప్పడంతో సుధాకర్‌రెడ్డి సోదరుడు, తల్లి ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటి వరకు ముఖం చూపించకుండా జాగ్రత్తపడ్డ రాజేష్ తప్పనిసరి పరిస్థితుల్లో ముఖానికి ఉన్న ముసుగు తీయాల్సి వచ్చింది. దీంతో అతను సుధాకర్‌రెడ్డి కాదని మంద సురేందర్‌రెడ్డి, తల్లి సుమతమ్మ గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బండారం బయటపడింది. -
భర్త..ప్రియుడు..క్రైమ్ థ్రిల్లర్
-
సీరియల్ చూసే స్కెచ్ వేశా!
సాక్షి, నాగర్‌కర్నూల్: సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య స్వాతిని అరెస్టు చేశారు. ‘మనసు మమత’టీవీ సీరియల్ ప్రభావంతో ఈ హత్యకు పథక రచన చేసినట్లు నిందితురాలు స్వాతి వెల్లడించినట్లు నాగర్‌కర్నూల్ ఏఎస్పీ జోగుల చెన్నయ్య చెప్పారు. ఆదివారం డీఎస్పీ లక్ష్మీనారాయణ, కొల్లాపూర్ సీఐ శ్రీనివాసరావుతో కలసి ఆయన కేసు వివరాలను మీడియాకు వివరించారు. ప్రియుడితో కలసి హత్య ప్రియుడు రాజేశ్‌తో ఉన్న వివాహేతర సంబంధంపై గత నెల 26న భర్త సుధాకర్‌రెడ్డి నిలదీశాడు. ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇద్దరూ తోసుకోవడంతో సుధాకర్‌రెడ్డి తలకు గాయమైంది. అదేరోజు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సుధాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లి తలకు కుట్లు వేయించుకుని ఇంటికి వచ్చాడు. అప్పటికే రాజేశ్‌తో కలసి సుధాకర్‌రెడ్డిని హత్య చేసేందుకు స్వాతి పథకం రచించింది. ఆ రోజు రాత్రే పని ముగించాలని అనుకున్నప్పటికీ ఇంట్లో మరో వ్యక్తి ఉండటంతో కుదరలేదు. తెల్లవారుజామున అతను బయటకు వెళ్లిన వెంటనే రాజేశ్‌ను ఇంటికి పిలిపించుకున్న స్వాతి.. నిద్రిస్తున్న సుధాకర్‌రెడ్డి మెడకు మత్తు ఇంజక్షన్ ఇచ్చింది. నోట్లో అతను అరవకుండా బట్టలు కుక్కింది. ఆ తర్వాత ప్రియుడితో కలసి ఇనుప రాడ్‌తో సుధాకర్‌రెడ్డి తలపై బాదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే శవాన్ని దుప్పట్లో మూటగట్టి కారు డిక్కీలో వేసుకుని నవాబ్‌పేట మండలం ఫతేపూర్ మైసమ్మ అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్డుకు వంద మీటర్ల దూరం అడవిలో శవాన్ని పడేసి.. వెంట తీసుకెళ్లిన పెట్రోల్‌తో తగులబెట్టారు. అనంతరం అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకున్నారు. తాము తీసుకెళ్లిన వాహనాన్ని మెకానిక్ షెడ్లో సర్వీసింగ్ చేయాలంటూ ఇచ్చేశారు. ప్రియుడు రాజేశ్, స్వాతిలను అదుపులోకి తీసుకొని విచారించగా.. పథకం ప్రకారమే తాము సుధాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఘటన స్థలంలో కాలిన శవం, ఎముకలు, పుర్రె మాత్రమే లభించిందని, వీటిని నిర్ధారణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని తెలిపారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా రాజేశ్, ఏ2 నిందితురాలిగా స్వాతిని చేర్చినట్లు వివరించారు. -
హత్య చేసింది భర్తే !
రామచంద్రపురం :ఈనెల 23న ఇంటిలో అనుమానాస్పదంగా మృతి చెందిన పడగ వెంకటలక్ష్మి(29)ది ఆత్మహత్యకాదని, హత్యేనని పోలీసులు నిర్ధారించారు. భార్యను కడతేర్చి, ఆత్మహత్య చేసుకున్నట్టుగా అందరినీ నమ్మించేందుకు ఆమె భర్త ప్రయత్నించాడని రామచంద్రపురం పోలీసులు పేర్కొన్నారు. సీఐ పి.కాశీవిశ్వనాథ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండపేట మండలం జెడ్ మేడపాడు గ్రామానికి చెందిన పడగ అంజి రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని 2006లో పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచీ చక్రద్వారబంధంలో అత్తవారింటిలోనే భార్యతో కలసి ఉంటున్నాడు. అయితే పిల్లలు పుట్టలేదనే నెపంతో అతడు తరచుగా వెంకటలక్ష్మిని వేధిస్తుండేవాడు. కొంతకాలంగా వారిద్దరూ ఘర్షణ పడుతుండడంతో అత్తింటివారు పెద్దల సమక్షంలో నాలుగు నెలల క్రితం వారితో రామచంద్రపురంలో వేరే కాపురం పెట్టించారు. శ్రీరాంపేటలో ఒక ఇంట్లో వీరు అద్దెకు దిగారు. అంజి పెట్రోల్‌బంక్‌లో పనికి కుదిరాడు. పెళ్లయి ఎనిమిదేళ్లయినా పిల్లలు పుట్టడంలేదని భార్యతో ఘర్షణ పడుతున్న అంజి ఎలాగైనా ఆమెను హతమార్చాలని భావించాడు. ఈనెల 23న ఉదయం నుంచి భార్యతో అతడు గొడవ పడుతున్నాడు. బంక్ నుంచి మధ్యాహ్నం ఇంటికివచ్చిన అంజి తాడుతో భార్య మెడకు బిగించి చంపేశాడు. ఆపైన గదిలో ఉరి వేసుకున్నట్టుగా పరిస్థితి కల్పించి చుట్టుపక్కల వారిని నమ్మించాడు. ఆపైన భార్య మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే గదిలో వెంకటలక్ష్మి మృతి చెందిన తీరు, భర్త అంజి పరారు కావటం అనుమానం కలిగించడంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారని సీఐ తెలిపారు. ఈనెల 26న శ్రీరాంపేటలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు వచ్చినపుడు అంజిని అదుపులోకి తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో పాల్గొన్న ఎస్సై ఫజల్హ్మ్రన్, ఏఎస్సై లాల్, హెచ్‌సీ సుబ్బారావు, పీసీలు వీరబాబు, వెంకటరమణ, కుమార్‌రాజా, విజయ్, సత్యనారాయణలను సీఐ కాశీవిశ్వనాథ్ అభినందించారు.