రాజస్థాన్ లోని ఉదయపూర్ లో బావతో కలిసి ఒక మహిళ తన భర్తను హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. ప్రత్యేక పోలీసు దర్యాప్తు బృందం పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ విషయం 5 నెలల తర్వాత చాలా ఆశ్చర్యకరంగా బయటకి వచ్చినట్లు పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్రంలోని అగర్తల పరిధిలోని నాగ్పాడకు చెందిన 45 ఏళ్ల ఉత్తమ్ దాస్ అనే వ్యక్తి తన అన్నయ్య 51 ఏళ్ల తపన్ దాస్ కలిసి నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఉత్తమ్ దాస్ భార్య రూపా దాస్ తో తపన్ దాస్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఎప్పటికైనా ఈ విషయం బయటకి వస్తే తమకు ప్రమాదమని గ్రహించి ఉత్తమ్ దాస్ ను చంపాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. తమ ప్లాన్ లో భాగంగా కిరాయి గుండాలకు డబ్బులు కూడా అందజేశారు. అనుకున్న ప్లాన్ ప్రకారం, రాజస్థాన్ కు వ్యాపార నిమిత్తం వెళ్లి రావాలని ఉత్తమ్ దాస్ కు తపన్ సూచించాడు. ఉత్తమ్ వెళ్లిన రెండు రోజుల తర్వాత తపన్ కూడా కిరాయి గుండాలను తీసుకోని వెళ్లారు. వీరందరూ తన మిత్రులని పరిచయం చేసి సైట్ చూడటానికి పోదామని తపన్ పేర్కొన్నాడు. సైట్ చుడానికి వెళ్తున్న మార్గం మధ్యలో తనకు మత్తు మాత్రలు కలిపిన కూల్ డ్రింక్ తాగించారు.
ఉత్తమ్ దాస్ నిద్రలోకి జారుకోగానే అతన్ని చంపి కాళ్లు, చేతులు కట్టేసి నదిలో పడేసారు. ఆ తర్వాత తపన్ దాస్ నాగ్పాడకు వెళ్లి రూపా దాస్ కు పని పూర్తీ అయ్యిందని చెప్పాడు. బందువులకు అడగ్గా వ్యాపార నిమిత్తం అక్కడే ఉన్నాడని పేర్కొన్నారు. కొద్దీ రోజుల తర్వాత గుర్తు తెలియని మృత దేహం బయటపడినట్లు వచ్చేసరికి. తపన్ దాస్, రూపా దాస్ కలిసి ఉత్తమ్ దాస్ కరోనా చనిపోయాడని తన శవాన్ని కూడా తీసుకురాకుండా అక్కడే పూడ్చిపెట్టినట్లు కట్టుకథ చెప్పారు. అయితే, 5 నెలల తర్వాత ఆస్తిని రూపా దాస్ పేరిట రాయించడానికి భర్త డెత్ సర్టిఫికెట్ అవసరం వచ్చింది. దీనితో వాళ్లు రాజస్థాన్ వెళ్లి ఒక ప్రభుత్వ డాక్టర్ కి డబ్బులు ఇచ్చి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరారు. కానీ, ఆ డాక్టర్ ఈ విషయాన్నీ పోలీసులకు చెప్పడంతో వాళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో మొత్తం ఈ హత్యలో పాల్గొన్న వాళ్లందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment