
సముద్రం వెనక్కి తగ్గడంతో రాళ్లు బయటపడ్డాయి. సముద్రం ముందుకొచ్చి తీర ప్రాంతాన్ని కోతకు గురిచేయడం ఇటీవల సర్వ సాధారణంగా మారింది

అయితే గురువారం సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడంతో సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. వాతావరణంలో మార్పులు, సముద్రంలో ఆటుపోట్ల కారణంగా ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు

దీని కారణంగా ఆర్కే బీచ్ నుంచి వీఎంఆర్డీఏ పార్క్ వరకు సముద్రంలో రాళ్లు పైకి కనిపించాయి. పర్యాటకులు వాటిపైకెక్కి సెల్ఫీలు తీసుకున్నారు







