rk beach
-
సత్తా చాటిన నౌకాదళం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఆర్కె బీచ్ వేదికగా తూర్పు నౌకాదళం సత్తా చాటింది. శనివారం సాయంత్రం బీచ్ వద్ద నౌకాదళం చేసిన విన్యాసాలు నౌకా దళం పటిష్టతను, ప్రతిభా పాటవాలను చాటి చెప్పాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. గంటన్నర పాటు భారత నావికా దళ సంపత్తిని ప్రస్ఫుటం చేస్తూ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు చేసిన యుద్ధ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.నౌకాదళం, మెరైన్ కమాండోలు ఒళ్లు గగుర్పొడిచేలా సాహసోపేతమైన విన్యాసాలు చేశారు. యుద్ధ సమయంలో నేవీ కమాండ్ స్పందించే విధానం చూపరుల్ని ఆకట్టుకుంది. ఆయిల్ రిగ్‌ను పేల్చివేయడం, 8 వేల అడుగుల నుంచి పారాచూట్లతో నిర్దేశిత ప్రాంతంలో మెరైన్ కమాండోలు దిగడం వంటివి ఆకట్టుకున్నాయి. డార్నియర్ హెలికాప్టర్, హాక్ జెట్ ఫైటర్లు, నౌకలపై నుంచి జరిపే ఫైరింగ్‌తో పాటు దేశీయంగా అభివృధ్ధి చేసిన హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరలో నిర్వహించిన లేజర్, డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. సముద్రంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ కాంతులతో అందరినీ ఆకట్టుకున్నాయి. 8న పీఎంచే రైల్వే జోన్‌కు శంకుస్థాపన: చంద్రబాబునావికాదళం ధైర్యం, సామర్థ్యాలను, దక్షతకు నిదర్శనంగా ఈ విన్యాసాలు నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రైల్వేజోన్‌కి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఎన్టీపీసీ–జెన్కో సంయుక్తంగా దేశంలోని తొలి భారీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. విశాఖలో త్వరలో టీసీఎస్ ఏర్పాటు కానుందని, గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు వస్తాయని, వచ్చే సంవత్సరం విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు.నేవీకి నగర ప్రజల సహకారం మరువలేనిది: తూర్పు నావికా దళాధిపతిఎటువంటి సవాళ్లనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తూర్పు నావికా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ చెప్పారు. విశాఖ వేదికగా గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. సామాజిక సేవ, పర్యావరణ కార్యక్రమాలలో తూర్పు నావికాదళం భాగమవుతోందని అన్నారు. ఇటీవల నిర్వహించిన నేవీ మారథాన్‌లో 14 వేల మందికి పైగా ప్రజలు, 9 దేశాలకు చెందిన వారు పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చారని చెప్పారు. తూర్పు నావికాదళానికి విశాఖ ప్రజలు అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో పాటు మంత్రులు, అధికారులు, సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తదితరులు హాజరయ్యారు. -
55 ఏళ్లు.. 150 కిలోమీటర్లు
కొందరు ఓటమి నుంచి విజయాలు అందుకుంటారు. మరికొందరు తమ జీవితంలో ఎదురైన ప్రతిబంధకాల నుంచి బయటపడేందుకు ఏదో సాధించాలనే తపనతో ముందుకు సాగుతారు. ఆ కోవకు చెందిన వారే స్విమ్మర్ గోలి శ్యామల. సామర్లకోటకు చెందిన శ్యామల భర్త మోహన్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. కుమారుడితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్‌లో యానిమేషన్ స్టూడియో పెట్టుకుని పలు సీరియళ్లు, సినిమాలకు పనిచేశారు. దురదృష్టవశాత్తూ స్టూడియో ద్వారా తీవ్రంగా నష్టపోవడంతో మానసికంగా మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. 45 ఏళ్ళ వయసులో శరీరం సహకరించని స్థితిలో మనసును మళ్ళించేందుకు హైదరాబాద్‌లో స్విమ్మింగ్ నేర్చుకున్నారు. స్వతహాగా ఆమె స్విమ్మర్ కాదు... అయితేనేం, నాటి మనోవేదనకు ఉపశమనంగా ప్రారంభించిన స్విమ్మింగ్ నేడు ఐదు పదుల వయసులో ఆమెను సముద్రాలు దాటే సాహస యాత్రికురాలిగా తీర్చిదిద్దింది.150 కిలోమీటర్లు ఏడు రోజుల్లో అలవోకగా.. డిసెంబరు 28న విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద సముద్ర తీరంలో ఈత ప్రారంభించిన శ్యామల శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో మాట్లాడుతూ యానిమేషన్ స్టూడియోలో నష్టం రావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన తాను మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు స్విమ్మింగ్ప్రారంభించాననీ, కోచ్ జాన్ సిద్ధిక్ సహకారంతో జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల స్విమ్ చేసేలా తయారయ్యానని సగర్వంగా చెప్పారు. 2021లో శ్రీలంక నుంచి ఇండియా వరకు రామ్‌సేతు దాటానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానన్నారు. బంగాళాఖాతంలో 150 కిలోమీటర్లు ఈదడం ద్వారా ఆసియా స్థాయిలో ఘనత సాధించానన్నారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదాలని రెండేళ్ళ కిందటే నిర్ణయించుకున్నానని, అయితే రెండుసార్లు వాతావరణం అనుకూలించలేదనీ, ఎట్టకేలకు డిసెంబర్ 28న చిన్న ఫిషింగ్ బోట్, ఇద్దరు స్క్రూపర్ డ్రైవర్స్తోప్రారంభించానన్నారు. ఆర్కే బీచ్‌లో సముద్రంలో ప్రవేశించాక మళ్ళీ కాకినాడలో నేలపైకి వచ్చామన్నారు. మొదటి రోజు 7 గంటల్లోనే 30 కిలోమీటర్ల దూరం ఈదానన్నారు. తరువాత నుంచి ఈరోజు వరకు అనేక ఒడుదొడుకులను అధిగమిస్తూ ఈదుకుంటూ వచ్చానన్నారు. తల వెంట్రుకల నుంచి కాలి గోళ్ల వరకు స్విమ్మింగ్ వల్లే ఆరోగ్యం కలుగుతుందని, స్విమ్మింగ్‌ను స్పోర్ట్‌గా కాకుండా సర్వైవల్ స్పోర్ట్‌గానే చెబుతానన్నారు. మహిళలు ఈత చేయడం వలన గైనిక్ సమస్యలు తగ్గుతాయన్నారు. హేళన చేసిన వారే పొగుడుతున్నారుసముద్రంలో ఈత కోసం తొలి ప్రయత్నం చేసినప్పుడు చాలామంది హేళన చేశారు. కొందరు యూ ట్యూబ్‌లో కామెంట్లు పెట్టారు. వాటిని పట్టించుకోలేదు. అరేబియా సముద్రం ఈదాను, శ్రీలంక నుంచి ఇండియా ఈత మరపురానిది, మేదీ స్ఫూర్తితో లక్షద్వీప్‌లో 18గంటల పాటు 48 కిలోమీటర్లు ఈదాను. వైజాగ్ నుంచి కాకినాడ 150 కిలోమీటర్లు ఈదగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. – గోలి శ్యామల – స్విమ్మర్. – లక్కింశెట్టి శ్రీనివాసరావుసాక్షి ప్రతినిధి.. కాకినాడ.ఫోటోలు: విశ్వనాధుల రాజబాబు. కాకినాడ రూరల్ -
విశాఖ : సాగర తీరంలో కొత్త సంవత్సరం జోష్.. యువత సెల్ఫీలు (ఫొటోలు)
-
విశాఖ సాగర తీరం.. కోత ఘోరం!
ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖపట్నం (Visakhapatnam) సాగర తీరంలో కొన్ని రోజులుగా ‘అల’జడి కొనసాగుతోంది. పర్యాటకానికి మణిహారంగా నిలిచిన ఆర్కే బీచ్‌తో (RK Beach) పాటు పలు ప్రదేశాలు.. ఇప్పుడు తీవ్ర కోతకు గురవుతున్నాయి. తుపాన్లకు తోడు ఇటీవల వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల ప్రభావంతో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా విశాఖ తీరంలో జరుగుతున్న మార్పులను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది.నోవాటెల్ హోటల్ ఎదురుగా ఉన్న పార్కులో గోడ కూలిపోవడం, నేల కుంగిపోవడం, అంబికా సీ గ్రీన్ హోటల్ ఎదురు కోత పెరగడం వంటివి విశాఖ వాసులను కలవర పెడుతున్నాయి. తీరంలో కోతను నివారించే ప్రయత్నాలు చేపట్టాలని.. నిపుణుల సూచనలతో తీరాన్ని అభివృద్ధి చేసి విశాఖను సంరక్షించాలని అధికారులను విశాఖ వాసులు కోరుతున్నారు. – ఏయూ క్యాంపస్ఎలుగుబంటి కాదు.. మానుపిల్లిగూడెంకొత్తవీధి: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని జడుమూరు వద్ద కాఫీతోటల్లో (Coffee Fields) గురువారం ఎలుగుబంటి (Bear) హల్చల్ చేసిందంటూ జరిగిన ప్రచారంపై అటవీ అధికారులు స్పందించారు. తోటల్లో కాఫీపండ్లను తింటున్నది ఎలుగుబంటి కాదని, అది అడవిలో సంచరించే మానుపిల్లి అని తెలిపారు. ఆకారంలో ఎలుగుబంటిని పోలి ఉన్నా.. ఇది సాధుజంతువని, మనుషులపై దాడిచేయదని పేర్కొన్నారు.చదవండి: నల్లమల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారీ -
విశాఖ: ఆర్కే బీచ్‌లో కుప్పకూలిన రిటైనింగ్ వాల్
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్‌లో రిటైనింగ్ వాల్ కుప్పకూలిపోయింది. వర్షాల నేపథ్యంలో రిటైనింగ్ వాల్‌పై ‘సాక్షి’ పలుమార్లు హెచ్చరించినా కూటమి ప్రభుత్వం మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు.వివరాల ప్రకారం.. విశాఖలో భారీ వర్షాల కారణంగా ఆర్కే బీచ్ రిటైనింగ్ వాల్ కూలిపోయింది. అలాగే, ఇందిరా గాంధీ చిల్డ్రన్ పార్క్ సైతం దెబ్బతిన్నంది. గడిచిన పది రోజులుగా పెద్ద సాగర తీరం పెద్ద ఎత్తున కోతతకు గురవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సాక్షి టీవీ హెచ్చరించినా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోలేదు. -
విశాఖలో అలజడిగా మారిన సముద్రం
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్‌ను కెరటాలు తాకుతున్నాయి. గతంలో వర్షాలకు రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. ఫెంగల్ తుపాను సమయంలో సబ్ మెరైన్ వద్ద తీరం కోతకు గురైంది. రాత్రి వేళలో అలలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. -
RK బీచ్ వద్ద అలల ఉగ్రరూపం
-
ఆదివారం విశాఖ సాగరతీరం కిటకిటలాడింది (ఫొటోలు)
-
విశాఖపట్నం బీచ్‌లో ఫ్రెండ్షిప్ డే సందడి (ఫొటోలు)
-
విశాఖ ఆర్కేబీచ్లో జన సందడి (ఫొటోలు)
-
రాత్రి వేళల్లోనూ విశాఖ బీచ్ ల్లో పర్యాటకుల సందడి
-
Vizag: తీరం.. జనసంద్రం (ఫోటోలు)
-
Vizag : విశాఖలో ఘనంగా హోలీ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
విశాఖ తీరం : మహా కోటి శివ లింగానికి భక్తుల రద్దీ (ఫొటోలు)
-
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆర్కే బీచ్‌లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్‌లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్‌తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్‌షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్‌భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్‌లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్‌భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్‌లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్‌నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
విశాఖ బీచ్ సూపర్
విశాఖ సిటీ: విశాఖ ఆర్కే బీచ్ అందానికి ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ స్టీవ్ హార్మిసన్ ఫిదా అయ్యాడు. భారత్‌లో తాను చూసిన బీచ్‌లలో రామకృష్ణ బీచ్ అత్యంత శుభ్రమైనది అని కితాబిచ్చాడు. భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ కోసం హార్మిసన్ విశాఖకు వచ్చాడు. ఆయన మ్యాచ్ చివరి రోజు ఆర్కే బీచ్‌ను సందర్శించాడు. హార్మిసన్ యూకేకు చెందిన టాక్స్పోర్ట్స్ చానల్‌తో మాట్లాడుతూ భారత్‌లో తాను అనేక బీచ్‌లను సందర్శించానని, విశాఖ ఆర్కే బీచ్ ఉన్నంత క్లీన్‌గా మరెక్కడా కనిపించలేదన్నాడు. రోడ్డుకు అతి సమీపంలోనే బీచ్ ఉండడం, యంత్రాల ద్వారా క్లీనింగ్ చేయడం అద్భుతంగా ఉందని చెప్పాడు. విశాఖ ప్రజలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని హార్మిసన్ ప్రశంసించాడు. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో... రాష్ట్ర ప్రభుత్వం చొరవతో విశాఖ సముద్ర తీర ప్రాంతాలు సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మునుపెన్నడూ లేని విధంగా తీర ప్రాంతాల్లో వ్యర్థాలను తొలగించేందుకు జీవీఎంసీ అధికారులు ప్రత్యేక యంత్రాలను వినియోగిస్తున్నారు. సముద్రం కోతకు గురికాకుండా విశాఖ పోర్టు డ్రెడ్జింగ్ చేపడుతోంది. గతంలో లేని విధంగా కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ప్రత్యేక పర్యాటక బీచ్‌లను అభివృద్ధి చేస్తోంది. రుషికొండ బీచ్‌లో కల్పించిన సదుపాయాల కారణంగా ప్రతిష్టాత్మకమైన బ్లూ ప్లాగ్ సర్టిఫికేషన్ -
కిక్కిరిసిన సాగర తీరం.. ఆర్కే బీచ్‌లో ఘనంగా నేవీ డే విన్యాసాలు (ఫొటోలు)
-
విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ డే వేడుకలకు సర్వం సిద్ధం
-
భయంకరంగా మిచాంగ్ తుఫాన్..
-
విశాఖ బీచ్ లో వైజాగ్ మారథాన్ వేడుకలు
-
విశాఖ RK బీచ్ లో ఇద్దరు ఇంటర్ విద్యార్థులు గల్లంతు
-
విశాఖ బీచ్‌లో భారీ చెక్కపెట్టె.. ఇంతకీ ఆ బోషాణంలో ఏముంది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరానికి భారీ బోషాణం (చెక్క పెట్టె) కొట్టుకు రావడం కలకలం రేపింది. ఆ పెట్టెలో ఏముందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందులో భారీ ఎత్తున నిధులు ఉండే అవకాశం ఉందని కొందరు.. స్మగ్లర్లు విలువైన వస్తువుల్ని అందులో దాచి ఉంటారని ఇంకొందరు.. శత్రు దేశాలు విధ్వంసం సృష్టించేందుకు పంపించిన బాక్స్ అని మరికొందరు పేర్కొనడంతో శుక్రవారం రాత్రంతా బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు పహారా కాశారు. శనివారం ఉదయానికి ఈ సమాచారం ఆ నోటా.. ఈ నోటా ప్రచారం కావడంతో భారీ పెట్టెను చూసేందుకు వేలాదిగా జనం ఎగబడ్డారు. చివరకు అది సముద్రం మధ్య నౌకల లంగర్ వేసేందుకు వినియోగించే స్లీపర్ బార్జ్ (చెక్క దిమ్మె)గా నిర్థారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అలల ఒడిలో.. భారీ వస్తువు! విశాఖ సాగర తీరంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అలల మధ్య భారీ వస్తువేదో కదులుతున్నట్టు సందర్శకులు గుర్తించారు. తొలుత అది భారీ సముద్ర జంతువు అని భయాందోళన చెందారు. ఒడ్డుకు పరుగులు తీశారు. రాత్రి పహారాకు బీట్ కానిస్టేబుళ్లకు కొందరు సమాచారం అందించగా.. అది ఒక భారీ చెక్క పెట్టె అని గుర్తించారు. చైనా, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏవైనా పేలుడు పదార్థాలున్నాయా అని భయాందోళనలకు గురయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలెర్ట్ అయిన సిటీ సెక్యూరిటీ వింగ్ పొక్లెయిన్ల సాయంతో బాక్స్‌ను ఒడ్డుకు తీసుకొచ్చింది. అది పురాతన బాక్స్‌గా కనిపించడంతో అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. కొందరు బాంబులు ఉన్నాయేమో అని భయపడగా.. భారీ నిధితో కూడిన పెట్టె ఒడ్డుకు వచి్చందని మరికొందరు భావించారు. భద్రతా బలగాలు బీచ్‌కు చేరుకుని ప్రజల్ని అప్రమత్తం చేశాయి. బీచ్ రోడ్డుని క్లియర్ చేశాయి. శనివారం ఉదయం ఆ భారీ పెట్టె మిస్టరీని ఛేదించేందుకు బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. చేతులతో దానిని తెరిచేందుకు బాంబ్ డిస్పోజల్ టీమ్ ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు. బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో చెక్ చేశారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని గుర్తించారు. జీవీఎంసీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న రెండు పొక్లెయిన్లను పోలీసులు రంగంలోకి దించారు. 14 గంటల నిరీక్షణ తరువాత.. సమాచారం అందుకున్న ఆర్కియాలజీ బృందం చేరుకుని బాక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇది పురాతన కాలం నాటి పెట్టె కాదని.. రెండు నుంచి నాలుగేళ్ల క్రితం బర్మా టేకుతో తయారు చేసిన పెట్టె అని నిర్థారించింది. 10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల దానిని విడదీసేందుకు ప్రయత్నించగా.. చివరకు అది కేవలం చెక్క దిమ్మెగా గుర్తించారు. ఆర్కియాలజీ బృందంతో పాటు మత్స్యకారులు, పోర్టు అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరపగా.. అది నౌకల్లో వినియోగించే స్లీపర్ బార్జ్ అని స్పష్టమైంది. చిన్న సైజు నౌకలు అలల తాకిడికి గురైనప్పుడు అవి దెబ్బ తినకుండా కర్రలతో చేసిన స్లీపర్ బార్జ్‌లను ఒక బ్లాక్‌గా బిగించి వినియోగిస్తారని తేలింది. సముద్రం మధ్యలో షిప్‌లని లంగరు వేసేందుకు వీటిని ఉపయోగిస్తారని తెలిసింది. కంటైనర్ కార్గో వెసల్స్ నుంచి కంటైనర్లను దించే సమయంలోనూ ఈ తరహా బార్జ్‌లను వినియోగిస్తుంటారనీ.. వాటిలో ఒకటి షిప్ నుంచి విడిపోయి ఇలా కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి విశాఖ నగరానికి 14 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా.. ఓవైపు ఆందోళనల్ని.. మరోవైపు ఉత్కంఠని కలిగిస్తూ.. యాక్షన్ సినిమా తలపించిన భారీ చెక్క కథ సుఖాంతమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: మత్స్యకారులకు కష్టాలుండవిక -
సాక్షి టీవీ రిపోర్టర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
విశాఖపట్నం: ఆర్.కె.బీచ్‌లో మంగళవారం రాత్రి జరిగిన చంద్రబాబునాయుడు సభ కవరేజీకి వెళ్లిన ఆరిలోవ జోన్ ‘సాక్షి’ టీవీ రిపోర్టర్ సురేష్‌పై టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. సుమారు 30 మంది వరకు దుర్భాషలాడుతూ సురేష్ సెల్‌ఫోన్ లాక్కొని.. పిడిగుద్దులు గుద్దుతూ బయటకు నెట్టేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారించినా వినకుండా పెట్రేగిపోయారు. ఈ దాడిపై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ కోరాడ రామారావుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. టీడీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం
-
ఆర్కే బీచ్: దీపక్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ఆర్కే బీచ్‌లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సరదా కోసం సముద్రంలో ఈతకు దిగిన యువకుడు అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టికుపోయాడు. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన బీచ్ లైఫ్ గార్డ్స్ అతడిని రక్షించారు. వివరాల ప్రకారం.. ఈరోజు ఆదివారం కావడంతో ఆర్కే చీచ్ వద్దకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇక, పలు పక్క రాష్ట్రం ఒడిషా నుంచి కూడా కొందరు పర్యాటకులు అక్కడికి వచ్చారు. కాగా, వీరిలో దీపక్(26) అనే వ్యక్తి ఈత కోసం సముద్రంలోకి దిగాడు. సరదాగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా సముద్ర అలలు ఎక్కువయ్యాయి. అలల తాకిడికి దీపక్ సముద్రంలోకి కొట్టుకుపోయాడు. దీంతో, వెంటనే రంగంలోకి దిగిన బీచ్ లైఫ్ గార్డ్స్ దీపక్‌ను రక్షించారు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఇది కూడా చదవండి: నర్సింగ్ విద్యార్థినిలకు వేధింపులు.. దిశ పోలీసుల ఎంట్రీతో..