
ఉగ్రదాడి నేపథ్యంలో విశాఖ బీచ్‌లో భద్రత కట్టుదిట్టం
విశాఖపట్నం : విశాఖపట్నంలోని బీచ్ రోడ్డును సోమవారం మధ్నాహ్నం నగర పోలీస్ కమీషనర్ అమిత్ గార్గ్ సందర్శించి భద్రతను పర్యవేక్షించారు. పంజాబ్‌లో ఉగ్రవాదుల దాడి, ఆగస్టు 15 దగ్గర పడుతుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుండడంతో భద్రతను పటిష్టం చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి హెచ్చరికలు రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమై వ్యవహరిస్తున్నారు.