
విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో సముద్రం అలజడిగా మారింది. ఆర్కే బీచ్ వద్ద అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇందిరా గాంధీ చిల్డ్రన్స్ పార్క్ రిటైనింగ్ వాల్‌ను కెరటాలు తాకుతున్నాయి. గతంలో వర్షాలకు రిటైనింగ్ వాల్ పూర్తిగా దెబ్బతింది. దీంతో తీరం భారీగా కోతకు గురవుతోంది. ఫెంగల్ తుపాను సమయంలో సబ్ మెరైన్ వద్ద తీరం కోతకు గురైంది. రాత్రి వేళలో అలలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 24 గంటల్లో వాయుగుండగా మారే అవకాశం ఉంది. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు పయనించే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.