దిక్కు తోచని స్థితిలో కుమిలిపోతున్నాం
కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుంది
వైకుంఠ ఏకాదశి టోకన్ల తొక్కిసలాటలో మృతి చెందిన బంధువుల ఆవేదన
వైకుంఠ ద్వారం నుంచి ఆ కలియుగ వేంకటేశ్వరస్వామివారిని దర్శించి పునీతులు కావాలని తరలివచ్చారు. కానీ అధికా రులు, సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. వారి జ్ఞాపకాలు తలుచుకుని బంధువులు నేటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు.
తిరుపతి టాస్క్‌ఫోర్స్: వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్లే సమాధానం చెబుతున్నాయి. తోడుగా ఉన్నవారు దూరమవడంతో దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తల్లిలేని ఆడ బిడ్డల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ఘటన నుంచి తేరుకోలేక పోతున్నామని, ఆ జ్ఞాపకాలు తలుచుకుని మంచానికే పరిమితమయ్యామని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు.
వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి బైరాగిపట్టెడ, శ్రీనివాసం కౌంటర్లలో ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెల్సిందే. అందులో నలుగురు ఏపీకి చెందిన వారు కాగా ఒకరు తమిళనాడు, మరొకరు కేరళకు చెందిన భక్తులు ఉన్నారు. ఘటన జరిగి సుమారు ఆరు రోజులు కావస్తున్నా మరణించిన భక్తుల రక్తసంబంధీకులు, బంధువులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కొందరు మంచానికే పరిమితమయ్యామని, జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
వైజాగ్‌కు చెందిన మృతురాలు లావణ్య కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. తల్లి దూరమైన ఆ పసిపాపల ఆవేదన వర్ణ నాతీతం. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేమంటూ ఆవేదన చెందుతున్న ఆ పిల్లలను బంధువులు ఓదార్చలేని పరిస్థితి.
తల్లిని కోల్పోయా..
మాది కేరళ. ఈనెల 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మా తల్లి నిర్మల చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోలేకున్నాం. మా తల్లి నా కళ్ల ఎదుటే తి రుగుతున్నట్లు ఉంది. మా కుటుంబానికి ఆ మే పెద్ద దిక్కు. అలాంటిది తల్లి లేకపోవడం కలచివేస్తోంది. ఏ జన్మలో పాపం చేశానో త ల్లిని పోగొట్టుకున్నాను.
–కౌషిగ, మృతురాలు నిర్మల కుమార్తె, కేరళ
అమ్మ జ్ఞాపకాలతో..
ఊహించని ఘటనతో కుటుంబం అంతా షాక్‌లోనే ఉంది. దైవదర్శనానికి వెళితే ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి అమ్మతో కలసి సంతోషంగా గడుపుకున్నాం. ఇప్పుడు నాన్నతో పాటు యావత్ కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయి ఉన్నాం. జ్వరాలతో మంచాన పడ్డాం.
– మహేష్, మృతురాలు శాంతి కుమారుడు, వైజాగ్
మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది
మాది వైజాగ్ దగ్గర మద్దెలపాళెం. నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఒక్కడే కుమారుడు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నా భార్య రజిని మరణించింది. మా ఇంటి మహాలక్ష్మి మాకు దూరమైంది. ఇంట్లో నేను, నా కుమారుడు ఇద్దరమే మిగిలాం. ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి సంతోషంగా గడిపాం. ఈ ఏడాది ఆమెను దేవుడు దూరం చేశాడు. మా అబ్బాయి విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాం.
– లక్ష్మణరెడ్డి, మృతురాలి భర్త, మద్దెలపాళెం, వైజాగ్
ఆయన జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా..
వైకుంఠ వాకిలి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనే తపనతో నా భర్త నాయుడుబాబుతో క లసి 8వ తేదీన తిరుపతికి వచ్చాం. అదే రోజు జరిగిన తొక్కిసలాటలో నా భర్త చనిపోయాడు. కూలి చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న మా కుటుంబంలో ఈ విషాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నా భర్త వెంట లేడనే బాధను దిగమింగుకోలేక పోతున్నా. కుటుంబంలో 90 ఏళ్ల పెద్దవారు ఉన్నా రు. వారి బాగోగులు చూసుకోవాలి. ఆయన తోడు విడిచాడు. నా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం సాయం అందించింది. నేను పెద్దగా చదువుకున్న దానిని కాదు. అధికారులు ఉద్యోగం నర్సీపట్నంలోనే కల్పిస్తే నాకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.
– మణికుమారి,మృతుడు నాయుడుబాబు సతీమణి, నర్సీపట్నం
Comments
Please login to add a commentAdd a comment