అమరావతి: తిరుపతి తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షమాపణలు చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని , టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పాలక మండలి సభ్యులు..ఈవో,ఎఈవో ఘటనకు భాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి ఘటనలో తాను దోషిగా నిలబడాలా? అని వ్యాఖ్యానించారు.
కాగా, రెండు రోజుల క్రితం వైకుంఠ ద్వార దర్శన(Vaikunta Dwara Darshan) టికెట్ల జారీచేసే కేంద్రాల వద్ద అధికారుల నిర్లక్ష్యంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. వైకుంఠ ద్వార దర్శనంలో భాగంగా బుధవారం రాత్రి టికెట్ కౌంటర్ల ఒక్కసారిగా తోపులాట జరిగింది. అధికారులు ఉన్నపళంగా గేట్లు తీయడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ నేపథ్యంలో తోపులాట చోటు చేసుకుని ఆరుగురు మృతిచెందారు.
ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. లక్షా యాభైవేల టోకెన్లు జారీచేస్తామని చెప్పి.. కనీస రక్షణ చర్యలు, మౌలిక ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. వచ్చిన వారిని వచ్చినట్లు క్యూలైన్‌లోకి అనుమతించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని భక్తులు అభిప్రాయపడ్డారు.
అలా కాకుండా ఒకేసారి అన్నిచోట్లా గేట్లు తెరవడంతో అప్పటికే గంటల తరబడి వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో ఊహించని విధంగా తొక్కిసలాట జరిగింది. దీంతో వీరిని అదుపుచేయడం అటు పోలీసులకు, ఇటు టీటీడీ సిబ్బందికి సవాలుగా మారింది.
ఈ ఘటనలో సర్కారు నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనబడింది. సర్కారు నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగింది. ముక్కోటి ఏకాదశి నాడు పెద్దఎత్తున భక్తులు వస్తారని తెలిసినా.. పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌లు, పోలీసులతో హంగామా చేశారు.
ఇక్కడ టీటీడీకి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఘోరం చోటు చేసుకుంది. వచ్చిన వాళ్లను వచ్చినట్లు క్యూలైన్‌లోకి వదలకుండా, జనం గుమిగూడిన తర్వాత వదిలిపెట్టడమే ఇందుకు సాక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment