![Mumtaz Hotel Row: Hindu groups Fire On Kutami Prabhutvam](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Hindu-groups-Fire.jpg.webp?itok=pYfoufTD)
తిరుపతి/అమరావతి, సాక్షి: ఆధ్యాత్మిక నగరాన్ని పర్యాటకం పేరిట నాశనం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్‌కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయవి. ఈ చర్యను ఖండిస్తూ.. హిందూ సంఘాలు, స్వామీజీలు ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించింది. అయితే.. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారాయన. ఈ క్రమంలో.. తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు, సనాతన ధర్మం అంటూ గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వాళ్లకు పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/05_23.jpg)
గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 👉🏼 ఏడుకొండల్ని రక్షించుకుందాం
కూటమి సర్కార్‌కు హిందూ సంఘాల ప్రశ్నిలివే..
- సనాతన ధర్మ రక్షణ వీరుడు, సూరుడు, ధీరుడు.. పవన్‌కల్యాణ్ ఎక్కడ?
- వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల దివ్య క్షేత్రానికి గుండు కొట్టడమా? పవన్ కల్యాణ్ గారు..
- వారాహి డిక్లరేషన్ అంటే.. తిరుమల ఏడు కొండలను నాశనం చేయడమా? పవన్ కల్యాణ్ గారు..
- వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల ఏడు కొండలలో ముంతాజ్ హోటల్ నిర్మించడమా పవన్ కల్యాణ్ గారు?
- సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కల్యాణ్?
- తిరుమల ఏడు కొండలకు వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీ నాయకులు
- తిరుమల ప్రక్షాళన అంటే తిరుమలను అపవిత్రం చేయడమా? చంద్రబాబు నాయుడు గారు
- తిరుమల ప్రక్షాళన అంటే.. ముంతాజ్ హోటల్ నిర్మించడమా? చంద్రబాబు నాయుడు గారు
- శేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడమా?
- ఏడు కొండలను పాడు చేయడమేనా? ప్రక్షాళన అంటే..
![తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ దీక్ష](https://www.sakshi.com/s3fs-public/inline-images/tt_3.jpg)
Comments
Please login to add a commentAdd a comment