alipiri
-
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్‌కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్‌కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్‌కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
తిరుమల ప్రాంక్ వీడియోపై స్పందించిన ప్రియాంక, శివ
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్, ప్రయాంక ఇద్దరూ తిరుమలకు వెళ్లారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్లోడ్ చేశారు. అయితే, అది భక్తులను భయాందోళలకు గురి చేసేలా ఉండటంతో చాలామంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.'మేము షేర్ చేసిన వీడియోపై చాలామంది శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. మేము తెలియకనే ఈ తప్పు చేశాం. మీ మనోభావాలను గాయపరిచినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాము. ఉద్దేశపూర్వకంగా అయితే వీడియో చేయలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేశాం. అయితే, ఇలా అవుతుంది అని మేము ఏమాత్రం ఊహించలేదు. ఇంతమందిని ఈ వీడియో హర్ట్ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను మేము తక్కువ చేయాలని అనుకోలేదు. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు మేము చేయం. తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మరోసారి ఈ తప్పు జరగదు.' అని వారు ఒక వీడియోతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
భక్తులతో కిటకిటలాడిన అలిపిరి (ఫొటోలు)
-
టీటీడీ ఈవో లేఖ.. ఎట్టకేలకు స్పందించిన పురావస్తుశాఖ
సాక్షి, తిరుపతి: అలిపిరి పాదాల మండపం శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండపం వెనుకభాగం కూలిపోయింది. దీంతో ఇనుప రాడ్లుతో మండపానికి సపోర్ట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు,.. కానీ ఏ సమయంలో కూలిపోతుందో తెలియని ఈ మండపం ద్వారా భక్తులకు ప్రాణహాని ఉందని.. టీటీడీ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. దీనిపై రాజకీయ రంగు పులిమి మండప నిర్మాణాన్ని అడ్డుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాసిన లేఖపై ఎట్టకేలకు పురావస్తుశాఖ స్పందించింది. ఢిల్లీ ఎఎస్ఏ నుంచి పురావస్తు బృందాన్ని పంపారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగుళూరు నుంచి జి.శ్రీనివాసులు, చెన్నై నుంచి ఏ. సత్యం, హైదరాబాద్ నుంచి కే.కృష్ణ చైతన్య బృందం మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మత్తుపై ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పించనున్నారు. -
అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: అలిపిరి మండపాల పునఃనిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదాల మండపం ఆర్కియాలజీ పరిధిలో లేదన్నారు. ఎప్పుడైనా కూలే పరిస్థితి ఉందని.. అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశామని ఈవో పేర్కొన్నారు. అనేకమార్లు ఆర్కియాలజీ సంప్రదింపు చేసిన స్పందించలేదు. అలిపిరి పాదాల మండపం కూడా శిథిలావస్థలో ఉన్నా.. వాటిపై రాజకీయాలు చేస్తూ, భక్తులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీటీడీ వద్ద శిల్పకళా, ఆలయాల నిర్మాణం సంబంధించిన అన్ని వింగ్స్ ఉన్నాయని ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని ఈవో అన్నారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం కానుకలుగా సమర్పించారు. గత ఏడాది రూ. 39.40 కోట్లు, 2022లో రూ.26.61 కోట్ల ఆదాయం వచ్చింది. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని ఈవో వెల్లడించారు. -
తిరుమలకు స్టార్ హీరోయిన్.. కాలి నడకన కొండపైకి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం నడిచి వెళ్లారు. సామాన్య భక్తులతో కలిసి దాదాపు ముడున్నర గంట పాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్నా దీపికా పదుకుణే.. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయమే స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. అనంతరం విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.. -
తిరుమల అలిపిరి మార్గంలో మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ చిక్కింది. చిన్నారి అక్షితపై దాడి చేసి చంపిన స్థలంలోనే చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత పేరుతో నాలుగు చిరుతలను అధికారులు బంధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో చిరుత సంచారం ఆందోళన రేకెత్తిస్తోంది. చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. -
తిరుమలకు ప్రత్యేక బృందాలు.. కొనసాగుతున్న చిరుతల వేట
సాక్షి, తిరుమల: ఇటీవల తిరుమల నడకమార్గంలో బాలిక లక్షిత.. చిరుత దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ భక్తుల భద్రతపై అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తిరుమలలో చిరుతల వేట కొనసాగుతోంది. కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తిరుమలకు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. తిరుమలకు నడకదారిలో జంతువుల సంచారం కోసం 500 కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటుచేస్తోంది. అలాగే, వివిధ ప్రాంతాల్లో చిరుతల కోసం బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మోకాళ్ల మెట్టు, 36వ మలుపు వద్ద బోన్లును అమర్చారు. అంతేకాకుండా నడకదారిలో అదనపు ఎల్ఈడీ లైటను అధికారులు ఏర్పాటుచేశారు. ఇది కూడా చదవండి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ప్రత్యేక దర్శనం ఎన్ని గంటలంటే? -
తిరుమల మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి మెట్ల నడకదారిలో ఎలుగుబండి సంచరించింది. 2వేల మెట్టదగ్గర సోమవారం ఉదయం భక్తులకు ఎలుగుబండి కనిపించింది. కాగా, ఎలుగు బండి సంచారంతో భక్తులు భయాందోళను గురవుతున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఇటీవల ఓ బాలిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అనంతరం, చిరుతను అధికారులు జూకు తరలించారు. ఇది కూడా చదవండి: చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్ఓ శ్రీనివాసులు -
టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో ఆంక్షలు ఇవే..
సాక్షి, తిరుమల: చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు నడక మార్గాల్లో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు టీటీడీ అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. ఇటీవల తిరుమలకు నడకదారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. రేపటి(సోమవారం) నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్ని తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నట్టు టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండవ ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్‌లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. మరోవైపు.. తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు. ఇది కూడా చదవండి: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన -
మేమేమి చేశాము పాపం?
బుడిబుడి అడుగులు వేస్తూ.. కేరింతలు కొడుతూ.. అందర్నీ దాటుకుంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతున్న కుమార్తెను చూసి ఉప్పొంగిపోయారు. ఆ గోవిందుడిని స్మరిస్తూ.. ముందు వెళ్తున్న కుమార్తెను గమనిస్తూ.. ముందుకు సాగారు. ఇంతలో బాలిక హఠాత్తుగా అదృశ్యమవ్వడంతో తల్లిదండ్రులు ఒకింత గందరగోళానికి లోనయ్యారు. ఎక్కడుందోనన్న ఆత్రుతతో చీకటిని చీల్చుకుంటూ వెతుకులాడడం ప్రారంభించారు. నిశీధిలో రెప్ప వాల్చకుండా ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉంటుందని ఎదురుచూశారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. వన్యమృగాల దాడిలో చిన్నారి మృతిచెందిందని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మా ఇంటి మహాలక్ష్మిని తీసుకెళ్లావా..దేవుడా! అంటూ గుండెలవిసేలా రోదించారు. అక్క ఎక్కడుందమ్మా..? అంటూ తమ్ముడు అడిగే మాటలకు ఆ తల్లి జవాబు చెప్పలేక కన్నీరుమున్నీరవుతూ విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. ఈ విషాద ఘటన రుయా ఆస్పత్రి వద్ద శనివారం కనిపించింది. సాక్షి, తిరుపతి: తిరుమల అలిపిరి నడక మార్గంలో శుక్రవారం రాత్రి ఘోరం చోటుచేసుకుంది. వన్యమృగం దాడిలో ఆరేళ్ల బాలిక మృతిచెందడం అందరినీ కలిచివేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, పోతిరెడ్డిపాళెంకు చెందిన దినేష్‌కుమార్, శిశికళ కుమార్తె లక్షిత(6) శుక్రవారం సాయంత్రం అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది జల్లెడ పట్టారు. శనివారం తెల్లవారు జాము నుంచి మరోమారు గాలింపు చేపట్టగా.. అలిపిరి నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయానికి వంద నుంచి 200 మీటర్ల దూరంలో ఓ బండరాయిపై లక్షిత మృతదేహం లభ్యమైంది. క్రూరం..ఘోరం చిన్నారి లక్షితను వన్యమృగాలు అతికిరాతకంగా హతమార్చినట్టు తెలుస్తోంది. మెడ, తల భాగాన్ని.. కుడి కాలు తొడ భాగంలోని కండను పూర్తిగా తినేయడంతో భయానకంగా మారింది. చిన్నారి మృతదేహాన్ని ఉదయం 7.55 గంటలకు తిరుపతి రుయా ఆస్పత్రి తీసుకొచ్చారు. 15 నిమిషాల పాటు డాక్టర్లు పరిశీలించి శవపరీక్ష కోసం మార్చురీకి తరలించారు. ఎస్వీ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగ వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఉదయం 11.05 గంటలకు పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు టీటీడీ అంబులెన్స్ సిద్ధం చేసింది. కొంప ముంచిన బెలూన్! సీసీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు చిన్నారి హుందాగా.. వేగంగా ఆడుకుంటూ తల్లిదండ్రులకంటే ముందే మెట్లెక్కడం కనిపిచింది. ఈ క్రమంలో ఆంజనేయస్వామి విగ్రహం తర్వాత ఓ దుకాణం వద్ద బిస్కెట్ ప్యాకెట్‌ను కొనిచ్చారు. వాటిని తింటూ చిన్నారి ముందుకు సాగింది. నరసింహస్వామి ఆలయ సమీపంలో చిన్నారి కనిపించకుండా పోయింది. బెలూన్‌తో ఆడుకుంటున్న సమయంలో గాలికి ఆ బెలూన్ మెట్లమార్గం దాటి వెళ్లడం.. దానికోసం పరుగులు తీసేక్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల మాటున దాగి ఉన్న క్రూరమృగం పాపను ఎత్తుకెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. రుయాలో మిన్నంటిన ఆర్తనాదాలు రుయా మార్చురీ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డ దక్కకుండా పోయిందంటూ తల్లి శశికళ గుండెలు బాదుకుంటూ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చిన్నారి నానమ్మ మనుమరాలితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దేవుడా..! ఇంత శిక్షవేశావేంటయా... అంటూ విలపించడం కలిచివేసింది. అక్క ఎక్కడమ్మా?..అంటూ తమ్ముడు లిఖిత్ అడుగుతుండడంతో తల్లి సమాధానం చెప్పలేక.. ఇంకెక్కడ అక్క నాయనా! దేవుడు తీసుకెళ్లి పోయాడురా అంటూ.. కన్నీరుమున్నీరైంది. మా ఇంటి మహాలక్ష్మి ఇక లేదన్న విషయాన్ని ఎలా జీర్ణించుకోవాలంటూ తల బాదుకుంటూ విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. దాడి చేసింది చిరుతేనా? వన్యమృగం చిన్నారి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది. చూడడానికి వీలుకాని రీతిలో మృతదేహం పడిఉండడం.. చూస్తే చిరుతా..లేక ఎలుగుబంటా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. మరికొందరు రేసుకుక్కల పనేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఒక నిర్ణయానికి రాగలమని అధికారులు చెబుతున్నారు. అయితే చిరుతదాడేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని సీసీఎఫ్ నాగేశ్వరరావు, డీఎఫ్ఓ సతీష్‌కుమార్ పరిశీలించారు. దాడిచేసిన జంతువును బంధించేందుకు బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎలుగుబంటు అయితే మత్తుద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్ ద్వారా బంధించనున్నట్లు వెల్లడించారు. జంతువుల కదిలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు. ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్‌గా ప్రకటించారు. ఘటనా స్థలాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పరిశీలించారు. చిన్నారి మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సంఘటనా స్థలాన్ని ఎస్పీ పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. బాలికను వన్యమృగాలు దారుణంగా చంపడం బాధాకరమన్నారు. భక్తులందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. -
TTD: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన
సాక్షి, తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్‌ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది టీటీడీ. తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమాతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. భక్తులకు ముందువైపు, వెనుకవైపు రోప్‌లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పైలట్‌గా సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. టీటీడీ నుంచి రూ.5లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, బాలికపై చిరుత దాడి ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. నడకదారి భక్తులకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. చిరుత కోసం అటవీశాఖ అధికారులు నడకదారిలో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. ఇది కూడా చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? -
గోవిందనామ స్మరణలతో మారుమోగిన పాదాల మండపం (ఫొటోలు)
-
అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
అలిపిరి బస్ డిపోకు మొదటి దశలో 50 ఎలక్ట్రిక్ బస్ లు
-
వామ్మో పాము.. అలిపిరి నడక మార్గంలో కలకలం
తిరుమల: అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఆరు అడుగుల పొడవైన నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఎన్ఎస్ ఆలయానికి సమీపంలో నాగుపామును చూసిన స్థానిక సిబ్బంది... టీటీడీ అటవీ విభాగం ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అటవీప్రాంతంలో విడిచిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ‘బర్డ్’లో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు తిరుపతి తుడా: గ్రహణం మొర్రితో బాధపడుతున్న పేద పిల్లలకు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న బర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి శుక్రవారం తెలిపారు. శస్త్రచికిత్సల కోసం ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అపాయింట్మెంట్, ఇతర వివరాల కోసం 7337318107 నంబరులో సంప్రదించాలని సూచించారు. (క్లిక్: వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా!) -
పే..ద్ద నాగుపాముతో టీటీడీ ఉద్యోగి
తిరుమల : అలిపిరి – తిరుమల నడకమార్గంలో శుక్రవారం నాగుపాము కలకలం రేపింది. టీటీడీ అటవీ ఉద్యో గి భాస్కర్ నాయుడు తెలిపిన వివరాలు.. అలిపిరి మెట్లదారిలోని 3400 మెట్టు వద్ద ఓ పే..ద్ద నాగుపాము వచ్చినట్లు భక్తులు చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బుసలు కొడుతున్న ఆ పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారికోనలో వదిలేశారు. -
జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత
తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. అయితే, కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది. సుందరకాండ పారాయణం ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సుందరకాండ 58వ సర్గలో గల 167 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. చదవండి: పంపా క్షేత్రమే హనుమంతుని జన్మస్థలం శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా! -
గుప్తనిధుల కోసం భారీ సొరంగం
సాక్షి, తిరుపతి: శేషాచలంలో ఎర్రబంగారమే కాదు.. అపారమైన గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో ఓ ముఠా పథకం వేసింది. ఏడాది పాటు శ్రమించి భారీ సొరంగం తవి్వంది. మరికొంత సొరంగం తవ్వితే.. గుప్తనిధులు బయటపడేవని ముఠా సభ్యులు చెబుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలకు యత్నించిన కొందరిని శనివారం అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనకాపల్లికి చెందిన పెయింటర్ నాయుడు 2014లో తిరుపతికి మకాం మార్చాడు. భార్య నుంచి విడిపోయిన అతడు తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి గుప్తనిధుల మీద ఆశ మొదలైంది. నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది. తవ్వకాల సమీపంలో రాయిపై ఉన్న గుర్తులు కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్తనిధి ఉందని భావించారు. నాయుడు, రామయ్యస్వామి.. ఆరుగురు కూలీలతో కలిసి ఏడాది కిందట తవ్వకాలు ప్రారంభించారు. విషయం బయటకు తెలియకుండా సొరంగం తవ్వుతూ వచ్చారు. ఏడాది పాటు గుట్టుచప్పుడు కాకుండా.. రేయింబవళ్లు 80 అడుగుల సొరంగం తవ్వారు. మరికొంత తవ్వేందుకు శుక్రవారం రాత్రి కూలీలతో బయలుదేరారు. మరికొందరి కోసం మంగళం వెంకటేశ్వరకాలనీ సమీపంలో ఎదురు చూడసాగారు. ఈ ముఠా కదలికలతో అనుమానం వచ్చిన కాలనీవాసులు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గుప్తనిధుల తవ్వకాలకు వచ్చినట్లు వారు విచారణలో తెలిపారు. వారిద్వారా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వితే సరిపోయేదని ముఠా సభ్యులు చెబుతున్నారు. -
కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతం..
-
అలిపిరి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, తిరుపతి : అలిపిరిలో కిడ్నాప్‌కు గురైన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. విజయవాడ రైల్వేస్టేషన్లో బాలుడ్ని కనుగొన్నారు పోలీసులు. ఈ నెల 27న అలిపిరి బస్టాండ్ వద్ద సాహూ అనే బాలుడ్ని కర్ణాటకలోని మున్నియనపల్లికి చెందిన శివప్ప అనే వ్యక్తి అపహరించిన సంగతి తెలిసిందే. శివప్పకు వి.కోటకు చెందిన కళావతితో వివాహం అయింది. వీరికి పుట్టిన నలుగురు పిల్లల్లో ముగ్గురు అనారోగ్యంతో చనిపోగా.. డిప్రెషన్‌కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సాహూ ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశాడు. నిందితుడ్ని గత 14 రోజులుగా పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతడు బాలుడ్ని విజయవాడలో వదిలేశాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి బాలుడ్ని గుర్తించారు. బాలుడితో విజయవాడనుంచి తిరుపతి బయలుదేరారు. చదవండి : మైనర్‌తో ప్రేమ.. పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్లో.. అలిపిరి బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి -
అలిపిరిలో బాలుడి కిడ్నాప్.. ఇంకా దొరకని ఆచూకీ
-
అలిపిరి బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి
తిరుపతి : అలిపిరిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్ కేసులో కిడ్నాపర్‌ను శివప్పగా పోలీసులు గుర్తించారు. కానీ ఇంతవరకు అతని ఆచూకీ దొరకలేదు. దీంతో అపహరణకు గురైన బాలుడు ఇంకా అతని చెరలోనే ఉన్నాడు. వివరాల ప్రకారం..చత్తీస్‌గఢ్ నుంచి గతనెల 27న శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లబోతూ ఫుట్‌పాత్ మీద కాసేపు సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు.ఆ సమయంలో వారి పక్కనే పేపర్ చదువుతున్నట్టు నటించిన ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అప్పటినుంచి బాలుడి కోసం గాలించినా ఎలాంటి క్లూ దొరకలేదు. కిడ్నాప్‌కు నాలుగు రోజుల ముందే శివప్ప పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకుపై అమితమైన ప్రేమ చూపించే శివప్ప..కుమారుడి మృతితో డిప్రెషన్లోకి వెళ్లినట్లు అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి బస్టాండు వద్ద ఆడుకుంటున్న సాహుని కిడ్నాప్ చేశాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా ఇంకా బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో సాహు కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి : (తిరుపతిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్, సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు) -
పేపర్ చదువుతున్నట్టు నటన, పిల్లాడిని తీసుకుని పరార్
తిరుపతి : అలిపిరి లింక్ బస్టాండు వద్ద ఆరేళ్ల బాలుడు అపహరణకు గురి కావడం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. చత్తీస్‌గఢ్ నుంచి గతనెల 27న శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లబోతూ ఫుట్‌పాత్ మీద కాసేపు సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఆ సమయంలో వారి పక్కనే పేపర్ చదువుతున్నట్టు నటించిన ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బాలుడి వెంటబెట్టుకుని దుండగుడు వెళ్తున్న దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి : (భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య) (హైదరాబాద్‌లో టెకీపై యువకుడి దారుణం) -
ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా
సాక్షి, తిరుపతి/తిరుపతి అర్బన్: ‘ పోలీసులకు బుర్ర లేదు. ఉద్యోగ సంఘాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. అన్నీ నోట్ చేసుకుంటున్నాం. రిటైర్డ్ అయినా కూడా ఎవరినీ వదలం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ధర్మపరిరక్షణ యాత్ర పేరుతో గురువారం అలిపిరి వద్ద టీడీపీ నేతలు రచ్చ చేశారు. పలుచోట్ల రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. శాంతియుతంగా ర్యాలీ చేసుకోవాలని కోరినా పట్టించుకోకపోవడంతో.. చివరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఎమ్మార్‌పల్లె, చంద్రగిరి పోలీస్స్టేషన్లకు తరలించారు. మరోవైపు టౌన్‌క్లబ్ సర్కిల్ వద్ద బహిరంగసభ నిర్వహించడానికి బయల్దేరుతున్న అచ్చెన్నాయుడును తిరుచానూరు సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి: అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు) అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించి తీరుతామన్నారు. సంతబొమ్మాళిలో ఏం జరిగిందో చర్చించేందుకు రావాలని వైఎస్సార్సీపీకి సవాల్ విసిరారు. ఆలయంలో నంది విగ్రహం ఖాళీగా ఉంటే.. తీసుకొచ్చి దిమ్మెపై పెట్టారన్నారు. దీనికే ఆలయంలో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ కూడా యాత్ర చేస్తుంది కదా? అని మీడియా ప్రశ్నించగా.. తమది స్వచ్ఛమైన యాత్ర అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. కాగా, టీటీడీ నిబంధనలను పట్టించుకోకుండా.. అలిపిరి వద్ద పసుపు జెండాలు కట్టి టీడీపీ నేతలు రాజకీయ ప్రచారం చేయడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. (చదవండి: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం) ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా తిరుచానూరు సమీపంలోని హోటల్ వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ దీపిక పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఆమె కాలును తొక్కడమే కాకుండా.. ‘ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా..’ అంటూ బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళా ఎస్ఐ దీపిక కన్నీరుపెట్టుకున్నారు. మాదంతా ఖాకీ కులం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు పోలీస్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని, తమకు కులమతాలు ఉండవని, తమదంతా ఖాకీ కులమని డీఐజీ, ఏపీ పోలీస్ టెక్నికల్ చీఫ్ పాలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో గురువారం డీజీపీ డి.గౌతమ్‌సవాంగ్ సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబుతో కలిసి పాలరాజు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను దిగజార్చేలా రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఆపదలో ఆలయాలు అంటూ రాజకీయ నేతలు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. వాస్తవంగా 2015 నుంచి 2021 వరకు నమోదైన కేసులను గమనిస్తే 2020–21లో ఆలయ ఘటనలు పెరగలేదన్నారు. ఈ ఏడాది 44 కేసుల్లో 29 కేసులు నిగ్గు తేల్చి దోషులను అరెస్టుచేసినట్లు ఆయన చెప్పారు. తొమ్మిది కేసుల్లో రాజకీయ నేపథ్యం కలిగిన వారున్నారన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసు శాఖ సూచించిన నిబంధనలను ఉల్లఘించినందుకే టీడీపీ తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతిని రద్దుచేసినట్లు శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్‌బాబు చెప్పారు.