
ఆధ్యాత్మిక నగరాన్ని పర్యాటకం పేరిట నాశనం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి

అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్‌కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయవి. ఈ చర్యను ఖండిస్తూ.. హిందూ సంఘాలు, స్వామీజీలు ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.

టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించింది.

అయితే.. ముంతాజ్ హోటల్‌కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు.

తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారాయన.

తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు, సనాతన ధర్మం అంటూ గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వాళ్లకు పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు.















