గవ ర్నర్‌కు చంద్రబాబు లేఖ
సాక్షి, హైదరాబాద్: అలిపిరివద్ద గతంలో తనపై జరిగిన దాడితో సంబంధం ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి తప్పించుకుని విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ఆతన్ని అరెస్టు చేసేలా డీజీపీని ఆదేశించాల్సిందిగా టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు శుక్రవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు రాసిన లేఖలో కోరారు. గంగిరెడ్డి వల్ల తనకు హాని ఉందని తెలిసి కూడా పోలీసులు ఆయనపై నిఘా ఉంచలేదని తెలిపారు. ఆయన దేశం విడిచిపోవటం యథాలాపంగా జరిగింది కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర, కొందరు పోలీసు అధికారుల సహకారం ఉందని పేర్కొన్నారు. దీనికి కారణమైన వారిపై చర్య తీసుకోవటంతో పాటు గంగిరెడ్డి ఆస్తులు జప్తు చే సేలా చూడాల్సిందిగా కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాల్సిందిగా ఆయన సూచించారు.