kollam gangi reddy
-
గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో వాంటెడ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి కేసులోనూ ఇతడిపై ఆరోపణలున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలకు సంబంధించి గంగిరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డి ఈ ఏడాది మే 15న బెయిల్ పొందాడు. ఆ తర్వాత నకిలీ పాస్‌పోర్ట్‌తో అదే నెల 21న బహెరైన్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. -
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి
హైకోర్టులో కర్నూలు జిల్లా పోలీసుల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా పోలీసులు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డికి హైకోర్టు ఈ నెల 15న బెయిల్ మంజూరు చేసిందని, అయితే అతను బహ్రెయిన్‌కు పారిపోయాడని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఇతర నిందితులూ దేశం దాటేందుకు అతను సహకరించే ప్రమాదం ఉందని, ఇతనికి అంతర్జాతీయ స్మగర్లతో సంబంధాలు ఉన్నాయని, అందుకుగాను వెంటనే అతని బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. కర్నూలు గ్రామీణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం విచారించనున్నారు. -
గంగిరెడ్డి తప్పించుకోవటం వె నుక కుట్ర
గవ ర్నర్‌కు చంద్రబాబు లేఖ సాక్షి, హైదరాబాద్: అలిపిరివద్ద గతంలో తనపై జరిగిన దాడితో సంబంధం ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించి తప్పించుకుని విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ఆతన్ని అరెస్టు చేసేలా డీజీపీని ఆదేశించాల్సిందిగా టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు శుక్రవారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు రాసిన లేఖలో కోరారు. గంగిరెడ్డి వల్ల తనకు హాని ఉందని తెలిసి కూడా పోలీసులు ఆయనపై నిఘా ఉంచలేదని తెలిపారు. ఆయన దేశం విడిచిపోవటం యథాలాపంగా జరిగింది కాదని, దీని వెనుక రాజకీయ కుట్ర, కొందరు పోలీసు అధికారుల సహకారం ఉందని పేర్కొన్నారు. దీనికి కారణమైన వారిపై చర్య తీసుకోవటంతో పాటు గంగిరెడ్డి ఆస్తులు జప్తు చే సేలా చూడాల్సిందిగా కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాల్సిందిగా ఆయన సూచించారు.