తిరుపతి : అలిపిరి బాంబు దాడికేసులో ముగ్గురిని న్యాయస్థానం దోషులుగా నిర్థారించింది. నిందితులు రాంమ్మోహన్ రెడ్డి, నర్సింహారెడ్డి, కేశవ్లను కోర్టు దోషులుగా తేల్చింది. మరికాసేపట్లో వారికి శిక్షలు ఖరారు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ ఒకటో తేదీన అలిపిరి సమీపంలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే.
కేసులో మొత్తం 33మంది నిందితులు ఉన్నారు. వీరిలో ఇదివరలో నలుగురిపై కేసు విచారణ జరగ్గా ఇద్దరిపై తిరుపతి నాల్గో అదనపు జిల్లా జడ్జి కోర్టు కేసు కొట్టివేస్తూ 2012 నవంబర్ 8న తీర్పు చెప్పింది. మరో ఇద్దరికి కోర్టు శిక్ష విధించటంతో వారు హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. కేసులో మొత్తం 96మంది సాక్షులు ఉండగా ఇదివరలోనే చాలామందిని కోర్టు విచారించింది. మొత్తం 33మంది నిందితుల్లో 29 మందిని మావోయిస్టులుగా పోలీసులు పేర్కొన్నారు.