judgement
-
కోల్ కతా డాక్టర్ హత్యాచార కేసు నిందితుడికి నేడు శిక్ష ఖరారు
-
ఆర్జీకర్ ఘటనలో తీర్పు.. కోర్టు హాలులో కన్నీటి రోదనలు
కోల్‌కతా ఆర్జీకర్ వైద్యురాలి హత్యాచార కేసులో తీర్పు వెలువడింది. నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది సీల్దా కోర్టు. మొత్తం 160 పేజీలతో కూడిన తీర్పు కాపీని రూపొందించారు. అయితే జడ్జి తీర్పు చదువుతుండగా.. ఒకవైపు దోషి సంజయ్, మరోవైపు బాధితురాలి తండ్రి, బంధువుల కన్నీటి రోదనలతో కోర్టు హాలు మారుమోగింది.‘‘నేను ఈ పని చేయలేదు. ఈ కేసులో నన్ను ఇరికించారు. తప్పు చేసినవాళ్లను ఎందుకు స్వేచ్ఛగా వదిలేస్తున్నారు?. ఏ తప్పూ చేయని నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు?’’ అంటూ గట్టిగా రోదించాడు. ఆ సమయంలో జడ్జి అనిర్బన్ దాస్ కలుగజేసుకుని చేసుకుని ‘‘నువ్వేమైనా మాట్లాడదల్చుకుంటే సోమవారం శిక్ష ఖరారు చేసే సమయంలో అవకాశం ఇస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీంతో సంజయ్ సైలెంట్ అయ్యాడు.మరోవైపు.. తీర్పు వెలువడుతున్న టైంలోనే బాధితురాలి తండ్రి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ‘‘న్యాయాన్ని రక్షించి.. మీపై నాకున్న నమ్మకం నిలబెట్టుకున్నారు. మీరు మీ గౌరవాన్ని కాపాడుకున్నారు సర్’’ అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బాధితురాలి తరపున వచ్చినవాళ్లంతా చప్పట్లు కొట్టారు. దీంతో.. జడ్జి నిశబ్దం పాటించాలంటూ అంటూ గావెల్(సుత్తి)తో మందలించారు.తీర్పు వెలువడక ముందు సీల్దా(Sealdah) కోర్టు ప్రాంగణంలో గంభీరమైన వాతావరణం నెలకొంది. సంజయ్‌ను గట్టి భద్రతా మధ్య కోర్టుకు తీసుకొచ్చారు. లాయర్లంతా కోర్టు బయట ఉండి సంఘీభావం ప్రకటించారు. అయితే.. తీర్పు అనంతరం బాధితురాలి తరఫున పోరాడిన సంఘాలు, ఇతరులు లాయర్లతో కలిసి స్వీట్లు పంచడంతో సందడి కనిపిచింది.కోల్‌కతాలోని రాధా గోబిందా కర్(RG Kar) మెడికల్ కాలేజీ సెమినార్లో కిందటి ఏడాది ఆగష్టు 7వ తేదీన ఓ వైద్యవిద్యార్థిని(31) అర్ధనగ్నంగా విగతజీవిగా కనిపించింది. ఈ ఘోరం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వైద్య సిబ్బంది దేశవ్యాప్త నిరసనలకు దారి తీసింది. మూడు రోజుల తర్వాత(ఆగష్టు 10న) సంజయ్ రాయ్ అనే వ్యక్తిని కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈలోపు ఘటనాస్థలంలోకి నిరసనకారులు దూసుకురావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నమేననే ఆరోపణలు వచ్చాయి. మరోవైపు.. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ ఛార్జి అభిజిత్ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టు కాగా.. తర్వాత వారికి ప్రత్యేక న్యాయస్థానంలో బెయిల్ లభించింది. వారు అరెస్టయిన దగ్గరినుంచి 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేయకపోవడంతో ఈ బెయిల్ లభించింది.కేసు తీవ్రత దృష్ట్యా కలకత్తా హైకోర్టు సీబీఐకి కేసును బదిలీ చేసింది. బాధితురాలికి అండగా దేశం మొత్తం కదలడంతో.. నిర్భయ ఘటన స్ఫూర్తితో ఈ కేసును ‘అభయ’గా మీడియా అభివర్ణించడం మొదలుపెట్టింది. ఇక.. ఈ ఘటనలో రాయ్ ఒక్కడే లేడని, ఇంకొందరి ప్రమేయం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తూ వస్తోంది. అయితే ఇటు కోల్‌కతా పోలీసులు, ఆపై సీబీఐ కూడా రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు నిర్ధారించాయి. సామూహిక అత్యాచారం విషయాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించలేదు. అయితే బాధిత కుటుంబ విజ్ఞప్తి మేరకు కోర్టు ఈ అంశాన్ని కూడా పరిశీలించింది. మరోవైపు.. అక్టోబర్ 7, 2024 సీల్దా కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్ ఆధారంగా సీల్దా అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు విచారణ జరిపింది. నవంబర్ 12వ తేదీ నుంచి జనవరి 9వ తేదీ దాకా.. నిందితుడి ఇన్‌కెమెరా ట్రయల్ జరిగింది. ఆ టైంలో 50 మంది సాక్షులను విచారించారు. చివరకు.. ఆర్జీకర్ హత్యాచార కేసులో వలంటీర్‌గా పని చేసే సంజయ్ రాయ్ పాత్రను సీబీఐ నిర్ధారించగా.. సీల్దా కోర్టు ఇవాళ దోషిగా ప్రకటించింది. ప్రస్తుతం సంజయ్ కోల్‌కతా ప్రెసిడెన్సీ జైల్లో ఉన్నాడు. మొదటి నుంచి తాను అమాయకుడినేంటూ వాదిస్తున్నాడు. అంతేకాదు.. ఓ పోలీస్ ఉన్నతాధికారికి అన్నివిషయాలు తెలుసంటూ చెబుతున్నాడు. అయితే కోర్టు మాత్రం అతని వాదనను పట్టించుకోలేదు. బీఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103(1) కింద అత్యాచారం, హత్య నేరాల కింద సంజయ్ రాయ్‌ను దోషిగా ప్రకటించింది కోర్టు. దీంతో సంజయ్‌కు మరణశిక్షగానీ, జీవితఖైదుగానీ పడే అవకాశాలే ఉన్నాయని జడ్జి వెల్లడించారు. -
గ్రీష్మపై కనికరమా?.. కఠినశిక్షా?
‘‘సర్.. నా వయసు 24 ఏళ్లు. నేనింకా చిన్నదాన్నే. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. జీవితంతో ఎంతో చూడాల్సి ఉంది. ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. నేను బాగా చదువుకున్నా. కావాలంటే ఇవి చూడండి..’’ అంటూ అమాయకంగా జడ్జి చేతికి తన సర్టిఫికెట్లను అందించింది గ్రీష్మ. తన ఛాంబర్ సీట్లో కూర్చున్న న్యాయమూర్తి వాటిని చూస్తూ.. ఒక్కసారిగా నిట్టూర్పు విడిచారు.కేరళ పరసాలలో మూడేళ్ల కిందట(2022లో) సంచలనం సృష్టించిన షరోన్ రాజ్ హత్య కేసులో.. జనవరి 20వ తేదీన తీర్పు వెలువడనుంది. ఈ కేసులో శుక్రవారం(జనవరి 17న) షరోన్ ప్రేయసి గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు దోషులుగా ప్రకటించింది. అయితే.. శిక్షలు ఖరారు కావాల్సి ఉంది. అయితే.. వ్యక్తిగతంగా ఆమె విజ్ఞప్తి చేయడంతో.. శనివారం ఉదయం తన ఛాంబర్‌కు రప్పించుకుని న్యాయమూర్తి ఏఎం బషీర్ మాట్లాడారు. ఈ క్రమంలో.. తన శిక్ష విషయంలో కనికరం ప్రదర్శించాలని గ్రీష్మ ఆయన్ని వేడుకుంది.అసలేం జరిగిందంటే..పరసాలా ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్(23), గ్రీష్మలు కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహాం నిశ్చయమైంది. ఆ తర్వాత షరోన్-గ్రీష్మల మధ్య దూరం పెరిగింది. వృత్తి రిత్యా వేరే ఊర్లో ఉంటున్న షరోన్.. అక్టోబర్ 10న షరోన్ పరసాలాకు వచ్చాడు. అక్టోబర్ 14న ఉదయం షరోన్‌కు ఉష ఫోన్ చేసింది. కలవాలని ఉందని.. బయటకు వెళ్దామని చెప్పింది. దీంతో తన స్నేహితుడితో కలిసి రామవర్మంచిరై(కన్యాకుమారి, తమిళనాడు)లో ఉష ఇంటికి వెళ్లాడు షరోన్.స్నేహితుడు బయటే ఎదురుచూస్తుండగా.. ఒక్కడే ఇంట్లోకి వెళ్లాడు. అయితే.. కాసేపటికే పొట్టచేత పట్టుకుని వాంతులు చేసుకుంటూ బయటకు వచ్చాడు షరోన్. దీంతో కంగారుపడ్డ స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆ దారిలోనూ ఇద్దరూ చాట్ చేసుకున్నారు. ‘‘కషాయంలో ఏం కలిపావు?’’ అని షరోన్ ఉషను నిలదీశాడు. అయితే తానేం కలపలేదని.. బహుశా వికటించిందేమో అని సమాధానం ఇచ్చిందామె. అక్కడితో వాళ్లిద్దరి ఛాటింగ్ ఆగిపోయింది. నీలిరంగులో వాంతులు చేసుకున్న షరోన్‌ను పరసాలా ప్రభుత్వాసుపత్రిలో చేర్చాడు స్నేహితుడు. ఆపై మెరుగైన వైద్యం కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. అయితే.. అక్కడ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్లు నార్మల్ రావడంతో.. ఇంటికి పంపించేశారు. రెండు రోజుల తర్వాత షరోన్ పరిస్థితి విషమించింది. దీంతో తిరిగి తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సలో షరోన్‌కు లంగ్స్, కిడ్నీ ఒక్కొక్కటిగా దెబ్బ తింటూ వచ్చాయి. ఈలోపు షరోన్ నుంచి మెజిస్ట్రేట్ సమక్షంలో వాంగ్మూలం సేకరించారు పోలీసులు. మరోవైపు వైద్యులు.. అతను తాగిన డ్రింక్‌లో పురుగుల మందు కలిసిందని నిర్ధారించుకున్నారు. అవయవాలన్నీ పాడైపోయి అక్టోబర్ 25వ తేదీన గుండెపోటుతో షరోన్ ప్రాణం విడిచాడు.ఎస్కేప్.. అరెస్ట్..తమ బిడ్డ చావుకు గ్రీష్మ కుటుంబం కారణమంటూ షరోన్ పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న ఆ కుటుంబం కోసం గాలించారు. చివరకు.. అదే ఏడాది నవంబర్ 22న గ్రీష్మ కుటుంబాన్ని అరెస్ట్ చేశారు. అయితే పీఎస్‌లో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది. వాదనలు ఇలా.. ఇది అత్యంత అరుదైన కేసు అని ప్రాసిక్యూషన్ వాదించారు. ఆమె కేవలం ఓ యువకుడ్ని మాత్రమే చంపలేదు. ప్రేమ అనే భావోద్వేగాన్ని ప్రదర్శించి ఓ ప్రాణం బలి తీసుకుంది. అనుకున్న ప్రకారమే.. ఆమె ప్రేమను అడ్డుపెట్టి మరీ అతన్ని తన ఇంటికి రప్పించి ఘోరానికి తెగబడింది. అతని చంపడానికి ఆమె అన్నివిధాల ప్రయత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పేరిట 11 రోజులపాటు అతను నరకం అనుభవించాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. షరోన్ కూడా ఎన్నో కలలు కన్నాడు. కానీ, గ్రీష్మ వాటిని చెరిపేసింది. కాబట్టి, ఆమెపై కనికరం చూపించాల్సిన అవసరం లేదు. ఆమెకు ఉరే సరి అని వాదించారు.మరోవైపు.. గ్రీష్మ తరఫున వాదనలు వినిపించిన లాయర్ అజిత్ కుమార్.. కేసులో వాస్తవ ఆధారాలు(Circumstantial Evidence) లేనప్పుడు మరణశిక్ష విధించడం కుదరని వాదించారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గ్రీష్మ ఆత్మహత్యకు ప్రయత్నించింది. వాస్తవానికి ఆమె షరోన్ నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ యువకుడు ఆమెను వదల్లేదు. వ్యక్తిగత చిత్రాలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. బెడ్రూం వీడియోలు బయటపెడతానని బెదిరించాడు. మానసికంగా ఆమెను ఎంతో వేధించాడు. అలాంటప్పుడు ఏ మహిళ అయినా ఎందుకు ఊరుకుంటుంది. ఆమె మెరిట్ విద్యార్థిని. శిక్ష విషయంలో కనికరం చూపించాల్సిందే’’ అని వాదించారు.దాదాపు రెండేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది. చివరకు.. జనవరి 17వ తేదీన గ్రీష్మను, ఆమె మేనమామ నిర్మలాకుమారన్‌ను దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో గ్రీష్మ తల్లి సింధును నిర్దోషిగా ప్రకటించి విడుదల చేసింది. జనవరి 20 సోమవారం శిక్షలు ఖరారు చేయనుంది. అయితే ఆమెకు కఠిన శిక్ష పడుతుందా? లేదంటే కోర్టు కనికరం ప్రదర్శిస్తుందా? చూడాలి. మూఢనమ్మక కోణం!మూఢనమ్మకంతో గ్రీష్మ కుటుంబం తమ బిడ్డ ప్రాణం తీసిందని షరోన్ కుటుంబం ఆరోపించింది. ఆమెకు ఎంగ్మేజ్మెంట్ అయ్యాక మనసు విరిగిన షరోన్.. తన పనిలో తాను ఉన్నాడని, గ్రీష్మానే ఫోన్ చేసి అతన్ని పరసాలాకు రప్పించిందన్నారు. ‘‘గ్రీష్మ కుటుంబానికి షరోన్ రాజ్ నచ్చలేదు. అందుకే మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి ఫిక్స్ చేసి.. ఎంగేజ్మెంట్ కూడా కానిచ్చేశారు. ఆపై పెళ్లిని అర్ధాంతరంగా వాయిదా వేశారు. అయితే.. గ్రీష్మకు పెళ్లైన వెంటనే భర్త మరణించే గండం ఉంది. ఆ దోషం పొగొట్టేందుకు షరోన్‌ను బలి పశువును చేశారు. బలవంతంగా ఆమె నుదుట కుంకుమ పెట్టించారు. ఉష ఇంటి నుంచి బయటకు వచ్చిన షరోన్ నుదుటిపై కూడా కుంకుమ ఉందని, ఆ విషయాన్ని వెంట ఉన్న స్నేహితుడు సైతం నిర్ధారించాడని అంటోంది. పక్కా ప్లాన్‌తో ఆమెతో బలవంతపు వివాహం జరిపించి.. ఆపై పురుగుల మందు తాగించి షరోన్ మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ వచ్చింది. అయితే పోలీసులు ఈ వాదనను తోసిపుచ్చారు. -
సంజయ్ రాయ్ దోషే
కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలిపై హత్యాచారం కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను దోషిగా కోర్టు తేల్చింది. 2024 ఆగస్ట్ 9న జరిగిన ఈ దారుణంపై నెలలపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం తెలిసిందే. బాధితురాలికి న్యాయం జరగాలంటూ వైద్యులతో పాటు యువత పెద్ద సంఖ్యలో రోడ్డెక్కారు. రాయ్‌పై భారతీయ న్యాయ సహిత సెక్షన్లు 64, 66తో పాటు మరణ శిక్ష, లేదా జీవిత ఖైదుకు వీలు కలి్పంచే 103(1) కింద కేసులు నమోదయ్యాయి. వాటిపై 2024 నవంబర్ 12 నుంచి సీల్డా అదనపు జిల్లా సెషన్స్ జడ్జి అనిర్బణ్ దాస్ రెండు నెలలపాటు రహస్య విచారణ జరిపారు. రాయ్‌పై మోపిన అన్ని ఆరోపణలనూ సీబీఐ రుజువు చేసిందని పేర్కొన్నారు. వైద్యురాలిపై అతను లైంగిక దాడి చేయడమే గాక ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలిందన్నారు. ‘‘తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆస్పత్రిలోకి చొరబడ్డావు. సెమినార్ హాల్లో నిద్రిస్తున్న ఆన్‌డ్యూటీ వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డావు. ఆమెకు ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశావు. సంబంధిత సాక్ష్యాధారాలు పరిశీలించి, వాదనలు విన్న మీదట నువ్వే దోషివని నిర్ధారించా. నిన్ను శిక్షించాల్సిందే’’ అని నిందితున్ని ఉద్దేశించి జడ్జి పేర్కొన్నారు. కేసులో ఇరికించారు తనను ఈ కేసులో ఇరికించారని రాయ్ అన్నాడు. ‘‘నేనే గనుక ఈ నేరం చేసుంటే నా మెడలోని రుద్రాక్షమాల అక్కడే తెగిపోయి ఉండేది’’ అన్నాడు. ‘నన్నీ కేసులో ఇరికించిన వారిని ఎందుకు వదిలేశారు?’ అని ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, స్థానిక పోలీస్ స్టేషన్ మాజీ ఎస్‌హెచ్‌వోలను ఉద్దేశించి ప్రశ్నించాడు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు దోషి వాంగ్మూలం తీసుకుంటామని, అనంతరం అతనికి శిక్ష ఖరారు చేస్తూ తుది తీర్పు వెలువరిస్తానని జడ్జి తెలిపారు. బాధితురాలి తండ్రి లేవనెత్తిన పలు అంశాలకు కూడా అందులో బదులిస్తానని చెప్పారు. తర్వాత రాయ్‌ను పోలీసులు ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోంకు తీసుకెళ్లారు. అతడిని మీడియాతో మాట్లాడనివ్వలేదు. తీర్పును పాలక తృణమూల్ కాంగ్రెస్ స్వాగతించగా ఇక పార్టీ ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తుదిశ్వాస వరకు పోరాడుతాం తీర్పు విన్నాక బాధితురాలి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి మీడియాతో మాట్లాడారు. ‘మీపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నారు’ అని జడ్జినుద్దేశించి పేర్కొన్నారు. తల్లి మాత్రం పూర్తి న్యాయం జరగలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కుమార్తెను చిత్రహింసలు పెట్టి పొట్టన పెట్టుకున్న రాయ్ విచారణ సమయంలో మౌనంగా ఉండిపోయాడు. ఈ దారుణానికి అతడొక్కడే కారణం కాదు. ఇతర దోషులనూ చట్టం ముందు నిలబెట్టాలి. అందుకు తుదిశ్వాస దాకా పోరాడతాం’’ అని చెప్పారు. కుట్ర తేలేదాకా పోరు: వైద్యులు పాక్షిక న్యాయమే జరిగిందంటూ తీర్పు అనంతరం జూనియర్ వైద్యులు పెదవి విరిచారు. ‘‘ఎన్నో ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఈ నేరంతో పెద్ద వ్యక్తులకు కచి్చతంగా సంబంధముంది. అందుకే క్రైం సీన్‌ను మార్చేశారు. ఆధారాలను చెరిపేశారు. ఆ దిశగా మరింత విచారణ జరపాలి’’ అని డిమాండ్ చేశారు. అప్పటిదాకా తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. రాయ్ ఒక్కడే దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు చెబుతుండగా ఇందులో మరికొందరి హస్తముందని బాధితురాలి తల్లిదండ్రులు, వైద్యులు వాదిస్తుండటం తెలిసిందే. 50 మంది సాక్షులు కోల్‌కతా పోలీసు విభాగంలో పౌర వలంటీర్ అయిన రాయ్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. నవంబర్ 12న మొదలైన రహస్య విచారణ జనవరి 9న ముగిసింది. 50 మంది సాక్షులను విచారించారు. ఘటన జరిగిన మర్నాడు రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళనలు తీవ్రరూపం దాల్చడంతో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. కోర్టు తీర్పును సవాలు చేయబోమని సంజయ్ రాయ్ సోదరి తెలిపారు. ‘‘అతను నేరం చేసినట్లయితే శిక్ష అనుభవించాల్సిందే. విచారణకు మా కుటుంబం హాజరవడం లేదు’’ అని చెప్పారు. 9 Aug: A Trainee doctor was R*PED and MURDERED in #RGKar Hospital.13 Aug: Calcutta HC ordered CBI Probe2 Sept: Former principal Sandip Ghosh arrested.7 Oct: Chargesheet Filed. Sanjay Roy named the key accused.18 January: Trial Court will pronounce the VERDICT Today. pic.twitter.com/NxVA6CXD5o— SAVE THE WORLD 🗺 (@ProtecterIM) January 18, 2025 -
కేటీఆర్ పిటిషన్..రేపే హైకోర్టు తుది తీర్పు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా-ఈ రేసుల కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం(జనవరి7) ఉదయం తుది తీర్పివ్వనుంది. ఈ కేసులో పూర్తి వాదనలు విన్న కోర్టు తీర్పు ఇప్పటికే రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తుది తీర్పు వచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు కూడా కోర్టు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్నారు. హైకోర్టు ఒకవేళ ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తే కేటీఆర్‌కు శాశ్వత ఊరట లభించినట్లవుతుంది.మరోవైపు ఈ కేసులో గురువారం(జనవరి9) విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఏసీబీ సోమవారం మళ్లీ నోటీసులిచ్చింది. సోమవారం కేసు విచారణ కోసం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్లారు. న్యాయవాదిని విచారణకు అనుమతించమని పోలీసులు చెప్పడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెనుతిరిగి వచ్చేశారు. ఈడీ విచారణకు రాలేను.. సమయం కావాలి: కేటీఆర్ ఫార్ములా-ఈ కేసులో మంగళవారం(జనవరి7) విచారణకు రావాలని కేటీఆర్‌కు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు రాలేనని, తనకు సమయం కావాలని ఈడీని కేటీఆర్ కోరారు.క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ అయినందున విచారణకు రాలేనని కేటీఆర్ సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: రేవంత్ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా -
Year Ender 2024: దేశగతిని మార్చిన 10 సుప్రీం తీర్పులు
2024 కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం పలు కీలక తీర్పులను వెలువరించింది. ఇవి దేశ రాజ్యాంగంలోని న్యాయ వ్యవస్థకు మైలురాళ్లుగా నిలిచాయి. ఈ ఏడాది సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో 10 తీర్పులు దేశగతిపై ప్రభావం చూపాయి. ఆ వివరాలు..1. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ఈ ఏడాది ఫిబ్రవరి 15న లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే ముందు, సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను ఏకగ్రీవంగా తిరస్కరించింది. ఇది ‘రాజ్యాంగ విరుద్ధం,ఏకపక్షం’ అని సుప్రీంకోర్టు ప్రకటించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ నిధుల మూలాన్ని వెల్లడించకపోవడం అవినీతికి దారితీసిందని కోర్టు పేర్కొంది.2. ఎన్నికల కమిషనర్ల నియామకం ఈ ఏడాది మేలో సుప్రీం ఇచ్చిన ప్రధాన తీర్పులో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్లను నియమించాలనే నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికలు సమీపిస్తున్నాయని, అలాంటి పిటిషన్లు గందరగోళాన్ని, అనిశ్చితిని సృష్టిస్తాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్,ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, కార్యాలయ షరతులు) చట్టం 2023 ఆపరేషన్‌పై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.3. ఆర్టికల్ 370 పునరుద్ధరణకు నోజమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థిస్తూ 2023, డిసెంబరు 11న ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఛాంబర్లో పిటిషన్లను పరిశీలించింది. ఈ రికార్డులలో ఎలాంటి లోపం కనిపించడం లేదని, అందుకే రివ్యూ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు బెంచ్ స్పష్టం చేసింది.4.షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)ఉప-వర్గీకరణపై తీర్పుఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ 2024 జూలైలో షెడ్యూల్డ్ కులాలలో (ఎస్సీ) మరింత వెనుకబడిన తరగతులకు ప్రత్యేక కోటాను నిర్ధారించాల్సిన అవసరం ఉందని తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణను సమర్థించింది. ఈ నిర్ణయం దరిమిలా దళితుల్లో మరింత వెనుకబడిన వారిని గుర్తించి, వారికి ఇచ్చే రిజర్వేషన్లో ప్రత్యేక కోటాను కల్పించవచ్చు.5. జైళ్లలో కుల వివక్ష తగదుజైళ్లలో కుల ప్రాతిపదికన వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని 2024, అక్టోబర్ 3న సుప్రీంకోర్టు పేర్కొంది. వివక్ష, కులాల ఆధారంగా విభజన అనేవి రాజ్యాంగంలోని 15వ అధికరణను ఉల్లంఘించడమేనని తెలిపింది. ఒక నిర్దిష్ట కులానికి చెందిన పారిశుధ్య కార్మికులను ఎంపిక చేయడం సమానత్వానికి పూర్తిగా విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. జైళ్లలో ఇలాంటి వివక్షను అనుమతించబోమని కోర్టు స్పష్టం చేసింది.6. క్షమాభిక్ష పిటిషన్లపై మార్గదర్శకాలు మరణశిక్ష పడిన ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లపై త్వరితగతిన సరైన చర్యలు తీసుకునేందుకు 2024 డిసెంబర్ 9న సర్వోన్నత న్యాయస్థానం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసింది. క్షమాభిక్ష పిటిషన్లకు సంబంధించిన అంశాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను సిద్ధం చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.7. బుల్డోజర్ జస్టిస్‌కు బ్రేక్ ఈ ఏడాది నవంబర్ 13న సుప్రీం కోర్టు తన ప్రధాన నిర్ణయంలో బుల్డోజర్ జస్టిస్ వ్యవస్థకు బ్రేక్ వేసింది. నిందితులు, దోషులపైన కూడా బుల్డోజర్ చర్య చట్టవిరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను నిర్దేశించింది. దాని ప్రకారం 15 రోజుల ముందుగానే సంబంధీకులకు నోటీసు ఇవ్వాలి.8) బిల్కిస్ బానో కేసులో..గుజరాత్ ప్రభుత్వం బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులకు ముందస్తుగా విడుదల చేసింది. ఈ దోషులంతా 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై అత్యాచారం చేశారు. వీరికి బాధితురాలి కుటుంబ సభ్యులలో ఏడుగురిని హత్య చేయడంలో ప్రమేయం ఉంది. దీనిపై 2024 జనవరి 8న సుప్రీం ఇచ్చిన తీర్పులో దోషులను విడుదల చేయడం న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.9) మనీష్ సిసోడాయా కేసులోలిక్కర్ స్కామ్ ఆరోపణలపై 2023 ఫిబ్రవరిలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు ఈ ఏడాది ఆగస్టు 9న సుప్రీంకోర్టు బెయిల్‌పై విడుదల చేసింది. ఈ కేసులో విచారణ జరుగుతున్నందున నిందితుడిని నిరవధికంగా జైల్లో ఉంచలేమని కోర్టు పేర్కొంది. ఎక్కువ కాలం జైలులో ఉంచడం ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది.10) చైల్డ్ పోర్నోగ్రఫీసుప్రీంకోర్టు 2024, సెప్టెంబరు 23న ఇచ్చిన తీర్పులో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన మెటీరియల్‌ని డౌన్లోడ్ చేయడం, వీటిని సేవ్ చేయడం నేరం కిందకు వస్తుందని పేర్కొంది. సంబంధిత వ్యక్తి అటువంటి వీడియోలు లేదా సమాచారాన్ని తొలగించకపోయినా లేదా పోలీసులకు తెలియజేయకపోయినా అది పాక్సో చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం నేరమని పేర్కొంది. పిల్లల అశ్లీల చిత్రాలను ఎవరికైనా పంపితే తప్ప, వాటిని కలిగి ఉండటం లేదా డౌన్లోడ్ చేయడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు వెలిబుచ్చిన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది.ఇది కూడా చదవండి: ‘ఇండియా’కు ఎవరు బెస్ట్? రాహుల్.. మమత బలాబలాలేమిటి? -
బొగ్గు స్కామ్‌లో ఢిల్లీ కోర్టు కీలక తీర్పు
సాక్షి,ఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు బుధవారం(డిసెంబర్11) కీలక తీర్పిచ్చింది. యూపీఏ హయాంలో జరిగిన బొగ్గు బ్లాకుల కేటాయింపులో అవకతవకలున్నాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది.ఈ కేసులో విచారణ అనంతరం నవభారత్ పవర్ ఎండీ హరిశ్చంద్రప్రసాద్, నవభారత్ పవర్ చైర్మన్ త్రివిక్రమప్రసాద్, హరిశ్చంద్ర గుప్తా,సమారియా సహా మొత్తం ఐదుగురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.ఈ మేరకు 341 పేజీల తీర్పును ప్రత్యేక కోర్టు వెలువరించడం గమనార్హం. -
జీహెచ్ఎంసీలో హౌజింగ్ సొసైటీలపై సుప్రీం సంచలన తీర్పు
సాక్షి,ఢిల్లీ: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో హౌసింగ్ సొసైటీలపై సుప్రీంకోర్టు సోమవారం(నవంబర్ 25) సంచలన తీర్పిచ్చింది. హౌజింగ్ సొసైటీలకు ఇప్పటికే చేసిన భూ కేటాయింపులను సీజేఐ సంజీవ్‌ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం రద్దు చేసింది. ఇంతేకాకుండా సొసైటీలు చెల్లించిన డబ్బును వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించింది.హౌజింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూ కేటాయింపులను సవాలు చేస్తూ రావు బి చెలికాని అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. ప్రజా ప్రతినిధులు,ప్రభుత్వ ఉద్యోగులు,జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వంలో గతంలో భూ కేటాయింపులు జరిపింది. ఇదీ చదవండి: సోషల్‌మీడియా అండతో తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు -
సీజేఐ లాస్ట్ వర్కింగ్ డే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా డీవై చంద్రచూడ్ చివరి పనిదినమైన శుక్రవారం(నవంబర్ 8) సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనార్టీ హోదాపై సీజేఐ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4:3 మెజారిటీతో తీర్పు చెప్పింది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ అయినంత మాత్రాన మైనార్టీ హోదా ఉండదనే సుప్రీంకోర్టు 1967లో ఇచ్చిన తీర్పును ధర్మాసనంలో సీజేఐ డీవై చంద్రచూడ్ సహా జస్టిస్ సంజీవ్ కన్నా,జస్టిస్ జేబీ పార్థీవాలా,జస్టిస్ మనోజ్మిశ్రాలు తోసిపుచ్చారు. ఇక ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్సీ శర్మ విభేదించారు. అయితే అలీగఢ్ యూనివర్సిటీకి మైనార్టీ హోదా ఉంటుందా ఉండదా అనే అంశాన్ని తేల్చేపనని ధర్మాసనం ముగ్గురు జడ్జిల ప్రత్యేక బెంచ్‌కు అప్పగించింది. కాగా, ఈ ఏడాది జనవరి చివరిలో ఈ కేసులో ఎనిమిది రోజుల పాటు వాదనలు విన్న అనంతరం ఫిబ్రవరి 1న సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది. శుక్రవారం సీజేఐ చంద్రచూడ్ చివరి పనిదినం కావడం గమనార్హం. ఆయన నవంబర్ 10 (ఆదివారం) రిటైర్ అవుతున్నారు.ఇదీ చదవండి: కోల్‌కతా హత్యాచార కేసు బదిలీకి సుప్రీం నో -
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్
-
‘నీట్’ పరీక్ష రద్దు లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నీట్ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 23) తుది తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుకాపీని చదివి వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.‘నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయి. పేపర్‌లీక్ వల్ల 155 మంది విద్యార్థులు మాత్రమే లబ్ధిపొందారు. పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదు. నీట్‌కు మళ్లీ పరీక్ష అక్కర్లేదు. నీట్‌పై అభ్యంతరాలను ఆగస్టు 24న వింటాం’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 14న వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) భావించినప్పటికీ.. ముందస్తుగానే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో జూన్ 4నే ఫలితాలు వెల్లడించింది. అయితే, పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమయ్యింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ.. బిహార్‌లో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసింది. నీట్-యూజీ పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను ఆదేశించింది. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలతో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది. -
సుప్రీంకోర్టులో యోగి ప్రభుత్వానికి షాక్
-
బంగ్లాదేశ్‌లో కోటా కట్
ఢాకా: బంగ్లాదేశ్‌ను అగ్నిగుండంగా మార్చిన రిజర్వేషన్ల వివాదానికి ముగింపు పలికే దిశగా సుప్రీంకోర్టు ఆదివారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. 1971లో బంగ్లా విముక్తి ఉద్యమంలో పాల్గొన్నవారి వారసులకు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటిదాకా కలి్పస్తున్న 30 శాతం కోటాలో భారీగా కోత విధించింది. కేవలం 5 శాతానికి పరిమితం చేసింది. వెనుకబడిన జిల్లాల ప్రజలకు, మహిళలకు 10 శాతం చొప్పున రిజర్వేషన్లు అమల్లో ఉండగా, న్యాయస్థానం వాటిని రద్దు చేసింది. గిరిజనులు/మైనార్టీలకు కల్పిస్తున్న 5 శాతం రిజర్వేషన్లను ఒక శాతానికి తగ్గించింది. దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు అమల్లో ఉన్న ఒక శాతం రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు చేయలేదు. మొత్తంగా 56 శాతం ఉన్న కోటాను ఏకంగా 7 శాతానికి కుదించడం గమనార్హం. 93 శాతం ప్రభుత్వ ఉద్యోగాలను కేవలం ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేసి, ప్రతిభావంతులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా తీవ్రంగా పోరాడుతున్న విద్యార్థులకు పాక్షిక విజయమే దక్కినట్లయ్యింది. రిజర్వేషన్లకు షేక్ హసీనా అనుకూలం ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అధికారంలో ఉన్న అవామీ లీగ్ పార్టీ బంగ్లా విముక్తి ఉద్యమానికి సారథ్యం వహించింది. సహజంగానే ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానంతో లబ్ధి చేకూరుతోంది. ఈ రిజర్వేషన్లను ప్రధానమంత్రి షేక్ హసీనా పరోక్షంగా సమరి్థస్తున్నారు. సొంతదేశం కోసం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో త్యాగాలు చేసిన సమరయోధుల కుటుంబాలకు సమున్నత గౌరవం ఇవ్వాలని ఆమె వాదిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా వివక్షతో కూడిన విధానమని విద్యార్థులు మండిపడుతున్నారు. రిజర్వేషన్లు పూర్తిగా పక్కనపెట్టి, కేవలం ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపట్టాలని పట్టుబడుతున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు క్రమంగా తగ్గిపోతుండడం, అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఉద్యోగాలు రిజర్వేషన్ల పేరిట కొన్ని కుటుంబాలకే దక్కుతుండడం, తమకు అన్యాయం జరుగుతుండడంతో విద్యార్థుల్లో అసహనం మొదలైంది. అదే చివరకు రిజర్వేషన్ల వ్యతిరేక పోరాటంగా మారింది. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్ట(బీఎన్పీ) సైతం విద్యార్థులకు అండగా నిలిచింది. ఎందుకీ ఆందోళనలు? 1971లో జరిగిన బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రాణత్యాగాలు సైతం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచి్చన తర్వాత వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానం తీసుకొచి్చంది. విముక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కలి్పంచింది. 2018లో ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించారు. దాంతో అప్పటి ప్రభుత్వం దిగివచి్చంది. రిజర్వేషన్లను నిలిపివేసింది. స్వాతంత్య్ర సమరయోధుల బంధువుల విజ్ఞప్తి మేరకు రిజర్వేషన్లను పునరుద్ధరిస్తూ ఈ ఏడాది జూన్‌లో బంగా>్లదేశ్ హైకోర్టు తీర్పు ప్రకటించడంతో విద్యార్థులు మళ్లీ భగ్గుమన్నారు. రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలంటూ పోరుబాట పట్టారు. వీధుల్లోకి వచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో షేక్ హసీనా ప్రభుత్వంలో కలవరం మొదలైంది. ఘర్షణల్లో విద్యార్థులు మరణిస్తుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతుండడంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రిజర్వేషన్లపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రిజర్వేషన్లు పూర్తిగా రద్దు చేయకుండా, అన్ని రకాల రిజర్వేషన్లను 7 శాతానికి పరిమితం చేస్తూ తీర్పు వెల్లడించింది. ఇందులో 5 శాతం బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు, 2 శాతం ఇతరులకు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆందోళనలు ఆపేదిలేదన్న విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకూ ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థి సంఘాల నేతలు తేలి్చచెప్పారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని, హింసకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయా లని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బంగ్లాదేశ్‌లో పరిస్థితి కొంత అదుపులోకి వచి్చంది. కర్ఫ్యూ నిబంధనలను ఇంకా సడలించలేదు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించలేదు. ఈ ఘటనలో మృతిచెందినవారు 150కి చేరినట్లు సమాచారం. ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు (శాతాల్లో) గతంలో ఇప్పుడు సమరయోధుల కుటుంబాలకు 30 5 వెనుకబడిన జిల్లాల ప్రజలకు 10 – మహిళలకు 10 – గిరిజనులు/మైనారీ్టలకు 5 1 దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు 1 1 -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక తీర్పు
-
మమత సర్కారుకు షాక్.. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సర్కారుకు కలకత్తా హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం(మే22)న కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓబీసీ కోటాలోని పలు క్లాసులు చట్ట విరుద్ధమని పేర్కొంటూ కొట్టివేసింది. 2010 తర్వాత నుంచి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేసింది.2012 పశ్చిమబెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు డివిజన్ బెంచ్ తెలిపింది. ఓబీసీ వర్గీకరణ చట్టవిరుద్ధంగా ఉందని స్పష్టంచేసింది.అయితే, ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆరోపించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎప్పటిలాగే అమలవుతాయన్నారు. -
సీమా హైదర్ కేసులో కొత్త మలుపు?
తన నలుగురు పిల్లలతో సహా అక్రమంగా భారత్‌కు వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ కేసు కొత్త మలుపు తిరిగింది. సీమా హైదర్ మొదటి భర్త గులాం హైదర్ తన పిల్లలను పాకిస్తాన్‌కు తిరిగి తెచ్చుకునేందుకు ఒక భారతీయ న్యాయవాదిని నియమించుకున్నారు. మానవ హక్కుల కార్యకర్త ఒకరు పాక్‌లోని కరాచీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సీమా, సచిన్ మీనాల కేసును ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఏటీఎస్ దర్యాప్తు చేస్తోంది. వీరిని నోయిడా పోలీసులు అరెస్టు చేసిన కొన్ని వారాల తర్వాత 2023 జూలైలో ఈ జంటను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. సీమా 2023 మేలో తన నలుగురు పిల్లలతో పాటు రబుపురా ప్రాంతంలో రహస్యంగా అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె పిల్లలందరూ ఏడేళ్లలోపు వారే. సీమా, మీనాలను గత ఏడాది జులై 4న అరెస్టు చేసిన స్థానిక కోర్టు జూలై 7న వారికి బెయిల్ మంజూరు చేసింది. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గల జాకోబాబాద్‌కు చెందిన సీమా హైదర్ కరాచీలోని తన ఇంటి నుంచి నేపాల్ మీదుగా గత ఏడాది మేలో తన పిల్లలతో కలిసి భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో సీమా భర్త గులాం హైదర్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. కాగా పాక్ న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ, సీమా భర్త గులాం హైదర్ తన నలుగురు పిల్లల సంరక్షణలో సహాయం కోసం తనను సంప్రదించారని చెప్పారు. ఈ నేపధ్యంలో తాము భారతీయ న్యాయవాది అలీ మోమిన్ సేవలను వినియోగించుకుంటున్నామన్నారు. అలాగే భారతీయ న్యాయస్థానాలలో చట్టపరమైన చర్యలను ప్రారంభించేందుకు పవర్ ఆఫ్ అటార్నీని పంపామని తెలిపారు. మానవ హక్కుల కార్యకర్త బెర్నీ ఒక ట్రస్ట్‌ను కూడా నడుపుతున్నారు. ఇది తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురయిన పిల్లలను వెదికేందుకు పనిచేస్తుంది. పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలకు సాయం అందించేందుకు కూడా ఆయన ముందుకు వచ్చారు. కాగా సీమా హైదర్ తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్‌కు తిరిగి వెళ్లనని స్పష్టం చేసింది. తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని సీమా పేర్కొంది. కాగా గులాం హైదర్ వాదన బలంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న వయసు కలిగిన పిల్లల మత మార్పిడి నిషేధమని బర్నీ తెలిపారు. సీమ ప్రస్తుతం భారత్‌లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని, వారు చిన్న వయస్సులో ఉన్నందున వారిపై పూర్తి హక్కులు తండ్రికి ఉంటాయని చట్టం చెబుతోందని ఆయన అన్నారు. గులాం హైదర్ తన భార్య నుండి ఏమీ కోరుకోవడం లేదని, కేవలం తన పిల్లలను మాత్రమే పాకిస్తాన్‌కు తీసుకురావాలని కోరుకుంటున్నాడని బర్నీ తెలిపారు. భారతదేశంలోని సీమా హైదర్, సచిన్ మీనా తరపు న్యాయవాది ఏపీ సింగ్ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన గురించి తమకు ఇంకా తెలియలేదని, దీని గురించి అధికారికంగా తెలియగానే స్పందిస్తామన్నారు. -
వేధింపుల కేసులో భారతీయ అమెరికన్ జంటకు 20 ఏళ్ల జైలు?
అమెరికాలోని వర్జీనియా ఫెడరల్ జ్యూరీ రెండు వారాల విచారణ అనంతరం ఒక భారతీయ అమెరికన్ జంటను దోషులుగా నిర్థారించింది. ఈ దంపతులు తమ బంధువును వేధించారని స్పష్టమైన నేపధ్యంలో జ్యూరీ వారిని దోషులుగా తేల్చిచెప్పింది. ఆ భారతీయ అమెరికన్ జంట తమ గ్యాస్ స్టేషన్, కన్వీనియన్స్ స్టోర్‌లో తమ బంధువును కార్మికునిగా నియమించుకునేందుకు బలవంతంగా ప్రయత్నించిందని ఫెడరల్ జ్యూరీ నిర్ధారించింది. ఈ కేసులో హర్మన్‌ప్రీత్ సింగ్(30), కుల్బీర్ కౌర్(43)లు దోషులుగా తేలడంతో వారికి 2024, మే 8న శిక్ష ఖరారు చేయనున్నారు. హర్మన్‌ప్రీత్ సింగ్, కుల్బీర్ కౌర్ దంపతులు తమ బంధువు చేత ఆహారాన్ని వండించడం, క్యాషియర్‌గా పని చేయించడం, స్టోర్ రికార్డులను శుభ్రపరచడం, నిర్వహించడం తదితర పనులు బలవంతంగా చేయించారు. ఇటువంటి కేసులలో గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. అలాగే 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జస్టిస్ డిపార్ట్మెంట్, పౌర హక్కుల విభాగానికి చెందిన అసిస్టెంట్ అటార్నీ జనరల్ క్రిస్టెన్ క్లార్క్ మాట్లాడుతూ ఈ దంపతులు.. యునైటెడ్ స్టేట్స్లో పాఠశాలకు వెళ్లాలనే బాధితుని ఆశను అణగార్చారని, శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని అన్నారు. బాధితుని ఇమ్మిగ్రేషన్ పత్రాలను దాచేయడం, తీవ్రమైన హాని కలిగించే ఇతర బెదిరింపులకు గురిచేయడం, కనీస వేతనం కూడా చెల్లించకపోవడం, అధికంగా పనిచేయించడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని అసిస్టెంట్ అటార్నీ జనరల్ పేర్కొన్నారు. యూఎస్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ వర్జీనియా అటార్నీ జెస్సికా డి'అబెర్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితులు తప్పుడు హామీలతో బాధితుని ఇక్కడకు తీసుకువచ్చి, మానసిక, శారీరక వేధింపులకు గురిచేశారన్నారు. మానవ అక్రమ రవాణా అనేది సమాజంలో అత్యంత జుగుప్సాకరమైన నేరమని, అయితే ఈ కేసులో బాధితునికి న్యాయం జరిగేలా హామీ ఇచ్చినందుకు ప్రాసిక్యూటర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తమ వాదనలో.. 2018లో నిందితులు.. ఆ సమయంలో మైనర్‌గా ఉన్న బాధితుని స్కూల్లో చేర్పిస్తామంటూ తప్పుడు వాగ్దానాలతో యునైటెడ్ స్టేట్స్కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. బాధితుతుడు అమెరికా వచ్చాక అతని ఇమ్మిగ్రేషన్ పత్రాలను తీసుకొని, తమ పనులలో నియమించుకున్నారు. బాధితుని దుకాణం పర్యవేక్షణలో నియమించారు. కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే అందించారు. బాధితుడు కోరినప్పటికీ వైద్య సంరక్షణ, విద్యను అందించడానికి నిరాకరించారు. బాధితునిపై నిరంతర నిఘా ఉంచారు. భారతదేశానికి వెళ్లిపోతాననే బాధితుని అభ్యర్థనను సింగ్ దంపతులు తిరస్కరించారు. వీసా గడువు దాటినా బాధితుని పనులలో కొనసాగేలా నిర్బంధించారు. బాధితుడు తన ఇమ్మిగ్రేషన్ పత్రాలను తిరిగి అడిగినపుడు సింగ్.. బాధితుని జుట్టు పట్టుకుని లాగి, చెంపమీద కొట్టి, కాలితో తన్నాడు. బాధితుడు తనకు ఒక రోజు సెలవు కావాలని అడిగితే రివాల్వర్‌తో బెదిరించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. -
20 ఉత్తుత్తి బెదిరింపు కాల్స్.. నాలుగేళ్లు నిజమైన జైలు?
అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఒక యువకుడు ఒకేరోజు నాలుగు నేరాలకు పాల్పడి, దోషిగా నిలిచాడు. అమెరికా, కెనడాలలో 20కిపైగా బెదిరింపు కాల్స్ చేశాడు. బాంబు దాడులు, కాల్పులు, ఇతర బెదిరింపులకు పాల్పడి, ప్రభుత్వ అత్యవసర విభాగాలలో గాభరా పుట్టించాడు. అస్టన్ గార్సియా(21) అనే యువకుడు టకోమాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో తన నేరాన్ని ఒప్పుకున్నాడు. రెండు దోపిడీలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన బెదిరింపులలో గార్సియా తన నేరాన్ని అంగీకరించినట్లు యుఎస్ అటార్నీ టెస్సా ఎం. గోర్మాన్ ఒక వార్తా ప్రకటనలో తెలిపారు. గార్సియాపై తొలుత 10 నేరాలు మోపారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మాట్లాడుతూ గార్సియా 2022, 2023లో బెదిరింపు కాల్స్ చేసే సమయంలో తన గుర్తింపును దాచేందుకు వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించాడని చెప్పారు. దీనిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ డిస్కార్డ్లో ప్రసారం చేస్తూ, అందరినీ వినాలని కూడా గార్సియా కోరేవాడన్నారు. గార్సియా తాను టార్గెట్ చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. డబ్బు, క్రెడిట్ కార్డుల సమాచారం లేదా అసభ్యకరమైన చిత్రాలను పంపించకపోతే ప్రభుత్వ అత్యవసర సిబ్బందిని వారి ఇళ్లకు పంపిస్తానని బెదిరించేవాడు. గార్సియా.. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లోని ఫాక్స్ న్యూస్ స్టేషన్‌కు ఫోన్ చేసి, లాస్ ఏంజెల్స్‌కు వెళ్లే విమానాలలో బాంబు ఉన్నదంటూ వదంతులు వ్యాప్తి చేశాడు. అలాగే బిట్‌కాయిన్ రూపంలో భారీ మొత్తాన్ని అందించకపోతే లాస్ ఏంజిల్స్‌లోని విమానాశ్రయంలో బాంబు పెడతానని బెదిరించాడు. 2017లో గార్సియా ఇటువంటి బెదిరింపు కాల్ప్ చేసి, తప్పుదారి పట్టించిన నేపధ్యంలో కాన్సాస్‌లో ఒక పోలీసు అధికారి ఒక వ్యక్తిని కాల్చి చంపారు. కాగా బ్రెమెర్టన్కు చెందిన గార్సియాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు సూచించారు. గార్సియాకు ఏప్రిల్‌లో శిక్ష ఖరారు కానుంది. అమెరికాలోని వాషింగ్టన్, కాలిఫోర్నియా, జార్జియా, ఇల్లినాయిస్, కెంటుకీ, మిచిగాన్, మిన్నెసోటా, న్యూజెర్సీ, ఒహియో, పెన్సిల్వేనియా, కొలరాడో, కెనడాలోని అల్బెర్టాలో గల అత్యవసర ఏజెన్సీలకు గార్సియా బెదిరింపు కాల్ చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. గార్సియాను వాషింగ్టన్‌లోని సీటాక్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్లో ఉంచి విచారిస్తున్నారు. -
క్వాష్ పై బాబు పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలేనా ?
-
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. దీనిపై సోమవారం వెలువరించిన తీర్పులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు నిచ్చింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాజు నాడు దీనిపై ఒప్పందం చేసుకున్నారని సుప్రీం కోర్టు వివరించింది. ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించిందని, కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదని పేర్కొంది. అలాగే రాష్ట్రపతి అధికారాలను ప్రతిసారి న్యాయపరిశీలనకు తీసుకోవడం సాధ్యంకాదని సీజేఐ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆర్టికల్ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు? వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించండి జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. కాగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే దీనిని స్థానిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో కశ్మీర్లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
చంద్రబాబు స్కాంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు..!
-
మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు
-
హైకోర్ట్ తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపట్టు: రేవంత్
-
చంద్రబాబు తీర్పుపై ఉత్కంఠ
-
చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు
-
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు
వాషింగ్టన్: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ హెచ్–1బీ వీసాలతో భారత్‌వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్ కార్డ్ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ తెలిపింది. అభినందనీయం ‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్‌సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
నోట్ల రద్దుపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుందో?
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులపై సంబంధిత రికార్డులను సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐలను ఆదేశించి డిసెంబర్ 7న తీర్పును రిజర్వు చేసింది. సోమవారం నాటి సుప్రీంకోర్టు షెడ్యూల్ ప్రకారం నోట్ల రద్దు అంశంపై రెండు వేర్వేరు తీర్పులుంటాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ బీవీ నాగరత్న ఇచ్చే ఈ తీర్పులు ఏకీభవిస్తాయా, భిన్నంగా ఉంటాయా అనేది స్పష్టంగా తెలియలేదు. ధర్మాసనంలో వీరితోపాటు జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ ఉన్నారు. -
బిగ్ క్వశ్చన్ : సుప్రీం తీర్పుపై ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్
-
అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
గర్భం వద్దనుకుంటే భర్త అనుమతి అవసరం లేదు: హైకోర్టు
కొచ్చి: గర్భం వద్దనుకుంటే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (ఎంటీపీ యాక్ట్ కింద 20 నుంచి 24 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు) కింద భర్త అనుమతి అవసరం లేదని కేరళ ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు భర్త నుంచి విడిపోయానని చెప్పుకునే మహిళ సైతం తన గర్భాన్ని తొలిగించాలనుకుంటే ఎంటీపీ యాక్ట్ కింద భర్త అనుమతి అవసరం లేదంటూ కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. గర్భిణీ స్తీకి చట్టబద్దంగా విడాకులు తీసుకున్న లేదా వింతంతువు కానప్పటికీ గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో పలు మార్పులు వస్తే తాను ప్రెగ్నెన్సీని కొనసాగించమనే హక్కు భర్తకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు పిటిషనర్ తాను డిగ్రీ చదువుతుండగా అదే ప్రాంతంలో బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నట్లు పిటిషన్లో పేర్కొంది. వివాహం అనంతరం తన భర్త ఆమె తల్లి కట్నం కోసం వేధిస్తూ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది. అదే సమయంలో తాను ప్రెగ్నెంట్‌గా ఉండటంతో మరింత వేధింపులు అధికమయ్యాయని, దీనికి తోడు ఎలాంటి ఆర్థిక భరోసా ఇవ్వకపోవడంతో అతడిని విడిచి వేరుగా ఉంటున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో ఆమె తన గర్భాన్ని తొలగించుకుందామని ఆస్పత్రికి వెళ్లితే వైద్యులు అందుకు నిరాకరిచండమే కాకుండా విడాకులు తీసుకున్నట్లు పత్రాలు సమర్పించాలని చెప్పారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ వీజీ అరుణ్ వింతంతువు లేదా చట్ట బద్ధంగా విడిపోయిన వాళ్లకు వర్తించే ఎంటీపీ చట్టంలోకి గర్భధారణ సమయంలో వైవాహిక జీవితంలో మార్పులు సంభవించిన మహిళలను కూడా చేరుస్తూ చారిత్రాత్మక తీర్పుని వెలువరించారు. పైగా సదరు మహిళలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేశారు. అంతేగాదు సదరు పిటిషనర్‌కి గర్భం తొలగించుకునేందుకు అనుమతించడమే కాకుండా అందుకు అవసరమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. (చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల వేళ ఎదురవుతున్న సంక్షోభాలు... ఆదుకోమంటూ ఆ నాయకుడికి పిలుపు) -
ఆరేళ్ళ బాలికపై లైంగిక దాడి కేసులో ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు
-
న్యాయమైన ప్రయత్నం!
మరణశిక్షపై మళ్ళీ ఒకసారి చర్చ మొదలైంది. ఒకే అంశానికి సంబంధించి ఒక్కో కేసులో ఒక్కో రకమైన తీర్పులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతి పెద్ద శిక్షల విధింపుపై ఆలోచన మొదలైంది. మరణశిక్ష తీర్పుల విషయంలో నిర్ణీత నియమాలు ఏర్పరిచే అంశాన్ని సుప్రీమ్ కోర్టు తనకు తానుగా చేపట్టి, అయిదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సోమవారం నివేదించింది. మరణశిక్షపై వాదనలు ఎప్పుడు, ఎలా వినాలనే దానిపై పరస్పర విరుద్ధ తీర్పులు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బెంచ్ తెలిపింది. ఆలోచించి, అత్యంత సంయమనంతో విధించాల్సిన ఉరిశిక్షను నేరం రుజు వైన రోజే ప్రకటిస్తున్న కోర్టులు, కేసులు ఇప్పుడు అనేకం. అందుకే, శిక్ష పడ్డ వ్యక్తికి ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పద్ధతుల్లో మార్పు కోసం సుప్రీమ్ చేపట్టిన ఈ చర్య కచ్చితంగా ఆహ్వానించదగ్గది. ఇప్పటికి 42 ఏళ్ళ క్రితం 1980లో బచ్చన్ సింగ్ వర్సెస్ పంజాబ్ ప్రభుత్వం కేసులో అయిదుగురు సభ్యుల సుప్రీమ్ ధర్మాసనం మరణశిక్షను సమర్థిస్తూనే, ‘అత్యంత అరుదైన’ సందర్భాల్లోనే ఉరిశిక్ష వేయాలంటూ రక్షణ కవచం ఇచ్చింది. గత నాలుగు దశాబ్దాలలో అది ఎంత సమర్థంగా అమలైందంటే అనుమానమే. అరుదైన సందర్భాలంటే ఏమిటనే దానికి ఎవరి వ్యాఖ్యానం వారిది కావడమూ దానికో కారణం. తీవ్రవాద కేసుల్లో తప్ప మిగతావాటిలో మరణశిక్ష విధించరాదంటూ, 2015 నాటి లా కమిషన్ నివేదిక ఏకంగా ఉరిశిక్ష రద్దుకు సిఫార్సు చేసింది. ఇప్పటికే 144కి పైగా దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి. భారత్‌లో మాత్రం దీనిపై ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి. అంతకన్నా విచిత్రమేమిటంటే – కొద్దికాలంగా మన దగ్గర మరణశిక్ష తీర్పులు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అటు పూర్తి ఉరిశిక్ష రద్దుకూ, ఇటు ప్రతి చిన్న నేరానికీ ఉరిశిక్ష విధించే దూకుడుకూ మధ్య సమతూకం అవసరం. ఉరిశిక్ష విధింపునకు సంబంధించిన విధివిధానాలకు మరింత కట్టు దిట్టం చేసి, అంతటా ఒకే రకమైన ఉన్నత ప్రమాణాలు పాటించేలా చూడడం తప్పనిసరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఏకరూప నియమావళిని రూపొందించే పనిని సుప్రీమ్ భుజానికి ఎత్తుకుంది. కులం, మతం, వర్గం లాంటి దుర్విచక్షణ ఉరిశిక్ష విధింపుపైనా ప్రభావం చూపుతోందనేది నిష్ఠురసత్యం. ఇది వివిధ అధ్యయనాల మాట. ఢిల్లీ నేషనల్ లా యూనివర్సిటీకి చెందిన నేర సంస్కరణల అనుకూలవాద బృందం ‘ప్రాజెక్ట్ 39ఏ’ 2016లో 385 మంది ఉరిశిక్ష ఖైదీల వివరాలను విశ్లేషించింది. ఉరిశిక్ష పడ్డవారిలో 76 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలవారే. ఇక, నాలుగింట మూడొంతుల మంది ఆర్థికంగా వెనకబడ్డవారు. ఒక వర్గంపై సమాజంలో ఉండే చిన్నచూపు మరణశిక్ష విధింపులోనూ కొనసాగుతోందనిపిస్తోంది. ఇక, 2020లో ఆ బృందమే జరిపిన మరో అధ్యయనంలో ఇంకొక చేదునిజం బయటకొచ్చింది. 2000కూ, 2013కూ మధ్య ఢిల్లీలో కింది కోర్టులు 80 ఉరిశిక్షలు విధించగా, తర్వాత హైకోర్టులో 60 శాతానికి పైగా కేసుల్లో ఆ శిక్ష తగ్గడమో, రద్దవడమో జరిగింది. సమాజంలోని భావావేశాలు సైతం కొన్నిసార్లు ఉరిశిక్ష విధింపునకు దారి తీస్తున్నాయట. ఇలా వివిధ ప్రభావాలు, కోర్టు కోర్టుకూ తీర్పులు మారి పోవడంపై ఇప్పటికైనా నిజాయతీగా దృష్టి పెట్టి, సరిదిద్దాల్సిన అవసరం ఉంది. నిజానికి, ముంబయ్ 26/11 దాడి, 2001లో పార్లమెంట్‌పై దాడి, ‘నిర్భయ’ లాంటి తీవ్రమైన కేసుల్లోనే నేరస్థులకు ఉరిశిక్ష అమలవుతోంది. కానీ, దిగువ కోర్టులు ఏటా పదులకొద్దీ కేసుల్లో ఉరి శిక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఉరిశిక్ష వేయడానికి వీలు కల్పించే భారత శిక్షాస్మృతిలోని 302వ సెక్షన్, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా), పసిపిల్లలపై లైంగిక అత్యాచారాలకు సంబం ధించిన ‘పోక్సో’ చట్టం వగైరాలను అవసరానికి మించి అతి చొరవతో చేతుల్లోకి తీసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయని విమర్శ. సంపన్న వర్గాలతో పోలిస్తే ఆర్థికంగా నిరుపేదలకు నాణ్యమైన న్యాయసేవలు అందవనేది జగద్విదితం. అలాంటి సందర్భంలో మరణశిక్ష పడ్డ అమాయకులు కోర్టులో తమ వాదనను సమర్థంగా వినిపించుకోలేక అన్యాయమైపోతున్నారు. అందుకే, సర్వోన్నత న్యాయ స్థానం సైతం నేరస్థుడి సామాజిక నేపథ్యం, వయస్సు, విద్యార్హతలు, కుటుంబ పరిస్థితులు, మానసిక స్థితి, శిక్షానంతర ప్రవర్తన లాంటివన్నీ చూడాలంటోంది. ఆ కీలక అంశాలను బట్టి నింది తుడికి ఉరిశిక్ష అమలుపై నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టులకు నొక్కి చెబుతోంది. ఆ అంశాల రీత్యా నిందితుడికి శిక్షలో ఉపశమన చర్యలు అందించే వీలు పరిశీలించాలనేదే భావం. చాలా సందర్భాల్లో సుప్రీమ్ మార్గదర్శకాల స్ఫూర్తిని దిగువ కోర్టులు అక్షరాలా పాటిస్తున్నాయ నుకోలేం. ఇప్పటికీ రాజద్రోహం లాంటి కాలం చెల్లిన చట్టాలపై సుప్రీమ్ చూపిన మార్గంలో దిగువ కోర్టులు వెళుతున్నట్టు లేదు. ఐటీ చట్టంలోని ‘సెక్షన్ 66ఏ’ లాంటివి సుప్రీమ్ కొట్టేసినా, కింది కోర్టు లకు అది పట్టినట్టు లేదు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షల విధింపునకు స్పష్టమైన నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడమే కాక, దిగువ కోర్టుల్లోనూ అది అమలయ్యేలా చూడాలి. వంద మంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ, ఒక్క అమాయకుడికైనా శిక్ష పడకూడదనేది అంతటా అంగీకరించే న్యాయసూత్రం. ఉరిశిక్ష పడుతున్న ఖైదీల విషయంలో అది అమలు కావాలంటే, నింది తుడి తరఫు వాదనలూ సాకల్యంగా వినాలి. అందుకు న్యాయబద్ధమైన అవకాశమిస్తూ, మార్గదర్శ కాలు రూపొందించే ప్రయత్నమే ప్రస్తుతం జరగనుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మేలు. -
ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు తీర్పు
ముస్లిం అమ్మాయిల పెళ్లి విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. షరియా లా ప్రకారం.. ముస్లిం అమ్మాయి 16 ఏళ్లకు పెళ్లి చేసుకోవడం సరైనదేనని స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. రెండు వారాల క్రితం పెళ్లి చేసుకున్న ఈ జంట తమకు రక్షణ కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించింది. ఈ జంట జూన్ 8వ తేదీన ఇస్లామిక్ పద్ధతుల ప్రకారం వివాహం చేసుకున్నారు. అనంతరం వారి పెళ్లిని నిరాకరిస్తూ.. కుటుంబ సభ్యులు బెదిరింపులకు గురి చేశారు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 సంవత్సరాల వయస్సు, అబ్బాయికి 21 ఏళ్లు వచ్చినప్పుడు ఆమె ఇష్టానుసారం వివాహం చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా కోర్టు తన తీర్పులో ఇస్లామిక్ చట్టాన్ని ఉదహరిస్తూ.. షరియా చట్టం ప్రకారం పురుషులు, మహిళలు 15 సంవత్సరాల వయస్సులో పెద్దలుగా పరిగణిస్తారని స్పష్టం చేసింది. వారిద్దరూ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న కారణంగా ప్రాథమిక హక్కులను తిరస్కరించలేమని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలో వారి వివాహానికి ఆమోదం తెలిపింది. A single-judge bench of the Punjab and Haryana High Court upheld a minor's marriage, ruling that Muslim girls can marry of their own free will at 16. Read more: #ITCard #Muslims #Punjab #Haryana #HighCourt #News #India (@sardakanu_law @mewatisanjoo) pic.twitter.com/JGQsPpdcD5 — IndiaToday (@IndiaToday) June 20, 2022 ఇది కూడా చదవండి: మోదీ జీ.. మీ దోస్త్‌ను అడిగి తెలుసుకోండి అంటూ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ -
అబార్షన్ చట్టంపై అమెరికా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
వాషింగ్టన్: అబార్షన్ హక్కులపై అమెరికాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ముసాయిదా లీకవడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. ఆందోళనకారులు వాషింగ్టన్ డీసీలోని సర్వోన్నత న్యాయస్థానం భవనాన్ని చుట్టుముట్టారు. తమ హక్కులను కాలరాయవద్దంటూ నినాదాలు చేశారు. లీకైన ముసాయిదాలో ఏముందంటే.. అబార్షన్ హక్కులపై 1973లో రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును జస్టిస్ శామ్యూల్ ఆలిటో రద్దు చేస్తున్నట్టు లీకైన ముసాయిదాలో ఉంది. రో వర్సెస్ వేడ్ కేసులో ఇచ్చిన వివరణ చాలా బలహీనంగా ఉందని, దాని పరిణామాలు ప్రమాదకరంగా ఉన్నట్లు జస్టిస్ అలిటో అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పు సరిగా లేదని లీకైన డాక్యుమెంట్‌పై విమర్శలు వస్తున్నాయి. అబార్షన్ హక్కులపై తీర్పు లీకైన సమాచారంపై సుప్రీంకోర్టు కానీ వైట్‌హౌజ్ కానీ ఇంతవరకు స్పందించలేదు. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని ఎన్నికైన ప్రతినిధులకు ఇవ్వాలన్న అభిప్రాయాన్ని ఆ ముసాయిదాలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోమవారం కొందరు సుప్రీంకోర్టు ముందు నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనలు తారా స్థాయికి చేరుకున్నాయి. కాగా జూలైలో అబార్షన్ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించాల్సి ఉంది. చదవండి: నిరసనకారులను కాల్చి చంపేయమని ఆదేశించిన ట్రంప్ -
10 ఏళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించనున్న నాంపల్లి కోర్టు
-
అక్బరుద్దీన్ విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో నేడు తుది తీర్పు
-
అక్బరుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై నేడు కోర్టు తీర్పు
-
హిజాబ్ వ్యవహారం: అందుకే హైకోర్టు అలాంటి తీర్పు ఇచ్చింది
నెలరోజుల ఘర్షణ వాతావరణానికి, ఉద్రిక్తతలకు తెరదించుతూ కర్ణాటక హైకోర్టు హిజాబ్ వ్యవహారంపై తీర్పు ఇచ్చింది. హిజాబ్ ధరించడం మత ఆచారం కాదని తేల్చి చెప్పింది. క్లాసు రూముల్లో హిజాబ్ వేసుకురావడంపై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ ఐదు వ్యాజ్యాలను కొట్టేసిన కోర్టు ‘హిజాబ్ ఇస్లాంలో తప్పనిసరి మతాచారం కాద’ని తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా.. హిజాబ్ తీర్పుపై కేంద్రం తరపున హర్షం వ్యక్తం అయ్యింది. ‘‘కోర్టు తీర్పును మేం స్వాగతిస్తున్నాం. దేశం ముందుకు వెళ్లాలని నేను కోరుకుంటున్నా. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ శాంతిని పాటించాలి.. కోర్టు తీర్పును గౌరవించాలి. విద్యార్థుల ప్రాథమిక పని చదవుకోవడం. కాబట్టి, ఇవన్నీ పక్కనపెట్టి అంతా కలిసి కట్టుగా చదువుకోండి’’ అంటూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఆర్డర్ కాపీలో అంశాల ప్రకారం.. హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హఠాత్తుగా అదీ అకడమిక్ ఇయర్ మధ్యలో.. హిజాబ్ వివాదం ఎలా పుట్టుకొచ్చిందని అనుమానాలు వ్యక్తం చేసిన బెంచ్.. దీనివెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాల్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వాలదే అధికారం: హైకోర్టు కర్నాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని సమర్థించింది. వ్యక్తిగత ఎంపిక కంటే సంస్థాగత క్రమశిక్షణ ప్రబలంగా ఉంటుంది. ఈ తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 యొక్క వివరణలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది. బహుశా అందుకే కోర్టు హిజాబ్‌పై ఇలాంటి తీర్పు ఇచ్చి ఉంటుందని అడ్వొకేట్ జనలర్ ప్రభూలింగ్ నవద్గి అభిప్రాయపడ్డారు. మరోవైపు ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ‘‘ముస్లిం మహిళలు హిజాబ్ వేసుకోవాలనేది మత ఆచారం కాదు. ఇస్లామిక్ విశ్వాసం కూడా కాదు. విద్యార్థులెవరూ యూనిఫాంపై అభ్యంతరాలు వ్యక్తం చేయరాదు. విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫాంను ధరించే స్కూలుకు రావాల్సి ఉంటుంది. యాజమాన్యాలు విద్యార్థులకు యూనిఫాంను పెట్టడం సహేతుకమైన చర్యే. అది యాజమాన్యాల ప్రాథమిక హక్కు. కాబట్టి అందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి అన్ని అధికారాలూ ఉంటాయి. జీవోలనూ పాస్ చేయవచ్చు’’ అని తేల్చి చెప్పింది. హిజాబ్ లను ధరించి వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించని కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఉడుపి కాలేజీ అభివృద్ధి కమిటీ చైర్మన్ (స్థానిక ఎమ్మెల్యే), వైస్ చైర్మన్ లను తొలగించాలన్న విద్యార్థుల అభ్యర్థనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఆ పిటిషన్లన్నింటినీ సమగ్రంగా విచారించిన కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్. దీక్షిత్, జస్టిస్ జె.ఎం. ఖాజీల నేతృత్వంలోని హైకోర్టు బెంచ్.. ఇవాళ వాటిని కొట్టేసింది. మతపరమైన దుస్తులను వేసుకురావడానికి బదులు విద్యార్థులంతా యూనిఫాంను వేసుకురావడమే సహేతుకమని స్పష్టం చేసింది. కర్ణాటక ప్రభుత్వ స్పందన ఇది మరోవైపు హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై స్పందించారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రతీ ఒక్కరూ కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని అన్నారు. లా అండ్ ఆర్డర్ మెయింటెన్ చేస్తూనే.. పిల్లల భవిష్యత్తును, వాళ్ల చదువును పరిరక్షించే ప్రయత్నం చేస్తామని అన్నారాయన. ఇక కర్ణాటక విద్యాశాఖ మంత్రి నగేశ్ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని కర్ణాటక హైకోర్టు సమర్థించినందుకు సంతోషంగా ఉంది. కోర్టుకు వెళ్లిన అమ్మాయిలు తీర్పును పాటించాలని నేను అభ్యర్థిస్తున్నాను, ఇతర విషయాల కంటే చదువు ముఖ్యం అని అన్నారాయన. కాగా, తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని పిటిషనర్లు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ అంశంపై చర్చలు జరుపుతున్నామని, తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత దానిని విశ్లేషించి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని పిటిషనర్ల తరఫు అడ్వొకేట్ షాహుల్ చెప్పారు. కోర్టు తీర్పుపై పలువురు నేతలు, ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. HC verdict on Hijab row | Everyone should follow court order for benefit of children. It is a question of fate & education of our children. Necessary arrangements have been made to maintain law and order: Karnataka CM Basavaraj Bommai pic.twitter.com/5aw1GiKoX1 — ANI (@ANI) March 15, 2022 I welcome the HC's decision. Muslim students of the state faced problems for a long time. Someone had misguided them that's why there was this issue. Quality education should be given to all students, so everyone should accept the order: Karnataka Min KS Eshwarappa #HijabRow pic.twitter.com/R4Ni7mlSQn — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the judgment of the Karnataka High Court; it's a very important step towards strengthening the educational opportunities & rights of girl students, especially for those belonging to the Muslim community: BJP MP Tejasvi Surya pic.twitter.com/xBSTurLxiB — ANI (@ANI) March 15, 2022 #HijabVerdict | I welcome the decision of the Karnataka High Court, as it is firstly not a religious practice, as per Quran. Secondly, when a student enters an institute, they must follow the rules & regulations...: Rekha Sharma, Chairperson, National Commission for Women pic.twitter.com/YDuu3JO9F1 — ANI (@ANI) March 15, 2022 -
హిజాబ్ వివాదంపై కర్నాటక హైకోర్టు కీలక తీర్పు
-
హిజాబ్ వివాదం.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, బెంగళూరు: హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదని ప్రకటించింది. విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సమర్థించింది. దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థీ, జస్టిస్ కృష్ణ ఎస్.దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం.వాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 129 పేజీలు తీర్పు వెలువరించింది. తీర్పును సవాలు చేస్తూ కొందరు మంగళవారమే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. తీర్పు మత విశ్వాసాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు, గోప్యతకు భంగం కలిగించేలా ఉందని పేర్కొన్నారు. తామూ సుప్రీంకు వెళ్తామని వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు మౌలానా షఫీ తెలిపారు. హిజాబ్ ధారణ గురించి ఖురాన్లో స్పష్టంగా ఉందని, ఏ ఆధారాలతో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. తీర్పును ముస్లిం విద్యార్థినులు వ్యతిరేకించారు. కర్ణాటకలో పలుచోట్ల వారు పరీక్షలు బహిష్కరించారు. చదువుతో పాటు హిజాబ్ కూడా ముఖ్యమేనని, దాన్ని ధరించి తీరతామని అన్నారు. 11 రోజుల విచారణ కర్ణాటకలో జనవరిలో మొదలైన హిజాబ్ వివాదం రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే. హిజాబ్‌కు పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించడంతో వివాదం మరింత రాజుకుంది. దాంతో రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థల్లో యూనిఫాం తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న ఉత్తర్వులిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ పలు సంఘాలతో పాటు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. స్కూళ్లు, కాలేజీల్లో హిజాబ్ ధరించేందుకు అవకాశం కల్పించాలని, ప్రభుత్వ జీవోను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. సింగిల్ బెంచ్ కేసును స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం 11 రోజులు విచారణ జరిపి తీర్పును రిజర్వు చేసింది. సీజే ఇంటికి భద్రత తీర్పు నేపథ్యంలో బెంగళూరులో సీజే, మిగతా ఇద్దరు న్యాయమూర్తుల నివాసాలకు పోలీసు భద్రత పెంచారు. రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. ►వివాదంపై హైకోర్టు మంచి తీర్పు ఇచ్చింది. విద్యార్థులకు చదువు కంటే ఏదీ ముఖ్యం కాదు. కోర్టు ఆదేశాలను అంతా పాటించాలి. శాంతిభద్రతలను కాపాడాలి. –సీఎం బసవరాజు బొమ్మై ►పిల్లలకు చదువు ముఖ్యం. హైకోర్టు ఆదేశాలను పాటించాలి. –జేడీఎస్ఎల్పీ నేత కుమారస్వామి ►హైకోర్టు తీర్పును శిరసావహించాలి. తీర్పును చదివాక పూర్తిగా స్పందిస్తా. –సీఎల్పీ నేత సిద్ధరామయ్య ►హిజాబ్ ధారణ గురించి ఖురాన్లో స్పష్టంగా ఉంది. – వక్ఫ్ బోర్డు కీలకమైన నాలుగు ప్రశ్నలు, సమాధానాలు కేసుకు సంబంధించి నాలుగు ప్రముఖ వివాదాంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 1.ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం హిజాబ్ లేదా స్కార్ఫ్ ధరించడం తప్పనిసరి ఆచరణా. హిజాబ్ ధరించడం ఆర్టికల్ 25 కింద సమర్థనీయమేనా? ధర్మాసనం: ఇస్లాం ధర్మం ప్రకారం ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం తప్పనిసరేమీ కాదు. 2.విద్యా సంస్థల్లో యూనిఫాంను తప్పనిసరి చేయడం ఆర్టికల్ 19 (1) కింద వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం, ఆర్టికల్ 21 కింద వ్యక్తి హక్కును కాలరాయడం అవుతుందా? ధర్మాసనం: విద్యా సంస్థల్లో యూనిఫాంపై నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. కొన్ని అంశాల్లో నిషేధాజ్ఞలను విధించడం ప్రభుత్వానికున్న రాజ్యాంగ హక్కు. దీన్ని విద్యార్థులు ప్రశ్నించడానికి వీల్లేదు. 3.యూనిఫాం జీవో నిబంధనలకు వ్యతిరేకమా? ఆర్టికల్ 14, 115లను ఉల్లంఘించడమా? ధర్మాసనం: జీవోలో ఎలాంటి ఉల్లంఘన, చట్ట వ్యతిరేక చర్య లేవు. 4.విద్యార్థులు తరగతులకు హాజరయ్యేలా, అందుకు కాలేజీలు అభ్యంతరపెట్టకుండా ఆదేశాలివ్వాలా? ధర్మాసనం: అవసరం లేదు. -
హిజాబ్ వద్దు..కాషాయం వద్దు కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
-
కోర్టు శిక్ష: కలెక్టర్‌గారు అనాథాశ్రమంలో ఉండండి
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు శిక్ష పడింది. ఎవరికీ లేనటువంటి వినూత్న శిక్ష విధిస్తూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ప్రతివారం రెండు గంటల పాటు నల్గొండ జిల్లాలోని అనథాశ్రమంలోని పిల్లలతో గడపాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది ఆరు నెలలపాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలతో ధిక్కరణ కేసులో కలెక్టర్‌కు విముక్తి లభించింది. కోర్టు ఇలాంటి సామాజిక సేవ తీర్పు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇదే కోర్టు ధిక్కారణ కేసులో మరో అధికారి సంధ్యారాణికి కూడా తెలంగాణ హైకోర్టు శిక్ష విధించింది. ఉగాది, శ్రీరామనవమికి హైదరాబాద్‌లోని అనాథాశ్రయంలోని పిల్లలకు భోజనాలు సమకూర్చాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే వీరికి గతంలో జరిమానా విధించగా ఆ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లారు. దీంతో వారిని సామాజిక సేవ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. -
30న బాబ్రీ కేసుపై తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. బీజేపీ దిగ్గజ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి సహా నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని తీర్పును వెల్లడించనున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్కే యాదవ్ కోరారు. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసానికి దారితీసేలా కుట్రపూరితంగా వ్యవహరించారని బీజేపీ దిగ్గజ నేతలపై ఆరోపణలున్నాయి. రాముడి జన్మస్థలంలో మసీదు ఉందని నమ్మడంతో కరసేవకులు ఈ కట్టడాన్ని నేలమట్టం చేశారు. బాబ్రీ కూల్చివేతపై అద్వానీ (92) జులై 24న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక న్యాయస్దానం ఎదుట స్టేట్మెంట్ రికార్డు చేశారు. అంతకుముందు రోజు మురళీ మనోహర్ జోషీ (86) తన స్టేట్మెంట్ రికార్డు చేశారు. తమపై నమోదైన అన్ని అభియోగాలను వారు తోసిపుచ్చారు. ఇక బాబ్రీ కేసులో న్యాయస్ధానం ఎలాంటి తీర్పు వెలువరించినా ఇబ్బంది లేదని బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి స్పష్టం చేశారు. చదవండి : బాబ్రీ మసీదు పరిమాణంలోనే కొత్త మసీదు! -
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో తుదితీర్పు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్ట్ కొట్టివేసింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం లేదంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ప్రభుత్వ ఆర్డినెన్స్, జీవోలను సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేశ్ కుమర్‌తో పాటు మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, వడ్డే శోభనాద్రీశ్వరరావు, టీడీపీ నేత వర్ల రామయ్య తదితరులు మొత్తం 13 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది. చదవండి: ‘నక్క అరిస్తే సింహం గర్జించినట్లు కాదు’ -
ఊపిరిపీల్చుకున్న హాజీపూర్
బొమ్మలరామారం: హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష వేసిన నేపథ్యంలో ఇన్నాళ్లు ఉత్కంఠగా ఎదురుచూసిన గ్రామస్తులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. కంటతడిపెడుతూ తమ పిల్లల ఉసురు తగిలిందని బాధితకుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామస్తులు బాణసంచా కాల్చారు. పలువురు మహిళలు స్వీట్లు తినిపించుకుంటూ కనిపించారు. ఉదయం నుంచి ఎదురుచూపులు సైకో శ్రీనివాస్‌రెడ్డికి కోర్టు ఏ శిక్ష వేస్తుందో నని గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు ఉదయం నుంచి ఎదురుచూశారు. ఉదయం 6 గంటల నుంచే గ్రామపంచాయతీ ఆవరణకు చేరుకున్న బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్తులు ప్లకార్డులతో బైఠాయించారు. మధ్యాహ్నం నేరం రుజువైందని జడ్జి చెప్పినట్లు తెలియడంతో కాసింత ఉపశమనం పొందారు. నిందితుడి శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష పడితేనే తమ పిల్లల ఆత్మలకు శాంతి కలుగుతుందని, లేకుంటే తమకు అప్పగిస్తే తగిన శాస్తి చేసి ఇంకెవరూ ఆడపిల్లల జోలికి వెళ్లకుండా శ్రీనివాస్‌రెడ్డికి శిక్ష విధిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉరిశిక్ష వేసినట్లు తెలియడంతో ఒక్కసారిగా ఆనందం వ్యక్తం చేశారు. ‘మా చెల్లిని చెరిచి చంపిన సైకోకు సరైన శిక్ష పడింది. ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది’అని ఓ బాలిక సోదరి మీనా ఆనందభాష్పాలు రాల్చడం అక్కడున్న వారి మనస్సు చలింపజేసింది. రాత్రి గ్రామస్తులు ముగ్గురు బాలికల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఉరితీసిన రోజే సంతృప్తి కోర్టు తీర్పుతో మాకు ఊరట లభించింది. నిందితుడికి కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంపై సంతోషంగా ఉంది. శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీసిన రోజే నిజమైన సంతృప్తి ఉంటుంది. నా కూతురును చిత్రవధ చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లే అతడిని కూడా చిత్రహింసలకు గురిచేసి చంపాలి. ఉన్న ఒక్క కూతురును పోగొట్టుకుని అనునిత్యం తన జ్ఞాపకాలతో బతుకుతున్నాం. శ్రీనివాస్‌రెడ్డికి పడిన శిక్షతోనైనా ఆడపిల్లల జోలికి వెళ్లేవారికి గుణపాఠంగా మారుతుంది. ఉరిశిక్ష పడటంతో మా పిల్లల ఆత్మలు శాంతించాయి. – పాముల నాగలక్ష్మి, బాలిక తల్లి -
ఉత్కంఠ: ఆ రెండు కేసుల్లో నేడే తుది తీర్పు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు కీలకమైన కేసుల్లో తుది తీర్పులు మరికాసేపట్లో వెలువడనున్నాయి. అందులో ఒకటి హాజీపూర్ కేసు కాగా.. రెండోది సమత కేసు. ఈ రెండు కేసుల్లోనూ సుదీర్ఘమైన విచారణ చేపట్టిన న్యాయస్థానాలు ఇవాళ తుది తీర్పును ప్రకటించనున్నాయి. నిందితులను ఉరి తీయాలని ప్రజలు డిమాండ్ చేస్తుండగా.. కోర్టు ఏ తీర్పును ప్రకటిస్తుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హాజీపూర్ వరుస హత్యల కేసు.. నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి ముగ్గురు బాలికలను అత్యంత క్రూరంగా, పాశవికంగా అత్యాచారం చేసి బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టిన ఘటన గతేడాది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి విదితమే. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు మూడు నెలల పాటు సుదీర్ఘ విచారణను చేపట్టింది. దాదాపు 300మంది సాక్షులను విచారించి.. 101 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఫోరెన్సిక్ నివేదిక కీలకం కానున్న ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించారు. అటు గ్రామస్థులు ఇటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న నలగొండ ఫాస్ట్ కోర్టు ఇవాళ తుది తీర్పును వెలువరించనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. (అంతా అబద్ధం సార్..) హాజీపూర్ కేసు: శ్రీనివాస్‌రెడ్డిది అంతా నేర చరిత్రే కాగా.. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో కూడా ఇవాళే తుది తీర్పు రానుంది. నవంబర్ 24 , 2019న తేదిన లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగింది. గ్రామాల్లో సంచరిస్తూ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే బాధితురాలని ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక హత్యాచారం చేసి హత్య చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఈ రెండు కేసుల విచారణ పూర్తయి తుది తీర్పు ఇవాళ రానుండటంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. సమతపై అత్యాచారం, హత్య: చార్జిషీట్ దాఖలు -
సమత కేసులో ముగిసిన వాదనలు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో హత్యాచారానికి గురైన సమత కేసులో సోమవారం వాదనలు ముగిశాయి. గత ఏడాది డిసెంబర్లో సాక్షులను విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. తీర్పును ఈ నెల 27వ తేదిన వెల్లడించనున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ 24వ తేదీన నిందితులైన ఎ1 షెక్ బాబా, ఎ2 షేక్ షాబోద్దీన్, ఎ3 షెక్ ముఖ్దీమ్లు కొమరంభీం జిల్లా ఎల్లపటార్ గ్రామంలో సమతను అత్యాచారం చేసి, హత్యా చేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 27వ తేదిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. డిసెంబర్ 11న ప్రభుత్వం కేసు విచారణలో భాగంగా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఇక డిసెంబర్ 14న పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేయగా కేసులోని 44 మంది సాక్షులలో 25 మందిని కోర్టు విచారించింది. చదవండి: సమత కేసు డిసెంబర్ 26కి వాయిదా -
27న హాజీపూర్ కేసు తీర్పు
నల్లగొండ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల హత్యకేసుకు సంబంధించి శుక్రవారం కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జడ్జి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు. నల్లగొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో న్యాయమూర్తి విశ్వనాథరెడ్డి ముందు ప్రాసిక్యూషన్ తరఫున పీపీ కె.చంద్రశేఖర్ వాదించగా, నిందితుడి తరఫున న్యాయవాది ఠాగూర్ వాదనలు వినిపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ వద్ద ముగ్గురు బాలికలపై అత్యాచారం చేయడంతోపాటు హత్య చేసి బావిలో పాతిపెట్టిన ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దానిపై నల్లగొండలోని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ సాగింది. సాక్ష్యాలన్నింటినీ న్యాయమూర్తి వి.విశ్వనాథరెడ్డి నిందితుడు శ్రీనివాస్‌రెడ్డికి చదివి వినిపించి అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అనంతరం కోర్టులో ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాది చంద్రశేఖర్ వాదిస్తూ, ముగ్గురు బాలికలపై అత్యాచారం, హత్య చేసింది శ్రీనివాస్‌రెడ్డే అని, అందుకు మెడికల్ రిపోర్టులు, సాక్ష్యాలు ఉన్నాయన్నారు. ఇలాంటి వ్యక్తి సమాజంలో ఉండడం సరైంది కాదని, ఉరి శిక్ష విధించాలని అన్నారు. నిందితుడి తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో లీగల్ ఎయిడ్ సంస్థ నియమించిన న్యాయవాది ఠాగూర్ శుక్రవారం తన వాదన వినిపించారు. హత్యలకు శ్రీనివాస్‌రెడ్డికి సంబం«ధం లేదని, సాక్ష్యాలు సక్ర మంగా లేవన్నారు. ఈనెల 8న కూడా ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 27వ తేదీకి వాయిదా వేశారు. -
ఉన్నావ్ అత్యాచార కేసులో నేడు తీర్పు
-
బ్రిటీష్ జడ్జిమెంట్!
-
‘ఉన్నావ్’ రేప్ కేసు తీర్పు 16న
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగారి అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ ధర్మేశ్ శర్మ తెలిపారు. 2017లో మైనర్ బాలికను బీజేపీ ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు మారింది. గోప్యంగా జరిగిన విచారణలో ఈ నెల 2న నిందితుడు తన వాదనలు వినిపించగా, సోమవారం సీబీఐ తన వాదనలను కోర్టులో వినిపించింది. సెంగార్ నిందితుడిగా ఉన్న ఈ కేసులో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును గత జూలై 28న ఓ ట్రక్కు ఢీకొట్టింది. అనంతరం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చి ఢిల్లీలో ఉంచింది. సుప్రీం ఆదేశాలతో ఆ కుటుంబానికి సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించారు. -
రివ్యూనే కోరుకుంటున్నారు!
లక్నో: అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయాలనే దేశంలోని 99 శాతం ముస్లింలు కోరుకుంటున్నారని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) పేర్కొంది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి నవంబర్ 9న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదును కూల్చిన స్థలంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం జరగాలని, మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే మరో చోట సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే, ముస్లింల తరఫు పిటిషన్‌దారు అయిన సున్నీ వక్ఫ్‌బోర్డు ఆ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయబోమని స్పష్టం చేసింది. కానీ, ఏఐఎంపీఎల్బీ మాత్రం డిసెంబర్ 9న రివ్యూ పిటిషన్ దాఖలవుతుందని పేర్కొంది. తాజాగా, ఆదివారం ఏఐఎంపీఎల్బీ ప్రధాన కార్యదర్శి మౌలానా వాలి రహ్మానీ మాట్లాడుతూ.. ‘99% ముస్లింలు రివ్యూ పిటిషన్ వేయాలనే కోరుకుంటున్నారు. ముస్లింలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు తరువాత.. వారిలో ఆ నమ్మకం తగ్గింది’ అని వ్యాఖ్యానించారు. రివ్యూ పిటిషన్ వేసినా.. ఆ పిటిషన్‌ను కొట్టేస్తారనే అనుమానం తమకుందన్నారు. పిటిషన్ వేయడం తమ హక్కు అని, సుప్రీంకోర్టు తీర్పులో వైరుద్ధ్యాలున్నాయన్నారు. ఉద్రిక్తతలు సృష్టించాలనే.. అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలన్న నిర్ణయాన్ని కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ తప్పుబట్టారు. పిటిషన్ వేయడం ద్వారా సమాజంలో విభజనపూరిత, ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడేలా చేయాలనుకుంటున్నాయని ఏఐఎంపీఎల్బీ, జమాయిత్ సంస్థలపై మండిపడ్డారు. ‘ముస్లింలు బాబ్రీని కాదు.. ఆర్థికంగా, సామాజికంగా సమానత్వం కోరుకుంటున్నార’న్నారు. ఆర్థికంపై దృష్టిపెట్టండి రివ్యూ పటిషన్ వేయాలన్న నిర్ణయాన్ని గతంలో అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన శ్రీశ్రీ రవిశంకర్ కూడా తప్పుబట్టారు. ఆ వివాదాన్ని మర్చిపోయి, హిందూ, ముస్లింలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. -
ఇంతకు అది అంగీకార సెక్సా, రేపా!?
లండన్ శివారులో తన సోదరుడితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న 20 ఏళ్ల చెర్రీ ఇటీవల ఓ వీకెండ్ సాయంత్రం పార్టీకి వెళ్లింది. అక్కడ అనుకోకుండా తానంటే అమితంగా ఇష్టపడే ఓ స్కూల్ ఫ్రెండ్‌ను కలుసుకొంది. అతను ఐదు గ్లాసుల వోడ్కా, ఓ కోక్‌ను ఆమెకు ఆఫర్ చేశాడు. చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ ఇద్దరు తాగారు. అనంతరం ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. చెర్రీ డాన్స్ చేస్తూ చేస్తూ ఓ దశలో కింద పడబోయి నిలదొక్కుకుంది. వారిద్దరు బయటకు వచ్చేసరికి బాగా రాత్రయింది. టాక్సీ పిలుచుకొని వారిద్దరు చెర్రీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే బాగా మత్తులో ఉన్న చెర్రీ అలాగే వెళ్లి బెడ్ మీద పడి పోయింది. ఆమె పక్కనే పడుకున్న బాల్య మిత్రుడు ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇది రేప్ కేసుగా ఇంగ్లీషు క్రౌన్ కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఇంతకు అది రేపా ? పరస్సర అంగీకారంతో జరిగిన సెక్సా ? న్యాయం చెప్పాల్సిన బాధ్యత 11 మంది సభ్యులు గల జ్యూరీ, ఓ జడ్జీ మీద పడింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు, కేసులోని వాస్తవాలు తేల్చేందుకు ‘క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీసీ)’ న్యాయవాదులు కోర్టు హాలుకు హాజరయ్యారు. అత్యాచారం కాకుండా రేప్‌గా తెలిస్తే అన్యాయంగా ఓ యువకుడి జీవితం పాడవుతుంది. రేప్ జరిగినా కాదని తెలిస్తే కుటుంబంలో, సమాజంలో ఓ యువతి పరువు పోతుంది. ఐదు పెగ్గుల వోడ్కా తాగిన అమ్మాయి స్పృహలో ఉండే అవకాశం తక్కువ. అలాంటి పరిస్థితుల్లో పరస్పర సెక్స్‌కు ఆమె అంగీకారం తెలపగలదా ? ఆ మత్తులోనే ఆమె శారీరక సుఖాన్ని కూడా కోరుకున్నదా ? ఆమె మత్తును ఆసరాగా తీసుకొని ఆ యువకుడే రెచ్చిపోయి రేప్ చేశారా? అన్నది తేలిస్తే కేసు సులభంగా కొలిక్కి వస్తుందన్నది జ్యూరీకి అర్థమైంది. ఇంగ్లండ్‌లో నమోదవుతున్న వంద రేప్ కేసుల్లో కేవలం మూడు కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. జడ్జీ, పెద్ద జ్యూరీతో విచారణ జరిపించడం, వారిలో ఎక్కువ మంది పురుషులవైపు మొగ్గు చూపడంతో నిందితులకు శిక్షలు పడడం లేదని వామపక్ష మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు గత కొంత కాలంగా లండన్ వీధుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వారి ఆందోళన కారణంగా మహిళలు ముందుకు వచ్చి రేప్ కేసులను నమోదు చేయడం మూడింతలు పెరగ్గా. శిక్షలు మాత్రం పెద్దగా పెరగలేదు. అందుకని జ్యూరీతో కాకుండా ఓ జడ్జీ, ఇద్దరు సభ్యుల కమిటీతోని రేప్ కేసుల విచారణ జరిపించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చెర్రీ రేప్ కేసుకు ప్రాధాన్యత చేకూరింది. రేప్ జరిగిన రోజు చెర్రీ బెడ్ రూమ్ నుంచి బయటకు రాగానే సోదరుడు ఎదురు పడి నిలదీశాడు. బెడ్ రూమ్ నుంచి ఓ పురుషుడు బయటకు రావడం తెల్లవారుజామున తాను చూశానని, అసలు ఏం జరిగిందో చెప్పంటూ బెదిరించాడు. తాను వద్దంటున్న, తాను ఒప్పుకోక పోయినా బలవంతంగా తనతో సెక్స్ జరిపాడని ఆమె చెప్పింది. ఆమె సోదరుడు వెంటనే అంబులెన్స్‌ను, పోలీసులను పిలిపించారు. ఆమెను అస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా, సెక్స్ జరిగినట్లు, రక్తంలో ఆల్కాహాల్ ఉన్నట్లు తేలింది. చెర్రీ ఆ రోజున ఐదు పెగ్గుల ఆల్కాహాల్ తీసుకుందని, ఆమె దాదాపు స్పృహ తప్పిందంటూ, అందుకు సాక్ష్యంగా ఆమె డాన్స్ ఫ్లోర్లో నేలపై పడుబోతున్నట్లుగా ఓ పత్రికలో వచ్చిన ఫొటోను, వైద్యుల నివేదికను ఆమె తరఫు న్యాయవాది జడ్జీకి సమర్పించి, ఆమె సెక్స్‌కు అంగీకరించే స్థితిలోనే లేదని వాదించారు. రేప్ కేసుగా పరిగణించి నిందితుడిని దోషిగా తేల్చాలని కోరారు. అప్పుడు జ్యూరీ నుంచి ఓ సభ్యుడు జడ్జీకి ఓ కాగితంపై ఏదో రాసి పంపిచారు. చెర్రీకి బ్రేక్ డ్యాన్సర్‌గా, అంతకుముందు మంచి అథ్లెట్‌గా మంచి గుర్తింపు ఉందని, నేలపై పడుతున్నట్లు కనిపించడం డ్యాన్స్‌లో ఓ భంగిమ అని ఆ కాగితంలో ఆ సభ్యుడు సూచించారు. జ్యూరీలోని మరో సభ్యుడు జోక్యం చేసుకొని చెర్రీని పోలీసులు ఇంటరాగేట్ చేసిన వీడియో క్లిప్‌ను మరోసారి ప్లే చేయమని కోరారు. అందులో ‘బాయ్ ఫ్రెండ్ ఐదు పెగ్గుల వోడ్కాకు ఆర్డర్ ఇచ్చిన మాట నిజమే. అయితే అందులో నేను రెండు పెగ్గులు తీసుకోగా, అతను మూడు పెగ్గులు తీసుకున్నారు’ అని చెర్రీ చెప్పడం కనిపించింది. ఆమెకు మద్యం ఎక్కువ కాలేదని, వైద్య పరీక్షల్లో కూడా ఆమె రక్తంలో ఆల్కాహాల్ శాతం చాలా తక్కువ ఉన్నట్లు పేర్కొన్నారని సదరు జ్యూరీ సభ్యుడు కోర్టుకు నివేదించారు. ఈ కారణంగా చెర్రీ ఇష్ట పూర్వకంగానే సెక్స్‌లో పాల్గొన్నదని, సోదరుడికి భయపడి ఆమె అబద్ధం చెప్పిందని జ్యూరీ తేల్చింది. జడ్జీ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించడంతో అందరు ఊపిరి పీల్చుకోగా, కేసు విచారణ జరిపిన ఇద్దరు పోలీసు అధికారులు మాత్రం తలపై చేతులు పెట్టుకున్నారు. నిందితుడు చిరునవ్వుతోనే జ్యూరీ సభ్యులకు అభినందనలు తెలిపి కోర్టు బయటకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు కుమారుడి వెన్ను తట్టి వెంట తీసుకెళ్లారు. అప్పటి వరకు అక్కడే కనిపించిన మహిళా సంఘాల నాయకులు కనుమరుగయ్యారు. -
పరస్సర అంగీకారంతో జరిగిన
లండన్ శివారులో తన సోదరుడితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్న 20 ఏళ్ల చెర్రీ ఇటీవల ఓ వీకెండ్ సాయంత్రం పార్టీకి వెళ్లింది. అక్కడ అనుకోకుండా తానంటే అమితంగా ఇష్టపడే ఓ స్కూల్ ఫ్రెండ్‌ను కలుసుకొంది. అతను ఐదు గ్లాసుల వోడ్కా, ఓ కోక్‌ను ఆమెకు ఆఫర్ చేశాడు. చిన్ననాటి జ్ఞాపకాలకు గుర్తు చేసుకుంటూ ఇద్దరు తాగారు. అనంతరం ఇద్దరు కలిసి డాన్స్ చేశారు. చెర్రీ డాన్స్ చేస్తూ చేస్తూ ఓ దశలో కింద పడబోయి నిలదొక్కుకుంది. వారిద్దరు బయటకు వచ్చేసరికి బాగా రాత్రయింది. టాక్సీ పిలుచుకొని వారిద్దరు చెర్రీ ఇంటికి చేరుకున్నారు. అప్పటికే బాగా మత్తులో ఉన్న చెర్రీ అలాగే వెళ్లి బెడ్ మీద పడి పోయింది. ఆమె పక్కనే పడుకున్న బాల్య మిత్రుడు ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నాడు. ఇది రేప్ కేసుగా ఇంగ్లీషు క్రౌన్ కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఇంతకు అది రేపా ? పరస్సర అంగీకారంతో జరిగిన సెక్సా ? న్యాయం చెప్పాల్సిన బాధ్యత 11 మంది సభ్యులు గల జ్యూరీ, ఓ జడ్జీ మీద పడింది. కేసు విచారణ చేపట్టిన పోలీసులు, కేసులోని వాస్తవాలు తేల్చేందుకు ‘క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీసీ)’ న్యాయవాదులు కోర్టు హాలుకు హాజరయ్యారు. అత్యాచారం కాకుండా రేప్‌గా తెలిస్తే అన్యాయంగా ఓ యువకుడి జీవితం పాడవుతుంది. రేప్ జరిగినా కాదని తెలిస్తే కుటుంబంలో, సమాజంలో ఓ యువతి పరువు పోతుంది. ఐదు పెగ్గుల వోడ్కా తాగిన అమ్మాయి స్పృహలో ఉండే అవకాశం తక్కువ. అలాంటి పరిస్థితుల్లో పరస్పర సెక్స్‌కు ఆమె అంగీకారం తెలపగలదా ? ఆ మత్తులోనే ఆమె శారీరక సుఖాన్ని కూడా కోరుకున్నదా ? ఆమె మత్తును ఆసరాగా తీసుకొని ఆ యువకుడే రెచ్చిపోయి రేప్ చేశారా? అన్నది తేలిస్తే కేసు సులభంగా కొలిక్కి వస్తుందన్నది జ్యూరీకి అర్థమైంది. ఇంగ్లండ్‌లో నమోదవుతున్న వంద రేప్ కేసుల్లో కేవలం మూడు కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడుతున్నాయి. జడ్జీ, పెద్ద జ్యూరీతో విచారణ జరిపించడం, వారిలో ఎక్కువ మంది పురుషులవైపు మొగ్గు చూపడంతో నిందితులకు శిక్షలు పడడం లేదని వామపక్ష మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు గత కొంత కాలంగా లండన్ వీధుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వారి ఆందోళన కారణంగా మహిళలు ముందుకు వచ్చి రేప్ కేసులను నమోదు చేయడం మూడింతలు పెరగ్గా. శిక్షలు మాత్రం పెద్దగా పెరగలేదు. అందుకని జ్యూరీతో కాకుండా ఓ జడ్జీ, ఇద్దరు సభ్యుల కమిటీతోని రేప్ కేసుల విచారణ జరిపించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో చెర్రీ రేప్ కేసుకు ప్రాధాన్యత చేకూరింది. రేప్ జరిగిన రోజు చెర్రీ బెడ్ రూమ్ నుంచి బయటకు రాగానే సోదరుడు ఎదురు పడి నిలదీశాడు. బెడ్ రూమ్ నుంచి ఓ పురుషుడు బయటకు రావడం తెల్లవారుజామున తాను చూశానని, అసలు ఏం జరిగిందో చెప్పంటూ బెదిరించాడు. తాను వద్దంటున్న, తాను ఒప్పుకోక పోయినా బలవంతంగా తనతో సెక్స్ జరిపాడని ఆమె చెప్పింది. ఆమె సోదరుడు వెంటనే అంబులెన్స్‌ను, పోలీసులను పిలిపించారు. ఆమెను అస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా, సెక్స్ జరిగినట్లు, రక్తంలో ఆల్కాహాల్ ఉన్నట్లు తేలింది. చెర్రీ ఆ రోజున ఐదు పెగ్గుల ఆల్కాహాల్ తీసుకుందని, ఆమె దాదాపు స్పృహ తప్పిందంటూ, అందుకు సాక్ష్యంగా ఆమె డాన్స్ ఫ్లోర్లో నేలపై పడుబోతున్నట్లుగా ఓ పత్రికలో వచ్చిన ఫొటోను, వైద్యుల నివేదికను ఆమె తరఫు న్యాయవాది జడ్జీకి సమర్పించి, ఆమె సెక్స్‌కు అంగీకరించే స్థితిలోనే లేదని వాదించారు. రేప్ కేసుగా పరిగణించి నిందితుడిని దోషిగా తేల్చాలని కోరారు. అప్పుడు జ్యూరీ నుంచి ఓ సభ్యుడు జడ్జీకి ఓ కాగితంపై ఏదో రాసి పంపిచారు. చెర్రీకి బ్రేక్ డ్యాన్సర్‌గా, అంతకుముందు మంచి అథ్లెట్‌గా మంచి గుర్తింపు ఉందని, నేలపై పడుతున్నట్లు కనిపించడం డ్యాన్స్‌లో ఓ భంగిమ అని ఆ కాగితంలో ఆ సభ్యుడు సూచించారు. జ్యూరీలోని మరో సభ్యుడు జోక్యం చేసుకొని చెర్రీని పోలీసులు ఇంటరాగేట్ చేసిన వీడియో క్లిప్‌ను మరోసారి ప్లే చేయమని కోరారు. అందులో ‘బాయ్ ఫ్రెండ్ ఐదు పెగ్గుల వోడ్కాకు ఆర్డర్ ఇచ్చిన మాట నిజమే. అయితే అందులో నేను రెండు పెగ్గులు తీసుకోగా, అతను మూడు పెగ్గులు తీసుకున్నారు’ అని చెర్రీ చెప్పడం కనిపించింది. ఆమెకు మద్యం ఎక్కువ కాలేదని, వైద్య పరీక్షల్లో కూడా ఆమె రక్తంలో ఆల్కాహాల్ శాతం చాలా తక్కువ ఉన్నట్లు పేర్కొన్నారని సదరు జ్యూరీ సభ్యుడు కోర్టుకు నివేదించారు. ఈ కారణంగా చెర్రీ ఇష్ట పూర్వకంగానే సెక్స్‌లో పాల్గొన్నదని, సోదరుడికి భయపడి ఆమె అబద్ధం చెప్పిందని జ్యూరీ తేల్చింది. జడ్జీ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించడంతో అందరు ఊపిరి పీల్చుకోగా, కేసు విచారణ జరిపిన ఇద్దరు పోలీసు అధికారులు మాత్రం తలపై చేతులు పెట్టుకున్నారు. నిందితుడు చిరునవ్వుతోనే జ్యూరీ సభ్యులకు అభినందనలు తెలిపి కోర్టు బయటకు వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఆ యువకుడి తల్లిదండ్రులు కుమారుడి వెన్ను తట్టి వెంట తీసుకెళ్లారు. అప్పటి వరకు అక్కడే కనిపించిన మహిళా సంఘాల నాయకులు కనుమరుగయ్యారు. -
కీలక సాక్ష్యం.. ‘మరణవాంగ్మూలం’
సాక్షి, జాగిత్యాల : రమ్యపై ఆమె భర్తకు అనుమానం. ఆమె ప్రవర్తన విషయమై ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో రమ్య భరించలేకపోయింది. ఒకరోజు కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. భర్త ఆసుపత్రికి తరలించాడు. డాక్టర్లు చికిత్స అందిస్తున్నప్పటికీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. వెంటనే కోర్టు మెజిస్ట్రేట్ వచ్చి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలు ఎవరు ఏమి చేస్తున్నారో, ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది’. ఈ నేపథ్యంలో బాధితుల మరణవాంగ్మూలం, పోలీసుల విచారణ తదితర విషయాల గురించి జగిత్యాల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ఎస్.పవన్‌కుమార్(9440128938) వివరించారు. చావు ప్రశ్నార్థకమైనప్పుడు.. వ్యక్తి చావు ప్రశ్నార్థకమైనప్పుడు, మరణించే వ్యక్తి తన చావుకు గల కారణాన్ని, ఆ చావుకు దారితీసిన పరిస్థితుల్ని తెలుసుకునేందుకు మెజిస్ట్రేట్ బాధితుల నుంచి నమోదు చేసే స్టేట్మెంట్ను మరణ వాంగ్మూలంగా పిలుస్తారు. జరిగిన నేరానికి బాధితుడు ఒక్కడే సాక్షి. ఆ సాక్షి చెప్పేదే బలమైన సాక్ష్యం అయి ఉండవచ్చు. అతడి స్టేట్మెంట్ను తీసుకోకుంటే బాధితుడికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి తోడు.. చావుకు దగ్గరైన వ్యక్తి నిజం చెబుతాడని, ఆ సమయంలో అబద్ధం చెప్పడని, చెప్పడానికి సదరు వ్యక్తి మనస్సు అంగీకరించదని చట్టం భావిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మరణ వాంగ్మూలాన్ని కోర్టు ప్రధాన సాక్ష్యంగా తీసుకుంటుంది. పోలీసులు ఏం చేస్తారంటే.. ఏవరైనా వ్యక్తి తీవ్రగాయాలతో సీరియస్‌గా ఉన్న పరిస్థితుల్లో, ఆ వ్యక్తి మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి పోలీసులు ఏర్పాట్లు చేయాలి. మరణ వాంగ్మూలం నమోదు చేసేందుకు ముందుగా మెజిస్ట్రేట్‌కు తెలియజేయాలి. ఇందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. అయితే గాయాలైన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండి, మెజిస్ట్రేట్ వచ్చేంత వరకు కూడా బతకలేని పక్షంలోనే, చికిత్స అందిస్తున్న డాక్టర్‌ను మరణ వాంగ్మూలం నమోదు చేయాలని కోరే హక్కు పోలీసులకు ఉంటుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి పరిస్థితి మరీ ప్రమాదకరంగా ఉండి, ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేని పరిస్థితులు ఉన్నప్పుడు, పోలీస్ అధికారే మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. పోలీసులు వాంగ్మూలాన్ని నమోదు చేసేటప్పుడు ఒక్కరిద్దరు సాక్షులు తప్పనిసరిగా ఉండాలి. సాధ్యమైనంత వరకు పోలీసులు మరణ వాంగ్మూలం నమోదు చేయకుండా ఉండటం బెటర్. అన్నింటికంటే ముఖ్యంగా కోర్టు మెజిస్ట్రేట్ చేత మరణ వాంగ్మూలం నమోదు చేయిస్తే విలువ ఎక్కువగా ఉంటుంది. ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏవరు మరణ వాంగ్మూలాన్ని నమోదు చేశారనే విషయాలను కేసు డైరీలో రాయాల్సి ఉంటుంది. రవాణా సౌకర్యం కల్పించాల్సిందే.. మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ప్రత్యేక పద్ధతంటూ చట్టంలో ఎక్కడా లేదు. కానీ మరణ వాంగ్మూలానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. పోలీసుల నుంచి అధికారిక సమాచారం రాగానే కోర్టు మెజిస్ట్రేట్ సైతం వాంగ్మూలం తీసుకోవాల్సిన వ్యక్తి దగ్గరకు బయలుదేరుతాడు. బాధితుడి దగ్గరకు వెళ్లగానే మెజిస్ట్రేట్ పోలీసులు పేర్కొంటున్న బాధితుడు ఇతడేనా..వంటి వివరాలు చూసుకుంటారు. బాధితుడికి తాను జడ్జినని చెప్పి, అతడు వాంగ్మూలం ఇచ్చే స్థితిలో ఉన్నాడా లేడా అనే విషయాలు తెలుసుకున్న తర్వాత వాంగ్మూలం రాస్తుంటారు. కేసు పరిశోధనలో మరణ వాంగ్మూలానికి అత్యంత విలువ ఉంటుంది కాబట్టి వాంగ్మూలం తీసుకునేందుకు వచ్చే మెజిస్ట్రేట్లకు రవాణా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉం దని హైకోర్టు 1993లో ఉత్తర్వులు జారీ చేసింది. ఎలా నమోదు చేస్తారంటే.. వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి సృహలో ఉన్నాడా, లేడా తను అడిగే ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబు చెప్పే పరిస్థితిలో ఉన్నాడా లేడా అని మొదట మెజిస్ట్రేట్ గమనిస్తుంటారు. అతడు అలా లేడని అనిపించినప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ను నమోదు చేయకుండా, అతడు సృహలో లేడనే విషయాన్ని నోట్ చేసి ముగిస్తుంటారు. అతడు సృహలో ఉన్నాడని మెజిస్ట్రేట్ తృప్తిపడితే, బాధితుడు సందర్భశుద్ధిగా మాట్లాడగలడా లేదా, మానసికస్థితి సరిగా ఉందా లేదనే విషయాలను పసిగడుతారు. ఇలా అన్ని విషయాలపై సంతృప్తి చెందిన తర్వాత, సంఘటన ఎలా జరిగింది, కారణం ఎవ్వరు వంటి ప్రశ్నలను అడుగుతూ మెజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారు. వాంగ్మూలం నమోదు చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు డాక్టర్లు తప్పనిసరిగా అక్కడే ఉండాలి. అలాగే వాంగ్మూలం ఇచ్చే వ్యక్తి సరైన మానసికస్థితిలో ఉన్నట్లు డాక్టర్ల నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సంతకం చేయలేక పోతే వేలి ముద్రలు.. స్టేట్మెంట్ పూర్తైన తర్వాత, ఆ స్టేట్మెంట్లోని విషయాలను, స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తికి తెలియజేసి అతడి సంతకాన్ని తీసుకోవాలి. బాధితుడు సంతకం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు అతడి వేలిముద్రలను స్టేట్మెంట్ చివర తీసుకోవాలి. గాయపడిన వ్యక్తి సృహాలో ఉన్నప్పటికీ సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో ఉంటే ఆయనకు చిన్నచిన్న ప్రశ్నలు వేసి, ఆ ప్రశ్నలకు ఆయనిచ్చే గుర్తులు, సంజ్ఞల ద్వారా వాంగ్మూలం నమోదు చేయాలి. ముఖ్యంగా స్టేట్మెంట్ నమోదు చేసే సమయంలో బాధితుల బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితులను దగ్గర ఉండనివ్వరు. మరణ వాంగ్మూలం నమోదు ప్రారంభించిన, ముగింపు సమయాన్ని స్టేట్మెంట్పై తప్పనిసరిగా వేయాలి. -
మల్కాజ్గిరి కోర్టు సంచలన తీర్పు
హైదరాబాద్ : తల్లిదండ్రులను వేధించే పిలల్లకు గుణపాఠంగా మల్కాజ్గిరి కోర్టు సోమవారం సంచలన తీర్పు ఇచ్చింది. తండ్రి మరణాంతరం తల్లి ఆలనపాలన చూడాల్సిన కొడుకే కర్కశంగా మారడంతో ఆ అభాగ్యురాలు పోలీసులు, కోర్టును ఆశ్రయించింది. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిపిన కోర్టు ఇవాళ తుదితీర్పును వెలువరించింది. ఆస్తి కోసం తల్లిని వేధించిన కొడుకుతో పాటు కోడలికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు పదివేల జరిమానా విధించింది. నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిల్ కాలనీలో నివాసం ఉండే ప్రేమ కుమారి (70)కి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2013లో భర్త చనిపోయాడు. భర్త చనిపోకముందే పిల్లల వివాహాలు జరిపించాడు. ఎవరికి వారు వేరుగా ఉంటున్నారు. భర్త చనిపోవడంతో పెద్ద కుమారుడు నుంచి తల్లికి వేధింపులు మొదలయ్యాయి. ముషీరాబాద్ లో నివాసం ఉండే పెద్ద కుమారుడు అమిత్ కుమార్ తన భార్యతో సహా తల్లి ఉండే ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించమే కాకుండా ఆమెను బయటకు పంపేందుకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని భార్యతో కలిసి క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇది భరించలేని తల్లి... 2015లో పోలీసులను ఆశ్రయించగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్లుగా విచారణ జరిగిన ఈ కేసు తుదితీర్పు నేడు(సోమవారం) వెలువడింది. పెద్ద కుమారుడు అమిత్ కుమార్, కోడలు శోభిత లావణ్యలకు రెండేళ్ల జైలుశిక్షతో పాటు చేరో పదివేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుపై పలువురు హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ తీర్పుతోనైనా సమాజంలో మార్పురావాలని వారు అభిప్రాయపడుతున్నారు. -
నాది నిర్ణయలోపమే
కొలంబో: ప్రపంచకప్ ఫైనల్ ఫలితాన్ని ప్రభావితం చేసిన ఓవర్‌త్రోకు ఆరు పరుగులు ఇవ్వడంపై తానేమీ చింతించట్లేదని ఆ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన కుమార్ ధర్మసేన (శ్రీలంక) స్పష్టం చేశారు. ఇంగ్లండ్ జట్టుకు ఆరు పరుగులు కేటాయించడం తన నిర్ణయ లోపమేనని ఒప్పుకున్న ధర్మసేన ఆ సమయంలో అదే సరైనదిగా తోచిందని అన్నారు. ‘ఓవర్‌త్రోకు ఐదుకు బదులు ఆరు పరుగులు ఇవ్వడం నా నిర్ణయ లోపమే. అది ఇప్పుడు టీవీ రీప్లేలు చూస్తే తెలుస్తోంది. కానీ ఆ సమయంలో మైదానంలో ఉన్నపుడు అది సముచితంగా అనిపించింది. నిర్ణీత సమయంలో తీసుకున్న నా నిర్ణయాన్ని ఐసీసీ అప్పుడు ప్రశంసించింది కూడా. ఇప్పుడు దాని గురించి నాకు చింత లేదు’ అని ధర్మసేన వివరించారు. లైగ్ అంపైర్ మారిస్ ఎరాస్మస్‌తో చర్చించాకే ఆరు పరుగులు కేటాయించానని ధర్మసేన తెలిపారు. -
మాల్యా అప్పగింతపై నేడు బ్రిటన్ కోర్టు తీర్పు
లండన్: రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించే అంశంపై బ్రిటన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (నేడు) తీర్పును వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన అప్పగింతకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకులు లేవని న్యాయస్థానం భావించిన పక్షంలో తుదినిర్ణయం తీసుకునేందుకు ఈ కేసును బ్రిటన్ హోంశాఖకు పంపవచ్చని న్యాయనిపుణులు జైవాలా అండ్ కో మేనేజింగ్ పార్ట్నర్ పావని రెడ్డి తెలిపారు. ప్రతికూల ఉత్తర్వులు వచ్చిన పక్షంలో ఇరు వర్గాలు (మాల్యా, భారత ప్రభుత్వం) 14 రోజుల్లోగా హైకోర్టులో అప్పీలు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. అప్పీలు చేసుకోకపోతే 28 రోజుల్లోగా మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు అమల్లోకి (ప్రభుత్వం కూడా ఏకీభవిస్తే) వస్తుందని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభంతో మూతబడిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తీసుకున్న దాదాపు రూ. 9,000 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన మాల్యా .. బ్రిటన్‌కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఏడాది కాలంగా ఆయన్ను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. -
ఈ నియంత్రణలైనా ఫలిస్తాయా?
దీపావళి టపాసుల విక్రయాలపై ఉన్న నిషేధం పోయి ఈసారి వాటి వినియోగంపై నియంత్రణ లొచ్చాయి. గత రెండేళ్లుగా జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లోనూ, దాని శివార్లలోనూ టపాసుల విక్రయాలను పండుగకు 20 రోజుల ముందు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇస్తున్న సర్వోన్నత న్యాయస్థానం ఈసారి అందుకు భిన్నంగా వాటిని కాల్చడానికి కొన్ని పరిమితులు విధించింది. దీపా వళి నాడు రోజంతా కాకుండా రాత్రి 8 గంటలకు మొదలుపెట్టి 10 గంటలకల్లా టపాసులు కాల్చ డాన్ని నిలిపేయాలని ఆంక్షలు విధించింది. అలాగే పరిమితికి మించిన ధ్వని, కాంతి, కాలుష్యం వగై రాలు లేకుండా చూడమని ఢిల్లీ పోలీసు శాఖను ఆదేశించింది. ఈ నియంత్రణలే రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు, ఇతర ఉత్సవాలకు కూడా వర్తిస్తాయని తెలిపింది. దీపావళి పండుగ హడావుడంతా చీకటిపడ్డాక మొదలవుతుంది. పోటాపోటీగా రకరకాల బాణసంచా, టపాసులు కాల్చడం పిల్లలతోపాటు పెద్దలకూ సరదాయే. కానీ మరుసటి రోజు ఉదయం వీధులన్నీ యుద్ధ క్షేత్రా లను తలపిస్తాయి. వ్యర్థాలతో వీధులన్నీ నిండిపోతాయి. ఇదంతా కంటికి కనిపించేది. పర్యావరణ చైతన్యం పెరగడం వల్ల కావొచ్చు...ఆ టపాసులు, బాణసంచా తీసుకొచ్చే కాలుష్యంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని నగరంలో సాధారణ దినాల్లోనే కాలుష్యం హద్దులు దాటుతుండగా దీపావళి రోజున అది మరింతగా పెరుగుతోంది. నిరుడు దీపావళి రోజున న్యూఢిల్లీలో వాయు కాలుష్యం మాములు రోజులతో పోలిస్తే మూడున్నర రెట్లు ఎక్కువున్నదని తేలింది. ఈసారి సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల ద్వారా ‘సురక్షితమైన హరిత దీపావళి’ జరుపుకోవాలని సూచించింది. అంటే తక్కువ కాలుష్యం వెదజల్లే టపాసుల్ని, బాణసంచాను మాత్రమే ఈసారి ఉత్ప త్తిచేయాలి. వాటినే అమ్మాలి. అవే కాల్చాలి. భారీగా కాలుష్యం వెదజల్లే అన్ని రకాల బాణసంచా, టపాసులు తయారు చేయడం, వాటిని విక్రయించడం, అవి కొనుక్కుని కాల్చడం ఈ తీర్పు పర్యవ సానంగా చట్టవిరుద్ధమవుతాయి. అలాగే బాణసంచా, టపాసులు రాత్రి 8–10 మధ్య మాత్రమే విని యోగించాలి. అంతకు ముందూ, ఆతర్వాత కాలిస్తే పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అంతేకాదు... వాటిని ఎవరింటి ముందు వారు కాల్చడం కాక అందరూ ఒకచోట చేరి ఆ కార్యక్ర మాన్ని పూర్తి చేసే విధానం అనుసరించాలని సూచించింది. దాంతోపాటు ఆకాశంలోకి రివ్వును దూసుకుపోయి అక్కడ రకరకాల రంగుల్లో కాంతులు వెదజల్లుతూ పెను శబ్దాలతో పేలే టపాసుల్ని కూడా నిషేధించింది. వీటితోపాటు ఆన్లైన్ విక్రయాలు ఉండరాదని చెప్పింది. అయితే ప్రభుత్వాలు, వివిధ సామాజిక సంస్థల క్రియాశీలపాత్ర లేకుండా ఇదంతా సాధ్యమేనా? ముందస్తుగా వివిధ మార్గాల్లో ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను చేపట్టకుండా కింది స్థాయికి ఇదంతా చేరు తుందా? పోలీసులు ప్రతి వీధిలోనూ, ఇంటి ముందూ పహారా కాసి అదుపులో పెట్టడం సాధ్యమా? మన దేశంలో ఏదైనా సమస్య ముంచుకొచ్చినప్పుడు మాత్రమే దానిపై చర్చ మొదలవుతుంది. న్యాయస్థానాలు కూడా ఆ మాదిరిగానే స్పందిస్తున్నాయి. రెండు మూడేళ్లుగా దీపావళి టపాసుల విషయంలో విచారణలు సుప్రీంకోర్టులో 15, 20 రోజుల ముందు సాగుతున్నాయి. ఉత్తర్వులు వెలు వడుతున్నాయి. ఈసారి కూడా పండుగ పక్షం రోజులుందనగా న్యాయస్థానం మార్గదర్శకాలొ చ్చాయి. నిజానికి దీపావళి కోసమని బాణసంచా, టపాసులు ఈపాటికే భారీ మొత్తంలో ఉత్పత్తి చేసి ఉంటారు. వీటితోపాటు పాత నిల్వలుంటాయి. తమిళనాడులోని శివకాశిలోనూ, దేశంలోని కొన్ని ఇతరచోట్లా బాణసంచా, టపాసుల తయారీ ఏడాది పొడవునా సాగుతూనే ఉంటుంది. వీటిని దీపా వళికి మాత్రమే కాక పెళ్లిళ్లు, వేర్వేరు పండుగల్లో కూడా వినియోగిస్తారు. ఇప్పటికే దేశ రాజధానిలో వందల టపాసుల దుకాణాలు వెలిశాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ స్థితిలో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలుకావడం సాధ్యమా? అందుకు భిన్నంగా ఏడాది ముందుగానే నిర్ణయం తీసు కుని ప్రభుత్వాలు, సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీలు నిరంతరం ఆ దిశగా పనిచేస్తే ఎంతో కొంత ఫలితం వస్తుంది. బాణసంచా, టపాసుల తయారీ విషయంలో ఇప్పుడు విధించిన పరిమి తుల వల్ల వ్యర్థాల పరిమాణం తగ్గడంతోపాటు ధ్వనికాలుష్యం, కాంతి తీవ్రత పరిమితమవుతాయని లెక్కలేస్తున్నారు. మంచిదే. కానీ అసలు గ్రీన్ టపాసులకు అవకాశమే లేదని ఉత్పత్తిదారులు చెబు తున్నారు. వాటిల్లో వాడే రసాయనాలను కొంత మేర తగ్గించవచ్చుగానీ దానికి సమయం పడుతుం దంటున్నారు. ఈ ఉత్తర్వులు కనీసం ఏడెనిమిది నెలలక్రితం వచ్చి ఉంటే ఉపయోగం ఉండేదేమో! వాయు కాలుష్యం తీవ్రత వల్ల అనేక అనర్థాలు ఏర్పడతాయి. విపరీతమైన దగ్గు, కఫం, ఊపిరా డనీయని ఆస్త్మా, శ్వాసకోశ వ్యాధి, అలెర్జీలు, కేన్సర్ వగైరాలు వస్తాయి. ఢిల్లీ నగరంలో ఇప్పుడున్న వాయు కాలుష్యం వల్ల మనిషి ఆయుఃప్రమాణం 6.4 ఏళ్లు తగ్గిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తు న్నారు. దేశంలో హైదరాబాద్‌తోసహా వివిధ నగరాల్లో జాతీయ వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ)లు ఏర్పాటు చేశారుగానీ వాటివల్ల ఎలాంటి ప్రయోజనం సిద్ధిస్తున్నదో అనుమానమే. పరిశ్రమల యజ మానుల్లో కాలుష్య నియంత్రణపై అవగాహన పెరిగిందా? కాలుష్య నియంత్రణ బోర్డులు చురుగ్గా వ్యవహరించి చర్యలు తీసుకుంటున్నాయా? కాలుష్యం తీవ్రతపై అవగాహన పెరిగి జనం ప్రభు త్వాలపై ఒత్తిళ్లు తెస్తున్నారా? వీటన్నిటికీ లేదన్న సమాధానమే వస్తుంది. దీపావళి టపాసులు, బాణ సంచా విషయంలో సుప్రీంకోర్టు తాజా నియంత్రణలు హర్షించదగ్గవే. కానీ ఇంత స్వల్ప వ్యవధిలో ఇవి ఎంతవరకూ సత్ఫలితాలిస్తాయన్నది అనుమానమే. పైగా రాజకీయపార్టీలు, సామాజిక సంస్థల తోడ్పాటు, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. అది జరిగే పనేనా? జల్లికట్టు, కోడిపందాలు వగైరా అంశాల్లో కోర్టు ఉత్తర్వులు ఎలా అమలయ్యాయో అందరికీ తెలుసు. జనం మనోభావాల పేరిట దేన్నయినా చలామణి చేయించే పార్టీలు, సంస్థలు ఉన్నంతకాలం ఫలి తాలు పరిమితంగానే ఉంటాయి. -
హక్కుల కార్యకర్తల అరెస్టుపై తీర్పు నేడే!
న్యూఢిల్లీ: వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను తక్షణం విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇచ్చే అవకాశముంది. మహారాష్ట్రలో గతేడాది జరిగిన ఎల్గర్ పరిషత్ సమావేశం, ఆ తర్వాత చెలరేగిన భీమా–కోరేగావ్ అల్లర్ల నేపథ్యంలో వరవరరావు, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, గౌతమ్ నవలఖ, వెర్మన్ గంజాల్వెజ్‌లను పుణె పోలీసులు ఈ ఏడాది ఆగస్టులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులను సవాలుచేస్తూ చరిత్రకారిణి రొమీలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, ప్రొ.సతీశ్ దేశ్‌పాండేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయడంతోపాటు ఈ ఘటనపై సమగ్ర విచారణ కోసం సిట్‌ను నియమించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో వరవరరావు సహా ఐదుగురు హక్కుల కార్యకర్తలను పోలీసులు ఆగస్టు 29 నుంచి గృహనిర్బంధంలో ఉంచారు. ఈ కేసులో తీర్పును ఈ నెల 20న రిజర్వు చేసిన సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం.. శుక్రవారం తుది తీర్పును వెలువరించే అవకాశముంది. -
జంట పేలుళ్ల కేసులో నేడే తుది తీర్పు
-
మా అప్పీల్‌పై వాదనలు వినండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల బహిష్కరణ అంశంపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేల తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ సోమవారం హైకోర్టును కోరారు. ఈ అప్పీల్‌పై వాదనలు వినడంతో పాటు విచారణార్హత తేల్చాలని కోర్టును కోరారు. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం అసెంబ్లీ జరగడం లేదని, అంత అత్యవసరం ఏముందని ప్రశ్నించింది. బహిష్కరణ తీర్మానంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు మళ్లీ ఇక్కడ ఎలా పిటిషన్ దాఖలు చేస్తారని అడిగింది. ఈ విషయం పైనా వాదనలు వినిపిస్తామని, అందువల్లే వాదనలు వినాలని కోరుతున్నట్లు వైద్యనాథన్ చెప్పారు. అప్పీల్ దాఖలుకు అనుమతివ్వడంపై ఈ నెల 26న విచారణ చేపడతామని దర్మాసనం తెలిపింది. -
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
-
సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి
సాక్షి,చిత్తూరు: పదేళ్ల క్రితం సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై హత్యాయత్నం కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 2007 డిసెంబర్ 31న సీకే బాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని నిందితులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీకే బాబు గన్‌మెన్ సురేంద్ర మృతి చెందగా, సీకే బాబుకు, అతని అనుచరులకు గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన వన్‌టౌన్ పోలీసులు 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. సీకే బాబు సహా 81మంది సాక్షుల్ని పోలీసులు చేర్చగా, కోర్టు 51 మందిని విచారించి 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఇందులో ఏ-1 నిందితుడు, టీడీపీ నాయకుడు కటారి మోహన్ మృతిచెందగా, ఏ-2 నిందితుడైన చింటూకు కోర్టు జీవితఖైదును విధించింది. మేయర్ కటారి అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడుగా ఇప్పటికే వైఎస్ఆర్ కడప జిల్లా సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. -
సీకేబాబుపై హత్యాయత్నం కేసులో నేడు తీర్పు
చిత్తూరు (అర్బన్): పదేళ్ల క్రితం చిత్తూరులో అప్పటి మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. సీకే బాబు వెళుతున్న కారును లక్ష్యంగా చేసుకుని పట్టపగలు నడిరోడ్డు పై మందుపాతర పేల్చారు. ఒక పోలీసు కానిస్టేబుల్ (గన్‌మెన్) చనిపోగా.. సీకే త్రుటిలో బయటపడ్డారు. ఈ కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా ఉంటుందోనని చిత్తూరు వాసులు ఆసక్తిగా ఉన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రెండు రోజుల నుంచి నగరంలోని ప్రముఖులకు, కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులకు కౌన్సెలింగ్ కూడా ఇస్తున్నారు. 2007 డిసెంబరు 31న అప్పటి చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై హత్యాయత్నం జరిగింది. సీకే.బాబు కట్టమంచిలోని తన నివాసం నుంచి గన్మెన్లు, అనుచరులతో వెళుతుండగా సాయిబాబా ఆలయం సమీపంలోని కల్వర్టు వద్ద మందుపాతర పేలింది. సీకే.బాబు గన్‌మెన్‌గా ఉన్న సురేంద్ర మృతి చెందాడు. సీకే.బాబుతో పాటు ఆయన అనుచరులు సైతం గాయపడ్డారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నిందితుల్లో టీడీపీ నాయకులు కఠారి మోహన్ (చనిపోయాడు), చింటూ, కఠారి ప్రవీణ్ (చిత్తూరు మేయర్ భర్త), జలగం మురళి, కిశోర్, గోపి, జ్యోతి, పురుషోత్తం, గిరిధర్‌రెడ్డి, ఏకాంబరం, డీఏ శ్రీనివాస్ (చిత్తూరు ఎమ్మెల్యే కొడుకు), వెంకటస్వామి, అర్జున్, రాజేష్, ఏడుకొండల యాదవ్, శ్రీను, వై.శ్రీనివాసులు, రవి ఉన్నారు. సీకే బాబుతో సహా మొత్తం 81 మందిని పోలీసులు సాక్షులుగా చేర్చారు. వారిలో 51 మందిని న్యాయమూర్తి కపర్తి విచారించి తీర్పును సోమవారానికి రిజర్వు చేశారు. కేసులో రెండో నిందితుడిగా ఉన్న చింటూ చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఇతను వైఎస్సార్ కడప సెంట్రల్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. -
కసాయి కొడుకులకు..కనువిప్పు..ఈ తీర్పు
కనిపెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిర్లక్ష్యానికి గురి చేస్తున్న కుమారులకు ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పు ఒక గుణపాఠం కానుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులను విస్మరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదనే వాస్తవాన్ని జడ్జి ఎం.సుబ్బారావు తన తీర్పు ద్వారా తేటతెల్లం చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి, ఆలమూరు: ఆలమూరు మండలంలోని గుమ్మిలేరుకు చెందిన పుల్లేటికుర్రు నాగభూషణం(72) స్థానిక శివాలయంలో అర్చకత్వం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య సత్యవతి ఏడేళ్ల క్రితం మృతి చెందింది. వృద్ధాప్యంలో ఉండటం వల్ల ఉన్న ఇల్లును కుమారులు పంచుకున్నారు. ఆయనను ఆదుకోవలసిన నలుగురు కుమారుల్లో ముగ్గురు ముఖం చాటేశారు. దీంతో కరెంట్ పనులు చేసుకుంటూ జీవిస్తున్న మూడో కుమారుడు మహేశ్వరరావు మాత్రమే తండ్రిని చేరదీశాడు. పెద్ద కుమారుడైన పీయూఆర్ఎల్కే సత్యనారాయణమూర్తి మండపేటలోని ఒక ప్రముఖ ఆలయంలో అర్చకత్వం చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. రెండో కుమారుడు వెంకట సుబ్రహ్మణ్య శర్మ తన తండ్రి నాగభూషణం చేస్తున్న అర్చకత్వాన్ని, దేవదాయశాఖ సమకూర్చిన ఇంటిని స్వాధీనం చేసుకుని ఆదాయాన్ని దర్జాగా అనుభవిస్తున్నాడు. నాలుగో కుమారుడు శ్రీప్రకాష్ రాజానగరంలోని ఒక గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మూడు సార్లు ఆత్మహత్యాయత్నం నాగభూషణం రెండో కుమారుడు తన తండ్రికి సోకిన చర్మవ్యాధిని అంటువ్యాధిగా ప్రచారం చేసి ఆలయంలోకి రాకుండా అర్చకత్వానికి దూరం చేశాడు. ఆర్థికంగా స్థిరపడిన ముగ్గురు కొడుకులు పట్టించుకోకపోవడంతో ఆయన మూడుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మూడో కుమారుడు చొరవతో బతికి బయటపడ్డాడు. ఈవిషయంపై గ్రామ పెద్దల వద్ద జరిగిన తగవులో కేవలం ఒక్కొక్క కుమారుడు నెలకు రూ.160 ఇస్తామన్న హామీని నెరవేర్చలేదు. తాను ఒక కుమారుడికి భారం కాకుడదని నాగభూషణం నిర్ణయించుకున్నాడు. తనను విస్మరించిన కుమారులకు న్యాయపరంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో 2016 జూన్ 30న ఆలమూరు కోర్టును ఆశ్రయించాడు. చివరకు న్యాయమే గెలిచింది ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాదోపవాదనలు జరుగుతుండగా గ్రామపెద్దల సూచనలతో ఒకదశలో లోక్ అదా లత్ ద్వారా జరిగిన రాజీ ప్రయత్నాలు నాగభూషణం కొడుకులు పట్టించుకోలేదు. సుదీర్ఘకాలం వాదోపవాదనలు జరిగిన అనంతరం నాగభూషణం ముగ్గురు కుమారులు తన తండ్రికి అన్యా యం చేశారనే విషయాన్ని జడ్జి సుబ్బారావు గ్రహించి ఆమేరకు నలుగురు కుమారులను మనోవర్తి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాలుగో కుమారుడు రూ. నాలుగువేలు, మిగతా ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు రూ. 1500 ఇవ్వాలంటూ ఈనెల 25న కోర్టు తీర్పును వెలువరించింది. కసాయి కొడుకులకు కనువిప్పు – ఎస్కే షరీఫ్, న్యాయవాది, ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులను పంచుకుని వృద్ధాప్యంలో పట్టించుకోని కసాయి కొడుకులకు ఈతీర్పు కనువిప్పు కలుగుతుందని నాగభూషణం తరఫు న్యాయవాది ఎస్కే షరీఫ్ అన్నారు. బాధితుడికి జరిగిన అన్యాయం తన మనస్సును కలచివేయడంతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నానన్నారు. దేశంలో తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అనేక మంది కన్న కొడుకులకు ఈ తీర్పు కనువిప్పు కావాలి. -
సంచలనాల సైనీ!
న్యూఢిల్లీ: 2జీ కేసు తీర్పు సందర్భంగా సీబీఐ న్యాయమూర్తి ఓం ప్రకాశ్ సైనీ కొన్ని కీలక, సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు వాస్తవాలతో సీబీఐ చార్జిషీటు రూపొందించిందని, నిందితులపై ఆరోపణల్ని రుజువు చేయడంలో దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. చట్టబద్ధ సాక్ష్యం కోసం ఏడేళ్ల సమయం ఎదురుచూశానని, అయితే తన ఎదురుచూపులు పూర్తిగా వ్యర్థమయ్యాయని పేర్కొంటూ సీబీఐ విచారణ తీరును ఆయన తప్పుపట్టారు. క్విడ్ ప్రొ కొ ఆరోపణలకు సీబీఐ ఎలాంటి సాక్ష్యాల్ని సమర్పించలేదని.. అందువల్ల రాజాపై ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తీర్పులో న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏడేళ్లు వ్యర్థం.. గత ఏడేళ్లుగా ఈ కేసుకు సంబంధించి ఎవరైనా సరైన సాక్ష్యాన్ని తీసుకొస్తారేమోనని అన్ని పనిదినాల్లో, వేసవి సెలవుల్లో క్రమం తప్పకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కోర్టు గదిలో కూర్చున్నాను. అయితే నా ఎదురుచూపులు వ్యర్థమయ్యాయి. న్యాయబద్ధమైన ఒక్క సాక్ష్యాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయారు. దీనిని బట్టి ప్రతి ఒక్కరూ వదంతులు, పుకార్లు, ఊహాగానాలతో కూడిన జన సామాన్య దృష్టితో ముందుకెళ్లారని అర్థమవుతోంది. న్యాయ విచారణలో అలాంటి వాటికి స్థానం లేదు. ఈ కేసులో కుట్రకు రాజా సూత్రధారి అనేందుకు రికార్డుల్లో ఎలాంటి ఆధారాలు లేవు. రాజా తప్పుచేసినట్లు, కుట్ర లేదా అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఉత్సాహంగా మొదలుపెట్టి.. సీబీఐ ఈ కేసు విచారణను ఎంతో ఆవేశంగా, ఉత్సాహంతో మొదలుపెట్టింది. కేసు విచారణ కొనసాగుతున్న కొద్దీ ఎంతో జాగత్తగా, రక్షణాత్మక ధోరణితో వ్యవహరించడం వల్ల ... ఏం నిరూపించాలని ప్రాసిక్యూషన్ భావిస్తుందో తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారింది. తుది దశలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఎస్పీపీ), సీబీఐ ప్రాసిక్యూటర్లు ఎలాంటి సమన్వయం లేకుండా పనిచేశారు. కేసు విచారణ చివరికొచ్చేసరికి ప్రాసిక్యూషన్ ప్రమాణాలు పూర్తిగా దిగజారడంతో పాటు.. ఎలాంటి దశా దిశా లేకుండా, ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లుగా తయారైంది. సీబీఐ, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అనేక దరఖాస్తులు, వివరణలు సమర్పించినా.. విచారణ చివరి దశలో మాత్రం ఒక్క సీనియర్ అధికారి, ప్రాసిక్యూటర్ కూడా వాటిపై సంతకాలు చేసేందుకు మొగ్గు చూపలేదు. దరఖాస్తులపై సంతకాల గురించి నేను ప్రశ్నించినప్పుడు.. ఎస్పీపీ సంతకం చేస్తారని సీబీఐ ప్రాసిక్యూటర్ చెప్పగా.. ఎస్‌పీపీని అడిగితే సీబీఐ సిబ్బంది సంతకం చేస్తారని సమాధానమిచ్చారు. కోర్టుకు సమర్పించిన, చెప్పిన అంశాలపై బాధ్యత తీసుకునేందుకు విచారణాధికారులు గానీ ప్రాసిక్యూటర్లు గానీ సిద్ధంగా లేరని దీనిని బట్టి అర్థమవుతోంది. తుది వాదనల సమయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనల్ని లిఖితపూర్వకంగా సమర్పించలేదు. దానికి బదులుగా.. ప్రతివాదుల తరఫు న్యాయవాదులు లిఖితపూర్వకంగా ఇస్తే తాను సమర్పిస్తానంటూ కోర్టుకు తెలిపారు. లిఖితపూర్వకంగా సమర్పించిన ప్రతులపై సంతకాలు చేసేందుకు కూడా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధంగా లేకపోవడం అత్యంత బాధాకరం. ఎవరి సంతకం లేకపోతే కోర్టులో ఆ పత్రానికి ఉపయోగం ఏమిటి? ‘క్విడ్ ప్రొ కొ’కు ఎలాంటి ఆధారాలు లేవు ఏ రాజాను ప్రశ్నించే సమయంలో ప్రాసిక్యూషన్ మొదటిసారి ‘క్విడ్ ప్రొ కొ’ పదం వాడింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన మొత్తం ఆధారాల్లో.. రూ. 200 కోట్ల బదిలీని అక్రమ ప్రతిఫలంగా నిరూపించేందుకు ఎలాంటి సాక్ష్యాన్ని పేర్కొనలేదు. అలాగే కలైంగర్ టీవీలో పెట్టుబడి పెట్టిన నాలుగు సంస్థలు.. ఆ పెట్టుబడిని సాధారణ వ్యాపార లావాదేవీలుగా నమ్మించేందుకు వాటి గుర్తింపును దాచిపెట్టాయన్న ఆరోపణకు సాక్ష్యం సమర్పించలేదు. రాజాను దోషిగా నిరూపించేందుకు అవసరమైన వ్యతిరేక సాక్ష్యం లేదని సీబీఐ చేసిన నిరుపయోగమైన క్రాస్ ఎగ్జామినేషన్‌తో అర్థమవుతోంది. అందువల్ల కలైంగర్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టడంలో రాజా పాత్ర ఉందన్న ప్రాసిక్యూషన్ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. అందుకు రాజాను తప్పుపట్టలేం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కార్యాలయంలోని సీనియర్ అధికారులు వాస్తవాల్ని మన్మోహన్‌కు తెలియకుండా కప్పిపుచ్చినందుకు రాజాను తప్పు పట్టలేం. రాజా లేఖలోని సంబంధిత, వివాదాస్పద అంశాల్ని మన్మోహన్‌కు తెలియకుండా పులక్ ఛటర్జీ దాచిపెట్టారు. అందువల్ల ప్రధానిని రాజా తప్పుదారి పట్టించారని లేక ఆయనకు తెలియకుండా వాస్తవాల్ని దాచిపెట్టారన్న ప్రాసిక్యూషన్ వాదనలో ఎలాంటి నిజం లేదు. నేర్పుగా ఈ కుంభకోణాన్ని అల్లారు కొందరు నేర్పుగా కొన్ని ఎంపికచేసుకున్న వాస్తవాలతో 2జీ కుంభకోణాన్ని అల్లారు. ఊహించని స్థాయిలో అవినీతి జరిగిందని అనుకునే స్థాయికి అంశాల్ని పెద్దది చేసి చూపించారు. ఈ కేసులో తప్పుడు వాస్తవాలతో అద్భుతంగా సీబీఐ చార్జిషీటును తయారుచేసింది. అయితే 2జీ కేసులో నిందితులపై ఆరోపణల్ని రుజువు చేయడంలో విఫలమైంది. టెలికం శాఖకు చెందిన కొందరు అధికారుల చర్యలు, నిర్లిప్తత వల్ల ఈ కేసులో భారీ కుంభకోణం జరిగిందని ప్రతిఒక్కరూ భావించారు. వారి చర్యలు ఒక పెద్ద కుంభకోణం జరిగినట్లు ప్రజలు ఊహించేదిశగా ప్రేరేపించాయి. టెలికం శాఖ రికార్డుల ప్రకారం.. యూఏఎస్ఎల్(యూనిఫైడ్ యాక్సెస్ సర్వీస్ లైసెన్స్) కోసం దరఖాస్తుల పరిశీలన, లైసెన్స్‌ల కేటాయింపుల్లో కొందరు అధికారుల నిర్వాకం వల్ల ఆ శాఖలో ఎంత గందరగోళం ఉందో స్పష్టమైంది. అధికారిక బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం, స్పష్టత లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. అంతే కాదు.. వారే స్వయంగా రూపొందించిన అధికారిక రికార్డులతో తమకు సంబంధం లేదని చెప్పి చంచల మనస్తత్వంతో, పిరికితనంగా వ్యవహరించారు. రికార్డుల్లో పేర్కొన్న దానికి భిన్నంగా తప్పును మరొకరిపై నెడుతూ వాంగ్మూలమిచ్చారు. సంచలనాల సైనీ! 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఎవరూ ఊహించని రీతిలో తీర్పు ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓంప్రకాశ్ సైనీ(58) 1980ల్లో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరిన ఆరేళ్లకు పరీక్ష రాసి మేజిస్ట్రేట్ అయ్యారు. హరియాణాకు చెందిన సైనీ ఢిల్లీ ప్రత్యేక పోటా జడ్జీగా ఎర్రకోట కాల్పుల కేసులో నిందితులకు మరణశిక్ష విధించి సంచలనం సృష్టించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహ్మద్ ఆరిఫ్‌ను దోషిగా తేలుస్తూ ఆయన విధించిన మరణశిక్షను తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఖరారుచేశాయి. పలు సున్నితమైన కేసుల్ని విచారించడంతో సైనీకి కేంద్రం 24 గంటలపాటు ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. టెలికాం స్పెక్ట్రమ్ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఢిల్లీ ప్రభుత్వం సైనీ నేతృత్వంలో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. 2జీ కేసుకు ముందు కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కేసును సైనీ విచారించారు. చివరికి కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడీ సహాయకులు ఆరుగురిని దోషులుగా తేల్చి జైళ్లకు పంపారు. 2జీ కేసులో నిందితురాలైన డీఎంకే ఎంపీ, తమిళనాడు మాజీ సీఎం ఎం.కరుణానిధి కూమార్తె కనిమొళికి బెయిల్ ఇవ్వడానికి సైనీ నిరాకరించడం అనూహ్య పరిణామం. ఆమె మహిళ కాబట్టి బెయిల్ ఇవ్వాలన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ఎందరినైనా ప్రభావితం చేయగల శక్తిమంతమైన నేత కావడంతో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. 2జీ కేసు విచారణ సందర్భంగా ఎంతటి పెద్ద వ్యాపారవేత్తలనూ వదలకుండా వారు కోర్టులో క్రమశిక్షణ పాటించేలా సైనీ వ్యవహరించి అందరి ప్రశంసలు పొందారు. మొబైల్ టెలికాం రంగంలో హేమాహేమీలైన ఎయిర్టెల్ చీఫ్ సునీల్ భారతీ మిత్తల్, హచిసన్ మేక్స్ అధినేత అసీమ్ ఘోష్, స్టెర్లింగ్ సెల్యూలర్ చీఫ్ రవి రూయాలను తన ప్రత్యేక అధికారాలు ఉపయోగించి సైనీ కోర్టుకు రప్పించారు. ‘గత ఏడేళ్లుగా వేసవి సెలవులతో సహా అన్ని పనిదినాల్లో నేను ఉదయం పది నుంచి ఐదింటి వరకూ ఓపెన్ కోర్టులో కూర్చున్నా. ఎవరైనా చట్టపరంగా నిలబడే సాక్ష్యం ఏదైనా తీసుకొస్తారేమోనన్న నా ఎదురుచూపులు నిష్ఫలమయ్యాయి’అని సైనీ తన తీర్పులో చెప్పిన మాటలు ఆయన నిజాయితీకి మచ్చుతునకలు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘సుప్రీం’’ తీర్పు గోదావరి పాలు
ప్రమాదాల నివారణకు రాష్ట్ర, జాతీయ రహదారులకు దూరంగా మద్యం దుకాణాలుండాలన్న సప్రీం ఆ తీర్పునకు వక్రభాష్యం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దుకాణాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర రహదారులను ఎండీఆర్‌గా మార్పు మంగళవారం ఉత్తర్వులు జారీ జిల్లాలో యథాతథంగా 340 దుకాణాలు సాక్షి, రాజమహేంద్రవరం: మద్యం మత్తులోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి, వాటిని నివారించేందుకు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వం తనదైన భాష్యం చెప్పింది. తమ ఆదాయానికి, మద్యం వ్యాపారులకు నష్టం జరగకుండా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల నుంచి వెళుతున్న రాష్ట్ర రహదారులను ఆయా సంస్థల పరిధి వరకు జిల్లా ప్రధాన రోడ్లు (ఎండీఆర్)గా మారుస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఫలితంగా జల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న 36 దుకాణాలు మినహా మిగిలిన మద్యం దుకాణాలు యథాతథంగా కొనసాగనున్నాయి. జిల్లాలో 545 దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈసారి (2017–19 లైసెన్స్ కాలం) 534 దుకాణాలకు వేలంలో వ్యాపారులు తీసుకున్నారు. గత లైసెన్స్ కాలం (2015–17)లో 545 దుకాణాలకుగాను 499 దుకాణాలు మాత్రమే వేలంలో పాడుకున్నారు. ఇందులో 376 దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్నాయి. మొత్తం దుకాణాల్లో ఇవి 75 శాతం మేర ఉన్నాయి. 376 దుకాణాల్లో 36 దుకాణాలు జాతీయ రహదారుల వెంట ఉండగా, మిగిలిన 340 దుకాణాలు రాష్ట్ర రహదారుల వెంట ఉన్నాయి. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఉండే రహదారుల నిర్వాహణ గతంలో జిల్లా పరిషత్, స్థానిక సంస్థలు చూసేవి. అయితే ఇవి భారం కావడంతో వాటిని రాష్ట్ర రహదారులుగా మారుస్తూ రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. అయితే సుప్రీం తీర్పు వల్ల మద్యం దుకాణాల ఏర్పాటుకు ఇబ్బందులు కలుగుతుండడంతో వాటిని జిల్లా ప్రధాన రహదారులుగా మారుస్తూ జీవో జారీ చేసింది. ఫలితంగా జాతీయ రహదారుల వెంట ఉన్న 36 దుకాణాలు మినహా అన్నీ కూడా యథాతథస్థానంలో కొనసాగనున్నాయి. . ప్రజల ప్రాణాలపై ఏదీ చిత్తశుద్ధి..? రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మద్యం మత్తులో ఉండడం వల్లే జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు, సర్వేలు వెల్లడిస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మద్యం తాగినవారితోపాటు అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటి నివారణకు దేశ అత్యున్నత న్యాయస్థానం పటిష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఆదాయమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వాటికి వక్రభాష్యం చెప్పడం ప్రజల ప్రాణాలపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. అంతేకాకుండా మండలం పరిధిగా ఎక్కడైనా మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చన్న నిబంధనతో జనావాసాలు, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఓ పక్క వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటామంటూనే మరోపక్క ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోతోంది. . చేతులు మారిన కోట్ల రూపాయలు... ఏడాదికి ఒకసారి ఇచ్చే బార్లైసెన్స్ను ఐదేళ్లకు పెంచుతూ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.382 కోట్ల రూపాయల ముడుపులు ప్రభుత్వ పెద్దలకు అందినట్లు బలమైన ఆరోపణలున్నాయి. తాజాగా రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణదారుల నుంచి వాటిని ఎండీఆర్‌గా మర్పు చేసేందుకు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. వ్యాపారం సాగాలంటే రోడ్లకు దగ్గరలోనే దుకాణాలు ఉండాలి కాబట్టి అడిగిన మేరకు ముడపులు ఇవ్వాల్సి వచ్చిందని రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యాపారి వాపోయారు. -
‘నిర్భయ’ దోషులకు ఉరి
అయిదేళ్లక్రితం దేశం మొత్తాన్ని తీవ్రంగా కుదిపేసిన నిర్భయ ఉదంతంలో దోషు లకు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష ఖాయం చేయడం సరైందేనని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ కేసును అత్యంత అరుదైన ఉదంతంగా అభివర్ణించడంతోపాటు నేరస్తులపై కారుణ్యం చూపనవసరం లేదని న్యాయమూర్తులు తేల్చిచెప్పారు. ఈ ఉదంతం అందరిలో ఆగ్రహాగ్ని రగిల్చింది. అప్పట్లో ఢిల్లీలో మాత్రమే కాదు... దేశవ్యాప్తంగా అనేకచోట్ల రోజుల తరబడి సాగిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేసింది ఒకే ఒక్కటి–ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడాలని. నేర తీవ్రత అధికంగా ఉన్నదని వెల్లడైనప్పుడు సమాజంలో వెల్లువెత్తే ఆగ్రహావేశాలు ఆ స్థాయిలోనే ఉంటాయి. నిర్భయ ఉదంతంలో ఆ ఉన్మాదుల ప్రవర్తనను వర్ణించడానికి మాటలు చాలవు. క్రూర మృగాలను తలపించే రీతి ప్రవర్తనతో అందరినీ వారు విస్మయపరిచారు. పారా మెడికల్ కోర్సు చదువుతూ స్నేహితుడితో కలిసి వెళ్లి ఇంటికొస్తున్న 23 ఏళ్ల యువతిపై దుండగులు కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించిందన్న ఆగ్రహంతో మరింత పాశవికంగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన ఆమె స్నేహితుణ్ణి కూడా తీవ్రంగా గాయపరిచారు. నెత్తురోడుతున్న ఆ ఇద్దరినీ ఒంటిపై దుస్తులు కూడా మిగల్చకుండా బస్సు నుంచి బయటకు నెట్టేశారు. ఆ నిశిరాతిరి వణికించే చలిలో వారిద్దరూ కొన్ని గంటలపాటు నరకం చవిచూశారు. మీడియాలో ఇదంతా వెల్లడయ్యాక పల్లెల నుంచి ఢిల్లీ వరకూ వేలాదిగా జనం రోడ్లపైకి వచ్చారు. ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కేసులో ఒకడిని బాల నేరస్తుడిగా నిర్ధారించి మూడేళ్ల శిక్ష విధించినప్పుడు సైతం నిరసనలు పెల్లుబికాయి. 2013 సెప్టెంబర్‌లో నిందితులకు ఉరి శిక్ష విధించాక మిఠాయిలు పంచుకున్నారు. ఆ ఉదంతం సమా జాన్ని ఎంతగా కుదిపిందో ఇవన్నీ వెల్లడిస్తాయి. అందువల్లే ఆనాటి యూపీఏ ప్రభుత్వం జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలో వెనువెంటనే ముగ్గురు సభ్యుల కమిటీని నియమించి మహిళలపై జరిగే అఘాయిత్యాలకు అంతం పలికేందుకు ఎలాంటి చట్టం అవసరమో సూచించమని కోరింది. ఆ కమిటీ అసాధారణ రీతిలో పని చేసింది. వివిధ రంగాల నిపుణుల సాయంతో వివిధ వర్గాలనుంచి వచ్చిన సుమారు 80,000 సూచనలను క్రోడీకరించి చాలా స్వల్ప వ్యవధిలో ఆ కమిటీ నివేదిక సమర్పించింది. కేంద్రం కూడా అంతే వేగంతో స్పందించి తొలుత ఆర్డినె న్స్నూ, ఆ తర్వాత దాని స్థానంలో నిర్భయ చట్టాన్నీ తీసుకొచ్చింది. నిర్భయ ఉదంతం సమాజంలోనూ, పాలకుల్లోనూ తీసుకొచ్చిన కదలికను చూసి చాలామంది సంతోషించారు. మన దేశంలో ఒక చట్టం తీసుకురావాలన్నా, ఉన్న చట్టంలో అవసరమైన మార్పులు చేయాలన్నా ఎన్నో ఏళ్లు పడుతుంది. అందుకు భిన్నంగా ప్రభుత్వం చురుగ్గా కదలడం వల్ల ఇకపై మహిళలపై సాగే నేరాలను తీవ్రంగా పరిగణిస్తారన్న ఆశ ఏర్పడింది. ఈ తరహా నేరాలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కఠిన శిక్షల పరిధిలోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని అప్పట్లో ప్రభుత్వం కూడా చెప్పింది. అందుకు తగ్గట్టు నిర్భయ చట్టంలో అత్యాచారాలకు పాల్పడేవారికి గరిష్టంగా మరణశిక్ష విధించడంతోపాటు కనీసం పదేళ్ల కఠిన శిక్ష వేయాలని నిర్దేశించారు. అయితే ఆ చట్టం చేసి చేతులు దులుపుకోవడమే తప్ప ఆ మాదిరి నేరాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసు కోవాలన్న విషయంపై పాలకులు దృష్టి పెట్టలేదు. ఎప్పటిలా అత్యాచారం ఆరోపణలొచ్చినప్పుడు కేసు పెట్టడంలో తాత్సారం చేయడం, నిందితులను పట్టు కోవడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం, బాధితులనూ, వారి కుటుంబ సభ్యులనూ రోజుల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పుకోవడం కొనసాగుతోంది. మహిళల వేషధా రణ గురించి, వారు ఇళ్లకే పరిమితం కావలసిన ఆవశ్యకత గురించి మతోద్ధారకు లుగా అవతారం ఎత్తినవారు మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, స్పీకర్ల వరకూ అందరికందరూ ఎప్పటిలాగే హితబోధలు చేస్తున్నారు. నిర్భయ ఘటనలో నేరస్తులకు ఉరిశిక్ష విధించడంపై హర్షం వ్యక్తం చేస్తున్న కేంద్ర మంత్రులు, ఇతరులూ దీనికి ఏం సంజాయిషీ ఇస్తారు? ఒక నేరం జరిగినప్పుడు కారకులైనవారిని సత్వరం బంధించగలిగితే... వారిపై పకడ్బందీగా దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను సేకరించగలిగితే న్యాయస్థానాలు సైతం చురుగ్గా విచారించ డానికి, శిక్షలు విధించడానికి ఆస్కారం ఉంటుంది. వెనువెంటనే శిక్షించే విధానం అమలైతే నేరగాళ్లలో వణుకు పుడుతుంది. ఆడపిల్లల జోలికెళ్లాలంటే భయపడే పరిస్థితులుంటాయి. లైంగిక నేరాల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు, విచారణ ఎందుకు నత్తనడక నడుస్తున్నాయో ఏనాడూ దృష్టి పెట్టనివారంతా ఇప్పుడు నిర్భయ ఉదంతంలో వెలువడిన తీర్పుతోనే అంతా మారిపోతుందన్నట్టు మాట్లా డుతున్నారు. తమ లోపాలను సరిదిద్దుకోవాలన్న ధ్యాస లేదు. ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ భానుమతి తెలిపిన వివరాల ప్రకారమే దేశంలో 2015లో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 3,27,394. అందులో అత్యాచారాలు 34,651, అత్యాచార యత్నాలు 4,437. నాలుగేళ్ల గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ నేరాలు 43 శాతం పెరిగాయి. నిందితులంతా మహిళలకు పరిచితులే. అయినా చాలా కేసుల్లో వారిని పట్టుకోవడంలో ఎంతో జాప్యం జరిగింది. నిర్భయ చట్టాన్ని తీసుకురావడంలో చూపిన వేగం దాన్ని అమలు చేయడంలో కనబడటం లేదని... సంబంధిత వ్యవస్థలు ఎప్పటిలా నిర్లక్ష్యధోరణిలోనే ఉంటున్నాయని ఈ గణాం కాలు చూస్తే బోధపడుతుంది. ఈ స్థితి మారాలి. ముఖ్యంగా మహిళలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న నేతలనూ, అలాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తున్న ధోరణులనూ అదుపు చేయకుండా కిందిస్థాయి పోలీసుల్లో చైతన్యం తీసు కురావడం, వారిలో సున్నితత్వాన్ని పెంచడం సాధ్యం కాదు. ఆ దిశగా గట్టి ప్రయత్నం చేసినప్పుడే మహిళల్లో అభద్రత పోతుంది. అది నిర్భయకు నిజమైన నివాళి అవుతుంది. -
కట్నం కేసులో తల్లీకొడుకులకు జైలు
తణుకు: అదనపు కట్నం తీసుకురమ్మని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనే ఆరోపణలు రుజువు కావడంతో తల్లి, కుమారుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తణుకు కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. తణుకు సీఐ సీహెచ్ రాంబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తణుకుకు చెందిన తిరుబిల్లి రేఖరోహిణికి బెంగళూరుకు చెందిన జోసఫ్ రాజేష్‌తో ఆరు నెలల క్రితం వివాహమైంది. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధిస్తుండటంతో రేఖరోహిణి పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏఎస్సై ఆర్.బెన్నిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త జోసఫ్ రాజేష్, అత్త జోసఫ్ సెలీనాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వాదోపవాదాల అనంతరం రాజేష్, సెలీనాకు జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికీ రూ.500 చొప్పున జరిమానా విధిస్తూ తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.శేషయ్య తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ మణి వాదించగా సీఐ రాంబాబు, ఎస్సై జి.శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబుల్ ఎస్.సంగయ్య సహకరించారు. చీటింగ్ కేసులో నిందితుడికి రెండేళ్లు.. తాడేపల్లిగూడెం రూరల్ : నకిలీ సర్టిఫికెట్తో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేస్తున్న నేరంపై ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని పట్టణ పోలీసులు సోమవారం తెలి పారు. వివరాలిలా ఉన్నాయి.. చాగల్లు మండలం కూడవల్లి గ్రామానికి చెందిన గుదే వివేకానందస్వామి నకిలీ సర్టిఫికెట్తో తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో ఉద్యోగం సంపాదించాడు. 2014లో అప్పటి డిపో మేనేజర్ మూర్తి ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కొండలరావు కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో వివేకానంద స్వామికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి ఎండీఈ ఫాతిమా తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు. -
‘పురుషోత్తపట్నం ఎత్తిపోతల’ బాధిత రైతులకు ఊరట
–2013 భూసేకరణ చట్టం అమలు చేయాలి -హైకోర్టు తీర్పుతో పెరగనున్న పరిహారం -ఒనగూరనున్న అనేక ప్రయోజనాలు సీతానగరం : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూసేకరణలో భూములు కోల్పోయే రైతులు శుక్రవారం నాటి హైకోర్టు తీర్పుతో ఊరట చెందారు. గతంలో భూసేకరణలో తమ భూములు ఇచ్చేందుకు సుమారు 230 మంది రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు పెట్టారు. మిగిలిన రైతులు తమ భూములు ఎకరానికి రూ.28 లక్షలకు ఇచ్చేది లేదంటూ హైకోర్టును ఆశ్రయించారు. భూములకు ధర చెల్లింపులో 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలంటూ న్యాయవాది బి.రచనారెడ్డి రైతుల తరఫున పిటిషన్ వేశారు. 2013 భూసేకరణ చట్టం వర్తింపుతోనే ఎత్తిపోతల పథకానికి భూములు తీసుకోవాలని శుక్రవారం హైకోర్టు జడ్జి శేషసాయి తీర్పు చెప్పారని రైతులు తెలిపారు. ఈ తీర్పుతో ప్రభుత్వం నాలుగు రెట్ల ధరను పరిహారంగా అందించాలి. అలాగే ఆర్ఆర్ ప్యాకేజీ అమలు చేయాలి. దీనితో పాటు ఈ భూములపై ఆధారపడిన కూలీలకు ఆరునెలల కూలి చెల్లించాలి. భూములు కోల్పోయే కుటుంబంలోని 18 ఏళ్ళు నిండిన యువకులకు ఉద్యోగం లేదా రూ.5 లక్షల పరిహారం చెల్లించాలి. అలాగే ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించి, గ్రామ సభలు జరపాలి. బహుళ పంటలు పండే భూములకు రెట్టింపు పరిహారం చెల్లించాలి. ఇలా పలు అంశాలు 2013 భూసేకరణ చట్టంలో పొందుపర్చి ఉన్నాయి. వీటిని అమలు పర్చాలంటే ఆరునెలలు పట్టే అవకాశం ఉంది. అయితే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసిన రైతుల భూముల్లో పనులు యథావిధిగా జరుగుతాయి. -
హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు
చిన్న మల్కాపురంలో ఉద్రిక్తత కర్నూలు(లీగల్)/ డోన్‌టౌన్: డోన్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చిన్నమల్కాపురంలో నివాసముంటున్న ఎం.శ్రీనివాసరెడ్డి హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు నాలుగో అదనపు జిల్లా కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. నంద్యాలకు చెందిన ఎం.శ్రీనివాసరెడ్డి తన సోదరి లీలావతిని డోన్ మండలం చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. వివాహం జరిగిన కొన్నాళ్లకు అనారోగ్యంతో శివశంకర్‌రెడ్డి మృతిచెందగా, ఆయనకున్న 30 ఎకరాల మైన్స్ వ్యాపారం చూసేందుకు శ్రీణివాసరెడ్డి నంద్యాల నుంచి తన నివాసాన్ని చిన్న మల్కాపురం మార్చాడు. లీలావతికి చెందిన మైన్స్ వ్యాపారంపై కన్నేసిన వారి బంధువు ఎస్.మహానందిరెడ్డి(ఏ1) తనకు భాగం ఇవ్వాలని తగాదా పడేవాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి కోర్టులో కేసు వేశాడు. ఈ క్రమంలో తన న్యాయవాదిని కలిసేందుకు 2013 ఏప్రిల్ 14వ తేదీన సాయంత్రం కర్నూలుకు చేరుకున్నాడు. తన పని పూర్తయిన తర్వాత రాత్రి చిన్న మల్కాపురం బయలుదేరాడు. విషయాన్ని ముందే తెలుసుకున్న ప్రత్యర్థులు డోన్–చిన్న మల్కాపురం రహదారిలో కాపు కాశారు. శ్రీనివాసరెడ్డి ప్రయాణిస్తున్న స్కార్పియోను అడ్డుకుని.. అతనిపై మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. నిందితులుగా మహానంది, సర్పంచ్ వెంకట సుబ్బమ్మ, పారిశ్రామిక వేత్త కృష్ణారెడ్డి దంపతుల ప్రథమ కుమారుడు మాజీ సింగిల్‌విండో అధ్యక్షుడు గోపాల్‌రెడ్డితోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. కేసు విచారణ అనంతరం ఎస్.మహానందరెడ్డి, గోపాల్‌రెడ్డిపై మాత్రమే నేరం రుజువు కావడంతో వారికి జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి టి.రఘురాం తీర్పు చెప్పారు. మిగిలిన ఏడుగురు నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో ఎ.నరేంద్రమూర్తి నాయుడు, ఈడిగ వెంకటేష్ గౌడు, తెలుగు నాగరాజు, డి.సుబ్బరామిరెడ్డి, వి.చిన్నలక్ష్మన్న, గొల్ల సంజప్ప, రేపల్లె రాజేంద్రకుమార్లపై కేసును కొట్టివేశారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ రాజేంద్రప్రసాద్ వాదించారు. హత్యకేసులో ఇద్దరికి జీవిత ఖైదు పడటంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. -
గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు
-
షరతులు వర్తిస్తాయ్
కోడి పందేలపై హైకోర్టు ఆదేశాలను సమర్థించిన సుప్రీం కోర్టు కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని.. ఎక్కడబడితే అక్కడ దాడులు చేయొద్దని ఆదేశాలు కోర్టు ఆదేశాలు అమలు చేస్తాం : ఎస్పీ భాస్కర్ భూషణ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలను నిరోధించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. అయితే, కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని.. ఎక్కడబడితే అక్కడ దాడులు చేయొద్దని ఆదేశించింది. ఇలాంటి మినహాయింపులను అడ్డం పెట్టుకుని సంక్రాంతి రోజుల్లో పందేలు వేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పందేల సందర్భంగా కోళ్లకు కట్టే కత్తులను స్వాధీనం చేసుకోవచ్చని చెప్పిన సుప్రీం కోర్టు పందెం కోళ్లను మాత్రం స్వాధీనం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పోలీసులు దీని కోసం ఎక్కడబడితే అక్కడ దాడులు చేయకూడదని, ఈ పందేలకు గుర్తింపు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తనిఖీలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. కోడి పందేలను నిరోధించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ జిల్లాకు చెందిన నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు పైవిధంగా ఉత్తర్వులిస్తూ.. కేసు విచారణను నెల రోజులపాటు వాయిదా వేసింది. ఆచితూచి అడుగులు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కోడి పందేలు నిర్వహించే వారితోపాటు కోళ్లకు కత్తులు కట్టేవారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతూ వచ్చారు. గతంలో పందేలపై దాడులు చేసినపుడు కోళ్లను కూడా స్వాధీనం చేసుకునేవారు. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కోళ్లను స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆంక్షల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై పోలీసులు కసరత్తు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామని, దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ’సాక్షి’కి తెలిపారు. మరోవైపు కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా సంప్రదాయం పేరుతో కోడిపందేలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడి పందేలకు అనుమతి ఇవ్వకపోయినా, కోర్టులు అక్షింతలు వేసినా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆఖరి నిముషంలో ఇచ్చే ఆదేశాలతో జిల్లాలో ఏటా కోడిపందేలు నిరాంటంకంగా సాగిపోతున్నాయి. బరుల వద్దే గుండాట, పేకాట, కోతాట వంటి జూదాలకు కూడా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. బరుల ఏర్పాటు అధికార పార్టీ నేతలే చేస్తుండటంతో సంక్రాంతి మూడు రోజులైనా అనుమతి వస్తుందన్న ఆశతో పందేల రాయుళ్లు ఉన్నారు. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు కోడిపందేలపై దాడుల కోసం జాయింట్ యాక్షన్ టీమ్‌ల ఏర్పాటుకు శనివారం చివరి రోజు కావడంతో ఆ దిశగా జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. -
'ఉగ్రవాదులకు ఉరి శిక్షే సరైన శిక్ష'
-
'మా బాధ వారికి తెలిసేలా శిక్షించండి'
-
దిల్సుఖ్నగర్ పేలుళ్లపై తీర్పు వాయిదా
హైదరాబాద్: 2013 దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసుపై తుది తీర్పును డిసెంబర్13కు వాయిదా వేస్తున్నట్లు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం పేర్కొంది. పేలుళ్ల ఘటనలో 18మంది మరణించగా, 138మంది గాయాలపాలయ్యారు. రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్ లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరం, పేలుడు పదార్ధాల యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో 157మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఇందుకు సంబంధించిన 502 డాక్యుమెంట్లను పరిశీలించింది. -
దిల్ సుఖ్ నగర్ పేలుళ్లపై తుది తీర్పు
-
చీటింగ్ కేసులో నిందితులకు జైలు
కర్నూలు(లీగల్): ఫోర్జరీ దస్త్రాలను సృష్టించిన ఇద్దరు నిందితులకు ఏడాది కఠిన కారాగారశిక్ష, ఒక్కొక్కరికి రూ.15 వేలు జరిమానా విధిస్తూ కర్నూలు స్పెషల్ ఎకై ్సజ్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. బాధితుడు జి.సుందర్రాజన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు.. 1984లో ఇతని తండ్రి స్థానిక లేపాక్షి నగర్లో ఒక ఇంటిస్థలాన్ని కొనుగోలు చేశారు. ఆయన తన కుటుంబాన్ని హైదరబాద్‌కు మార్చి 2004లో అక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత సుందరరాజన్ తన తండ్రి ఇంటి ప్లాటును గమనించాల్సిందిగా మామిదాలపాడు గ్రామానికి చెందిన రాఘవరెడ్డికి చెప్పి అందుకు సంబంధించిన జిరాక్స్ కాపీలను ఇచ్చారు. అయితే ఇవి వెల్దుర్తి మండలం గుంటుపల్లికి చెందిన నిందితుడు రమణారెడ్డి వద్దకు చేరడంతో ఆయన.. ఫోర్జరీ పత్రాలను సృష్టించి తన పేరు మీద జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ చేరుకున్నారు. ఈ స్థలాన్ని కర్నూలుకు చెందిన కె.భాస్కర్‌కు విక్రయించాడు. దీంతో బాధితుడు విషయం తెలుసుకుని నిందితులు కె.భాస్కర్, రమణారెడ్డి, రాఘవరెడ్డిలపై ఫిర్యాదు చేశారు. కోర్టులో కె.భాస్కర్, రమణారెడ్డిలపై మాత్రమే నేరం రుజువు కావడంతో వారికి ఒక ఏడాది కారాగారశిక్ష, రూ.15 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. మరో నిందితుడు రాఘవరెడ్డిపై నేరం రుజువు కాకపోవడంతో అతనిపై కేసును కోర్టు కొట్టివేసింది.