సల్మాన్ జైలుకెళ్లాక.. పరిస్థితి ఏంటి? | salman khan jailed, what happens next? | Sakshi
Sakshi News home page

సల్మాన్ జైలుకెళ్లాక.. పరిస్థితి ఏంటి?

May 6 2015 1:26 PM | Updated on Sep 3 2017 1:33 AM

సల్మాన్ జైలుకెళ్లాక..  పరిస్థితి ఏంటి?

సల్మాన్ జైలుకెళ్లాక.. పరిస్థితి ఏంటి?

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. 5 సంవత్సరాలు జైలు శిక్ష పడింది.

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ దోషిగా తేలాడు. 5 సంవత్సరాలు  జైలు శిక్ష పడింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న సల్మాన్ను జైలు అధికారులకు అప్పగించనున్నారు. ఆ తర్వాతి పరిస్థితి ఏంటన్నది బాలీవుడ్ను వేధిస్తున్న ప్రశ్న. సల్మాన్తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. రూ. 200 కోట్ల ప్రాజెక్టులు సల్మాన్పై ఆధారపడి ఉన్నాయి. వీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సల్మాన్ ప్రస్తుతం బజ్రంగి భైజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాల్లో నటిస్తున్నారు. షూటింగ్లో పాల్గొన్న సల్మాన్.. కోర్టుకు హాజరయ్యేందుకు మంగళవారం ముంబై వచ్చారు.

బజ్రంగి భైజాన్ చిత్రం జూలై 25న విడుదల చేయాలని భావించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు డైలమాలోపడ్డారు. జైలుకు వెళ్లడం వల్ల ఆయన చిత్రాలపై ప్రతికూలం ప్రభావం చూపనుంది. సల్మాన్తో ఒప్పందం చేసుకున్న బ్రాండ్ ఎండార్స్మెంట్ల పరిస్థితి కూడా అంతే. ఇక సల్మాన్ టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ 8లో నటిస్తున్నారు. ఇక నుంచి ఈ షోకు దూరం కావాల్సిన పరిస్థితి. సల్మాన్ హైకోర్టులో అపీలు చేసుకోవచ్చు. సల్మాన్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement