ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగారి అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ ధర్మేశ్ శర్మ తెలిపారు. 2017లో మైనర్ బాలికను బీజేపీ ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు మారింది.
గోప్యంగా జరిగిన విచారణలో ఈ నెల 2న నిందితుడు తన వాదనలు వినిపించగా, సోమవారం సీబీఐ తన వాదనలను కోర్టులో వినిపించింది. సెంగార్ నిందితుడిగా ఉన్న ఈ కేసులో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును గత జూలై 28న ఓ ట్రక్కు ఢీకొట్టింది. అనంతరం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చి ఢిల్లీలో ఉంచింది. సుప్రీం ఆదేశాలతో ఆ కుటుంబానికి సీఆర్‌పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment