High Court of Delhi
-
లిక్కర్ స్కాం: సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు షాక్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. సరైన కారణం లేకుండానే కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారని చెప్పలేమని విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు తెలిపింది. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తెలిపింది. అయితే ఢిల్లీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు బెయిల్ కోసం సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయనున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.Aam Aadmi Party (AAP) says, "Arvind Kejriwal will approach Supreme Court, challenging the order of the Delhi Court. At Supreme Court, he will challenge his arrest by the CBI as well as appeal for bail." https://t.co/Ry9m0zxCft— ANI (@ANI) August 5, 2024కాగా లిక్కర్ ఈడీ కేసులో ఇప్పటికే కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో లిక్కర్ కేసులో సీబీఐ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సీఎం కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. గతవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై వాదానులు ముగియడంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది. నేడు ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. -
‘ఐదు’ తప్పి, ఆరులో ప్రమోషన్ కోసం న్యాయపోరాటం
దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా ఐదో తరగతి చదువుతున్న ఓ బాలుడు ఫెయిల్ కావడంతో ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు ఆ పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ పదేళ్ల బాలుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. బాలల హక్కుల కోసం జరిగిన ఈ పోరాటంలో తల్లిదండ్రులు, న్యాయవాదులు ఆ బాలునికి మద్దతుగా నిలిచారు. ఈ కేసు అలకనందలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. 2023-24 సంవత్సరంలో 10 ఏళ్ల బాలుడు ఐదవ తరగతి పరీక్షకు హాజరయ్యాడు. అయితే సదరు పాఠశాల యాజమాన్యం ఆ బాలుడు ఫెయిలయ్యాడనే విషయాన్ని తెలియజేయకుండా 15 రోజుల వ్యవధిలో తిరిగి అతనికి మరోమారు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఆ బాలుడు ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ బాలుడిని ఆరో తరగతికి ప్రమోట్ చేసేందుకు పాఠశాల యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఆ విద్యార్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఇది విద్యా చట్టంలోని సెక్షన్ 16(3)ని ఉల్లంఘించడమేనని ఆ బాలుడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఆ బాలుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జస్టిస్ సి హరిశంకర్ ధర్మాసనం ఆ బాలునికి సిక్స్త్‌లో అడ్మిషన్ కల్పించకపోతే అతని చదువు దెబ్బతింటుందని పేర్కొంది. ఆరో తరగతిలో ఆ బాలుడిని కూర్చోవడానికి పాఠశాల అనుమతిస్తే, అది పాఠశాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని వ్యాఖ్యానించింది. దీనికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు సదరు ప్రైవేట్ స్కూల్‌తో పాటు విద్యా డైరెక్టరేట్‌ను ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 4న జరగనుంది. తన ఫెయిల్యూర్ గురించి స్కూల్ తనకు తెలియజేయలేదని కోర్టులో పిటిషన్ వేసిన బాలుడు పేర్కొన్నాడు. అంతేకాకుండా పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు రెండు నెలల సమయం కావాలని కోరాడు. దీంతో సదరు పాఠశాల యాజమాన్యం రెండు నెలల తరువాత ఆ విద్యార్థికి తిరిగి పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించింది. -
జీఎస్టీ షోకాజ్ నోటీసులపై బొంబాయి హైకోర్టుకు డ్రీమ్ 11
న్యూఢిల్లీ: ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్11 తన ప్లాట్‌ఫారమ్‌పై పెట్టిన పందాలపై రెట్రాస్పెక్టివ్ (గత లావాదేవీలకు వర్తించే విధంగా)గా 28 శాతం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధించడాన్ని సవాలు చేసింది. ఈ మేరకు జారీ అయిన షోకాజ్ నోటీసులపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 216.94 కోట్లు, 2018–19కిగాను రూ. 1,005.77 కోట్ల పన్ను డిమాండ్ ఉందని పిటిషన్లో డ్రీమ్11 పేర్కొంది. ‘‘అత్యున్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల ప్రకారం.. ఇలాంటి షోకాజ్ నోటీసు జారీ తగదు. పిటిషనర్ (డీ11) అందించిన ఆన్లైన్ ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్రధానంగా నైపుణ్యానికి సంబంధించినది. జూదం లేదా బెట్టింగ్‌కు సంబంధించినది కాదు’’ అని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా పన్ను డిమాండ్ నోటీసు రూ.40 వేల కోట్లని, రూ. 25 వేల కోట్లని మీడియాలో భిన్న కథనాలు రావడం గమనార్హం. గేమింగ్ రంగంపై రెవెన్యూశాఖ దృష్టి! పన్ను వసూళ్లకు సంబంధించి రెవెన్యూ వ్యవస్థ ప్రస్తుతం గేమింగ్ రంగంపై దృష్టి సారించినట్లు కనబడుతోంది. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై నైపుణ్యం లేదా సంబంధిత అంశాలతో సంబంధం లేకుండా 28 శాతం పన్ను విధించడం జరుగుతుందని జీఎస్టీ మండలి ఇటీవల ఇచ్చిన వివరణ ఈ పరిణామానికి నేపథ్యం. రూ. 16,000 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లింపుల్లో లోటుపై కాసినో ఆపరేటర్ డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు జీఎస్టీ అధికారులు గత వారం నోటీసులు జారీ చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో రూ. 21,000 కోట్ల జీఎస్టీ రికవరీ కోసం ఆన్లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్కు ఇదే విధమైన షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై ఆ సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులను హైకోర్టు కొట్టివేసింది. దీనిని రెవెన్యూశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అక్టోబర్ 10వ తేదీన ఈ కేసు విచారణకు లిస్టయ్యింది. -
‘అంత తొందరెందుకు’.. ఢిల్లీ హైకోర్టులో ‘ఆదిపురుష్’కు స్వల్ప ఊరట
‘ఆపురుష్’ చిత్ర బృందానికి ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆదిపురుష్’ సినిమాఫై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన ‘పిల్’ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ చిత్రంపై అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ నెల 30న విచారణకు రావాలని ఆదేశించింది. (చదవండి: ఆదిపురుష్' 5 రోజుల కలెక్షన్స్.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్లు?) ఆదిపురుష్ చిత్రంలో వివాదాస్పదమైన అంశాలెన్నో ఉన్నాయని, నేపాల్ వంటి దేశాలు కూడా ఈ సినిమాను నిషేధించాయని హిందూ సేన లాయర్ పేర్కొన్నారు. ఈ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను, తొలగిస్తానని, డైలాగులను మారుస్తామని చిత్ర దర్శకుడు ఓంరౌత్ ప్రకటించినప్పటికీ అలాంటి చర్యలేవీ ఇప్పటివరకు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. వెంటనే ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని, ఈ మేరకు అత్యవసరంగా విచారణ జరపాలని హిందూ సేన లాయర్ కోరగా..హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఎలాంటి అత్యవసరం లేదని, జూన్ 30న విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 16న విడుదలై.. ప్రేక్షకుల నుంచి మిశ్రస స్పందనను సంపాదించుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. అంతకు మించిన నిరసనలను ఎదుర్కొంటుంది. హిందూ సంఘాలతో పాటు పలువురు ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
ఆయా శాఖల్ని ప్రతివాదులుగా పిటిషన్ దాఖలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన అంశంలో సంబంధిత శాఖలు, సంస్థల్ని ప్రతివాదు లుగా చేర్చి మరో పిటిషన్ దాఖలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఢిల్లీ హైకోర్టు సూచించింది. రేవంత్ దాఖలు చేసిన ఓ అప్లికేషన్ సోమవారం సీజే జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియమ్‌ప్రసాద్ ధర్మాసనం ముందుకొచ్చింది. 2018 లో బంగారు కూలీ పేరుతో టీఆర్ఎస్ నిధులు సమీకరించిందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతివాదిగా ఢిల్లీ హైకోర్టులో రేవంత్‌రెడ్డి పిటిషన్ దాఖలుచేశారు. ఆయన లేవనెత్తిన అంశాలపై ఐటీ శాఖ అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తూ విచారణ ముగించింది. తాజాగా ఇదే కేసులో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారని, ఐటీశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ రేవంత్ రెడ్డి అప్లికేషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం సంబంధిత శాఖల్ని ప్రతివాదులుగా చేర్చుతూ మరో పిటిషన్ దాఖలు చేయడానికి స్వేచ్ఛనిస్తూ ఈ అప్లికేషన్‌పై విచారణ ముగించింది. -
చనిపోవడం కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన వ్యక్తి... ఆపేందుకు కోర్టు మెట్లెక్కిన స్నేహితురాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 40 ఏళ్ల ఒక వ్యక్తి గత కొంతకాలంగా మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ లేదా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీన్ని దీర్ఘకాలిక న్యూరో ఇన్ఫలమేటరీ వ్యాధీ అని కూడా అంటారు. ఇది నరాలను బలహీన పరుస్తూ నెమ్మదిగా మంచానికి పరిమితం చేసే అరుదైన వ్యాధి. అతనికి ఈ వ్యాధి లక్షణాలను 2014లో తొలిసారిగా గుర్తించారు వైద్యులు. అతను ఎయిమ్స్‌లో కొన్నేళ్ల పాటు చిక్సిత తీసుకున్నాడు. దాతల సమస్య, తర్వాత కరోనా రావడం వంటి తదితర సమస్యల నడుమ ఆ వ్యక్తికి చికిత్స కొనసాగించ లేకపోయారు అతని తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆ వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. కేవలం కొన్ని అడుగులు మాత్రమే వేయగలడు. దీంతో ఆ వ్యక్తి అనాయసంగా లేదా కారుణ్య మరణం పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతను స్విట్జర్లాండ్ వెళ్లాడు. దీంతో అతడి స్నేహితురాలు అతన్ని ఆపేందుకు ఢిల్లీ హైకోర్టు మెట్టెక్కింది. తన స్నేహితుడికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆమె పిటిషన్లో తన స్నేహితుడు అరుదైన న్యూరో ఇన్ఫలమేటరీ వ్యాధితో బాధపడుతున్నాడని, దాతల సమస్య కారణం చికిత్స కొనసాగించలేకపోయమని పేర్కొంది. అతనికి భారత్‌లో లేదా విదేశాల్లో చికిత్స అందించే ఆర్థిక పరిస్థితులు లేవు. కానీ అతను కారుణ్య మరణానికి వెళ్లాలనే గట్టి నిర్ణయంతో ఉన్నాడు. దీన్ని వృధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు తట్టుకోలేరు. పైగా వారికి తమ కొడుకుకి ఏదో ఒక రోజు నయమవుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు చికిత్స కోసం స్విట్జర్లాండ్ వెళ్తున్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి వీసా పొందిన తన స్నేహితుడి వైద్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్య బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అంతేకాదు ఆమె తమ అభ్యర్ధను మన్నించి అతన్ని ఆపకపోతే తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు తీవ్ర మనో వేదనను, పుత్ర శోకాన్ని మిగిల్చిన వారవుతారని పిటిషన్లో పేర్కొంది. (చదవండి: క్షమాపణలు కోరిని బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్) -
‘స్వలింగ వివాహాలను అనుమతించలేం’
సాక్షి, న్యూఢిల్లీ : స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, న్యాయవ్యవస్థ, సమాజం, మన విలువలు గుర్తించలేదని, ఇలాంటి వివాహాలను అనుమతించలేమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్టం (హెచ్ఎంఏ), ప్రత్యేక వివాహ చట్టం కింద స్వలింగ వివాహాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలాన్‌ల ఎదుట సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రభుత్వ వాదనను వినిపించారు. స్వలింగ జంటల మధ్య వివాహాన్ని మన చట్టాలు, సమాజం, న్యాయవ్యవస్థ గుర్తించవని పేర్కొంటూ ఈ తరహా వివాహాలకు అనుమతిస్తూ పిటిషనర్ కోరిన ఊరటను కల్పించడాన్ని మెహతా వ్యతిరేకించారు. ఈ తరహా వివాహాలను చట్టబద్ధం చేయాలని, ఊరట కల్పించాలని పిటిషనర్ కోరారని ఇందుకు అనుమతిస్తే ఇది పలు చట్ట నిబంధనలకు విరుద్ధమవుతుందని అన్నారు. హిందూ వివాహ చట్టంలో వివాహాల నియంత్రణ, వివాహేతర సంబంధాల నివారణకు పలు నిబంధనలు భార్య, భర్తల గురించి ప్రస్తావిస్తాయని స్వలింగ జంటల్లో ఈ పాత్రలను ఎలా చూస్తారని మెహతా ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా పద్ధతులు మారిపోతున్నాయని, అయితే అవి భారత్‌కు వర్తించవచ్చు..వర్తింపకపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి : చనిపోయేవరకు స్వలింగ సంపర్కులని తెలియదు ఈ కేసులో పిటిషన్ అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది. ప్రభావితమయ్యే వారు బాగా చదువుకున్నవారని, వారు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. పరస్పర అంగీకారంతో జరిగే స్వలింగ సంపర్క చర్యలను సుప్రీంకోర్టు నేరపూరిత స్వభావం నుంచి తొలగించినా స్వలింగ జంటల వివాహాలు ఇప్పటికీ సాధ్యం కావడం లేదని పిటిషన్ వాదించింది. ఇక స్వలింగ వివాహాన్ని రిజిస్టర్ చేసేందుకు నిరాకరణకు గురైన వ్యక్తుల వివరాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభిజిత్ అయ్యర్ మిత్రాను కోర్టు కోరింది. తదుపరి విచారణను అక్టోవర్ 21కి హైకోర్టు వాయిదా వేసింది. -
‘ఉన్నావ్’ రేప్ కేసు తీర్పు 16న
ఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ‘ఉన్నావ్’లో మైనర్ బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగారి అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసులో తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. ఈ నెల 16న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు జడ్జి జస్టిస్ ధర్మేశ్ శర్మ తెలిపారు. 2017లో మైనర్ బాలికను బీజేపీ ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్ చేశారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు మారింది. గోప్యంగా జరిగిన విచారణలో ఈ నెల 2న నిందితుడు తన వాదనలు వినిపించగా, సోమవారం సీబీఐ తన వాదనలను కోర్టులో వినిపించింది. సెంగార్ నిందితుడిగా ఉన్న ఈ కేసులో బాధితురాలు ప్రయాణిస్తున్న కారును గత జూలై 28న ఓ ట్రక్కు ఢీకొట్టింది. అనంతరం ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబానికి ఢిల్లీ మహిళా కమిషన్ ఆశ్రయమిచ్చి ఢిల్లీలో ఉంచింది. సుప్రీం ఆదేశాలతో ఆ కుటుంబానికి సీఆర్పీఎఫ్ బలగాలతో రక్షణ కల్పించారు. -
‘భారత్’ మూవీ విడుదలపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన భారత్ మూవీ విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తక్షణం విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. దేశం పేరుతో రూపొందిన ఈ సినిమా దేశ సాంస్కృతిక, రాజకీయ ప్రతిష్టను మసకబార్చేలా ఉందన్న పిటిషనర్ ఆరోపణలపై విచారణకు హైకోర్టు ముందుకొచ్చింది. జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో తమ పిటిషన్‌పై సత్వరమే విచారణ చేపట్టాలన్న పిటిషనర్ల వినతిని జస్టిస్ జేఆర్ మిధా, జస్టిస్ చందర్‌శేఖర్‌లతో కూడిన వెకేషన్ బెంచ్ అంగీకరిస్తూ దీనిపై ఈరోజే విచారిస్తామని పేర్కొంది. ఎంబ్లమ్స్, నేమ్స్ చట్టం ప్రకారం భారత్ పేరును ఎలాంటి వ్యాపారం, వర్తకం, వృత్తి లేదా ట్రేడ్‌మార్క్, పేటెంట్‌లాగా వాడుకోవడం నిషిద్ధమని పిటిషనర్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం ‘భారత్’ దేశ అధికారిక నామమని, ఈ పేరుతో సినిమా టైటిల్ సరైంది కాదని పిటిషనర్ వికాస్ త్యాగి నివేదించారు. సినిమా విడుదలపై మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. -
రెండాకులు.. అన్నాడీఎంకేవే
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ చిహ్నం ‘రెండాకులు’ను పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయి స్తూ ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పు చెప్పింది. గతంలో కేం ద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ అగ్రనేతల్లో విభేదాలొచ్చి విడిపోయారు. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలు రెండాకుల చిహ్నం కోసం పోటీపడ్డాయి. చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో రెండాకుల చిహ్నం కోసం మూడు వర్గాలూ ఈసీని ఆశ్రయించాయి. అయితే, రెండాకుల చిహ్నం ఎవరికీ చెందకుండా తాత్కాలిక నిషేధం విధించింది. ఎన్నికల తర్వాత మూడు వర్గాలు ఈసీ వద్ద తమ వాదనలకు బలం చేకూరుస్తూ అనేక డాక్యుమెంట్లను సమర్పించాయి. కొన్నిరోజుల తర్వాత ఎడపాడి, పన్నీర్ సెల్వం ఏకమైపోగా శశికళ వర్గం ప్రతినిధిగా టీటీవీ దినకరన్ పోటీపడ్డారు. విచారణ జరిపాక ఎడపాడి, పన్నీర్‌సెల్వం నేతృత్వంలో అన్నాడీఎంకే పార్టీకే రెండాకుల చిహ్నాన్ని కేటాయిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసీ నిర్ణయాన్ని దినకరన్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో వాదో పవాదాలు ముగియగా రెండాకుల చిహ్నాన్ని ఎడపాడి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకేకు కేటాయిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. -
‘నేషనల్ హెరాల్డ్’ ఖాళీ చేయాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వార్తా సంస్థకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్ ఢిల్లీలోని ఆఫీస్‌ను ఖాళీ చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు డిసెంబరులో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. దేశ రాజధాని ప్రాంతంలో గల ఢిలీ-ఐటీవో భవనంలో హెరాల్డ్ సంస్థ గత 56 ఏళ్లుగా కొనసాగుతోంది. కాగా, ఐటీవో ప్రాంతంలో ఎలాంటి వార్తా సంస్థలు కొనసాగరాదంటూ కేంద్రం గతంలోనే కోర్టుకు విన్నవించింది. గత పదేళ్లుగా ఐటీవో ప్రాంతంలో వార్తా సంస్థల నిర్వహణకు అనుమతివ్వడం లేదని తెలిపింది. 56 ఏళ్ల క్రితం అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్‌కు ఇచ్చిన లీజును ఈ మేరకు కేంద్రం రద్దు చేసింది. దీంతో ఐటీవో భవనంలో కొనసాగుతున్న నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని డిసెంబరులో కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
ఎందాకొచ్చింది మీ దర్యాప్తు?
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు సోమవారం సీబీఐని తలంటింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌ను రియో ఒలింపిక్స్ (2016)లో పాల్గొనకుండా డోపీగా మార్చిన ఉదంతంపై విచారణ ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించింది. ‘రియో’కు అర్హత పొందిన నర్సింగ్‌ను మెగా ఈవెంట్ నుంచి తప్పించాలనే దురుద్దేశంతో కొందరు అతను తినే ఆహారంలో డ్రగ్స్ కలిపినట్లు ఆరోపణలొచ్చాయి. ఏదేమైనా డోపీ మరకతో నర్సింగ్ చివరి నిమిషంలో ఒలింపిక్స్‌కు దూరమయ్యాడు. అనంతరం న్యాయపోరాటం చేస్తున్నాడు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేకుండా ఉంది. దీంతో సీబీఐ తీరుపట్ల హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ ఎప్పటికీ పూర్తి చేస్తారని, దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తదుపరి కోర్టు విచారణ జరిగే ఫిబ్రవరి 1వ తేదీకల్లా తెలపాలని జస్టిస్ నజ్మీ వాజిరి ఆదేశించారు. ‘ఇప్పటి వరకు ఏం చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఎందుకు చర్యలు చేపట్టలేదు. ఇది సీబీఐ అనుకుంటున్నారా లేక మరేదైనా ఏజెన్సీనా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెజ్లింగ్, బాక్సింగ్ క్రీడాకారుల కెరీర్ నాశనమవడం భారత క్రీడల ప్రగతికి చేటని జస్టిస్ నజ్మీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
‘ఆ పాపాలకు మూల్యం చెల్లిస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌ను ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చడంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. సజ్జన్ కుమార్‌ను దోషిగా హైకోర్టు తేల్చడం న్యాయం గెలిచితీరుతుందని కాస్త ఆలస్యమైనా వెల్లడైందన్నారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల పాపాలకు కాంగ్రెస్ పార్టీతో పాటు గాంధీ కుటుంబం మూల్యం చెల్లించకతప్పదని వ్యాఖ్యానించారు. 1984 ఘర్షణల బాధితులకు కాంగ్రెస్ ఎలాంటి న్యాయం చేయలేదని, బాధితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం విశ్వసనీయతను పాదుకొల్పిందన్నారు. సిక్కు వ్యతిరేక ఊచకోత ఘటనల్లో అల్లర్లను ప్రేరేపించేలా సజ్జన్ కుమార్ ప్రసంగించారని, మత సామరస్యానికి విఘాతం కల్పించారని ఢిల్లీ హైకోర్టు ఆయనను దోషిగా పేర్కొంటూ జీవిత ఖైదును విధించిన సంగతి తెలిసిందే. -
రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబాకు సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. రాందేవ్ జీవితానికి సంబంధించిన పుస్తకం అమ్మకాన్ని, ప్రచురణను నిలిపేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ పబ్లిషర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నేపథ్యంలో రెస్పాండెంట్ 1 (రాందేవ్)కు నోటీసులు పంపినట్లు జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్త నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసుపై తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేసింది.జుగ్గర్‌నౌట్ బుక్స్ అనే పబ్లిషర్ ‘గాడ్మేన్ టు టైకూన్’ అనే పుస్తకాన్ని ప్రచురించగా రాందేవ్ బాబా దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పుస్తకంలో తన పరువుకు భంగం కలిగించే సమాచారం ఉందని, తన ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా అది ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. -
ఢిల్లీ హైకోర్టులో సుజనాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కేసులో టీడీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ ధర్మాసనం పిటీషనర్ వాదనలతో ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను కొట్టివేస్తూ.. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. (ఆంధ్రప్రదేశ్ మాల్యా... సుజనా!) అసలేం జరిగిందంటే.. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. సుజనా చౌదరి మొత్తం 120 డొల్ల కంపెనీలు సృష్టించి.. బ్యాంకుల నుంచి ఏకంగా రూ. 5,700 కోట్లు కొల్లగొట్టారని ఈడీ వెల్లడించింది. ఇప్పటికే సుజనా చౌదరి అక్రమాలపై ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని కోర్టు మెట్లెక్కిన సుజనా ఢిల్లీ ధర్మాసనం తీర్పుతో కంగు తిన్నారు. (బ్యాంకులకు కుచ్చుటోపీ: సుజనాకు ఈడీ షాక్..) -
రాకేష్ అస్తానాకు హైకోర్టులో స్పల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సీబీఐ ముడుపుల వ్యవహారంలో స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై అక్రమంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, దాన్ని కొట్టివేయాలని ఆస్తానా వేసిన పిటిషన్‌పై విచారించిన హై కోర్టు..తదుపరి ఆదేశాల వరకు ఆస్తానాను అరెస్ట్ చేయకూడదని సీబీఐని ఆదేశించింది. ఐతే తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలన్న విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తిరస్కరించింది. తదుపరి విచారణను అక్టోబరు 29కి వాయిదా వేసింది. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేశారు. -
ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్
ఢిల్లీ: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో శివసేన తెలంగాణ అధ్యక్షుడు తిరుపతి నరసింహ మురారి పిటిషన్ దాఖలు చేశారు.ఆర్టికల్ 226 కింద ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తోందంటూ ఎంఐఎం సిద్ధాంతాల జాబితాను ఢిల్లీ హైకోర్టుకు మురారి సమర్పించారు. -
ఆ మీడియా సంస్థలకు రూ.10 లక్షల జరిమానా
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కథువాలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక వివరాలను బయటకు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు పది లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలిక వివరాలు బహిర్గతం కావడానికి కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహమే కారణమనే అభిప్రాయాలు వెలువడిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం శుక్రవారం దేశంలోని పలు దిన పత్రికలు, టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది. నిర్భయ కేసులో సంయమనం పాటించిన మీడియా ఈ కేసులో ఎందుకు అలా చేయలేకపోయిందని ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో మీడియా సంస్థలు నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేయడం ద్వారా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఆ డబ్బును బాధితురాలి కుటుంబానికి కోర్టు అందేజేస్తుందని వెల్లడించింది. ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బహిర్గతం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. -
ఎయిర్‌లిఫ్ట్ చేయాలని హైకోర్టు తీర్పు
న్యూఢిల్లీ : దేశ రాజధాని మధ్యలో ఉన్న 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విగ్రహాన్ని ఎయిర్‌లిఫ్ట్ చేయాలని తీర్పునిచ్చింది. హనుమాన్ ఉన్న ప్రాంతంలో ప్రదేశాలు దురాక్రమణకు గురయ్యాయనే ఓ నాన్ గవర్నమెంటల్ ఆర్గనేషన్(ఎన్జీవో) దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో 108 అడుగుల హనుమాన్ విగ్రహం ఉంది. దీంతో అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దేవుడిని ఆసరగా చేసుకుని ఆ ప్రాంతంలోని ప్రదేశాలపై కొందరు దురాక్రమణ జరిపారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విన్న హైకోర్టు.. అమెరికా మాదిరి విగ్రహాన్ని ఎయిర్‌లిఫ్ట్ చేసి మరో చోట ప్రతిష్టించాలని తీర్పు చెప్పింది. ఇందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది.