ఆ మీడియా సంస్థలకు రూ.10 లక్షల జరిమానా | Delhi HC Slams Fine On Media Who Revealed Kathua Horror Victim Name | Sakshi
Sakshi News home page

ఆ మీడియా సంస్థలకు రూ.10 లక్షల జరిమానా

Apr 18 2018 2:01 PM | Updated on Apr 18 2018 3:17 PM

Delhi HC Asked Media Who Revealed Kathua Victim Details To Pay Ten Lakhs - Sakshi

న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కథువాలో సామూహిక అత్యాచారానికి, హత్యకు గురైన బాలిక వివరాలను బయటకు వెల్లడించిన మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు పది లక్షల రూపాయలు జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలైన మైనర్‌ బాలిక వివరాలు బహిర్గతం కావడానికి కొన్ని మీడియా సంస్థల అత్యుత్సాహమే కారణమనే అభిప్రాయాలు వెలువడిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్, న్యాయమూర్తి హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని సుమోటాగా స్వీకరించి విచారణ చేపట్టింది.

ఈ విషయంపై వివరణ ఇవ్వాలంటూ ధర్మాసనం శుక్రవారం దేశంలోని పలు దిన పత్రికలు, టీవీ చానళ్లకు నోటీసులు జారీ చేసింది. నిర్భయ కేసులో సంయమనం పాటించిన మీడియా ఈ కేసులో ఎందుకు అలా చేయలేకపోయిందని ప్రశ్నించింది. సున్నితమైన అంశాల్లో మీడియా సంస్థలు నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేయడం ద్వారా  భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. బాధితురాలి వివరాలు బహిర్గతం చేసిన మీడియా సంస్థలు 10 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని పేర్కొంది. ఆ డబ్బును బాధితురాలి కుటుంబానికి కోర్టు అందేజేస్తుందని వెల్లడించింది. ఎవరైనా అత్యాచారానికి గురైన బాధితుల వివరాలను బహిర్గతం చేస్తే వారికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement