Kathua
-
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు జవాన్ల మృతి
శ్రీనగర్:కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కిష్త్వార్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు విడిచారు. అదే విధంగా కథువాలో జరిగిన మరో ఎన్కౌంటర్లో భారత బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు.కాగా చత్రూలోని నైద్ఘం గ్రామ సమీపంలోని పింగ్నాల్ దుగడ్డ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులుకాల్పులు జరిపాయి. వీటిని బలగాలు ధీటుగా తిప్పికొట్టాయి. అయితే ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్కౌంటర్లో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు గాయపడినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ కొనసాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి#𝐈𝐧𝐝𝐢𝐚𝐧𝐀𝐫𝐦𝐲𝐎𝐏 𝐊𝐇𝐀𝐍𝐃𝐀𝐑𝐀In the Joint operation launched on 11 Sep by 𝐓𝐫𝐨𝐨𝐩𝐬 𝐨𝐟 𝐑𝐢𝐬𝐢𝐧𝐠 𝐒𝐭𝐚𝐫 𝐂𝐨𝐫𝐩𝐬 & 𝐉&𝐊 𝐏𝐨𝐥𝐢𝐜𝐞, Two Terrorists Neutralised & Large War Like Stores Recovered. 𝐎𝐩𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧𝐬 C𝐨𝐧𝐜𝐥𝐮𝐝𝐞𝐝 pic.twitter.com/QUc92EhElN— Rising Star Corps_IA (@RisingStarCorps) September 13, 2024ఇక ఉదంపూర్ జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన కొద్ది రోజులకే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. గత జూలైలో దోడాలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ముడిపడి ఉన్న ఉగ్రవాదులే తాజా కాల్పుల్లోనూ పాల్గొన్నట్లు సంబధిత వర్గాలు తెలిపాయి. దోడా ఎన్కౌంటర్లో ఓ అధికారి సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు.అయితే శనివారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు కొన్ని గంటల ముందు ఈ దాడి జరగడం గమనార్హం. ప్రధాని రేపు దోడాను సందర్శించే అవకాశం ఉంది.దోడా, ఉదంపూర్, కథువా జిల్లాల్లో ఇటీవల తీవ్రవాద దాడులు పెరిగాయి దోడాలో జరిగిన ఆపరేషన్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఇద్దరు ఆర్మీ కెప్టెన్లు మరియు ఏడుగురు సైనికులతో సహా దాదాపు డజను మంది మరణించారు.ఇక సెప్టెంబరు 18న దక్షిణ కాశ్మీర్ జిల్లాలైన అనంత్‌నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్‌లోని 16 స్థానాలతో పాటు చీనాబ్ లోయ ప్రాంతంలోని దోడా, కిష్త్వార్, రాంబన్ జిల్లాల్లో ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కిష్త్వార్, దోడా, రాంబన్ జిల్లాల్లో భద్రతను పెంచారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, పోలింగ్ స్టేషన్ల భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. జమ్మూ, కథువా, సాంబా జిల్లాలో సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న రెండో, మూడో దశలలో ఓటింగ్ జరగనుంది. -
జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూ కశ్మీర్లో బుధవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఉదంపూర్, కథువా జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచారానికి సంబంధించి సమాచారం అందుకున్నఆర్మీ ప్రత్యేక బలగాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు అక్కడికి చేరుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.భారీ వర్షాలు, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నా ఉగ్రవాదులను ఏరివేయడంలో భద్రతా బలగాలు విజయం సాధించాయి. కథువా జిల్లాల్లో చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు టెర్రరిస్టులను అంతమొందించారు. హతమైన ఉగ్రవాదుల నుంచి ఎం4 రైఫిల్, ఏకే రైఫిల్, పిస్టల్ సహా పలు ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో భారీగా బలగాలను మోహరించారు. ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
కథువా ఉగ్రదాడిని ఖండించిన భారత్.. ప్రతీకారం తీర్చుకుంటాం!
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు సోమవారం భారీ దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన వాహనంపై టెర్రిరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మాచేడి-కిండ్లీ-మల్హార్ రోడ్డు మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.తాజాగా కథువా ఉగ్రదాడి ఘటను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనే స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.‘కథావాలోని బద్నోటాలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఐదుగురు ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయినందుకు.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి నిస్వార్థ సేవను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది, వారి త్యాగం ప్రతీకారం తీర్చుకుంటాం. అలాగే దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను భారత్ విడిచిపెట్టదు.’ అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారం దాడికి పాల్పడ్డారు. తొలుత కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారు. వాహనం ఆగిపోవడంతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్‌తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఆర్మీ కాన్వాయ్‌లో పదిమంది సైనికులు ఉన్నారు. బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించేసరికి అక్కడి నుంచి దగ్గర్లోని అటవీ ప్రాంతంలోకి పరారైనట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. -
జమ్ము కథువాలో ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు మృతిచెందారు. ఈ దాడిలోనే మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మచెడి ప్రాంతంలో కిండ్లీ-మల్హార్ రోడ్లో పాట్రోలింగ్ నిర్వహిస్తున్న ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. గ్రెనేడ్ విసిరి.. కాల్పులకు దిగారు. ప్రతిగా సైన్యం దాడికి దిగగా.. ఉగ్రవాదులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడినవాళ్లకు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. మచెడి అడవుల్లో ఉగ్రవేట కొనసాగుతున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.ఇదిలా ఉంటే.. జమ్ములో గత 48 గంటల్లో ఉగ్రవాదులు జరిపిన రెండో దాడి ఇది. ఆదివారం రాజౌరీ జిల్లాలోని ఆర్మీక్యాంప్‌పై ముష్కరులు జరిపిన దాడుల్లో ఓ సైనికుడు గాయపడ్డాడు. ఇంకోవైపు శనివారం కుల్గాంలో ఉగ్రవాదులకు, సైన్యానికి మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మరణించగా, ఓ సైనికుడు గాయపడ్డాడు. అప్పటి నుంచి ఉగ్రవాడుల్ని సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో(మోడర్గాం, ఫ్రిసాల్ ఏరియా) ఆరుగురు ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ/భదర్వా: కశ్మీర్లో మళ్లీ ఉగ్ర ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. కథువా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమారిస్తే, దోడా జిల్లాలో చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించి పారిపోయారు. శివ్‌ఖోరీ నుంచి కాత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగి 9 మంది మరణించిన ఘటన మరువకముందే మళ్లీ కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. వివరాలను జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. ‘‘మంగళవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు సైదా సుఖాల్ గ్రామంలో చొరబడి ఒక ఇంట్లో తాగేందుకు నీళ్లు అడగడంతో గ్రామస్థులు భయపడి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన కబీర్ దాస్ అనే సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఒక పౌరునికి సైతం గాయాలయ్యాయి.చెక్‌పోస్ట్‌పై గుళ్ల వర్షందోడా జిల్లాలోని భదర్వా–పఠాన్‌కోట్ రోడ్డులోని ఛత్తర్గల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తాత్కాలిక సంయుక్త చెక్‌పోస్ట్‌ను ఆర్మీ, పోలీసులు ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి ఆ చెక్‌పోస్ట్ దాటేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
డ్రైవర్ లేకుండానే... 70 కి.మీ. వెళ్లిన గూడ్స్
జమ్మూ/చండీగఢ్: గూడ్స్ రైలొకటి డ్రైవర్ లేకుండానే 70 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయింది. అధికారులు చివరికి అప్రమత్తమై ఇసుక బస్తాలను పట్టాలపై అడ్డుగా ఉంచి రైలును నిలపగలిగారు. ఘటన జమ్మూ–జలంధర్ సెక్షన్లో ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్యలో చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్ నుంచి కంకర లోడున్న 53 బోగీల డీజిల్ లోకోమోటివ్ గూడ్స్ రైలు పంజాబ్ వైపు బయలుదేరింది. డ్రైవర్ మార్పిడి కోసం కథువా స్టేషన్ వద్ద రైలును ఆపారు. తర్వాత ఏం జరిగిందో ఏమో..రైలు నెమ్మదిగా జమ్మూ–జలంధర్ సెక్షన్ దిశగా ముందుకు సాగింది. కొంత సేపటికి విషయం తెలిసిన అధికారులు ఆ మార్గంలోని స్టేషన్లతోపాటు, రైల్–రోడ్ క్రాసింగ్‌ల వద్ద అధికారులను అప్రమత్తం చేశారు. దాదాపు 70 కిలోమీటర్ల దూరం వెళ్లాక ఊంచి బస్సీ వద్ద పట్టాలపై ఇసుక బస్తాలను అడ్డుగా ఉంచి రైలును ఆపు చేయగలిగారు. ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తునకు ఆదేశించింది. -
డ్రైవర్ లేకుండా 70 కిలోమీటర్లు పరుగులు తీసిన గూడ్సు!
జమ్ముకశ్మీర్‌లోని కథువా రైల్వే స్టేషన్లో అధికారులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్‌కోట్ వైపు ఏకంగా 70 కిలోమీర్ల దూరం వరకూ పరుగులు తీసింది. నేటి(ఆదివారం) ఉదయం 8.47 గంటలకు క్రషర్లతో నిండిన గూడ్స్ రైలు డ్రైవర్ లేకుండానే జమ్మూలోని కథువా స్టేషన్ నుండి పంజాబ్‌లోని హోషియార్పూర్ వైపు వేగంగా పరుగులుపెట్టింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే అధికారులు రైలును ఆపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఏటవాలుగా ఉన్న మార్గం కారణంగా రైలు వేగం పుంజుకుంది. దీంతో అధికారుల్లో ఆందోళన మొదలయ్యింది. ఈ విషయమై ఆ మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లకు తెలియజేశారు. ఎట్టకేలకు కథువాకు 70 కిలోమీటర్ల దూరంలోని హోషియార్‌పూర్‌లోని దాసుహా వద్ద ఆ గూడ్సను నిలిపివేయగలిగారు. రైల్వే ట్రాక్‌పై చెక్క దిమ్మెలను ఉంచి, రైలును ఆపడంలో రైల్వే ఉద్యోగులు విజయం సాధించారు. #WATCH | Hoshiarpur, Punjab: The freight train, which was at a halt at Kathua Station, was stopped near Ucchi Bassi in Mukerian Punjab. The train had suddenly started running without the driver, due to a slope https://t.co/ll2PSrjY1I pic.twitter.com/9SlPyPBjqr — ANI (@ANI) February 25, 2024 ఈ సందర్భంగా ఆ గూడ్సు డ్రైవర్ మాట్లాడుతూ తాను ఆ రైలుకు హ్యాండ్‌బ్రేక్ వేయడం మర్చిపోయానని, ఫలితంగా ఆ రైలు పట్టాల వాలు కారణంగా ఆటోమేటిక్‌గా ముందుకు కదిలిందని తెలిపాడు. రైలు కదులుతున్న సమయంలో తాను అక్కడ లేనిని చెప్పాడు. కాగా ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే ఇది ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫిరోజ్‌పూర్ రైల్వే అధికారుల బృందం జమ్మూ చేరుకుంది. -
సరిహద్దు వద్ద రూ.135 కోట్ల డ్రగ్స్ రవాణా యత్నం!
జమ్మూ: భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దు వెంట మాదకద్రవ్యాల అక్రమరవాణా ప్రయత్నానికి బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకట్టవేశాయి. మార్కెట్లో రూ.135 కోట్ల విలువచేసే 27 కేజీల హెరాయిన్‌ను భారత భూభాగంలోకి తీసుకొస్తున్న పాకిస్తానీ స్మగ్లర్‌ను బీఎస్ఎఫ్ బలగాలు హతమార్చాయి. జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో భారత్–పాక్ సరిహద్దు వెంట పర్సర్ బోర్డర్ ఔట్‌పోస్ట్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి దాటాక(తెల్లారితే బుధవారం) 2.30–3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ వివరాలను బీఎస్ఎఫ్(జమ్మూ) ఐజీ ఎన్ఎస్ జామ్వాల్ వెల్లడించారు. చదవండి: పార్లమెంటరీ కమిటీ భేటీలో హైడ్రామా -
‘ఆమె’ డ్రైవర్
జమ్మూ – కథువా – పఠాన్‌కోట్ రహదారి పెద్ద పెద్ద ట్రక్కులు, వాహనాలతో బిజీగా ఉంటుంది. అలాంటి రహదారి మీద కథువా నుండి జమ్మూ వెళ్లే ప్రైవేట్ బస్సులో ఉన్న ప్రయాణికులు మొదట ఆశ్చర్యపోయారు బస్సు డ్రైవర్ని చూసి. తర్వాత సందేహించారు. కారణం ‘ఆమె’ బస్సు నడపగలదా? అని. తర్వాత తమ ప్రయాణానికి ఢోకా లేదని నిశ్చింతంగా కూర్చున్నారు. బస్సు గమ్యస్థానానికి చేరింది. ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగుతూ బస్సు డ్రైవర్‌కి అభినందనలు తెలిపారు. ఆ బస్సు డ్రైవరు పేరు పూజా దేవి. జమ్మూ కాశ్మీర్లో మొదటిసారి బస్సు నడిపిన మహిళగా పేరుపొంది పూజాదేవి. కతువా జిల్లాలోని సంధర్–భష్లో అనే మారుమూల గ్రామానికి చెందిన పూజాదేవికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. టీనేజ్ నుంచి కార్లు, మోటార్ సైకిళ్లు డ్రైవ్ చేస్తుండేది. ఆ వయసు నుంచే పెద్ద పెద్ద వాహనాలను నడపాలనుకునేది. పూజాదేవి తాను చేస్తున్న పని గురించి వివరిస్తూ ‘నా కుటుంబం మొదట్లో నాకు మద్దతు ఇవ్వలేదు. కానీ, నాకు వేరే ఉద్యోగం ఎంచుకునేంత పెద్ద చదువు లేదు. నాకు డ్రైవింగ్ పని వచ్చు. కుటుంబ పోషణకు డబ్బు కావాలి. నాకు వచ్చిన పని నుంచే ఉపాధి పొందవచ్చు కదా అనుకున్నాను. అందుకు ఇంట్లో వాళ్లు ఆడవాళ్లు అంత పెద్ద పెద్ద వాహనాలను ఎలా నడపగలరు. శక్తి సరిపోదు అన్నారు. కానీ, నేను వారి మాటలను పట్టించుకోలేదు. కమర్షియల్ వెహికిల్స్‌ను ఎలా నడపాలో తెలుసుకోవడానికి ఇప్పటి వరకు టాక్సీ నడుపుతున్నాను. కతువా నుండి జమ్మూ వరకు ట్రక్కు కూడా నడిపాను. ఈ వారమే ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాను. ఇప్పుడిలా ప్రయాణికులను చేరవేసే బస్సు నడపడంతో ఎప్పటి నుంచో నాకున్న కల నెరవేరింది’ అని సంతోషం వెలిబుచ్చిన పూజను కలిస్తే ఎవ్వరైనా అభినందించకుండా ఉండలేం. పురుషులు మాత్రమే ప్రయాణికుల బస్సులను నడపగలరనే మూసను ముక్కలు చేయాలనుకున్న విషయాన్నీ పూజ ప్రస్తావిస్తారు. డ్రైవింగ్ ద్వారా ఉపాధి పొందాలని కోరుకునే మహిళలకు వారి కుటుంబాలు మద్దతు ఇవ్వాలని చెబుతుంది పూజ జమ్మూ కథువా పఠా¯Œ కోట్ రహదారి భారీ ట్రాఫిక్‌తో ఉంటుంది. ఇతర పురుష డ్రైవర్లు సైతం రాకపోకలు సాగించడం కష్టంగా ఉండి, సరిగ్గా విధులకు హాజరు కాకపోడంతో, ఈ ఉద్యోగం పూజకు ఇచ్చారు. తన శక్తిని నమ్మి డ్రైవింగ్ ఉద్యోగం ఇచ్చిన బస్సు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతుంది పూజ. -
‘నాపై ఎప్పుడైనా దాడి జరుగవచ్చు’
శ్రీనగర్: లాయర్ దీపికా రజావత్.. సంచలనాలకు మారుపేరు. ట్రోలింగ్ బారిన పడటం ఆమెకు కొత్తేమీ కాదు. రెండేళ్ల కిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా చిన్నారి అత్యాచారం, హత్య కేసులో బాధితుల తరఫున నిలబడ్డారు. ఈ కారణంగా అత్యాచార బెదిరింపులు ఎదుర్కొన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా ధైర్యంగా పోరాడారు. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో బాధిత కుటుంబమే, దీపిక సేవలు తమకు వద్దని చెప్పడంతో కేసు నుంచి ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ బాధితుల తరఫున తన గళం వినిపిస్తూ సామాజిక కార్యకర్తగా తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఆమె మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. (చదవండి: దళిత యువతి మృత్యు ఘోషకు భయపడే..) నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ప్రతిబింబించేలా ఉన్న ఓ కార్టూన్‌ను మంగళవారం ట్విటర్లో షేర్ చేశారు. ఓవైపు దేవతామూర్తులను కొలుస్తూనే, మరోవైపు ఆదిశక్తి స్వరూపాలైన అతివలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతో రూపొందించిన కార్టూన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వివాదాస్పద ట్వీట్లు చేసినందుకు ఆమెను అరెస్టు చేయాలంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. తమ మనోభావాలు గాయపరిచిన దీపికా రజావత్‌ను వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ #Arrest_Deepika_Rajawat అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు. (‘ఏదో ఒకరోజు.. వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు’) అంతేగాక మంగళవారం రాత్రి కొంతమంది వ్యక్తులు జమ్మూ కశ్మీర్‌లోని ఆమె ఇంటి ఎదుట నిరసనకు దిగారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వెల్లడించిన దీపిక.. ‘‘అలర్ట్... మా ఇంటి ముందు ఓ సమూహం ధర్నాకు దిగింది. నాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో నాకు బెదిరింపులు వస్తున్నాయి. నాపై ఎప్పుడు, ఎలా దాడి జరుగుతుందో తెలియదు. కాబట్టి చట్టబద్ధ సంస్థలు ఈ విషయంలో జోక్యం చేసుకుని నాకు రక్షణ కల్పించాలని మనవి’’అని విజ్ఞప్తి చేశారు. Alert Mob assembled outside my residence and raising slogans against me . — Deepika Singh Rajawat (Kashir Koor) (@DeepikaSRajawat) October 20, 2020 -
పాకిస్తాన్ డ్రోన్ కలకలం : కూల్చివేత
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని దేశ సరిహద్దు వెంట పాకిస్తాన్ రహస్య డ్రోన్‌ను భారత భదత్ర బలగాలు కూల్చి వేసాయి. కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్లో రాతువా ప్రాంతం ఫార్వర్డ్ పోస్టులో పాకిస్తాన్ గూఢచార డ్రోన్ కదలికలతో సరిహద్దు భద్రతా దళం అప్రమత్తమైంది. 19వ బెటాలియన్‌కు చెందిన బీఎస్ఎఫ్ పెట్రోలింగ్ పార్టీ శనివారం తెల్లవారుజామున దీన్ని కూల్చి వేసింది. రాతువా సమీపంలో పాకిస్తాన్ డ్రోన్ ఎగురుతుండగా గుర్తించి, ట్రాక్ చేసిన భద్రతా అధికారులు ఎనిమిది రౌండ్లు కాల్పుల అనంతరం ఆ డ్రోన్ ను విజయవంతంగా నేలమట్టం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. -
పాక్ నుంచి పావురం.. ఆ కోడ్ ఏంటి?
శ్రీనగర్: ప్రపంచమంతా కరోనాను కట్టడి చేసే చర్యల్లో నిమగ్నమై ఉంటే దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం పదే పదే వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో గూఢచర్యం చేసేందుకు ఓ పావురానికి తర్ఫీదునిచ్చి దాని కాలికి ఓ ఉంగరం తగిలించి పంపింది. కథువా జిల్లాలోని మన్యారీ గ్రామ ప్రజలు ఈ పావురాన్ని గుర్తించి దానిని స్థానిక పోలీస్ స్టేషనులో అప్పగించారు. ఈ విషయం గురించి కథువా ఎస్ఎస్పీ శైలేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ సరిహద్దులో దొరికిన పావురం కాలికి ఓ రింగ్ ఉంది. దానిపై కొన్ని నంబర్లు ఉన్నాయి. ఆ కోడ్‌ను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాం’’ అని పేర్కొన్నారు. (‘పైలెట్‌ను 3 సార్లు హెచ్చరించాం.. పట్టించుకోలేదు’) కాగా ఓ వైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో సరిహద్దుల వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ.. పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న విషయం తెలిసిందే. అంతేగాక భారత్‌లో అంతర్భాగమైన పీఓకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇక ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. గిల్గిట్ బాల్టిస్తాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు దాయాది దేశ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేస్తూ.. భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసి గట్టి కౌంటర్ ఇచ్చింది.(‘పిల్లలు, పెద్దల ఆర్తనాదాలు.. చుట్టూ మంటలు’) -
‘దిశ’ పేరు బహిర్గతం చేయడం నేరం!
సాక్షి, న్యూఢిల్లీ : ‘రేప్ బాధితురాలు మరణించారన్న విషయంతో సంబంధం లేదు. చనిపోయిన వారికి కూడా గౌరవం ఉంటుంది. చనిపోతే గౌరవం అక్కర్లేదని భావించడం భావ్యం కాదు’ అని సుప్రీం కోర్టుకు చెందిన జస్టిస్ మదన్ బీ లోకుర్, జస్టిస్ దీపక్ గుప్తాలు గత డిసెంబర్లో ‘నిపున్ సక్సేనా వర్సెస్ కేంద్ర హోం శాఖ’ కేసులో భారతీయ శిక్షా స్మతిలోని 228(ఏ) సెక్షన్‌కు స్పష్టమైన భాష్యం చెప్పారు. రేప్ బాధితురాలి పేరును కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఎట్టిపరిస్థితుల్లో పోలీసులుగానీ, మీడియాగానీ వెల్లడించరాదు. ఆమె ఎవరో సమాజంలో నలుగురికి తెలిసేలా ఆమె ఎక్కడ ఉంటున్నారో, ఏం చేస్తున్నారో, కనీసం కుటుంబసభ్యుల వివరాలను కూడా బహిర్గతం చేయరాదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని ఐపీసీ 228 (ఏ) సెక్షన్ తెలియజేస్తోంది. బాధితురాలు చనిపోతే, మైనరయితే, బుద్ధి మాంద్యం ఉంటే పేరు వెల్లడించడానికి సమీప బంధువుల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలని 228ఏ (2)(సీ) సెక్షన్ చెబుతోంది. ‘దిశ అత్యాచారం–హత్య’ కేసులో అటు పోలీసు వ్యవస్థ, ఇటు మీడియాతోపాటు మహిళా సంఘాలు కూడా ఈ నిబంధనను పూర్తిగా ఉల్లంఘించాయి. చాలా ఆలస్యంగా బాధితురాలి పేరును ‘దిశ’గా మార్చాయి. ఆ పని ముందే చేయాల్సింది. ఢిల్లీ ‘నిర్భయ’ కేసులో ఆమె అసలు పేరేకాదు, కుటుంబం వివరాలను కూడా వెల్లడించకుండా పోలీసులు, మీడియా ఎంతో సంయమనం పాటించాయి. నిర్భయ తల్లిదండ్రులు ఆ తర్వాత నిర్భయంగా మీడియా ముందుకు వచ్చినప్పడే వారి వివరాలను బహిర్గతం చేశారు. ఇప్పటికీ ‘నిర్భయ’ అసలు పేరు సమాజానికి తెలియదు. లైంగిక దాడులకు సంబంధించిన కేసులను గోప్యంగా విచారించేందుకు ఐపీసీ 327 (2) సెక్షన్ జడ్జీలకు అధికారం ఇచ్చింది. ఈ విచారణలను కోర్టు అనుమతి లేకుండా మీడియా బహిర్గతం చేయరాదు. అలా చేస్తే శిక్షలు విధించే అధికారం కోర్టులకుంది. రేప్ బాధితులు దిగువ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పైకోర్టుకు వెళ్లాలనుకున్నప్పుడు వారు మారు పేరును కూడా వాడుకోవచ్చు. ఈ కేసులకు సంబంధించిన వైద్య పరీక్షలు, డీఎన్ఏ పరీక్షల విషయంలోనే కాకుండా ఎఫ్ఐఆర్ విషయంలోనూ గోప్యత పాటించాల్సి ఉంటుంది. లైంగిక దాడుల నుంచి మైనర్లను రక్షించడం కోసం 2012లో తీసుకొచ్చిన ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్’లో కూడా ఈ నిబంధనలన్నింటిని పొందుపర్చారు. ‘కథువా అత్యాచారం–హత్య’లో ఈ నిబంధనలను అతిక్రమించినందుకు సుప్రీం కోర్టు గత ఏప్రిల్ నెలలో దేశంలోని 12 మీడియా సంస్థలకు జరిమానాలు విధించింది. ‘కోల్‌కతా పార్క్ స్ట్రీట్ గ్యాంగ్ రేప్’ కేసులో బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై స్వయంగా మీడియా ముందుకు వచ్చారు. అలాంటప్పుడు అలాంటి వారి అనుమతితో పేరు, వివరాలు బహిర్గతం చేయవచ్చు. ‘మన సమాజంలో లైంగిక దాడులకు పాల్పడిన నేరస్థులకన్నా ఆ దాడులకు గురైన బాధితులను నీచంగా చూస్తారు. అందుకని రేప్ కేసుల్లో ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది’ అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. -
సంచలన కేసులో రానున్న తీర్పు : భారీ భద్రత
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా హత్యాచారం కేసులో తుది తీర్పు నేడు (సోమవారం, జూన్ 10) వెలువడనుంది. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టులో విచారణ ముగిసిన నేపథ్యంలో న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. దీంతో పఠాన్‌కోట్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా గట్టి చర్యలు చేపట్టారు. కాగా జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేశారు. బాలికకు మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అత్యంత పాశవికమైన ఈ ఘటన పట్ల నిరసనలు హోరెత్తాయి. అయితే ఈ కేసు విచారణకు జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ కేసులో ఎనిమిదిమంది నిందితులు ఉండగా..వారిలో ఏడుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. నిందితులకు ఉరి శిక్ష విధించాలన్న డిమాండ్ కూడా ఊపందుకున్న సంగతి తెలిసిందే. Punjab: Security heightened outside Pathankot court ahead of verdict in Kathua rape-murder case pic.twitter.com/XaCdsSMnKd — ANI (@ANI) June 10, 2019 -
కథువా కేసు; దీపికా రజావత్‌కు ఊహించని షాక్!
శ్రీనగర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా సామూహిక అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్న లాయర్ దీపికా రజావత్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రాణాలకు తెగించి మరీ ఈ కేసును వాదిసున్న దీపికాకు.. ఇకపై ఆమె సేవలు తమకు అక్కర్లేదంటూ బాధిత కుటుంబం షాక్ ఇచ్చింది. ముస్లిం తెగకు చెందిన చిన్నారి తరపున వాదిస్తున్నందుకు దీపికాను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించింది. కాగా సున్నితమైన ఈ ఘటన కారణంగా మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్నందున పంజాబ్‌లోని పఠాన్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు సుప్రీంకోర్టు ఈ కేసును బదిలీ చేసింది. ఈ క్రమంలో కేసు విచారణ సమయంలో దీపిక కేవలం రెండుసార్లు మాత్రమే కోర్టుకు హాజరయ్యారని, ఇలా అయితే తమకు న్యాయం జరగదని చిన్నారి తండ్రి భావిస్తున్నట్లు అతడి సన్నిహితులు తెలిపారు. అంతేకాకుండా 100 సార్లు కేసు విచారణకు వచ్చిందని, 100 మంది సాక్ష్యులను విచారించినా ఇంతవరకు ఎటువంటి పురోగతి కనిపించలేదని ఆరోపిస్తూ లాయర్‌ను మార్చుకుంటున్నట్లు ఆయన పఠాన్ కోర్టుకు దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం. -
‘వాళ్లు నన్ను కచ్చితంగా చంపేస్తారు’
‘నువ్వొక జాతి వ్యతిరేక శక్తివి నీ ఆరేళ్ల కూతురికి, నీకు అదే గతి పడుతుంది ఛీ.. అసలు వీళ్లతో మనకు మాటలేంటి? నీ కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తాం’ - ఇవి అత్యాచార ఘటనలో బాధితురాలి తరపున వాదిస్తున్నందుకు ఓ మహిళా న్యాయవాదికి వస్తున్న బెదిరింపులు, ఈసడింపులు నల్లకోటు వేసుకున్న ప్రతీ ఒక్కరూ న్యాయవాది అనిపించుకోరు.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ప్రాణాలను సైతం పణంగా పెట్టే వారే నిజమైన న్యాయవాదులు. ఇందుకు చక్కని ఉదాహరణ దీపికా రజావత్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తరపున వాదిస్తున్నారు ఆమె. అడుగడుగునా అవరోధాలే.. ఈ కేసులో బాధితురాలి తరపున వాదిస్తానని చెప్పగానే దీపికాకు బెదిరింపుల పర్వం మొదలైంది. సంప్రదాయ కశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన దీపికా.. ఓ గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలిక తరపున వాదించడమేమిటని కొంతమంది ఈసడించుకుంటే... మరికొంత మంది ఇంకో అడుగు ముందుకేసి దీపికను, ఆమె కూతురిని అత్యాచారం చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పటికైనా ఈ కేసు నుంచి తప్పుకోకపోతే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే న్యాయవాద వృత్తిని ప్రాణంగా ప్రేమించే దీపికా ఈ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు. కచ్చితంగా చంపేస్తారు.. నాకు తెలుసు ‘ప్రతీరోజూ ఇంటికి చేరుకోగానే మెయిన్ గేటు నుంచి ఇంట్లో వరకు గల పరిసరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను. నా కూతురు, భర్త గురించి ఏ క్షణాన.. ఏ చేదు వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతాను. ఈ ఘటన జరిగి 10 నెలలు గడిచిపోయింది. విచారణ కొనసాగుతోంది. నా అభ్యర్థనను మన్నించి రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి చుట్టూ పోలీసు కాపలా ఏర్పాటు చేసింది. అయితే ఒకటి మాత్రం నిజం.. వాళ్లు ఏదో ఒకరోజు కచ్చితంగా నన్ను చంపేస్తారు. నాకు ఈ విషయం స్పష్టంగా తెలుసు. సరైన సమయం కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. అయినా పర్లేదు. ఈ కేసును విడిచిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు దీపికా. (చదవండి : ‘మేం చనిపోయేలోపు మా కూతురికి న్యాయం చేయాలి’) అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి గురైన ఆ ఎనిమిదేళ్ల చిన్నారి చనిపోయేముందు ఎంత నరకయాతన అనుభవించిందో ఓ మహిళగా, తల్లిగా నేను అర్థం చేసుకోగలను. మానవ హక్కుల కార్యకర్తగా, ఓ న్యాయవాదిగా బాధితుల తరపున పోరాడాల్సిన బాధ్యత నాపై ఉంది. అందుకే ఈ కేసు వాదించేందుకు నాకు నేనుగా ముందుకు వచ్చాను. ఈ కారణంగా నా తల్లిదండ్రులు కూడా చాలా ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. జాతి వ్యతిరేక శక్తిగా నాపై ముద్ర వేసినపుడు వారి బాధ వర్ణనాతీతం. నా తోటి న్యాయవాదులు కూడా నా పట్ల ఇదే భావన కలిగి ఉండటం నన్ను మరింతగా బాధిస్తోంది. కానీ ఇప్పుడిప్పుడే వారిలో కాస్త మార్పు కన్పిస్తోంది. కానీ అది నిజమైనదో కాదో పోల్చుకోలేకపోతున్నాను. అంటూ ‘వోగ్ క్రూసేడర్ ఆఫ్ ది ఇయర్- 2018’గా ఎంపికైన సందర్భంగా దీపికా రజావత్ తన అనుభవాలను పంచుకున్నారు. కేసు పూర్వాపరాలు... కశ్మీర్‌లోని కథువా సమీపంలో గల రసనా గ్రామానికి చెందిన ముక్కుపచ్చలారని ఎనిమిదేళ్ల బాలికకు డ్రగ్స్ ఇచ్చిన ఎమిమిది మంది మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆమెను హత్యచేశారు. బాకర్‌వాలాగా పిలిచే ఓ ముస్లిం తెగకు చెందిన ఆ చిన్నారి శవం ఈ ఏడాది జనవరి 17వ తేదీన పోలీసులకు దొరికింది. అంతకు వారం రోజుల ముందే ఆ పాప అదృశ్యం అయింది. ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని, తమ ఫిర్యాదు స్వీకరించి ఉంటే కూతురిని పోగొట్టుకునేవాళ్లం కాదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించడంతో చలించిన కశ్మీర్ ప్రభుత్వం విచారణ వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో జనవరి 21వ తేదీన 5 ఏళ్ల బాలుడిని పోలీసులు పట్టుకొచ్చి నిందితుడిగా చూపారు. హీరానగర్ ప్రాంతానికి చెందిన ఆ బాలుడు అలాంటి వాడు కాదని స్థానికులు చెప్పడం, పోలీసుల చిత్ర హింసలకు ముందుగా నేరాన్ని అంగీకరించినా ఆ తర్వాత ప్రజల సమక్షంలో తానే పాపం చేయలేదని మొరపెట్టుకోవడం పలు అనుమానాలకు దారితీసింది. అయితే మరింత లోతుగా విచారణ జరిపిన పోలీసులు.. కథువాకు చెందిన సాంజీరాం, అతడి కొడుకు విశాల్, స్పెషల్ పోలీసు ఆఫీసర్ దీపక్ ఖజురియా, సురీందర్ వర్మ, పర్వేశ్ కుమార్, తిలక్ రాజ్, ఎస్సై అరవింద్ దత్తా తదితరులను నిందితులుగా తేల్చారు. కాగా బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి జరిగిన కారణంగా ఆమె ఊపిరాడకనే చనిపోయిందని వైద్యులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో.. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. పంజాబ్‌లోని పఠాన్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. - సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మేం చనిపోయేలోపు మా కూతురికి న్యాయం చేయాలి’
కశ్మీర్ : సబీనా, యాకూబ్ దంపతులు ఓ నెల రోజుల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించారు. కార్గిల్ శిఖరాల అంచుల నుంచి సాంబ మైదానాలకు చేరుకున్నారు. చివరకు తమ స్వగ్రామం రసనాకు కేవలం 25 కిలో మీటర్ల దూరంలో ఆగిపోయారు. తమ స్వగ్రామానికి వెళ్లాలని వారు ఎదురుచూస్తున్నారు. రసన.. ఆ పేరు తలచుకుంటేనే వారికి భయంతోపాటు బాధ కూడా తన్నుకోస్తుంది. అక్కడే తమ ఏనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా ఆడిపాడింది. పశువుల వెంట, గొర్రెపిల్లల వెనక పరుగు తీసింది. కానీ ఆకస్మాత్తుగా ఆ అందమైన దృశ్యాల స్థానే ఓ భయంకరమైన సంఘటన వచ్చి చేరింది. ఆసిఫా ఎనిమిదేళ్ల చిన్నారి.. ప్రపంచం అంటే ఏంటో తెలియని పసిపాప.. లోకమంతా తనలానే ఉంటుందని నమ్మిన అమాయకురాలి మీద కొన్ని మృగాళ్లు దాడి చేశాయి. తనకు ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని ఆ చిట్టితల్లి మూడు రోజుల పాటు దేవాలయంలోనే దయ్యాలకు ఆహారమయ్యింది. జరుగుతున్న ఘోరాన్ని చూడలేక ఆ దేవత నిజంగానే శిలయ్యింది. మూడురోజుల పాటు దైవసాక్షిగా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన ఆ చిన్నారి శ్వాస ఆగిపోయింది. ఈ సంఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మీడియా కావాల్సినంతా టీఆర్పీ సాధించింది. ప్రతిపక్షాలు అధికారి పార్టీ మీద తనివి తీరా దుమ్మెత్తి పోశాయి. మేం సిగ్గుపడుతున్నాం అంటూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో రెండు కన్నీటి బొట్లు రాల్చారు. చిత్రమేంటంటే అన్యాయం జరిగిన కుటుంబాన్నే సమాజం శిక్ష విధించింది. పోయిన ప్రాణం.. పడిన వేదన గ్రామస్తులకు కనిపించలేదు. మా వాళ్లనే జైలుకు పంపిస్తారా మీ సంగతి చూస్తాం అంటూ బెదిరింపులు. ఆఖరికి తమ స్థలంలోనే బిడ్డను ఖననం చేసేందుకు కూడా వారు ఒప్పుకోలేదు. గ్రామస్తులు అడ్డుకోవడంతో చేసేదిలేక చిన్నారి మృతదేహాన్ని వణికించే చలిలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న కణాహ్ గ్రామానికి తరలించి అక్కడ ఖననం చేశారు. చేతుల్లో ఉన్న భారాన్ని భూమాతకు అప్పగించారు. తిరిగి సొంత గ్రామానికి వెళ్లలేక ఎక్కడో సాంబ మైదాన ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. ఈ దారుణం జరిగి ఇప్పటికి 10నెలలు గడిచాయి. క్రమంగా ఆ సంఘటన ప్రజల మనసుల నుంచి చెరిగిపోయింది. ఆదుకుంటామన్న ప్రభుత్వాలు ఆ మాటే మర్చిపోయాయి. తల్లి ఆ శోకం నుంచి ఇంకా కోలుకోలేదు.. తండ్రి కూతుర్ని కలవరిస్తున్నాడు. సమాజం ఇప్పడు కూడా వారిని వదలడం లేదు. ఇక్కడ నుంచి వెళ్లాలంటూ బెదిరింపులు. ఒంటరిగా సమీప నదికి వెళ్లి తాగు నీరు తెచ్చుకోవాలన్నా వెళ్లలేని పరిస్థితులు. వీటన్నింటి కంటే ఎక్కువగా ఆ తల్లిదండ్రులను భయపెడుతున్నది తాము చనిపోయేలోపైనా తమ కూతురికి న్యాయం జరుగుతుందా.. చివర వరకూ పోరాడే శక్తి తమకు ఉందా అనే విషయం గురించే. ఎందుకంటే ప్రస్తుతం హాసీన తల్లిదండ్రులు ఉన్న ప్రదేశం.. ఈ కేసు విచారణ జరుగుతున్న పఠాన్‌కోట్ కోర్టుకు దాదాపు 530 కిలోమీటర్ల దూరాన ఉంది. కోర్టు ట్రయల్స్‌కి హాజరు కావడానికి డబ్బు లేదు. సంపాదించే పరిస్థితులు కూడా లేవు. చేసేదేం లేక ఉన్న గొర్రెలను.. పశువులను అమ్ముకుంటున్నారు. తమ ఆస్తి అంతా అమ్మకున్నా పర్వాలేదు. కానీ తమ కూతురికి న్యాయం జరిగితే చాలు అంటున్నారు. అదేంటి ప్రభుత్వం సాయం అందలేదా అంటే రెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు.. కానీ ఇంతవరకూ చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు అంటున్నారు బాధితురాలి తల్లిదండ్రులు. ఎవరి సాయం కోసమో ఎదురు చూస్తూ కూర్చోలేము. నా చిట్టితల్లి కోసం మేమే పోరాడతాం. ఆ మృగాళ్లకు శిక్ష పడితేనే నా కుమార్తె ఆత్మ శాంతిస్తుందంటున్నారు కథువా బాధితురాలి తల్లిదండ్రులు యాకూబ్, సబీనా. కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్‌లో ఆసిఫా అనే బాలికను ఆరుగురు వ్యక్తులు అత్యంత పైశాచికంగా డ్రగ్స్ ఇచ్చి కొన్ని రోజుల పాటు లైగింక దాడికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశారు. ఆసిఫా ఒక గిరిజన ముస్లిం తెగకు చెందిన బాలిక. హిందువులు అధికంగా ఉండే కథువా ప్రాంతంలో కొంతమంది దుండగులు బాలికను కిడ్నాప్ చేసి ‘దేవిస్థాన్’ అనే దేవాలయంలో ఉంచి అత్యాచారం చేసి, అంతమొందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసిఫా తల్లిదండ్రుల దుర్భర జీవితం గడుపుతూ కూడా కూతురికి న్యాయం జరిగేలా చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. -
‘కథువా’ లైంగిక దాడి నిజమే: వైద్యులు
పఠాన్‌కోట్: ‘కథువా’ ఘటనలో బాధితురాలిపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యుల బృందం ధ్రువీకరించింది. బాధిత బాలిక ఊపిరాడకపోవడంతోనే చనిపోయినట్లు తేల్చింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆ వివరాలను చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌కు ఇటీవల వివరించారని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేకే చోప్రా తెలిపారు. ఈ ఏడాది జనవరిలో జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఓ బాలిక(8) సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. బాధితురాలిపై పదేపదే లైంగిక దాడి జరిగిందనీ, ఆమె ఊపిరాడకనే చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. -
కథువాలో మరో దారుణం : చర్చి పాస్టర్ అరెస్ట్
కథువాలో మరో దారుణం చోటు చేసుకుంది. అనాథశ్రమంలో మైనర్ బాలికలను ఓ చర్చి పాస్టర్ లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తమల్ని తీవ్రంగా వేధిస్తున్నాడంటూ బాలికల ఫిర్యాదు అనంతరం, చర్చి పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్ జిల్లాలోని కథువాలో నిర్వహిస్తున్న ఈ అనాథశ్రమంపై పోలీసులు దాడులు నిర్వహించి, 19 మంది పిల్లల్ని రక్షించారు. వారిలో ఎనిమిది మంది బాలికలు ఉన్నారు. కేరళ నుంచి వచ్చిన ఆంటోని థామస్ అనే పాస్టర్ ఈ అనాథశ్రమాన్ని నడుపుతున్నాడు. తమల్ని లైంగికంగా వేధిస్తున్నాడని కొంతమంది చిన్నారులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సివిల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు శుక్రవారం ఆ అనాథశ్రమంపై దాడులు నిర్వహించారు. అంతేకాక ఆంటోని థామస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అయితే తానెలాంటి తప్పు చేయలేదని థామస్ కప్పిపుచ్చుకుంటున్నాడు. ఆ అనాథశ్రమంలో మొత్తం 21 మంది చిన్నారులున్నారు. వారిలో ఇద్దరు స్వగ్రామంలో(పంజాబ్‌లో) ఓ పెళ్లి వేడుకకు హాజరు కావడానికి తమ స్వస్థలానికి వెళ్లారు. 5 నుంచి 16 ఏళ్ల వయసున్న మిగతా చిన్నారులను ప్రభుత్వం నడిపించే బాల ఆశ్రమ్, నారి నికేతన్‌లకు తరలించినట్టు అధికారులు చెప్పారు. వారందరూ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ ప్రాంతాలకు చెందిన వారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్టు కథువా సీనియర్ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు శ్రీదర్ పటీల్ చెప్పారు. గత కొన్నేళ్లుగా ఈ ఆశ్రమం నడుస్తుందని, ఓ ఎన్జీవో సంస్థతో ఇది లింక్ అయి ఉండేందని, కానీ కొన్ని రోజుల క్రితం దాంతో కూడా సంబంధాలు తెంచుకున్నట్టు పటీల్ పేర్కొన్నారు. అనాథశ్రమంలోని కొన్ని వస్తువులును అధికారులు సీజ్ చేశారు. కాపాడిన చిన్నారులను మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సిలింగ్‌కు తరలించారు. పాస్టర్ భార్య కేరళలో సంభవించిన వరదల కారణంగా ఆ ప్రాంతానికి వెళ్లారు. కొన్ని రోజుల్లో ఆమె తిరిగి రావొచ్చని చెప్పారు. చిన్నారుల కుటుంబ సభ్యులను అధికారులు కాంటాక్ట్ అవుతున్నారు. ఈ ఆశ్రమం కూడా అనధికారికంగా నడుస్తున్నట్టు తెలిసింది. దీన్ని నడిపేందుకు ఎలాంటి రిజిస్ట్రేషన్‌ను థామస్ తీసుకోలేదని కథువా అసిస్టెంట్ కమిషనర్ రెవెన్యూ, జితేంద్ర మిశ్రా చెప్పారు. నిందితులకు కఠిన శిక్ష వేయాలని రాష్ట్రీయ భజరంగ్ దళ్ కార్యకర్తలు జమ్మూలోని ప్రెస్ క్లబ్ ఎదుట ఆందోళన చేశారు. -
బాలికల రేపిస్టులకు మరణశిక్ష
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించింది. 12ఏళ్ల లోపు బాలికలపై అత్యాచార దోషులకు మరణశిక్ష విధించేందుకు వీలు కల్పించే కీలకమైన క్రిమినల్ లా (సవరణ) బిల్లు–2018ను బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో దోషులకు కఠిన శిక్షలు విధించేలా ఏప్రిల్ 21 తేదీన కేంద్రం ఒక ఆర్డినెన్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. బిల్లుపై దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చకు హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు సమాధానమిచ్చారు. కథువా, ఉన్నవ్ ఘటనల నేపథ్యంలో రూపొందించిన ఈ బిల్లులో 12, 16 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలుండేలా నిబంధనలు పొందుపరిచామన్నారు. ‘12 ఏళ్లలోపు బాలికలపై రేప్‌నకు పాల్పడిన వారికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష, యావజ్జీవ కారాగారం లేదా మరణ శిక్ష, 16 ఏళ్లలోపు బాలికలపై రేప్ నిందితులకు కనీసం 20 ఏళ్ల నుంచి బతికినంత కాలం జైలు శిక్ష. 16 ఏళ్లలోపు బాలికలపై గ్యాంగ్‌రేప్ నిందితులకు జీవితాంతం జైలు. మహిళలపై లైంగికదాడికి పాల్పడిన వారికి కనీసం పదేళ్ల కఠిన కారాగారం నుంచి జీవితకాల జైలు శిక్ష’ అమలవుతుంది’ అని చెప్పారు. ఈ కేసుల్లో దర్యాప్తు, విచారణ వేగంగా పూర్తయ్యేందుకు కూడా నిబంధనలున్నాయి. అత్యాచార కేసులన్నిటినీ రెండు నెలల్లోపే దర్యాప్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. మూకహత్యల దోషులకు మరణ శిక్ష: మంత్రి మూకహత్యల కేసుల్లో దోషులకు మరణశిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ప్రభుత్వం త్వరలో తీసుకురానుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్ వెల్లడించారు. -
‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు
బనిహాల్(జమ్ముకశ్మీర్): ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి కీలక తీర్పులు వెలువడనున్నాయి. కేసు విచారణను జమ్ముకశ్మీర్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలన్న బాధిత కుటుంబం అభ్యర్థన, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాన్న నిందితుల డిమాండ్.. ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించనుంది. కాగా, తమ కుటుంబానికి జరిగిన దారుణాన్ని తలుచుకుంటూ మృతురాలి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని కాల్చిచంపండి: కథువాలో దారుణ సంఘటన, అనంతర పరిణామాల తరువాత బాధిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. ప్రస్తుతం వారు కథువాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహాల్(రంబాన్ జిల్లా)లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. కనీస అవసరాలు కూడా లేని చిన్న గుడారంలో కాలం వెళ్లదీస్తోన్న ఆ కుటుంబం.. ఇప్పటికీ భయంతో వణికిపోతున్నది. ‘‘నా బిడ్డను పొట్టనపెట్టుకున్న ఆ దుర్మార్గులు బయటికొస్తే మిగిలిన మా నలుగురినీ(తను, భర్త, ఇద్దరు పిల్లు) చంపేస్తారు. మాకు కావాల్సిందల్లా న్యాయమే. ఒకవేళ న్యాయం చేయలేరనుకుంటే మమ్మల్ని కాల్చిచంపేయండి’’ అని కన్నీటిపర్యంతం అయిందా తల్లి. అమాయకులు కాదు.. దుర్మార్గులు: రసానాలో తాము గడిపిన రోజులు నిజంగా భయంకరమైనవని, సాంజీరామ్(బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు) కుటుంబీకులు చాలా క్రూరంగా ప్రవర్తించేవారని మృతురాలి తల్లి గుర్తుచేశారు. ‘‘ ఊరి బయట పచ్చికలోనూ మా పశువుల్ని మేపనిచ్చేవారు కాదు. చివరికి నా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. అక్కడ(రసానాలో) మాకున్న ఇల్లు, ఆస్తి అంతా ధ్వంసమైపోయింది. కోర్టులో చెప్పుకున్నట్టు వాళ్లేమీ(నిందితులేమీ) అమాయకులు కాదు. పచ్చి దుర్మార్గులు. వాళ్లను ఉరితీయాల్సిందే. పొరపాటున బయటికొస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు’’ అని బాలిక తల్లి అన్నారు. పశువుల పెంపకమే వృత్తిగా జీవించే బకర్వాల్ సంచార తెగకు చెందిన కుటుంబాలు.. చాలా కాలం కిందటే కథువా ప్రాంతంలో శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. విశాలమైన పచ్చకబయళ్లున్న ఆ ప్రాంతంలో తమ గొర్రెలు, మేకలు, గుర్రాలను మేపేవారు. ముస్లిం తెగల వ్యాప్తిని జీర్ణించుకోలేని స్థానికులు కొందరు.. బకర్వాల్‌లను అక్కడి నుంచి వెళ్లగొట్టాలనుకున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే.. ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి, కొద్దిరోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారం జరిపి, చివరికి కొట్టిచంపేశారు. జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఈ విషయాలను పేర్కొన్నారు. అయితే, తాము అమాయకులమని, చిన్నారి మరణంతో ఎలాంటి సంబంధంలేదని నిందితులు వాదిస్తున్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని, ఆమేరకు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. అటు బాధిత కుటుంబం సైతం కేసును జమ్ముకశ్మీర్ నుంచి బయటికి తరలించి విచారించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
కథువా కేసుపై వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, శ్రీనగర్ : బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలకు బ్రేక్ పడటం లేదు. జమ్మూ కశ్మీర్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ నేత కవిందర్ గుప్తా వెనువెంటనే కథువా హత్యాచార కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన చాలా చిన్నదని..దీనికి ఏమంత ప్రాధాన్యత ఇవ్వరాదని గుప్తా పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో బీజేపీ నేత వివరణ ఇచ్చారు. కథువా వంటి కేసులు చాలా ఉన్నాయని మాత్రమే తాను అన్నానని దీన్ని వివాదాస్పదం చేయవద్దని కోరారు. కథువా కేసు సర్వోన్నత న్యాయస్ధానం పరిథిలో ఉన్నందున దీన్ని పదేపదే ప్రస్తావించడం సరైంది కాదన్నారు. కథువా కేసు విచారణను ఛండీగర్‌కు బదలాయించాలని, సీబీఐకి అప్పగించాలని పలు పిటిషన్లు దాఖలైన క్రమంలో మే 7వరకూ ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఈ ఏడాది జనవరి 10న కథువాకు సమీపంలోని గ్రామం నుంచి 8 ఏళ్ల మైనర్ బాలికను అపహరించిన దుండగులు లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. -
కథువా కేసు : విచారణపై సుప్రీం స్టే
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా మైనర్ బాలిక హత్యాచారం కేసు విచారణపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కేసు విచారణను చండీఘర్‌కు బదలాయించాలన్న అప్పీల్‌పై స్పందించాలని నిందితుడిని కోరింది. కథువాలో శనివారం జరగాల్సిన విచారణను నిలిపివేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస ఇందూ మల్హోత్రాలతో కూడిన సుప్రీం బెంచ్ పేర్కొంది. కేసు బదలాయింపు పిటిషన్‌పై మే 7న తాము విచారణ చేపడతామని ప్రకటించింది. గతంలో కేసు విచారణను చండీఘర్‌కు బదలాయించాలన్న ప్రతిపాదనను జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వ్యతిరేకించింది. జమ్మూ కశ్మీర్లో విభిన్న పీనల్ కోడ్ ఉందని, విచారణను బదలాయిస్తే సాక్షులకు అసౌకర్యం కలుగుతుందని పేర్కొంది. అయితే కేసు విచారణలో ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది. కథువాలో మైనర్ బాలికపై కొందరు సామూహిక లైంగిక దాడికి పాల్పడి హతమార్చడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. -
‘కథువా’ కేసు; సంచలన ఆధారాలు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని కలిచివేసిన కథువా బాలిక హత్యాచారానికి సంబంధించి బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. చిన్నారి శరీర భాగాలు, దుస్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలు, నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్(డీఎఫ్ఎల్) నివేదికలో వెల్లడైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పేర్కొంది. దీంతో చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లైందని, కోర్టు విచారణలోనూ ఇవే అంశాలు కీలకం కానున్నాయని సిట్ అధికారులు అన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28న జరగనుంది. చిన్నారిపై అకృత్యం జరిగింది ఆలయంలోనే!: కథువా ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన వేళ ఘటన జరిగిన ప్రదేశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ‘జరిగింది ఆలయంలో కాదంటూ’ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంకూడా సాగింది. అయితే ప్రాధమిక దశలోనే ఆలయం నుంచి సేకరించిన రక్తనమూనాలు, వెంట్రుకలు.. ఇటీవల అరెస్టైన నిందితుల డీఎన్ఏతో సరితూగాయని ఫోనెన్సిక్ నివేదికలో తేలింది. హత్య తర్వాత దుస్తులు ఉతికారు!: రోజుల పాటు చిన్నారికి నరకం చూపించి, హత్యచేసిన తర్వాత సంబంధిత ఆధారాలను చెరిపేసేందుకు నిందితులు యత్నించారు. ‘హత్య తర్వాత బాధితురాలి దుస్తులు ఉతికారు, తల నుంచి పాదాల దాకా తుడిచేశారు. దీంతో ఆధారాలను నిర్ధారించడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆలయంలో లభించిన రక్తనమూనాలు, వెంటుక్రలు ఎవరివనేవి తేల్చలేకపోయాం. ఆ తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ (డీఎఫ్ఎల్) సహాయాన్ని తీసుకున్నాం. అత్యాధునిక విశ్లేషణా పద్ధతులను అవలంబించే డీఎఫ్ఎల్.. మృతురాలి శరీరభాగాలు, ఒంటిపై లభించిన రక్తపు నమూనాలను విశ్లేషించి, వాటిని నిందితుల డీఎన్ఏతో సరిపోల్చగా దాదాపు ఖచ్చితమైన ఆధారాలు లభించినట్లైంది’’ అని సిట్ అధికారులు పేర్కొన్నారు. కథువా నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం కూడా నిరసనలు జరిగాయి. -
ఆగని అకృత్యాలు.. వసివాడుతున్న పసిమొగ్గలు
లక్నో/రాయ్‌పూర్ : కథువా, ఉన్నావో సంఘటనలతో ఓవైపు దేశమంతా అట్టుడికిపోతుంటే మరోవైపు బాలలపై జరిగే లైంగిక నేరాలు మాత్రం తగ్గటంలేదు. తాజాగా ఇలాంటివే మరో రెండు సంఘటనలు వెలుగుచూశాయి. ఈ రెండు ఘటనలు రెండు వేర్వేరు రాష్ట్రాలలో చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గడ్‌లో ఓ వివాహానికి హజరైన పదకొండేళ్ల బాలికపై అదే వేడుకకు వచ్చిన ఓ పాతికేళ్ల వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కబీర్ధామ్ జిల్లాలోజరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తమ్ సాహూ(25) అనే వ్యక్తి పెళ్లి కుమారుడు తరుపు బంధువు. సాహూ ఇదే వివాహానికి వచ్చిన ఓ పదకొండేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి ఊరవతలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలిక తలపై బండతో మోదీ చంపేశాడు. కాసేపటి తరువాత వచ్చి వివాహ వేడుకలో పాల్గొన్నాడు. బాలిక ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. గురువారం ఉదయం బాలిక మృతదేహం ఒక కాలువ దగ్గర కనిపించింది. బాలిక చివరిసారిగా సాహూతో కనిపించడంతో ఆమె తల్లిదండ్రులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాహూని అదుపులోకి తీసుకుని విచారించగా తానే బాలికపై అత్యాచారం చేసి చంపినట్లుగా ఒప్పుకున్నాడు. నిందితుడిపై అత్యాచార, హత్యా నేరాల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి లాల్ ఉమెద్ సింగ్ తెలిపారు. ఇటువంటి సంఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో చోటుచేసుకుంది. ఓ తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేశారు. పోలీసులు వివరాల ప్రకారం బాధిత బాలిక ఎటాలో ఓ పెళ్లికి హజరవ్వడానికి వచ్చింది. అదే వేడుకకు వంటలు చేయడానికి వచ్చిన పింటూ అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపేశాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పింటూపై కేసు నమోదు చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు.