హీరోయిన్ తమన్నా
మనదేశం ఎటు పోతుందని మిల్కీ బ్యూటీ తమన్నా చాలా వేదనతో ప్రశ్నిస్తోంది. జమ్మూ కశ్మీరులోని కథువా జిల్లాలో 8ఏళ్ల బాలికపై అత్యాచార దుర్ఘటన ఈ మిల్కీ బ్యూటీని కలత చెందేలా చేసింది. ఆసిఫా అనే బాలికను 6గురు వ్యక్తులు అత్యంత పైశాచికంగా లైంగిక దాడి చేసి అనంతరం హత్య చేసిన ఘటన ప్రస్తుతం దేశాన్ని కదిలిస్తోంది. ఈ సంఘటనపై పలువురు ప్రముఖులు తమ ఆవేదనను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా పెరుగుతోంది.
ఈ ఘటనపై హీరోయిన్ తమన్నా స్పందిస్తూ.. జమ్మూ కశ్మీరులో 8ఏళ్ల బాలిక, మరో చోట 16ఏళ్ల యువతి అత్యాచారానికి గురయ్యారు. ‘దీనిపై పోరాడిన ఆమె తండ్రిని దారుణంగా కొట్టి చంపేశారు. నేరస్తులను కాపాడటానికే ఈ విధంగా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘోరాలను చూస్తుంటే మనదేశం ఎటు పోతోందని ప్రశ్నించింది. స్త్రీలకు రక్షణ కల్పించలేని దేశం తిరోగమన దశకు చేరుతోంది. దీనికి చాలా తోందరగా చికిత్స చేయాల’ని తమన్నా పేర్కొన్నారు. ఈ అత్యాచారాలను పలువురు ప్రముఖులు కూడా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment