Kathua Rape Case
-
చలికాలంలో చెమటలు.. అతన్ని పట్టించాయి
కశ్మీర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార కేసులో కోర్టు ఆరుగురు నిందితులకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వీరిలో జీవిత ఖైదు పడిన సాంజి రామ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అధికారులు. ఆర్కే జల్లా అనే అధికారి మాట్లాడుతూ.. కేసు విచారణ నిమిత్తం సాంజీ రామ్ ఇంటికి వెళ్లినప్పుడు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా తోచింది. మా నుంచి ఏదో దాచడానికి ప్రయత్నించాడని తెలిపాడు. ‘అప్పటికే అతని మైనర్ అతని మేనల్లుడిని జువైనల్ హోమ్‌కు తరలించాం. సాంజీని,అతని కుమారుడు విశాల్‌ని విచారించే నిమిత్తం అతని ఇంటికి వెళ్లినప్పుడు మమ్మల్ని చూడగానే చాలా కంగారు పడ్డాడు. భయంతో కంపించిపోయాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని ప్రశ్నిస్తుండగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు’ అని గుర్తు చేసుకున్నాడు. ‘అతని కొడుకు గురించి ప్రశ్నించగా.. మీరట్‌లో చదువుతున్నాడని.. కావాలంటే తన కాల్ రికార్డ్ డాటా(సీఆర్డీ)ను పరిశీలించుకోవచ్చని తెలిపాడు. అప్పుడు నాకు రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒకటి సీఆర్డీ చెక్ చేసుకోమంటూ మాకే సలహా ఇవ్వడం.. రెండు చలి విపరీతంగా ఉండే జనవరిలో అతనికి చెమట పట్టడం. దాంతో మాకు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగింది. అతని మీద బెనిఫిషరి ఆఫ్ డౌట్ కింద కేసు నమోదు చేసి.. తదుపరి విచారణను పూర్తి చేశామని వెల్లడించారు. సాంజీ తన కుమారున్ని కాపాడుకోవడానికి అన్నివిధాల ప్రయత్నం చేశాడని జల్లా పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదని జల్ల స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు సేకరించేందుకు తాము చేసిన కృషిని హై కోర్టు గుర్తించి ప్రశంసించిందని తెలిపారు. (చదవండి : సరైన తీర్పు) -
‘తను పదే పదే జ్ఞాపకం వస్తోంది’
కశ్మీర్ : ఏడాదిన్నర క్రితం కథువాలో జరిగిన దారుణ అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. కోర్టు తీర్పు తమకు సంతృప్తినివ్వలేదని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడిగా భావించిన వ్యక్తినే నిర్దోషిగా విడుదల చేయడం పట్ల వారు నిరాశ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘నా కూతుర్ని గుర్తు చేసుకోకుండా ఒక్క రోజు కూడా గడవడంలేదు. తను నాకు పదే పదే గుర్తుకొస్తుంటుంది. నా కళ్ల ముందే ఉన్నట్లు అన్పిస్తుంది. సోమవారం తీర్పు వస్తుందని నాకు చెప్పారు. కానీ కోర్టుకు వెళ్లి కూర్చోవాలనిపించలేదు. పదే పదే జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకోవాలంటే నాకు ధైర్యం సరిపోవడం లేదు. అందుకే కోర్టుకు వెళ్లలేదు. అయితే తీర్పు గురించి విన్నప్పుడు నాకు సంతోషం కలగలేదు. ఏడగురు నిందితులకు మరణ శిక్ష పడాలని భావించాను. కానీ తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది. సంపూర్ణ న్యాయం జరిగినట్లు అనిపించడం లేద’న్నారు. బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. ‘రెండు నెలల క్రితం నా చిట్టితల్లి సమాధి దగ్గరికి వెళ్లాను. దుఃఖం ఆగలేదు. నేటికి కూడా తనను తల్చుకోని ఏడుస్తూనే ఉన్నాను. నా శోకం ఇప్పట్లో తీరదు. కనీసం తీర్పు అయినా మేం కోరుకున్న విధంగా వస్తే సంతోషించే వాళ్లం. కానీ అలా జరగలేదు. నిందితులందరిని ఉరి తీస్తేనే నా చిట్టితల్లి ఆత్మకు శాంతి చేకూరుతుంది. న్యాయం జరుగుతుంద’న్నారు. నిరుడు జనవరిలో జమ్మూలోని కథువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికను అపహరించి, అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రాం, మరో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మరో ముగ్గురికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 50,000 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సాంజీరాం కుమారుడు విశాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, ఆయనకు సమీప బంధువైన మైనర్ బాలుడు జువెనైల్ కోర్టులో విచారణనెదుర్కొంటున్నాడు. ఆ దురంతం సాధారణమైనది కాదు. అసిఫాను దారుణంగా హింసించి మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపారు. చివరికామెను రాళ్లతో కొట్టి చంపారు. -
సరైన తీర్పు
దేశం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన అత్యంత అమానుషమైన దురంతంలో నేరగాళ్లకు కఠిన శిక్షలు విధిస్తూ సోమవారం పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. నిరుడు జనవరిలో జమ్మూలోని కఠువాలో అసిఫా అనే ఎనిమిదేళ్ల బాలికను అపహ రించి, అత్యాచారం జరిపి హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడు సాంజీ రాం, మరో ఇద్దరు నిందితులకు యావజ్జీవ శిక్ష విధించడంతోపాటు సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిం చిన మరో ముగ్గురికి అయిదేళ్ల జైలు శిక్ష, రూ. 50,000 చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. సాంజీరాం కుమారుడు విశాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించగా, ఆయనకు సమీప బంధువైన మైనర్ బాలుడు జువెనైల్ కోర్టులో విచారణనెదుర్కొంటున్నాడు. ఆ దురంతం సాధారణమైనది కాదు. అసిఫాను దారుణంగా హింసించి మత్తు పదార్ధాన్నిచ్చి నాలుగు రోజులపాటు అత్యాచారం జరిపారు. చివరికామెను రాళ్లతో కొట్టి చంపారు. అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు బయటికొచ్చినప్పుడల్లా సమాజంలో ఆగ్రహావేశాలు పెల్లుబకడం రివాజే. కానీ కఠువా అత్యాచారం విషయంలో జరిగింది ఇది కాదు. ఆరోపణలెదుర్కొంటున్న నిందితులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. అప్పటి పీడీపీ–బీజేపీ ప్రభుత్వంలో మంత్రు లుగా ఉన్న ఇద్దరు ఆ ర్యాలీలో పాల్గొనడం మాత్రమే కాదు... ‘ఒక బాలిక మృతిపై ఇంత రాద్ధాంతం చేస్తారా?’ అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఎంతమంది మహిళలు ఈ ప్రాంతంలో మరణించడం లేదంటూ ప్రశ్నించారు. చివరకు బీజేపీ కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని ఆ మంత్రులిద్దరితోనూ రాజీనామాలు చేయించింది. కఠువా బార్ అసోసియేషన్, హిందూ ఏక్తా మంచ్ వంటి సంస్థలు జాతీయ పతాకంతో ర్యాలీలు నిర్వహించాయి. ఇందులో స్థానిక బీజేపీ, కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. చార్జ్‌షీటు దాఖలు చేయడానికొచ్చిన అధి కారులను అక్కడి బార్ అసోసియేషన్ అడ్డగించింది. చివరకు బాధితులు అక్కడైతే న్యాయం దక్క దని సుప్రీంకోర్టును ఆశ్రయించాక కేసు విచారణ పంజాబ్‌కు బదిలీ అయింది. రాజకీయాలు నేరమయం అవుతున్నాయని అందరూ ఆందోళనపడుతున్నారు. కానీ కఠువా ఉదంతం విషయంలో ఇది తిరగబడింది. అక్కడ నేరం రాజకీయమయం కావడం కనిపిస్తుంది. మతపరమైన కోణంలో నిందితులకు మద్దతు పలకడం కనిపిస్తుంది. ఈ సందర్భంగా న్యాయ మూర్తి తేజ్విందర్సింగ్ చేసిన వ్యాఖ్యలు గమనార్హమైనవి. నేరగాళ్లు ఈ సమాజంలో ఆటవిక రాజ్యం ఉన్నదన్న రీతిలో చెలరేగిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాల విష యంలో నిజానికి సమాజం మొత్తం ఒక్కటి కావాలి. నిందితుల నేరం రుజువు కావడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని పట్టుబట్టాలి. కానీ జమ్మూలోనూ, కథువాలోనూ అక్కడి సమాజం ఏకమై నిందితులను సమర్థించింది. నేరాన్నిబట్టి, దాని తీవ్రతనుబట్టి కాకుండా బాధిత వర్గం ఎవరో, నేరగాళ్లెవరో చూసుకుని సమర్థించాలో, వ్యతిరేకించాలో నిర్ణయించుకునే ధోరణి చివరకు సమాజాన్ని ధ్వంసం చేస్తుంది. తమ ప్రాంతంలో ఉంటున్న సంచార తెగవారిలో ఒకరు తమ బంధువును కొట్టారన్న ఆగ్రహంతో ప్రధాన నిందితుడు కక్షగట్టి అసిఫాను కిడ్నాప్ చేయించి ఈ మొత్తం దురంతానికి సూత్రధారిగా మారాడు. దిక్కూమొక్కూలేని సంచార తెగవారు ఈ ఉదంతం తర్వాత ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టిపోతారని, ఈ నేరం అక్కడితో సమసిపోతుందని అతగాడు భావించాడు. దీనంతటికీ ప్రార్థనా స్థలాన్ని వినియోగించుకున్నాడు. లైంగిక నేరాలకు దోహదపడుతున్న అంశాలేమిటో సక్రమంగా అవగాహన చేసుకున్నప్పుడే సరైన పరిష్కారం సాధ్యమవుతుంది. జరుగుతున్న నేరాలపై సత్వర దర్యాప్తు మొదలుపెట్టి, వెనువెంటనే దోషులను శిక్షించే ప్రక్రియ అమలైతే అవి చాలావరకూ తగ్గుతాయి. అయితే దీంతో పాటు చేయాల్సింది చాలా ఉంది. లైంగిక నేరాలకు మూలం ఆధిపత్య ధోరణిలో ఉంది. ఆ ఆధిపత్య ధోరణిలో ఒక్క జెండర్ అంశం మాత్రమే కాదు... కుల, మతాలవంటివి బలంగా ఉన్నాయని... అణగారిన వర్గాలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతున్నారు. కఠువాలో అది బాహాటంగా వెల్లడైంది. అసిఫాకు న్యాయం జరగాలని పట్టుదలతో కృషి చేసిన మహిళా న్యాయ వాది దీపికా సింగ్ రజావత్‌ను సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో దూషించడం, చంపేస్తామని బెదిరించడం మాత్రమే కాదు...సాంఘిక బహిష్కరణ అమలు చేశారు. న్యాయ స్థానంలో ఆమె సహచరులు ఆమెతో మాట్లాడటం మానుకున్నారు. ఇరుగుపొరుగు, బంధువులు దీపికా సింగ్‌ను దూరం పెట్టారు. ఆమెపై ‘జాతి వ్యతిరేకి’ ముద్ర వేశారు. ఇవన్నీ గమనించాక ఆమె కుటుంబసభ్యులు హడలెత్తి ఈ కేసు నుంచి తప్పుకోమంటూ ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఒక నిస్స హాయ సంచార తెగ బాలిక అన్యాయంగా బలైపోయిందని భావించి, మానవతా దృక్పథంతో ఈ కేసును స్వచ్ఛందంగా స్వీకరించిన ఒక మహిళా న్యాయవాది సమాజంలో ఏకాకిగా మారడం ఊహకందనిది. ఇలాంటివి లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో జరిగాయని విన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయేవారు. అది మనకు సైతం సాధారణ విషయంగా అనిపించే స్థితి ఏర్పడటం ప్రమా దకరమైంది. నిజానికి మిలిటెంట్ల ఆగడాలతో కశ్మీర్లో ఉండలేక అక్కడినుంచి వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందినవారు దీపికాసింగ్. ఆమెను వ్యతిరేకించినవారి అభ్యంతరం అదే. అన్ని బాధలకు కారణమైనవారికి ‘ఏదో జరిగితే’ ఎందుకు పట్టించుకోవాలన్నది వారి ప్రశ్న. ఈ కేసు విచారణ ఏడాది వ్యవధిలో పూర్తయి దోషులకు శిక్షపడటం ఊరటనిస్తుంది. సహజంగానే ఈ కేసు అప్పీల్‌కు వెళ్తుంది. ఉన్నత న్యాయస్థానాల్లో సైతం ఇదే వేగంతో విచారణ కొనసాగి నేరగాళ్లకు కఠిన శిక్షలు పడాలని ఆశించాలి. -
మరణించేవరకు జైలు జీవితమే..
పఠాన్‌కోట్: ఏడాదిన్నర క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన కఠువా సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని కోర్టు సోమవారం దోషులుగా తేల్చింది. వారిలో ముగ్గురికి యావజ్జీవ శిక్ష (జీవితఖైదు), ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సంజీరామ్ కొడుకు అయిన విశాల్‌ను కోర్టు సరైన సాక్ష్యాలు లేని కారణంగా నిర్దోషిగా విడుదల చేసిందని బాధితురాలి కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఫరూఖీ ఖాన్ చెప్పారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని సెషన్స్ కోర్టు ఈ కేసును సంవత్సరంపాటు విచారించిన అనంతరం న్యాయమూర్తి తేజ్వీందర్ సింగ్ సోమవారం తీర్పు చెప్పారు. ఈ కేసును జమ్మూ కశ్మీర్లో కాకుండా బయటి కోర్టు విచారించాలని గతేడాది మే 7న సుప్రీంకోర్టు ఆదేశించడంతో పఠాన్‌కోట్ కోర్టు ఈ కేసును విచారించింది. రణ్‌బీర్ పీనల్ కోడ్ (ఆర్పీసీ) కింద కోర్టు వారిని దోషులుగా తేలుస్తూ, బయట మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో వేచి ఉండగా తీర్పు వెల్లడించింది. కోర్టులోకి విలేకరులను అనుమతించలేదు. జమ్మూ కశ్మీర్‌లోని కఠువాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికపై ఓ ఆలయంలో సామూహిక అత్యాచారం, హత్య జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. బాలికను అపహరించి, ఆలయంలో బంధించి, నాలుగురోజుల పాటు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన అనంతరం బండరాళ్లతో మోదీ హత్య చేశారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కోర్టు ఈ కేసులో మొత్తం ఆరుగురిని దోషులుగా తేల్చగా, వారిలో నలుగురు పోలీసులే కావడం గమనార్హం. మరణించేవరకు జైలు జీవితమే.. బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్న ఆలయ సంరక్షకుడు సంజీరామ్, ప్రత్యేక పోలీస్ అధికారి (ఎస్పీవో) దీపక్ ఖజూరియాతోపాటు మరో వ్యక్తి ప్రవేశ్కుమార్లను కోర్టు దోషులుగా తేల్చింది. ఈ ముగ్గురూ అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడటంతోపాటు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వచ్చిన ఆరోపణలు రుజువైనట్లు కోర్టు తెలిపింది. వీరిని దోషులుగా ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించింది. జీవిత ఖైదు అంటే మరణించేంత వరకు జైలులో ఉండాల్సిందేనని కోర్టు స్పష్టంగా వివరించింది. అలాగే మరో ఎస్పీవో సురేంద్ర వర్మ, ఎస్సై ఆనంద్ దత్తా, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌లు సాక్ష్యాలను నాశనం చేశారంటూ వారికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 50 వేల జరిమానా విధించింది. జరిమానా కట్టలేకపోతే మరో ఆరునెలలు ఎక్కువగా జైలు జీవితం గడపాలని ఆదేశించింది. ఆనంద్ దత్తా, తిలక్ రాజ్‌లు కేసులో సాక్ష్యాలను నాశనం చేసేందుకు సంజీరామ్ నుంచి రూ. 4 లక్షలు తీసుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. బాలిక సంచార జాతికి చెందిన అమ్మాయి కాగా, వారి మైనారిటీ జాతిని పూర్తిగా లేకుండా చేసేందుకు చాలా పకడ్బందీగా కుట్ర పన్ని ఈ నేరానికి ఒడిగట్టారని చార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. తీర్పుపై మెహబూబా హర్షం.. కోర్టు తీర్పు పట్ల జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు హర్షం వ్యక్తం చేశారు. ‘నేరస్తులను చట్టానికి లోబడి వీలైనంత కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నేరస్తులకు మద్దతు తెలిపిన రాజకీయ నేతలను ఏదైనా అనడానికి అసలు పదాలు లేవు’ అని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. బీజేపీ నాయకులు గతంలో నిందితులకు మద్దతుగా నిలవడం తెలిసిందే. దోషులకు అత్యంత కఠిన శిక్ష పడేలా చేయాలని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దోషులందరికీ మరణశిక్ష వేయాలంటూ హైకోర్టులో జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) చైర్మన్ రేఖా శర్మ కోరారు. మరణశిక్ష పడుతుందనుకున్నాం.. ‘నేరస్తులకు మరణశిక్ష పడుతుందని మేం ఆశించాం. నిర్దోషిగా బయటపడిన వ్యక్తీ.. ప్రధాన నిందితుడేనని మేం వింటున్నాం. అలాంటప్పుడు అతణ్ని ఎందుకు విడుదల చేశారు’అని బాలిక తండ్రి అన్నారు. బాధిత కుటుంబం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు ఓ ప్రకటన విడుదల చేస్తూ, తాము కోర్టు తీర్పును పరిశీలించిన అనంతరం పై కోర్టుకు వెళ్తామనీ, నిర్దోషిగా విడుదలైన విశాల్‌ను దోషిగా తేల్చాలని అప్పీల్ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఓ బాలనేరస్థుడితో సహా మొత్తం ఎనిమిది మందిపై జమ్మూ కశ్మీర్ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేయగా, ఏడుగురిపై విచారణను ఈ కోర్టు చూసుకుంది. ఎప్పుడేం జరిగిందంటే.. ► 2018 జనవరి 10: కఠువా జిల్లాలోని రసనా గ్రామంలో బకర్వాల్ సంచార జాతికి చెందిన 8 ఏళ్ల బాలిక గుర్రాలను మేపుతుండగా ఆమె ఆచూకీ గల్లంతు. ► జనవరి 12: బాలిక తండ్రి ఫిర్యాదుతో హీరానగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. ► జనవరి 17: బాలిక మృతదేహం లభ్యం. గ్యాంగ్‌రేప్ తర్వాత చంపేసినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి. ► జనవరి 22: దేశవ్యాప్త నిరసనలతో జమ్మూ కశ్మీర్ క్రైం బ్రాంచ్‌కు కేసు బదిలీ. ► ఫిబ్రవరి 16: నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించిన హిందూ ఏక్తా మంచ్. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. ► మార్చి 1: ప్రధాన నిందితుడు, ఆలయ సంరక్షకుడు సంజీరామ్ను బంధువైన బాల నేరస్తుడి అరెస్టుకు వ్యతిరేకంగా హిందూ ఏక్తా మంచ్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేతలు, మంత్రులు. ► ఏప్రిల్ 9: మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా తేల్చి, వారిలో ఏడుగురిపై అభియోగపత్రాన్ని కఠువా కోర్టులో దాఖలు చేసిన పోలీసులు ► ఏప్రిల్ 10: బాల నేరస్తుడినని చెప్పుకున్న ఎనిమిదో వ్యక్తి పైనా అభియోగపత్రం దాఖలు చేసిన పోలీసులు. ► ఏప్రిల్ 14: మంత్రివర్గం నుంచి తప్పుకున్న చంద్ర ప్రకాశ్, లాల్ సింగ్. బాధితులకు న్యాయం చేయాలన్న ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్. ► ఏప్రిల్ 16: కఠువాలో ప్రధాన సెసన్స్ కోర్టు జడ్జి ముందు విచారణ ప్రారంభం. ► మే 7: కఠువా నుంచి పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు విచారణను మార్చిన సుప్రీంకోర్టు. విచారణను రహస్యంగా, వేగవంతంగా, మీడియాకు దూరంగా చేపట్టాలని ఆదేశించిన సుప్రీం కోర్టు. ► 2019 జూన్ 3: విచారణను ముగించిన పఠాన్ కోట్ సెషన్స్ కోర్టు. ► జూన్ 10: దోషులుగా తేల్చుతూ తీర్పు వెల్లyì ంచిన కోర్టు. సాంజీ రామ్ కఠువా దోషులు దీపక్ ఖజురియా ఎస్సై ఆనంద్ దత్తా, సురేందర్ వర్మ, తిలక్ రాజ్ -
కథువా కేసు: ఆ చిన్నారికి న్యాయం జరిగింది!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో చిన్నారి బాధితురాలికి న్యాయం చేకూరడం తనకు ఆనందం కలిగించిందని ఈ కేసు విచారణకు నేతృత్వం వహించిన జమ్మూకశ్మీర్ మాజీ పోలీసు అధికారి రమేశ్‌కుమార్ జల్లా తెలిపారు. ‘ఆ చిన్నారి ఆత్మకు న్యాయం జరగడం ఆనందంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. కథువా రేప్ కేసులోని ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారిస్తూ.. పఠాన్‌కోట్ స్పెషల్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, ప్రవేష్‌కుమార్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఆనంద్ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కథువా అత్యాచార కేసు.. అప్పుడు అధికారంలో ఉన్న పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో తీవ్ర విభేదాలకు కారణమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో తమ బృందానికి ఎలాంటి రాజకీయ ఒత్తిడి ఎదురుకాలేదని రమేశ్‌కుమార్ జల్లా మీడియాతో పేర్కొన్నారు. క్రైమ్ బ్రాంచ్ సీనియర్ సూపరింటెండెంట్‌గా వ్యవహరించిన ఆయన గత నెలలో పదవీ విరమణ తీసుకున్నారు. ‘నేను ఇప్పుడు రిటైరయ్యాను. ఇప్పుడు నన్ను ఎవరూ ఏమీ చేయలేను. నమ్మండి నేను చెప్పేది నిజం. ఏ వర్గం నుంచి మాకు ఒత్తిడి ఎదురుకాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ, పీడీపీ ఇలా ఏ ఒక్కరి నుంచి మాకు ఒత్తిడి రాలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అత్యాచార కేసుకు మతపరమైన ముద్ర వేసేందుకు ప్రయత్నించారని, కానీ, అప్పటి మంత్రుల నుంచి కానీ, అధికార వ్యవస్థ నుంచి కానీ ఎలాంటి ఒత్తిళ్లు ఎదురవ్వలేదని ఆయన వివరించారు. మీడియాలో విభిన్నమైన కథనాలు రావడం తమను ఒత్తిడికి గురిచేసిందని, అయినా దానిని తాము పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే అత్యాచారం చేసి.. హత్య చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. -
కథువా హత్యాచార కేసు : ముగ్గురికి జీవిత ఖైదు
చండీగఢ్ : దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన పఠాన్‌కోట్ స్పెషల్ కోర్టు సోమవారం మధ్యాహ్నం వారిలో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఆలయ పూజారి సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, ప్రవేష్‌కుమార్‌లకు జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో దోషులుగా తేలిన ముగ్గురు పోలీసు అధికారులు సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, ఆనంద్ దత్తాలకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతకుముందు ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని దోషులుగా ఖరారు చేస్తూ ప్రత్యేక న్యాయస్ధానం తుదితీర్పు వెలువరించింది. కాగా, జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. -
ఉపశమనం లభించింది; ఇది సరిపోదు!
శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచారం కేసులో పఠాన్కోర్టు వెలువరించిన తీర్పును జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి, ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఎనిమిదేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసులో ఆరుగురిని దోషులుగా తేలుస్తూ కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తి స్పందించారు. ‘ కథువా కేసులో తీర్పుతో కాస్త ఉపశమనం లభించింది. ఈ గొప్పదనమంతా.. క్రైమ్‌బ్రాంచ్ టీమ్‌ను ముందుండి నడిపించిన ఐజీపీ ముజ్తాబా, ఎస్ఎస్పీ జాలా, ఇతర పోలీసు ఉన్నతాధికారులు నవీద్, శ్వేతాంబరి, లాయర్ దీపికా రజావత్, తాలిబ్లకే దక్కుతుంది. వీరంతా ప్రాణాలు పణంగా పెట్టిమరీ నిజాలను వెలుగులోకి తెచ్చారు. చిన్నారికి మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ తీర్పును స్వాగతిస్తున్నా. ఎనిమిదేళ్ల చిన్నారికి మత్తు పదార్థాలు ఇచ్చి, పలుమార్లు అత్యాచారం జరిపి, పాశవికంగా హత్య చేసిన క్రూరులకు చట్టంలోని లోపాలు ఆయుధం కాకూడదు. హేయమైన నేరానికి పాల్పడిన వాళ్లకు కచ్చితంగా శిక్ష అమలు కావాలి అని ఆమె పేర్కొన్నారు. ఈ శిక్ష సరిపోదు.. ‘ఈ తీర్పును స్వాగతిస్తున్నా. అయితే దోషులకు జీవిత ఖైదు సరిపోదు. అంతకంటే కఠినమైన శిక్షను అమలు చేయాలి. నిందితులకు మద్దతుగా నిలిచిన కొంతమంది రాజకీయ నాయకులకు కనువిప్పు కలగాలి. బాధిత కుటుంబాన్ని, పోలీసులు, లాయర్లను బెదిరించిన వారిని ఏమనాలో అర్థం కావడం లేదు’ అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. చదవండి : ఏదో ఒకరోజు నన్ను కచ్చితంగా చంపేస్తారు కాగా కశ్మీర్‌లోని కథువాలో గిరిజన తెగకు చెందిన ముస్లిం బాలికపై కొంతమంది వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారం జరిపి హతమార్చిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. ఈ కేసులో బాధితురాలి తరఫున వాదిస్తే చంపేస్తామని బెదిరింపులు రావడంతో..ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో దీపికా సింగ్ రజావత్ చిన్నారి తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. అయితే నిందితులకు కొంతమంది బీజేపీ నాయకులు మద్దతు తెలపడం, ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలు చెలరేగడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు తీర్పు వెలువరించింది. -
కథువా అత్యాచారం, హత్య కేసులో తుది తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన కథువా అత్యాచార కేసులో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ స్పెషల్ కోర్టు సోమవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లో ఆరుగురిని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సాంజీ రామ్, ఇద్దరు పోలీసు అధికారులు దీపక్ ఖజూరియా, సురేందర్ వర్మ, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్‌ల, మరో ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్థారించింది. అయితే సాంజీ రామ్ కుమారుడు విశాల్‌ను నిర్దోషిగా చెబుతూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. దోషులకు న్యాయస్థానం మధ్యాహ్నం శిక్షలు ఖరారు చేయనుంది. చదవండి: కథువా కేసు.. వాళ్ల పనే! కాగా జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గతేడాది జనవరిలో ఎనిమిదేళ్ల బాలికను అత్యంత దారుణంగా ఆలయంలోనే హత్యాచారం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన విషయం విదితమే. బాధితురాలికి మత్తు పదార్థాలు ఇచ్చి, సామూహిక అత్యాచారం, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. బాలికను గ్రామంలోని ఓ దేవాలయంలో బంధించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. నాలుగు రోజుల తర్వాత అత్యంత దారుణ పరిస్థితిలో బాలిక మృతదేహం బయటపడింది. పాశవికమైన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు,. నిరసనలు హోరెత్తాయి. ఈ కేసులో గ్రామ పెద్ద సాంజి రామ్, అతని కొడుకు విశాల్, మైనర్ మేనల్లుడితోపాటు ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు దీపక్ ఖజురియా, సురేందర్ వర్మలను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు లంచం తీసుకుని ఆధారాలను ధ్వంసంచేశారనే ఆరోపణలపై కానిస్టేబుల్ తిలక్‌రాజ్, సబ్ ఇన్సిపెక్టర్ ఆనంద్ దత్తా కూడా అరెస్టయ్యారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. కేసు విచారణను సుప్రీంకోర్టు పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేసింది. మొత్తం ఎనిమిదిమంది నిందితులు ఉండగా.. వారిలో ఏడుగురిపై అత్యాచారం, హత్య అభియోగాలపై ఛార్జ్‌షీట్ దాఖలైంది. మైనర్ మాత్రం ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. కాగా కోర్టు తీర్పు నేపథ్యంలో పఠాన్‌కోట్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ కోర్టు వద్ద అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఎలాంటి అంవాఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు నిందితులకు ఉరిశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
కథువా కుటుంబానికి మరో షాక్
కశ్మీర్ : డిజిటల్ బ్యాంకింగ్ వంటి నూతన పోకడల వల్ల నిరక్షరాస్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ వార్త మన కళ్లకు కడుతుంది. గతేడాది జనవరిలో కథువాలో ఎనిమిదేళ్ల బాలికను అపహరించి ఆలయంలో బంధించి సామూహిక అత్యాచారం జరిపి హతమార్చిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కన్న బిడ్డను పోగొట్టుకున్న బాధ నుంచి ఆ కుటుంబం ఇంకా కోలుకోనేలేదు. అప్పుడే వారికి మరోక షాక్ తగిలింది. బిడ్డ మరణంతో కుమిలి పోతున్న వారిని ఆదుకోవాడానికి విరాళాలు ఇచ్చారు కొందరు మానవతా వాదులు. కానీ జనాలు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారంటే.. అలా వచ్చిన సొమ్మును కూడా కాజేశారు. అది కూడా దర్జాగా బ్యాంక్ ఖాతా నుంచి కొట్టేశారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది లక్షల రూపాయలను బ్యాంక్ ఖాతా నుంచి ఖాతాదారునికి తెలియకుండా డ్రా చేశారు. వివరాలు.. కథువా సంఘటన తర్వాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణ ప్రారంభించాయి. అలా వచ్చిన సొమ్మును బాధితురాలి తండ్రితో పాటు వారి కుటుంబానికి చెందిన అస్లాం ఖాన్ అనే వ్యక్తి పేరు మీద తీసిన జాయింట్ అకౌంట్లో వేశారు. ప్రస్తుతం ఈ అకౌంట్ నుంచి తనకు తెలియకుండా ఎవరో ఏకంగా 10 లక్షల రూపాయలను విత్‌డ్రా చేశారని బాధితురాలి తండ్రి వాపోతున్నాడు. తనకు చదువు రాదని.. ఈ మోసం ఎలా జరిగిందో తనకు తెలియదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.అంతేకాక ఈ విషయం గురించి అస్లాం ఖాన్‌ను ప్రశ్నించినప్పుడు అతడు సరిగా స్పందించలేదని బాధితురాలి తండ్రి తెలిపాడు. తనకు అతని మీద అనుమానం ఉందని పేర్కొన్నాడు. గత నెల జనవరి నుంచి నేటి వరకు తన అకౌంట్ నుంచి రూ. 22 లక్షలు డ్రా చేశారని తెలిపాడు. వాటిలో ఓ పది లక్షల రూపాయలు మాత్రమే తాను తీసుకున్నానని.. మిగతా మొత్తం గురించి తనకు తెలీదని వాపోతున్నాడు. ఈ విషయం గురించి బ్యాంక్ అధికారులను ప్రశ్నించగా.. చెక్కులు తీసుకొచ్చి సొమ్ము డ్రా చేశారని.. వాటిలో అన్ని వివరాలు సరిగా ఉండటంతో సొమ్ము ఇచ్చామన్నారు. కొన్ని ట్రాన్సాక్షన్లు అస్లాం ఖాన్ పేరు మీద జరగ్గా.. మరి కొన్ని ట్రాన్సాక్షన్లు నజీమ్ అనే వ్యక్తి పేరు మీద జరిగినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. బ్యాంక్ ఖాతా వివరాలు పూర్తిగా తెలిసిన వారే ఈ పని చేసుంటారని అధికారలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
2018 : కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం
కొండగట్టు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది.. కథువా ఘటన మనిషిలో కనుమరుగైన మానవత్వాన్ని చూపింది.. ఉన్నావ్ దుర్ఘటన రాజకీయ ఒత్తుడులను చవిచూసింది.. సమాజానికి సిగ్గుచేటుగా దాచేపల్లి ఘటన.. ప్రేమికుడి కోసం భర్తను హత్య చేయించడం మానవ సంబంధాల ఉనికిని చూపెడుతోంది.. ఈ ఏడాది సంచలనం రేపిన ఘటనలను ఓ సారి చూద్దాం.. సంచలనం రేపిన కథువా దుర్ఘటన (జనవరి 10-17) జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కథువా గ్రామానికి కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విషాదం మిగిల్చిన విమానం ఆఫ్రికాలోని అల్జీరియాలో ఏప్రిల్ 11న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది దుర్మరణం చెందారు. రాజధాని అల్జీర్స్ నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. మృతుల్లో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఉలిక్కిపడేలా చేసిన ఉన్నావ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలి తండ్రిని ఏప్రిల్ 5వ తేదీన అక్రమ ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయన అదే రాత్రి మృతి చెందడం కలకలం రేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మానవత్వానికి సిగ్గుచేటు.. దాచేపల్లి ఘటన (మే 3-5) గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు గురజాల మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు కోసం భర్త హత్య (మే 7)విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి మండలంలో సరస్వతి అనే వివాహిత పెళ్లైనా వారం రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని ప్రేమించిన సరస్వతి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ హత్య దుండగులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నిందితురాలిగా తేల్చారు. పడవ బోల్తా.. 26మంది మృతి (మే 15) పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందారు. మే 15 సాయంత్రం దేవిపట్నం నుంచి కొండమొదలు బయలుదేరిన లాంచీ సుడిగాలుల తీవ్రతకు బోల్తాపడింది. మేనమామే.. మృగంలా మారి! (జూన్ 15) మానసిక వికలాంగులైన చిన్నారులను సొంత మేనమామే దారుణంగా హత్య చేశాడు. మిర్యాలగూడలోని తన అక్క వద్ద నుంచి పిల్లల్ని తన రూమ్‌కు తీసుకువచ్చిన మల్లికార్జునరెడ్డి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. చివరకు నిందితుడు మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ఎనిమిదేళ్ల బాలికపై.. (జూన్ 26) మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారనికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది.. (జూలై 1) దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మూఢ నమ్మకాలపై విశ్వాసంతో.. మోక్షం పొందడం కోసమే వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి ఇంట్లో లభించిన ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతు.. (జూలై 14) తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో నాటుపడవ గోదావరి నది పాయలో బోల్తా కొట్టిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతయ్యారు. చిన్నారులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనాథ శరణాలయంలో దారుణం! (జూలై) బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకుడు బ్రజేష్ లైంగిక దాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబైకి చెందిన ‘టిస్’ చేపట్టిన సోషల్ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కరక్కాయతో కాటువేశాడు! (జూలై) హైదరాబాద్ కేపీహెచ్బీలో కరక్కాయ పొడి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితులకు వేల రూపాయలు ఎరగా చూపిన నిందితులు కోట్లాది రూపాయలతో ఉడాయించారు. ధర్మపురి సంజయ్‌పై ఆరోపణలు (ఆగస్టు) ప్రముఖ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్ 20 రోజలు పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం (సెప్టెంబర్ 11) జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి. మిర్యాలగూడ పరువు హత్య! (సెప్టెంబర్ 14) మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహన్ని తట్టుకోలేకపోయిన మారుతి రావు ప్రణయ్‌ను అంతమొందించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హతం! (సెప్టెంబర్ 23) మన్యంలో మాటు వేసిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే కిడారి సోములను దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. మిస్టరీగా ఖషోగ్గి హత్య (అక్టోబర్ 2) ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కనీసం ఆయన మృతదేహాం కూడా లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖషోగ్గీ హత్య వెనుక ఉంది సౌదీ అరేబియా ఉందనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొంది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారనే ఆరోపణలు వచ్చాయి. రావణాసురుడి దహణం.. 59మంది దుర్మరణం (అక్టోబర్ 19) పంజాబ్ అమృత్‌సర్‌లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జోడా ఫాటక్ ప్రాంతంలో రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అండమాన్‌లో అమెరికన్ టూరిస్ట్ హత్య (నవంబర్) అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా, అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు. ఆలయంలో విష ప్రసాదం.. 15మంది మృతి (డిసెంబర్ 14) కర్ణాటక చామరాజనగర జిల్లా సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయంలో విష ప్రసాదం తిని 15 మంది మృతి చెందటం సంచలనంగా మారింది. ఆధిపత్య పోరు ముసుగులో పగతో ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలింది. -
మూకోన్మాదం, కథువాపై రచ్చ
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని అల్వార్‌లో ఇటీవల జరిగిన మూకోన్మాద ఘటనపై సోమవారం లోక్‌సభ దద్దరిల్లింది. జీరో అవర్‌లో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ఎంపీ కరణ్ సింగ్ రాజస్తాన్‌లో ఇటీవలి కాలంలో జరిగిన నాలుగో మూక హత్య ఇదని పేర్కొన్నారు. దీని వెనక గోరక్షకుల హస్తముందన్నారు. దీనిపై బీజేపీ మండిపడింది. పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి కాంగ్రెస్ ఎంపీ ప్రసంగానికి అడ్డుతగలడంతో వాగ్వాదం జరిగింది. అంతకుముందు, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా కథువా ఘటనను, దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నావ్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. రాహుల్‌పై హక్కుల ఉల్లంఘన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో రాఫెల్ ఒప్పందంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలంటూ బీజేపీ ఎంపీలు పెట్టిన సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఇచ్చారు. రాఫెల్ ఒప్పందంలో బూటకపు జాతీయవాదం చాటున నక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని మాజీ రక్షణ మంత్రి ఆంటోనీ విమర్శించారు. కాగా, యూపీఏ హయాంలో కోట్ చేసిన దానికంటే 9 శాతం తక్కువకే తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని న్యాయశాఖ మంత్రి చెప్పారు. గృహ కొనుగోలుదారులకు సాధికారత కల్పించేలా దివాళా చట్టం – 2018లో ప్రభుత్వం తీసుకురానున్న సవరణలను ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఎంపీలు ఆన్లైన్లోనే ప్రశ్నలు అడిగేలా, నోటీసులిచ్చేలా ‘ఈ–నోటీసెస్’ యాప్‌ను ప్రారంభించారు. అటు, చెక్ బౌన్సుల కేసులో త్వరగా విచారణ జరిగే నెగోషియేబుల్ ఇన్స్ట్రుమెంట్ (సవరణ) బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఇలాంటి కేసుల విచారణలో చెక్ ఇచ్చిన వ్యక్తి ముందుగా చెక్ మొత్తంలో 20శాతాన్ని పరిహారంగా చెక్ తీసుకున్న వ్యక్తికి ఇవ్వాలి. -
కథువా కేసు.. వాళ్ల పనే!
ఎనిమిదేళ్ల చిన్నారి కిరాతకంగా హత్యాచారానికి గురైన కేసులో నిందితుడి తరపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘోరం వెనుక ఉంది జిహాదీలే తప్ప.. తన క్లైయింట్లు కాదని వ్యాఖ్యానించాడు. పథాన్‌కోట్ జిల్లా మరియు సెషన్స్ న్యాయస్థానంలో ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు సాంజీ రామ్ స్టేట్మెంట్ను నమోదు చేయగా.. ఆ మరుసటి రోజే సాంజీరామ్ తరపు న్యాయవాది అంకుర్ శర్మ ఈ వ్యాఖ్యలు చేశాడు. (నోరు విప్పిన సాంజిరామ్.. అందుకే చంపా!) ‘ఇది ముమ్మాటికీ జిహాదీల పనే. జమ్ము కశ్మీర్లో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం వాళ్ల ఎజెండా. అందుకే బాలికను క్రూరంగా చంపి అక్కడ పడేశారు. నా క్లైయింట్లకు ఏ పాపం తెలీదు. కుట్రపూరితంగా వారిని ఇరికించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేపడితే విషయాలు వెలుగులోకి వస్తాయి. ఈ మేరకు గవర్నర్ వోహ్రాను కలిసి విజ్ఞప్తి చేస్తాం’ అని అంకుర్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ ఘటన తర్వాత నోమాదిక్ తెగ వారికి ప్రభుత్వ స్థలాల్లో ఆశ్రయాలను ఏర్పాటు చేసుకునేందుకు అప్పుడు సీఎంగా ఉన్న మెహబూబా ముఫ్తీ ఇచ్చిన ఆదేశాలు.. ఇప్పటికీ కొనసాగటంపై అంకుర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. తక్షణమే ఆ ఆదేశాలను రద్దు చేయాలని గవర్నర్‌ను కోరనున్నట్లు అంకుర్ తెలిపాడు. (‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు) అయితే న్యాయ నిపుణులు మాత్రం అంకుర్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై నేరారోపణలు నమోదు అయ్యాక.. (నిందితుడి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు కూడా...) న్యాయవాది అంకుర్ ఇలా ఎలా వ్యాఖ్యలు చేయగలుగుతున్నారని వారు మండిపడుతున్నారు. కథువాకు సమీపంలోని ఓ గ్రామంలో నోమాదిక్ తెగకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి.. వారంపాటు పైశాచికంగా లైంగిక దాడి చేసి మరీ హతమార్చారు. ఈ ఘటన కథువా కేసుగా ప్రప్రంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
కథువా నిందితులపై అభియోగాల నమోదు
సాక్షి, పఠాన్‌కోట్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్మూ కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసును విచారిస్తున్న న్యాయస్థానం ఎనిమిది మంది నిందితులకు గాను ఏడుగురిపై అభియోగాలు నమోదు చేసింది. దీంతో నిందితులపై విచారణ ప్రారంభించేందుకు మార్గం సుగమం చేసిందని అధికారులు పేర్కొన్నారు.నిందితులపై నేరపూరిత కుట్ర, హత్య, సామూహిక లైంగిక దాడి నేరాలను నమోదు చేసినట్టు జిల్లా సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జేకే చోప్రా చెప్పారు. నిందితులు సంజీ రామ్, ఆయన కుమారుడు విశాల్, ప్రత్యేక పోలీసు అధికారులు దీపక్ ఖజురియా, దీపు, సురీందర్ వర్మ, పర్వేష్ కుమార్ అలియాస్ మన్ను, హెడ్‌కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ దత్తాలపై అభియోగాలు నమోదయ్యాయి. బాలికను అపహరించే కుట్రకు ప్రధాన సూత్రధారిగా సంజీరామ్ను భావిస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి మైనారిటీ వర్గాన్ని తరిమికొట్టే కుట్రలో భాగంగా ఇతర నిందితులతో కలిసి సంజీ రామ్ పకడ్భందీగా ఈ నేరానికి పాల్పడినట్టు భావిస్తున్నారు. కథువా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. -
కథువా కేసు...గూగుల్, ఫేస్‌బుక్‌లకు షాక్!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘కథువా అత్యాచార’ ఘటనకు సంబంధించి సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో గూగుల్, ఫేస్బుక్, ట్విటర్, యూట్యూబ్ సంస్థలకూ నోటిసులు జారీ చేసింది. వివరాల ప్రకారం...‘కథువా అత్యాచార’ ఘటనలో బాధితురాలి వివరాలను వెల్లడి చేసినందుకు గాను వివరణ ఇవ్వాల్సిందిగా గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విటర్ సంస్థలకు అంతకముందు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలకు సమాధానం చెప్పే అధికారం తమకు లేదంటూ ఆయా కంపెనీల భారతీయ అనుబంద సంస్థలు తెలిపాయి. దాంతో కోర్టు ఈ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. మీడియా సంస్థలు అత్యాచార బాధితురాలి వివరాలు వెల్లడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) దాఖలు చేసిన పిటీషన్ విచారించడానికి ఢిల్లీ హైకోర్టు ఒక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ గూగుల్‌తో పాటు ఇతర ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా సైట్లు మైనర్ అత్యాచార బాధితురాలి వివరాలను బహిర్గతం చేసాయని తెలిపింది. కానీ ఇటువంటి పనులు చేయడానికి సదరు కంపెనీలకే కాక ఎవరికి ఎటువంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టు గత నెల 12 మీడియా సంస్థలకు, ఒక్కొక్క సంస్థకు రూ.10 లక్షల జరిమానా విధించింది. ఇలా బాధితురాలి వివరాలను వెల్లడించడం వల్ల ఆ కుటుంబానికే కాక సమాజంలోని మహిళలపై కూడా దీర్ఘకాలంలో ఈ అంశాలు ప్రభావం చూపుతాయని తెలిపింది. చట్టాన్ని అతిక్రమించినందుకు గాను సదరు కంపెనీలు ఐపీసీ సెక్షన్ 228 - ఏ కింద శిక్షార్హులని తెలిపింది. -
కథువా కేసులో కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: కథువా కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బాధిత కుటుంబానికి, న్యాయవాదికి, సాక్ష్యులకు రక్షణ కల్పించాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ‘కథువా కేసును పఠాన్‌కోట్ జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నాం ఈ కేసులో ప్రతీరోజు వాదనలు జరగాలి. కేసు విచారణ త్వరగతిన పూర్తి కావాలి. కోర్టు విచారణను రహస్య విచారణ చేపట్టాలని ఆదేశించింది(ఇన్-కెమెరా ప్రోసీడింగ్స్). ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించుకునేందుకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి అనుమతిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనను జూలై 9కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మమ్మల్ని కాల్చిచంపండి:‘కథువా’ బాలిక తల్లి అందుకే చిన్నారిని చంపాం: సాంజిరామ్ 8 ఏళ్ల చిన్నారిని ఆలయంలో బంధించి అత్యాచారం చేసి, ఆపై అత్యంత దారుణంగా హతమార్చిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సాంజీరామ్ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగితోసహ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును జమ్ము కశ్మీర్ నుంచి ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధిత బాలిక తండ్రి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. మరోపక్క నిందితులు మాత్రం ఆ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగానే దర్యాప్తు జరుపుతున్నారంటూ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తాజాగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్ కామాంధులకు మరణశిక్ష.. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం -
‘కథువా’ బాలిక తల్లి సంచలన వ్యాఖ్యలు
బనిహాల్(జమ్ముకశ్మీర్): ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన కథువా బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి కీలక తీర్పులు వెలువడనున్నాయి. కేసు విచారణను జమ్ముకశ్మీర్ నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలన్న బాధిత కుటుంబం అభ్యర్థన, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాన్న నిందితుల డిమాండ్.. ఈ రెండు అంశాలపై సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయం ప్రకటించనుంది. కాగా, తమ కుటుంబానికి జరిగిన దారుణాన్ని తలుచుకుంటూ మృతురాలి తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని కాల్చిచంపండి: కథువాలో దారుణ సంఘటన, అనంతర పరిణామాల తరువాత బాధిత కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది. ప్రస్తుతం వారు కథువాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనిహాల్(రంబాన్ జిల్లా)లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. కనీస అవసరాలు కూడా లేని చిన్న గుడారంలో కాలం వెళ్లదీస్తోన్న ఆ కుటుంబం.. ఇప్పటికీ భయంతో వణికిపోతున్నది. ‘‘నా బిడ్డను పొట్టనపెట్టుకున్న ఆ దుర్మార్గులు బయటికొస్తే మిగిలిన మా నలుగురినీ(తను, భర్త, ఇద్దరు పిల్లు) చంపేస్తారు. మాకు కావాల్సిందల్లా న్యాయమే. ఒకవేళ న్యాయం చేయలేరనుకుంటే మమ్మల్ని కాల్చిచంపేయండి’’ అని కన్నీటిపర్యంతం అయిందా తల్లి. అమాయకులు కాదు.. దుర్మార్గులు: రసానాలో తాము గడిపిన రోజులు నిజంగా భయంకరమైనవని, సాంజీరామ్(బాలిక హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు) కుటుంబీకులు చాలా క్రూరంగా ప్రవర్తించేవారని మృతురాలి తల్లి గుర్తుచేశారు. ‘‘ ఊరి బయట పచ్చికలోనూ మా పశువుల్ని మేపనిచ్చేవారు కాదు. చివరికి నా బిడ్డను పొట్టనపెట్టుకున్నారు. అక్కడ(రసానాలో) మాకున్న ఇల్లు, ఆస్తి అంతా ధ్వంసమైపోయింది. కోర్టులో చెప్పుకున్నట్టు వాళ్లేమీ(నిందితులేమీ) అమాయకులు కాదు. పచ్చి దుర్మార్గులు. వాళ్లను ఉరితీయాల్సిందే. పొరపాటున బయటికొస్తే మమ్మల్ని కూడా చంపేస్తారు’’ అని బాలిక తల్లి అన్నారు. పశువుల పెంపకమే వృత్తిగా జీవించే బకర్వాల్ సంచార తెగకు చెందిన కుటుంబాలు.. చాలా కాలం కిందటే కథువా ప్రాంతంలో శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. విశాలమైన పచ్చకబయళ్లున్న ఆ ప్రాంతంలో తమ గొర్రెలు, మేకలు, గుర్రాలను మేపేవారు. ముస్లిం తెగల వ్యాప్తిని జీర్ణించుకోలేని స్థానికులు కొందరు.. బకర్వాల్‌లను అక్కడి నుంచి వెళ్లగొట్టాలనుకున్నారు. వారిని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశంతోనే.. ఎనిమిదేళ్ల చిన్నారిని అపహరించి, కొద్దిరోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారం జరిపి, చివరికి కొట్టిచంపేశారు. జమ్ముకశ్మీర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో ఈ విషయాలను పేర్కొన్నారు. అయితే, తాము అమాయకులమని, చిన్నారి మరణంతో ఎలాంటి సంబంధంలేదని నిందితులు వాదిస్తున్నారు. సీబీఐతో దర్యాప్తు జరిపిస్తే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని, ఆమేరకు సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేశారు. అటు బాధిత కుటుంబం సైతం కేసును జమ్ముకశ్మీర్ నుంచి బయటికి తరలించి విచారించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. -
‘ఆ చిన్నారికి తాతలాంటోడిని..’
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన కథువా కేసులో ప్రధాన నిందితుడు సాంజిరామ్ ట్విస్ట్ ఇచ్చాడు. తాను అమాయకుడినని, తనకే పాపం తెలీదని.. కుట్రపన్ని పోలీసులు ఈ కేసులో ఇరికించారని ఆరోపణలకు దిగాడు. ఈ మేరకు కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో శుక్రవారం ఓ అఫిడవిట్ దాఖలు చేశాడు. అఫిడవిట్లో పేర్కొన్న వివరాలు... ‘ఆ చిన్నారికి నేను తాతలాంటోడ్ని. పోలీసులు కుట్ర పన్ని ఈ కేసులో మమల్ని ఇరికించారు. బాధితురాలికే కాదు.. ఈ కేసులో మాకు కూడా న్యాయం జరగాల్సిందే. సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అసలు నేరస్థులు ఎవరన్నది తేలుతుంది. ఛండీగఢ్ కోర్టుకు కేసును బదిలీ చేయాలన్న డిమాండ్ హేతుబద్ధమైంది కాదు. కానీ, ఈ కేసులో 221 మంది సాక్ష్యులు ఉన్నారు. వారందరినీ కథువా నుంచి ఛండీగఢ్ తరలించటం చాలా కష్టంతో కూడుకున్న పని. పైగా బాధిత కుటుంబానికి ప్రాణహాని ఉందన్న నేపథ్యంలోనే కేసును బదిలీ చేయాలని కొందరు వాదిస్తున్నారు. కానీ, దీనివెనుక వేరే ఉద్దేశం ఉంది. మా ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మమల్ని చంపాలని చూస్తున్నారు. అందుకే అనుమతించొద్దు’ అని సాంజీరామ్, అతని తనయుడు విశాల్ తరపున న్యాయవాది అఫిడవిట్లో విజ్ఞప్తి చేశారు. కథువా కేసు.. దిగ్భ్రాంతికర విషయాలు ఇక ఈ కేసులో బాధితురాలి తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్‌ను కూడా సాంజీ రామ్ వదల్లేదు. ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఆమె వాదనలు వినిపించలేదు. అలాంటప్పుడు ప్రాణ హాని ఉందని ఆమె ఎలా అంటున్నారు. ఆమె కోసం నియమించిన భద్రతా సిబ్బందిని వెంటనే తొలగించాలి’ అని సాంజీ రామ్ విజ్ఞప్తి చేశాడు. కాగా, తన కొడుకును రక్షించుకునేందుకే ఆ చిన్నారిని చంపాల్సి వచ్చిందన్న సాంజీరామ్ వాంగ్మూలాన్ని పోలీసులు ఇదివరకే నమోదు చేశారు. నేను కూడా ‘కథువా’ బాధితురాలినే... ‘కథువా’ నిరసన; మోదీకి చేదు అనుభవం -
కథువా ఘటన : న్యాయవాదికి ఎమ్మా వాట్సన్ మద్దతు
లాస్ ఏంజెల్స్ : జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచార ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కుతున్న సంగతి తెలిసిందే. అత్యంత కిరాతకమైన ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా హ్యారీ పోర్టర్ నటి ఎమ్మా వాట్సన్ స్పందించారు. అత్యాచార బాధిత తరుఫున వాదిస్తున్న న్యాయవాది దీపికా సింగ్ రజావత్‌కు ఆమె మద్దతు తెలిపారు. దీపికా సింగ్ రజావత్‌కు మద్దతు తెలుపుతూ ఎమ్మా వాట్సన్ శుక్రవారం ఓ ట్వీట్ చేశారు. ఓ ఆర్టికల్‌ను షేర్ చేస్తూ... దీపికా సింగ్ రజావత్‌కే అన్ని అధికారాలు అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మా వాట్సన్ ఐక్యరాజ్యసమితిలో మహిళల గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఉన్నారు. యువతుల్లో సాధికారిత కలిగించేందుకు ఆమె క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఎమ్మా వాట్సన్ షేర్చేసిన ఆర్టికల్‌లో రజావత్ నమ్మకాన్ని, వృత్తి పట్ల ఆమెకున్న వైఖరిని పేర్కొన్నారు. కథువా అత్యాచార ఘటనకు సంబంధించి మొట్టమొదట రిట్ పిటిషన్ వేసిన లాయర్ దీపికా సింగ్ రజావత్. చిన్నారిపై జరిగిన ఘాతుకానికి చలించి కథువాలోని ఆ పాప తండ్రిని కలిసి కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసును చేపట్టిన వెంటనే ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. అయినా ఆమె భయపడకుండా.. హంతకులకు శిక్షపడి, ఆ పాప తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు వెనక్కితగ్గేది లేదని కరాఖండిగా చెప్పారు. కశ్మీరీ పండిట్ అయిన 38 ఏళ్ల దీపికా సింగ్ రజావత్ స్వస్థలం కశ్మీర్ ఉత్తర ప్రాంతంలోని సరిహద్దు జిల్లా కుప్వారాలో కరిహామా గ్రామం. ఈ చిన్నారి తరుఫున వాదిస్తున్న రజావత్‌కు బెదిరింపులు ఎక్కువ అవడంతో, ఆమెకు సెక్యురిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది. రజావత్‌తో పాటు, చిన్నారి కుటుంబానికి, బాధిత కుటుంబానికి సాయంగా ఉన్న బకర్వాల్ కమ్యూనిటీ సభ్యుడు తలీబ్ హుస్సేన్‌కు కూడా సెక్యురిటీ ఏర్పాటు చేయాలని జమ్ముకశ్మీర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.ప్రస్తుతం జమ్ముకశ్మీర్ హైకోర్టులో ఈ కేసు వాదనలు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. All power to Deepika Singh Rajawat ✊🏻https://t.co/sZzDVcIFNo — Emma Watson (@EmmaWatson) May 3, 2018 -
కశ్మీర్ కేబినెట్లోకి ‘కథువా’ ఎమ్మెల్యే
సాక్షి, జమ్మూ : జమ్మూ కశ్మీర్ ప్రభుత్వంలో సోమవారం మంత్రి పదవులు స్వీకరించిన ఆరుగురు బీజేపీ శాసన సభ్యుల్లో ఒకరు కథువా శాసన సభ్యుడు రాజీవ్ జస్రోటియా కూడా ఉన్నారు. కథువాలో సంచారజాతి ముస్లిం కుటుంబానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై దారుణంగా రేప్ చేసి, హత్య చేసిన సంఘటనలో నిందితులకు మద్దతుగా జరిపిన ర్యాలీలో ఈ జస్రోటియా కూడా పొల్గొన్నారు. అంతేకాకుండా ఆ సంచార జాతి ముస్లింలను తరిమేసేందుకు వారిపై హింసను ప్రోత్సహించడమే కాకుండా ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన దారుణాన్ని కూడా బహిరంగంగా సమర్థించారు. కథువా దారుణంలో నిందితులకు మద్దతుగా జనవరి 17వ తేదీన ‘హిందూ ఏక్తా మంచ్’ నిర్వహించిన ర్యాలీలో పొల్గొన్నారన్న కారణంగానే పీడీపీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ శాసన సభ్యులు లాల్ సింగ్, చందన ప్రకాష్ గంగాలను బీజేపీ అధిష్టానం తొలగించింది. అదే ర్యాలీలో పాల్గొన్న కథువా బీజేపీ ఎమ్మెల్యే జస్రోటియాకే ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టింది. డిప్యూటీ ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ సహా మరికొంత మంది బీజేపీ మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ బీజేపీ అధిష్టానం దష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో చర్చలు జరిపిన పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని మొత్తం తొమ్మిది మంది మంత్రుల్లో ఎనిమిది మందిని తొలగించాలని నిర్ణయించింది. ఆ మేరకు వారు రాజీనామా చేశారు. ఆ స్థానంలో సోమవారం ఆరుగురు బీజేపీ శాసన సభ్యులు కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వారిలో ఒకరు సహాయ మంత్రి హోదా నుంచి పదోన్నది లభించిన ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ముఫ్తీ సూచన మేరకు రాష్ట్ర డిప్యూటి ముఖ్యమంత్రి పదవి నుంచి నిర్మల్ సింగ్‌ను పార్టీ అధిష్టానం తొలగించలేదని, ముఫ్తీకి చెక్ పెట్టేందుకు మరింత కరుడుగట్టిన ఆరెస్సెస్ నాయకుడు కవీందర్ గుప్తాను ఆయన స్థానంలో తీసుకొచ్చిందని స్థానిక బీజేపీ వర్గాలు తెలియజేస్తున్నాయి. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కవీందర్ గుప్తా విలేకరులతో మాట్లాడుతూ కథువా సంఘటన చాలా చిన్న విషయమని, దాన్ని అంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కవీందర్ సింగ్ మొదటి నుంచి వివాదాస్పద నాయకుడే. 2015లో ఆయన రాష్ట్ర అసెంబ్లీలో స్వీకర్ బాధ్యతలు స్వీకరిస్తూ, తాను ఆరెస్సెస్ సభ్యుడిని అయినందుకు అత్యంత గర్వపడుతున్నానని, ఇక్కడ కేవలం స్పీకర్నేనని అన్నారు. ఇదిలా ఉండగా, కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో ఇద్దరికి నేరస్థులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వారే కిష్టావర్ ఎమ్మెల్యే సునీల్ శర్మ, దోడా ఎమ్మెల్యే శక్తి పరిహార్‌లు. 2013లో ఈద్ నాడు ఓ ముస్లింను హత్యచేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు పరారీలో ఉన్న హరి కషన్తో కలిసి వీరిద్దరు 2016, మార్చి నెలలో ఫొటో దిగారు. అప్పటికే కోర్టు హరి కషన్ను ‘పరారీలో ఉన్న నిందితుడి’గా ప్రకటించింది. ఉధంపూర్ ఎంపీ, కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ నివాసంలో ఈ ముగ్గురు కలిసి ఫొటో దిగారు. సింగ్, శర్మల తరఫున కశ్మీర్ ఎన్నికల్లో హరి కషన్ బహిరంగంగానే ప్రచారం చేశారు. ఓ ముస్లింను సజీవంగా దహనం చేసిన మరో కేసులో ప్రధాన నిందితుడు రోషన్ లాల్‌తో కూడా శర్మకు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. కిష్టావర్‌లో జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్‌ను ఇరువురు కలిసి చూశారు. టీవీ ప్రసారాల్లో వారు కనిపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. -
కఠువా రేప్ ఓ చిన్న ఘటన
జమ్మూ: జమ్మూకశ్మీర్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కొన్నిగంటలు కూడా గడవకముందే బీజేపీ నేత కవీందర్ గుప్తా(59) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కఠువాలో అసిఫా(8) అనే బాలికను అత్యాచారం చేసి, హత్యచేయడం చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ సత్పాల్ శర్మ, గుప్తాతో పాటు మరో ఆరుగురు సోమవారం బీజేపీ–పీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చేరారు. ఈ సందర్భంగా కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించినందుకే బీజేపీ నేతల్ని తప్పించారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ‘కఠువాలో జరిగింది ఓ చిన్న ఘటనే. ఇలాంటివి జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలో మనం ఆలోచించాలి. ఇలాంటి చాలా సమస్యల్ని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ ఒక్క ఘటనకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు’ అని గుప్తా పేర్కొన్నారు. కాగా, కఠువా నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజీవ్ జస్రోటియాకు మంత్రివర్గంలో చోటుదక్కడం గమనార్హం. -
పోక్సో చట్టంతో బాలురకూ రక్షణ!
న్యూఢిల్లీ: లైంగిక దాడులకు గురవుతున్న బాలురకూ రక్షణ కల్పించేలా పోక్సో (లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను రక్షించే చట్టం) చట్టానికి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కఠువా, ఉన్నావ్ ఘటనల నేపథ్యంలో 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ వారికి గరిష్టంగా మరణశిక్ష విధించేలా కేంద్రం ప్రతిపాదించిన పోక్సో చట్ట సవరణ ఆర్డినెన్స్‌కు ఇటీవల రాష్ట్రపతి ఓకే చెప్పడం తెల్సిందే. ఈ నేపథ్యంలో స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోక్సోకు తాజాగా మరో సవరణ తెచ్చే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బాలురపై లైంగిక వేధింపులను పట్టించుకోవడం లేదని నిర్మాత, సామాజిక కార్యకర్త ఇన్సియా దరివాలా ఆన్లైన్లో చేసిన ఫిర్యాదుకు మంత్రి మేనకా గాంధీ మద్దతు పలికారు. -
కథువా కేసు.. విస్మయపరిచే కోణం
శ్రీనగర్: సంచలనం సృష్టించిన కథువా హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సాంజి రామ్ ఎట్టకేలకు నోరు మెదిపాడు. విచారణలో పోలీసులకు అతను దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడించాడు. కుమారుడిని రక్షించుకునేందుకు ఆ బాలికను చంపినట్లు సాంజి రామ్ తెలిపాడు. హిందూ ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతం నుంచి నోమాదిక్ గుజ్జర్, బకర్వాల్ తెగలను తరిమికొట్టాలన్న ఉద్దేశంతోనే తాము ఈ ఘటనకు పాల్పడినట్లు సాంజి రామ్ వివరించాడు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం... జనవరి 7వ తేదీ నుంచే బాలిక కిడ్నాప్ కోసం సాంజి రామ్ ప్రణాళిక అమలు చేశాడు. జనవరి 10న మత్తుమందు ఇచ్చి బాలికను అపహరించి ఆలయానికి తరలించారు. అదే రోజు సాంజిరామ్ మేనల్లుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే లైంగిక దాడి జరిగిన విషయం 13వ తేదీన తనకు తెలిసిందని సాంజిరామ్ వివరించాడు. తన కుమారుడితోపాటు అల్లుడు కూడా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని.. వారిని రక్షించుకునేందుకే ఆ బాలికను చంపేసినట్లు సాంజి రామ్ దర్యాప్తు బృందానికి చెప్పారు. జనవరి 13 అర్ధరాత్రి విశాల్(సాంజిరామ్ కొడుకు), అతని స్నేహితుడు పర్వేశ్ కుమార్(మన్ను).. ఆలయం నుంచి బాలికను బయటకు తీసుకొచ్చారు. చంపేముందు మరోసారి అత్యాచారం చేస్తానని పోలీసాధికారి దీపక్ ఖజూరియా నిందితులతో చెప్పాడు. కానీ, పరిస్థితులు సహకరించకపోవటంతో బాలికను తిరిగి ఆలయంలోకి తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు అంటే.. జనవరి 14న బాలికను రాళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు. తర్వాత బాలిక మృతదేహాన్ని హీరానగర్ కాలువ వద్ద పడేయాలని పథకం రచించారు. విశాల్, ఖజూరియా, పర్వేశ్ కుమార్, మైనర్ బాలుడు అంతా కలిసి బాలిక మృతదేహాన్ని ఆలయం నుంచి బయటకు తీసుకురాగా.. రామ్ బయట కాపలాకాశాడు. చివరకు కారు దొరక్కపోవటంతో జనవరి 15వ తేదీ మధ్యాహ్నం విశాల్, సాంజిరామ్ మేనల్లుడు కలిసి సమీపంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృత దేహాన్ని పడేసి వచ్చారు. అయితే సాంజిరామ్ స్టేట్మెంట్పై స్పందించేందుకు అతని తరపు న్యాయవాది నిరాకరించారు. ఛార్జీ షీట్ వివరాలు... మైనర్ బాలుడితోపాటు, సాంజిరామ్, అతని తనయుడు విశాల్, సాంజిరామ్ అల్లుడు, పోలీస్ అధికారులు ఖజూరియా, సురేందర్ వర్మ, పర్వేశ్ కుమార్ పేర్లతో ఛార్జీషీట్ దాఖలు చేశారు. సాంజిరామ్‌పై హత్య, అపహరణ, ఆధారాలను మాయం చేయటం.. పర్వేశ్ కుమార్(మన్ను)పై అపహరణ కింద కేసు నమోదు చేశారు. సాంజిరామ్ నుంచి నాలుగు లక్షలు తీసుకుని ఆధారాలు మాయం చేసేందుకు యత్నించారన్న ఆరోపణలపై హెడ్ కానిస్టేబుల్ తిలక్ రాజ్, సబ్ ఇన్స్పెక్టర్ ఆనంద్ దత్తాల పేర్లను కూడా ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. జనవరి 17న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు జనవరి 23న కేసును క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేయగా.. సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆ టీమ్ 8 మందిని అరెస్ట్ చేసింది. సుప్రీం కోర్టు జోక్యంతో ఏప్రిల్ 16న కేసులో విచారణ ప్రారంభం.. తదుపరి విచారణ ఏప్రిల్ 28కి వాయిదా. ఈ కేసు విచారణ జమ్ము కశ్మీర్ కోర్టులో చేయవద్దని.. ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధితురాలి తండ్రి సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసును విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను మే 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టవద్దని దిగువ న్యాయస్థానాలకు ఆదేశాలు జారీ చేసింది. -
కథువా ఘటన; ఆ సినిమాను చూడకండి
సాక్షి, ముంబై: బాలీవుడ్ చిత్రం వీరె ది వెడ్డింగ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ఉద్యమం మొదలైంది. కథువా ఘటనపై స్పందిస్తూ ఈ చిత్రంలోని హీరోయిన్లు ఫ్లకార్డ్లతో నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే వారి చేష్టలు సమంజసంగా లేవంటూ ఆ సమయంలో విమర్శలు.. ట్రోలింగ్ ఎదురుకాగా... ఇప్పుడు ఆ ప్రభావం వాళ్లు నటించిన చిత్రంపై పడింది. ‘హిందువుల అత్మగౌరవం నిలవాలంటే ఈ చిత్రాన్ని(వీరె ది వెడ్డింగ్) బహిష్కరించండి. కరీనా, సోనమ్, స్వరభాస్కర్లు బీగ్రేడ్ హీరోయిన్లు. హిందువులపై అపవాదులు వేసే అలాంటి వాళ్ల చిత్రాలను ఆదరించాల్సిన అవసరం హిందువులకు లేదు. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే’ అంటూ ప్రముఖ కాలమిస్ట్ షెఫాలీ వైద్యా పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీటర్లో బాయ్కాట్వీర్దేవెడ్డింగ్ పేరిట యాష్ ట్యాగ్‌ను వైరల్ చేస్తున్నారు. ఇక హిందువులపై అత్యాచారాలు జరిగినప్పుడు ఈ హీరోయిన్లంతా ఎక్కడికి పోయారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కథువా చిన్నారిపై ఘటనను తామూ ఖండిస్తున్నామని.. కానీ, సరిగ్గా సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలోనే వీళ్లు ఇలా డ్రామాలు ఎంతవరకు సరైందని మరికొందరు రీట్వీట్లు చేస్తూ షెఫాలీ నినాదానికి మద్ధతు ఇస్తున్నారు. హిందుస్థాన్‌లో పుట్టినందుకు సిగ్గు పడుతున్నామని.. ఆలయంలో హత్యాచారానికి గురైన 8 ఏళ్ల చిన్నారికి న్యాయం జరగాలంటూ ఈ ముగ్గురు ఫ్లకార్డ్లతో తమ ఫోటోలను ట్వీటర్లో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ను ఎదుర్కున్నారు. -
కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ భార్య హసిన్ జహాన్ షాకింగ్ కామెంట్లు చేశారు. తన వ్యవహారాన్ని కథువా హత్యాచార ఘటనతో ఆమె పోల్చుకుంది. బుధవారం సాయంత్రం కథువా బాధిత చిన్నారి కోసం ఓ ఎన్జీవో నిర్వహించిన శాంతి ర్యాలీలో హసిన్ పాల్గొంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కథువా కేసులో నిందితులు ఎంతటి వారైనా సరే శిక్ష పడాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నా. ఒక రకంగా నేను కూడా కథువా తరహా బాధితురాలినే. కానీ, ఆ చిన్నారి చనిపోతే.. నేనింకా బతికున్నా. కథువా ఘటనలో ఏవేం జరిగాయో.. నాక్కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. నన్ను అత్యాచారం చేయాలని షమీ కుటుంబ సభ్యులు యత్నించారు. ఆపై చంపి నా శవాన్ని చెత్తకుప్పలో పడేయాలని వారు ప్రయత్నించారు. రెండు నెలలపాటు షమీ కుటుంబ సభ్యులతో పోరాడి నేను ప్రాణాలతో బతికి బయటపడ్డాను’ అని జహాన్ మీడియాతో తెలిపింది. కాగా, గతంలో భర్త షమీపై సంచలన ఆరోపణలు చేసిన జహాన్.. ఇప్పుడు చేసిన ఈ కామెంట్లు అతన్ని మరిన్ని చిక్కుల్లోని నెట్టేసేలా కనిపిస్తున్నాయి. ఇక గృహ హింస చట్టం కింద కేసు నమోదు కావటంతో షమీని, అతని సోదరుడిని ప్రశ్నించిన కోల్‌కతా పోలీసులు.. వారి నుంచి వాంగ్మూలం సేకరించారు. షమీతోపాటు అతని సోదరుడు, తల్లి కూడా తనని హింసించి చంపాలని చూశారంటూ ఆరోపించిన ఆమె.. తనకు-కూతురి పోషణ కోసం భరణం కోరుతూ షమీపై ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
ఉరి వల్ల రేప్‌లు ఆగుతాయా?
న్యూఢిల్లీ: బాలికలపై అత్యాచారానికి పాల్పడే కీచకులకు మరణదండన విధించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్(పోక్సో చట్టంలో సవరణ)పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవున్నాయి. పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్ జారీ చేయడానికి ముందు కేంద్రం శాస్త్రీయ అధ్యయనం చేసిందా? అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు.. రేప్ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా?’’ అని జస్టిస్ గీతా మిట్టల్, జస్టిస్ హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘అత్యాచార ఉదంతాలకు సంబంధించి గతంలో చేసిన ఐపీసీ చట్టసవరణ దుర్వినియోగం అవుతోందం’టూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. నిర్భయ చట్టం తర్వాత ఏంజరిగింది?: కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అకృత్యం, ఉన్నావ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం, బాధితురాలి తండ్రి హత్య ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికిన దరిమిలా కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసింది. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది ఆ సవరణ ఉద్దేశం. కాగా, గతంలో నిర్భయ ఉదంతం తర్వాత కూడా ఇదే మాదిరిగా కఠిన చట్టాలను రూపొందించడం, వాటి వల్ల నేరాలు అదుపులోకి రానివిషయాన్ని సామాజిక, న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. నిర్భయ చట్టం తర్వాత లైంగిక నేరాలు అదుపులోకొస్తాయని జాతి యావత్తూ విశ్వసించినా, వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరిగింది. 2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. పోర్న్ సైట్లను నిషేధించండి: బీజేపీ మంత్రి దేశంలో లైంగికనేరాల పెరుగుదలకు పోర్న్ వెబ్సైట్లే ప్రధాన కారణమని మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ అన్నారు. యువతపై అశ్లీల సైట్ల ప్రభావం అధికంగా ఉందని, కాబట్టి వెంటనే వాటిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖరాశారు. (చదవండి: కఠిన చట్టాలే పరిష్కారమా?)