సాక్షి, న్యూఢిల్లీ: కథువా కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బాధిత కుటుంబానికి, న్యాయవాదికి, సాక్ష్యులకు రక్షణ కల్పించాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.
‘కథువా కేసును పఠాన్‌కోట్ జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నాం ఈ కేసులో ప్రతీరోజు వాదనలు జరగాలి. కేసు విచారణ త్వరగతిన పూర్తి కావాలి. కోర్టు విచారణను రహస్య విచారణ చేపట్టాలని ఆదేశించింది(ఇన్-కెమెరా ప్రోసీడింగ్స్). ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించుకునేందుకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి అనుమతిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనను జూలై 9కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
మమ్మల్ని కాల్చిచంపండి:‘కథువా’ బాలిక తల్లి
అందుకే చిన్నారిని చంపాం: సాంజిరామ్
8 ఏళ్ల చిన్నారిని ఆలయంలో బంధించి అత్యాచారం చేసి, ఆపై అత్యంత దారుణంగా హతమార్చిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సాంజీరామ్ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగితోసహ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును జమ్ము కశ్మీర్ నుంచి ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధిత బాలిక తండ్రి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. మరోపక్క నిందితులు మాత్రం ఆ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగానే దర్యాప్తు జరుపుతున్నారంటూ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తాజాగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment