transferred
-
ఏపీలో ఒకేసారి 27 మంది ఐపీఎస్‌ల బదిలీలు
-
మహారాష్ట్ర డీజీపీపై ఈసీ బదిలీ వేటు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికళ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లాపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం బదిలీ వేటు వేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఈసీ తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రతిపక్షాల విషయంలో డీజీపీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ చర్యలు తీసుకుంది.రష్మీ శుక్లా స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారికి డీజీపీగా బాధ్యతలు అప్పగించాలని ఎన్నికల సంఘం మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. డీజీపీగా నియామకం కోసం మంగళవారం మధ్యాహ్నంలోగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్‌ను పంపాలని తెలిపింది. దీంతో రష్మీ శుక్లా స్థానంలో అత్యంత సీనియర్ అధికారిగా ఉన్న వివేక్ ఫన్సాల్కర్‌కు తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ముంబై సీపీగా పనిచేస్తున్నారు.కా గాగత నెలలో రాష్ట్ర డీజీపీని తొలగించాలని అభ్యర్థిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే లేఖ రాశారు. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ(శరద్చంద్ర) సహా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలపై డీజేపీ శుక్లా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు. చదవండి: దేశంలో పలు స్థానాల్లో ఉప ఎన్నిక తేదీ మార్పుగత ప్రభుత్వ హయాంలో నేతల ఫోన్లను ట్యాప్ చేశారని.. నేతలు ఏం చేయబోతున్నారనేది తెలుసుకొని ఆ సమాచారాన్ని ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేరవేశారంటూ శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ప్రతిపక్షాలపై రాజకీయ హింస పెరిగిందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి. ఆమెను తొలగించాలని లేఖలో కోరాయి. దీనిపై ఈసీ స్పందించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా, న్యాయంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించారు. తమ విధులను నిర్వహించడంలో పార్టీలకతీతంగా భావించేలా చూడాలన్నారు. ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో నవంబరు 20న ఓటింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
కావాల్సిన వారికే కీలక పోస్టులు!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే... అన్నచందంగా మారింది పరిపాలనలో కీలకమైన డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు, పోస్టింగ్‌ల వ్యవహారం. ముఖ్య నేత ఆశీస్సులు పొందిన వారికి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యులకు ముడుపులు సమర్పించుకున్న వారికి పనితీరు, సీనియారిటీతో సంబంధం లేకుండా మంచి పోస్టులు కట్టబెడుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మిగిలిన వారికి అప్రాధాన్య పోస్టులు ఇవ్వడం... లేదా జీఏడీకి కేటాయించి ఏ పనీ చెప్పకుండా కూర్చోబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం సోమవారం రాత్రి డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి బదిలీలు, పోస్టింగ్‌లపై రెండు జీవోలు జారీ చేసింది. అందులో సిఫారసులు చేయించినవారికి, కాసులిచ్చిన వారికి మంచి పోస్టింగ్‌లు ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన వారికి పనిష్మెంట్ పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ప్రభుత్వంలో ఆర్డీవోలుగా పనిచేసిన ఏడుగురు అధికారులకు ఇటీవల పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టిన కూటమి సర్కారు... ఇప్పుడు వారిని సీఆర్డీఏకి కేటాయించడం గమనార్హం.వంద మందికి పైగా జీఏడీకి: గత నెల 24వ తేదీన 30 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేయగా, వారిలో 11 మందికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోసారి 70 మందికిపైగా ఆర్డీవోలు, ఇతర కీలక స్థానాల్లో ఉన్న వారిని బదిలీ చేసినప్పుడు సుమారు 30 మందిని జీఏడీకి ఎటాచ్ చేసింది. వీరందరినీ జీఏడీకి పంపడానికి రాజకీయ కారణాలే తప్ప... మరే ఇతర కారణాలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 100 మందికిపైగా డిప్యూటీ కలెక్టర్లు జీఏడీకి ఎటాచ్ అయి ఉన్నారు. వారి సేవలు ఉపయోగించుకోకుండా, కావాలని రాజకీయ ముద్ర వేసి పక్కనపెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో పనిచేసిన ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు. సిఫారసులు, కాసులతోనే: మరోవైపు సీనియారిటీ, పనితీరుతో సంబంధం లేకుండా కొందరు ముఖ్య నేతను ప్రసన్నం చేసుకుని పోస్టింగ్‌లు దక్కించుకుంటున్నారు. ఇప్పటివరకు ఎక్కడో లూప్ లైన్లో ఉండి హఠాత్తుగా మంచి పోస్టింగ్‌లు దక్కించుకోవడానికి అదే కారణంగా కనిపిస్తోంది. ముఖ్య నేతను కలిసి భారీగా సమర్పించుకున్న వారికి కీలక పోస్టులు దక్కాయి. జిల్లా కేంద్రాల్లోని ఆర్డీవో పోస్టుల కోసం రూ.30 లక్షలకుపైగా కొందరు ఖర్చు చేసి పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. కొన్ని కీలకమైన ఆర్డీవో సీట్లకు అయితే ఏకంగా రూ.కోటి నుంచి రూ.మూడు కోట్లు కూడా ఖర్చు పెట్టి పోస్టింగ్‌లు దక్కించుకున్నట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గాల్లో కీలకమైన ఆర్డీవో, ఇతర ముఖ్యమైన పోస్టింగుల్లో డిప్యూటీ కలెక్టర్లను నియమించడానికి భారీగా డబ్బు తీసుకుని సిఫారసులు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సహానా కేసులో దళిత అధికారికి బదిలీ కానుక
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడైన రౌడీషీటర్ నవీన్ చేతిలో హతమైన తెనాలి యువతి మధిర సహానా (25) కేసులో తాము చెప్పిన పనిని సకాలంలో చేయలేదన్న అక్కసుతో గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌పై కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. దళితుడైన కిరణ్‌కుమార్ బదిలీ ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం అయ్యిందని, నేడోరేపో బదిలీ ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయన నడుచుకోలేదని, సీఎంఓ కార్యాలయం నుంచి చెప్పినా వినలేదనే ఆరోపణలతో ఆస్పత్రి సూపరింటెండెంట్ సీటు నుంచి ఆయనను తొలగిస్తూ సీఎం కార్యాలయం ఆమోద ముద్ర వేసింది. అసలు కారణం ఇదీ..రౌడీషీటర్ నవీన్ చేతిలో తీవ్రంగా గాయపడిన తెనాలికి చెందిన సహానాను ఈ నెల 20న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. అప్పటికే యువతి పరిస్థితి విషమించింది. కోమాలో ఉన్న సహానాను న్యూరోసర్జరీ ఐసీయూలో ఉంచి ఆస్పత్రి అ«ధికారులు, వైద్యులు చికిత్స అందించారు. కాగా.. రౌడీషీటర్ చేతిలో దారుణంగా దెబ్బతిని సహానా కోమాలోకి వెళ్లగా.. ఆమెపై ముగ్గురు లైంగిక దాడి చేశారని కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు.దీంతో ఈ నెల 23న సహానా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ వస్తారని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 22న సాయంత్రం 5 గంటలకు రౌడీషీటర్ నవీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటివరకు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సహానా ఆ రోజు రాత్రి 7 గంటలకు మరణించినట్టు నిర్ధారించి మార్చురీకి తరలించారు. ఆమెకు మరుసటి రోజు ఉదయం 6గంటలకల్లా శవపంచనామా, 9 గంటల్లోగా పోస్టుమార్టం పూర్తిచేసి భౌతికకాయాన్ని తెనాలి తరలించాలని కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు భావించారు. ఆ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్‌కు ఆదేశాలిచ్చారు. అయితే, సహానా తల్లిదండ్రులు పోలీసుల ఉచ్చులో పడకుండా జగన్మోహన్రెడ్డి పర్యటన పూర్తయిన తర్వాత కూడా పంచనామాపై సంతకం చేయకుండా తమ బిడ్డకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. మరోవైపు సహానా భౌతికకాయాన్ని పరిశీలించి, కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సహానా కేసు విషయంలో ప్రభుత్వ తాత్సారాన్ని, నిర్లక్ష్య వైఖరిని జగన్ ఎండగట్టారు. దీంతో ఈ ఘటనలో తమ పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌పై సీరియస్ అయ్యారు. చివరకు ఆయనకు బదిలీ కానుక ఇచ్చారు. -
పెదవుల అందం.. పదవికి చేటు!
ఆడాళ్లు అనుకువగా ఉండడం అసాధ్యమంటారు పెద్దలు.. ఇది అక్షరాలా నిజం అనిపించే ఘటన చెన్నై నడిరోడ్డున కార్పొరేషన్ కార్యాలయం సాక్షిగా చోటు చేసుకుంది. ఒక ఒరలో రెండు కత్తులు.. సాధ్యం కాదనేలా.. కార్పొషన్ను శాసించే మేయర్‌కు.. ఆమెకు సహాయకారిగా ఉండే మహిళా దఫేదార్కు మధ్య ఏర్పడిన చిరు వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి రచ్చకెక్కింది. చివరికి ఒకరి ఉద్యోగానికి ఎసరు తెచ్చింది... అదెలాగో మీరూ చూడండి! సాక్షి, చెన్నై: నగర కార్పొరేషన్లో మహిళలు పెదావుల కు వేసుకునే లిప్‌స్టిక్ వ్యవహారం బుధవారం పెద్ద చర్చకే దారి తీసింది. మేయర్ ప్రియ వెన్నంటి ఉండే మహిళా దఫేదార్ మాధవి బదిలీ ఈ లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు తెచ్చింది. వివరాలు.. చెన్నై కార్పొరేషన్లో గత 15 ఏళ్లుగా మాధవి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డీఎంకే మేయర్ ఆర్ ప్రియకు దఫేదార్‌గా ఉన్నారు. హఠాత్తుగా మాధవిని మనలి మండలానికి బదిలీ చేశారు. అలాగే ఆమెకు ఓ మెమో జారీ చేయడంతో ఈ వ్యవహారం లిప్‌స్టిక్ గొడవను తెరమీదకు వచ్చింది. మేయర్ ఆర్.ప్రియతో సమానంగా మాధవి లిప్‌స్టిక్ వేసుకుని రావడమే ఈ బదిలీకి కారణం అనే చర్చ జోరందుకుంది.మేయర్ వేసుకునే రంగులోనే లిప్‌స్టిక్‌ను ఆమె అనేక సందర్భాలలో వేసుకుని రావడాన్ని ప్రియ పీఏలు ఖండించినట్టు సమాచారం. చిన్నతనం నుంచి తాను లిప్‌స్టిక్ వాడుతున్నాని, తనకు నచ్చిన రంగు,ఫ్లేవర్ వాడుతానని, దీనిని హఠాత్తుగా మార్చుకోమడం సబబు కాదని వారికి మాధవి సూచించిన నేపథ్యంలో ఈ బదిలీ వేటు పడటమే కాకుండా, ఆమె సరిగ్గా పనిచేయడం లే దంటూ మెమో జారీ చేసినట్టు కార్పొరేషన్లో చర్చ ఊ పందుకుంది. ఈ విషయంగా మాధవి మీడియాతో మాట్లాడుతూ, తాను వేసుకునే లిప్‌స్టిక్, మేయర్ వేసుకునే లిప్‌స్టిక్ ఒకే విధంగా ఉందని పేర్కొంటున్నారని వాపోయారు. తనకు నచ్చిన రంగు తాను వాడుతున్నానని, ఇది తన వ్యక్తిగతం అని వ్యాఖ్యలు చేశారు. పురుష దఫేదార్ ఇంటికి వెళ్లి పోయినా, తాను మాత్రం కుటుంబాన్ని సైతం వీడి మేయర్‌కు వెన్నంటి రేయింబవళ్లు శ్రమించినందుకు మంచి గుర్తింపునే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా వీరికి మరో రెండేళ్లు పదవి ఉండవచ్చునని, తాను ఓ ఉద్యోగిని అని, తన జర్నీ మరింతగా కార్పొరేషన్లో కొనసాగాల్సి ఉంటుందని వ్యాఖ్యనించడం కొనమెరుపు. -
‘ఆర్జీకర్’ ఘటన ఎఫెక్ట్: కోల్‌కతా ‘సీపీ’ బదిలీ
కోల్‌కతా: సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లకు ఇచ్చిన హామీని పశ్చిమబెంగాల్లో మమత సర్కారు నిలబెట్టుకుంది. డాక్టర్ల డిమాండ్ మేరకు ఇప్పటిదాకా కోల్‌కతా నగర పోలీస్‌కమిషనర్‌గా ఉన్న వినీత్‌కుమార్ గోయెల్‌ను ప్రభుత్వం బదిలీ చేస్తూ మంగళవారం(సెప్టెంబర్17) ఉత్తర్వులు జారీ చేసింది.గోయెల్ స్థానంలో మనోజ్‌కుమార్ వర్మను కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించారు.కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నగర పోలీస్ కమిషనర్ గోయెల్‌పై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ను జూనియర్ డాక్టర్లు సీఎం మమత ముందుంచారు. దీంతో ప్రభుత్వం కమిషనర్‌ను బదిలీచేసింది. పోలీస్కమిషనర్తో పాటు ఆరోగ్య శాఖలోని పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేయాలని డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. వీరి కోరిక మేరకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇదీ చదవండి.. కోల్‌కతా బాధితురాలి ఫొటో..పేరు తొలగించండి: సుప్రీంకోర్టు -
హైదరాబాద్ సీసీఎస్ ప్రక్షాళన.. 12 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పోలీసు విభాగానికి గుండెకాయ వంటి నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అవినీతికి అడ్డాగా మారిపోవడంతో సీసీఎస్ ప్రక్షాళనకు హైదరాబాద్ సీపీ చర్యలు చేపట్టారు. 12 మంది సీసీఎస్ ఇన్స్పెక్టర్లను మల్టీజోన్-2కు బదిలీ చేశారు. వెంటనే రిపోర్ట్ చేయాలని హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.కాగా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత నెల 21న ఏసీపీ టీఎస్ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గురువారం ఈఓడబ్ల్యూ టీమ్–7 ఇన్స్పెక్టర్ సుధాకర్ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రతిష్టాత్మకమైన ఈ విభాగం ప్రతిష్ట దిగజారుతోందనే ఆరోపణ వినిపిస్తోంది.సంచలనాత్మక నేరాలతో పాటు భారీ స్కాములను సీసీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తారు. రూ.25 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, రూ.75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్ పరిధిలోని వస్తాయి. ఈ విభాగమే నేరుగా కొన్ని కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసుస్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీసు కమిషనర్ దర్యాప్తు నిమిత్తం ఈ విభాగానికి బదిలీ చేస్తుంటారు. సీసీఎస్ దర్యాప్తు చేసే కేసుల్లో అత్యధికం రూ.కోట్లతో ముడిపడి ఉంటాయి. -
రాజకీయ కక్షతో విజయవాడ సీపీపై బదిలీ వేటు
సాక్షి, విజయవాడ: రాజకీయ కక్షతోనే విజయవాడ సీపీపై బదిలీ వేటు పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసును విజయవాడ సీపీ కాంతిరాణా దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణ చేస్తున్న కాంతిరాణాపై కక్షతో టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులతో కూటమి బ్లాక్మెయిల్ చేసింది. ఈ క్రమంలో ష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సీపీని బదిలీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే వేముల సతీష్ అరెస్టయ్యారు. టీడీపీ నేత బోండా ఉమకు వేముల సతీష్అనుచరుడిగా ఉన్నారు. విచారణ కీలక దశలో ఉండగా సీపీ కాంతిరాణా బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసులపై విచారణ జరుపుతున్న రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జడ్జి ఎంకే నాగ్‌పాల్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న్యాయమూర్తి కావేరీ బవేజా నియమితులయ్యారు. ఇక నుంచి ఢిల్లీ లిక్కర్ కేసును కావేరి భావేజా విచారించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఢిల్లీ హయ్యర్ జ్యూడీషియల్ సర్వీసెస్‌కు చెందిన మరో 27 మంది న్యాయమూర్తులను(నాగ్‌పాల్‌తో సహా) ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. మరోవైపు ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీసెస్ (డీజేఎస్)కి చెందిన 31 మంది న్యాయమూర్తులు కూడా బదిలీ అయ్యారు. కాగా జస్టిస్ నాగ్పాల్మద్యం పాలసీ కేసును ప్రారంభం నుంచి విచారిస్తున్నారు. నాగ్‌పాల్ ఇక నుంచి ఢిల్లీ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంటి పలువురు ప్రముఖులు అరెస్టయ్యారు. సిసోడియా, సింగ్ జ్యూడీషియల్ కస్టడీలో ఉండగా.. కవిత ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. చదవండి: MLC Kavitha: మూడో రోజు ఈడీ విచారణ -
హర్యానా ఘర్షణల ఎఫెక్ట్.. నూహ్ ఎస్పీపై వేటు
చండీగఢ్: హర్యానాలో నెలకొన్న హింస ఎఫెక్ట్‌తో నూహ్ జిల్లా ఎస్పీపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నూహ్ కేంద్రంగా మత ఘర్షణలు చెలరేగిన సోమవారం రోజు సెలవులో ఉన్న ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు వేసింది. జిల్లా కొత్త ఎస్పీగా ఐపీఎస్ నరేంద్ర బిజర్నియా నియమిస్తూ హర్యానా హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నూహ్ జిల్లా ఎస్పీ వరుణ్ సింగ్లా అల్లర్లు చెలరేగే ముందు రోజే సెలవులపై వెళ్లారు. దీంతొ ఘర్షణలు మొదలైన సోమవారం నుంచి నూహ్ తాత్కాలిక ఎస్పీగా ఐపీఎస్ అధికారి నరేంద్ర బిజర్నియా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన గతంలో 2020 ఫిబ్రవరి నుంచి 2021 అక్టోబర్ వరకు నూహ్ జిల్లాలో పోలీస్ బలగాలకు అధిపతిగా ఉన్నారు. తాజాగా వరుణ్ సింగ్లా 160 కిలోమీటర్ల దూరంలోని బివానీ జిల్లాకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. సింగ్లా స్థానంలో నూహ్ శాశ్వత ఎస్పీగా శుక్రవారం నరేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు హర్యానా ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ మత ఘర్షణలకు కారణమైన వారిని విడిచిపెట్టబోమని, రాష్ట్రంలో పరిస్థితి వేగంగా సాధారణ స్థితికి వస్తోందని పేర్కొన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్రాన్ని త్వరలో నుహ్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చదవండి: 8 ఫోర్లు జారిపడ్డ లిఫ్ట్.. గుండెపోటుతో మహిళ మృతి #WATCH | Security deployed outside Jama Masjid, Sadar Bazar in Haryana's Gurugram ahead of Friday prayers pic.twitter.com/V3sSwwAlma — ANI (@ANI) August 4, 2023 కాగా సోమవారం వీహెచ్‌పీ, బజరంగ్దళ్ చేపట్టిన మతపరమైన ఊరేగింపు రాజుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు మత్యువాత పడ్డారు. ఇంకా అల్లర్లు కొనసాగుతున్నాయి. పలు వాహనాలు, మత ప్రార్థన స్థలాలు, రెస్టారెంట్లు, దుకాణలను అల్లరిమూకలు తగలబెట్టాయి. నూహ్‌లోని రెండు మసీదులకు గురువారం దుండగులు నిప్పటించారు. దీంతో నుహ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో నిషేధ ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. హింస కారణంగా 176 మందిని అరెస్ట్ చేశారు90 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. VIDEO | Police personnel continue to remain deployed in parts of Gurugram in the aftermath of violence that broke out earlier this week. pic.twitter.com/1H6fHEmWlP — Press Trust of India (@PTI_News) August 4, 2023 నుహ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాలో అలాగే గురుగ్రామ్‌లోని మూడు సబ్ డివిజన్లు( సోహ్నా, పటౌడీ ,మనేసర్) ఆగస్టు 5 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అయతితే నేడు నూహ్‌లో నేడు(శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటలకు వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ చండీగఢ్‌లో కేబినెట్ బేటీ ఏర్పాటు చేయనున్నారు. అంతకుముందే నుహ్ జిల్లా పోలీస్ బాధ్యతలను పాల్వాల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లోకేందర్ సింగ్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఎస్పీ సింగ్లా స్థానంలో నరేంద్ర బిజర్నియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. చదవండి: రాహుల్ గాంధీ ఇంటికి కొత్త అతిథులు.. గోవా వెళ్లి మరీ తీసుకొచ్చారు -
మునుగోడు ఉపఎన్నికలో మరో ట్విస్ట్.. రిటర్నింగ్ అధికారి బదిలీ..
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉపఎన్నికల రిటర్నింగ్ అధికారి జగన్నాథరావును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికల గుర్తుల వ్యవహారంలో వివాదం నెలకొన్న తరుణంలో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. యుగతులసి పార్టీ అభ్యర్థి కొలిశెట్టి శివకుమార్‌కు గుర్తు కేటాయింపు విషయంలో జగన్నాథరావు ఇష్టారీతిగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈసీ వేగంగా చర్యలు తీసుకుంది. ఆయన స్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌కు మునుగోడు ఉపఎన్నికల బాధ్యతలు అప్పగించింది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు ముగిసిన అక్టోబర్ 17న తనకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించారని యుగతులసి అభ్యర్థి శివకుమార్ తెలిపారు. అయితే అక్టోబర్ 18న విడుదలైన జాబితాలో మాత్రం బేబీ వాల్కర్ గుర్తు ఇచ్చారని పేర్కొన్నారు. తమ కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్, క్యాప్, చపాతి రోలర్ వంటి గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని టీఆర్ఎస్ పార్టీ 17వ తేదీ రాత్రి ఆందోళన చేసింది. దీంతో తెల్లారేసరికి గుర్తులు మారిపోయాయని, దీనిపై వివరణ కోసం తాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిని సంప్రదించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని శివకుమార్ ఎన్నికల సంఘానికి బుధవారం ఫిర్యాదు చేశారు. ఆ మరునాడే రిటర్నింగ్ అధికారిని బదిలీ చేస్తూ కేంద్రం ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. శివకుమార్‌కు రోడ్డురోలర్ గుర్తునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చదవండి: మునుగోడులో గుర్తుల కేటాయింపుపై సీఈసీ సీరియస్.. అంతా మీ ఇష్టమా? -
పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ హెచ్చరికలు
ఛండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలకు.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కీలక సందేశం పంపించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో దందాలకు పాల్పడవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే.. ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను తప్పనిసరిగా కలవాలని కేజ్రీవాల్ అన్నారు. గతంలో.. పంజాబ్ ఎమ్మెల్యేలు కొందరు తమకు అనుకూలంగా ఉండే ఎస్పీలు/ఎస్ఎస్పీలను బదిలీ చేయించుకుని.. తమ నియోజకవర్గాల్లో దందాలను నడిపించుకున్నారని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు మాత్రం అలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. పోలీసుల బదీలీలకు సంబంధించిన ప్రక్రియను సీఎం భగవంత్‌మాన్‌కు, మంత్రులకు వదిలేయాలని.. ఎమ్మెల్యేలు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని, కేవలం నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటే చాలని అన్నారు. అలా కాకుండా అధికార ధోరణి ప్రదర్శిస్తే.. పరిణామాలు వేరుగా ఉంటాయని, చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలంతా టీమ్‌గా పని చేయాలని కోరారు. మన వ్యక్తిగత ఆశయాలను వదిలి.. జట్టుగా పని చేస్తే పంజాబ్ పురోగమిస్తుంది అని కేజ్రీవాల్ పిలుపు ఇచ్చారు. ఈ జట్టుకు భగవంత్ మాన్ నాయకుడని కేజ్రీవాల్ నొక్కి చెప్పారు. పార్టీ నాయకులు, వాలంటీర్లు ఎల్లప్పుడూ హుందాగా వ్యవహరించాలని, అసభ్య- అభ్యంతరకరమైన ప్రవర్తనలను సహించేదే లేదని కేజ్రీవాల్ హెచ్చరించారు. (చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. అది జరిగితే..) -
మమత బదిలీ.. మరునాడే నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత బదిలీని మున్సిపల్ పరిపాలన శాఖ ఒక్కరోజులోనే నిలిపివేసింది. ఆమెను ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వకార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతోపాటు మరో నలుగురు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్/అదనపు కమిషనర్లను కూడా బదిలీ చేశారు. అయితే విధుల్లో చేరకముందే బుధవారం సాయంత్రానికల్లా మమత బదిలీని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా బదిలీ అయిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజను తాజాగా ఎల్.బి.నగర్‌కు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న స్పెషల్, సెలక్షన్ గ్రేడ్, అదనపు డైరెక్టర్, అదనపు కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర శివారు జోన్ల కమిషనర్లను తొలుత బదిలీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను ఖైరతాబాద్‌కు, ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకను శేరిలింగంపల్లికి బదిలీ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీచేశారు. త్వరలోనే మరిన్ని బదిలీలు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, ఏ గ్రేడ్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్ల పనితీరు ఆధారంగా త్వరలో బదిలీల ప్రక్రియ సాగనుందని సమాచారం. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సత్సంబంధాలు కొనసాగించనివారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు శివార్లలో కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా స్థానభ్రంశం చెందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం సర్కారుకు ఫైల్ పంపించినట్లు సమాచారం. -
ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్ మహేశ్వరి బదిలీ
-
ఏపీలో 22 మంది డీఎస్పీల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. రాష్ట్రంలో 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ మచిలీపట్నంలో టీడీపీ కార్పొరేటర్ వీరంగం -
ఏపీలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ల బదిలీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఎం.వి.శేషగిరిబాబు, ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీగా కె.ప్రవీణ్‌కుమార్ రెడ్డి.. ఏపీ టవర్స్ లిమిటెడ్ సీఈవోగా ఎం.రమణారెడ్డి, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా ఎస్బిఆర్.కుమార్‌లకు బాధ్యతలు అప్పగించారు. -
ఐపీఎస్‌లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.మొత్తం 9 మందికి ప్రమోషన్లు రాగా, వీరిలో 2002 బ్యాచ్‌కు చెందిన ముగ్గురికి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ)గా, 2006 బ్యాచ్‌కి చెందిన మరో ఆరుగురికి డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీఐజీ)గా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఆదేశాలు ఇచ్చారు. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేశ్‌కుమార్, ఎన్. శివశంకర్‌రెడ్డి, వి.రవీందర్‌లకు ఐజీలుగా ప్రమోట్ చేసింది. ప్రస్తుతం సీనియర్ ఎస్పీలుగా ఉన్న 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ, కె. రమేశ్‌నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్రావుకు డీఐజీలుగా పదోన్నతి కల్పించింది. 40మందికిపైగానే స్థానచలనం..! ఈసారి బదిలీలు భారీ ఎత్తున ఉంటాయని, దాదాపు 40 మందికిపైగా స్థానచలనం ఉంటుం దని ప్రచారం సాగుతున్న వేళ.. డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా స్థాయిలో విధులు నిర్వహించే పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీలపై వాకబు చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధమైన ఈ జాబితాకు ఇంకా సీఎం ఆమోదం తెలపాల్సి ఉంది. డబుల్ ప్రమోషన్లు దక్కినా.. పాత కుర్చీలోనే విధులు.. గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. వీరిలో సీనియర్ ఎస్పీ, డీఐజీ, ఐజీ, ఏడీజీ వరకు ర్యాంకులు ఉన్నాయి. ఈ పదోన్నతి కల్పించి దాదాపు 10 నెలలు కావస్తోంది. అయినా, వీరికి కొత్త పోస్టింగుగానీ, బదిలీగానీ కల్పించలేదు. అదే సమయంలో గతేడాది ఏప్రిల్‌లో ఎస్పీ ర్యాంకునుంచి సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి పొందిన 2006 ఐపీఎస్ బ్యాచ్‌కుచెందిన కార్తికేయ, కె. రమేశ్‌నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్రావు ప్రస్తుతం పదోన్నతి జాబితాలోనూ చోటు దక్కించున్నారు. పదినెలల కాలంలో రెండోసారి పదోన్నతి సాధించిన వీరికి తాజాగా ప్రభుత్వం డీఐజీ హోదా కల్పించింది. అయినా, వీరి విషయంలోనూ ప్రభుత్వం పోస్టింగ్, బదిలీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ విషయంలో చాలమంది ఐపీఎస్ ఆఫీసర్లు ప్రభుత్వ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ప్రమోషన్ వచ్చిందని సంతోషించాలా? లేక కిందిస్థాయి పోస్టులోనే కొనసాగాల్సి వస్తోందని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని అంటున్నారు. -
కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలనలో భాగంగా..
న్యూఢిల్లీ: రైల్వే బోర్డులో సమర్థతను పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బోర్డు అధికారుల సంఖ్యను 200 నుంచి 150కి తగ్గించింది. డైరెక్టర్, ఆ పై స్థాయికి చెందిన 50 మంది అధికారులను వివిధ జోన్లకు బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ‘కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పరిపాలన అనే ప్రధాని ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ అధికారుల సేవలను గరిష్టంగా వినియోగించుకునేందుకు వారిని వివిధ జోన్లకు బదిలీ చేశాం’ అని రైల్వే ఉన్నతాధికారి చెప్పారు. బోర్డులో అవసరమైన మేరకే సిబ్బంది ఉండాలన్నది నాటి ప్రధాని వాజ్‌పేయి ఆలోచన. బోర్డును పునర్వ్యవస్థీకరించాలని 2015లో డెబ్రాయ్ కమిటీ సిఫారసు చేసింది. రైల్వే శాఖ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేసిన తొలి అడుగే రైల్వే బోర్డులో సిబ్బందిని తగ్గించడమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ
సాక్షి, అమరావతి : టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. శ్రీనివాసరాజును సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో టీటీడీ జేఈవోగా బసంత్‌కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. తక్షణమే బాధ్యతలు చేపట్టాలని బసంత్‌కుమార్‌ను ఆదేశించింది. కాగా, బసంత్‌కుమార్ ప్రస్తుతం వీఎంఆర్డీఏ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. -
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం : ఎయిర్‌పోర్టు ఆఫీసర్ బదిలీ
-
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం : ఎయిర్‌పోర్టు ఆఫీసర్ బదిలీ
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరగడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సాక్షాత్తు ఓ రాష్ట్ర ప్రతిపక్షనేత అందులోనూ కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలోనే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చోటుచేసుకోవడంతో విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రముఖుల భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌పై బదిలీ వేటు పడింది. వైజాగ్ ఎయిర్ పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వేణుగోపాల్‌ను చెన్నై ఎయిర్ పోర్టుకు బదిలీ చేస్తున్నట్టు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. విమానాశ్రయ భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. -
ఇస్రో సీనియర్ శాస్త్రవేత్తపై బదిలీ వేటు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సీనియర్ శాస్త్రవేత్త తపన్ మిశ్రాపై వేటు పడింది. ప్రస్తుతం అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్(ఎస్ఏసీ) డైరెక్టర్‌గా ఉన్న మిశ్రాను బెంగళూరులోని సంస్థ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేసిన చైర్మన్ కె.శివన్.. ఆయనకు ఇస్రో సలహాదారుగా కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఇస్రో చేపడుతున్న అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు శివన్ గణనీయమైన ప్రాధాన్యమివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో మిశ్రాపై వేటు పడిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మిశ్రా స్థానంలో ఎస్ఏసీ డైరెక్టర్‌గా మరో సీనియర్ శాస్త్రవేత్త డీకే దాస్‌ను నియమించినట్లు పేర్కొన్నారు. దేశీయంగా పలు కీలక ఉపగ్రహాల తయారీలో పాలుపంచుకున్న మిశ్రా భవిష్యత్‌తో ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టేవారిలో ముందువరుసలో ఉన్నారన్నారు. -
డీఎంహెచ్ఓ అన్నప్రసన్నకుమారి బదిలీ
జనగామ : జనగామ జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారిని పదోన్నతిపై బదిలీ చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. 2017 మేలో జిల్లా వైద్యాధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రులను చక్కదిద్దడమే కాకండా.. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ప్రైవేట్ క్లినిక్, నర్సింగ్ హోం, స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు స్కానింగ్ కేంద్రాలు, క్లినిక్, ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లను రద్దు చేయడమే కాకుండా, కేసులు కూడా నమోదు చేశారు. గుట్టుచప్పడు కాకుండా చేస్తున్న అబార్షన్లపై కన్నెర్రజేశారు. ప్రజలను అమాయకులను చేసి, అడ్డదారిలో వైద్యం చేసే ఎంతటి వారినైనా వదిలి పెట్టలేదు. రాజకీయంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా ఆస్పత్రులను సీజ్ చేశారు. సుమారు 14 నెలల జనగామలో పని చేసిన అన్న ప్రసన్నకుమారి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ అడిషినల్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పదోన్నతిపై వెళ్తున్నారు. జిల్లాలో పని చేసినంత కాలం వైద్య సేవల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. నేడు విధుల్లో చేరాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జనగామ జిల్లా వైద్యాధికారిగా మహేందర్ జనగామ జిల్లా వైద్యాధికారిగా ఎ.మహేందర్‌ను నియమిస్తూ వైద్యారోగ్య కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం స్టేట్ ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్‌గా పని చేసిన మహేందర్ పదోన్నతిపై హైదరాబాద్‌కు వెళ్లారు. ప్రస్తుత డీఎంహెచ్ఓ పదోన్నతిపై బదిలీపై వెళ్లడంతో ఆమె స్థానంలో మహేందర్‌ను నియమించారు. -
విజిలెన్స్ ఎస్పీపై బదిలీ వేటు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ అనిల్‌పై బదిలీ వేటు పడింది. అనంతపురం నుంచి బదిలీ చేయడమే కాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు ఆ శాఖ నుంచి రిలీవ్ చేశారు. దీంతో ప్రభుత్వం ఆయనను ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా నియమిస్తూ, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అనురాధ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్పీ స్థాయిలోని అనిల్‌ను విజిలెన్స్ ఎస్పీగా నాలుగేళ్లకుపైగా ఎఫ్ఏసీ(పూర్తి అదనపు బాధ్యతలు)పై విధులు నిర్వహించారు. అయితే ఆయన పనితీరుపై విపక్షపార్టీ తరచూ విమర్శలు గుప్పించింది. అధికారపార్టీకి పూర్తి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, పలు శాఖలను బ్లాక్మెయిల్ చేసి అవినీతికి పాల్పడుతున్నారని డీజీకి ఫిర్యాదు చేశారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా అనిల్ విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 3న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విజిలెన్స్ డీజీకి ఫిర్యాదు చేశారు.విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ జిల్లాపై నిఘా ఉంచి అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం వెచ్చించే నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలి. అలా జరిగితే తనిఖీలు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలి. కానీ ఈ శాఖ పనితీరు నాలుగేళ్లుగా వివాదాస్పదంగానే ఉంది. అనిల్ అధికార పార్టీకి అండగా ఉంటారని, ఓ సామాజికవర్గానికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేకించి తనిఖీల పేరుతో బెదిరించి ఒకసారి కేసు నమోదు చేసి, తర్వాత వారితో సత్ససంబంధాలు నడుపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపించా యి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందనికాడికి దోచుకున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసే స్థాయికి వచ్చారంటే ఆ శాఖ పరిస్థితి ఎలా ఉందో? అధికారులు ఎలా వ్యవహరించారో? ఇట్టే తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీలోని ఓ కీలక అధికారి, విజిలెన్స్‌లో పనిచేసిన ఓ ఎస్ఐ అండతో ఇతను అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు అనిల్‌పై బదిలీ వేటు వేశారని తెలుస్తోంది. అనిల్‌పై వచ్చిన ఆరోపణలు కొన్ని: = సాయినగర్ పశువుల ఆస్పత్రిలో అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి నిధులు(బిల్లు నెంబర్–3160/29–3–2014,ఎంబుక్కు నెంబర్ 454/2012–2013)తో షెడ్డు నిర్మించారు. దీనికి ప్రస్తుత కార్పొరేషన్ అధికారులు 2014 అక్టోబర్ 29న మరో బిల్లు(బిల్లునెంబర్1648/29–10–2014, ఎంబుక్కు నెంబర్ 24/2008–09)డ్రా చే శారు. దీన్ని 2008–09 ఎంబుక్కులో ఎంటర్ చే శారు. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. = తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా దందా ఏ స్థాయిలో సాగుతోందో పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని ఆ శాఖ విజిలెన్స్ సీఐ ప్రతాప్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫి ర్యాదుచేశారు. తాడిపత్రితో జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ దందా సాగుతున్నా విజిలెన్స్ నిఘా కరువైంది. వారితో విజిలెన్స్ అధికారులు సన్ని హిత సంబంధాలు నడపడమేననే ఆరోపణలు ఉన్నాయి. =ఎరువుల దుకాణాల్లోని అవకతవకలు చూసీ చూడనట్లు వ్యవహరించేందుకు వ్యాపారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసినట్లు తెలుస్తోంది. =కర్ణాటక నుంచి ప్రతి నెలా 80–100 వరకూ స్పాంజ్ ఐరన్ లారీలు హిందూపురం పరిధిలోని పరి శ్రమలకు వస్తుంటాయి. ఒక్కో వాహనానికి రూ.15వేలు ఇవ్వాలని హుకూం జారీ చేసినట్లు సమాచారం. = జిల్లాలో క్రషర్లతో పాటు మైనింగ్ 75శాతం ని బంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. వీరి నుం చి కూడా భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. = గుంతకల్లు సమీపంలోని కొందరు డీజిల్ మాఫియాగా ఏర్పడి కల్తీ ఆయిల్ సరఫరా చేస్తున్నారు. వీరి నుంచి భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. = ఓ సిమెంట్ ట్రాన్స్పోర్ట్ సంస్థ నిబంధనలకు వి రుద్ధంగా జిల్లాలోకి ప్రవేశిస్తున్నందుకు ప్రతి నెలా రూ.2లక్షలు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. = ఇసుక మాఫియా నుంచి కూడా భారీగా ముడుపులు అందుతున్నట్లు తెలిసింది. = తనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ల జోలి కి వెళ్లకుండా ఉండటం, విపక్ష పార్టీకి చెందిన ఏజెన్సీలు, దారికి రాని వారి పనుల్లో లోపాలు వెతికి కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించేలా చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. =అనంతపురంలోని ఒకటో డివిజన్లో సిమెంట్ రోడ్డు తనిఖీకి వెళ్లి ఒక శాంపిల్ తీయగానే అధికార పార్టీ నేతల నుంచి ఫోన్ రావడంతో వెనక్కు వెళ్లిపోవడం గమనార్హం. -
పాఠశాల విద్యా శాఖ కమిషనర్ బదిలీ
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖ కమిషనర్ జి.కిషన్ బదిలీ అయ్యారు. ఆ స్థానంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హాకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌గా కిషన్ రెండున్నరేళ్లు కొనసాగారు. ఉపాధ్యాయ బదిలీలు జరుగుతున్న కీలక సమయంలో ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనకు ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌గా కిషన్ పలు అంశాల్లో వివాదాల్లోకెక్కారు. సాధారణంగా శాఖాపరమైన నిర్ణయాలను త్వరితగతిన తీసుకోరన్న అభిప్రాయం ఉంది. కమిషనర్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపేవారని సమాచారం. దీంతో నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగేదన్న ఆరోపణలున్నా యి. చివరికి సొంతంగా తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. ఉపాధ్యాయుల సెలవుల జారీలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారికి బాధ్యతలు అప్పగించడం, స్కూల్ గ్రాంట్స్ ఖర్చులో చెక్కుల చెల్లింపులు, పాఠశాలల్లో డ్యూయల్ డెస్క్‌ల కొనుగోలులో పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సీఎం వద్ద జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు కమిషనర్ వైఖరి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కమిషనర్ నిర్ణయాలతో ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తోందంటూ పలువురు సీఎం వద్ద ఏకరువు పెట్టారు. దీంతో కిషన్ బదిలీ జరిగినట్లు తెలుస్తోంది. -
కథువా కేసులో కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: కథువా కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును పఠాన్‌కోట్ కోర్టుకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తు విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. బాధిత కుటుంబానికి, న్యాయవాదికి, సాక్ష్యులకు రక్షణ కల్పించాలని జమ్ము కశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ‘కథువా కేసును పఠాన్‌కోట్ జిల్లా కోర్టుకు బదిలీ చేస్తున్నాం ఈ కేసులో ప్రతీరోజు వాదనలు జరగాలి. కేసు విచారణ త్వరగతిన పూర్తి కావాలి. కోర్టు విచారణను రహస్య విచారణ చేపట్టాలని ఆదేశించింది(ఇన్-కెమెరా ప్రోసీడింగ్స్). ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించుకునేందుకు జమ్ము కశ్మీర్ ప్రభుత్వానికి అనుమతిస్తున్నాం’ అని బెంచ్ తెలిపింది. ఈ కేసులో తదుపరి వాదనను జూలై 9కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మమ్మల్ని కాల్చిచంపండి:‘కథువా’ బాలిక తల్లి అందుకే చిన్నారిని చంపాం: సాంజిరామ్ 8 ఏళ్ల చిన్నారిని ఆలయంలో బంధించి అత్యాచారం చేసి, ఆపై అత్యంత దారుణంగా హతమార్చిన ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ కేసులో సాంజీరామ్ అనే మాజీ ప్రభుత్వ ఉద్యోగితోసహ ఏడుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును జమ్ము కశ్మీర్ నుంచి ఛండీగఢ్ కోర్టుకు బదిలీ చేయాలని బాధిత బాలిక తండ్రి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసింది. మరోపక్క నిందితులు మాత్రం ఆ విషయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, రాష్ట్ర పోలీసులు సమర్థవంతంగానే దర్యాప్తు జరుపుతున్నారంటూ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి తాజాగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కథువా కేసు; షమీ భార్య షాకింగ్ కామెంట్స్ కామాంధులకు మరణశిక్ష.. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం -
‘కార్’కు ఏడీసీపీ గంగిరెడ్డి బదిలీ
సాక్షి, హైదరాబాద్: ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు టీవీ చానళ్లలో వచ్చింది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. -
మాల్యాకు రూ.100కోట్ల షాక్
న్యూఢిల్లీ: వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఇటీవల మాల్యాను ఇండియాకు తిరిగి రప్పించే చర్యలను వేగవంతం చేసిన కేంద్రం తాజాగా మరో కీలక చర్య తీసుకుంది. మాల్యాకు చెంఇన సుమారు రూ.100కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేంద్రానికి బదిలీచేసింది. ముఖ్యంగా యునైటెడ్ బ్రూవరీస్‌కు చెందిన ఆస్తులపై దృష్టిపెట్టిన ఈడీ తాజాగా మాల్యాకు చెందిన రూ.100 కోట్ల విలువైన వాటాలను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. స్టాక్ హోల్డింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్) యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీల్) కు చెందిన రూ. 100 కోట్ల విలువైన ( ప్రత్యక్ష, పరోక్ష)వాటాల హక్కులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. మనీలాండర్ చట్టం సెక్షన్9 ప్రకారం ఈ ఆస్తుల బదిలీ ప్రక్రియను చేపట్టింది. మరోవైపు ఈడీ ఇప్పటికే యూబీఎల్‌కు చెందిన 4 కోట్ల వాటాలు, యూఎస్ఎల్కు చెందిన 25.1లక్షల వాటాలు, మెక్‌డోవెల్స్ హోల్డింగ్స్‌లోని 22 లక్షల వాటాలను అటాచ్ చేసింది. వీటితోపాటు మాల్యావిగా అనుమానిస్తున్న మరికొన్ని కంపెనీలపై దృష్టి సారించింది. వీటిల్లో దేవీ ఇన్వెస్ట్మెంట్స్, కింగ్‌ఫిషర్ ఫిన్వెస్ట్ ఇండియా, మాల్యా ప్రైవేటు లిమిటెడ్, ఫార్మాట్రేడింగ్ కంపెనీ, విట్టల్ ఇన్వెస్ట్మెంట్స్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్, కామ్‌స్కో ఇండస్ట్రీస్, ‘ది గెమ్’ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ కంపెనీలపై కూడా దృష్టిపెట్టింది. రెండునెలల క్రితం యూబీఎల్, యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్ఎల్) మాక్టోవెల్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లో మాల్యా, అతని అనుబంధ సంస్థలకు చెందిన రూ. 4వేల కోట్ల వాటాలను బదిలీ చేయాల్సిందిగా ఎస్‌హెచ్‌సీఐఎల్‌కు ఈడీ లేఖరాసింది. ఈ మేరకు ఫిబ్రవరిలో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆర్డర్ రూ .4,200 కోట్ల ఆస్తుల ఎటాచ్మెంట్ ఆర్డర్‌ను కోర్టు సమ్మతించింది. ఈ కంపెనీల్లో మాల్యాకు రూ.4,000 కోట్ల విలువైన షేర్లు ఉంటాయని అంచనా. అలాగే గత ఏడాది సెప్టెంబర్‌లో ఈడీ రూ .6,630 కోట్ల విలువైన అటాట చేసిన సంగతి తెలిసిందే. మనీ లావాదేవీ నిరోధక చట్టం (పిఎంఎల్ఏ) నిబంధనలో 9 వ సెక్షన్ కింద, జప్తు ఆర్డర్ తర్వాత, అటువంటి ఆస్తిలో అన్ని హక్కులు కేంద్ర ప్రభుత్వానికే చెందుతాయి. -
ఖాకీలకూ ‘పనిష్మెంట్’
పోలీసు ఉల్లంఘనలపై ప్రత్యేక నజర్ ♦ సిబ్బంది, అధికారుల వయొలేషన్స్‌పై సీరియస్ ♦ తాజాగా కానిస్టేబుల్‌పై అటాచ్మెంట్ వేటు సాక్షి, హైదరాబాద్: రహదారులపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సాధారణ ప్రజలకు జరిమానా, పాయింట్లు మాత్రమే పడుతున్నాయి. ఇదే పని పోలీసులు చేస్తే వారికి వీటితో పాటు తాఖీదులు తప్పట్లేదు. కొన్ని నెలలుగా నగర పోలీసులు ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 242 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు ఉన్నతాధికారులు చార్జ్ మెమోలు జారీ చేశారు. వీరిలో ఆరుగురిపై బదిలీ లేదా అటాచ్మెంట్ వేటు కూడా పడింది. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతూ మీడియాకు చిక్కిన రామ్‌గోపాల్‌పేట కానిస్టేబుల్ కె.రాకేష్సాగర్ను సీఏఆర్ హెడ్–క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ మధ్య మండల డీసీపీ జోయల్ డెవిస్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమలు చేయాల్సిన వారే తప్పు చేస్తే... రహదారి భద్రతకు సంబంధించి అంశాలు, నిబంధనల్ని క్షేత్రస్థాయిలో ట్రాఫిక్, శాంతిభద్రతల అధికారులే అమలు చేస్తుంటారు. ఇలాంటి అధికారాలున్న వారే తప్పులు చేస్తే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని హెల్మెట్ నిబంధన పక్కా చేసినప్పుడు కమిషనరేట్లోకి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనచోదకుడూ కచ్చితంగా దీన్ని ధరించాల్సిందేనని కొత్వాల్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ విధానాన్ని మరింత విస్తరిస్తూ రహదారుల పైనా పోలీసులు నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. యూనిఫాంలో ఉంటే సీరియస్... నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న పది వేల మందికి పైగా సిబ్బంది నిత్యం ఇళ్ల నుంచి పోలీసుస్టేషన్/కార్యాలయం మధ్య, వ్యక్తిగత/అధికారిక పనుల నిమిత్తం రాకపోకలు సాగిస్తుంటారు. ఇలా వీరు రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో అత్యధిక శాతం యూనిఫాంలోనే ఉంటున్నారు. వీరు వినియోగిస్తున్న వాటిలో ప్రైవేట్ వాహనాలతో పాటు ప్రభుత్వం అందించినవీ ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో యూనిఫాంలో ఉన్న పోలీసులతో పాటు పోలీసు వాహనాలు ఉల్లంఘనలకు పాల్పడటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వీరిలో మార్పు తీసుకురావడానికి కౌన్సెలింగ్‌లు చేపట్టిన అధికారులు, కొన్నాళ్లుగా తాఖీదులు జారీ చేయడం మొదలుపెట్టారు. నాలుగు రకాలుగా ఆధారాలు పోలీసుల ఉల్లంఘనలకు సంబంధించి పక్కా ఆధారాలు ఉంటేనే చర్యలు తీసుకుం టున్నామని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలి పారు. మొత్తం 4 రకాల సాధనాల ద్వారా వీటిని సేకరిస్తున్నారు. విధుల్లో ఉంటున్న సిబ్బంది తమ చేతిలో ఉండే కెమెరాల ద్వారా చిత్రీకరిస్తున్నారు. బషీర్‌బాగ్‌లోని కమిషన రేట్లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచీ ఫొటోలు తీస్తున్నారు. ఈ రెంటితో పాటు సోషల్‌మీడియాలో సర్క్యు లేట్ అవుతున్న, పత్రికల్లో వస్తున్న ఫొటోలను పరిగణలోకి తీసుకుంటున్నారు. తాఖీదులు పొందిన వారు ఇలా.. అదనపు ఇన్స్పెక్టర్ 1 ఎòౖÜ్సలు 66 హెడ్–కానిస్టేబుళ్లు 9 కానిస్టేబుళ్లు 86 హోంగార్డులు 80 మొత్తం 242 ముందు ఫైన్... ఆపై మెమో... సేకరించిన ఫొటోలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది అధ్యయనం చేస్తున్నారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపింది ఎవరనేది నిర్ధారించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్పష్టత వచ్చిన తర్వాత సదరు పోలీసుల నుంచి జరిమానా వసూలు చేసి, ఆపై చార్జ్‌మెమో జారీ చేస్తున్నారు. నిర్ణీత సమయంలోపు సంజాయిషీ ఇవ్వకపోయినా, ఇచ్చింది సం తృప్తికరంగా లేకపోయినా తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో పక్క పోలీసు సిబ్బంది/అధికారులకు చెందిన వ్యక్తిగత, అధికారిక వాహనాలపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని సీపీ స్పష్టం చేశారు. -
రెవెన్యూలో 174 మంది బదిలీ
ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 174 మందిని బదిలీ చేసినట్టు జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్లోని గోదావరి కాన్ఫెరె¯Œ్స హాల్లో బదిలీల ప్రక్రియ సోమవారం అర్ధరాత్రి వరకూ సాగింది. ఐదేళ్లు సర్వీసు నిండిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు చెప్పారు. వారు కోరుకున్న చోటుకు అర్హతను బట్టి బదిలీ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 154 మంది వీఆర్ఓలు, 12 మంది సీనియర్ అసిస్టెంట్లు, 8 మంది జూనియర్ అసిస్టెంట్లను బదిలీ చేశామని చెప్పారు. బదిలీ పత్రాన్ని సిద్ధం చేసి సంబంధిత ఉద్యోగికి అందించామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి కె.హైమావతి పాల్గొన్నారు. -
రాత్రికి రాత్రే యూపీ సీఎం మరో కీలక నిర్ణయం
పట్నా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. తాజాగా యోగి భారీగా ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 41 జిల్లాల పోలీసు బాస్‌లను, ఇతర ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగులను చేపట్టారు. ఈ కీలక ఆదేశాలను బుధవారం అర్థరాత్రి జారీ చేశారు. సుమారు 50మందికిపైగా అధికారులకు స్థాన భ్రంశం కల్పించారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల పోలీస్ బాస్‌లను బదిలీ చేయడం ద్వారా పెద్ద సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలరోజుల తరువాత ఇదే అతిపెద్ద పోలీస్ సంస్కరణగా నిలిచింది. ముఖ్యంగా మెయిన్‌పురి, నోయిడా, ఆగ్రా, సహారన్పూర్, అమ్రోహ, గోరఖ్‌పూర్, డియోరియా,కన్నౌజ్ జిల్లాల ఎస్ఎస్పీలను బదిలీ చేసింది. మెయిన్ పురి జిల్లాకు కొత్త పోలీస్ చీఫ్‌గా ఎస్ రాజేష్ నియమితుడయ్యారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ నేతృత్వంలోని ఊరేగింపు నిషేధించి ఇటీవల వార్లల్లో నిలిచిన షహరన్‌పూర్ ఎస్ఎస్పీ లవ్‌కుమార్‌ను నోయిడాకు ట్రాన్సఫర్ చేయగా, రాయబరేలికి గౌరవ్ సింగ్, లక్నోకు దీపక్‌కుమార్, ఆగ్రాకు దినేష్ చంద్ర దుబే పోలీస్ ఛీప్‌గా వ్యవహరించనున్నారు. మునుపటి సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం నియమించిన ఐపీఎస్ లలో ఎక్కువమందిని రీ షఫిల్ చేయడ విశేషం. -
20 మంది సీఐలకు స్థానచలనం!
► బదిలీలకు రంగం సిద్ధం ► రాజకీయ సిఫార్సులకే కీలక ప్రాధాన్యం ► ఐఏఎస్ బదిలీల కంటే ముందే.. ► పైరవీలు ప్రారంభించిన సీఐలు సాక్షి, గుంటూరు : సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. గుంటూరు రేంజ్ పరిధిలో పెద్దసంఖ్యలో సీఐలను బదిలీ చేయటానికి ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యంగా రెండేళ్ళ కాలపరిమితిని ప్రామాణికంగా తీసుకొని బదిలీలు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే అడుగడుగునా రాజకీయ సిఫార్సులు, భారీగా పైరవీలకు తెరలేవటంతో బదిలీల వ్యవహారం అంతా అధికార పార్టీ నేతల కనుసన్నల్లోకి వెళ్ళింది. దీంతో కొందరు సీఐలు తమకున్న రాజకీయ పరపతిని వినియోగించి ఆదాయం ఎక్కువ ఉన్న స్టేషన్ల పోస్టింగ్ కోసం ముందే లాబీయింగ్ నిర్వహిస్తున్నారు. సిఫార్సులకే పెద్దపీట! గుంటూరు రేంజ్ పరిధిలో గుంటూరు అర్బన్, రూరల్ జిల్లాలతో పాటు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. రేంజ్ పరిధిలో రూరల్ ప్రాంతాల్లోని కొన్ని స్టేషన్లు, అలాగే అర్బన్ ప్రాంతాల్లోని కొన్ని పోలీస్స్టేషన్ల పోస్టింగ్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆయా స్టేషన్లలో పోస్టింగ్ దక్కాలంటే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు భారీగా కొంతమేర చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు నగరంలోని మూడు కీలక స్టేషన్లలకు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో ఉన్న కొన్ని మున్సిపాలిటీల్లో పోస్టింగ్‌లు డిమాండ్ ఉంది. వాస్తవానికి రెండు నెలల క్రితమే బదిలీలకు సంబంధించి ఐజీ సంజయ్ ప్రాథమికంగా కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ సిఫార్సులకు పెద్దపీట వేసేలా జాబితాలు సిద్ధమైనట్లు సమాచారం. అయితే అమాత్యులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలు దాటి సిఫార్సులు చేస్తుండటంతో బదిలీలను అప్పుడు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ఈ నెలాఖరులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు పెద్దసంఖ్యలో జరగనున్నాయి. ఈ క్రమంలో రేంజ్ ఐజీ సంజయ్, అర్బన్, రూరల్ ఎస్పీలకు స్థానచలనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఐజీ, రూరల్ ఎస్పీ రెండేళ్ళ కాలపరిమితి పూర్తి చేసుకున్నారు. దీంతో ఇద్దరి బదిలీలు అనివార్యంగా మారాయి. ఈ క్రమంలో ఈనెల మొదటి వారంలో ఐపీఎస్‌ల బదిలీలు జరుగుతాయని ప్రచారం జరిగిన నేపథ్యంలో హడావుడి మళ్ళీ మొదలైంది. పల్నాడు ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ... రేంజ్ పరిధిలోని సీఐల బదిలీలు అన్ని పల్నాడు ప్రాంతంలో ఉన్న ఒక అధికార పార్టీ కనుసన్నల్లో జరుగుతున్నాయి. గత ఏడాది కాలంగా జరుగుతున్న బదిలీల్లో సదరు నేతదే కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో సీఐలు సదరు ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు సత్తెనపల్లి, నరసరావుపేటల్లో యువనేత అవినీతి ఆరోపణలతో నిమిత్తం లేకుండా తనకు కావాల్సిన ఎస్ఐలందరినీ ఇప్పటికే బదిలీలు చేయించుకొని పోలీస్ ఉన్నతాధికారులకు సీఐల బదిలీల జాబితా అందజేసినట్లు సమాచారం. జిల్లాలో మరికొందరు ప్రజాప్రతినిధులు కూడా ఇచ్చారు. అయితే మొత్తం మీద కీలకంగా మాత్రం పల్నాడు ఎమ్మెల్యే వ్యవహరిస్తుండటం గమనార్హం. మరోవైపు 20 మంది సీఐలకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గుంటూరు ఈస్ట్ సర్కిల్లో ఒకరు, వెస్ట్ సర్కిల్ ఒకరుతో పాటు అర్బన్ పరిధిలో ఆరుగురు సీఐలు బదిలీల జాబితా ఉండే అవకాశం ఉంది. -
పొరపాటున వేలకోట్లు బదిలీ చేసిన బ్యాంకు
జర్మన్ దేశానికి చెందిన డెవలప్మెంట్ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యు మరోసారి తప్పులో కాలేసింది. బిలియన్ల యూరోలు పొరపాటున వేరు వేరు బ్యాంకుల్లోకి బదిలీ అయిపోయాయి. అనుభవజ్ఙడైన ప్రోగ్రామర్ కాన్ఫిగరేషన్ మిస్టేక్ కారణం గా ప్రభుత్వం రంగ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యు కు చెందిన నగదు నాలుగు ఇతర బ్యాంకులకు భారీ మొత్తం బదిలీ అయింది. 5.4 బిలియన్ డాలర్లు( సుమారు రూ. 35304కోట్లు) తరలిపోయిన ఈ ఘటన ఫిబ్రవరిలో చోటు చేసుకుందని బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ చేసింది. ఇది మానవ తప్పిదమని నివేదించింది. ఇది 6 బిలియన్ యూరోలకంటే ఎక్కువే ఉండంచ్చని కూడా తెలుస్తోంది. దీన్ని గుర్తించిన బ్యాంక్ వెంటనే విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ ఉదంతంతపై జర్మన్ సెంట్రల్ బ్యాంకుకు ఫిర్యాదు చేసింది. బదిలీ అయిన నిధులను వెనక్కి చెల్లించాలని డిమాండ్ చేసింది. కాగా 2008 లో కూడా ఇలాంటి సంఘటన చోటుసుకుంది. కేఏఎఫ్ డబ్ల్యు పొరపాటున 300 మిలియన్ల యూరోలను అమెరికాకు చెందిన లేమన్ బ్రదర్స్‌కు ట్రాన్స్ఫర్ చేసిందట. -
రాత్రికి రాత్రే 70 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ!
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కుటుంబ రాజకీయ గొడవలకు అధికారులు సతమతమవుతున్నారు. రాత్రికి రాత్రే కనీస సమాచారం లేకుండా 70 మంది ఐపీఎస్ అధికారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. దీనిలో పోలీసు చీఫ్‌లు కూడా ఉన్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌కు, ఆయన కుమారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు గత కొంతకాలంగా విబేధాలు వచ్చాయి. మొదట అసమర్థుడైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అనంతరం అవినీతి ఆరోపణలతో తన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌కు దగ్గరి వారైన ఇద్దరు మంత్రులను అఖిలేష్ తప్పించారు. దీంతో తండ్రీ కొడుకి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. వీరిద్దరి వివాదాల వల్ల ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ కీలకపరిమాణాలు చోటుచేసుకుంటున్నాయి.. ఈ నేపథ్యంలో 70 మంది ఇండియన్ పోలీసు సర్వీసు అధికారులకు ట్రాన్స్ఫర్లు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. సీనియర్ హోమ్ డిపార్ట్మెంట్ అధికారుల ప్రకారం ఎక్కువగా ప్రాముఖ్యం పొందిన కాన్పూర్, మెయిన్‌పురి, ముజాఫర్‌నగర్, కాన్పూర్ రూరల్, ఫైజాబాద్, మధురా, ఫిరోజాబాద్, షామిలి, హపుర్, హర్దాయ్, జలాన్, చిత్రకూట్ జిల్లాల పోలీసు చీఫ్‌లను ప్రభుత్వం బదిలీ చేసినట్టు వెల్లడైంది. ఎస్పీకి పట్టుగొమ్ములాంటి మెయిన్‌పురి జిల్లాకు సునిల్ కుమార్ సక్సేనాను పోలీసు సూపరింటెండెంట్‌గా ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా అనంత్ డియోను సున్నితమైన పట్టణంగా పేరొందిన ఫైజాబాద్‌కు పోలీస్ చీఫ్‌గా బదిలీచేసింది. షలబ్ మాథుర్‌ను కాన్పూర్ నుంచి అలహాబాద్‌కు బదిలీచేసి కొత్త సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌గా పోస్టింగ్ ఇచ్చింది. జవహర్ బాగ్‌లో హింసాత్మక ఘటన నేపథ్యంలో సస్పెండ్ అయి, మథుర నుంచి ట్రాన్స్ఫర్ అయిన రాకేష్ సింగ్‌ను జలాన్ జిల్లాకు కొత్త ఎస్పీగా బదిలీ చేసింది. ఇలా ఇతర పోలీసు అధికారులను కూడా శుక్రవారం రాత్రి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బదిలీలు చేసింది. పోలీసు డిపార్ట్మెంట్లో జరిగిన ప్రధాన పునర్వ్యస్థీకరణ ఇదే. రాత్రికి రాత్రే ఈ బదిలీలు చేపట్టడంతో అసలు ఈ ట్రాన్స్ఫర్లకు కారణాలేమిటా అని సర్వత్రా చర్చనీయాశమైంది. -
మావాడే ఉండాలి!
సీఐల బదిలీలపై టీడీపీ నేతల పెత్తనం పోస్టింగుల పేరిట భారీ వసూళ్లు విజయవాడ నగరంలో ఇదీ పరిస్థితి ‘పోలీస్‌స్టేషన్‌లో నా మాటే చెల్లుబాటు కావడం లేదు. నా వ్యతిరేకులపై ఏవో కేసులు పెట్టమంటే రూల్స్ మాట్లాడుతున్నారు. ఇందుకేనా నేను అధికార పార్టీలోకి వచ్చింది. వెంటనే అక్కడ సీఐని మార్చండి. నా మనిషిని వేయండి’ - నగరంలోని అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి హుకుం. అమరావతి : విజయవాడలో ప్రస్తుత పరిస్థితికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. అక్రమార్జనకు నగరాన్ని ప్రధాన వనరుగా మలచుకోవాలని భావిస్తున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పోలీసు శాఖపై నియంత్రణ కోసం పట్టుబడుతున్నారు. తమ అభీష్టం మేరకే సీఐల బదిలీలు జరపాలని తేల్చి చెబుతున్నారు. తమపట్ల రాజకీయ విధేయతతోపాటు సీటుకు తగిన రేటు నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. పోస్టింగులను అంగడి సరుకుగా మార్చేస్తున్న అధికార పార్టీ నేతల యవ్వారం ఇదిగో ఇలా ఉంది... ప్రక్షాళనా!... రాజకీయ పెత్తనమా! రాజధానిగా రూపాంతరం చెందిన నగరంలో పోలీస్ వ్యవస్థ పటిష్టతకు ఉన్నతాధికారులు కొన్ని నెలల క్రితం కార్యాచరణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది సీఐలను వీఆర్‌కు పంపించడం రాజకీయంగా సంచలనం కలిగించింది. పుష్కరాలు ముగియడంతో ఆ అంశంపై మళ్లీ దృష్టి సారించారు. ఆరు నుంచి ఎనిమిది మంది పనితీరు బాగోలేదని గుర్తించారు. శాంతిభద్రతల కోణంలో కీలకమైన నగరంలోని రెండు నియోజకవర్గాల్లో సీఐల పనితీరుపై ఉన్నతాధికారులు అసంతృప్తిగా ఉన్నారు. ఉత్సవాల పేరిట వసూళ్ల దందాకు ఓ అధికారి ఓ ప్రజాప్రతినిధికి వత్తాసు పలికారు. పారిశ్రామిక ప్రాంతంలో ఓ అధికారి ప్రజాప్రతినిధికి ఏజెంట్‌గా మారిపోయారు. ఇక శివారులోని రెండు నియోజకవర్గాల్లో కూడా కొందరు అధికారులు సివిల్ వివాదాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నారు. ట్రాక్ రికార్డే ప్రాతిపదికగా చురుకైన అధికారులను నియమించాలని భావిస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగారు. అదేం కుదరదు... మా వాళ్లను నియమించాల్సిందే ... ‘అంతా ఉన్నతాధికారుల ఇష్ట ప్రకారం చేస్తామంటే కుదరనే కుదరదు. ట్రాక్ రికార్డు, పనితీరు అంటూ ఏవేవో చెప్పొద్దు’అని టీడీపీ నేతలు తేల్చిచెప్పారు. ఏకంగా సీఎం కార్యాలయం వద్ద పంచాయితీ పెట్టినట్లు సమాచారం. తాము సూచిస్తున్న అధికారుల పేర్లతో ఓ జాబితాను కూడా సీఎం కార్యాలయ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఐల పోస్టింగులకు ఏకంగా సీఎం కార్యాలయ స్థాయిలో పైరవీలు చేస్తుండడం పట్ల పోలీసు వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో సీఐ పోస్టింగుకు ప్రజాప్రతినిధులు రూ.కోటి చొప్పున వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అదే రూరల్ పరిధిలో అయితే దాదాపు రూ.60 లక్షలు డిమాండ్ చేస్తున్నారని పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం టీడీపీ నేతలు పట్టుబడుతున్న కొన్ని పోస్టింగులు ఇవీ... భూ దందాలకు పేరుబడ్డ శివారు నియోజకవర్గంలోని పోస్టింగులపై అక్కడ ప్రజాప్రతినిధి పట్టుదలకు పోతున్నారు. తన మాటకంటే గతంలో ప్రజాప్రతినిధిగా చేసిన టీడీపీ నేత మాటే చెల్లుబాటు అవుతోందని మండిపడుతున్నారు. తాను చెప్పిన అధికారికి పోస్టింగు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. నగరంలోని ఓ కీలక నేత మళ్లీ టీడీపీలో చేరారో లేదో పంచాయితీలు మొదలయ్యాయి. 30 ఏళ్ల క్రితం తమ రాజకీయ ఎదుగుదలకు కేంద్రస్థానమైన చోటే మళ్లీ పాగా వేయాలని భావిస్తున్నారు. అందుకు తాము సూచించిన అధికారిని నియమించాలని పట్టుబడుతున్నారు. నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో వైట్‌కాలర్ దందాలపై ఓ ప్రజాప్రతినిధి కన్నేశారు. అందుకోసం అక్కడ తన మనిషే ఉండాలని కరాఖండీగా చెబుతున్నారు. రెండోసారి ప్రజాప్రతినిధిగా ఉన్న ఒక నేత వ్యాపార వర్గాలను తన ఆదాయ వనరుగా మార్చుకునేందుకు పోలీసులను వాడుకోవాలని భావిస్తున్నారు. ఈ పరిణామాలతో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య అభిప్రాయభేదాల అంశం ప్రస్తుతం సీఎం కార్యాలయానికి చేరింది. -
ఖమ్మం జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు
ఖమ్మం: జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని దాదాపు 58 మంది ఎస్సైలకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్నవారితోపాటు... కొత్తగా ఎస్సై ట్రైనింగ్ పూర్తి చేసుకున్నవారికి కూడా ఈ బదిలీల్లో పోస్టింగ్ ఇస్తున్నట్లు ఎస్పీ ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. -
అలహాబాద్ సీజేగా జస్టిస్ బొసాలే బదిలీ
-
ఏపీ ఆర్థిక, రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌గా అజేయ కల్లం
భారీగా సీనియర్ ఐఏఎస్‌లకు స్థానచలనం వెయిటింగ్లో ఉన్న ఏడుగురికి పోస్టింగ్ అటవీశాఖకు పీవీ రమేశ్ సాక్షి, హైదరాబాద్: నెల రోజులుగా ఐఏఎస్‌ల బదిలీలపై ఊరిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం 21 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న ఐఏఎస్‌లతో పాటు ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్లకు చెందిన ఏడుగురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ముందు నుంచి అనుకున్నట్లుగానే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్‌పై ఏపీ సీఎం వేటు వేశారు. ఆయన్ను అడవుల బాట పట్టించారు. రమేశ్ అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉండడంతో పాటు అదనంగా రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి కేంద్రంలో పెండింగ్ అంశాలకు సంబంధించి సీఎం ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తారు. బదిలీల్లో ఏపీ సీఎస్ సత్యప్రకాశ్ టక్కర్ ముద్ర ప్రస్ఫుటంగా కనిపించింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజేయ కల్లంను నియమించాల్సిందిగా తొలి నుంచి టక్కర్ సీఎంకు చెబుతూ వచ్చారు. ఇప్పుడు అదే అమలైంది. ఆర్థిక శాఖ, రెవెన్యూ(వాణిజ్య, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రెవెన్యూ) శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అజేయ కల్లంను ప్రభుత్వం నియమించింది. దీర్ఘకాలంగా సాగునీటి శాఖ అధికారిగా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్‌ను బదిలీ చేశారు. ఆయనను స్కూల్ విద్యా శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. సాగునీటి శాఖ కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్‌ను నియమించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఏకే ఫరీడాను ప్రాధాన్యత లేని ప్రభుత్వ రంగ సంస్థల శాఖకు బదిలీ చేశారు. మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు ప్రస్తుతం ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖకు అదనంగా గృహ నిర్మాణ శాఖను కేటాయించారు. ఇటీవల పరిశ్రమల శాఖ నుంచి బదిలీ చేసిన రావత్‌ను సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు. -
నెహ్రూను పొగిడిన కలెక్టర్ కు ఝలక్..!
భోపాల్: సీనియర్ ఐఏఎస్ అధికారి ఫేస్ బుక్ లో చేసిన పోస్ట్ పై మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో ఆ కలెక్టర్ ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. అజయ్ సింగ్ గంగ్వార్ మధ్యప్రదేశ్ లోని బర్వానీలో కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన వారం రోజుల కిందట మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇక అంతే ఈ పోస్ట్ వైరల్ గా మారింది. చివరికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వారం రోజుల తర్వాత కలెక్టర్ ఆ పోస్ట్ డిలీట్ చేశారు. రాజకీయ అంశాలపై అధికారులు కామెంట్లు చేయరాదన్న నియమాన్ని ఆయన ఉల్లంఘించారని, ప్రభుత్వాన్ని వ్యతిరికించేలా పోస్ట్ చేశాడంతో ఇది తీవ్ర చర్యగా భావించి ఆయనను అక్కడి నుంచి బదిలీ చేశారు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రభుత్వాన్ని, వ్యవస్థను టార్గెట్ చేస్తూ అజయ్ గంగ్వార్ పోస్ట్ ఉందని బీజేపీ నేత వివ్ఆస్ సారంగ్ తెలిపారు. ఇస్రో, ఐఐటీ, బార్క్, ఐఐఎస్బీ, ఐఐఎం, బీహెచ్యిఎల్, థర్మల్ ప్రాజెక్టులు, డ్యాములు ఎన్నో నిర్మించారంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. నెహ్రూ సెక్యూలర్ తత్వాన్ని కూడా కలెక్టర్ అజయ్ సింగ్ ప్రస్తావించారు. ఈ పోస్ట్ విషయం తెలిసి అధికారులు విచారణ చేసి చివరకి కలెక్టర్ అజయ్ ఈ పోస్ట్ చేశారని తెలుసుకుని ఆయనను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం బీజేపీపై మండిపడుతోంది. దేశంలో అసహనం ఉందనడానికి ఇది నిదర్శనమని, స్వాతంత్ర్య సమరయోధుడిని పొగడటం కూడా తప్పేనా అని ప్రశ్నించింది. నెహ్రూను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేస్తే కలెక్టర్ అజయ్ సింగ్ గంగ్వార్ ను బదిలీ చేశారంటేనే సామాన్య ప్రజల్లో ఇంకెన్ని భయాలున్నాయోనని కాంగ్రెస్ నేత అఫ్జల్ వ్యాఖ్యానించారు. -
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ : కె.వి.సత్యనారాయణ పరిశ్రమల శాఖ కార్యదర్శి : సాల్మన్ ఆరోగ్య రాజ్ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ కమిషనర్ : కె.వి.రమణ సమాచార కార్యదర్శి : ఎస్ వెంకటేశ్వర్ సెర్ప్ సీఈవో : పి. కృష్ణమోహన్ -
లక్షల రూపాయలతో బ్యాగ్ లు కొనేసింది!
నాలుగేళ్ళ క్రితం ఆమెను నడమంత్రపు సిరి వరించింది. ఓ బ్యాంక్ అనుకోకుండా చేసిన తప్పిదం ఆమెను ధనవంతురాల్ని చేసింది. అప్పనంగా వచ్చిన సుమారు ఏభై లక్షల రూపాయలను ఆమె.. మూడో కంటికి తెలియకుండా ఖర్చు చేసేందుకు చూసింది. అయితే ఆ అదృష్టం కేవలం నాలుగేళ్ళే నిలిచింది. ఆరా తీసిన బ్యాంక్ సిబ్బందికి అసలు విషయం తెలియడంతో ప్రయాణానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెను వలవేసి పట్టుకున్నారు. మిలియనీర్ గా మారిన 21 ఏళ్ళ క్రిస్టీన్ జియాక్సిన్ లీ.. తనకు కలసి వచ్చిన అదృష్టాన్నినాలుగేళ్ళపాటు రహస్యంగానే ఉంచింది. బ్యాంక్ సిబ్బంది చేసిన తప్పుతో ఆమె అకౌంట్ లోకి వచ్చిన సుమారు 46 లక్షల రూపాయలను ఖరీదైన డిజైనర్ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ ల కొనుగోలుకు ఖర్చు చేసేసింది. అయితే నాలుగేళ్ళ తర్వాత ఆమె ఓ ఎమర్జెన్సీ పాస్ పోర్టుతో మలేషియా వెళ్ళేందుకు సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా తన బ్యాంకులో 33 లక్షల రూపాయల వరకూ బ్యాలెన్స్ ఉందని, మిగిలిన డబ్బును తనకిష్టమైన ఖరీదైన వస్తువులు కొనుక్కున్నానని, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని జియాక్సిన్ పోలీసులకు తెలిపింది. డబ్బు వచ్చిందని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, ఆమె స్వంత ఖర్చులకు వినియోగించడాన్ని కోర్టు నేర చర్యగా పరిగణించింది. సిడ్నీ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న జియాక్సిన్ ను అరెస్టు చేసిన పోలీసులు 2014 జూలై నుంచి, 2015 ఏప్రిల్ మధ్య కాలంలో ఆమె అనేక దఫాలుగా ఏటీఎం నుంచి డబ్బును డ్రా చేసినట్లు చెప్తున్నారు. అయితే కనీసం తనకు వచ్చిన డబ్బు ఏ బ్యాంకు నుంచి వచ్చిందన్న విషయాన్నికూడ తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే జియాక్సిన్ కు బెయిల్ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం... బ్యాంకు చేసిన పొరపాటు గురించి తనకు ఎటువంటి అవగాహనా లేదని, అయితే ఆమె ఖర్చు చేసినట్లు ఆరోపణలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించాడు. -
ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖిల భారత సర్వీసుకు చెందిన తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్వర్వులు జారీ చేసింది. వారి వివరాలు ఇలా ఉన్నాయి.. అధికారి ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం 1.ఎన్ శ్రీధర్ రావు - వెయిటింగ్ ఐజీపీ (ఎల్‌అండ్‌ఓ) 2.మహేశ్ చంద్ర లడ్హా- వెయిటింగ్ అదనపు సీపీ, విజయవాడ 3.కె. వెంకటేశ్వరరావు- వెయిటింగ్ డీఐజీ(ట్రైనింగ్) 4. ఇ. దామోదర్- వెయిటింగ్ డీఐజీ(లీగల్) 5. సీహెచ్. శ్యామ్‌ప్రసాద్‌రావు- వెయిటింగ్ అదనపు ఇన్స్పెక్టర్ జనరల్(ఏఐజీ) 6.విశాల్ గున్ని- వెయిటింగ్ ఎస్పీ, నెల్లూరు 7.డా. గజ రావు భూపాల్- ఎస్పీ, నెల్లూరు ఎస్పీ, సీఐడీ 8.సీహెచ్. విజయరావు- వెయిటింగ్ కమాండెంట్, ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ 9.రాహుల్ దేవ్ శర్మ- వెయిటింగ్ ఎస్పీ, సీఐడీ -
ఏపీలో 15 మంది డీఎస్పీలు బదిలీ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో15 మంది డీఎస్పీల బదిలీతోపాటు పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ జె.వి.రాముడు శుక్రవారం విజయవాడలో ఉత్తర్వులు జారీ చేశారు. గుంతకల్లు డీఆర్ఎస్పీగా పీఎన్ బాబు గుంటూరు డీఆర్ఎస్పీగా ఎల్ అజయ్ ప్రసాద్‌ను నియమించారు. అలాగే ఇంటెలిజెన్స్ డీఎస్పీగా ఎస్.రాఘవ, తిరుపతి నగర పశ్చిమ ఎస్డీపీవోగా టి.కనకరాజు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీగా దిలీప్ కిరణ్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్‌కు టి.మురళీ కృష్ణను రిపోర్ట్ చేశారు. రాజంపేట ఎస్డీపీవోగా విజయ్‌భాస్కర్, డీఎస్పీ ఇంటెలిజెన్స్‌గా అరవింద్‌బాబు, విజయవాడ సెంట్రల్ ఏసీపీగా ఎన్. సత్యానందం బదిలీ చేశారు. అయితే ప్రస్తుతం గుంతకల్లు డీఆర్ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కె. మధును హైదరాబాద్ హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధం
నల్లగొండ : తహసీల్దార్ల బదిలీలకు రంగం సిద్ధమైంది. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా సుమారు 15 మంది తహసీల్దార్లను బదిలీచేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీరిలో రిక్వెస్టు కింద బదిలీ కావాలని కోరిన తహసీల్దార్లు ఐదుగురు ఉన్నారు. తహసీల్దార్ల బదిలీలు రెండేళ్లకోసారి చేయడం సర్వసాధారణం. మరో రెండు, మూడు మాసాలు గడిస్తే తహసీల్దార్ల బదిలీలు జరిగి రెండేళ్లు పూర్తవుతుంది. అయితే పలు చోట్ల తహసీల్దార్లపై వస్తున్న ఫిర్యాదుల మేరకు బదిలీ చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు గతంలో సరియైన పోస్టింగ్ లభించక ఇబ్బంది పడుతున్న వారిని కూడా బదిలీ జాబితాలో చేర్చారు. కొత్త ఓటర్ల జాబితా కసరత్తు జరుగుతు న్నందున ఈ సమయంలో తహసీల్దార్ల బదిలీలు జరగాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. దీంతో కలెక్టర్ ఎన్నికల కమిషన్ అనుమతి కోరుతూ గతంలో లేఖ రాశారు. రెండు, మూడు రోజుల క్రితం తహసీల్దార్ల బదిలీలకు ఈసీ పచ్చజెండా ఊపడంతో రెండు, మూడు రోజుల్లో ట్రాన్స్ఫర్ ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. గతంలో ఆప్షన్స్ తీసుకుని బదిలీల కోసం ఎదురుచూస్తున్న వీఆర్వోలను కూడా రెండు, మూడు రోజుల్లో బదిలీ చేయనున్నారు. ఉద్యోగ విరమణకు ఏడాది సర్వీసు ఉన్న వారిని మినహాయించి ఒకే చోట ఏడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వీఆర్వోలను సమీప మండలాలకు బదిలీ చేయనున్నారు. ఈ జాబితాలో 180 మంది వీఆర్వోలు ఉన్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా అప్పట్లో వారి నుంచి ఆప్షన్స్ తీసుకుని బదిలీ చేయకుండా అధికారులు పెండింగ్‌లో పెట్టారు. -
ఎక్సైజ్ శాఖలో ఇప్పుడు నేనే నంబర్ వన్!
ఎక్సైజ్ శాఖలో మొన్నటివరకు పెత్తనం కోసం ఆరాటపడి బదిలీవేటు వేయించుకున్న సంఘటనలు చూసైనా ఇంకా కొంత మంది అధికారులు గుణపాఠాలు నేర్వడం లేదని అబ్కారీ శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎక్సైజ్ శాఖ మొత్తం ఇప్పుడు నా చేతుల్లోనే ఉంది.. నేనే నెంబర్ వన్ అని అబ్కారీ శాఖలోని ఓ ఉన్నతాధికారి హైదరాబాద్‌లోని జూబ్లీ క్లబ్లో గొప్పలు చెబుతున్నారట. సదరు ఉన్నతాధికారి వ్యాఖ్యల్ని సొంత శాఖలో సిబ్బంది జోరుగా ప్రచారం చేస్తున్నారట. ఇది విన్న అధికారులు కొందరు ‘‘ఆయనకు పేకాట ఆడేందుకే సమయం సరిపోవడం లేదు.. సొంత శాఖపై పట్టు సాధిస్తేనే కదా.. నెంబర్ వన్ అయ్యేది.. ఇక ఆయన ఎప్పుడు నెంబర్ వన్ కావాలి’’ అని నిష్టూరాలాడుతున్నారట. ఆయన వెనక అధికార పార్టీ అండ ఉందేమో కానీ.. నెంబర్ వన్ ఎప్పటికీ కాలేరని సిబ్బంది ఉద్ఘాటిస్తున్నారట. నెంబర్ వన్ అని ఊగి.. చినబాబు, నేను తమ్ముళ్లమే.. అని బీరాలు పలికి చివరకు బయటకు వెళ్లిన ఉన్నతాధికారిని చూసైనా క్లబ్లో కోతలు కోస్తున్న అధికారి మారరా? అని అబ్కారీ శాఖలో గుసగుసలాడుకుంటున్నారు. -
18 టన్నుల గ్యాస్‌ను 19 గంటల్లో...
బెర్హంపూర్(ఒడిశా): బోల్తా పడిన ట్యాంకర్ నుంచి హిందుస్తాన్ పెట్రోలియం(హెచ్‌పీ) సిబ్బంది లిక్వీఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ)ను సురక్షితంగా తరలించారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాలోని ఛత్రపుత్ టౌన్ సమీపంలో శనివారం రాత్రి ఎల్పీజీని తరలిస్తున్న ట్యాంకర్ బొల్తా పడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. అయితే గ్యాస్ లీక్ అయితే పెను ప్రమాదం సంభవించి ఉండేది. ట్యాంకర్‌లోని గ్యాస్‌ను మరో మూడు ట్యాకర్లలోకి జాగ్రత్తగా పైపుల సహాయంతో తరలించారు. విశాఖపట్నం, జత్నాయికి చెందిన 10 మంది సభ్యులతో కూడిన టీం 18 టన్నుల గ్యాస్‌ను ట్రాన్స్ఫర్ చేసే మిషన్‌ను 19 గంటల్లో విజయవంతంగా పూర్తి చేశారు. పని పూర్తి అవ్వగానే ఎన్‌హెచ్9 హైవేతోపాటూ, కరెంటు సప్లైని కూడా పునరుద్ధరించారు. ప్రమాదం జరిగిన వెంటనే గ్యాస్ లీక్ వల్ల ప్రమాదం సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రహదారులు, కరెంటు సప్లైతోపాటూ దగ్గర్లోని స్కూళ్లు, కాలేజీలను మూసివేసిన విషయం తెలిసిందే. -
తెలంగాణలో ఆరుగురు జడ్జీల బదిలీ
-
విశాఖ పోలీస్ కమిషనరేట్ లో బదిలీల కలకలం
విశాఖ:నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో బదిలీల కలకలం చోటు చేసుకుంది. ఒకేసారి 14 మంది ఎస్ఐలను రేంజ్ కి సరెండర్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా కలవరం మొదలైంది. తాజా బదిలీలన్నీ ట్రాఫిక్, లాండ్ అండ్ ఆర్డర్ విభాగంలో ఉండే అవకాశం ఉంది. -
భారీగా ఐఏఎస్‌ల బదిలీ
-
భారీగా ఐఏఎస్‌ల బదిలీ
22 మందికి స్థానచలనం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిపాలన పీఠాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకేసారి 22 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్లో వున్న పలువురికి కొత్త పోస్టింగ్‌లు కేటాయించింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. రాష్ర్ట విభజనలో భాగంగా ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి ఉన్న వారిలో ఓ అధికారిని రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ రాజీవ్ శర్మ ఆదివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అందరూ ఊహించినట్లే పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్రను కీలకమైన ఆర్థిక శాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.నాగిరెడ్డిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. ఇక సుదీర్ఘ కాలంగా సాధారణ పరిపాలన శాఖలో రాజకీయ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ మిశ్రాను రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. అఖిల భారత సర్వీసు అధికారుల పంపకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాల్సి ఉన్న వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యను రిలీవ్ చేయడం గమనార్హం. అయితే, ఏపీ కేడర్‌కు వెళ్లాల్సి ఉన్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్‌కు పరిశ్రమల శాఖ బాధ్యతలను అదనంగా అప్పగించింది. కాగా, మంత్రి కేటీఆర్ ఒత్తిడి మేరకు ఆ శాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్‌ను తప్పించిన ప్రభుత్వం ఆయన స్థానంలో టీఎస్ఐఐసీ వైస్‌చైర్మన్ జయేశ్ రంజన్‌ను నియమించింది. ఆయన స్థానంలో టీఎస్ఐఐసీ వైస్చైర మన్, ఎండీగా ఆ సంస్థ ఈడీ ఎ.వి. నరసింహరెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన సమాచార, ప్రజా సంబ ధాల శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్‌ను కీలకమైన ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు. ఇక అజయ్ మిశ్రాసతీమణి శాలినీ మిశ్రాకు ప్రతిష్టాత్మక వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. తుది కేటాయింపుల్లో తెలంగాణకు వచ్చిన వికాస్‌రాజ్‌కు సాధారణ పరిపాలన శాఖలో రాజకీయ కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది. -
33 మంది ఎస్ఐల బదిలీ
నల్లగొండ క్రైం: జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 33 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి భారీ ఎత్తున ఎస్ఐలకు స్థాన చలనం జరగడం పోలీస్‌శాఖలో చర్చనీయాంశమైంది. బదిలీ అయిన ఎస్ఐలు వెంటనే విధుల్లో చేరాలని ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. -
వైద్యమో.. రామచంద్రా!
రిమ్స్ క్యాంపస్: రాత్రి 9 గంటలు: జాతీయ రహదారిపై పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను 108లో రిమ్స్‌కు తీసుకొచ్చారు,9:20: డ్యూటీలో ఉన్న క్యాజువాల్టీ డాక్టర్ వారిని పరిశీలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో సంబంధిత వైద్యులను ఫోన్ చేసి పిలిచారు.9:45: వైద్యులు హుటహుటిన రిమ్స్‌కు చేరుకుని వైద్య సేవలందించి క్షతగాత్రుల ప్రాణాలు కాపాడారు...వారు స్థానికంగానే నివసిస్తున్న రెగ్యులర్ వైద్యులు కావడం వల్లే అత్యవసర సమయంలో క్షణాల్లో ఆస్పత్రిలో వాలిపోయి చికిత్స అందించారు. ప్రాణాలు పోకుండా కాపాడారు. మిగతా వైద్యుల్లో చాలా వరకు విశాఖ, తదితర దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నవారే. ఈ రెగ్యులర్ వైద్యుల సేవలు 20 రోజుల్లో దూరం కానున్నాయి. చుట్టపుచూపు వైద్యమే గత్యంతరం కానుంది. అదేంటి అంటారా.. 785 జీవోతో షాక్ జిల్లాకే తలమానికంగా ఉన్న రిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న ఐదేళ్లకుపైగా సర్వీసు ఉన్న వైద్యులను బదిలీ చేయనుండటంతో వైద్యం కోసం డాక్టర్లను వెత్తుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడనుం ది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 785 ప్రకారం రాష్ట్రంలో వైద్య కళాశాలలను ఎ, బి, సి కేటగిరీలుగా విభజించారు. వీటిలో ఐదేళ్లకుపైగా ఒకేచోట పని చేస్తున్న వైద్యులను బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ ప్రకారం చూస్తే పాత జిల్లా కేంద్ర ఆస్పత్రి నుంచి ప్రస్తుత రిమ్స్‌లోనూ కొనసాగుతున్న 17 మంది రెగ్యులర్ వైద్యులు ఈ కోవలోకి వస్తారు. దాంతో వీరి బదిలీకి రంగం సిద్ధమైంది. వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ బదిలీల ఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే సెమీ అటానమస్ సంస్థగా ఉన్న రిమ్స్ కళాశాల వైద్యులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఏళ్ల నుంచి స్ధానికంగా ఉంటూ రాత్రి పగలు అన్న తేడా లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్న రెగ్యులర్ డాక్టర్లను బదిలీ చేయాలన్న నిర్ణయం చర్చనీయాంశమైంది. విశాఖ వైద్యులు వస్తే అంతే.. ఈ 17 మంది వైద్యులను బదిలీ చేస్తే వారి స్థానంలో ఎక్కువ మంది విశాఖపట్నం నుంచే వచ్చే అవకాశముంది. విశాఖ ఆంధ్రా మెడికల్ కళాశాలల్లో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వైద్యులను కూడా బదిలీ చేయనుండటమే దీనికి కారణం. వారు తమ అప్షన్‌గా అత్యంత చేరువలో ఉన్న శ్రీకాకుళం రిమ్స్‌నే ఎంచుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే విశాఖ నుంచి బదిలీపై వచ్చే వారు స్థానికంగా ఉండే పరిస్ధితి లేదు. విశాఖపట్నంలో ఉన్నవారంతా ప్రైవే ట్ ఆస్పత్రుల్లో పని చేస్తుండటమో.. సొంతంగా క్లినిక్‌లు నడుపుకోవడమో చేస్తున్నారు. వారు ఇక్కడికి బదిలీ అయినా వాటిని వదులుకోకుండా రోజూ విశాఖ నుంచి రాకపోకలు సాగించడం తథ్యం. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిలో రిమ్స్‌లో పని చేస్తున్న చాలా మంది విశాఖ వైద్యులు స్ధానికంగా ఉండకుండా నిత్యం రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు స్థానిక వైద్యుల స్థానంలో విశాఖ డాక్టర్లు వస్తే.. దాదాపు వైద్యులందరూ అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. రోగులకు తిప్పలు తప్పవు. దీర్ఘకాలిక సెలవులు ఖాయం కాగా బదిలీ అయ్యే రెగ్యులర్ వైద్యులు లాంగ్‌లీవ్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటికీ కాదంటే రాజీనామాలు చేసేందకు కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెలిసింది. తమను బదిలీ చేయడం అన్యాయమన్న భావనలో ఉన్న వారు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం దారుణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి స్థానికంగా ఉంటూ ఏ సమయంలోనైనా వైద్య సేవలందిస్తున్న వైద్యులను బదిలీ చేయాలన్న నిర్ణయం ఎంతమాత్రం సమంజసం కాదు. ఇప్పటికే రిమ్స్‌లో అంతంత మాత్రంగా సేవలందుతున్నాయన్న చెడ్డపేరుంది, ప్రభుత్వ నిర్ణయంతో రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముంది. పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని స్థానికంగా ఉంటున్న వైద్యుల బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. -డాక్టర్ అప్పలనాయుడు, డాక్టర్ లూకలపు ప్రసన్నకుమార్, ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు -
ఉండగానే దండుకుందాం..
సాక్షి, కాకినాడ : ‘దీపం’ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు జిల్లా అధికారులు. సార్వత్రిక ఎన్నికల సమయంలో పనిచేసిన అధికారులందరికీ బదిలీ తప్పదని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలిచ్చింది. పైగా జిల్లాస్థాయిలో పనిచేస్తున్న అధికారులందరూ రెండేళ్లకు పైబడి ఇక్కడ పనిచేస్తున్న వారే. దీంతో ఉండగానే దండుకోవాలన్నట్టు.. పలువురు అధికారులు ఆర్జన కోసం ఆరాటపడుతున్నారు. సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. సెప్టెంబర్ 3 నుంచి నెలాఖరు వరకు బదిలీలకు పచ్చజెండాఊపింది. సాధారణంగా నియామకం జరిగిన తర్వాత రెండేళ్ల వరకు బదిలీలకు అవకాశాలుండవు. క్లరికల్ స్థాయి ఉద్యోగులు, సిబ్బందినైతే కనీసం మూడేళ్లు కొనసాగిస్తుంటారు. తాజా బదిలీలకు ప్రత్యేక మార్గదర్శకాలంటూ లేనందున క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు జిల్లాస్థాయి అధికారులు కూడా పెద్ద సంఖ్యలోనే బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు ఇక్కడే కొనసాగాలని ప్రజాప్రతినిధుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. కొందరు రాజధానిలో మకాం వేసి ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమకు ఎలాగూ బదిలీ వేటు తప్పదన్న భావనతో పలువురు జిల్లాలోనే ఉండి దండుకునే పనిలో పడ్డారు. బదిలీ తప్పని పలువురు జిల్లాస్థాయి అధికారులు తాత్కాలిక రాజధాని(విజయవాడ) వైపు చూస్తున్నారు. బదిలీల్లో జోక్యం వలదన్న బాబు.. సార్వత్రిక ఎన్నికల సమయంలో జిల్లాలో పనిచేసిన అధికారులను బదిలీ చేసి కొత్త టీమ్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఇప్పటికే జిల్లా నేతలకు టీడీపీ అధినేత హుకుం జారీ చేశారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవద్దని, సిఫార్సు లేఖలు ఇవ్వవ ద్దని బాబు జిల్లా నేతలకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. దీంతో జిల్లాలో పనిచేసే వారిని వెనకేసుకొచ్చేకంటే కొత్తగా వచ్చే వారి నుంచే దండుకుంటే మేలన్న ధోరణిలో వారున్నట్టు కనిపిస్తోంది. ఏదేమైనా ఈ నెలాఖరుతో తమకు స్థానచలనం తప్పదని తెలియడంతో పలువురు అధికారులు అందినంత దండుకోవాలని ఆరాటపడుతున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను చకచకా మంజూరు చేయడంతో పాటు అప్రూవల్స్, పర్మిట్లు, అనుమతులు, లెసైన్సుల జారీల్లో ఉదారంగా వ్యవహరిస్తూ భారీగానే దండుకుంటున్నట్టు తెలుస్తోంది. గతేడాది మంజూరు కానిబిల్లులను సాధారణంగా ఇచ్చే పర్సంటేజ్‌ల కంటే ఎక్కువగా ఇస్తే చాలు మంజూరు చేస్తామని అడిగి మరీ చేతులో పెడుతున్నారని పలువురు కాంట్రాక్టర్లు చెబుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. కొన్ని శాఖల అధికారులు ఏదైనా ఫైలు తమ టేబుల్‌పైకి వస్తే చాలు క్షణాల్లో క్లియర్ చేస్తూ పర్సంటేజ్లను ముక్కుపిండి వసూలు చేసుకుంటున్నారు. ‘ఇల్లు చక్కబెట్టుకోవడమే’ఇప్పుడు వారి డ్యూటీ వివిధ శాఖల్లో డివిజన్, మండల స్థాయిల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడినట్టు కనిపిస్తోంది. మరోనాలుగైదురోజుల్లో బదిలీలపై మార్గ దర్శకాలు జారీ కాగానే తొలుత జిల్లా అధికారులకు, తర్వాత జిల్లా పరిధిలో బదిలీలకు షెడ్యూల్ విడుదలయ్యే సూచనలున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడి చాక బదిలీలు గతంలో ఎన్నడూ చేయలేదని, తక్షణం బదిలీలను నిలుపుదల చేయాలని ఇప్పటికే జేఏసీ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయినా ఎన్నికల సమయంలో పని చేసిన వారందరినీ కదపాల్సిందేనన్న పట్టుదలతో అధికార పార్టీ పెద్దలున్నారు. ఏదేమైనా వచ్చే నెలలో జిల్లాలో అధికారులు మూడో వంతు బదిలీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అక్టోబర్ నుంచి కలెక్టర్, జేసీ స్థాయి అధికారులతో పాటు పూర్తిగా కొత్తవారు జిల్లాకు రానున్నారని చెబుతున్నారు. -
‘బదిలీ’ లొల్లి..!
సాక్షి, న్యూఢిల్లీ:ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ అధికారిగా ఉన్న సంజీవ్ చతుర్వేదిని తొలగించడం వివాదాస్పదంగా మారింది. అవినీతి క్యాన్సర్‌పై పోరాటం చేస్తానని ప్రధాని ప్రకటిస్తుండగా, అనేక కుంభకోణాలను బయటపెట్టి నిజాయితీపరుడిగా పేరుతెచ్చుకున్న అధికారిని హఠాత్తుగా పదవి నుంచి తొలగిస్తూ ఆరోగ్య మంత్రిత్వశాఖ తీసుకున్న నిర్ణయం విమర్శల పాలైంది.బీజేపీకి చెందిన ఓ ప్రముఖ నేత చెప్పడం వల్ల తనను బదిలీచేశారని సంజీవ్ చతుర్వేది అంటున్నారు. ఆయన తన బదిలీని వ్యతిరేకిస్తూ ఆరోగ్య శాఖ కార్యదర్శికి లేఖ రాయడమేకాక లేఖప్రతులను ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపారు. బీజేపీకి చెందిన ఓ ప్రముఖ నేత వ్యక్తిగత వైద్యుని సలహా మేరకు తనను పదవి నుంచి తొలగించారని, ఆ వైద్యునిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై తాను దర్యాప్తు చేయడమే ఇందుకు కారణమని చతుర్వేది ఆ లేఖలో పేర్కొన్నారు.వాస్తవానికి 2016 జూలై వరకు చతుర్వేది సీవీవో పదవిలో కొనసాగాల్సి ఉంది. అయితే ఆయనను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు బుధవారం ఉత్తర్వులు అందాయి. ఆరోగ్యశాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న విశ్వాస్ మెహతాను చతుర్వేది స్థానంలో మూడు నెలల పాటు సీవీవోగా నియమించారు. ఎయిమ్స్‌కు చెందిన పలువురు ఉన్నతాధికారులు, ఫ్యాక్టల్టీ సభ్యులపై అవినీతి కేసులను దర్యాప్తు చేయడంవల్ల చతుర్వేదిని తొలగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.కాగా, చతుర్వేది బదిలీ వెనుక బిజెపి ప్రధాన కార్యదర్శ జె.పి.నడ్డా హస్తముందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. హర్యానా కేడర్‌కు చెందిన 2002 బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ అధికారి అయిన సంజీవ్ చతుర్వేదికి రాజకీయ నాయకుల వ్యతిరేకత , బదిలీలు కొత్త కాదు. ఐదేళ్లలో ఆయనను 12 సార్లు బదిలీ అయ్యారు. ఎయిమ్స్‌లో సీవీవోగా ఆయన జూన్ 2012లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాలుగేళ్లపాటు ఆ పదవిలో కొనసాగేందుకు వీలు కల్పిస్తూ నియామక ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.గత రెండేళ్లలో ఎయిమ్స్‌లో జరిగిన అనేక అవకతవకలను చతుర్వేది బయటపెట్టారు. దాంతో అక్కడి నుంచి ఆయనను తొలగించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. అత్యంత నిజాయితీపరుడైన చతుర్వేదిని పదవిలో కొనసాగించాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించడంతో పార్లమెంటరీ కమిటీతో పాటు ప్రధాని కార్యాలయం ఆయనను పదవిలో కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేశాయి . చతుర్వేదిని తొలగించడానికి తీసుకునే నిర్ణయమేదైనా ఉంటే దానిని క్షుణంగా పరిశీలించాలని కేబినెట్ సెక్రటరీని ఆదేశించడమే కాక ఈ విషయాన్ని పీఎంఓకు తెలియచేయాలని ప్రధాని కార్యాలయం గత నవంబర్‌లో ఉత్తర్వు జారీ చేసింది. అయితే ఈ విషయాలన్నింటినీ బేఖాతరు చేస్తూ చతుర్వేదిని బదిలీచేస్తూ ఆరోగ్యశాఖ మంత్రిత్వశాఖ బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. బీజేపీ జనరల్ సెక్రటరీ జెపి నడ్డా ఏడాదిగా సీవీవో పదవి నుంచి చతుర్వేదిని తొలగించడానికి యత్నిస్తున్నారని, ఆయన ఈ విషయమై గతంలో సిబ్బంది, శిక్షణ విభాగానికి కూడా రెండుసార్లు లేఖ రాశారని అంటున్నారు. ఎయిమ్స్‌లో సీవీవో పోస్ట్ లేదని, చతుర్వేది నియామకంలో అవకతవకలు జరిగాయని నడ్డా కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖ రాశారని బీజేపీ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉండగా చతుర్వేది బదిలీ వెనుక తన హస్తం లేదని నడ్డా వివరణ ఇచ్చుకున్నారు. కాగా, తాను దర్యాప్తు చేసిన అవినీతి కేసులను సిబిఐకి అప్పగించాలని ప్రధానికి రాసిన లేఖలో చతుర్వేది సూచించారు. అలాగే ప్రధాన కార్యాలయం, పార్లమెంటరీ కమిటీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తన బదిలీకి ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని ఆయన డిమాం డ్ చేశారు. చతుర్వేది రాసిన ఈ లేఖ ఎయిమ్స్‌తో పాటు ఆరోగ్య మంత్రిత్వశాఖలో కలకలం సృష్టిం చింది. ప్రస్తుతం చతుర్వేది సెలవుపై ఉన్నారు. ఇదిలా ఉండగా, ఎయిమ్స్ సీవీవోగా చతుర్వేది ఎయిమ్స్‌లో వెలికి తెచ్చిన కుంభకోణాలపై సీబీఐ విచారణకు ఉపక్రమించింది. చతుర్వేది వెలికితెచ్చిన కుంభకోణాల్లో సెక్యూరిటీ గార్డులు, నకిలీ సిబ్బంది నియామకాలు, మందుల కొనుగోలులో జరుగుతోన్న అవకతవకలు వంటివి ఉన్నాయి, స్పెషాలిటీ క్యాన్సర్ సెంటర్లో ఓ అడిషనల్ డైరక్టర్ తన పెంపుడుకుక్కకు ఆపరేషన్ చేయించిన వైనం కూడా ఆయన దర్యాప్తులో బయటపడింది. చతర్వేది బదిలీని ప్రశ్నించిన ఆప్: సంజీవ్ చతుర్వేదిని బదిలీచేయడాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది.. నిజాయితీపరుడైన అధికారిని ఎందుకు బదిలీచేశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ చర్యను ప్రశ్నించింది. ఈ బదిలీ అక్రమమని ఆరోపించింది. -
బదిలీ మాటున ‘బద్లా’
సాక్షి, కాకినాడ : పగ్గాలు చేపట్టి రెండునెలలు కూడా కాకుండానే ‘బద్లా’ (కక్ష సాధింపు) చర్యలు మొదలెట్టారు తెలుగుదేశం నేతలు. స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదన్న అనుమానంతో పలువురు ఉద్యోగులపై బదిలీ వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తం అధికార యంత్రాంగం తమ చెప్పుచేతల్లో ఉండేలా చేసుకోవడానికి తహతహలాడుతున్నారు. ఇందుకు సంబంధించి మరో వారం రోజుల్లో మార్గదర్శకాలు జారీ కానుండగా.. నెలాఖరులో ఈ తంతు పూర్తి చేయాలని టీడీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. అధికారులు, ఉద్యోగుల పిల్లల విద్యాభ్యాసానికి ఇబ్బందులు తలెత్తవన్న భావనతో ఏటా సాధారణ బదిలీలు మే లేదా జూన్‌లో జరుగుతుంటాయి. ఆ తర్వాత ఏవైనా అత్యవసర పరిస్థితులు, వివాదాలు, ఆరోపణలు, కేసుల్లో ఇరుక్కుంటే తప్ప బదిలీలుండవు. అయితే టీడీపీ సర్కారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండునెలల తర్వాత ఆగస్టులో బదిలీలకు సన్నద్ధమవడం వివాదాస్పదమవుతోంది. సాధారణంగా కనీసం రెండేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారిని మాత్రమే బదిలీలకు పరిగణనలోకి తీసుకావాలి. కానీ చరిత్రలో తొలిసారిగా జీర్ బేస్డ్ సర్వీస్ (పని చేసిన కాలంతో పనిలేకుండా) ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శి నుంచి ప్రిన్సిపల్ కార్యదర్శుల వరకు బదిలీ చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. అంతేకాక ఒక శాఖలో బదిలీ అయ్యే వారు 20 శాతానికి మించకూడదన్న నిబంధనను కూడా పక్కన పెడుతోంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమైనందున తమను బదిలీ చేస్తే విద్యాప్రమాణాలు కుంటుపడతాయని ఉపాధ్యాయులు చెపుతున్నందున వారిని బదిలీల నుంచి మినహాయించింది. కనీసం 10 వేల మందికి స్థానచలనం! మిగిలిన అన్ని శాఖల్లో పై నుంచి కింద స్థాయి వరకు అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు వేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేయలేదని భావిస్తున్న వారి జాబితాలను అధికార పార్టీ ప్రజాప్రతినిధుల శాఖలవారీగా ఇప్పటికే సిద్ధం చేశారు. జిల్లాలో 56 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా, వీరిలో సుమారు పాతికవేల మంది ఉపాధ్యాయులు. వారిని మినహాయిస్తే మిగిలిన 31 వేల మందిలో కనీసం 10 వేల నుంచి 15 వేల మంది వరకు బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, స్త్రీ,శిశుసంక్షేమం, వ్యవసాయం, వైద్య, ఆరోగ్యం, ఉపాధిహామీ, మత్స్య శాఖల సిబ్బందిపై వేటుపడే అవకాశాలు ఉన్నాయి. తొలుత జిల్లా, డివిజన్ స్థాయిలలో, తర్వాత మండలస్థాయిలో పనిచేసే తహశీల్దార్, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, ఎఫ్డీఓ, ఎస్సైలు, చివరగా గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు.. ఇలా అన్నిస్థాయిల్లోనూ బదిలీల కుదుపు తప్పదనిపిస్తుంది. ఇప్పటికే కలెక్టర్, జేసీల బదిలీ తప్పదని ప్రచారం సాగుతోంది. వారి బదిలీ తర్వాత వరుసగా బదిలీ లుంటాయని చెబుతున్నారు. విద్యాప్రమాణాలు కుంటుపడతాయని కోరగానే ఉపాధ్యాయులను బదిలీల నుంచి మినహాయించిన ప్రభుత్వం తమ పిల్లలను వేలకు వేలు ఫీజులు కట్టి పాఠశాలల్లో చేర్పించి రెండున్నర నెలలు కావస్తుండగా ఇప్పుడు బదిలీ వేటు వేయాలని చూడడం ఎంతవరకు సమంజసమని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇ ప్పటికిప్పుడు తాము వేరే ప్రాంతాలకు వెళితే పిల్లలకు అడ్మిషన్లే కా దు.. అద్దెకు ఇళ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఎవరు అధికారంలోకొచ్చినా వారి ప్రాధాన్యతలకనుగుణంగా పనిచేస్తాం తప్ప ఏ పార్టీకీ కొమ్ము కాయమని చెబుతున్నా రు. అకాలపు బదిలీలు కక్షసాధింపే తప్ప మరొకటి కాదని అంటున్నా రు. ఇకనైనా ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అభ్యర్థిస్తున్నారు. -
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎన్.శ్రీధర్
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఎన్.శ్రీధర్, నిజామాబాద్ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్‌గా డి.వెంకటేశ్వరరావు, పోలీసు రిక్రూట్మెంట్ ఐజీగా బి.బాలనాగదేవి, హోంగార్డ్స్ డీఐజీగా జె.అజయ్ కుమార్, పరిపాలన డీఐజీగా డి.కల్పనానాయక్, గోదావరిఖని ఏఎస్పీగా కె.ఫకీరప్పలను నియమిస్తున్నట్లు జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. తూనికలు, కొలతల కంట్రోలర్‌గా ఎస్.గోపాల్‌రెడ్డి, అంబర్‌పేట సీపీఎల్ కమాండెంట్‌గా మహేంద్రకుమార్ కొనసాగనున్నారు. -
ముగ్గురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, బెంగళూరు : ముగ్గురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీజాపురజిల్లా డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రిత్విక్ రంజనమ్ పాండేను సర్వే సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ కమిషనర్‌గా, రాష్ట్ర ఆర్థికశాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న డి.రణదీప్‌ను బీజాపుర జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖలోనే డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దీప్తి ఆదిత్య కనాడేని ఆర్థిక శాఖలోని (బి అండ్ ఆర్) విభాగానికి డిప్యూటీ కమిషనర్‌గా నియమించింది. బెంగళూరులోని అటల్ జనస్నేహి కేంద్ర డెరైక్టర్‌గా రిత్విక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది. బెంగళూరు సిటీ సౌత్ డివిజన్ విభాగానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెచ్.ఎస్.రేవణ్ణను కర్ణాటక లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విభాగానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
అధికార రాజకీయం!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న కక్కుర్తి రాజకీయాలకే కాదు.. అధికార యంత్రాంగానికీ పాకింది. అసలే రాష్ట్రంలో ప్రభుత్వం లేదు.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందో తెలీదు. ఎన్నికల వేళ జిల్లాపై పెత్తనమంతా అధికార యంత్రాంగానిదే.. నిధులూ విధులూ అన్నీ వారి కనుసన్నల్లో సాగాల్సిందే. సరిగ్గా ఇదే అంశం జిల్లా అధికార యంత్రాంగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెర తీసింది. కీలక స్థానాలన్నింటిలోనూ తనవాళ్లే ఉండాలన్న వ్యూహంతో ఓ ఉన్నతాధికారి పావులు కదుపుతున్నారు. దాని ఫలితమే జిల్లా పరిషత్తు సీఈవో కైలాస గిరీశ్వర్ ఆకస్మిక బదిలీ. ఈ ఒక్కటే కాదు.. ఇటీవల జిల్లాలో మరో ఇద్దరు ఉన్నతాధికారుల పోస్టింగులు కూడా వివాదాస్పదమయ్యాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా పరిషత్తు సీఈవో కైలాస్ గిరీశ్వర్ను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసింది. ఆయ న్ను బదిలీ చేస్తున్నట్లు మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయనకు ప్రస్తుతానికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జి సీఈవోగా ఉన్న ఇ.నాగార్జున సాగర్‌ను జిల్లా జెడ్పీ కొత్త సీఈవోగా నియమించారు. ఎన్నికల వేళ ఈ బదిలీ సాధారణం అనుకోవడానికి లేదు. జిల్లా అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చనీయాంశమైన ఈ బదిలీ జెడ్పీ కేంద్రంగా కొంతకాలంగా ఉన్నతాధికారుల మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధానికి పరాకాష్ట. జెడ్పీని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఓ ఉన్నతాధికారి భావించడమే దీనికి ప్రధాన కార ణం. ఇందుకోసం తెరవెనుక చాలా తతంగమే నడిచింది. అందులో కొన్ని కీలక ఘట్టాలు ఏమిటంటే.. ఇటీవల జెడ్పీ పరిధిలోని పంచాయతీ కార్యదర్శుల పోస్టులను క్రమబద్ధీకరించారు. ఈ వ్యవహారంలో ఆర్థిక అంశాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. పం చాయతీ కార్యదర్శుల నుంచి కొంత మొత్తం చొప్పున వసూలు చేయాలని ఓ ఉన్నతాధికారి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దానికి మరోఅధికారి అంగీకరించ లేదు. దాంతో ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. జెడ్పీ జనరల్ నిధులతో ఫర్నిచర్ కొనుగోలు అంశం కూడా జిల్లా ఉన్నతాధికారుల మధ్య చిచ్చు పెట్టింది. పదో తరగతి పరీక్ష కేంద్రాల కోసం రూ.4 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు చేయాలని ఉన్నతాధికారి భావించారు. కేంద్రమంత్రి కృపారాణి అనుచరుడు టెక్కలిలో నిర్వహిస్తున్న ఫర్నిచర్ దుకాణం నుంచే వీటిని కొనుగోలు చేయాలని సూచించారు. రూ.4 కోట్ల విలువైన కొనుగోళ్లు ఏకమొత్తంగా జరపాలంటే టెండర్లు పిలవాలి. దాంతో టెండర్ ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు ఓ ఎత్తుగడ వేశారు. ఆ రూ.4 కోట్ల టెండరును చిన్న చిన్న భాగాలు చేసి అన్నింటినీ ఒకరికే అప్పగించాలన్నది పన్నాగం. అందుకోసం పరీక్ష కేంద్రాల హెడ్ మాస్టర్ల నుంచి ఫర్నిచర్ కోసం ప్రతిపాదనలు కోరారు. ఒక్కో పాఠశాలకు రూ.2 లక్షల ఫర్నిచర్‌ను టెక్కలిలో తాము సూచించిన ఏజెన్సీ నుంచి కొనేందుకు అనుమతి ఇస్తామని చెప్పారు. ఆ బిల్లులను జెడ్పీకి పంపించాలని సూచించారు. అలా చేస్తే టెండర్ ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా రూ.4కోట్ల కాంట్రాక్టును అస్మదీయుడికి కట్టబెట్టవచ్చు. తామూ కమీషన్లు దండుకోవచ్చని భావించారు. ఇందుకోసం జెడ్పీలో అందుబాటులో ఉన్న జనరల్ ఫండ్‌ను కేటాయించాలని ఉన్నతాధికారి చెప్పారు. అందుకు సీఈవో కైలాస్ గిరీశ్వర్ సమ్మతించలేదు. పస్తుతం జెడ్పీలో నిధులు లేవని, ఇతర నిధులు సర్దుబాటు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. దాంతో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు మరింత ముదిరాయి.ఇలా ఒక్కో అంశంలో ఉన్నతాధికారుల మధ్య విభేదాలు పెరగుతూ వచ్చా యి. సీఈవోను కాదని కిందిస్థాయి అధికారులతో జె డ్పీ వ్యవహారాలను చక్కబెట్టసాగారు. దాంతో ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రరూపు దాల్చింది. సీఈవో జెడ్పీ కార్యాలయానికి రావడం తగ్గించేశారు. దీన్నే అవకాశంగా తీసుకుని సీఈవోపై ఉన్నతాధికారి పంచాయతీరాజ్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చే శారు. ఆయన విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని చెప్పారు. ఆ నెపంతో సీఈవోను బదిలీ చేయిం చాలన్నది ఆయన ఎత్తుగడ. ఒక దశలో ఆయన్ను ప్రభుత్వానికి సరెండర్ చేయించాలని కూడా భావిం చినట్లు తెలుస్తోంది. అనుకున్నంతా అయ్యింది... సీఈవో గిరీశ్వర్ను బదిలీ చేశారు. అయి తే ఆయనకు ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చారా? అసలు బదిలీ చేశారా?? ప్రభుత్వానికి సరెండర్ చేశారా??? అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. మరికొన్ని అధికార స్థానాల్లోనూ!... జిల్లాలో ఇటీవల రెండు అధికార స్థానాల భర్తీ వ్యవహారం కూడా అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. జేసీగా రెండు నెలల క్రితం ఉషారాణిని ప్రభుత్వం నియమించినా ఆమె విధుల్లో చేరలేదు. జిల్లా అధికా ర యంత్రాంగంలో ఉన్న పరిస్థితిపై అవగాహన ఉ న్నందునే ఆమె జిల్లాకు వచ్చేందుకు సుముఖత చూప లేదని సమాచారం. దాంతో ఉషారాణికి ప్రభుత్వ మరో చోట పోస్టింగ్ ఇచ్చింది. టెక్కలి ఆర్డీవోగా ఈ నెల 12న ఎం.వెంకటేశ్వరరావు బాధ్యతలు స్వీకరిం చారు. కానీ అంతలోనే ఆయన్ను బదిలీ చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచ ఆర్డీవోగా ఉన్న ఎం.శ్యామ్‌ప్రసాద్‌ను టెక్కలి ఆర్డీవోగా నియమించారు. ఆయన మంగళవారం విధుల్లో చేరారు. ఇలా పది రోజుల్లోనే ఆర్డీవో బదిలీ కావడంపై కలకలం రేపింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార యంత్రాం గంలో మరెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో చూడాల్సిందే.! ‘ఫర్ సీఈవో’ సంతకం ఇటీవలి కాలంలో జెడ్పీకి సంబంధించిన పలు ఫైళ్లపై డిప్యూటీ సీఈవో రమేష్ సంతకాలు చేశారు. ‘ఫర్ సీఈవో’ పేరుతో సంతకాలు చేసేయడం వివాదాస్పదమైంది. దీన్ని సీఈవో కైలాస్ గిరీశ్వర్ ప్రశ్నిం చారు. తాను విధుల్లో ఉండగా ఎలా సంతకాలు చేస్తారని డిప్యూటీ సీఈవోను నిలదీసినట్లు తెలుస్తోంది. ఓ ఉన్నతాధికారి చెబితేనే అలా చేశానని ఆయన చెప్పినట్లు సమాచారం. దానిపై సీఈవో మనస్తాపం చెందారు. అలా పెట్టకూడదు ఈ విషయంపై సీఈవో కైలాస్ గిరీశ్వర్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా బదలీపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తాను విధుల్లో ఉండగా డిప్యూటీ సీఈవో ‘ఫర్ సీఈవో’ పేరుతో సంతకాలు చేయడం సరికాదన్నారు. ఆ విషయంపై ఆయన్ను ప్రశ్నించానని కూడా చెప్పారు. దీనిపై డిప్యూటీ సీఈవో రమేష్‌ను సంప్రదించగా ఆయన సరిగ్గా స్పందించలేదు. -కైలాస్ గిరీశ్వర్ -
హస్తానుసారం బదిలీలు!
జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న అధికారులను బదిలీ చేయాలని జారీ చేసిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను హస్తం పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ మేరకు పైరవీలు షురూ చేశారు. పక్క జిల్లాల్లో తమకు అనుకూలమైన అధికారులను జిల్లాకు రప్పించుకుని ఎన్నికలను గట్టెక్కాలని భావిస్తున్నారు. పోలీస్ శాఖలో తమకు అనుకూలమైన వారిని ఇప్పటికే బదిలీ చేయించుకున్నట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, విజయనగరం : దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారితో పాటు సొంత జిల్లాలో పనిచేసే అధికారులు పక్షపాతంతో వ్యవహరించవచ్చని భావించి, ఎన్నికలతో సంబంధం ఉన్న వారందరినీ బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కానీ, శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా అధికార పార్టీ నేతలు పైఎత్తులు వేస్తూ ఇతర జిల్లాల్లో ఉన్న తమ ఇష్టానుసారం కావలసిన అధికారులనే బదిలీపై రప్పించుకుంటున్నారు. సిఫారసుల లేఖతో దర్జాగా కావలసిన వారిని తెచ్చుకుంటున్నారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అధికార పార్టీ నేతల ఎత్తుగడలను గమనిస్తు న్న విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ దృష్టి సారించకపోతే ప్రస్తుతం చేస్తున్న బదిలీలకు సార్థకత ఉండదని వాపోతున్నాయి. మూడేళ్లు ఒకేచోట పనిచేసిన అధికారులు, సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులు ఎన్నికల సందర్భంలో తమ అనుకూల నేతలకు సానుకూలంగా పనిచేస్తున్నారన్న ఉద్దేశంతో ప్రతిసారి రెవెన్యూ, పోలీస్ అధికారుల్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఈసారి వారితో పాటు ఎంపీడీఓలను బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో బదిలీల పర్వం ప్రారంభమయింది. ఇన్నాళ్లూ పనిచేసిన అధికారులు ఎలాగూ వెళ్లిపోతున్నారని వారి స్థానంలో కావలసిన వ్యక్తులను రప్పించుకోవడానికి అధికార పార్టీ నేతలు ఆరాతీయడం మొదలుపెట్టారు. గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లి పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నంలో పనిచేస్తున్న వారిలో తమకు కావల్సిన అధికారులను గుర్తించి, వారితో సంప్రదింపులు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖలిచ్చి రప్పించుకుంటున్నారు. దీనికి ఉన్నతాధికారులు ఇతోధికంగా సాయపడుతున్నారు. జిల్లాలో 25 మం ది ఎంపీడీఓలు, 34 మంది తహశీల్దార్లు బదిలీపై వెళ్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులపై ఒత్తిడి చేసి వారి స్థానంలో తమకు కావల్సిన వారిని, కావల్సిన మండలాలకు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే మండలాల కేటాయింపుల జాబితా రానుంది. పోలీసుశాఖలో ఈ వ్యవహారం మరింత జోరుగా సాగుతోంది. ఇప్పటికే కార్యాచరణలోకి వచ్చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మం త్రుల సిఫారసుల లేఖ ఆధారంగానే సీఐ, ఎస్ఐల బదిలీలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలైతే అదే పనిలో నిమగ్నమయ్యారు. రేంజి అధికారులపై ఒత్తిడి చేసి పోస్టింగ్‌లు వేయించుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే విసృ్తత ప్రచా రం జరుగుతోంది. అనుకూల వ్యక్తులతో రానున్న ఎన్నికల్లో ఇష్టారీతిన వ్యవహరించేందుకు వ్యూహాత్మకంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి భాగోతాన్ని పసిగట్టిన విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఇప్పటి నుంచే అధికార పార్టీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారని వాపోతున్నాయి. -
ముగ్గురు సీఐల బదిలీ .
గుంటూరు, న్యూస్‌లైన్: గుంటూరు రేంజ్ పరిధిలోని ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సీసీఎస్ సీఐ బి.టి నాయక్‌ను ఒంగోలు వన్‌టౌన్‌కు, కనిగిరిలో పని చేస్తున్న పి.కరుణాకర్‌రావును ఒంగోలు సీసీఎస్‌కు, గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐ వి.సుధాకర్‌రావును ప్రకాశం జిల్లా కనిగిరికి బదిలీ చేశారు. కాగా మేడికొండూరు సీఐగా ఎవరినీ నియమించలేదు. బదిలీలపై విస్తృత చర్చ.. రేంజ్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరుగుతాయనే ఊహాగానాలకు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ చెక్‌పెట్టారు. దశల వారీగా బదిలీలు చేపడుతున్నారు. గతేడాది ఒక్కొసారిగా 40మంది సీఐలను బదిలీ చేసిన అప్పటి ఐజీ హరీష్‌కుమార్‌గుప్తా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలతో బదిలీల ప్రక్రియను సునిసితంగా పరిశీలించి నిర్వహిస్తున్నారు. రెండేళ్ల పాటు ఒకే చోట పని చేస్తున్న వారిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తొలుత వేటు వేసుకుంటూ వచ్చిన ఐజీ సునీల్‌కుమార్ కొన్ని ముఖ్యమైన సర్కిల్స్ పరిధిలో సమర్ధవంతమైన అధికారులను నియమించే పనిలో నిమగ్నమైనట్లు తాజాగా జరుగుతున్న బదిలీల ద్వారా తెలుస్తోంది. గుంటూరు అర్బన్ పరిధిలో ముగ్గురు సీఐలను గత నెలలో బదిలీ చేయగా తాజాగా ప్రకాశం జిల్లా కేంద్రంపై దృష్టి పెట్టారు. ఏడాదిలో మొత్తంగా 21మంది సీఐలను బదిలీ చేయగా ఈ జాబితాలో మరికొందరు ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.