ముగ్గురు సీఐల బదిలీ .
Published Thu, Nov 14 2013 11:43 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
గుంటూరు, న్యూస్‌లైన్: గుంటూరు రేంజ్ పరిధిలోని ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సీసీఎస్ సీఐ బి.టి నాయక్‌ను ఒంగోలు వన్‌టౌన్‌కు, కనిగిరిలో పని చేస్తున్న పి.కరుణాకర్‌రావును ఒంగోలు సీసీఎస్‌కు, గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐ వి.సుధాకర్‌రావును ప్రకాశం జిల్లా కనిగిరికి బదిలీ చేశారు. కాగా మేడికొండూరు సీఐగా ఎవరినీ నియమించలేదు. బదిలీలపై విస్తృత చర్చ.. రేంజ్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరుగుతాయనే ఊహాగానాలకు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ చెక్‌పెట్టారు.
దశల వారీగా బదిలీలు చేపడుతున్నారు. గతేడాది ఒక్కొసారిగా 40మంది సీఐలను బదిలీ చేసిన అప్పటి ఐజీ హరీష్‌కుమార్‌గుప్తా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలతో బదిలీల ప్రక్రియను సునిసితంగా పరిశీలించి నిర్వహిస్తున్నారు. రెండేళ్ల పాటు ఒకే చోట పని చేస్తున్న వారిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తొలుత వేటు వేసుకుంటూ వచ్చిన ఐజీ సునీల్‌కుమార్ కొన్ని ముఖ్యమైన సర్కిల్స్ పరిధిలో సమర్ధవంతమైన అధికారులను నియమించే పనిలో నిమగ్నమైనట్లు తాజాగా జరుగుతున్న బదిలీల ద్వారా తెలుస్తోంది. గుంటూరు అర్బన్ పరిధిలో ముగ్గురు సీఐలను గత నెలలో బదిలీ చేయగా తాజాగా ప్రకాశం జిల్లా కేంద్రంపై దృష్టి పెట్టారు. ఏడాదిలో మొత్తంగా 21మంది సీఐలను బదిలీ చేయగా ఈ జాబితాలో మరికొందరు ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
Advertisement