sunilkumar
-
‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి
బాపట్లటౌన్: విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్‌కుమార్ (36), అతని కొడుకు అనురాజ్ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్‌లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్‌గౌడ్ (35) మృతదేహాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశారు. అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామశివారులోని తుమ్మచెట్ల మధ్యలో ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అవన్నీ అపోహలే
మేకల కళ్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర ఆస్తులకు ఏపీ ల్యాండ్ టైట్లింగ్ చట్టం–2023 ద్వారా మరింత రక్షణ లభిస్తుందని భూ చట్టాల నిపుణులు, నల్సార్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఎం.సునీల్ కుమార్(భూమి సునీల్) స్పష్టం చేశారు. ఈ చట్టంపై ఉన్న అపోహలు, అనుమానాలు సత్యదూరమైనవన్నారు. ఈ చట్టం వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని భూములకు గ్యారంటీ లభిస్తుందన్నారు. ఈ గ్యారంటీకి ప్రభుత్వం సరి్టఫికెట్ ఇస్తుందని తెలిపారు.ఈ చట్టం భూముల రక్షణ కోసమే కానీ భక్షణ కోసం కాదని తేలి్చచెప్పారు. రాష్ట్రంలోని ప్రతి భూ యజమానికి హక్కుల గ్యారంటీ పత్రం వస్తే ఎక్కడెక్కడో ఉన్నవాళ్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లో భూములు కొంటారన్నారు. దీంతో పెట్టుబడులు పెరుగుతాయని, నేరాలు తగ్గుతాయని చెప్పారు. ఈ చట్టం కోర్టు ద్వారాలు మూయడం లేదని, ఆ కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం సంపూర్ణంగా అమల్లోకి వస్తే రైతులకు మంచి జరుగుతుందన్నారు. నలభై ఏళ్లుగా ఎలాంటి చట్టం రావాలని ఆశించామో, భూహక్కులకు ఎలాంటి భద్రత కలగాలని అనుకున్నామో అలాంటి చట్టం ల్యాండ్ టైట్లింగ్ చట్టమని తెలిపారు. ఇలాంటి చట్టంపై అపోహలను సృష్టించడం, వాటిని సమరి్థస్తూ మాట్లాడటం దురదృష్టకరమన్నారు.ఎవరూ చేయలేకపోయిన ఈ చట్టం కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం కారణంగానే అమల్లోకి వస్తోందన్నారు. ఇలాంటి చట్టాన్ని తేవాలని 1908లో రిజి్రస్టేషన్ల చట్టం, 1971లో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం రూపొందిస్తున్నప్పుడే అనుకున్నారన్నారు. ఈ మేరకు సునీల్ కుమార్ ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి సంబంధించి అనేక అనుమానాలను నివృత్తి చేశారు. ప్రశ్న: ప్రజల ఆస్తులు లాక్కోవడానికే ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తెచ్చిందా? సునీల్: ఈ చట్టం లక్ష్యమే ఆస్తులు లేదా భూములకు రక్షణ కల్పించడం, ప్రభుత్వం తరఫున గ్యారంటీ సరి్టఫికెట్ ఇవ్వడం. ఏదైనా తేడా వస్తే సదరు ఆస్తి లేదా భూమికి పరిహారం చెల్లించడం. లాక్కోవడం, లాక్కోవాలనుకోవడం ఈ చట్టం ద్వారానే కష్టమవుతుంది. అలాంటి వాళ్ల ఆటలు ఈ చట్టంతో సాగవు. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వస్తే భూముల యాజమాన్య పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంటాయా? సునీల్: ఇప్పటివరకు రైతుల చేతుల్లో భూమికి సంబంధించిన పాస్ పుస్తకం మాత్రమే ఉంది. ప్రభుత్వం చేతిలో ఆ భూమి రికార్డులు, సాగు వివరాలతో కూడిన అడంగల్ ఉన్నాయి. ప్రస్తుతం భూములకు సంబంధించి మొత్తం 40 రకాల రిజిస్టర్లు ఉన్నాయి. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇన్ని రిజిస్టర్లు ఉండవు.. ఒక్కటే రిజిస్టర్ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. ఈ రికార్డులుండే రిజిస్టర్‌కు అదనంగా ప్రభుత్వం యజమానులకు గ్యారంటీ సరి్టఫికెట్, యాజమాన్య పత్రంఅందజేస్తుంది. భూమికి సంబంధించిన అన్ని అసలు పత్రాలను యజమానులకే ఇస్తుంది. ప్రశ్న: ఇప్పటికే పాస్ çపుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు ఉన్నవారు కూడా ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చాక వారి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాలా? సునీల్: ఇది కూడా వాస్తవం కాదు. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర 1బీ రికార్డు ఉంది. భూముల సర్వే ద్వారా కొత్త రికార్డు తయారవుతుంది. ఈ రికార్డుల ఆధారంగా టైటిల్ రిజి్రస్టేషన్ అధికారి (టీఆర్వో) రిజిస్టర్ తయారు చేసి దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఇందులో ఏమైనా అభ్యంతరాలుంటే రెండేళ్ల పాటు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్పీళ్లను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ వివాదాలన్నీ పరిష్కారమయ్యాకే శాశ్వత రిజిస్టర్ రూపొందిస్తారు. రైతులు లేదా యజమానులు వెళ్లి వారి యాజమాన్య హక్కులను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వస్తే భూతగాదాల పరిష్కారం కోసం కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదా? సునీల్: ఇప్పుడున్న విధానం ప్రకారం రెవెన్యూ రికార్డుల్లో పొరపాట్లను రెవెన్యూ అధికారులే సరిదిద్దుతారు. యాజమాన్య వివాదాల కోసం మాత్రమే సివిల్ కోర్టులకు వెళుతున్నారు. కొత్త చట్టం వచ్చాక కూడా రెవెన్యూ రికార్డుల్లో మార్పుల కోసం జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఫోరంకు వెళ్లొచ్చు. యాజమాన్య వివాదాలుంటే హైకోర్టుకెళ్లొచ్చు. ప్రశ్న: కోర్టుల్లో కేసులు వేసేందుకు టీఆర్‌వోకు సమాచారమివ్వాలా? సునీల్: ఈ చట్టం కోర్టు ద్వారాలు మూయడం లేదు. అసలు కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తోంది. ఒకవేళ కోర్టులకు వెళ్లినా ఏళ్లతరబడి జాప్యం జరగదు. రికార్డులన్నీ పకడ్బందీగా ఉంటాయి. యాజమాన్య హక్కులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కాబట్టి కేసులు కూడా త్వరగా పరిష్కారమవుతాయి. ఒకవేళ ప్రభుత్వం ఇచి్చన గ్యారంటీ తప్పయితే సదరు రైతుకు పరిహారం లభిస్తుంది. ప్రశ్న: కొత్త చట్టం కింద భూహక్కుల నిర్ధారణ ఎవరు చేస్తారు? సునీల్: ఈ చట్టం ద్వారా ప్రతి గ్రామానికి టైటిల్ రిజిస్టర్ వస్తుంది. ఈ రిజిస్టర్‌లోని రికార్డులకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. ఏవైనా లావాదేవీలు జరిగినప్పుడు ఈ గ్యారంటీకి అనుగుణంగా రిజిస్టర్లో మార్పులు చేసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారులకు మాత్రమే ఉంటుంది. వారి అధికారాల ద్వారా జరిగిన మార్పుల్లో అభ్యంతరాలుంటే కోర్టుల్లో సవాల్ చేయొచ్చు. ప్రశ్న: కొత్త చట్టం ద్వారా వారసత్వ హక్కుల వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు? సునీల్: వారసత్వ హక్కుల్లో ఎలాంటి వివాదాలూ లేకపోతే టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్వో) చేస్తారు. వివాదం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందే. సివిల్ కోర్టు ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పును టీఆర్వో రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రశ్న: వందేళ్ల తర్వాత ఏపీలో జరుగుతున్న భూముల సర్వే ప్రాధాన్యత ఏంటి? సునీల్: వాస్తవానికి భూముల సర్వేలు ప్రతి 30 ఏళ్లకోసారి జరగాలి. ఏపీలో 1910 తర్వాత సర్వే రికార్డులు రూపొందాయి. ఇప్పుడు 110 ఏళ్ల తర్వాత సర్వే జరుగుతోంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చేందుకు భూముల సర్వేలే పునాది. ఇప్పుడు ఏపీలోని నాలుగువేల గ్రామాల్లో భూముల సర్వే జరుగుతోంది. సమస్యలు పరిష్కారమయ్యాకే సర్వే రికార్డులు రూపొందిస్తారు. ప్రశ్న: ఇలాంటి చట్టం ఎక్కడైనా అమల్లో ఉందా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల్లో అమల్లో ఉంది. ఆ్రస్టేలియా, కెనడా, బ్రిటన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు, ఆఫ్రికా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది. తద్వారా అక్కడి భూముల హక్కులకు భద్రత పెరిగింది. భూముల హక్కులకు గ్యారంటీ ఉంటే జీడీపీ పెరుగుతుందనే శాస్త్రీయ లెక్కలున్నాయి. ప్రశ్న: ఇది కేంద్ర చట్టమా? రాష్ట్ర ప్రభుత్వ చట్టమా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం కోసం 1987లో ప్రొఫెసర్ డి.సి.వాధ్వా ఏకసభ్య కమిషన్‌ను ప్రణాళికా సంఘం నియమించింది. ఈ కమిటీ 1989లో టైటిల్ గ్యారంటీ చట్టం అమలును సిఫారసు చేస్తూ నివేదిక ఇచి్చంది. ఆ తర్వాత 2008లో కేంద్రం ఈ విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. 2008, 2011, 2015, 2019లో నాలుగుసార్లు ఇందుకు సంబంధించిన ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపారు. 2019లో నీతి ఆయోగ్ కమిటీ కొత్త ముసాయిదాను రాష్ట్రాలకు పంపింది. ఈ చట్టాన్నయినా లేదంటే మహారాష్ట్రలో అమల్లో ఉన్న చట్టాన్నయినా, లేదంటే ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఈ చట్టాల్లో మార్పులు చేసుకుని కొత్త చట్టం చేసుకోవాలని సూచించింది. ప్రశ్న: కొత్త చట్టం ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచి్చందా? సునీల్: ఇంకా అమల్లోకి పూర్తిస్థాయిలో రాలేదు. చట్టం అమల్లోకి తెస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఇందుకు సంబంధించిన నిబంధనలు తయారు కావాలి. ఆ తర్వాతే చట్టం అమల్లోకి వస్తుంది. ప్రశ్న: కొత్త చట్టం వల్ల రైతులకు జరిగే మేలు ఏమిటి? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూముల హక్కులపై స్పష్టత, భద్రత, భరోసా వస్తాయి. సమస్యల పరిష్కారం, లావాదేవీల బదలాయింపు సులభమవుతుంది. ఇప్పుడు ఉన్న రికార్డులు, చట్టాలు హక్కుల నిరూపణలకు అంతిమ సాక్ష్యాలు కావు. ఇవన్నీ తెచ్చే ప్రయత్నంలో భాగంగా కొత్త చట్టం వచి్చంది. ఇది తప్పకుండా రైతులకు మేలు చేసే చట్టమే. ఈ చట్టం అమలులో ఇబ్బందులను అధిగమించగలిగితే ఏపీలోని ప్రతి రైతుకు మేలు జరుగుతుంది. ప్రతి భూమికి, ఆస్తికి రక్షణ లభిస్తుంది. ప్రశ్న: ఈ చట్టం అమల్లోకి వస్తే ఇప్పటికే ప్రజల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లకుండా పోతాయా? సునీల్: చెల్లకుండా పోవడానికి ఇవేమీ రాత్రికి రాత్రి ప్రకటించిన నోట్ల రద్దు కాదు. జాతీయ స్థాయిలో చర్చించి ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్ లాంటివి సిఫారసు చేసిన చట్టం. అసెంబ్లీలో చర్చించి ఆమోదించిన చట్టం. ఒకేరోజు చెల్లకుండా పోవు. రాష్ట్రమంతటా ఈ చట్టం ఒక్కరోజే అమల్లోకి రాదు. భూముల సర్వే తర్వాత అభ్యంతరాలను పరిష్కరించాక తుది రిజిస్టర్ రూపొందించిన ప్రదేశాల్లో కాలాను క్రమంగా చట్టం అమల్లోకి వస్తుంది. అప్పటివరకు రైతుల వద్ద ఉన్న పాస్ పుస్తకాలు, రిజిస్టర్డ్ దస్తావేజులు చెల్లుబాటులోనే ఉంటాయి. ఒక్కసారి తుది రిజిస్టర్ ద్వారా ప్రభుత్వం టైటిల్ గ్యారంటీ ఇచ్చాక మాత్రమే పాత రికార్డులు చెల్లవు. ప్రశ్న: భూహక్కులకు సంబంధించి వందల చట్టాలు అమల్లో ఉండగా ఈ కొత్త చట్టం ఎందుకు? సునీల్: భూరికార్డులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 124 చట్టాలు అమల్లో ఉన్నాయి. ఈ చట్టాలేవీ ఇవ్వని భరోసా కొత్త చట్టం ఇస్తుంది. ఆర్వోఆర్ చట్టం ద్వారా కేవలం రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులకు గ్యారంటీ ఉండదు. కానీ కొత్త చట్టం హక్కులకు గ్యారంటీ ఇస్తుంది. ప్రశ్న: ఈ చట్టం వ్యవసాయ భూములకేనా? వ్యవసాయేతర ఆస్తులకు కూడా వర్తిస్తుందా? సునీల్: ల్యాండ్ టైట్లింగ్ చట్టం అన్ని రకాల భూములు, ఆస్తులకు వర్తిస్తుంది. గతంలో వ్యవసాయ భూముల రికార్డులు రెవెన్యూ శాఖ దగ్గర ఉంటే.. ఆస్తుల వివరాలు స్థానిక సంస్థల వద్ద ఉండేవి. ఇప్పుడు ఈ చట్టం అమల్లోకి వస్తే అన్ని భూములు, ఆస్తులకు ఒకటే రిజిస్టర్.. ఒకటే మ్యుటేషన్. ప్రశ్న: కొత్త చట్టం అమల్లోకి వచ్చాక రిజి్రస్టేషన్ల వ్యవస్థలో ఎలాంటి మార్పులు వస్తాయి? సునీల్: భూ రిజి్రస్టేషన్ల వ్యవస్థలో ఈ చట్టం ద్వారా ప్రధాన మార్పులు వస్తాయి. ఇప్పటివరకు స్టాంపు కాగితాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అత్యంత భద్రతతో ప్రభుత్వ గ్యారంటీతో కూడిన డాక్యుమెంట్లు వస్తాయి. హక్కులను కూడా టీఆర్‌వోనే బదలాయిస్తాడు కాబట్టి మ్యుటేషన్ అవసరముండదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పటివరకు డీడ్స్ రిజి్రస్టేషన్ జరగ్గా ఇక నుంచి టైటిల్ రిజి్రస్టేషన్ జరుగుతుంది. ప్రశ్న: ఈ చట్టం అమలు పట్ల న్యాయవాదులకున్న అభ్యంతరాలేంటి? సునీల్: ఈ చట్టం అమల్లోకి వస్తే భూముల లిటిగేషన్లు తగ్గిపోతాయి. కోర్టుల్లోఉన్న కేసుల్లో 66 శాతం భూ వివాదాల కేసులే. చట్టం అమల్లోకి వస్తే అది 10 శాతానికి తగ్గిపోతుంది. భూవివాదాల పరిష్కారం వల్ల నేరాలు కూడా తగ్గిపోతాయి. దీంతో సివిల్ కేసుల కోసం ప్రజలు కోర్టులకు వెళ్లాల్సినఅవసరం ఉండదేమో. ప్రశ్న: ప్రభుత్వం కొత్తగా జారీ చేస్తున్న పాస్ పుస్తకాలపై ముఖ్యమంత్రి బొమ్మ ముద్రించకూడదా? సునీల్: కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం గ్యారంటీతో ఇస్తుంది. ఈ పుస్తకాల ద్వారా రైతు లేదా భూ యజమానికి పంట సాయం వస్తుంది. సబ్సిడీలు.. బ్యాంకుల ద్వారా రుణాలొస్తాయి. పరిహారం వస్తుంది. భూముల అమ్మకాలు,కొనుగోళ్లకు ఇదే పుస్తకం ఆధారం. చాలా ప్రభుత్వ పథకాల అమలు సందర్భంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల బొమ్మలు పెడుతుంటారు. కరోనా వ్యాక్సినేషన్ సరి్టఫికెట్ల మీద ప్రధాని బొమ్మ ముద్రించారు. ముఖ్యమంత్రి బొమ్మ ఉన్నంత మాత్రాన ఏమీ జరగదు. ఈనాడు కథనం కల్పితం ఉమ్మడి కర్నూలు జిల్లాకుచెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి రిజి్రస్టేషన్‌కే రాలేదు కర్నూలు జిల్లా రిజి్రస్టార్ సీహెచ్ నాగలింగశ్వేర రావు వెల్లడి కర్నూలు(సెంట్రల్): ‘‘ఈనాడులో మీ భూమి మీదికాదు శీర్షికన ప్రచురితమైన కథనం పూర్తిగా ఊహాజనితం. కలి్పతం. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన గోవిందరెడ్డి అనే వ్యక్తి రిజి్రస్టేషన్ కోసం వెళ్తే టైటిల్ రిజి్రస్టార్ ఆఫీసర్(టీఆర్ఓ) అనుమతి తీసుకొని వస్తేనే రిజి్రస్టేషన్ చేస్తామని చెప్పినట్లు ఆ కథనంలో ఉన్న విషయం అవాస్తవం’’అని కర్నూలు జిల్లా రిజి్రస్టార్ సీహెచ్ నాగలింగశ్వేర రావు స్పష్టం చేశారు. తన పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచారణ చేయించామన్నారు. గోవిందరెడ్డి పేరుతో ఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజి్రస్టేషన్ జరగలేదన్నారు. కనీసం సదరు వ్యక్తి సందేహా నివృత్తి కోసం కూడా రాలేదన్నారు. ఇంతవరకు ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. పూర్వం నుంచి అమల్లో ఉన్న రిజి్రస్టేషన్ చట్టం ప్రకారం ఆన్లైన్ 1బీ, అడంగల్ చూసి మాత్రమే వ్యవసాయ భూములు రిజి్రస్టేషన్లు చేస్తున్నామన్నారు.అపోహలు వద్దు ‘ఈ భూమి మీది కాదు’రాతలు కలి్పతం మాత్రమే శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్ స్పష్టీకరణ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): శ్రీకాకుళం జిల్లాలోని 13 సబ్–రిజి్రస్టార్ కార్యాలయాలకు సాంబశివుడు అనే పేరుతో ఏ వ్యక్తీ రిజి్రస్టేషన్ కోసం గానీ, తన భూమి రిజి్రస్టేషన్ విషయమై సందేహ నివృత్తి కోసం గానీ రాలేదని జిల్లా రిజి్రస్టార్ తెలిపారు. ఈ నెల 4వ తేదీ ఈనాడు దిన పత్రికలో ‘ఈ భూమి మీది కాదు’ శీర్షికతో వచ్చిన కథనం కేవలం ఊహాజనితం, కల్పితం మాత్రమేనని ఖండించారు.భూ యాజమాన్య హక్కు చట్టం అనేది రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని, ఈ చట్టం ప్రతిపాదిత, సంప్రదింపుల దశలోనే ఉందన్నారు. ఈ చట్టం ప్రతిపాదిత వివరాల్లో రిజి్రస్టేషన్ కార్యాలయాల పాత్ర ఏమీ ఉండదని స్పష్టం చేశారు. రిజి్రస్టేషన్ కార్యాలయాల్లో ఇంతకు ముందు ఏ పద్ధతిలో రిజి్రస్టేషన్లు జరుగుతున్నాయో ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నాయని,ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు. ఎవరా సుబ్బారావు? ఈనాడులో తప్పుడు కథనం అటువంటిదేమీ లేదన్న అమలాçపురం జిల్లా రిజిస్ట్రార్ సాక్షి, అమలాపురం: జగన్ ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వస్తోందని, దీని వల్ల అమలాపురానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తికి చెందిన ఎకరం పొలాన్ని ఊరూ పేరూ లేని మరో వ్యక్తి పేరిట రాసేశారని ఈనాడు ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని జిల్లా రిజి్రస్టేషన్, స్టాంపుల శాఖ రిజి్రస్టార్ బి.శ్రీనివాస్ రాత పూర్వకంగా ఖండించారు. సుబ్బారావు అనే పేరుతో ఏ వ్యక్తీ జిల్లాలోని 15 సబ్ రిజి్రస్టార్ కార్యాలయాల్లో రిజి్రస్టేషన్ కోసం రాలేదని, కనీసం సందేహ నివృత్తికి కూడా సుబ్బారావు తమ కార్యాలయాలను సంప్రదించలేదని నిర్ధారించారు. అసలు భూ యాజమాన్య హక్కు రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదని, ఈ చట్టం ప్రతిపాదన మాత్రమేనని తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి నిబంధనలు ఇంకా రూపొందించకపోతే కొత్త రిజిస్ట్రేషన్ ఎక్కడుందని ప్రశి్నంచారు. ఈనాడులో వచి్చన కథనంపై శాఖాపరమైన చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. కాగా, ఎవరా సుబ్బారావు అనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. -
సునీల్‌కుమార్ యాదవ్‌కు 14 రోజుల రిమాండ్
కడప అర్బన్ / పులివెందుల రూరల్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అనుమానితుడిగా నిర్ధారించిన సునీల్ కుమార్ యాదవ్‌కు పులివెందులలోని మొదటి అదనపు జిల్లా మేజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సీబీఐ అధికారుల బృందం బుధవారం ఉదయం కడప రిమ్స్‌లో ఇతనికి కోవిడ్ టెస్ట్ చేయించిన తర్వాత పులివెందుల కోర్టులో మధ్యాహ్నం 2:55 గంటలకు హాజరు పరిచారు. సాయంత్రం 6:15 గంటలకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించడంతో అక్కడి నుంచి కడప కేంద్ర కారాగారానికి తీసుకెళ్లి అక్కడి అధికారులకు అప్పగించారు. సునీల్ కుమార్ యాదవ్‌ను విచారించేందుకు 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అంతకు ముందు సీబీఐ వారు అదే మేజిస్ట్రేట్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజే (బుధవారం) రిమాండ్‌కు విధించినందున, ఇదే రోజు కస్టడీకి ఇవ్వలేమని కోర్టు పేర్కొంది. కాగా, ఈ హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా సీబీఐ తమ కుటుంబాన్ని వేధిస్తోందని గత నెలలో సునీల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆ తర్వాత ఇతను అజ్ఞాతంలోకి వెళ్లగా.. గోవాలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మాకు ప్రాణహాని ఉంది.. సునీల్ కుమార్ యాదవ్‌ను పులివెందుల కోర్టులో హాజరు పరుస్తున్నారని తెలుసుకున్న తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రమ్మ, భార్య లక్ష్మి, సోదరుడు కిరణ్‌కుమార్ యాదవ్‌లు అతన్ని కలిసేందుకు వచ్చారు. యాదవ్.. కారులో ఉండగా, కోర్టు ఆవరణలోని గదిలో అతనితో మాట్లాడారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ‘ఈ హత్య కేసులో మాకు ఏమీ సంబంధం లేకపోయినా అనవసరంగా ఇరికించారు. పదేపదే పిలిపించి విచారిస్తున్నారు. మేము ఊరు విడిచి వెళ్లాం. మాకు ప్రాణ భయం కూడా ఉంది. సునీల్‌ను అనవసరంగా అరెస్ట్ చేశారు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పాల వ్యాపారి ఉమాశంకర్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరయ్యారు. సీబీఐ బృందం యాదవ్ రిమాండ్ వ్యవహారంలో బిజీగా ఉండటంతో వారు వెనుదిరిగి వెళ్లారు. -
సోయా.. సాగుకు సమయమిదే!
సోయా చిక్కుడుతో సిరులు అంతర పంటల్లోనూ అనుకూలమే యాజమాన్య పద్ధతులతో దిగుబడి మెలకువలు పాటిస్తే మరింత మేలు టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ టేక్మాల్: సోయా సాగు సమయమిదేనని, ఈ పంటతో రైతులకు ఎంతగానో మేలు చేకూరుతుందని టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ (9949968674) తెలిపారు. సోయా పంటను అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చునని ఆయన చెబుతున్నారు. సోయా చిక్కుడు ఇతర పప్పు ధాన్యాల పంటల కంటే అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా అత్యధిక శక్తిని చేకూర్చే పోషకాలను అందిస్తుందన్నారు. యాజమాన్య పద్ధతులతో పాటు మెలకువలు పాటిస్తే అనుకున్న స్థాయిలో దిగుబడులను పొందవచ్చునన్నారు. మోతాదుకి మించి ఎరువులను వాడకుండా సమయానుకూలంగా కలుపు నివారణ చేపట్టాలన్నారు. సోయా సాగు విధానంపై ఆయన రైతులకు అందించిన సలహా సూచనలు.. పంటకాలం: ఖరీఫ్‌లో జూన్, జులై నెలల్లో, రబీలో అక్టోబర్, వేసవిలో ఫిబ్రవరిలో సోయా పంటను సాగు చేయవచ్చు. రకాలు: పీకే–472, ఎంఏసీఎస్–58, ఎంఎస్సీఎస్–124, జేఎస్–335, ఎల్ఎస్బీ–335, ఎల్ఎస్బీ–1, ఎంఏసీఎస్–450, పీకే–1029 వంటి తదితర రకాలు అన్ని కాలాల్లో సాగుకు అనుకూలిస్తాయి. విత్తనం: ఎకరాకు 25–30 కిలోలు నాటాలి. విత్తన మోతాదు–గింజ పరిమాణం, మొలక శాతంపై ఆధారపడి ఉంటుంది. విత్తనశుద్ధి: ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాముల థైరమ్, 1 గ్రాము కార్బండజిమ్ లేదా 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ మందుతో విత్తన శుద్ధి చేయాలి. తర్వాత ప్రతి 8–10 కిలోల విత్తనానికి 200 గ్రాముల మేర రైబోపియం జపానికం విధానంలో విత్తనశుద్ధి చేసి నీడలో ఆరబెట్టాలి. విత్తే దూరం: తేలిక భూముల్లో, నల్లరేగడి భూముల్లో 225 సెంటీమీటర్లు, చదరపు మీటరుకు 40 మొక్కల చొప్పున ఎకరాకు లక్షా అరవై వేల మొక్కలు ఉండాలి. ఎరువులు: ఎకరాకు 12 కిలోల నత్రజనిని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్, 8 కిలోల గంధకాన్ని చివరి దుక్కిలో వేయాలి. భాస్వరపు ఎరువును సూపర్‌ఫాస్పేట్ రూపంలో వేస్తే గంధకం కూడా లభ్యమవుతుంది. కలుపు నివారణ, అంతరకృషి: విత్తే ముందు ప్లుకోరాలిన్ 45 శాతం, ఎకరాకు లీటరు చొప్పున పిచికారి చేసి భూమిలో కలియదున్నాలి. లేదా పెండిమిథాలిన్ 30 శాతం 1.3 నుంచి 1.6 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే కానీ, మరుసటి రోజున కానీ పిచికారి చేయాలి. విత్తిన 20–25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి. విత్తిన 25 రోజులకు క్విజాలాపాప్ ఇథైల్ 5 శాతం 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేసి గడ్డిజాతి మొక్కలను, ఇమజిథాపైర్ 10 శాతాన్ని 300 మిల్లీలీటర్ల చొప్పున పిచికారి చేసి వెడల్పాకు, గడ్డిజాతి కలుపును నిర్మూలించుకోవచ్చు. అంతర పంటలు: సోయా చిక్కుడును కంది (1ః7), పత్తి, మొక్కొజొన్న (1ః1) ఇతర పండ్ల తోటల్లో అంతర పంటగా సాగు చేయవచ్చు. తొలకరిలో సోయా చిక్కుడు తర్వాత శనగ, ఆవాలు, మినుములు సాగుచేస్తే వాణిజ్య పంటల కంటే అధిక ఆదాయం పొందవచ్చు. సస్యరక్షణ– పురుగులు రసం పీల్చే పురుగులు: ఆకుల్లోని రసం పీల్చడం వలన ఆకులు పసుపు, గోధుమ రంగులోకి మారి దిగుబడులు తగ్గుతాయి. తామర పురుగుల ద్వారా మొవ్వుకుళ్లు, తెల్లదోమ ద్వారా మోజాయిక్ తెగులు వ్యాపిస్తుంది. వీటి నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటరు మేర కలిపి పిచికారి చేయాలి. ఆకుముడత పురుగు: ఆకుల అంచులను కలిపి పత్రహరితాన్ని గీకి నష్టపరుస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1 గ్రాము లేదా క్లోరోఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లను కలిపి పిచికారి చేయాలి. సస్యరక్షణ–తెగుళ్లు ఆకుమచ్చ తెగులు: ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి 2.5 గ్రాముల మాంకోజెట్ కలిపి 10 రోజుల వ్యవధిలో అవసరాన్ని బట్టి రెండుసార్లు పిచికారి చేయాలి. కుంకుమ తెగులు: ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తెగులు తీవ్రదశలో తుప్పు రంగు పొడ ఏర్పడుతుంది. నివారణకు లీటరు నీటిలో 1 మిల్లీలీటరు హెక్సాకొనాజోల్ లేదా ప్రొపికొనాజోల్ కలిపి వారం వ్యవధిలో అవసరాన్ని బట్టి 2–3 సార్లు పిచికారి చేయాలి. బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు: ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడి ముదురు గోధుమ రంగులోకి మారతాయి. నివారణకు 10 లీటర్ల నీటికి 1.5 గ్రాముల పౌషామైసిన్+15 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను కలిపి 2–3 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. ఎల్ఎస్బీ–1, ఎంఏసీఎస్,–58, పీకే–472 రకాలు ఈ తెగులును అరికడతాయి. మోజాయిక్ తెగులు: తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు ఇది. దీనివల్ల మొక్క పసుపు రంగులోకి మారుతుంది. నివారణకు లీటరు నీటికి 1గ్రాము ఎసిఫేట్‌ను కలిపి 2–3 సార్లు పిచికారి చేసి తెగులు వ్యాప్తి చేసే పురుగును నివారించవచ్చు. మొవ్వుకుళ్లు తెగులు: తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు ఇది. ఇది సోకితే మొక్క మొవ్వు నుంచి ఎండిపోతుంది. తెగులును తట్టుకునే జేఎస్–335, పీకే–1029 రకాలను వాడాలి. చేనులో మొక్కల సాంద్రత సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కార్భసల్పాన్తో విత్తనశుద్ధి చేయాలి. ఇలా చేయడం ద్వారా తామర పురుగులను నివారించవచ్చు. -
ఇంటా బయటా స్వచ్ఛత పాటించాలి
ఐఏఎస్ అధికారులు సునీల్‌కుమార్, అజిత్బి చౌహాన్, జిల్లా పరిశీలన అధికారి గంగయ్య జాతీయ పరిశీలకుల పర్యటన జైనూర్: జైనూర్ మండలంలోని పాఠశాలలను శుక్రవారం జాతీయ పరిశీలన అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని స్వచ్ఛపాఠశాలల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించడానికి దబోలి గ్రామ పంచాయతీ పరిధిలోని లేండిగూడ, శేకుగూడ, దబోలి, కోలాం శాటిలైట్ పాఠశాలల మరుగుదొడ్డి, మూత్రశాల, పాఠశాల రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులతో మాట్లడారు. విద్యార్థులు ఇంటా బయటా స్వచ్ఛత పాటించాలని అన్నారు. మరుగుదొడ్లు అందరూ మరుగుదొడ్లు వాడాలని సూచించారు. ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకునేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు వివరించారు. గ్రామంలో స్వచ్ఛత కార్యక్రమాలపై సర్పంచ్ రాధాబాయి, వైస్ ఎంపీపీ షేక్ రషీద్‌లతో మాట్లాడి తెలుసుకున్నారు. వీరి వెంట మోప్మా పీడీ రాజేశ్వర్, ఆర్వీఎం జీల్లా పరిశీలన అధికారి గంగయ్య, ఎంపీడీవో దత్తరావు, ఎంమ్మార్వో శంకర్ గౌడ్, ఎంఈవో భరత్, చౌహన్, హెచ్ఎంలు అత్మరావు, భీంరావు, సోము, ఖమ్ము, స్థానిక నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులున్నారు. -
జన్మభూమిని బహిష్కరించిన ఎమ్మెల్యే
ప్రభుత్వం తీరుపై సునీల్‌కుమార్ ఆగ్రహం టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యుల వాగ్వాదం సభను బహిష్కరించి జాతీయ రహదారిపై బైఠాయింపు బంగారుపాళెం: జన్మభూమి సభలో ప్రభుత్వ తీరును ఎమ్మెల్యే విమర్శించినందుకు టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్యే సభను బహిష్కరించి జాతీయ రహదారిపై బైఠాయించారు. బంగారుపాళెం మండలంలోని బలిజపల్లె పంచాయతీ కార్యాలయం ఆవరణలో జరిగిన జన్మభూమి గ్రామసభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీపై ప్రభుత్వం తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, బ్యాంకు రుణాల మంజూరులో జన్మభూమి కమిటీ సభ్యులు, స్థానిక సర్పంచ్ వ్యవహరిస్తున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేశారు. రైతు రుణమాఫీ కింద 27 వేల కోట్లు రూపాయలను మాఫీ చేశామని చెబుతున్నా, వాస్తవానికి మాఫీ చేసింది 7.3 వేల కోట్ల రూపాయలేనన్నారు. డ్వాక్రా సభ్యుల ఖాతాలో ఒక్కొక్కరికి 10 వేల రూపాయలు జమచేసినట్లు చెప్పిన ప్రభుత్వం మూడు వేల రూపాయలే జమ చేసిందన్నారు. ఈ వాస్తవాలను జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేపై మాటల యుద్ధానికి దిగారు. దీంతో గందరగోళం నెలకొంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండిపోయారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు సర్పంచ్ దొరస్వామి, ఎంపీటీసీ సభ్యులు స్వరూపాచిట్టి సభను బహిష్కరించారు. జాతీయ రహదారిపై రాస్తారోకో ఎమ్మెల్యేతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పంచాయతీ కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించారు.ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. జన్మభూమి ప్రత్యేక అధికారి ప్రసాద్, మండల ప్రత్యేక అధికారి ఎమ్మెల్యే వద్దకు వచ్చి గ్రామసభకు రావాలని కోరారు. ఆయన నిరాకరించడంతో వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతున్నపుడు తాము ఎదురు మాట్లాడలేదన్నారు. వాస్తవాలు మాట్లాడితే తెలుగుతమ్ముళ్లకు మింగుడుపడక తనపై మాటల వాదనలకు దిగారని మండిపడ్డారు. -
ఆ స్థలం జూబ్లీహిల్స్ సొసైటీదే
♦ నేను లీజుపై తీసుకున్నా.. డీకే కుటుంబానికి సంబంధం లేదు ♦ పెట్రోల్ బంక్ యజమాని సునీల్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ చౌరస్తాలో తాను సొసైటీ నుంచి 59 ఏళ్ల లీజుకు స్థలాన్ని తీసుకున్నానని, ఈ స్థలంతో మాజీ మంత్రి డీకే అరుణ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని పెట్రోల్ బంక్ యజమాని సునీల్‌కుమార్ తెలిపారు. తాను 1987లో జూబ్లీహిల్స్ సొసైటీ నుంచి స్థలాన్ని లీజుకు తీసుకున్నానని, ఈ మేరకు పలు ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. ఇదే విషయమై మాజీ మంత్రి డీకే అరుణ ‘సాక్షి’తో మాట్లాడుతూ సీఎం సమీప బంధువు భవనానికి విలువ పెంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి కూల్చివేశారని, ఆపై సదరు భూమి డీకే అరుణకి చెందినది అంటూ మీడియాకు లీకులిచ్చారని మండిపడ్డారు. సునీల్‌కుమార్‌తో తమ కుటుంబానికి పరిచయం మాత్రమే ఉందని, పరిచయం ఉన్న వారి ఆస్తులు, తమవి ఎలా అవుతాయో ప్రభుత్వం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
సర్కారు తీరుపై ఎమ్మెల్యేలు ఫైర్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ చెందిన ఎమ్మెల్యేలు జిల్లా వాణిని గట్టిగా వినిపించారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పలు సమస్యలపై ధ్వజమెత్తారు. శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఫీజు రీయింబ ర్స్మెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరుగారుస్తోందని సిటీ ఎమ్మె ల్యే అనిల్ మండిపడ్డారు. రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవటాన్ని తప్పుబట్టారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. నిధులు విడుదల చేయకపోవటంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులు అప్పు లు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా నిధులు విడుదల కాకపోవటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా అందాల్సిన నిధులు సకాలంలో విడుదల చేయకపోవటంతో జిల్లాలో వేలాది మం ది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు. విద్యాసంస్థలు బకాయిల కోసం ఒత్తిడి చేస్తుండటంతో కొందరు విద్యార్థులు కళాశాలలకు వెళ్లడం మానేసినట్లు తెలిసిందన్నారు. ముఖ్యమంత్రికి చంద్రబాబుకు అబద్ధాలు చెప్పటంలో డాక్టరేట్ ఇవ్వొచ్చని విమర్శించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిల్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో సంచలనం రేపాయి. జిల్లా మంత్రి నారాయణపై ఫైర్ అయ్యే ఎమ్మెల్యే అనిల్ అసెంబ్లీలో సీఎంను విమర్శించడాన్ని జనం చర్చించుకోవటం కనిపించింది. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తాగునీటి కోసం విడుదల చేసిన నిధులను కొంద రు అక్రమార్కులు దుర్వినియోగం చేసినా, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గూడురు పట్టణ ప్రజలకు 24 గంటలు తాగునీరు ఇచ్చేందుకు గతంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రూ.64.13 కోట్లు మంజూరు చేశారని, కండలేరు నుంచి గూడూరు వరకు పైప్‌లైన్ ఏర్పా టు చేసి నిరంతరం నీరివ్వాల్సి ఉందని తెలిపారు. పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో ఓ కాంట్రాక్టర్ చేపట్టిన ఆ పనుల్లో పెద్ద ఎత్తును నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలున్నాయని తెలిపారు. పైపులు నాసిరకంగా వేశారని, పనులు పూర్తి కాకముందే సంబంధిత అధికారులు పూర్తయినట్లు మున్సిపాలిటీకి అప్పగించటాన్ని ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తప్పుబట్టారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించి గూడూరుకు తాగునీరు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యపై ప్రస్తావించారు. రైతులు పంటలు వేయక ముందు నీరిస్తామని చెప్పిన అధికారులు తీరా సాగుచేశాక ఇప్పుడు నీళ్లివ్వలేమంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి కాలువ బాగుచేయకపోవటంతో రైతులు మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రస్తుతం నీరివ్వలేకపోతే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి చక్కెర ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చెరకు రైతులను ఆదుకోవాలని కోరారు.అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలపై తమ వాణి వినిపించారు. -
పూతలపట్టు ఎమ్మెల్యేకు వైఎస్. జగన్ ఫోన్
పూతలపట్టు: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌తో శుక్రవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఫోన్లో మాట్లాడారు. సునీల్‌కుమార్‌పై నమోదైన పోలీసు కేసుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. పోలీసు కేసు నమోదు కావడానికి యాదమరి మండలం మోర్థానిపల్లె సబ్‌స్టేషన్‌లో ఏం జరిగిందని సునీల్‌ను అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ నాయకులు అనవసరంగా పెడుతున్న కేసులకు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకుల సహకారం తీసుకుని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిం చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేసు నమోదు చేసిన ట్రాన్స్‌కో అధికారులపై తగు చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. -
సీఐలపై నిఘా !
సీఐలపై నిఘా ! రేంజి ఐజీగా పీవీ సునీల్‌కుమార్ ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలు పోలీసు వర్గాల్లో కలకలం సృష్టించాయి.సివిల్ వివాదంలో తలదూర్చిన ఒక డీఎస్పీ సహా ఇద్దరు సీఐలు, ఓ ఎస్ఐను సస్పెండ్ చేయడం, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరో సీఐపై వేటు వేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. ఓ పేకాట క్లబ్‌కు సంబంధించి పైరవీ చేయబోయిన కొందరు పెద్దలకు ‘ప్రత్యేక కౌన్సెలింగ్’ చేసి పంపిన ఆయన అక్రమ మార్గాల్లో నడుస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్లపై నిఘా వేయడం తాజాగా చర్చనీయాంశమైంది. సాక్షి, గుంటూరు: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ల బదిలీలకు శ్రీకారం చుట్టిన ఐజీ సునీల్‌కుమార్ అవినీతి ఆరోపణలు వచ్చిన సీఐలను వీఆర్‌కు పంపి ఆయా స్టేషన్లలో రికార్డుల నిర్వహణపై విచారణ చేయిస్తున్నారు. అత్యంత రహస్యంగా జరుగుతున్న ఈ ప్రక్రియ అనంతరం అవకతవకలకు పాల్పడిన సీఐలైపై చర్యలు ఉంటాయని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఐజీ తాజాగా చేపట్టిన రికార్డుల విచారణ సమాచారం బయటకు పొక్కడంతో సీఐలు తలలుపట్టుకుంటున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని కొన్ని స్టేషన్లలో రికార్డులు తారుమారుపై ఉన్నతాధికారులకు సమాచారం అందింది. డబ్బులకు కక్కుర్తిపడి అక్రమ మార్గంలో కేసులు మాఫీచేయడం, దర్యాప్తును మూలనపడేయడం, డీఎస్పీలకు సమాచారం లేకుండానే రికార్డులను పాత సంవత్సరాల జాబితాల్లో పెట్టడం, ఒక కేసులో ఆధారాలు వేరొక కేసుఫైలులో ఉంచడం తదితర ‘తప్పు’లను విచారణ అధికారులు బయటపెడుతున్నారు. గుంటూరు వెస్ట్ సర్కిల్ డీఎస్పీగా మొన్నటివరకు పనిచేసిన కె. లావణ్యలక్ష్మి రెండు వారాల కిందట తానే స్వయంగా పలు పోలీసుస్టేషన్లలో 2004 నుంచి రికార్డులను బయటకు తీయించి పరిశీలించారు. ఆమె పట్టాభిపురం, అరండల్‌పేట, నగరంపాలెం స్టేషన్లలో పలు కేసుల్లో కీలక డాక్యుమెంట్లుపై పూర్వ సీఐలను విచారించాల్సిందిగా ఐజీకి నివేదిక పంపినట్లు సమాచారం. మిస్సింగ్ కేసులుపై ఆరా... గతంలో స్టేషన్‌కొచ్చిన మిస్సింగ్ కేసులు ఫిర్యాదులపై పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారు కాదు. మూడు నాలుగేళ్లుగా స్టేషన్లకు అందిన మిస్సింగ్ ఫిర్యాదులపై పోలీసులు ఏ చర్యలు చేపట్టారు. అదృశ్యమైన వ్యక్తులు దొరికారా.. లేదా.. అని అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో స్టేషన్ సిబ్బంది మిస్సింగ్ కేసులు ఫైళ్లు బూజుదులిపి బాధితులకు ఫోన్లు చేసి స్టేషన్లకు రావాలని బతిమాలుతున్నారు. -
ముగ్గురు సీఐల బదిలీ .
గుంటూరు, న్యూస్‌లైన్: గుంటూరు రేంజ్ పరిధిలోని ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సీసీఎస్ సీఐ బి.టి నాయక్‌ను ఒంగోలు వన్‌టౌన్‌కు, కనిగిరిలో పని చేస్తున్న పి.కరుణాకర్‌రావును ఒంగోలు సీసీఎస్‌కు, గుంటూరు జిల్లా మేడికొండూరు సీఐ వి.సుధాకర్‌రావును ప్రకాశం జిల్లా కనిగిరికి బదిలీ చేశారు. కాగా మేడికొండూరు సీఐగా ఎవరినీ నియమించలేదు. బదిలీలపై విస్తృత చర్చ.. రేంజ్ పరిధిలో భారీగా సీఐల బదిలీలు జరుగుతాయనే ఊహాగానాలకు రేంజ్ ఐజీ పి.వి.సునీల్‌కుమార్ చెక్‌పెట్టారు. దశల వారీగా బదిలీలు చేపడుతున్నారు. గతేడాది ఒక్కొసారిగా 40మంది సీఐలను బదిలీ చేసిన అప్పటి ఐజీ హరీష్‌కుమార్‌గుప్తా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలతో బదిలీల ప్రక్రియను సునిసితంగా పరిశీలించి నిర్వహిస్తున్నారు. రెండేళ్ల పాటు ఒకే చోట పని చేస్తున్న వారిని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తొలుత వేటు వేసుకుంటూ వచ్చిన ఐజీ సునీల్‌కుమార్ కొన్ని ముఖ్యమైన సర్కిల్స్ పరిధిలో సమర్ధవంతమైన అధికారులను నియమించే పనిలో నిమగ్నమైనట్లు తాజాగా జరుగుతున్న బదిలీల ద్వారా తెలుస్తోంది. గుంటూరు అర్బన్ పరిధిలో ముగ్గురు సీఐలను గత నెలలో బదిలీ చేయగా తాజాగా ప్రకాశం జిల్లా కేంద్రంపై దృష్టి పెట్టారు. ఏడాదిలో మొత్తంగా 21మంది సీఐలను బదిలీ చేయగా ఈ జాబితాలో మరికొందరు ఉన్నట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.