పూతలపట్టు ఎమ్మెల్యేకు వైఎస్‌. జగన్ ఫోన్ | sunil kumar got phone call from ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

పూతలపట్టు ఎమ్మెల్యేకు వైఎస్‌. జగన్ ఫోన్

Published Sun, Nov 9 2014 2:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

పూతలపట్టు ఎమ్మెల్యేకు  వైఎస్‌. జగన్ ఫోన్ - Sakshi

పూతలపట్టు ఎమ్మెల్యేకు వైఎస్‌. జగన్ ఫోన్

పూతలపట్టు: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్‌తో శుక్రవారం రాత్రి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. సునీల్‌కుమార్‌పై నమోదైన  పోలీసు కేసుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. పోలీసు కేసు నమోదు కావడానికి యాదమరి మండలం మోర్థానిపల్లె సబ్‌స్టేషన్‌లో ఏం జరిగిందని సునీల్‌ను అడిగి తెలుసుకున్నారు.

అధికార పార్టీ నాయకులు అనవసరంగా పెడుతున్న కేసులకు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. జిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకుల సహకారం తీసుకుని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచిం చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేసు నమోదు చేసిన ట్రాన్స్‌కో అధికారులపై తగు చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement