మృతదేహాలకు పోస్టుమార్టం
కుటుంబ సభ్యులకు అప్పగింత
బాపట్లటౌన్: విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్‌కుమార్ (36), అతని కొడుకు అనురాజ్ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశాలకు తరలించారు.
మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్‌లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్‌గౌడ్ (35) మృతదేహాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశారు.
అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామశివారులోని తుమ్మచెట్ల మధ్యలో ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment