Kiran
-
డీఐజీ వికృత చేష్టలు.. వీడియో వైరల్!
సాక్షి, గుంటూరు: తాను సమాజంలో బాధత్య గల స్థాయిలో ఉన్నాననే విషయం ఆయన మరిచిపోయారు. భార్యను శారీరంగా హింసించారు. అంతేకాదు.. మరో మహిళతో సంబంధం పెట్టుకుని కట్టుకున్న ఇల్లాలినే మానసికంగా వేధించారు. విసిగిపోయిన ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది. గుంటూరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ కిరణ్ వికృత చేష్టలు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గుంటూరు పోస్టల్ కాలనీకి చెందిన తాళ్లూరి అనుసూయా రాణి, భారత్ పేటకు చెందిన వీర్నపు కిరణ్ ఇద్దరు గతంలో పాలకొల్లు ఎల్ఐసీ శాఖలో అసిస్టెంట్లుగా పని చేశారు. 1998 డిసెంబర్లో గుంటూరు శారదాకాలనీ చర్చిలో వీళ్ల వివాహం జరిగింది. అయితే ఈ జంటకు సంతానం కలగకపోవడంతో.. 2002లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఈలోపు.. 2009లో కిరణ్‌కుమార్‌కు విజయనగరంలోని రిజిస్ట్రార్‌గా ఉద్యోగం వచ్చింది. ఆపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 2018లో డీఐజీగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి భర్త కిరణ్‌కుమార్ వికృత చేష్టలను ఆమె చూడసాగింది. ప్రస్తుతం అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్ఐసిలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కిరణ్ నెల్లురు జిల్లాలో డిఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో.. ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. పది నెలల క్రితం పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసి భర్త కిరణ్ కుమార్ బాబును తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. పోషణ, చదువు బాధ్యతలు తాను చూసుకునేలా రాసి ఇచ్చారు. అయితే అనసూయ శనివారం విజయవాడలోని ఓ శుభకార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఆమెను చూసి కిరణ్ రగిలిపోయారు. బాబు సంరక్షణ విషయంలో గొడవ జరిగి ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. ఆస్పత్రి నుంచి తన పుట్టింటికి వెళ్తున్న ఆమెపై మళ్లీ దాడికి యత్నించాడు. దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు చేస్తున్నారు. -
కిరణ్ రాయల్ చేసిన మోసాలపై ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేసిన లక్ష్మి
-
జనసేన నేత చేతిలో మోసపోయిన బాధితురాలు లక్ష్మిపై కేసు, అరెస్ట్
-
పవన్ కళ్యాణ్ వస్తున్నాడు మీటింగ్ కి డబ్బులు కావాలి.. కిరణ్ రాయల్ బాగోతం బట్టబయలు చేసిన లక్ష్మి
-
నేను అన్ని రిలీజ్ చేస్తే కిరణ్ రాయలు పుట్టగతులు ఉండవు
-
జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలి లక్ష్మి అరెస్ట్
సాక్షి, తిరుపతి: జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలి లక్ష్మి అరెస్ట్ అయ్యారు. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలని గత కొద్దిరోజులుగా బాధితురాలు లక్ష్మి న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో సోమవారం లక్ష్మి ప్రెస్‌మీట్ పెట్టారు. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్ఘతం చేశారు. అయితే, ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. చెక్‌బౌన్స్ కేసంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. కాగా, కిరణ్ రాయల్ కోసం కూటమి నేతలు ఢిల్లీ నుంచి చక్రం తిప్పినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి ఆదేశాలు రావడంతో కిరణ్ రాయల్‌ను కాపాడేందుకు లక్ష్మిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
జనసేన కిరణ్ రాయల్ బాధితురాలు సంచలన ప్రెస్ మీట్
-
నా వెనుక పవన్ ఉన్నాడు.. కిరణ్ రాయల్ బెదిరింపులు
సాక్షి, తిరుపతి : జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్, బాధిత మహిళ లక్ష్మి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎప్పుడో పదేళ్ల కిందట సమసిపోయిన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన కిరణ్ రాయల్‌కు బాధిత మహిళ లక్ష్మి కౌంటర్ ఇచ్చారు. తాజాగా, మరోసారి కీలక ఆధారాల్ని మీడియా ఎదుట బహిర్ఘతం చేశారు. చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. ఈ తరుణంలో సోమవారం కిరణ్ రాయల్ వ్యవహారంపై బాధితురాలు లక్ష్మి ఎస్పీను కలిసి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని, కిరణ్ రాయల్ చేసిన అన్యాయానికి సంబంధించిన ఆధారాల్ని అందించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడారు.‘నేనో కిలాడీ లేడీ అని, నాపై ఎన్నో కేసులు ఉన్నాయని కిరణ్ రాయల్ అంటున్నాడు. నా మీద కేసులు ఉన్నాయి. ఎందుకంటే మా ఇద్దరి మధ్య జరిగిన మనీ ట్రాన్సాక్షన్ వల్ల, ఒక లక్ష నా అకౌంట్ నుంచి అతని సహచరుడి అకౌంట్‌కు వెళ్లినందు వల్లే కేసులు నమోదయ్యాయి. ఆ అబ్బాయి గతంలో జనసేనలో పనిచేశాడు. ఆ తర్వాత కిరణ్ రాయల్ కోసం పనిచేశాడు. డబ్బులు ట్రాన్సాక్షన్ విషయంలో సదరు వ్యక్తిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఒక మహిళగా ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే కుటుంబ పరువుపోతుంది. ఇలా మాట్లాడినందుకే నా అనుకున్న వాళ్లే నాకు దూరమయ్యారు. నాకు ఆపద వచ్చినప్పుడు ఎవరు నాకు సహాయం చేసేందుకు ముందుకు రాలేదు. అందుకే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను.నెలన్నర క్రితం నా బిడ్డకు ఆపరేషన్ జరుగుతుంది డబ్బులు కావాలని అడిగితే కిరణ్ రాయల్ నానా దూర్భషలాడాడు. నా ఖాళీ చెక్ తీసుకుని, లక్ష రూపాయలు నాకు ఇచ్చాడు. అందుకు మా ఇంటి సీసీ కెమెరా, అతని అనుచరులే సాక్ష్యం.ఆ ఘటన జరిగిన తర్వాత నాపై అసభ్యపదజాలంతో దూషించాడు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పు అని బెదిరించాడు. వెంటనే మా ఇంటికి వచ్చి నన్ను దారుణంగా కొట్టాడు. ఆపై బెదిరించాడు. ఎవరొస్తారో రానియ్. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో. పోలీసులకు చెబుతావా. నన్ను ఎవరు వచ్చినా ఏం చేయలేరు. నా వెనుక జనసేన ఉంది. పవన్ కళ్యాణ్,నాదెండ్ల మనోహర్ ఉన్నాడు. నా వెనకాల జనసేన వీరమహిళలు ఉన్నారు.వీళ్లందరూ మహిళల్ని మోసం చేయమని కిరణ్ రాయల్‌కు చెప్పారా? పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా చెప్పారు. ఏ ఆడబిడ్డకు కష్టం వస్తే ముందు ఉంటానన్నారే.. కిరణ్ రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని నోట్ విడుదల చేస్తే సరిపోతుందా.2013 నుంచి 2016 వరకు మా ఇద్దరి మధ్య స్నేహం ఉందని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయామని మీడియాకు కిరణ్ రాయల్ చెప్పాడు. అలాంటప్పుడు 2023లో కిరణ్ రాయల్ నాకు డబ్బులు ఎలా ఇచ్చాడు.? ఆ సమయంలో అతను డబ్బులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. దీని గురించి కిరణ్ రాయల్ అనుకూల మీడియా ప్రశ్నించిందా? నేతలు ప్రశ్నించారా? లేదు. ఎందుకంటే జనసేన అధికారంలో ఉంది కాబట్టి.అన్యాయం జరిగిన నాకు న్యాయం చేయాల్సింది పోయింది. అందరు తనకు మద్దతుగా ఉంటూ నన్ను కామెంట్స్ చేస్తున్నారా? అవును. జనసేన నేత కిరణ్ రాయల్‌ను నేను నమ్ము తప్పు చేశాను. 2015, 2016 నాకు తనకు ఎలాంటి మాటల్లేవన్న కిరణ్ రాయల్ డబ్బులు ఎందుకు ఇచ్చాడు. 2025, 2026 సంవత్సరం పేరుతో చెక్స్ ఎందుకు ఇచ్చాడు.కిరణ్ రాయల్ చేతిలో మోస పోయింది నేనే కాదు.. మరో అమ్మాయి కూడా మోస పోయింది. ఆమె తన సొంత బిడ్డను కూడా వదిలేసింది. నాకు ఏ పార్టీతో కానీ, ఏ నేతలు కూడా తెలియదు. కిరణ్ రాయల్‌పై నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను. ఎక్కడ ఆడపడుచు కష్టాల్లో ఉన్న పవన్ కల్యాణ్ తనకు న్యాయం చేయాలి. ఇద్దరు బిడ్డలతో న్యాయ పోరాటం చేస్తున్నా. నాకు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కిరణ్ రాయల్ నుంచి నాకు ప్రాణహాని ఉంది. అధికార బలగాన్ని ఉపయోగించి నా ప్రాణం తీసినా.. నా ఇద్దరు బిడ్డలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’అని పలు ఆడియో,వీడియో,చెక్స్,బాండ్ పేపర్స్‌ను బహిర్ఘతం చేశారు. -
లక్ష్మి ఇంట్లోకి జనసేన కిరణ్ రాయల్
-
పవన్ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? కిరణ్ రాయల్ సంగతేంటి..?
-
మోసపోయిన నన్నే తిరిగి ట్రోల్ చేస్తున్నారు : లక్ష్మి
-
జనసేన తిరుపతి ఇన్ చార్జి కిరణ్ రాయల్ పై లక్ష్మి ఫిర్యాదు
-
ఎవరీ కిరణ్ రాయల్?
ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తుంటారు. ఆధునిక సమాజంలో ఆడవారికి ఆకాశంలో సగం అంటూ అగ్రపీఠం వేశారు. అయితే కొందరు మాత్రం మహిళలను ఆటబొమ్మలుగానే చూస్తున్నారు. వంటింటి కుందేళ్లుగానే భావిస్తున్నారు. మళ్లీ ఆటవిక యుగంలోకే నెట్టేస్తున్నారు. ఇదే కోవలో జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ వ్యవహరిస్తున్నారు. మహిళల రక్షణ అంటూ వారి పార్టీ అధినేత గొంతు చించుకుంటూ ఉంటే.. అనుయాయుడు మాత్రం అతివల జీవితాలతో ఆడుకుంటున్నారు. ‘చిల్లర’ వేషాలు వేస్తూ సాఫీగా సాగుతున్న సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నారు. గుట్టుగా కాపురం చేసుకుంటున్న వనితలను కల్లబొల్లి కబుర్లతో లోబరుచుకుని రూ.కోట్లు కాజేస్తున్నారు. ప్రశ్నించిన వారిని చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. బ్లాక్ టికెట్ విక్రయాలతో బతుకు మొదలుపెట్టిన సదరు కిరణ్వారు.. బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలతో స్వప్రకటిత నేతగా హల్చల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడని చెప్పుకుంటూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.సాక్షి ప్రతినిధి, తిరుపతి : ‘‘జనసేన తిరుపతి ఇన్చార్జి కిరణ్‌రాయల్ నా జీవితం నాశనం చేశాడు. రూ.1.20 కోట్లు తీసుకుని మోసం చేశాడు. నన్ను అప్పుల పాలు చేసేశాడు. అడిగితే మమల్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడు’’ అంటూ ఓ మహిళ విడుదల చేసిన ఆడియో.. వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జనసేనలో సదరు కిరణ్‌రాయల్ కీలకంగా వ్యవహరిస్తుండడంతో ఆ పారీ్టకి తలనొప్పిగా మారాయి. దీనిపై పవన్‌కల్యాణ్ సైతం సీరియస్ అయినట్లు సమాచారం. కిరణ్ రాయల్‌పై చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఒక్కొక్కటి వెలుగులోకి.. కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ రాయల్ రాసలీలలు ఒక్కోక్కటే వెలుగులోకి వస్తున్నాయి. నమ్మించి మోసం చేసిన కిరణ్ రాసలీలల భాగోతాన్ని బాధిత మహిళ బట్టబయలు చేసింది. మరో వివాహితతో సైతం కిరణ్ శారీకర సంబంధం కొనసాగిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది. ఈ క్రమంలోనే జనసేన పారీ్టలోని ఇద్దరు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పార్టీ పదవులను పావులుగా చూపి లోబరుచుకున్నట్లు నగరంలో సైతం చర్చ జరుగుతోంది. కామాంధుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితులతో పాటు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తనలా కిరణ్ బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకురావాలని, మహిళలను మోసగించే దుర్మార్గుడికి శిక్షపడేందుకు ఆధారాలు ఇవ్వాలని లక్ష్మి కోరుతున్నారు.మాయమాటలతో మహిళలకు వల!తనకున్న మాటకారితనం, హావభావాలతో మహిళలను ఆకట్టుకునేవాడు. తనకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఇతర మహిళలను వలలో వేసుకోవడం పరిపాటిగా మార్చుకున్నాడు. అందులో భాగంగా తన పక్కింటిలో ఉన్న లక్ష్మీరెడ్డి కుటుంబంతో చనువు పెంచుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమెను బుట్టలో వేసుకున్నాడు. చివరకు ఆ కుటుంబం విడిపోవడానికి కారకుడయ్యాడు. అతడి మోజులో పడిన ఆ మహిళ కుటుంబాన్ని వదలి కిరణ్ వెంట నడిచింది. రాజకీయంగా ఎదుగుతున్న తనకు ఆర్థిక అండ అవసరమని గుర్తించి ఆమెకున్న ఎకరం భూమిని అమ్మించి సొమ్ము చేసుకున్నాడు. పలు దఫాలుగా రూ.1.32కోట్ల నగదును చేయి బదులుగా తీసుకున్నట్లు ఆ మహిళ ఆధారాలను బయటపెట్టింది. దీంతో పాటు 300గ్రాముల బంగారు నగలను కాజేశాడని వెల్లడించింది. ఆమెతో వివాహేతర సంబంధం నడుపుతూనే మరో మహిళను ముగ్గులోకి దింపాడు. కొన్నాళ్లకు ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో ఇద్దరి మహిళల మధ్య చిచ్చురేగింది. దీనిపై నిలదీయడంతో లక్ష్మీని దూరం పెడుతూ వచ్చాడు. నిన్ను నమ్ముకుని సర్వస్వం నీకే ఇచ్చేశాను.. నీ కారణంగా నా కుటుంబం రోడ్డున పడింది. నా బిడ్డలు అనాథలయ్యారని లక్ష్మి వేడుకున్నా కఠిన మసస్తత్వం కరగలేదు. దీంతో ఆమె తనకు ఇవ్వాల్సిన నగదు బంగారం తిరిగి ఇవ్వాలని కిరణ్‌ను అడగడంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలోనే ఆ మహిళ పట్ల దారుణంగా వ్యవహరించి, పత్రికలో రాయలేని విధంగా దుర్భాషలాడుతూ చంపేస్తానంటూ బెదిరించాడు. ఆమెపై నేరుగా దాడి చేసినట్లు వాయిస్ రికార్డులో కిరణ్ ఒప్పుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నిన్ను చంపి బెయిల్‌పై తిరిగొస్తా.... నిన్ను ఎవడు కాపాడుతాడో చూస్తా... నీలాంటి వాళ్లను చాల మందిని చూశా... నా వెంట్రుక కూడా ఏవరూ పీకలేరు...నీవల్ల ఏమవుతుందో అది చేసుకో...అంటూ దారుణంగా మాట్లాడిన ఆడియో, వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. మొత్తం వ్యవహారంపై బాధితురాలు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.సస్పెన్షన్‌కు రంగం సిద్ధం! సనాతన ధర్మ పరిరక్షణకు పాటుబడతానని, మహిళలకు రక్షణ కవచంలా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరచూ ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి జనసేన ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ రాయల్ వికృత పోకడలపై వీడియో, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహిళను చంపేస్తానంటూ బెదిరించిన కిరణ్ రాయల్‌ను పార్టీ నుంచి నేడో, రేపో సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఆధారాలు వెలుగు చూసినా పార్టీ అధిష్టానం రెండు రోజులుగా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలు సైతం కిరణ్‌రాయల్ అక్రమాలపై కచ్చితమైన ఆధారాలతో పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశించారు. తదుపరి నిర్ణయం ప్రకటించేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు స్పష్టం చేశారు.ఎవరీ కిరణ్? కిరణ్ రాయల్ జీవితం అంతా వివాదాస్పదంగానే ఉంది. సుమారు 25 ఏళ్ల క్రితం తిరుపతికి వలస వచ్చిన కిరణ్ తన బతుకును గ్రూప్ థియేటర్స్ నుంచి ప్రారంభించాడు. చిరంజీవి సినిమాలకు బ్లాక్‌లో టెకెట్లు విక్రయిస్తూ ఆపై మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నేతగా ఎదిగాడు. ఆ క్రమంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రైల్వేస్టేషన్ ఎదురుగా ఓ హోటల్ యజమానిని ఒప్పించి కిళ్లీ కొట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు అతను కిరణ్గానే అందరికీ పరిచయం. కిళ్లీ కొట్టులో మాదకద్రవ్యాలను సైతం విక్రయించే ఈ స్థాయికి ఎదిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యాన్‌గా చిన్నపాటి కార్యక్రమాలు చేపడుతూ చిరంజీవి దృష్టిలో పడ్డాడు. మెగా ఫ్యాన్‌కు జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర పదవిలోనూ కొనసాగాడు. ఈ క్రమంలో తిరుపతి నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. తదనంతరం కిరణ్ ‘‘రాయల్’’గా అవతరించాడు. ఇంతలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో ఆయనకు రాజకీయ ప్రాధాన్యం లభించింది. ఆపై పవన్‌కల్యాణ్‌కు దగ్గరవుతూ జనసేనలోనూ కొనసాగాడు. తిరుపతిలో ఆ పారీ్టలో చేరేందుకు ముఖ్యనేతలెవ్వరూ మొగ్గు చూపకపోవడంతో కిరణ్ రాయలే పెద్ద దిక్కుగా మారాడు.దర్శన టికెట్లలో అవినీతి తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలుపొందిన రోజులల్లో కిరణ్ అక్రమాల భాగోతం తిరుమలకు పాకింది. తన అభిమాని కావడం, పార్టీ వ్యవహారాలు చూస్తుండడంతో శ్రీవారి దర్శన సిఫార్సు లేఖల వ్యవహారం మొత్తం కిరణ్‌కు అప్పగించారు. ఈ క్రమంలోనే సిఫార్సు లేఖలను కిరణ్‌రాయల్ అక్రమంగా రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. ఈ విషయం చిరంజీవి చెవిన పడడంతో ఆయన పలు మార్లు కిరణ్‌ని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. దీంతో కొంత కాలం పాటు కిరణ్‌ను పక్కన పెట్టారు. నాగబాబు ద్వారా మంతనాలు నడిపి మళ్లీ మెగా కుటుంబం పంచన చేరాడు. తిరుమలలో శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారంలో ఆయనపై పలు కేసులు నమోదవడం గమనార్హం. ‘గో బ్యాక్ ఆరణి అంటూ’.. జనసేన పార్టీ తిరుపతి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులు పేరును ఖరారు చేయడంతో కిరణ్ రాయల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముందు ఆరణితో సఖ్యతగా ఉన్నా తనకు లొంగలేదన్న అక్కసుతో తిరుపతి నగరం అంతా ‘గోబ్యాక్ ఆరణి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాడు. ఎన్నికల సమయంలో ఈ ఫ్లెక్సీల అంశం రాజకీయంగా కుదిపేసింది. జనసేనలోనే ఉంటూ ఆ పారీ్టకి నష్టం చేకూర్చేలా వ్యవహరించడం ముఖ్యనేతలకు నచ్చలేదు. మెగా ఫ్యాన్ అసోసియేషన్ నేత కావడంతో మందలించి వదిలేశారు. ఎన్నికలలో ఆరణికి వ్యతిరేకంగా పనిచేశాడని ఆధారాలతో సహా పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే మొన్నటి వరకు ఎమ్మెల్యేతో ఉప్పు నిప్పుగా ఉంటూ వచ్చాడు. మళ్లీ కొద్దిరోజులుగా ఎమ్మెల్యే ఇంటి వైపునకు వెళ్లివస్తున్నాడు. ఇంతలో ఈ వ్యవహారం వెలుగులోకి రావడం ఆ పారీ్టలో సంచలనంగా మారింది. అలాగే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులను టార్గెట్ చేసుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడ్డాడు. అసభ్యంగా దూషిస్తూ తీవ్రమైన విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అప్పటి టీటీడీ ఈఓ, కలెక్టర్, కార్పొరేషన్ కమిషనర్‌ను సైతం బ్లాక్మెయిల్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. -
అమాయక మహిళను బెదిరించి మోసం చేసిన జనసేన నేత కిరణ్ రాయల్
-
నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా: కిరణ్‌రాయల్
నీ పిల్లల కాళ్లు విరిచేస్తానంటూ జనసేన నేత హెచ్చరిక దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ ఆయన బాగోతంపై మరో వీడియో విడుదల చేసిన బాధితురాలు మరెంతో మంది కిరణ్‌రాయల్ బాధితులు బయటకొస్తారు మీడియాతో బాధితురాలు లక్ష్మి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా.. నాలుగు రోజుల్లో బెయిల్‌పై బయటకొస్తా.. నీ వల్ల ఏమైతే అది చేసుకో.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నీ కొడుకులు పెద్దవాళ్లయ్యారని విర్రవీగొద్దు.. వాళ్ల కాళ్లు విరిచేస్తా..’ అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జి కిరణ్‌రాయల్ లక్ష్మికి ఫోన్ చేసి తీవ్ర దుర్భాషలాడిన ఆడియో కలకలం రేపుతోంది.తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి రూ.1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని తిరుపతి రూరల్ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి.. కిరణ్‌రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్.. కైపు.. నైఫ్.. అంటూ లక్ష్మీతో కిరణ్‌రాయల్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కిరణ్‌రాయల్ ఆమెకు ఫోన్ చేసి పైవిధంగా బెదిరించాడు.పత్రికలో రాయలేని భాషలో ఆ మహిళను తిట్టిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కిరణ్‌రాయల్ తనతో ప్రైవేటుగా ఉన్న వీడియో క్లిపింగ్‌ను ఆమె ఆదివారం తెల్లవారు జామున మీడియాకు విడుదల చేసింది. వారిద్దరూ బెడ్‌పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడియోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్‌రాయల్ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్‌కళ్యాణ్ న్యాయం చేయాలి: బాధితురాలు ఆడబిడ్డకు కష్టం వస్తే నేను అండగా ఉంటానంటున్న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని కిరణ్‌రాయల్ బాధితురాలు లక్ష్మి వేడుకున్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కిరణ్‌రాయల్ తనను మోసం చేసి తీసుకున్న డబ్బు, బంగారాన్ని పవన్‌కళ్యాణ్ తనకు ఇప్పించాలని కోరారు. భవిష్యత్తులో మరింత మంది ఆయన బాధితులు బయటకొస్తారని చెప్పారు. కాగా, కిరణ్‌రాయల్‌పై ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆదివారం లక్ష్మి ఫిర్యాదు చేశారు. తన కుమారులిద్దరినీ చంపేస్తానని కిరణ్‌రాయల్ బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఇవ్వాల్సిన నగదును ఇప్పించాలని కోరారు. కామాంధుడిని కఠినంగా శిక్షించాలి.. ఇదిలా ఉండగా.. కామాంధుడు కిరణ్‌రాయల్‌ను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. లక్ష్మికి అండగా వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడంపై పద్మజ, గీతాయాదవ్, మధుబాల, విజయరాయల్, దుర్గా, రాధ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షుణ్ణంగా పరిశీలించండి : పవన్‌కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తమ పార్టీ నేత కిరణ్‌రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత, డెప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించారు. అతని గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలైంది. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కిరణ్‌రాయల్ పార్టీకి దూరంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కిరణ్‌రాయల్‌పై గతంలోనే లక్ష్మి ఫిర్యాదుఅయినా పట్టించుకోని పోలీసులు తిరుపతి క్రైం: కిరణ్‌రాయల్‌పై 2023 నవంబర్ 23న లక్ష్మీరెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు వైరల్‌గా మారింది. లక్ష్మి భర్త బృందకుమార్రెడ్డి 2021 జూన్ 6న అనారోగ్యంతో మరణించాడు. బృందకుమార్రెడ్డికి కిరణ్‌రాయల్ స్నేహితుడు కావడంతో లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని, ఆమె పిల్లలను తన పిల్లలుగా చూసుకుంటానని చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. నా వెనుక పవన్‌కళ్యాణ్ ఉన్నాడు.. ‘నా ఆరి్థక కష్టాలు తీరిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాను.. నాకు రావాల్సిన డబ్బుతో నీ పిల్లలను చదివిస్తూ నీ దగ్గర తీసుకున్న బంగారు నగలను, డబ్బులను తిరిగి ఇచ్చేస్తా..’ అంటూ ఆయన భార్య రేణుక ముందే కిరణ్‌రాయల్ ఒప్పించాడని లక్ష్మి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక కారు కోసం రూ.పదకొండు లక్షలు, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి రూ.కోటీ ముప్పై రెండు లక్షలు, 300 గ్రాముల బంగారు నగలను తీసుకుని.. ఆ తర్వాత తనను పట్టించుకోవడమే మానేశాడని ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు.అంతటితో ఆగకుండా మరికొందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నట్టు తెలిపారు. డబ్బుల కోసం ఫోన్ చేస్తే ‘నిన్ను, నీ బిడ్డలను నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తా’ అంటూ బెదిరించే వాడని.. తనను ఎవరూ ఏమీ చేయలేరని, తన వెనుక పవన్‌కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి పెద్ద వాళ్లున్నారని బెదిరించేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్ని ఆధారాలనూ సైతం పోలీసులకు అందించారు. అయితే అప్పట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేశారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. -
జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. పోలీసులకు బాధితురాలి మరో ఫిర్యాదు!
సాక్షి,తిరుపతి : తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది.తాజాగా,తన కుటుంబంపై కిరణ్ రాయల్ బెదిరింపులకు దిగుతున్నారంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. తన ఇద్దరు కుమారుల్ని చంపేస్తానని కిరణ్ రాయల్ బెదిరిస్తున్నారని ఆదివారం సాయంత్రం లక్ష్మి ఎస్వీ యూనివర్సిటీ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కిరణ్ ఇవ్వాల్సిన రూ.1.20 కోట్లు ఇప్పించాలని ఫిర్యాదులో కోరింది. -
జనసేన కిరణ్ రాయల్ లీలలు.. వెలుగులోకి మరో సంచలన వీడియో
సాక్షి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్ రాయల్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిరణ్ రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే.. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్‌గా మారింది. తాజాగా కిరణ్ రాయల్ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సంచలనంగా మారింది.కిరణ్ రాయల్ ఇంటిని ముట్టడించిన మహిళలుజనసేన ఇంచార్జీ కిరణ్ రాయల్ ఇంటిని మహిళలు ముట్టడించారు. మహిళను మోసం చేసిన కిరణ్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. గొడవ చేస్తే మిమ్మల్ని అరెస్టు చేస్తామంటూ పోలీసులు బెదిరించారు. బాధితురాలి న్యాయం జరిగే వరకు కదిలేదని.. మహిళలు మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపటం లేదంటూ ప్రశ్నిస్తూ.. ఇదేనా మీరు రక్షణ కల్పించేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సమగ్ర విచారణ జరిపించాలిజనసేన నేత కిరణ్ రాయల్‌పై మహిళా సంఘాలు మండిపడుతున్నారు. మహిళను మోసం చేసిన ఘటనలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐద్వా తిరుపతి జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి మాట్లాడుతూ.. బాధిత మహిళకు న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ ఈ అంశంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్నారు. పార్టీ నాయకుడు కాబట్టి చర్యలు తీసుకోమంటే చూస్తూ ఊరుకోం. కిరణ్ రాయల్ తప్పు ఉందని విచారణలో తేలితే ఆందోళన చేపడతాం. బాధిత మహిళకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం’’ అని ఆమె తెలిపారు.ఇదీ చదవండి: జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్మరోవైపు, కిరణ్ రాయల్ నీచుడు.. రాజకీయ ప్రతినిధిగా అనర్హుడు అంటూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. మాయమాటలతో మహిళలను మోసం చేస్తున్నాడు. కిరణ్ రాయల్‌ను జనసేన నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. -
జనసేన కిరణ్ రాయల్ బాగోతం.. వీడియో వైరల్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి కిరణ్‌రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే.. ‘నా పేరు లక్ష్మి. నేను ఒకర్ని నమ్మి మోసపోయాను. అప్పులు చేసి రూ.1.20 కోట్లు ఇచ్చాను. డబ్బులు అడిగితే పిల్లల్ని చంపుతానని బెదిరించి.. ఇంకా ఎన్నో చేసి నాతో వీడియో రికార్డు చేయించుకున్నారు.కేవలం రూ.30 లక్షలకు బాండ్లు, చెక్కులు రాయించాడు. నా వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలు అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంక నేను బతకలేను. కిరణ్ రాయల్ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు మా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నాను’ అంటూ మహిళ వాపోయింది. శనివారం ఆ వీడియో బయటకు రాగా.. వెంటనే స్పందించిన కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్‌చేసి నానా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగినట్టు ఆ మహిళ కిరణ్‌రాయల్ వాయిస్ రికార్డును విడుదల చేశారు. వీడియో వైరల్ అయ్యాక కిరణ్‌రాయల్ మీడియా సమావేశం నిర్వహించి.. ఆమె కిలాడి లేడీ అని, బెట్టింగ్‌ల కారణంగా అప్పుల పాలైందని, ఆ కుటుంబాన్ని తానే రక్షించానని చెప్పుకొచ్చారు.బాధితురాలు ఏమంటోందంటే..తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్ పల్లిలో నివాసం ఉంటోంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్‌రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని.. కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత, ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తంగా రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు వివరించింది. ఈ విషయం తెలియడంతో భర్త, కుటుంబీకులు నిలదీయగా.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు లక్ష్మి వెల్లడించింది.భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బుకు రెండింతలు ఇస్తానని.. మూడు నెలలు ఆగమని ఒప్పించినట్టు తెలిపింది. ఆ తరువాత డబ్బు అడుగుతుంటే.. రూ.30 లక్షలకు బాండు పేపర్లు, చెక్కులు ఇచ్చారని చెప్పింది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తీవ్రం కావడం, కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావటంతో కిరణ్ రాయల్కి ఫోన్‌చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిపింది. అయినా అతడి బెదిరింపులు తారస్థాయికి చేరటంతో వీడియో రిలీజ్చేసి ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించింది.బూతులు తిడుతూ..వీడియో వైరల్ కావడంతో జనసేన నేత కిరణ్‌రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మి కిలాడి లేడీ అని, ఆమెపై జైపూర్, విశాఖ, బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆరోపించారు. బెట్టింగ్‌లు, రకరకాల వ్యవసనాలతో ఆమె అప్పులు పాలైందని, ఆ కారణంగానే లక్ష్మిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేస్తే తానే విడిపించానని చెప్పారు. కాగా.. వీడియో వైరల్ అయిన వెంటనే.. కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్‌చేసి నానాబూతులు తిడుతూ.. చంపేస్తానని, ఆ తరువాత నెలలో బయటకు వస్తానంటూ తీవ్రస్థాయిలో బెదిరించిన వాయిస్‌ను లక్ష్మి మీడియా ముందు వినిపించారు.తన కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్లిన వీడియోలను కూడా మీడియాకు చూపించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వారం కాదని, తనకు శత్రువులు లేరని, ఏదైనా జరిగితే కిరణ్‌రాయల్ వల్లే అని లక్ష్మి మీడియా ముందు వెల్లడించారు. కిరణ్ రాయల్ అరాచకాలకు సంబంధించిన ప్రతి దానికి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు. కిరణ్‌రాయల్ తనకు ఫోన్‌చేసి మాట్లాడిన మాటలకు సంబంధించి 10 వాయిస్ రికార్డులను లక్ష్మి విడుదల చేశారు. ఆ వాయిస్‌లో పత్రికలో రాయలేని విధంగా బూతులు మాట్లాడుతూ.. చంపేస్తానంటూ బెదిరించిన రికార్డులు ఉన్నాయి. -
‘బండి సంజయ్.. నువ్వు కార్పొరేటర్ కాదు కేంద్రమంత్రి’
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుడు బండి సంజయ్ కార్పొరేటర్ కాదు.. కేంద్రమంత్రి అని గుర్తు పెట్టుకోవాలని చురకలంటించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. ఇదే సమయంలో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు.ఎంపీ చామల కిరణ్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కేంద్రమంత్రి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడటానికి ఆయనేం కార్పొరేటర్ కాదు. పద్మశ్రీ అవార్డుల విషయం పార్లమెంట్ జీరో అవర్‌లో లేవనెత్తుతాను. అవార్డుల విషయంలో బండి సంజయ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది బీజేపీ నేతలను ఎంపీలుగా గెలిపించారు. మిమ్మల్ని గెలిపించింది ఎందుకు?. జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో అయినా బీజేపీ ఎంపీలు విభజన హామీల గురించి మాట్లాడాలన్నారు. కేంద్రం బీహార్, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు. అందుకే బడ్జెట్లో మొండి చేయి చూపిస్తున్నారు. కిషన్ రెడ్డి దావోస్ పర్యటనను, కంపెనీలపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లారో కేటీఆర్‌ను అడిగితే వ్యంగ్యంగా చెప్పాడు. ఆదిలాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీని రాష్ట్రానికి పెద్దన్నలాగా ఉండమన్నారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. హైదరాబాద్ లైఫ్ లైన్ ఆర్ఆర్ఆర్కు 45వేల కోట్లు అవసరం. ఆర్ఆర్ఆర్, మెట్రోతో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు. నల్లగొండలో రైతులు ఎవ్వరు కేటీఆర్ ధర్నాను పట్టించుకోలేదు. మూసీ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ఎంపీలందరూ పార్లమెంట్లో కొట్లాడాలి. మహారాష్ట్ర కంటే మన రాష్ట్రం ఎక్కువగా కేంద్రానికి జీఎస్టీ పన్నులు కడుతోంది. పదేళ్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను రప్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది. హరీష్ రావు ముందు కేసీఆర్‌ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘బండి సంజయ్.. బీజేపీ భావజాలం ఉంటేనే అవార్డ్ ఇస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటరిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. అలాగే, నక్సలైట్లకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వొచ్చు కానీ.. పద్మ అవార్డులు ఇవ్వడానికి పనికి రారా? అని ప్రశ్నలు సంధించారు.కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘బండి సంజయ్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇందిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మా అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా. నక్సలైట్ భావజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. మావోయిస్టులకు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వొచ్చు కానీ, పద్మా అవార్డులకు పనికి రారా?.లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికోసం ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే ఈటల కూడా బీజేపీ అధ్యక్ష పదవికి అనర్హుడా?. ఈ విషయం బండి సంజయ్ చెప్పాలి. బండి సంజయ్ వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానిస్తున్నట్లు ఉన్నాయి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డుల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఇదే సమయంలో బండి సంజయ్‌కు ఎంపీ చామల కిరణ్ కూడా కౌంటర్ ఇచ్చారు. తాజాగా ఎంపీ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ..‘గద్దర్ భావజాలానికి సంబంధించి బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం. బీజేపీ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డ్ ఇస్తారా?. గద్దర్ అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. బీజేపీ పాట పాడిన వారు.. బీజేపీ గొంతు పలికిన వారికి ఇకపై అన్నీ అన్నట్టు బండి సంజయ్ మాటలు ఉన్నాయి. గద్దర్‌పై బండి సంజయ్ మాట్లాడిన మాటలను విత్ డ్రా చేసుకోవాలి అని కామెంట్స్ చేశారు. మరోవైపు.. బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ దగ్గర ఆయన దిష్టి బొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ సందర్బంగా గద్దర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు పలువురు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో గద్దర్ అభిమానులకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: గద్దర్‌కు పద్మ అవార్డుపై బండి సంజయ్ వ్యాఖ్యలు -
టీడీపీపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
-
కిరణ్ జార్జి సంచలన విజయం
వాంటా (ఫిన్లాండ్): ఆర్క్టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి సంచలనం సృష్టించాడు. ప్రపంచ 25వ ర్యాంకర్ వాంగ్ జు వె (చైనీస్ తైపీ)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో కిరణ్ జార్జి 23–21, 21–18తో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో వాంగ్ జు వెతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన కిరణ్ ఈసారి విజయం రుచి చూశాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో కిరణ్ జార్జి తలపడతాడు. మరోవైపు భారత స్టార్ లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్నాడు. తొలి రౌండ్లో లక్ష్య సేన్‌తో ఆడాల్సిన డెన్మార్క్ ప్లేయర్ రస్ముస్ గెమ్కే గాయం కారణంగా వైదొలగడంతో భారత ప్లేయర్ కోర్టులో అడుగుపెట్టకుండానే విజయాన్ని అందుకున్నాడు. -
అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి
కల్లూరు రూరల్: ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్ (20) శనివారం అమెరికాలో మృతి చెందాడు. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్ అమెరికాలో మిస్సోరీ స్టేట్‌లో ఉన్న శ్యాండిల్ ఎస్ టౌన్లో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లిన కిరణ్ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. అయితే, ఈతకొలను ఎనిమిది అడుగుల మేర ఉండగా అందరూ దిగడంతో కిరణ్‌కు ఈత రాక నీళ్లలో మునిగిపోయాడు. మిగిలిన మిత్రులకు కూడా ఈత రాకపోవడంతో నీట మునుగుతున్న కిరణ్‌ను చూస్తూ నిస్సహాయులుగా మిగిలిపోయారని తెలుస్తోంది. కాగా, కిరణ్ తండ్రి లక్ష్మణ్‌రాజు గతంలోనే చనిపోగా తల్లి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. వీరి బాధ్యతలను కిరణ్ తాత కృష్ణమూర్తిరాజు చూస్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కిరణ్ చనిపోయినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
Kiran Kamdar: కిచిడీ బామ్మ
ఆస్పత్రిలోని రోగులు ప్రతి మధ్యాహ్నం ఆమె కోసం ఎదురు చూస్తారు. ఆమె రాకుండా పోదు. మబ్బులు రానీ నిప్పులు కురవనీ వస్తుంది. ముంబై ఆస్పత్రుల్లోని పేద రోగులకు రోజుకు వంద మందికి ఆమె కిచిడీ పంచుతుంది. ఆమె దగ్గర డబ్బు లేదు. మనసు తప్ప. అందుకే ఆమెను అందరూ ‘కిచిడీ ఆజి’ అని పిలుస్తారు.62 సంవత్సరాల కిరణ్ కామ్దార్ కుదురుగా నిలబడిగాని, కూచునిగాని మాట్లాడలేదు. దానికి కారణం ఐదేళ్ల క్రితం ఆమెకు వచ్చిన పార్కిన్సన్స్ వ్యాధి. కాని ఆమె ఆలోచనలు కుదురుగా ఉన్నాయి. ఆమె సేవాగుణం కుదురుగా ఉంది. దానిని ఎవరూ కదపలేరు. ముంబై శివార్లలో కొంకణి తీరాన ఉన్నపాల్ఘర్ పట్టణం ఆమెది. సాదాసీదా జీవనమే అయినా ఒక మనిషికి సాటి మనిషి సేవ అవసరం అని ఆమె తెలుసుకుంది. అందుకు కారణం ఆమె కుమారుడు సెరిబ్రల్‌పాల్సీతో జన్మించడమే. కుమారుడి కోసం జీవితాన్ని అంకితం చేసిన కిరణ్ చుట్టుపక్కల పేద పిల్లలకుపాఠాలు చెప్పడంతోపాటు చేతనైన సాయం చేయడం కొనసాగించేది. అయితేపార్కిన్సన్స్ వ్యాధి ఆమె కార్యకలాపాలను స్తంభింపచేస్తుందని ఆమె భర్త, కుమార్తె అనుకున్నారు. కాని 2021లో జరిగిన ఒక ఘటన అందుకు విరుద్ధంగా ఆమెను ప్రేరేపించింది.కిచిడి ముద్దపాల్ఘర్లో ఒకే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల 15 పల్లెల నుంచి పేద జనం ఉదయం నుంచే వచ్చి ఓపీలో వెయిట్ చేస్తుంటారు. వారికి చెకప్ అయ్యేసరికి మధ్యాహ్నం 2 అవుతుంది. ఆ సమయంలో వారి ఆకలి బాధకు అక్కడ విరుగుడు లేదు. 2021లో కోవిడ్ సెకండ్‌వేవ్ సమయంలో ఒక బంధువును పరామర్శించడానికి కిరణ్ ఆ ఆస్పత్రికి వెళ్లింది. మధ్యాహ్నం వేళ చాలామంది పేషెంట్లు ఆకలితో బాధ పడుతున్నారని గ్రహించింది. ‘వీరికి ఆకలి తీరే మార్గమే లేదా?’ అనుకుని వెంటనే రంగంలో దిగింది. హాస్పిటల్ డీన్‌ని కలిసి ‘నేను మీ హాస్పిటల్‌లోని పేషెంట్లకు శుచిగా చేసిన వెజిటబుల్ కిచిడి పెట్టొచ్చా. వాళ్లు అన్నం లేక బాధ పడుతున్నారు’ అని అడిగింది. హాస్పిటల్ డీన్ వెంటనే అంగీకారం తెలిపారు. అలా మొదలైంది కిరణ్ ‘కిచ్డీ బ్యాంక్’ ఆలోచన.రోజూ 100 మందిఅంతటిపార్కిన్సన్స్ వ్యాధితో బాధ పడుతున్నా రోజూ స్వయంగా దాదాపు 20 నుంచి 22 కిలోల కిచిడి తయారు చేస్తుంది కిరణ్. ఆ తర్వాత దానిని స్వయంగా తీసుకుని ఆస్పత్రి చేరుతుంది. అక్కడ వార్డు వార్డుకు తిరుగుతూ పేషెంట్లకి, వారి బంధువులకి, చిన్న పిల్లలకు పంచి పెడుతుంది. ఇందుకు రెండు మూడు గంటలు పట్టినా ఆమె అలసి పోదు. పల్లెటూరి పేదవారు ఆమె తెచ్చే ఆ కిచిడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ‘నువ్వు దేవతవు తల్లీ’ అని ఆశీర్వదిస్తూ ఉంటారు. ‘కిచిడి పేషెంట్లను త్వరగా కోలుకునేలా చేస్తుంది. సులభంగా అరుగుతుంది’ అంటుంది కిరణ్.అదే వైద్యంపార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతూ ఇంతమందికి రోజూ వండటం గురించి కిరణ్‌కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆందోళన చెందినా, వారించినా ఇప్పుడు మూడేళ్లుగా సాగుతున్న ఆమె సేవను చూశాక, ఆమెకు పరీక్షలు చేశాక ‘ఆమె చేస్తున్న సేవే ఆమెకు వైద్యంగా పని చేస్తున్నదని’ తేల్చారు. ఆమె సంకల్పం వ్యాధిని అదుపులో పెడుతోందని తెలియచేశారు. కిరణ్ కామ్దార్ గత మూడేళ్లుగా సాగిస్తున్న ఈ సేవకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. మెచ్చుకోళ్లు దక్కుతున్నాయి. నిజానికి ఇది అసాధ్యమైన పని కాదు. ఆమె మాత్రమే చేయదగ్గ పని కాదు. ఎవరైనా అతి సులువుగా పూనుకోదగ్గదే. ప్రతి ్రపాంతంలో ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల దగ్గర పేదవాళ్లు, లోపలి పేషెంట్లు సరైన తిండి లేక బాధపడుతుంటారు. వారికి కిచ్డీయో సాంబార్ రైసో పెట్టడం పెద్ద కష్టం కాదు. రోజూ చేయకపోయినా వారానికి ఒకరోజైనా ఇలాంటి సేవ చేస్తే ఆ తృప్తే వేరు. ఎక్కువమంది పూనుకోరు. పూనుకున్నవారు కిరణ్ కామ్దార్లా చిరాయువు పొందుతారు. -
Haryana Political Crisis: బీజేపీ గూటికి కిరణ్ చౌదరి
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ హరియాణాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఎమ్మెల్యే కిరణ్ చౌదరి, ఆమె కూతురు శ్రుతి చౌదరిని కాంగ్రెస్‌ను వీడి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీల సమక్షంలో వీరిద్దరూ కాషాయ కండువాలు కప్పుకున్నారు. కిరణ్ చౌదరి ఎమ్మెల్యే కాగా, శృతి హరియాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ. హరియాణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ కోడలు కిరణ్. హరియాణా కాంగ్రెస్ పార్టీని సొంత జాగీరులా నడుపుతున్నారని తన బద్ధ విరోధి, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాపై కిరణ్ ధ్వజమెత్తారు. -
‘వాగు’లో గల్లంతైన నలుగురి మృతి
బాపట్లటౌన్: విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి బాపట్ల ప్రాంతానికి వచ్చిన 12 మందిలో బుధవారం నల్లమడవాగులో నలుగురు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో సునీల్‌కుమార్ (36), అతని కొడుకు అనురాజ్ (13) మృతదేహాలు బుధవారం రాత్రి ఏరియా వైద్యశాలకు తరలించారు. మరో ఇద్దరు ఆచూకీ లభించకపోవడంతో జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా, ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, సూర్యలంక తీరంలోని గజ ఈతగాళ్లు, అగ్నిమాపక అధికారులు టీమ్‌లుగా ఏర్పడి నల్లమడ వాగులో సుమారు 3 కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో భాగంగా వడ్లకొండ కిరణ్‌గౌడ్ (35) మృతదేహాన్ని గురువారం ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తించి వెలికి తీశారు. అదే సమయంలో బండా నందు (35) మృతదేహం మూలపాలెం గ్రామశివారులోని తుమ్మచెట్ల మధ్యలో ఉన్నట్లు గుర్తించి వెలికి తీశారు. నలుగురు మృతదేహాలకు గురువారం బాపట్ల ఏరియా వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుల కుటుంబసభ్యులు మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. రూరల్ సీఐ శ్రీహరి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులు X గిరిజనులు
సత్తుపల్లి: గిరిజన వర్గాల మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన సత్తుపల్లి పోలీసులపై గిరిజనులు దాడికి దిగారు. ఘటన పూర్వాపరాలిలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు శివారు చంద్రాయపాలెం అటవీ ప్రాంతంలోని 400 హెక్టార్లలో కొంతకాలంగా స్థానిక గిరిజనులు, స్థానికేతర గిరిజనుల మధ్య పోడు వివాదం నడుస్తోంది. గిరిజనులకు నేతృత్వం వహిస్తున్న కూరం మహేంద్రను అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు శనివారం సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌కు సీఐ టి.కిరణ్ పిలిపించి విచారించి పంపించారు. ఈక్రమంలో చంద్రాయపాలెంకు చెందిన గిరిజనులు ఆదివారం ఉదయం డయల్ 100కు ఫోన్ చేసి స్థానికేతర గిరిజనులు తమ భూముల్లోకి వస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో తొలుత ఎస్సై రాజు, ముగ్గురు పోలీసు సిబ్బంది వెళ్లారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న సమాచారంతో సీఐ టి.కిరణ్ మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి చేరుకున్నారు. సీఐ కిరణ్‌పై మెరుపుదాడి.. అదే సమయంలో గిరిజన నేత కూరం మహేంద్ర ఫోన్లో మాట్లాడుతుండగా, ‘నిన్ననే కదా నీతో మాట్లాడి పంపించింది.. మళ్లీ గొడవ ఏమిటి’ అంటూ సీఐ కిరణ్ ఆయన ఫోన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఇంతలో ఒక్కసారిగా గిరిజన మహిళలు కోపోద్రిక్తులై సీఐ కిరణ్‌ను చుట్టుముట్టి పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న కానిస్టేబుళ్లు పి.నర్సింహారావు, ఇమ్రాన్, సత్యనారాయణ, నరేష్ కలిసి సీఐ కిరణ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో చుట్టూ రక్షణ కవచంలా నిలిచి పోలీస్ వ్యాన్ వైపు తీసుకొస్తుండగా గిరిజనులు కర్రలతో వెంబడించి దాడి చేశారు. అతి కష్టంమీద అక్కడి నుంచి సీఐ కిరణ్‌ను పోలీసులు తీసుకొని బయ టపడ్డారు. ఈ ఘటనలో సీఐ కిరణ్ చొక్కా చిరిగిపోయింది. పోలీస్ పికెట్ ఏర్పాటు విషయం తెలుసుకుని కల్లూరు ఏసీపీ రఘు, రూరల్ సీఐ వెంకటేశం, డివిజన్లోని ఎస్సైలు, పెద్ద సంఖ్యలో సిబ్బంది చంద్రాయపాలెం బయలుదేరారు. మార్గమధ్యలో బుగ్గపాడు శివారులో పోలీసులపై దాడి చేసిన గిరిజనులు గుంపులుగా వస్తుండగా పోలీసులు వారిని చుట్టుముట్టారు. గిరిజనులు ప్రతిఘటించటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పి కూరం మహేంద్రతో సహా గిరిజనులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
కిరణ్ జార్జి సంచలనం
ఇండోనేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ప్లేయర్, ప్రపంచ 36వ ర్యాంకర్ కిరణ్ జార్జి ప్రిక్వార్టర్ ఫైనల్లో 21–11, 13–21, 21–18తో ప్రపంచ 18వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను బోల్తా కొట్టించి క్వార్టర్ ౖఫైనల్కు చేరాడు. భారత్‌కే చెందిన లక్ష్య సేన్, ప్రియాన్షు ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
ఒక డైమండ్ కోసం జరిగే అన్వేషణే ‘పింకీ’
కిరణ్, మౌర్యాణి జంటగా నటించిన తాజా చిత్రం ‘పింకీ’. సీరపు రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుమన్ , శుభలేఖ సుధాకర్, రవి అట్లూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. విఆర్ పి క్రియేషన్స్ పతాకంపై పి.పద్మావతి సమర్పణలో పసుపులేటి వెంకట రమణ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో గ్రాండ్ గా విడదులకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌లోని ఫిలించాంబర్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ..`జనం, జరిగిన కథ చిత్రాలు చేసిన దర్శక నిర్మాత పసుపులేటి వెంకట రమణ గారు. ఆయన దర్శకుడు అయ్యుండి మరో దర్శకుడికి అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. తన నిర్మాణంలో వస్తోన్న ఈ పింకీ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా` అన్నారు. హీరో కిరణ్ మాట్లాడుతూ...`నాకు ఈ చిత్రంలో హీరోగా అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు సినిమా. ఈ సినిమా విడుదలకోసం ఆతృతగా ఎదురు చూస్తున్నా` అన్నారు. దర్శకుడు సీరపు రవి కుమార్ మాట్లాడుతూ...`ఇది నా మొదటి సినిమా. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా బాగా రావడానికి సహకరించారు. ఒక డైమండ్ కోసం జరిగే అన్వేషణే ఈ చిత్రం. ఫ్యామిలీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్` అన్నారు. నిర్మాత పసుపులేటి వెంకట రమణ మాట్లాడుతూ..`సీరపు రవి కుమార్ చెప్పిన కథ నచ్చడంతో `పింకీ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నా. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. సెన్సార్ పనులు జరుగుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దర్శకుడు అన్నీ తానై ఈ చిత్రాన్ని రూపొందించాడు`అన్నారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ...`` పింకీ టైటిల్ తో వివిధ భాషల్లోవచ్చిన చిత్రాలన్నీ ఘన విజయం సాధించాయి. ఎన్నో అవార్డ్స్ అందుకున్నాయి. అలాంటి క్యాచీ టైటిల్ తో వస్తోన్న ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’అన్నారు. -
కిరణ్ జార్జికి సింగిల్స్ టైటిల్
భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిరణ్ జార్జి తన కెరీర్లో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. జకార్తాలో ఆదివారం ముగిసిన ఇండోనేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 టోరీ్నలో 23 ఏళ్ల కిరణ్ జార్జి విజేతగా నిలిచాడు. కేరళకు చెందిన కిరణ్ జార్జి ఫైనల్లో 21–19, 22–20తో జపాన్‌కు చెందిన ప్రపంచ 82వ ర్యాంకర్ కూ తకహాíÙపై గెలుపొందాడు. కిరణ్ జార్జికు 7,500 డాలర్ల (రూ. 6 లక్షల 22 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5,500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
తిరుమల శ్రీవారికి కోటి 50 లక్షల విలువ చేసే బంగారం
-
తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు. కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో.. ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు. -
ఓ వ్యక్తిని పిచ్చిగా ప్రేమించా.. జీవితం నాశనమైంది: హీరోయిన్
తమిళసినిమా: కోలీవుడ్‌లో విక్రమ్‌కు జంటగా నటించి మెరిసిన ఉత్తరాది భామ కిరణ్. ఆ తరువాత అజిత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో నటించి అగ్రస్థాయికి చేరుకుంది. అందాలారబోతకు వెనుకాడని నటి ఈ అమ్మడు. అలా మంచి ఫామ్‌లో ఉన్న కిరణ్ అనూహ్యంగా సినిమాలకు దూరమైంది. అలా చాలాకాలం తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఆ మధ్య కార్తీ కథానాయకుడిగా నటించిన శకుని చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. (చదవండి: తగ్గేదే లే..ఆపేదేలే..అనుకున్నా..!) తాజాగా నటుడు విజయ్ కథానాయకుడుగా నటిస్తున్న లియో చిత్రంలో నటించినట్లు కిరణ్ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ తాను ఒక వ్యక్తిని పిచ్చిగా ప్రేమించానని చెప్పింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని కోరుకున్నానంది. అయితే ఆ ప్రేమ ఫెయిల్ అయ్యిందని చెప్పింది. దాంతో తన మనసు ముక్కలైపోయిందని పేర్కొంది. సినిమాలు కొద్ది కాలం లేకపోవడానికి ప్రేమలో ఓడిపోవడమే కారణం అని చెప్పింది. అప్పుడు సరిగా ఉన్నట్లయితే నటిగా మంచి స్థాయికి చేరుకునేదానినంది. తప్పుడు నిర్ణయం కారణంగానే తమ జీవితం నాశనమైందని ఆవేదనను వ్యక్తం చేసింది. ఇప్పుడు మళ్లీ నటించాలని కోరుకుంటున్నానని అయితే ఎవరు అవకాశాలు ఇవ్వడం లేదని చెప్పింది. తాను మొదట్లో ఐదు విజయవంతమైన చిత్రాలు నటించినా ఇప్పుడు ఒక్కరు కూడా తనను నటించడానికి పిలవకపోవడం బాదాకరమన్నారు. కొత్త దర్శకుల చిత్రాల్లో నటించడానికి కూడా రెడీ అని కిరణ్ పేర్కొంది. -
సీటు రానివారికి టెలీ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ, నీట్, జేఈఈ వంటి ప్రముఖ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చి ఎంబీబీఎస్, ఐఐటీ వంటి వాటిల్లో సీటు రాని వారికి మానసిక చికిత్స అందజేసేందుకు 24 గంటల టెలీ కౌన్సెలింగ్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఆయా పరీక్షలు రాసి కొద్ది మార్కులతో సీట్లు కోల్పోతున్నవారు అనేకమంది ఉంటున్నారు. వీరిలో కొందరు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘మానసిక ఆరోగ్యం.. వర్తమాన పరిస్థితుల్లో దాని నిర్వహణ’అనే అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఓ నివేదిక తయారు చేసి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందజేసింది. వివరాలిలా ఉన్నాయి.. ఆత్మహత్యలు 10 శాతానికి తగ్గాలి పాఠశాలల్లోనూ మానసికంగా కుంగిపోయే విద్యార్థుల కోసం కౌన్సిలర్లను నియమించాలి. ప్రస్తుతం జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్యను 2030 నాటికి 10 శాతానికి తగ్గించాలి. కేంద్రీకృత సెంట్రల్ మెంటల్ హెల్త్ అథారిటీ, స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. జైళ్లల్లోనూ మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మానసిక ఆరోగ్య, సమస్యలను ఆరోగ్య బీమాలో చేర్చాలి. దేశంలో 47 మానసిక చికిత్సాలయాలున్నాయి. అయితే 2017లో ఏర్పాటైన మానసిక ఆరోగ్య చట్టానికి అనుగుణంగా అవి లేవు. ఆ మేరకు వాటిని తీర్చిదిద్దాలి. ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మెంటల్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. మానసిక చికిత్సకు సంబంధించిన 17 రకాల మందులను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చారు. అవన్నీ మెడికల్ కాలేజీలు, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఉన్నాయి. వాటిల్లో కనీసం 13 మందులను ప్రాథమిక ఆసుపత్రి స్థాయికి తీసుకురావాలి. పోలియో చుక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు సినీ తారలు, క్రీడాకారుల వంటి ప్రముఖులతో ప్రచారం చేస్తారు. అలాగే మానసిక సమస్యలకు సంబంధించి కూడా ఆయా రంగాల ప్రముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించి అవగాహన పెంచాలి. నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. స్వయం ఉపాధి పొందుతున్నవారిలోనే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తర్వాత వేతన జీవులు, నిరుద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు, ప్రైవేట్ రంగం, రైతుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. 2021లో స్వయం ఉపాధికి చెందిన వారి లో 20,237 మంది ఆత్మహత్య చేసుకు న్నారు. వేతన జీవులు 15,870, నిరుద్యోగులు 13,714, విద్యార్థులు 13,089, వ్యా పారస్తులు 12,055, ప్రైవేట్‌రంగ ఉద్యోగులు 11,439, రైతులు 5,318, కూలీలు 5,563 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోవిడ్ తర్వాత మానసిక సమస్యలు 28% పెరిగాయి. 2017లో 1.29 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటే, 2021లో 1.64 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్కహాల్ వల్ల 4.7 శాతం మంది, పొగాకు వల్ల 20.9 శాతం మంది మానసిక సమస్యలకు గురవుతున్నారు. డిప్రెషన్, ఉద్వేగాలు, ఇతరత్రా కారణాలతో 10.9 శాతం మందికి సమస్యలు వస్తున్నాయి. తీవ్రమైన స్కిజోఫ్రేనియా వంటి సమస్యలతో 1.4 శాతం, యాంగ్జయిటీతో 3.2 శాతం, స్ట్రెస్‌తో 3.7 శాతం, ఇతరత్రా ఏదో ఒక మానసిక సమస్యతో 13.7 శాతం బాధపడుతున్నారు. దేశంలో లక్ష జనాభాకు 0.75 మంది మానసిక చికిత్స నిపుణులు ఉన్నారు. అంటే 1.34 లక్షల మంది జనాభాకు ఒక మానసిక చికిత్స నిపుణుడు మాత్రమే ఉన్నారు. ప్రపంచ సగటు 1.7గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో లక్షకు 8.6 మంది మానసిక నిపుణులు ఉన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్న బడ్జెట్లో రెండు శాతమే మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారు. దీన్ని 10 శాతానికి పెంచాలని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక మానసిక రోగుల్లో 85 శాతం మందికి తగిన వైద్యం అందడం లేదు. మానసిక చికిత్సలను ఆయుర్వేద, యోగా పరిధిలోకి తీసుకురావాలి. జిల్లా కేంద్రంగా మానసిక వైద్యం ఉండాలి. మానసిక రోగుల్లో అవగాహన పెంచాలి జిల్లాకొక యువ స్పందన కార్యక్రమం పెట్టి 20 మందిని రిక్రూట్ చేసుకొని ప్రజల్లో మానసిక రోగాలపై అవగాహన పెంచాలి. బ్రిక్స్ దేశాల్లోని దక్షిణాఫ్రికాలో 35.8 శాతం మంది మానసిక సమస్యలున్నవారే. మన దేశంలో 30.1 శాతం మంది ఏదో ఒక మానసిక సమస్యలతో ఉన్నారు. – డాక్టర్ కిరణ్ మాదల,ఐఎంఏ, సైంటిఫిక్ కమిటీ కన్వీనర్ -
ఆర్టీసీ బస్సులో మహిళకు వేధింపులు
మిర్యాలగూడ టౌన్: మద్యం మత్తులో ఇద్దరు కామాంధులు అర్ధరాత్రి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అడ్డుకున్న డ్రైవర్‌పై దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును నేరుగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఆ ఇద్దరినీ పోలీసులకు అప్పగించాడు. నల్లగొండ జిల్లాలో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఇటీవల మిర్యాలగూడకు వచ్చింది. పట్టణంలో ఈ నెల 20న ఈవెంట్ నిర్వహించిన అనంతరం అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేందుకు అర్ధరాత్రి 12:30 గంటలకు మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కింది. అదే బస్సులో మరో ఇద్దరు ప్రయాణికులతో పాటు మిర్యాలగూడకు చెందిన కిరణ్, మంగళ్‌సింగ్ కూడా ఎక్కా రు. బస్సు మిర్యాలగూడ నుంచి బయల్దేరిన తర్వాత ఇద్దరు ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. ఈ క్రమంలో బాగా మద్యం తాగి ఉన్న కిరణ్, మంగళ్‌సింగ్ .. ఈవెంట్ ఆర్గనైజర్ సీటుపై కాళ్లు వేయడంతో పాటు వెకిలిచేష్టలకు పాల్పడ్డారు. దీంతో ఈవెంట్ ఆర్గనైజర్ వారి వేధింపులు తాళలేక బస్సు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి కూర్చుంది. దీంతో వారు కూడా డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్లి ఆ ప్రయాణికురాలిని వేధించారు. దీంతో బస్సు డ్రైవర్ సైదులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా అతడిపై దాడి చేశారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును నేరుగా నల్లగొండ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. అనంతరం కిరణ్, మంగళ్‌సింగ్‌ను పోలీసులకు అప్పగించాడు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నల్లగొండ టూ టౌన్ ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా, కామాంధుల నుంచి తనను కాపాడిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైదులుతో పాటు సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఈవెంట్ ఆర్గనైజర్ ఆదివారం ఆర్టీసీ మిర్యాలగూడ డీఎం బొల్లెద్దు పాల్‌కు లేఖ అందించింది. -
హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి
ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నటి కిరణ్ రాథోడ్.. ఈమె 2002లో జెమినీ అనే చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఈ తరువాత విల్లన్, అన్భే శివం, విన్నర్, తెన్నవన్, ఆంబళ్ వంటి పలు చిత్రాల్లో నటించింది. అదేవిధంగా తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ తదితర భాషల్లోనూ నటించింది. ఆ తరువాత అనూహ్యంగా కోలీవుడ్‌కు దూరం అయిన కిరణ్ ఇటీవల మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యింది. అయితే 41 ఏళ్ల ఆ భామకు హీరోయిన్ అవకాశాలు రావడం కష్టం అవడంతో తన దృష్టిని సామాజిక మాధ్యమాలపై సారించింది. తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్‌లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ వస్తోంది. అక్కడితో ఆగకుండా కిరణ్ పేరుతో ఒక యాప్‌ను ప్రారంభించి అభిమానులతో వ్యాపారం చేస్తోంది. ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలంటే రూ.49 ఖర్చు చేయాలి. ఆ యాప్ ద్వారా వెయ్యి రూపాయలు చెల్లిస్తే కిరణ్ తన రెండు గ్లామరస్ ఫొటోలను పంపుతుందట. అదేవిధంగా ఆమెతో 5 నిమిషాలు మాట్లాడాలంటే రూ.10 వేలు చెల్లించాల్సిందేనట. చదవండి: బ్రహ్మాజీ చేయి కోసుకుంటే నేనే ఆస్పత్రికి తీసుకెళ్లా: కమెడియన్ భార్య వీడియో కాల్లో 15 నిమిషాలు మాట్లాడాలంటే రూ.14 వేలు, 25 నిమిషాలు మాట్లాడాలంటే రూ.25 వేలు చెల్లించాల్సిందేనట. ఇలా అభిమానుల నుంచి కాసులు రాబడుతున్న కిరణ్ ఒక క్యాప్షన్‌ను తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి అందులో గుడ్ గర్ల్స్ డోంట్ మేక్ హిస్ట్రరీ బోల్డ్ గర్ల్స్ మేక్ హిస్టరీ అని పేర్కొంది.( మంచి అమ్మాయి చరిత్ర కెక్కలేరనీ, ధైర్యం కలవారే చరిత్ర సృష్టించగలరని అర్ధం). ఇప్పుడీ అమ్మడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్ చేశారు: నిర్మాత -
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత
ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కన్నడ సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. డైరెక్టర్ కిరణ్ గోవి(53) గుండెపోటుతో మరణించారు. ఈ రోజు తన ఆఫీసులోనే గుండెపోటుకు గురి కాగా.. ఆయన సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ డైరెక్టర్ కన్నుమూశారు. దీంతో శాండల్‌వుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. సంచారి, పయన, పారు వైఫ్ ఆఫ్ దేవదాస్, యారిగే యారింటు లాంటి కన్నడ చిత్రాలను ఆయన దర్శకత్వంలో తెరకెక్కించారు. ఆయన తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. టాలీవుడ్లో తిరుగుబోతు అనే మూవీని తెరకెక్కించారు. కిరణ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో తొమ్మిది మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్స్ (ఏఈ సివిల్) పరీక్ష పేపర్లు లీకైనట్టు పోలీసులు తేల్చారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడైన పి.ప్రవీణ్‌కుమార్ ఈ ప్రశ్నపత్రాలనే టీచర్ రేణుక, ఆమె భర్త లవుడ్యావత్ డాక్యాకు అందించాడని గుర్తించారు. వీటితోపాటు ప్రవీణ్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ కూడా ఉందని, దాన్ని విక్రయించేందుకు అతను ఒప్పందం చేసుకున్నాడని ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి లీకేజీ వ్యవహారం వివరాలను వెల్లడించారు. కారుణ్య నియామకం కింద వచ్చి.. ఏపీలోని రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రరావు కుమారుడు ప్రవీణ్‌కుమార్. హరిశ్చంద్రరావు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కుమార్‌కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ప్రవీణ్ 2017 నుంచి టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేణుక 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా గురుకుల హిందీ టీచర్‌గా ఎంపికై.. ప్రస్తుతం వనపర్తిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త లవుడ్యావత్ డాక్యా వికారాబాద్‌లోని డీఆర్డీఏలో పనిచేస్తున్నాడు. టీఎస్పీఎస్సీ పరీక్షకు సిద్ధమైన నాటి నుంచీ రేణుక, ప్రవీణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె తరచూ కమిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవీణ్‌ను కలిసేది. ల్యాన్ ద్వారా యాక్సెస్ చేసి.. టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసేందుకు రేణుక, లవుడ్యావత్ డాక్యా పథకం వేశారు. పేపర్లను తమకు ఇవ్వాలని ప్రవీణ్‌ను రేణుక కోరింది. టీఎస్‌టీఎస్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న అట్ల రాజశేఖర్‌తో ప్రవీణ్ కలిసి పేపర్ లీకేజ్‌కి మార్గాలు అన్వేషించాడు. పరీక్ష పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో ఉంటాయి. ఈ సెక్షన్‌కు నేతృత్వం వహించే కస్టోడియన్ శంకరలక్ష్మి తన కంప్యూటర్ పాస్వర్డ్, యూజర్ ఐడీలను నిత్యం వినియోగించే పుస్తకం చివరి పేజీలో రాసి పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు.. ఆమె పుస్తకం నుంచి తస్కరించాడు. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి కంప్యూటర్ను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాక్సెస్ చేశాడు. ఇద్దరూ కలిసి ఆ కంప్యూటర్లో నుంచి ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లను, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్‌ను కాపీ చేసుకున్నారు. ప్రవీణ్ వీటిని తన పెన్‌డ్రైవ్‌లో వేసుకున్నాడు. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రింట్ ఔట్ తీసుకున్నాడు. ఇంట్లోనే చదివించి, దగ్గరుండి పరీక్ష రాయించి.. మరోవైపు టీచర్ రేణుక, లవుడ్యావత్ డాక్యా ఏఈ పరీక్ష పేపర్లు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేణుక సోదరుడు, మాన్సూర్‌పల్లి తండా సర్పంచ్ కుమారుడైన కేతావత్ రాజేశ్వర్‌నాయక్‌ను.. అతడి ద్వారా మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ (రాజేశ్వర్ సోదరుడు)ను సంప్రదించి ఏఈ పేపర్ విషయం చెప్పారు. ఎస్సై పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీనివాస్.. తనకు ఏఈ పేపర్ వద్దని చెప్పి, పరిచయస్తులైన కేతావత్ నీలేశ్‌నాయక్, పత్లావత్ గోపాల్‌నాయక్‌ల పేర్లు చెప్పాడు. దీనితో వారిని సంప్రదించిన రేణుక, డాక్యా రూ.13.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ తీసుకున్నారు. ఏఈ పేపర్లు ప్రింట్ తీసుకున్న ప్రవీణ్.. ఈ నెల 2న రేణుక, డాక్యాలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు మహబూబ్‌నగర్‌లో ఉన్న వారిద్దరూ వెంటనే బాలాపూర్ వరకు వచ్చి ప్రవీణ్‌ను కలిశారు. ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని రూ.5 లక్షలు ఇచ్చారు. నీలేశ్, గోపాల్‌తోపాటు నీలేశ్ సోదరుడు రాజేంద్రనాయక్‌లను గండీడ్ మండలం పంచగల్ తండాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. 5న ఉదయం డాక్యా అభ్యర్థులను వెంటపెట్టుకుని సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రం వరకు వచ్చి.. పరీక్ష రాయించాక విడిచిపెట్టాడు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఇద్దరిపై వేటు అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఇక ఈ వ్యవహారంలో భాగస్వాములైన గురుకుల టీచర్ రేణుక, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో.. వారిపైనా చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలు సిద్ధమయ్యాయి. మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు 6న తేదీన మళ్లీ ప్రవీణ్‌ను కలిసిన రేణుక, ఆమె భర్త ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు. -
శభాష్ కిరణ్..
టేకుమట్ల(రేగొండ): గుండెపోటుతో కొట్టుమిట్టాడుతున్న ఓ యువకుడికి పోలీస్ కానిస్టేబుల్ సీపీఆర్ ద్వారా ప్రాణం పోశాడు. ఈ సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఓ చికెన్ సెంటర్లో పనిచేసే వంశీ (35) నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్క సారిగా గుండెపోటుకు గురై రోడ్డుపై పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న బ్లూకోట్ కానిస్టేబుల్ కిరణ్ వెంటనే అతనికి సుమారు 15 నిమిషాలపాటు పీసీఆర్ నిర్వహించగా తిరిగి శ్వాస తీసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి పోలీస్ వాహనంలో పరకాల ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతనికి సీపీఆర్‌తో తిరిగి ప్రాణం పోసిన పోలీసులను స్థానిక ప్రజలు అభినందించారు. -
అదే ఆమె గొప్పతనం.. మంత్రి రోజాపై కిరణ్ ప్రశంసల వర్షం
ఏపీ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు లలితా జువెలరీస్ ఎండీ కిరణ్. చిత్తూరు జిల్లాలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్‌లు కలిగిన లలితా జువెలరీస్ తాజాగా 46వ షోరూంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 'డబ్బులు ఊరికే రావు' అనే డైలాగ్‌తో ఫేమస్ అయ్యారు కిరణ్. ఈ సందర్భంగా హాజరైన మంత్రి రోజాను కిరణ్ కొనియాడారు. పిలవగానే వచ్చినందుకు రోజాకు ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ మాట్లాడుతూ.. 'మా ఆహ్వానం అందగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇటీవలే రోజా ఇంటికి వెళ్లి షోరూం ప్రారంభోత్సవానికి పిలిచాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాకు చాలా బాగా మర్యాదలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అది ఆమె గొప్పతనం. మనం పిలిచిన వ్యక్తి గెస్ట్‌గా వస్తే ఆనందం మాటల్లో వర్ణించలేం.' అంటూ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రోజా కూడా లలితా జువెలరీస్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
విశాఖ పోలీస్ సంచలన నిర్ణయం.. నగరంలో తొలిసారి..
సాక్షి, దొండపర్తి / మధురవాడ (భీమిలి): నగరంలో నేర నియంత్రణపై పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టిన పోలీస్ శాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖలో తొలిసారిగా ఒక రౌడీషీటర్‌ను నగరం నుంచి బహిష్కరించి నేరాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టించింది. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో గూండాయిజం చేస్తున్న రౌడీషీటర్ పెంటకోట కిరణ్(19)ను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ బుధవారం నోటీసులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఎం పాలెం ఆర్‌హెచ్ కాలనీకి చెందిన కిరణ్ ఇంటర్ వరకు చదివాడు. వ్యసనాలకు బానిసై శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం ప్రారంభించాడు. పీఎంపాలెం స్టేషన్ పరిధిలో రోబరీ, కిడ్నాప్, కొట్లాట ఇలా అనేక నేరాలకు కిరణ్ పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఐపీసీ 297, 324, 425, 364 – ఏ, 342, 323, 384, 120బి, 34తోపాటు 428, 392 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రౌడీషీట్, హిస్టరీ షీట్‌తోపాటు ఎన్నికేసులు ఉన్నప్పటికీ కిరణ్ నిత్యం నేరాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. అంతేకాకుండా గూండాయిజం చేస్తూ ప్రజలను బెదిరించడంతోపాటు దాడులకు పాల్పడుతున్నాడు. గత 6 నెలలుగా కిరణ్ కదలికలు, కార్యకపాలపై పోలీసులు నిఘా పెట్టారు. అతడి నుంచి ప్రజలకు, వారి ఆస్తులకు ప్రమాదముందని భావించారు. అతడిపై కేసులు పెట్టే వారితోపాటు, సాక్షులను బెదిరిస్తుండడంతో కిరణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ప్రజలు భయపడుతుండడాన్ని గుర్తించారు. దీంతో నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పెంటకోట కిరణ్‌ను షరతులతో అక్టోబర్ 31వ తేదీ నుంచి 6 నెలలపాటు విశాఖ కమిషనరేట్ పరిధి నుంచి బహిష్కరిస్తూ నోటీసు అందించారు. రౌడీషీటర్లకు వెన్నులో వణుకు నగరంలో జరుగుతున్న నేరాలు, హత్యలతో పోలీసులు రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్న, సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అలాగే నిర్మాణుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం, ఇతర నేరాలకు పాల్పడుతున్న వారిని నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు తొలిసారిగా రౌడీషీటర్‌ను నగరం నుంచి బహిష్కరించి సంచలనం సృష్టించారు. నగరంలో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ రౌడీషీటర్ల వెన్నులో వణుకు పుట్టించారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు నగరంలో రౌడీయుజం, గూండాయుజం, నేరాలకు పాల్పడితే సహించేది లేదు. నగర ప్రశాంతతకు, భద్రతకు భంగం కలిగించే వారెవరైనా ఉపేక్షించేది లేదు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విశాఖలో నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – సీహెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ -
టీడీపీ కార్యకర్త అరాచకం.. మహిళపై అత్యాచారయత్నం
సాక్షి, గుంటూరు: టీడీపీ క్రియాశీలక కార్యకర్త మల్లెల కిరణ్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళా కూలీపై అత్యాచారానికి ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. దుగ్గిరాల మండలం శృంగారపురంలో కిరణ్ శుక్రవారం.. ఓ మహిళా కూలీపై అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలిని పొలాల్లోకి లాక్కెళ్తుండగా తోటి కూలీలు గమనించారు. ఈ క్రమంలో డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకుని కిరణ్‌ను అరెస్ట్ చేశారు. -
ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
Kiran Gosavi, NCB Witness In Aryan Khan Case, Arrest: ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విట్నెస్, డిటెక్టివ్ కిరణ్ గోసవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. ఆర్యన్ అరెస్ట్ తర్వాత తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కారణ్ గోసవి ఇటీవలె ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా అక్టోబర్ 2న క్రూయిజ్ నౌకపై దాడి జరిగిన కిరణ్ గోసవి సహా ఆయన వ్యక్తిగత సహాయకుడు ప్రభాకర్ ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దీంతో ఎన్సీబీ గోసవిని, ప్రభాకర్‌ని సాక్షులుగా చేర్చి విచారించింది. చదవండి: ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. ఆర్యన్‌ను ఎన్సీబీ కార్యాలయానికి తీసుకొచ్చినప్పుడు కిరణ్ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాతో తెగ వైరల్ అయ్యింది. అయితే తర్వాత గోసవి కనిపించకుండాపోవడం, అతనిపై పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేయడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా ఇటీవలె మీడియాతో మాట్లాడుతూ ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్యన్‌ఖాన్‌ను విడిచిపెట్టడానికి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులతో రూ.25 కోట్లకు డీల్ కుదిరిందని ప్రభాకర్ సాయిల్ సంచలన కామెంట్స్ చేశారు. ఆ మొత్తంలో రూ.8 కోట్లు ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడేకి ముట్టజెప్పాలని ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ప్రభాకర్ తాను సమర్పించిన అఫిడవిట్లో ఆరోపించారు. చదవండి: Aryan Khan: ఆర్యన్‌ను వదిలేయడానికి రూ.25 కోట్లు? వాంఖెడే X నవాబ్ మాలిక్ -
పెళ్లయిన నెలకే.. భార్య గొంతు కోసి దారుణహత్య
సాక్షి, హైదరాబాద్: ఎన్నో ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించిన నవవధువు పెళ్లయిన నెలకే దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన హైదరాబాద్‌లో బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. ప్రగతినగర్‌కు చెందిన కిరణ్‌కు సుధారాణి (22) అనే యువతితో నెల రోజుల క్రితమే వివాహమైంది. పెళ్లి తర్వాత భార్య మీద అనుమానం పెంచుకున్న కిరణ్ శనివారం అర్ధరాత్రి సమయంలో ఆమెను గొంతుకోసి అతి కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం తానూ చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల అందించిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకొని సుధారాణి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నం చేసిన కిరణ్‌ను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సుధారాణిని మరణాన్ని జీర్ణించుకోలేని కుటుంబ సభ్యులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేసి ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (వేరే మహిళతో భర్త సంబంధం.. సర్పంచ్ తట్టుకోలేక..) -
సుచిరిండియా ‘ది టేల్ ఆఫ్ గ్రీక్’
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ కంపెనీ సుచిరిండియా ‘ది టేల్ ఆఫ్ గ్రీక్’ పేరిట లగ్జరీ, స్టూడియో అపార్ట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను హీరోయిన్ సమంతా అక్కినేని లాంఛనంగా ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. శంషాబాద్‌లో 2.55 ఎకరాలలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో 6 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో మొత్తం 398 గృహాలుంటాంటాయని సుచిరిండియా చైర్మన్ డాక్టర్ కిరణ్ తెలిపారు. 800–945 చదరపు అడుగుల మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. మూడంతస్తులలో క్లబ్ హౌస్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్ట్రన్స్ ప్లే ఏరియా, ఫార్మసీ వంటి వసతులుంటా యి. బెంగళూరు హైవేలోని కొత్తూరులో గిజాపొలీస్, అల్వాల్‌లో ఆర్యవర్త నగరి ప్రాజెక్ట్‌లను నిర్మి స్తుంది. మరొక 12 ప్రాజెక్ట్‌లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. -
వరకట్న హత్యలు: జాగ్రత్త... ఉద్యోగం ఊడుతుంది
ప్రభుత్వం గట్టిగా సంకేతం ఇస్తే ప్రమాదం తలపెట్టేవారు దారికొస్తారు. కేరళ ప్రభుత్వం వరకట్న హత్యల పట్ల చాలా కఠినంగా ఉంది. కొన్నాళ్ల క్రితం సంచనం సృష్టించిన ఆయుర్వేద వైదుర్యాలు విస్మయ మరణంపై విచారణ జరిపిన కేరళ ప్రభుత్వం భర్తను ఉద్యోగం నుంచి తొలగించింది. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్‌గా ఉన్నందుకు అతడు అధిక కట్నం ఆశించాడు. నేడు ఆ ఉద్యోగం పోయింది. ప్రభుత్వం పెన్షన్ కూడా ఇవ్వనని తేల్చి చెప్పింది. అధికారులూ జాగ్రత్త అని హెచ్చరించింది. ఇరవై నాలుగేళ్ల ఆయుర్వేద డాక్టర్ విస్మయ. కేరళలోని కొళ్లం ఆమెది. తల్లిదండ్రులు ఎంతో అపురూపంగా పెంచుకుని మంచి సంబంధం అని కొళ్లంలోని రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్‌లో అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న కిరణ్ కుమార్‌కు ఇచ్చి 2020లో పెళ్లి చేశారు. కాని పెళ్లయిన కొన్నాళ్లకే ఇచ్చిన 10 లక్షలు చాలవని ఇంకో పది లక్షలకు వేధించడం మొదలెట్టాడు కిరణ్. కారు ఇస్తే లగ్జరీ కారు ఇవ్వలేదని పేచీ పెట్టాడు. ఆమెను భౌతికంగా గాయపరిచే స్థాయికి వెళ్లాడు. ఇవన్నీ విస్మయ తల్లిదండ్రులకు చెప్పింది. కొన్నాళ్లకు వాళ్ల దగ్గరికే వచ్చి ఉండిపోయింది. మళ్లీ ‘లోకం ఏమనుకుంటుంది’ అనే భయంతో భర్త దగ్గరకు వెళ్లింది. జూన్ 21న ఆమె ఉరి పోసుకొని కనిపించింది. దీనిపై కేరళ అట్టుడికింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెంటనే ఇలాంటివి సహించేది లేదని చెప్పారు. మరోవైపు కిరణ్ పని చేస్తున్న ట్రాన్స్పోర్ట్ శాఖ మరుసటి రోజే అతణ్ణి సస్పెండ్ చేసి మెమో ఇచ్చింది. అంతర్గత విచారణకు ఒక సీనియర్ ఆఫీసర్‌ను నియమించి 45 రోజుల గడువు ఇచ్చింది. కేరళ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనల ప్రకారం కట్నం ఇవ్వడం తీసుకోవడం రెండూ కాండక్ట్ అతిక్రమణ కిందకు వస్తాయి. విచారణ చేసిన సీనియర్ అధికారి కిరణ్ వాట్సప్ సందేశాలు, ఇతర ఆధారాల ప్రకారం కట్నం కోసం భార్యను వేధించినట్టు తేల్చాడు. నివేదిక వచ్చిన వెంటనే కిరణ్‌ను ప్రభుత్వం ఉద్యోగం నుంచి ఊడబెరికింది. వరకట్నం కేసుల్లో ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. కేరళ ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆంటోని రాజు ఒక ప్రకటన చేస్తూ ‘పోలీసు విచారణతో సంబంధం లేకుండానే శాఖాపరమైన ఎంక్వయిరీలో ఈ నిర్ణయం తీసుకున్నాం. కిరణ్ పెన్షన్‌కు అప్లై చేయడానికి కూడా వీలు లేదు. పెన్షన్ ఇవ్వం. అలాగే ఇక మీద అతడు ఏ విధమైన ప్రభుత్వ ఉద్యోగానికి కూడా అనర్హుడు’ అన్నారు. అంతేకాదు ‘ప్రభుత్వ ఉద్యోగులూ... బహుపరాక్. ఇది ఒక హెచ్చరిక అని తలవండి. వరకట్నం గురించి ఎవరు వేధించినా వారిపై ఇదే చర్య ఉంటుంది’ అన్నారు. కిరణ్ ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. డిక్లరేషన్ ఇవ్వాలి కేరళ ప్రభుత్వం వరకట్న హత్యల నేపథ్యంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌ను వరకట్న నిరోధక ప్రధాన అధికారిగా కూడా నియమించింది. అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెళ్లయిన నెలరోజుల లోపు ‘వరకట్నం తీసుకోలేదు, తీసుకోబోము’ అని తప్పక డిక్లరేషన్ ఇవ్వాలని సర్క్యులర్ పంపింది. దాని మీద వధువు, వధువు తండ్రి, వరుడి తండ్రి కూడా సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం ప్రతి ఏటా ఇకపై నవంబర్ 26ను ‘వరకట్న వ్యతిరేక దినోత్సవం’గా నిర్వహించనుంది. ఆ రోజున అన్ని స్కూళ్లు, కాలేజీలలో వరకట్న వ్యతిరేక ప్రతిజ్ఞను చేయాలి. వరకట్నం ఒక అనాగరిక చర్య. అది లేని సమాజం కోసం కేరళ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అందరూ గమనించవలసినవి. -
విస్మయను బలిగొన్న కిరణ్‌కు తగిన శాస్తి.. అయినా సరిపోదు
తిరువనంతపురం: రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన విస్మయ మృతి కేసులో ప్రధాన నిందితుడైన ఆమె భర్త ఎస్. కిరణ్ కుమార్‌కు కేరళ సర్కారు షాకిచ్చింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా కొల్లాం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్(30), కడక్కల్‌లోని కైతోడ్ నివాసి అయిన విస్మయ వి నాయర్(23)కు గతేడాది పెద్దలు వివాహం చేశారు. మోటార్ వెహికిల్స్ ఇన్స్పెక్టర్ అయిన కిరణ్‌కు పెళ్లి సమయంలో భారీగా కట్నకానుకలు ఇచ్చారు విస్మయ తల్లిదండ్రులు. 800 గ్రాముల బంగారం, సుమారు ఒక ఎకరం భూమి, ఖరీదైన కారు ముట్టజెప్పారు. అయితే, పెళ్లైన కొన్నాళ్లకే అదనపు కట్నం కోసం కిరణ్ విస్మయను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. కొత్త కారు, ఇంకొంత నగదు కావాలంటూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన పుట్టింటి వాళ్లకు పంపిన విస్మయ, ఈ ఏడాది జూన్‌లో వాష్‌రూంలో విగతజీవిగా కనబడింది. దీంతో అత్తింటి వాళ్లే ఆమెను హతమార్చారని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా విస్మయ మృతి కేసుతో కేరళలో ఒక్కసారిగా ప్రకంపనలు చెలరేగాయి. సోషల్ మీడియాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది. వరకట్న పిశాచికి వ్యతిరేకంగా మరోసారి ఉద్యమాలు ఉధృతమయ్యాయి. అదే విధంగా విస్మయను బలిగొన్న కిరణ్‌కు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో పోలీసులు అతడిని అరెస్టు చేయగా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా కిరణ్‌కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కేరళ రవాణా శాఖా మంత్రి ఆంటోనీ రాజు వెల్లడించారు. ‘‘విస్మయ మృతి కేసులో అరెస్టైన కిరణ్ కుమార్‌పై విచారణకు ప్రభుత్వ విభాగానికి 45 రోజుల పాటు గడువు విధించాం. శుక్రవారం నాటితో అది పూర్తయింది. పోలీసులు సేకరించిన వివరాలు, కిరణ్ వాంగ్మూలం, మిగతా ఆధారాలు అన్నీ.. అతడు సర్వీసు నిబంధనలు ఉల్లంఘించాడని నిరూపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగం నుంచి తీసేశాం’’ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో విస్మయను అన్యాయంగా పొట్టనబెట్టుకున్న కిరణ్ కుమార్‌కు తగిన శాస్తి అయ్యిందని, అయితే అతడికి మరింత కఠినమైన శిక్ష పడితేనే ఆమె ఆత్మకు శాంతి కలుగుతుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Savita Punia: ఏడవద్దు.. తలెత్తుకో.. చేయగలిగిందంతా చేశావు! -
‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సమ్మతమే’. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. ప్రవీణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా గురువారం (జూలై 15) కిరణ్ అబ్బవరం బర్త్ డే సందర్భంగా ‘సమ్మతమే’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఓ గ్రామంలోని ఇంటి వరండాలో కూర్చుని అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతున్న యవకుడిగా కిరణ్ అబ్బవరం, అతన్ని చూస్తూ ఎఫెక్షన్ ఫీల్ అవుతూ చాందినీ చౌదరి కనిపిస్తున్నారు.గడ్డంతో కిరణ్ హ్యాండ్సమ్ కనిపిస్తుంటే, చీరకట్టులో చాందినీ చౌదరి అందంగా కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. -
దారుణం: భర్త అంత్యక్రియలు.. ఆ వెంటనే భార్య ఆత్మహత్య
మండ్య: జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటానని ఏడడుగులు నడిచిన భర్త అంతలోనే దూరం కావడం ఆమెను తీవ్ర వేదనకు గురిచేసింది. భర్త అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత ఇంటికి వచ్చిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లిలో జరిగింది. వివరాలు.. కిరణ్ (30), పూజా (22)లకు 11 నెలల క్రితమే వివాహం జరిగింది. బొమ్మనహళ్లిలోనే కాపురం ఉన్నారు. కిరణ్ గుండెజబ్బుతో బాధపడుతూ బెంగళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఉదయం చనిపోయాడు. బంధువులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత పూజా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంతలోనే మరో దారుణంతో ఇరు కుటుంబాలు నిశ్చేష్టులయ్యాయి. కొంతసేపటికి ఆమె మృతదేహానికి కూడా అంత్యక్రియలు జరిపించారు. -
బైడెన్ టీమ్ మరో భారతీయ మహిళా కిరణం
అమెరికాలో 20 లక్షల 80 వేల మంది ‘ఫెడరల్’ ఉద్యోగులు ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడు కొత్త బాస్ మన భారతీయ మహిళ కిరణ్ అహూజా! స్వయంగా బైడెనే తన ఎంపికగా ఆమెను నియమించారు. ‘ఉద్యోగుల ప్రియబాంధవి’ గా ఆమెకు ఎంత మంచి పేరుందంటే యూఎస్‌లోని అన్ని వర్గాల ఉద్యోగులూ ‘ఈ తరుణంలో జరగవలసిన నియామకం’ అని బైడెన్‌ని అభినందిస్తున్నారు. కిరణ్ అహూజాకైతే ఈ అభినందనలు ఆమె ‘లా’ డిగ్రీ పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పటినుంచీ పుష్పగుచ్చంలా చేతికి అందుతూ ఉన్నవే! పాలనలోని అన్ని విభాగాలు, చట్టసభలు, రక్షణ రంగంలోని సిబ్బంది అంతా యూఎస్‌లో ఫెడరల్ సిబ్బందే. ఉద్యోగులుగా అభ్యర్థుల నియామకం మొదలు, పదవీ విరమణ వరకు వారి జీతాలు, సర్వీసులు, పదోన్నతులు, సంక్షేమ సదుపాయాలు, సౌకర్యాలు.. వీటన్నిటినీ యూ.ఎస్.లోని ఒ.పి.ఎం. చూస్తుంటుంది. ఒ.పి.ఎం. అంటే ఆఫీస్ ఆఫ్ పర్సనెల్ మేనేజ్మెంట్. సిబ్బంది నిర్వహణ కార్యాలయం. ప్రధాన కేంద్రం వాషింగ్టన్ డీసీలో ఉంది. ఆ ఒ.పి.ఎం. కే ఇప్పుడు భారత సంతతికి చెందిన కిరణ్ అర్జున్‌దాస్ అహూజా డైరెక్టర్‌గా వెళ్లబోతున్నారు. సెనెట్ ఆమె నియామకాన్ని ఆమోదించగానే ఒ.పి.ఎం. ఆమె చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఇక అమెరికన్ ఉద్యోగుల బాగోగులన్నీ కిరణ్‌వే. కిరణ్‌నే ఈ పదవిలో నియమించడానికి తగినన్ని కారణాలే ఉన్నాయి. అధికార శ్రేణిలోని పదోన్నతి అంచెలలో భాగంగా చూస్తే.. కిరణ్ రెండున్నరేళ్ల పాటు 2015 నుంచి 2017 వరకు ఒ.పి.ఎం. డైరెక్టర్‌కు ‘చీఫ్ ఆఫ్ స్టాఫ్’గా పని చేశారు కాబట్టి పై అంచెగా ఆమె డైరెక్టర్ అయ్యారని అనుకోవాలి. అయితే అది మాత్రమే ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లిందని చెప్పడానికి లేదు. 49 ఏళ్ల కిరణ్.. పౌరహక్కుల న్యాయవాది. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవల సంస్థలకు నేతృత్వం, నాయకత్వం వహించిన అనుభవం ఆమెకు ఉంది. ప్రస్తుతం ఆమె యూఎస్‌లోని పరోపకార సంస్థల ప్రాంతీయ యంత్రాంగం అయిన ప్రసిద్ధ ‘ఫిలాంథ్రోఫీ నార్త్‌వెస్ట్’ కు సీఈవోగా ఉన్నారు. ఒబామా అధ్యక్షుడిగా, బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆరేళ్లపాటు ఏషియన్ అమెరికన్లకు ప్రాధాన్యం ఇచ్చి, వారికి మెరుగైన అవకాశాలను కల్పించే ‘వైట్ హౌస్ ఇనీషియేటివ్’ కార్యక్రమానికి కిరణ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆనాటి ఆమె పని తీరును బైడెన్ ప్రత్యక్షంగా చూడటం కూడా ఇప్పుడీ అత్యంత కీలకమైన ఒ.పి.ఎం. డైరెక్టర్ పదవికి ఆమె నామినేట్ అయేందుకు దోహదపడింది. 2003–2008 మధ్య నేషనల్ ఏషియన్ పసిఫిక్ ఆమెరికన్ ఉమెన్స్ ఫోరం వ్యవస్థాపక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె అందించిన సేవలూ ఈ కొత్త పదవికి అవసరమైనవే. పౌరహక్కుల న్యాయవాదిగా కిరణ్ కెరీర్ ఆరంభం కూడా అత్యంత శక్తిమంతమైనది. స్కూల్ సెగ్రెగేషన్ మీద (బడులలో పిల్లల్ని జాతులవారీగా వేరు చేసి కూర్చొబెట్టడం), జాతివివక్ష వేధింపుల మీద ‘యు.ఎస్. డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్’లో కేసు వేసిన తొలి న్యాయ విద్యార్థిని ఆమె. ∙∙ కిరణ్ అహూజా జార్జియా రాష్ట్రంలోని సవానాలో పెరిగారు. ఆమె తల్లిదండ్రులు డెబ్బైలలో ఇండియా నుంచి అమెరికా వెళ్లి స్థిరపడినవారు. జార్జియా యూనివర్సిటీలోనే ఆమె ‘లా’ లో పట్టభద్రురాలయ్యారు. ఒ.పి.ఎం.లో ట్రంప్ చేసి వెళ్లిన అవకతవకల్ని సరిచేసేందుకే బైడెన్ ఈ పోస్ట్‌లో ఆమెను నియమించారని ‘వాషింగ్టన్ పోస్ట్’ రాసింది. అమెరికాకు మరొక ఆశా కిరణం అనే కదా అర్థం. కిరణ్ అర్జున్‌దాస్ అహూజా -
ఇప్పుడు మాత్రమే కాదు.. అప్పుడూ ఇదే పాట
కేంద్ర ప్రభుత్వం 2020 సెప్టెంబరులో మూడు వ్యవసాయ బిల్లులను ఆమోదింపచేసుకుంది. ఇవి వ్యవసాయ సంస్కరణలను ఆటో పైలట్ మోడ్‌లో ఉంచాయి. 1991లో సరళీకరణ కూడా ఇలాంటి ప్రభావాన్నే తీసుకొచ్చింది. ఆరోజు కూడా ప్రతిపక్షాలు సరళీకరణను ఇలాగే అడ్డుకున్నాయి కానీ కాలం గడిచే కొద్దీ వారి అభిప్రాయం తప్పని రుజువైంది. వ్యవసాయ రంగంలో తలుపులు తెరవడం పట్ల రైతులు సానుకూల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాలు, స్వార్థ ప్రయోజనాలు కలిసి 1991లో సంస్కరణలు ప్రారంభించిన ఆ పరమాద్భుత క్షణాల్లోకి వెళ్లకుండా భారతీయ వ్యవసాయాన్ని అడ్డుకుంటున్నాయి. ఇన్నేళ్ల తర్వాత వ్యవసాయ బిల్లులు ఆనాటి సరళీకరణను తలపిస్తూ దేశ వ్యవసాయ సంస్కరణలను ఆటో–పైలట్ మోడ్‌లో ఉంచాయి. ఇప్పటిలాగే ఆనాడు కూడా పెడబొబ్బలు పెట్టే ప్రతిపక్షం ఉండేది. కానీ వారి అరుపులన్నీ కాలం గడిచే కొద్దీ తప్పు అని రుజువయ్యాయి. ప్రజాస్వామ్యానికి అధికార వాణిగా పేరొం దిన థామస్ జెఫర్సన్ చెప్పారు.. ‘‘వ్యవసాయం అనేది అత్యంత తెలివైన అన్వేషణ. ఎందుకంటే అంతిమంగా అది దేశ నిజమైన సంపదకు, మంచి నైతిక విలువలకు, సంతోషానికి తోడ్పడుతుంది’’. భారతీయ వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యతను ఆయన మాటలు చక్కగా వర్ణిస్తాయి. 73 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత, శతాబ్దాల వ్యవసాయ అనుభవం తర్వాత కూడా మనం ఆయన ప్రకటన సారాంశాన్ని అర్థం చేసుకోవడం లేదు. సంవత్సరాలుగా, ఇంకా చెప్పాలంటే దశాబ్దాలుగా వ్యవసాయం ఒక ప్రత్యేక రంగంగా విడిగా నడుస్తోంది కానీ జాతీయ ఆర్థిక వ్యవస్థతో అది మిళితం కావడం లేదు. దేశంలో 70 శాతం గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నాయి. దేశ స్థూలదేశీయోత్పత్తిలో 17 శాతాన్ని మాత్రమే అందిస్తున్న వ్యవసాయ రంగం మొత్తం జనాభాలో 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిస్థితి ఏకకాలంలో ఉపాధి లేమిని, అరకొర ఉపాధిని ప్రతిబింబిస్తోంది. అయినప్పటికీ వ్యవసాయ రంగ శక్తిసామర్థ్యాలు అపారమైనవి. కోవిడ్–19 మహమ్మారి కాలంలో వేగంగా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులవైపు దిశను మార్చుకున్న వ్యవసాయ విధానాలు మరింతగా విస్తరించాయి.అదేసమయంలో సవాళ్లు కూడా తక్కువగా లేవు. ప్రకృతిలో అనూహ్య మార్పులు చాలా తరచుగా సంభవిస్తున్నాయి. దీంతో అకాల వర్షాలు, కరువులు పదే పదే వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇక రాజకీయ జోక్యం అనే మరో సవాలు సంస్కరణల పురోగతిని గణనీయంగా అడ్డుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాల అమలు విషయంలో పంజాబ్ తీవ్ర సమస్యలను సృష్టిస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన తాజా వ్యవసాయ చట్టాలు కనీస మద్దతు ధరను ఎత్తివేయడానికి దారి తీస్తాయని, బడా కార్పొరేట్ వర్గాల దయాదాక్షిణ్యాలకు తమను బలిచేస్తారని భావిస్తుండటంతో రైతులు తమ నిరసనలపట్ల ఎలాంటి బాధను, పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచడం లేదు. చిట్టచివరి వారికి కూడా చేరేలా (ఎల్ఎమ్సి) పథకాల ఏర్పాట్లు ఉంటేనే భారతీయ అమలు వ్యవస్థ విజయవంతం అవుతుంది.. గ్రామీణ భారతానికి ఇది మరీ ఎక్కువగా వర్తిస్తుంది. కోవిడ్ మహమ్మారి ఈ ఎల్ఎమ్సి ప్రాధాన్యతను ఒక్కసారిగా వేగవంతం చేసింది. అందుకే ఆత్మనిర్భర ఉద్యమంలో భాగంగా వివిధ ప్రకటనలను కేంద్రం జారీ చేసింది. సమీకృత ఆర్థిక వృద్ధిని సాధించడానికి ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్తు, నీటి సరఫరా అనేవి ప్రాణాధారమైనవి. కోవిడ్ కాలంలో వ్యవసాయ రంగం మాత్రమే గణనీయ వృద్ధిని నమోదు చేసింది. కరోనా కాలం లోనే వరి ఎగుమతులు బాగా పెరి గాయి. నెస్టిల్, డాబర్, బ్రిటానియా వంటి కంపెనీలు గ్రామీణ ప్రాంతాలకు శరవేకంగా తమ నెట్‌వర్క్‌లను విస్తరించాయి. అనుకూలమైన రుతువులు, కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర గరిష్టంగా ఉండటం, వలసబాట పట్టిన వారు తిరిగి తమ ఊళ్లకు చేరుకోవడం, ప్రభుత్వ సంక్షేమ చర్యలు పుంజుకోవడం వంటివి దీనికి మరింతగా దోహదం చేశాయి. అదే సమయంలో సరళీకరణ ప్రారంభ దిశలో అంటే 1991లో వ్యవసాయదారులు అద్భుత క్షణాలను ఆస్వాదించారు. చాలా కాలం తర్వాత 2020 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ బిల్లులను చట్టరూపంలోకి తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టాలు స్తబ్దంగా ఉండిపోయిన వ్యవసాయ రంగాన్ని పునరుత్తేజం చెందించే లక్ష్యంతో వరుస సంస్కరణలకు తాజా వ్యవసాయ చట్టాలు వీలు కల్పిస్తున్నాయి. అయితే వీటి ద్వారా ప్రయోజనాలు పొందే అన్ని వర్గాలు దాపరికం లేని మనస్తత్వంతో వ్యవహరించాలి. అయితే ప్రస్తుతం ఇది సాధ్యమయ్యేటట్లు కనిపించడం లేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్లాలు కేంద్ర బిల్లులను రాజకీయంగా వ్యతిరేకించడం ప్రారంభించాయి. మరోవైపున ఈ సంస్కరణలు చిన్న, సన్నకారు రైతులను భయాందోళనల్లో ముంచెత్తుతున్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి భారతీయ వ్యవసాయ రంగం మార్కెట్ ఆధారిత రంగంలోకి ప్రవేశించే క్రమంలో ఉంది. వ్యవసాయ విలువ ఆధారిత సరఫరా చెయిన్‌ను వేగవంతం చేయడానికి, మధ్యదళారుల నుంచి చిన్న, సన్నకారు రైతులను విముక్తి చేయడానికి, విత్తులు నాటిన సమయం నుంచే ముందే నిర్దేశించిన మార్కెట్ ధరతో రైతులు ప్రయోజనం పొందడం కోసం ఒక సమగ్రమైన, నిలకడైన చట్రాన్నితీసుకురావడానికి రైతులు వ్యవసాయంలో తలుపులు తెరవడం పట్ల చైతన్యాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎట్టకేలకు వ్యవసాయం ఒక పరిణిత రంగంగా మార్పు చెందుతోంది. భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య ఉల్లిపాయలు, యాపిల్స్ వంటి ఉత్పత్తులను దీర్ఘకాలం పాటు శీతలీకరించేందుకు గానూ పది వేల టన్నుల సామర్థ్యంతో కూడిన ఉష్ణోగ్రతల నియంత్రిత గిడ్డంగులను ఏర్పరుస్తోంది. ఇది రైతులకు మేలు చేయడమే కాకుండా ధరల స్థిరీకరణకు కూడా తోడ్బడుతుంది. వ్యవసాయ అభివృద్ధిలో టెక్నాలజీని వర్తింపజేయడం వేగం పుంజుకుంది. కొన్ని టెక్నాలజీ సంస్థలు డేటా ఆధారిత వ్యవసాయాన్ని స్పెషలైజ్ చేస్తున్నాయి. వాతావరణానికి అనుగుణమైన వ్యవసాయంపై దృష్టి తప్పనిసరి అవుతోంది. వ్యవసాయరంగ దుస్థితి దాని కారణంగా ఏర్పడుతున్న నిరుద్యోగిత అనే అతిపెద్ద కొరతను తీర్చడానికి కార్యాచరణ పథకం అవసరం అవుతుంది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న పంజాబ్‌ని వ్యవసాయ సంస్కరణలలో బీహార్ మార్గంలో వెళ్లడానికి అనుమతించకూడదు. వ్యవసాయ సంస్కరణలు రాజకీయ సులోచానాల నుంచి చూడకూడదు. పంజాబ్ రాష్టం తన సొంత వ్యవసాయ బిల్లులను ఆమోదించిన తరుణంగా పంజాబ్ రైతులు ఢిల్లీకి ఎందుకు దండు కట్టారన్నదే సమస్య. పంజాబ్ రాష్ట్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లులు ఉత్తమంగా ఉన్నాయని భావిస్తున్న ఆ రాష్ట్ర రైతులు కేంద్రం తీసుకొచ్చిన బిల్లులను మాత్రం వ్యతిరేకిస్తూ రాజకీయ ప్రకటనలను తలపించే మాటలు మాట్లాడుతూ న్యాయ పోరాటానికి కూడా దిగుతున్నారు. అయితే ఇటీవలే ఉల్లిపాయల ఎగుమతుల విషయంలో చేసినట్లు తాత్కాలిక ప్రయోజనాలతో కూడిన రాజకీయాలను అందరూ నిలిపివేయాలి. వాస్తవానికి పురోగామి స్వభావం కలిగిన వ్యవసాయ సంస్కరణలను ఉపయోగించుకోవడానికి రాష్ట్రాల మధ్య పోటీ తత్వం ఉండాలి. అన్ని స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలనూ వ్యవసాయ ప్రయోజానాలను ప్రోత్సహించేలా కుదుర్చుకోవాలి. ప్రకృతి సహజమైన, సాస్కృతిక పరమైన వనరులు సమృద్ధిగా ఉన్న భారత్‌లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ–పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యలు చేపట్టాలి. వ్యవసాయ సంస్కరణలు అమలు కావాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. వ్యవసాయ బిల్లులు ఆహార భద్రతకు హామీ ఇస్తున్నప్పటికీ, వినియోగదారుల మనోభావాలపై ప్రభావం చూపేలా దాన్ని అనుమతించకూడదు. కిరణ్ నందా, కార్పొరేట్ ఆర్థికవేత్త -
‘సెబాస్టియన్ పీసీ.524’ షూటింగ్ ప్రారంభం
సాక్షి, మదనపల్లె: ఎలైట్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్స్‌లో ‘సెబాస్టియన్ పీసీ.524’ సినిమా షూటింగ్ బుధవారం పట్టణంలోని సొసైటీకాలనీ రామాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. రాజావారు రా ణిగారు, ఎస్సార్ కల్యాణమండపం ఫేమ్ కిరణ్ అ బ్బవరం హీరోగా, నూతన దర్శకుడు బాలాజీ స య్యపురెడ్డి దర్శకుడిగా, నమృత థారేకర్, కోమలిప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది. మదనపల్లె నేపథ్యం కథాంశంగా పోలీ సు ఓరియంటెడ్ మూవీగా పట్టణ పరిసర ప్రాంతాల్లో 27 రోజులు సింగిల్ షెడ్యూల్లో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చిత్ర నిర్మాతలు తెలిపారు. పట్టణంలో చారిత్రక కట్టడాలు, చుట్టూ కొండలు, న్యాయస్థానాలు, భవనాలు పాతతరానికి చెందినట్లుగా సహజంగా ఉండడంతో ఇక్కడ సినిమా చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి రాజ్. కె.నల్లి సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరిస్తారని, తప్పకుండా అందరినీ అలరించే మంచి చిత్రమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలో సినిమా షూటింగ్ జరుగుతుందనే విషయం తెలియడంతో పలువురు చిత్రీకరణను చూసేందుకు ఆసక్తి కనపరిచారు. సొసైటీకాలనీ రామాలయంలో ‘సెబాస్టియన్ పీసీ.524’ చిత్రబృందం -
రెచ్చిపోదాం
కిరణ్, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో ఏకే జంపన్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రెచ్చిపోదాం బ్రదర్’. వీవీ లక్ష్మి, హనీష్ బాబు ఉయ్యూరు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. సాయి కార్తీక్ స్వరాలను అందించారు. మా సినిమా లిరికల్ సాంగ్ ‘జాగో..’ను ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేయగా 1 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇందుకు సాయి కార్తీక్ సంగీతం, భాస్కరభట్ల లిరిక్స్, భాను కొరియోగ్రఫీనే కారణం’’ అన్నారు. -
అదే నా లక్ష్యం
‘‘నాది వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి. సినిమాల్లో నటించాలనే ఆసక్తి 2016లో కలిగింది. ఏడు షార్ట్స్ ఫిల్మ్స్‌లో నటించిన తర్వాత ఇక సినిమాలు చేద్దామనుకున్నా. ఆ సమయంలో డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఏర్పడిన పరిచయంతో ‘రాజావారు రాణిగారు’ చిత్రం చేశా’’ అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. నేడు ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ‘‘నటుడిగా నా మొదటì పుట్టినరోజు ఇది. ఈ సందర్భంగా నా కొత్త సినిమా ‘సెబాస్టియన్’ని ఈరోజు ప్రకటిస్తున్నాం. బాలాజీ అనే కొత్త అతను దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం నేను హీరోగా ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా నిర్మిస్తున్న ఎలైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంలోనే ప్రమోద్, రాజుగార్లు ఈ సినిమాని కూడా నిర్మిస్తారు. కల్యాణ మండపం నేపథ్యంలో ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమా ఉంటుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. 1975 అని పెట్టడానికి కారణం కల్యాణ మండపం ఆ టైమ్‌లో కట్టిందని చెప్పడానికే. లవ్‌స్టోరీ, తండ్రీ కొడకుల మధ్య బంధం, స్నేహం.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్న చిత్రమిది. ఇందులోని పాత్రలన్నీ కడప జిల్లా యాసలోనే మాట్లాడతాయి. ఈ సినిమా చిత్రీకరణ అంతా కడప జిల్లాలోనే ప్లాన్ చేశాం. నిర్మాతలు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికి 40 శాతం అయ్యింది. లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఈ సినిమా షూటింగ్లో సాయికుమార్, తనికెళ్ల భరణిగార్ల నుంచి చాలా నేర్చుకున్నాను. ఈ చిత్రదర్శకుడు శ్రీధర్‌కి ఇది తొలి సినిమా. ముందు ‘1991’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. నాలుగేళ్లుగా కలసి ప్రయాణం చేస్తున్నాం. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ నేనే రాశాను. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చేతన్ భరద్వాజ్‌గారు మా చిత్రానికి 6 మంచి పాటలిచ్చారు. అన్ని పాటలూ భాస్కరభట్లగారు రాశారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘హీరోలు కృష్ణ, చిరంజీవిగార్లు ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు. వాళ్లలా మంచి నటుడనిపించుకోవాలనుకుంటున్నాను. ఏ పాత్ర అయినా పోషించగలననే పేరు తెచ్చుకోవడమే నా లక్ష్యం’’ అన్నారు కిరణ్. -
కిరణ్..కిరాక్
ఆల్విన్‌కాలనీ: కూకట్‌పల్లిలోని క్రిస్ గెతిన్ లుకింగ్ జిమ్ సెంటర్లో ప్రముఖ బాడీ బిల్డర్ కిరణ్ డెంబ్లా ఆదివారం సందడి చేశారు. వివిధ రకాల విన్యాసాలను ప్రదర్శించారు. చిన్నప్పటి నుంచే బాడీ బిల్డింగ్‌లో రాణించిన కిరణ్.. 45 ఏళ్ల వయసులోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా బాడీ బిల్డర్‌గా గుర్తింపు పొందారు. ఎంతో మంది మహిళలకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ నెల 7న లండన్‌లో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు. -
లేడీస్ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు...
డబ్బులు ఊరికే రావు అన్న మాటకు పేటెంట్ లలితా జ్యుయెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. కిరణ్ కుమారే! మనకి డబ్బు ఊరికే రాదన్న విషయం గ్రహించిన వ్యక్తి .. మన కష్టాన్నే కాదు..డబ్బు విలువను కూడా గ్రహించినట్టే! విలువలు చదువుకుంటే రావు... అనుభవాలే విలువలకు పాఠాలు! వజ్రం విలువ తెలిసినవాడు మనిషి విలువను తెలుసుకుంటే ఆ మనిషే ఒక వజ్రం అవుతాడు! తన జీవితంలోని కష్టసుఖాలను తరుగుపెట్టి సాక్షికి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ... బిజినెస్ చాలా ఈజీ.. ఎంత పెద్ద చదువులు చదువుకున్నా నెల జీతం దగ్గరే ప్లాన్ చేసుకుంటోంది యూత్. ప్రతివాళ్లూ పది నుంచి అయిదు గంటల ఉద్యోగాలనే సౌకర్యంగా ఫీలవుతున్నారు. దానికే మైండ్‌ను సెట్ చేసుకుంటున్నారు. కూలి పనికి చదువెందుకు చెప్పండి? అందుకే యూత్ ఎంట్రప్రెన్యూర్షిప్వైపు రావాలి. రిస్క్ ఉంటుంది. తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రిస్క్ వద్దనుకుంటే ఇరవైవేల జీతానికే రాజీ పడి.. లైఫ్ పట్ల కంప్లయింట్స్ పెట్టుకోకూడదు. లైఫ్‌లో చాలెంజ్ ఉండాలి అనుకుంటే రిస్క్ తీసుకోవాలి. సొంతంగా వ్యాపారం మొదలుపెట్టాలి. లక్ష రూపాయల పెట్టుబడితో అయినా సరే వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. నిజానికి బిజినెస్ చాలా ఈజీ. నాకు ఆరుగురు అక్కయ్యలు, ఒక్క అన్న.. మొత్తం ఎనిమిదిమందిమి. ప్రతి పూటా కడుపు నిండా భోజనం మాకు చాలెంజే! ఇంట్లో అందరికీ మంచి గుడ్డలు లేక అందరం కలిసి ఒకేసారి బయటకు వెళ్లలేకపోయేవాళ్లం. గుడ్డల దాకా ఎందుకు అందరికీ సరిపడా భోజనం కూడా ఉండేది కాదు. అది మాకు తెలియనివ్వకుండా మేనేజ్ చేసేది మా అమ్మ. అయినా గుర్తుపట్టి ఆకల్లేదు అంటూ ఆ బాధను దిగమింగుకునేవాళ్లం. చెప్పాలంటే ఇలాంటివి బోలెడు. అదో స్ట్రగుల్. నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటుంది.. రోజూ రాత్రి పడుకునే ముందు అమ్మ ‘‘ ఎలాగోలా ఈ రోజు గట్టెక్కింది. రేపు ఎలా గడిచిపోయింది?’’ అని ఆలోచిస్తూనే పడుకునేది. అందుకే లేమిని ఎలా అనుభవించామో గుర్తుపెట్టుకుంటే కలిమికి బానిసలం కాము. సౌకర్యాలు మనల్ని నడిపించకూడదు. వాటి అవసరమెంతో గ్రహించే విచక్షణ మనకుండాలి అంటాను. చదువు.. గురువులు బడికి వెళ్లి నేను చదువుకుంది లేదు. చిన్నప్పటి నుంచి నేను ఎదుర్కొన్న పరిస్థితులే నాకు గురువులు. నేనేం సాధించినా జీవిత పాఠాల సారంతోనే. ఎంత చదువుకున్నా, ఎంత మంచిగా ఉన్నా.. ఎన్ని గొప్ప పనులు చేసినా సరే.. మన దగ్గర డబ్బులుంటేనే గుర్తింపు ఉంటుంది. జీవిత భాగస్వామి నా భార్యా వాళ్లది మా కన్నా కాస్త కలిగిన కుటుంబం. అయినా కష్టం విలువ తెలిసిన మనిషి. వృథాగా ఖర్చు పెట్టదు. ఇల్లు, ముగ్గురు పిల్లలు, వాళ్ల చదువుల బాధ్యతంతా ఆమెదే. ఈ మధ్య నుంచే బిజినెస్‌లో కూడా హెల్ప్ చేస్తోంది. వ్యాపారానికి సంబంధించి నా గురించి అన్నీ తెలిసిన ఒక నమ్మకమైన మనిషి తోడుగా ఉండడం చాలా అవసరం. లైఫ్ పార్టనర్‌ను మించిన రిలయబుల్ ఫ్రెండ్ ఎవరుంటారు? ఎవరికైనా?. డైమండ్స్ జ్యుయెలరీ వింగ్‌ను ఆమెకు అప్పజెప్పాను. ఓ వైపు డైమండ్ జ్యుయెలరీ డిజైన్స్, ప్రైజ్ చూసుకుంటూనే నెమ్మదిగా పర్చేజ్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ గురించీ తెలుసుకుని ప్రస్తుతం వాటినీ కమాండ్ చేస్తోంది. భార్య హేమా కిరణ్‌కుమార్, కూతుళ్లు భక్తి కిరణ్, భవ్య కిరణ్, కొడుకు హీత్ కిరణ్‌లతో లలితా జ్యుయెలరీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎమ్. కిరణ్‌కుమార్ వాళ్లేం చెప్పినా మన మంచికే నా భార్య సలహాలను తప్పకుండా పాటిస్తా. నా కన్నా ఆమెకే ముందు చూపు ఎక్కువ. ఆ మాటకొస్తే ఆడవాళ్లందరికీ ముందు చూపు ఉంటుంది. మగవాళ్ల కన్నా లోతుగా ఆలోచిస్తారు. మగవాళ్లు ఏ ఆలోచన లేకుండానే ఓ మాట అనేస్తారు. కాని ఆడవాళ్లు అలా కాదు. వాళ్లలో బ్యూటీ అదే. ఉదాహరణకు.. నా స్టాఫ్ ఎవరైనా వచ్చి ‘‘అన్నా .. ఒక ప్రాబ్లం వచ్చింది. నాకో లక్ష రూపాయిలు కావాలి’’ అని అడిగితే ‘‘సరే.. ఇస్తాలే’’ అనేస్తా. అదే మా ఇంట్లో పనమ్మాయి మా ఆవిడను ఒక పదివేలు అడిగిందనుకోండి. ‘‘ఏమైంది? పోయిన్నెలే తీసుకున్నావ్ కదా? మళ్లీ ఎందుకు అవసరమొచ్చింది? బాబుకు బాగాలేదా?’’ అంటూ మా ఆవిడ ఆమెను ఓ పది ప్రశ్నలు అడుగుతుంది. బాగాలేదు అని పనమ్మాయి జవాబిస్తే.. డ్రైవర్‌ను పురమాయిస్తుంది ‘‘వెళ్లి వాళ్ల బాబును చూసిరా’’ అంటూ. అంటే నిజంగానే ఆ పదివేలు తనకు అంత అర్జెంటా? లేక తాగుడుకో, ఇంక దేనికో భర్త సతాయిస్తే అడుగుతోందా అన్న విషయం తేల్చుకోవడానికి. సబబే అనిపిస్తే వెంటనే పదివేలు సర్దుతుంది. అంతెందుకు ‘‘నా పర్స్‌లో డబ్బులు అయిపోయాయి.. పెట్టు’’ అని నేను చెబితే కూడా ‘‘మొన్ననే 30 వేలు పెట్టాను. రెండు రోజుల్లోనే అయిపోయాయా? లెక్క చెప్పండి?’’ అంటుంది. అలా లేడీస్ అంతగుడ్డిగా దేన్నీ నమ్మరు. నిజానికి అంత ఈజీగా డబ్బూ ఖర్చుపెట్టరు. కాబట్టి ఆడవాళ్లు ఏదైనా చెబుతుంటే శ్రద్ధగా వినాలి. ఆ ఆడవాళ్లు మీకేం తెలుసు? అని కొట్టిపారేయొద్దు. వాళ్లేం చెప్పినా 99 శాతం మన మంచికే. మీ మేలు కోరుకొనే ఒకే ఒక్క మనిషి భార్యే. ఒకవేళ భార్యలో మీకు లోపాలు కనిపించాయంటే అది కచ్చితంగా మీ తప్పే. మీలో నిజాయితీ, బాధ్యత లోపించిందన్నమాటే. భర్త.. భార్యను గౌరవిస్తే.. భార్యా.. భర్తను గౌరవిస్తుంది.. ప్రేమిస్తుంది. ఫ్యామిలీ టైమ్ ఏ కొంచెం టైమ్ దొరికినా కుటుంబంతో గడుపుతా. ఇంట్లో ఉన్నా ఆలోచనలన్నీ బిజినెస్ చుట్టే తిరుగుతుంటాయి. మాట్లాడుతూనే మైండ్‌లో పది ప్లాన్స్ తయారైపోతాయి. కాని బయటకు కనపడనివ్వను . ఊర్లో ఉంటే కచ్చితంగా రాత్రి భోజనం అందరం కలిసే చేస్తాం. హోటల్స్‌లో డిన్నర్స్ చాలా రేర్. ఏ మాత్రం వీలున్నా ఫ్యామిలీతో షాపింగ్ కూడా చేస్తా. ఒకవేళ కుదరకపోతే మా ఆవిడ తనకు నచ్చినవన్నీ ఫొటోస్ తీసి నాకు వాట్సప్ చేస్తుంది. సెలెక్ట్ చేయమని. ‘‘మీకు నచ్చినవి తీసుకోండి’’ అంటే వినదు. ఎలాగైనా నన్ను ఇన్వాల్వ్ చేయాలని (నవ్వుతూ). సమాజంలో స్త్రీల మీద పెరుగుతున్న దాడులు.. దేన్నయినా సహనంగా భరించే రోజులకు ఫుల్స్టాప్ పెట్టాలి. ఆడవాళ్లూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి. తమ జోలికి వచ్చిన మగవాళ్లకు తగిన బుద్ధి చెప్పాలి. రానున్న రోజులు మరింత గడ్డుకాలంగా కనబడ్తున్నాయి కాబట్టి ధైర్యంగా ఉండాల్సిందే. తోబుట్టువులు ఊహ తెలిశాక ఓ మూడు నాలుగేళ్లు ఎంజాయ్ చేసుంటానేమో పండుగలను! నాకు పన్నెండు, పదమూడేళ్లు వచ్చేసరికే ఇంట్లో పేదరికం అర్థమైపోయింది. అప్పటి నుంచీ పండుగలన్నిటికీ దూరం. దృష్టంతా డబ్బు సంపాదనమీదే. కాని రాఖీ పండుగ నాకు మంచి చైల్డ్ మెమరీ. మా అక్కయ్యలు రాఖీ కడితే.. ప్రతి అక్కయ్యకు రూపాయి పావలా ఇచ్చేవాడిని. అక్కయ్యలు బొట్టు పెట్టి.. రాఖీ కడుతుంటే ఆ ప్రేమ స్పర్శ నాకో భరోసానిచ్చేది. వాళ్లకు పెళ్లిళ్లై, పిల్లలు, ఆ పిల్లలకు పిల్లలు వచ్చాక ఎవరి కుటుంబాలతో వాళ్లు బిజీ అయ్యారు. అందుకే ఇప్పుడు రాఖీకి ఆ ప్రేమ పోస్ట్‌లో వస్తూంటుంది (నవ్వుతూ) మా అక్కయ్యలకు, నాకు మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. మా పెద్దక్కయ్యకు పెళ్లయి పాప పుట్టాక నేను పుట్టాను. అందుకే మా అక్కయ్యలందరిలో నేను అమ్మ ప్రేమనే ఆస్వాదించా. మా మూడో అక్కయ్యతో నాకు అటాచ్మెంట్ ఎక్కువ. ఆమే నాకున్న రెండు జతల బట్టలను శుభ్రంగా ఉతికి.. ఇస్త్రీ చేసి పెట్టేది. చిన్నప్పుడు నాకు జుట్టు బాగా ఒత్తుగా ఉండేది. అప్పట్లో పఫ్ తీసుకోవడం ప్యాషన్. అలా పఫ్ తీసి దువ్వి.. తనకు నచ్చినట్టుగా నన్ను తయారు చేసేది. చాలా మిస్ అవుతాను ఆ రోజుల్ని. అప్పుడున్న ప్రేమాప్యాయతలు వేరు. ఫ్రెండ్స్.. పార్టీలు.. అలాంటి వాతావరణంలో పెరగలేదు. కాబట్టి ఇప్పుడూ అవి అలవాటు కాలేదు. చాలా చాలా నార్మల్ లైఫ్. నాకు ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు. పార్టీలు, గెట్ టుగెదర్లు, ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడాలూ ఉండవ్. ఆ రోజు ఎలా బతికానో.. ఈ రోజూ అలాగే ఉన్నాను.. ఉన్నాం! ఆడపిల్ల.. మగ పిల్లాడు అనే భేదం.. ఎందుకు ఉండాలి? తల్లిదండ్రులకు బాగా లేదంటే ఎంతమంది మగపిల్లలు పరిగెత్తుకొస్తున్నారు? అదే కూతురైతే? పెళ్లయి అత్తారింట్లో ఉన్నా భర్త, అత్తమామలకు నచ్చజెప్పుకొని తల్లిదండ్రుల దగ్గరకు వస్తుంది. కళ్లలో పెట్టుకొని చూసుకుంటుంది. ఇదంతా ప్రేమతో చేస్తుంది.. ప్రతిఫలం ఆశించకుండా! కూతురు లేని ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీయే కాదు. నన్ను అడిగితే కూతురు చాలా ముఖ్యం.. కొడుకు సెకండ్ ముఖ్యం అంటాను. రిగ్రెట్స్.. నేనో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసినా.. కొత్త కారు కొనుక్కున్నా మా అమ్మానాన్న గుర్తొస్తారు. వాళ్లు లేకుండా ఇదంతా ఎక్స్పీరియన్స్ అవుతున్నానే అని చాలా రిగ్రెట్స్ ఫీలవుతా. కష్టాలు మాత్రమే అనుభవించి పోయారు. కనీసం కడుపు నిండా తిండిక్కూడా నోచుకోలేదు. కాని ఈ రోజు నాకున్నదంతా వాళ్ల ఆశీర్వాదమే. వాళ్ల బ్లెసింగ్స్తోనే ఈ స్థాయికొచ్చాను. ముఖ్యంగా మా అమ్మ ఆశీర్వాదం. ఎనిమిది మంది బిడ్డలు కాదు.. వేయి మంది బిడ్డలున్నా అందరికీ సమానంగా ప్రేమను పంచడం ఆమెకే సాధ్యం. ప్రతిరోజూ మా అమ్మానాన్న (షకాలి బాయి, మూల్‌చంద్ జీ) ఫొటోకు దీపం పెట్టి దండం పెడ్తాను. గంటలు గంటలు పూజలు, భజనలైతే చేయను కాని మనస్ఫూర్తిగా స్మరించుకుంటాను. సోషల్ మీడియా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నింటికీ దూరం. అసలు నాకు వాటి గురించి తెలియను కూడా తెలియదు. నా దగ్గరున్న కంప్యూటర్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా తెలియదు. మనుషులతో నేరుగా మాట్లాడ్డమే ఇష్టం. డబ్బులు ఊరికే రావు.. బంగారానికి బ్రాండ్ నేమ్ నాకు దేవుడు నా కస్టమర్. వాళ్లిచ్చిన డబ్బులతోనే నా తిండి, నా బట్టలు, కారు.. ఈ వ్యాపారమైనా. అలాంటి కస్టమర్‌కు డబ్బులు ఊరికే రావు కదా! ఈ నిజం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటిదాకా దీన్నిలా ఎవరూ అడ్రస్ చేయలేదు. గోల్డ్ ఇండస్ట్రీ.. ఆ మాటకొస్తే ఏ ఇండస్ట్రీ గురించైనా సామాన్యులకేం తెలుసు? లేబుల్ వేసి.. ఇదే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అంటే దాన్నే నమ్మి కొనుక్కుంటారు. నేను అలాంటి గిమ్మిక్కులు చేయకుండా డబ్బు కోసం పడే కష్టం విలువ తెలిసిన వాడిగా ప్రొడక్ట్ క్వాలిటీ పట్ల కస్టమర్‌కు అవగాహన కల్పిస్తున్నాను. అతని కష్టానికి సరితూగే క్వాలిటీ ప్రొడక్ట్‌ను చేతిలో పెడ్తున్నాను. నేనేం చెబుతానో.. అదే చేస్తాను. నా మాటలే ఈరోజు బ్రాండ్ నేమ్‌గా అయ్యాయి అంటే నన్ను నమ్ముతున్నట్టేగా. ఆ నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు. ఫ్యూచర్లో లిస్టింగ్‌కి కూడా వెళ్తాను. లలితా జ్యుయెలరీ అంటే మనందరి జ్యుయెలరీగా అనుకునేలా చేస్తాను. ఎంప్లాయ్స్ విషయంలో కూడా అంతే కన్సర్న్తో ఉంటాను. నా దగ్గర మొత్తం 33 వేలకు పైనే ఎంప్లాయ్స్ ఉన్నారు. వాళ్లందరినీ నా కుటుంబంగానే ట్రీట్చేస్తా. హార్డ్ వర్క్ అండ్ టీమ్ వర్క్‌తోనే విక్టరీ అని నమ్ముతా. దాన్నే పాటిస్తా. నా ఉద్యోగులకూ అదే చెప్తా.-సంభాషణ: సరస్వతి రమ -
విజయవాడ కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ
-
ఆధ్యాత్మిక శోభ.. పండిత సభ
సాక్షి, విజయవాడ/తాడేపల్లి రూరల్: కృష్ణా తీరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. పండిత సభ మహోన్నతంగా సాగింది. శారదా పీఠం ఆధ్వర్యంలో ఉత్తరాధికారి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ మహోత్సవం రెండో రోజు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రముఖులు, భక్తులు తరలి రావడంతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం భక్తజన సందోహంగా మారింది. విశాఖలోని శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ (కిరణ్ బాలస్వామి) సన్యాస స్వీకరణ మహోత్సవం మూడు రోజులపాటు నిర్వహిస్తున్న విషయం విదితమే. రెండవ రోజైన ఆదివారం సన్యాసాంగ అష్ట శ్రాద్ధాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కూష్మాండ, పురుష సూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశ మహాదానాలు జరిపారు. స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి శారదా చంద్రమౌళీశ్వరులకు అర్చన, అభిషేకాలను నిర్వహించగా, పెద్దసంఖ్యలో హాజరైన భక్తులు కన్నుల పండువగా వీక్షించారు. స్వామి చేపట్టిన అభిషేక క్రియకు వేదపండితులు తమ గళాన్ని జతపరిచి ప్రాంగణమంతటినీ వేదమయం చేశారు. మరోవైపు బాలస్వామి సన్యాసాశ్రమ దీక్షా స్వీకరణ సందర్భంగా శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్థ శాస్త్ర మహాసభలు నిర్వహించగా.. వ్యాకరణ, తర్క, మీమాంస సహా ఆరి శాస్త్రాలను ఔసోసన పట్టిన పండితులు పాల్గొన్నారు. సన్యాస దీక్ష ఫలితం ఏమిటి? సన్యాసం దేనికోసం తీసుకోవాలి? సన్యాసం తీసుకుంటే ఎలా ఉండాలి? నియమాలు ఏమిటనే అంశాలపై పండితులు చర్చాగోష్టి చేశారు. సన్యాస జీవితం చాలా గొప్పది స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రవచనం చేస్తూ.. సన్యాసం గురించి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, యోగ శాస్త్రాల్లో చాలా గొప్పగా చెప్పారని వివరించారు. ద్వివిద సన్యాసం, విద్వత్ సన్యాసం, ఆశ్రమ సన్యాసం తదితర ఆశ్రమాలపై ఉపనిషత్తుల్లో చాలా చర్చ సాగిందని చెప్పారు. తమ పీఠం ఉత్తరాధికారి విద్వత్ సన్యాసి అని సగర్వంగా ప్రకటించారు. ఆది శంకరాచార్యుల కృప తమ పీఠ ఉత్తరాధికారికి పూర్తిగా ఉందని, పరమ గురువు సచ్చిదానందేంద్ర సరస్వతి వారి అనుగ్రహం కలిగిందని తెలిపారు. భారతదేశంలోని శాస్త్ర పండితులు తర్కం, వ్యాకరణం, మీమాంస, వేదాంతం ఇత్యాది శాస్త్రాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోందని చెప్పారు. భారత ప్రభుత్వం వాటిని దూరంగా ఉంచినా.. పీఠాలు, మఠాలు పురాతనమైన శాస్త్రాలను కాపాడుతున్నాయని స్వామీజీ అన్నారు. భారతదేశ ఔన్నత్యానికి ప్రతీకలైన తర్కం, వ్యాకరణం, వేదాంతం, ఉపనిషత్తులు, అగ్నిహోత్ర సభలు ఏటా తమ పీఠం వార్షికోత్సవంలో జరుగుతాయన్నారు. ఈ ఏడాది ఉత్తరాధికారి సన్యాస దీక్ష ఉండటంతో అగ్నిహోత్ర సభలు, శాస్త్ర సభలు ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.విజయలక్ష్మి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ సుందరశర్మ, దేవదాయ శాఖ కమిషనర్ ఎం.పద్మ, దుర్గగుడి ఈఓ కోటేశ్వరమ్మ, సిమ్స్ విద్యాసంస్థల అధినేత భీమనాథం భరత్‌రెడ్డి హాజరయ్యారు. సన్యాస దీక్ష చివరి రోజైన సోమవారం జగద్గురు శ్రీచరణులచే బాలస్వామికి యోగపట్టా అనుగ్రహిస్తారు. -
విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ బాలస్వామి
సాక్షి, విజయవాడ/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ వద్ద శిష్యరికం చేస్తున్న కిరణ్ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పగించనున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడ కృష్ణా తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్ధం వద్ద కిరణ్ బాలస్వామి సన్యాసాశ్రమ దీక్ష కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారమే నగరానికి చేరుకున్న స్వరూపానందేంద్ర స్వామీజీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దీక్ష కార్యక్రమాలు సాగేదిలా.... శారదాపీఠం ఉత్తరాధికారి కిరణ్ బాలస్వామి దీక్షా క్రతువు మూడు రోజుల పాటు జరుగుతుంది. తొలిరోజు శనివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ చతుష్కృత్య ప్రాయశ్చిత్తం, దశవిధ స్నానాలు, కూష్మాండ, పురుషసూక్త, ప్రాజాపత్య, వైశ్వానర హోమాలు, షోడశమహాదానాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు సన్యాసాంగ అష్ట శ్రాద్దాలు, శాస్త్ర, అహితాగ్ని, వాక్యార్ధ మహాసభలు నిర్వహిస్తారు. సోమవారం మూడో రోజున ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వైశ్వానర స్థాలీపాకం, విరజాహోమాలు, సావిత్రీ ప్రవిలాపనం, శిఖా, కటిసూత్ర, యజ్ఞోపవీత పరిత్యాగం, ప్రేషోచ్చారణం, కాషాయ, దండ, కమండలలు ధారణ, గురుసమీపగమనం, ప్రణవ, మహావాక్యోపదేశం, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు శాస్త్ర సభ, అహితాగ్ని సభ, అనంతరం శ్రీప్రాచీన, నవీన గురువందనాలు, తర్వాత జగదుర్గు శ్రీ చరణులచే బాలస్వామి వారికి యోగపట్టా అనుగ్రహం జరుగుతాయి. చివరగా జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. దుర్గమ్మ సేవలో స్వరూపానందేంద్ర ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన విజయవాడ కనకదుర్గమ్మను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కమిషనర్ ఎం.పద్మ, ఆలయ ఈవో ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మహా గణపతి ప్రాంగణంలో స్వరూపానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు రిషికేష్, కాశీ, తమిళనాడులో శాఖోపశాఖలుగా విస్తరించిన విశాఖ శారదా పీఠం ఎన్నో ధర్మ పోరాటాలతోపాటు దేవాలయ భూములు, వ్యవస్థ పరిరక్షణకు కృషి చేసిందని చెప్పారు. ఆలయాల్లో ధూప దీపనైవేద్యాలు సక్రమంగా అమలు జరిగేలా చూడటంతోపాటు టీటీడీలో జరిగిన ఆగడాలపై పోరాటం చేసింది శారదా పీఠం మాత్రమేనన్నారు. రాజధానిలో పవిత్ర కృష్ణానది తీరాన పీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు. మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమాలలో చివరి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లతోపాటు గవర్నర్ నరసింహన్ పాల్గొంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణార్థం మూడు రోజులపాటు దీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. స్వామీజీతోపాటు అమ్మవారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తదితరులున్నారు. పీఠాధిపతులు, మఠాధిపతుల రాక బాలస్వామి సన్యాసాశ్రమ దీక్షా కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, సాధు, సంతులు విచ్చేస్తున్నారు. శారదా పీఠం నిర్వాహకులు వారికి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. -
విశాఖ శారద పీఠాధిపతిగా కిరణ్‌శాస్త్రి
సాక్షి, హైదరాబాద్: విశాఖ శారదా పీఠం అధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శిష్యుడు కిరణ్‌శాస్త్రి నియమితులవుతున్నట్లు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవంను నిర్వహిస్తున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ స్టేట్ అడిషనల్ సెక్రటరీ రఘురామయ్య చెరుకుచర్ల తెలిపారు. ఈ మేరకు ఈ స్వీకార మహోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం హైదరాబాద్‌లోని కుబేరా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, అధికార ప్రతినిధి కె.వేణుగోపాలచారి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ..స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పదవి ముగుస్తున్న కారణంగా ఆయన స్థానంలో తన శిష్యుడు కిరణ్ శాస్త్రిని విశాఖ పీఠాధిపతిగా నియమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో పాటు దేశంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. -
విశాఖ శారదా పీఠాధిపతిగా కిరణ్‌శాస్త్రి
హైదరాబాద్: విశాఖ శారదా పీఠం అధిపతిగా ప్రస్తుత పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి శిష్యుడు కిరణ్‌శాస్త్రి నియమితులవుతున్నట్లు ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా కరకట్టపై ఉత్తరాధికారి శిష్య తురీయాశ్రమ దీక్షా స్వీకార మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు, వైఎస్సార్సీపీ స్టేట్ అడిషనల్ సెక్రటరీ రఘురామయ్య చెరుకుచర్ల తెలిపారు. ఈ మేరకు ఈ స్వీకార మహోత్సవానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను బుధవారం హైదరాబాద్‌లోని కుబేరా ప్యాలెస్‌లో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణచారి, అధికార ప్రతినిధి కె.వేణుగోపాలచారి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘురామయ్య మాట్లాడుతూ..స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పదవి ముగుస్తున్న కారణంగా ఆయన స్థానంలో తన శిష్యుడు కిరణ్ శాస్త్రిని విశాఖ పీఠాధిపతిగా ఆయ నను నియమిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావులతో పాటు దేశంలో పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు. -
రామోజీరావు, కిరణ్‌పై ‘అనంత’ కోర్టులో కేసు
సాక్షి, అనంతపురం : ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు, ఎండీ కిరణ్‌పై రిటైర్డ్ ఏఎస్పీ వెంకటేశ్వరరావు శుక్రవారం అనంతపురం మొబైల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రామోజీరావు, కిరణ్ వ్యక్తిగతంగా హాజరై అఫిడవిట్ సమర్పించాలని, లేదంటే స్టే గడువు పెంచుకోవాలని సూచిస్తూ...తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా రామోజీరావుతో పాటు ఆయన కుమారుడు కిరణ్‌పై వెంకటేశ్వరరావు గతంలో హైకోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఇరువురిపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని అభ్యర్థించారు. అయితే ఈ కేసులో రామోజీరావు, కిరణ్‌లు 2012 నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందారు. ఇటీవల సుప్రీంకోర్టు సుదీర్ఘ కాలంగా ఉన్న స్టేలపై కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీర్ఘ కాలంలో ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం నిర్దేశించడంతో ...వెంకటేశ్వరరావు మరోసారి మొబైల్ కోర్టును ఆశ్రయించారు. -
జనన ధృవీకరణ పత్రం జారీలో ఔదార్యత
దుబాయ్: తమ దేశ చట్టాలను పక్కన పెట్టి ఇద్దరు భారతీయ నిర్వాసితులకు పుట్టిన శిశువుకు జనన ధృవీకరణ పత్రం జారీ చేసి యూఏఈ ప్రభుత్వం తన ఔదార్యతను ప్రదర్శించింది. జనన ధృవీకరణ పత్రం జారీ చేయడంలో ఔదార్యత ప్రదర్శించడం ఏమిటి అని సందేహం తొలుస్తుంది కదూ. కానీ యూఏఈ చట్టాల ప్రకారం ఇతర దేశాల నుంచి వచ్చి యూఏఈలో నివాసముంటున్న వారు పెళ్లి చేసుకోవాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ముస్లిం పురుషుడు, ముస్లిమేతర మహిళను పెళ్లి చేసుకోవచ్చు కానీ ముస్లిం మహిళ... వేరే మతానికి చెందిన పురుషుడిని పెళ్లి చేసుకోరాదు. షార్జాకు చెందిన కిరణ్ బాబు, సనమ్ సాబూ సిద్ధిఖీలు 2016లో కేరళలో పెళ్లి చేసుకున్నారు. కిరణ్ బాబు హిందువు కాగా.. సనమ్ సాబూ సిద్ధిఖీ ముస్లిం. వీరిద్దరికీ 2018 జూలైలో కూతురు పుట్టింది. అయితే కుమార్తె జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. దీనిపై కిరణ్ బాబు మాట్లాడుతూ...‘నాకు అబుదాబి వీసా ఉంది. అక్కడే ఇన్సూరెన్స్ కవరేజీ కూడా తీసుకున్నాను. అక్కడే ఉన్న మెదియోర్ 24/7 ఆసుపత్రిలో నా భార్యను డెలివరీ నిమిత్తం చేర్పించాను. నేను హిందువును కావడంతో నా కూతురికి జనన ధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు ఆసుపత్రి వైద్యులు నిరాకరించారు. ఆ తర్వాత కోర్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాను. విచారణ నాలుగు నెలలు సాగింది. నా కేసును కోర్టు కొట్టేసింద’ని వెల్లడించారు. తన కూతురుకు ఎలాంటి లీగల్ డాక్యుమెంట్లు లేకపోవడంతో ఆశలన్నీ యూఏఈ ప్రభుత్వ క్షమాభిక్షపైనే పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఇండియన్ ఎంబసీ కూడా తనకు బాగా సహకరించిందని కిరణ్ బాబు తెలిపారు. జనన ధృవీకరణ పత్రం జారీలో సహాయపడిన ఇండియన్ ఎంబసీ కౌన్సెలర్ ఎం రాజమురుగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నిబంధనలు మార్చి జనన ధృవీకరణ పత్రం జారీ చేయడం దేశంలో ఇదే మొదటిదని ఆయన తెలిపారు. కాగా ఔదార్యత చూపే దేశాల్లో యూఏఈ అందరికంటే ముందుంటుందని చెప్పటానికి యూఏఈ ప్రభుత్వం 2019 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టోలరెన్స్‌గా ప్రకటించింది. రెండు విభిన్న సంస్కృతులను కలిపే విధంగా, ఇతర మతాలను ప్రజలు అనుమతించే వాతావరణం కల్పించటంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని యూఏఈ చేపట్టింది. జనన ధృవీకరణ పత్రం జారీచేయడం పట్ల దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. -
బాక్సర్‌గా మెగా హీరో..!
అంతరిక్షం సినిమాతో మరోసారి ఆకట్టుకున్న వరుణ్ తేజ్, తదుపరి చిత్రంలోనే ప్రయోగానికే రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 2లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్లో నటిస్తున్న ఈ యంగ్ హీరో తరువాత ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు ఓకె చెప్పాడు. కొత్త దర్శకుడు కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాతో వరుణ్ బాక్సర్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి వరుణ్ నటిస్తున్న ఎఫ్ 2 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్‌కు జోడిగా మెహరీన్ నటిస్తోంది. -
సాహితీ సేనాని
విద్వాన్ బూతపాటి కిరణశ్రీకి తెలుగు భాషంటే ప్రాణం. తెలుగుభాష మాధుర్యాన్ని ప్రపంచానికి చాటాలనే దృఢ సంకల్పం. తెలుగు పండితునిగా విద్యార్ధుల్లో ఆయన స్థానం సుస్థిరం. అక్షరాలు సమాజాన్ని మారుస్తాయన్న అచంచల నమ్మకం ఆయనది. రచనలు, అనువాదాలు చేస్తూనే.. నవయుగ కవి చక్రవర్తి, పద్మ విభూషణ్ గుర్రం జాషువా కవిత్వం పట్ల, జీవిత విధానం పట్ల మక్కువతో విశ్రాంత జీవితాన్ని సమాజాన్ని మలిచేందుకు వినియోగిస్తున్నారు. జాషువా పేరిట తొలి ప్రజాగ్రంథాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశారు. జాషువా విగ్రహాన్నీ ప్రతిష్ఠించారు. భవిష్యత్ తరానికి సాహితీ సిరులను అందించడంలో అలుపెరగని అవిశ్రాంత ఉపాధ్యాయుడు కిరణశ్రీ. జాషువా సేవలో తరించారు కిరణశ్రీ సొంత ఊరు అప్పటి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ. తల్లిదండ్రులు నాగరత్నమ్మ, జాన్. ఆయన తండ్రి ఆంగ్లేయుల కాలంలోనే ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయుడు. కిరణశ్రీ ప్రాధమిక విద్య ఉయ్యలవాడలోనే సాగింది. సంజీవరాయునిపేటలో ఎస్ఎస్ఎల్సి పూర్తిచేశారు. 1968–71ల మద్య పద్మభూషణ్ గుర్రం జాషువాకు శిష్యునిగా సేవలందించారు. అప్పుడే తెలుగుభాషా మాధుర్యాన్ని చవి చూసి, భాషపై మక్కువ పెంచుకున్నారు. జాషువాతో పాటు జంధ్యాల పాపయ్యశాస్త్రి, అమరేంద్ర, ప్రసాదరాయ కులపతి వంటి మహాపం డితుల సహచర్యం ఆయనకు లభించింది. చిన్నవయస్సులోనే వారితో కవిసమ్మేళనాల్లో పాల్గొన్నారు. విద్యార్థులపై చెరగని ముద్ర చదువు పూర్తయ్యాక బెస్తవారిపేట క్రైస్తవ మిషనరీ కళాశాలలో సెకండరీగ్రేడ్ పూర్తిచేశారు కిరణశ్రీ. అనంతరం ద్వితీయశ్రేణి తెలుగు పండిట్‌గా 1973లో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఓవైపు బోధిస్తూనే తాను విద్యార్ధిగా మారి డిగ్రీలను సాధించారు. ముప్పైమూడేళ్ల పాటు ఉపాధ్యాయునిగా సేవలు అందించారు. తెలుగు నుడికారాలను, ఉచ్చారణ, పద్యపఠన, చందస్సులను బోధించడంలో ప్రతి విద్యార్థ్ధిపై తనదైన చెరగని ముద్రవేశారు. పదవీ విరమణ అనంతరం వెలుగు ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేశారు. 2012లో రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ తెలుగు అనువాదకునిగా అనేక జీవోలను తెలుగులోకి అనువదించారు. విగ్రహం ఏర్పాటుకు పదేళ్లు! నెల్లూరులో జాషువా కవితా పీఠాన్ని 1984లో ప్రారంభించారు కిరణశ్రీ. 2008లో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆయనలో కలిగింది. పదేళ్లపాటు సుదీర్ఘ పోరాటంతో 2018 సెప్టెంబర్‌లో నెల్లూరు నగరంలో జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆథర్స్, కన్ఫెడరేషన్ అండ్ యునెస్కో క్లబ్ ఆఫ్ ఇండియా జాతీయ కార్యవర్గ సభ్యులు, జాషువా కవితాపీఠం, అధికారభాషా సంఘం రాష్ట్ర, జాతీయ సంస్థల్లో అనేక కీలక పదవులను నిర్వహిస్తున్న సమయంలో కూడా జాషువా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆయన పలు అవరోధాలను అధిగమించాల్సి వచ్చిందన్నది నిజం. పురస్కారాలు.. పుస్తకాలు కిర ణశ్రీ రచించిన పలు పుస్తకాలను ప్రభుత్వం పాఠ్యగ్రంథాలుగా తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడో తరగతి విద్యార్థుల కోసం ‘అణిముత్యాలు’ అనే తెలుగు ఉపవాచక పుస్తకానికి గాను ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. ఆయన రాసిన ‘పిచ్చివాడు’ అనే నాటకం సుమారు యాభై పరిషత్‌ల అవార్డులను అందుకుంది. ‘మడివేలు మాచయ్య’ పద్యనాటకం పండితుల ప్రశంసలు సైతం అందుకుంది. అనువాదకునిగా ఆయన ఎనభైకి పైగా గ్రం«థాలను తెలుగులోకి తెచ్చారు. తెలుగు భాషను సజీవంగా ఉంచాలని, విశిష్టమైన తెలుగు భాషా మాధుర్యాన్ని భావితరాలకు అందించాలని నిర ంతరం కృషి చేస్తున్న కిరణశ్రీ వంటి వారి అడుగుజాడల్లో ఈతరం వారు నడవడం ఎంతైనా అవసరం. – మౌంట్‌బాటన్, సాక్షి, నెల్లూరు -
ద్విశతక వీరుడు
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు యువ సంచలనం మద్దెల సూర్యకిరణ్ క్రికెట్లో జిల్లా పేరు నిలబెడుతున్నాడు. ఆంధ్రా జట్టుకు నాయకత్వం వహిస్తున్న కిరణ్ (జిల్లా నుంచి మొదటి వ్యక్తి) అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నీలో డబుల్ సెంచరీ చేసి సత్తా చాటాడు. విజయ్ మర్చెంట్ అంతర్ రాష్ట్ర అండర్–16 క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు ముందు హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్రాల ట్ర యాంగ్లర్ సిరీస్(ఇండివిడ్యువల్ మ్యాచ్‌లు)లో డబుల్ సెంచరీతో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ నెల 5 నుంచి హిమాచల్‌ప్రదేశ్–1 జట్టుతో జరిగిన మూడు రోజుల క్రికెట్ మ్యాచ్‌లో వన్ డౌన్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన కిరణ్ 376 బంతులను ఎదుర్కొని 229 పరుగులు చేశాడు. ఇందులో 37 బౌండరీలు, ఒక భారీ సిక్సర్ ఉండటం విశేషం. జిల్లా నుంచి ఇంతవరకు ఎవరూ ఈ స్థాయిలో క్రికెట్లో రాణించలేదు. ఈ మ్యాచ్‌లోనే కాదు హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులు, పశ్చిమబెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 55 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో డబుల్‌సెంచరీతో హోరెత్తించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అం దుకున్నాడు. సూర్యకిరణ్ సత్తా చాటడంపై జిల్లా క్రికెట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. జిల్లాకు గర్వకారణంగా నిలిచిన సూర్యకిరణ్‌ను శ్రీకాకుళం జిల్లా బాలురు బాలికల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర ఎన్వీ నాయుడు, జేవీ భాస్కరరావు, ఉపాధ్యాక్షులు బోయిన రమేష్, పి.సూర్యారావు, కోశాధికారి గిరిధరరావు, కార్యవర్గ సభ్యులు, కోచ్‌లు అభినందించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. చిన్ననాటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సూర్యకిరణ్ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగాడు. తల్లిదండ్రులు మద్దెల వరప్రసాద్, విజయలక్ష్మి, చెల్లి (మైథిలి). తండ్రి సివి ల్ కానిస్టేబుల్. తల్లి గృహిణి. వరప్రసాద్ రేగిడి ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి స్వస్థలం ఎచ్చెర్ల మండలంలోని షేర్‌మహ్మద్ పురం గ్రామం. అయితే ప్రస్తుతం వరప్రసాద్ ఉద్యోగ రీత్యా పాలకొండలో నివా సం ఉంటున్నారు. సూర్యకిరణ్ ప్రస్తుతం విజ యనగరంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ (సీఈఓ గ్రూప్) చదువుతున్నాడు. బ్యాటింగే ప్రధాన బలం 2012లో శిక్షణ ఆరంభించిన సూర్యకిరణ్‌కు బ్యా టింగే బలం. ఏ స్థానంలో అయినా కుదురుకుని మంచి టెక్నిక్‌తో బ్యాటింగ్ చేయడం ఈ రైట్ హ్యాండర్ ప్రత్యేకత. 2013లో జిల్లా అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. అది మొదలు వెనుదిరి గి చూడలేదు. 2014, 2015ల్లో అండర్–14 ఆంధ్రా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2016, 17లో అండర్–16 జట్లకు ఎంపికై సత్తాచాటాడు. అంతర్రాష్ట్ర పోటీల్లో పాల్గొన్న మొద టి మ్యాచ్‌లోనే 65 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అక్కడి నుంచి అవకాశం దొరికిన ప్రతి చోటా పరుగులు సాధిస్తూ సెలెక్టర్లను మెప్పిస్తున్నాడు. స్పిన్ బౌలర్‌గానూ జట్టుకు సేవలందించగలడు. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యంగా అంచెలంచెలుగా రాణిన్నాడు. జాతీయ జట్టుకు ఎంపికే లక్ష్యం నన్ను నిరంతరం మా పేరెంట్స్, కోచ్‌లు, క్రికెట్ సంఘ పెద్దలు ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాను. డబుల్ సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో మరిన్ని భారీ స్కోర్లు చేస్తానన్న నమ్మకం కలిగింది. రంజీ జట్టుకు ఎంపికై, అక్కడ రాణించి తర్వాత జాతీయ జట్టుకే ఎంపికే లక్ష్యంగా ఆడతాను. జిల్లాకు, రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొస్తాను. – మద్దెల సూర్యకిరణ్, ఆంధ్రా జట్టు కెప్టెన్, అండర్–16 -
బామ్మ మాటలా...
సీనియర్ నటి శ్రీలక్ష్మి టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘వామ్మో బామ్మ’. కిరణ్, అశ్లేష జంటగా విజయ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో సి.హెచ్. వెంకటేశ్వరరావు, జి. సంధ్యారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం పాటలు, ట్రైలర్‌ని నిర్మాతలు సాయి వెంకట్, టి. రామసత్యనారాయణ విడుదల చేశారు. విజయ్ ఆనంద్ మాట్లాడుతూ– ‘‘కామెడీ హారర్ ఎంటరై్టనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో శ్రీలక్ష్మిగారే హీరో. అనుకున్నదానికంటే సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘వామ్మో బామ్మ’ సినిమా చాలా బాగుంది. శ్రీలక్ష్మిగారు అద్భుతంగా నటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలు విడుదల చేయటం చాలా కష్టం. కానీ, ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి స్పందన వస్తోంది’’ అన్నారు సాయి వెంకట్. ‘‘గతంలో ‘బామ్మ మాట బంగారు బాట’ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు ‘వామ్మో బామ్మ’ కూడా అంతటి విజయం సాధించాలి’’ అన్నారు రామ సత్యనారాయణ. ‘‘కుటుంబ సభ్యులందరూ చూడదగ్గ చిత్రమిది’’ అన్నారు శ్రీలక్ష్మి. ఈ చిత్రానికి సంగీతం: ఆదిత్య, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.రాజశేఖర్. -
నిర్మాత కిరణ్‌కి పితృ వియోగం
తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు, నిర్మాత పి. కిరణ్ తండ్రి పర్వతనేని గోపాలరావు తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఆయన మృతి చెందారు. గోపాలరావు పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఆయన కుమార్తె, కిరణ్ సోదరి నివాసంలో ఉంచారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు గోపాలరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. -
టీజర్ చూసి షాకయ్యా – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘ఏడాది క్రితం కార్తీక్, సుజన్ సినిమా తీద్దామని మా ఆఫీసుకి వచ్చారు. వీళ్లు ఏం తీస్తారులే అనుకున్నాను. సడన్‌గా వచ్చి సినిమా కంప్లీట్ అయ్యిందని చెప్పి కొన్ని సీన్స్‌తోపాటు, టీజర్ చూపించారు. చూడగానే షాక్ అయ్యాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. కార్తీక్ మేడికొండ కార్తీక్ దర్శకత్వంలో కిరణ్, హర్షద కులకర్ణి, మహేశ్ కత్తి, గాయత్రి గుప్తా ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’. ధృవ ప్రొడక్షన్ బ్యానర్‌పై సుజన్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ‘‘టైటిల్ గమ్మత్తుగా ఉంది. కొత్త తరహా సబ్జెక్ట్ ఇది. కచ్చితంగా మంచి సక్సెస్ అవుతుంది’’ అన్నారు భరద్వాజ. ‘‘కార్తీక్‌కి టెక్నికల్‌గా మంచి నాలెడ్జ్ ఉంది. సుజన్ నిర్మాతగా సక్సెస్ అవ్వాలి ’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘నా మీద నమ్మకంతో కథ వినకుండా సినిమా తీయడానికి ముందుకొచ్చిన సుజన్‌కి థ్యాంక్స్. టీజర్‌తో పాటు సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. జీవీ మంచి పాటలిచ్చారు’’ అన్నారు కార్తీక్. ‘‘డిఫరెంట్ జోనర్లో రియలిస్టిక్‌గా రూపొందిన చిత్రమిది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడంలో సక్సెస్ అవుతామన్న నమ్మకం ఉంది’’ అన్నారు సుజన్. -
ఫోనులో దెయ్యం
కిరణ్, దివ్య జంటగా కె. నరేంద్రబాబు దర్శకత్వంలో వెంకటేశ. సి నిర్మించిన సినిమా ‘మళ్లీ వచ్చిందా’. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసిన టి. ప్రసన్నకుమార్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్, హారర్ థ్రిల్లర్స్‌కు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. ‘గంగ, రాజుగారి గది, ఆనందో బ్రహ్మ’ తరహా జానర్లో వస్తోన్న ‘మళ్లీ వచ్చిందా’ కూడా ప్రేక్షకాదరణ పొందుతుంది’’ అన్నారు. నరేంద్రబాబు మాట్లాడుతూ– ‘‘ఆత్మలు, దెయ్యాలు మనుషుల్ని ఆవహించి, భయపెట్టడం చాలా సినిమాల్లో చూశాం. కానీ, ఒక దెయ్యం ఓ ఫోన్ నుంచి మరో ఫోన్‌కి వెళుతూ మనుషుల్ని భయపెడితే ఎలా ఉంటుందనేది మా సిన్మాలో చూపించాం. ఈ దెయ్యం స్పెషాలిటీ ఏంటంటే... ఎవరి ఫోన్‌కైనా వారి వాయిస్‌ను ‘డెత్ మెసేజ్’ రూపంలో పంపిస్తుంది’’ అన్నారు. త్వరలో పాటల్ని, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రసహ నిర్మాతలు గురురాజ్, జి. శశికాంత్, హీరో కిరణ్, హీరోయిన్ దివ్య, కెమెరామ్యాన్ పూర్ణ .కె తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి చూపులకు వెళ్తూ..
∙ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు ∙ నల్లమల ఘాట్‌లో ఘటన ∙ కారులో ఇరుక్కుపోయిన క్షతగాత్రులు ∙ నుజ్జునుజ్జయిన కారు నల్లమల ఘాట్(మహానంది): నంద్యాల–గిద్దలూరు రహదారిపై నల్లమల ఘాట్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు.. మార్కాపురం గ్రామానికి చెందిన మర్రి రమణ, సుభద్ర దంపతులు తమ కుమారుడు కిరణ్‌కు పెళ్లి చూపుల కోసం కారులో స్వగ్రామం నుంచి బయలుదేరారు. పచ్చర్ల సమీపంలో ఉన్న కల్వర్టు మలుపుల వద్ద వేగంగా వస్తున్న బండల లారీ కారును ఢీకొట్టింది. దీంతో రమణకు నడుము, సుభద్ర కాలు, చేయి విరిగాయి. కిరణ్‌కు తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ సురేష్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కారు నుజ్జనుజ్జవడంతో దాదాపు గంటపాటు వారు వాహనం నుంచి బయటకు రాలేకపోయారు. అటుగా వచ్చిన ప్రయాణికులు వారిని 108లో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో వారిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మహానంది ఎస్ఐ పెద్దయ్యనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన సిబ్బందితో కలిసి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి వెÐðళ్లి వివరాలు సేకరించారు. కారు డ్రైవర్ సురేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కొత్తవాళ్లను ప్రోత్సహించాలి
– రమణాచారి పావని, కిరణ్, యోధ, సాంబ ముఖ్య తారలుగా వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లావణ్య విత్ లవ్‌బాయ్స్’. నర్సింలు పటేల్‌చెట్టి, సి. రాజ్యలక్ష్మీ నిర్మించారు. యశోకృష్ణ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సీడీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. రమణాచారి ఆవిష్కరించి, రచయిత పరుచూరి గోపాలకృష్ణకు అందజేశారు. ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. రమణాచారి మాట్లాడుతూ– ‘‘తేనె మనసులు’తో ఆదుర్తిగారు పరిచయం చేయకపోతే కృష్ణగారు, కొత్త నటీనటులు వద్దని దాసరిగారు అనుకుని ఉంటే మోహన్‌బాబుగారి లాంటి ప్రతిభావంతులు వచ్చి ఉండేవారు కాదు. తేజ, శేఖర్ కమ్ముల వంటి దర్శకులు కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. వడ్డేపల్లి కృష్ణ చక్కని కథాంశంతో కొత్త నటీనటులతో చేసిన చిత్రమిది. కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేవాళ్లు మరింతమంది రావాలి’’ అన్నారు. ‘‘ముగ్గురు యువకులు లావణ్య అనే అమ్మాయితో ప్రేమలో పడతారు. ఆ ముగ్గురిలో ఆమె ఎవర్ని పెళ్లి చేసుకుందనేదే కథ’’ అన్నారు వడ్డేపల్లి కృష్ణ. -
ప్రాణం తీసిన సిక్స్‌ప్యాక్ మోజు
బెంగళూరు(బనశంకరి) : సిక్స్‌ప్యాక్ మోజుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన కర్ణాటకలో బనశంకరిలోని కుమారస్వామిలేఔట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు..కుమారస్వామిలేఔట్కు చెందిన కిరణ్ (30) అబ్కారీ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సిక్స్‌ప్యాక్ బాడీ కోసం ఓ జిమ్‌లో చేరాడు. అతి తక్కువ సమయంలో సిక్స్‌ప్యాక్ పొందడానికి స్టెరాయిడ్స్ తీసుకున్నాడు. దీంతో బ్రెయిన్‌డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితం మల్లిగే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంతరిక్ష కేంద్రాన్నీ నిర్మించగలం: ఇస్రో ఛీఫ్
ఇండోర్: భారత్‌కు అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించే సామర్థ్యముందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కిరణ్ తెలిపారు. అయితే ఇందుకోసం దీర్ఘకాల వ్యూహం, పటిష్టమైన ప్రణాళిక అవసరమన్నారు. ఇండోర్‌లో సోమవారం జరిగిన రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ డ్ టెక్నాలజీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరైన కిరణ్ కుమార్.. ‘అంతరిక్ష కేంద్రం నిర్మించే సామర్థ్యం మనకుంది. దేశం నిర్ణయం తీసుకున్న రోజు మేం ప్రాజెక్టును స్వీకరిస్తాం. ఇందుకోసం విధి విధానాలను రూపొందించి కావాల్సిన నిధులు, సమయం ఇస్తే చాలు’ అని తెలిపారు. మానవరహిత అంతరిక్ష కేంద్రం వల్ల ఉపయోగమేంటనే అంశంపైనా ఇంకా చర్చిస్తున్నామని అందుకే ఈ దిశగా ఆలోచన చేయలేదన్నారు. వాతావరణ పరిస్థితులు, కమ్యూనికేషన్ నెట్వర్క్ రంగాల్లో విస్తృత పరిశోధనలకోసం మరిన్ని ఉపగ్రహాలను పంపించాల్సిన అవసరం ఉందన్నారు. -
ప్రేమ గొప్పతనం
‘పిల్లజమీందార్’, ‘పెద్దరికం’, ‘భైరవద్వీపం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ తదితర చిత్రాలకు పాటలు రాసిన డా. వడ్డేపల్లి కృష్ణ దర్శకునిగా మారారు. పావని, పరమేశ్ యోధా, సాంబ, కిరణ్ ముఖ్య తారలుగా ఆయన దర్శకత్వంలో రాజ్యలక్ష్మి.సి, నర్సింలు పటేల్ చెట్టి నిర్మిస్తున్న చిత్రం ‘లావణ్య విత్ లవ్ బాయ్స్’. ఈ సినిమా ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి చంద్రశేఖర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంటుంది. కథ, మాటలు, పాటలు అన్నీ బాగా కుదిరాయి. ప్రేమకు సరికొత్త భాష్యంగా నిలిచే ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుంది’’ అని తెలిపారు. కాశీ విశ్వనాథ్, డా. పరుచూరి గోపాలకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: తోట.వి.రమణ, సంగీతం: యశోకృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, సమర్పణ: శరత్చెట్టి (యూఎస్ఏ). -
ప్రేయసి ఇంటి ముందు ఆత్మహత్య
గంగావతి/హొస్పేట : తాను ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు వివాహానికి నిరాకరించడంతో ఓ యువకుడు అమ్మాయి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం కొప్పళ తాలూకా మునిరాబాద్‌లో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. గంగావతి తాలూకాలోని జీరాళ కల్గుడి క్యాంప్‌కు చెందిన గొల్లపూడి కిరణ్(27) అనే యువకుడు కొప్పళ తాలూకా మునిరాబాద్‌కు చెందిన ఓ యువతిని గత మూడేళ్లుగా ప్రేమించేవాడు. దూరపు బంధువులైన వీరిద్దరూ హుబ్బళ్లిలో అమ్మాయి బీటెక్ చేస్తుండగా, అక్కడే కార్మెల్ సాఫ్ట్‌వేర్‌లో డిజైనర్‌గా పని చేస్తున్న కిరణ్ పరస్పరం ప్రేమించుకున్నట్లు తెలిసింది. వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు వీరి ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించడమే గాకుండా ఆమెకు వేరొకరితో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో తాను ప్రేమించిన యువతి తనకు దక్కకుంటే తనకు ఈ జీవితం అవసరం లేదని తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు కిరణ్ తన చావుకు ప్రియురాలు, వారి కుటుంబ సభ్యులే కారణమని, తనను క్షమించమని అమ్మ, అక్క, కుటుంబ సభ్యులను కోరుతూ వాట్సప్‌లో వీడియోని పంపించి యువతి ఇంటి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని అమ్మాయి తండ్రి ఫోన్ చేసి తమకు తెలిపాడని యువకుని తల్లిదండ్రులు తెలిపారు. తాము మునిరాబాద్‌కు వెళ్లేలోపు ఆస్పత్రిలో చేర్చారని, సకాలంలో అతనికి సరైన చికిత్స ఇప్పించక పోవడంతో మృతి చెందాడని కిరణ్ బంధువులు ఆరోపించారు. మునిరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బళ్లారి ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై మునిరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఎకరన్నర కోసం పోరాడితే..
ఆరుడుగుల స్థలం దక్కింది - పొలం పట్టా కోసం రైతు ప్రదక్షిణలు - మనస్తాపంతో నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం - చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి - భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు ఆలమూరు (రుద్రవరం): ఓ నిరుపేద రైతు ఎకరన్నర పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో కొందరు ఆ పొలంపై కన్నేసి ఆక్రమించే ప్రయత్నం చేశారు. పొలం పట్టా కోసం రైతు కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా కరుణించలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని భావించి కలెక్టర్‌ను కలిసే ప్రయత్నం చేయగా అవకాశం దక్కలేదు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎకరన్నర పొలం కోసం పోరాడితే చివరకు ఆరుడుగుల స్థలం దక్కింది. రైతు ప్రాణం పోయిన తర్వాత అధికారులు ఇప్పుడు న్యాయం చేస్తామని ముందుకొచ్చారు. రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన రైతు పోతురాజు కిరణ్ (23) 1.58 ఎకరాల పొలం కోసం పోరాడి చివరకు మృత్యుఒడి చేరాడు. నాలుగు రోజుల క్రితం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆదివారం మధాహ్నం మృతదేహాన్ని భారీ పోలీసు బందోభస్తు మధ్య స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే గ్రామంలో కొందరు మృతదేహాన్ని గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శిరివెళ్ల, ఆళ్లగడ్డ సీఐలు ప్రభాకర్ రెడ్డి, దస్తగిరి బాబుతోపాటు ఆళ్లగడ్డ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో పాటు ఏఎస్ఐలు, 100 మంది పోలీసులతో గ్రామం చేరుకున్నారు. ప్రతి వీధిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. స్థానిక శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడికి భార్య విజయ, మూడేళ్ల కుమారుడు, తమ్ముడు దేవదాసు, నాన్నమ్మ మరియమ్మ ఉన్నారు. ఆర్థిక సాయం అందజేత: మృతుడి కుటుంబానికి కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అధికారులు చెక్ రూపంలో అందించారు. జిల్లా కలెక్టర్ విజయ మోహన్ ఆదేశాల మేరకు నంద్యాల ఆర్డీఓ సుధాకర్ రెడ్డి, రుద్రవరం తహసీల్దార్లు మాల కొండయ్య, ఆళ్లగడ్డ ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని రైతు కిరణ్ మృతు దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 447 సర్వే నెంబర్లోని భూమి 1.58 ఎకరాలకు పట్టా ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరాగా.. ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే వారి వాయిస్ రికార్డు చేసి కలెక్టర్‌కు నివేదిస్తామని ఆర్డీఓ తెలిపారు. -
జీవితరాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శిపై కేసు
చిలకలగూడ : ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో నటి జీవితరాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శిపై చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. చిలకలగూడ సవరాలబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ పీ కొండ (33)కు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జ్యోతితో 2005లో వివాహమైంది. అయితే కుటుంబ గొడవల కారణంగా విడిపోయారు. 2010 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలని జ్యోతి తెలుగు ఛానెల్లో ప్రసారం అవుతున్న బతుకుజట్కాబండి నిర్వాహకులను ఆశ్రయించింది. ఈనెల 17న జీవితరాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శిగా చెప్పుకున్న కిరణ్ అనే వ్యక్తి కొండకు ఫోన్ చేసి మీభార్య నీ మీద ఫిర్యాదు చేసింది, తక్షణమే స్టూడియోకు రావాలన్నాడు. విడిపోతున్నట్లు మరోమారు స్టూడియోలోనే ఒప్పందం కుదుర్చుకోవాలన్నాడు. అతను రానని చెప్పడంతో బెదిరించారు. దీంతో తనను బతుకుజట్కాబండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జీవితరాజశేఖర్ వ్యక్తిగత కార్యదర్శి తనను బెదిరిస్తున్నాని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కిరణ్‌తో పాటు మరో మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ పోలీసులు తెలిపారు. -
మిర్యాలగూడలో యువకుడి ఆత్మహత్య
మిర్యాలగూడ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధి రవీంద్రనగర్‌లో నివాసముంటున్న తమ్మడబోయిన కిరణ్(28) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కిరణ్ 2012లో ఎస్ఐగా ఎంపికయ్యాడు. ట్రైనింగ్‌లో కాలు విరగడంతో కొద్ది కాలంగా ఇంటి వద్దే ఉంటున్నాడు. రెండు నెలల క్రితమే బాబు పుట్టాడు. పోస్టింగ్ ఇంకా ఇవ్వలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. -
కుమారుడికి తల్లి చిత్రహింసలు
మాట వినడం లేదనే అక్కసుతో కొడుకును చిత్రహింసలు పెడుతున్న తల్లిపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలివీ.. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన కిరణ్, అపర్ణ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంటి వద్ద అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన తల్లి అపర్ణ కొడుకును కొట్టి, వాతలు పెట్టింది. దీనిపై తండ్రి కిరణ్ సోమవారం బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకుని, కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరారు.ఈ ఘటన వివరాలు తెలుసుకున్న సంఘం అపర్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది.